IPL 2021 Second Phase
-
Hardik Pandya: అలా జరగనట్లయితే పెట్రోల్ పంపులో పనిచేసేవాడిని.. నిజం..
Otherwise I would be working at a petrol pump Says Hardik Pandya: ఆటగాడి జీవితంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. వృత్తిగతంగా ముందుకు వెళ్లేందుకు, ప్రేరణ పొందేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. డబ్బు కారణంగానే జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పుకొచ్చాడు. కాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా టీమిండియా, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అతడి సోదరుడు కృనాల్ పాండ్యా సైతం క్రికెటర్‌గా మంచి గుర్తింపు పొందాడు. భారత జట్టుకు ఆడుతున్న ఈ అన్నదమ్ములు.. ఐపీఎల్‌లోనూ ఒకే టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా... ‘‘ఐపీఎల్ వేలంలో భారీ మొత్తంలో ఆఫర్ దక్కించుకునే ఆటగాళ్లు.. తాము ఆ ధరకు అమ్ముడుపోయేందుకు అర్హులమనే భావనలోకి వెళ్తారు కదా? ఇలాంటివి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసే, ఆలోచనలను పక్కదోవ పట్టించే అంశాలుగా పరిణమిస్తాయి కదా’’ అన్న ప్రశ్న హార్దిక్‌కు ఎదురైంది. అలా అయితే పెట్రోల్ పంపులో పనిచేసేవాడిని ఇందుకు బదులుగా... ‘‘అసలేం జరుగుతుందో అర్థం చేసుకోగలిగే శక్తి మనకు ఉండాలి. నేను, కృనాల్ దృఢచిత్తం కలిగిన వాళ్లం. ఐపీఎల్లో కచ్చితంగా డబ్బు దొరుకుతుందనే విషయం మాకు తెలుసు. అయితే, డబ్బు వచ్చినంత మాత్రాన ఆలోచనలు మారకూడదు. కాళ్లు నేల మీదే ఉండాలి. డబ్బు మంచిది సోదరా! ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ. నాకు ఇలాంటి అవకాశాలు రాకపోయినట్లయితే.. ఇప్పటికి ఏ పెట్రోల్ పంపులోనూ పనిచేస్తూ ఉండేవాడిని. నేనేమీ సరదాకి ఈ మాట చెప్పడం లేదు. నా వరకు కుటుంబమే నా మొదటి ప్రాధాన్యత. నా కుటుంబ సభ్యులకు మంచి జీవితం ఇవ్వడానికి నేను ఇలాంటి పనులు చేసేందుకు వెనుకాడను’’ అని పేర్కొన్నాడు. కాబట్టి ఆటతో పాటు డబ్బు కూడా ముఖ్యమే అని చెప్పుకొచ్చాడు. డబ్బు దండిగా దొరకనట్లయితే... ఎంత మంది క్రికెట్ ఆడతారో తనకైతే తెలీదంటూ హార్దిక్ పాండ్యా.. తనదైన స్టైల్లో పంచ్ వేశాడు. మరి మీరేమంటారు?! కాగా ఐపీఎల్-2021లో 11 మ్యాచ్‌లలో 127 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి సిద్ధమవుతున్నాడు. చదవండి: Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. ధర ఎంతంటే! ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలం సందర్భంగా హార్దిక్ పాండ్యా షేర్ చేసిన వీడియో View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
Ruturaj Gaikwad: బ్రావో డాన్స్.. రుతుకు ఘన స్వాగతం... ఈ వీడియోలు చూశారా?
IPL 2021 Winner CSK Moments Goes Viral: ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ ముగిసినా సామాజిక మాధ్యమాల్లో ఆ సందడి ఇంకా తగ్గలేదు. క్యాష్ రిచ్ లీగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ విజేత చెన్నై సూపర్‌కింగ్స్ విజయోత్సాహానికి సంబంధించిన వీడియో అన్నింటికంటే హైలెట్‌గా నిలిచింది. మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్రోఫీ అందుకోగానే.. సీఎస్కే సంబరాలు అంబరాన్నంటాయి. దీపక్ చహర్ ధోనికి ఎదురెళ్లి ట్రోఫీని చేతుల్లోకి తీసుకోగా.. ‘ఛాంపియన్స్’ అంతా ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చారు. Courtesy: CSK Twitter/IPL ఈ సందర్భంగా క్రికెటర్ల కుటుంబాలు ఒక్కసారిగా మైదానంలోకి వచ్చాయి. ధోని కుమార్తె జీవా, రాబిన్ ఊతప్ప కొడుకు తండ్రులతో కలిసి సందడి చేశారు. ఇక డ్వేన్ బ్రావో, గౌతమ్ కిష్టప్ప కలిసి కాసేపు స్టెప్పులేశారు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ తర్వాత అంతా కలిసి సెల్ఫీలు దిగారు. ఇక రుతురాజ్‌కు ఇంటి వద్ద ఘన స్వాగతం లభించిన వీడియో కూడా సీఎస్కే ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి! 🦁 Vamsam!#SuperCham21ons #CSKvKKR #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/iF3BflBFaY — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 17, 2021 Mersal Arasan 🔙 Home 💛#WhistlePodu #Yellove 🦁 @Ruutu1331 pic.twitter.com/SlOFnkvF9o — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 17, 2021 -
Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న పృథ్వీ షా.. ధర ఎంతంటే!
Prithvi Shaw Gifts Himself BMW Car: టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఖరీదైన కారు కొన్నాడు. దాదాపు 68.50 లక్షల విలువ గల(ఎక్స్ ఫోరూం ధర) బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టరిస్మోను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న 21 ఏళ్ల పృథ్వీ షా... కారు ముందు దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘‘అట్టడుగు స్థాయి నుంచి మొదలై.. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం’’ అంటూ ఉద్వేగభరిత కామెంట్ జత చేశాడు. కాగా మహారాష్ట్రలోని థానేలో సాధారణ కుటుంబంలో జన్మించిన పృథ్వీ షా... దేశవాళీ క్రికెట్లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో ఈ ముంబై ఓపెనర్ డబుల్ సెంచరీ సాధించాడు. 152 బంతుల్లో 227 పరుగులు చేసి సంజూ శాంసన్ (212) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు. అంతేగాక లిస్టు ఏ క్రికెట్ (పురుషులు)లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్(శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీ)గా కూడా నిలిచాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా 15 మ్యాచ్‌లలో 479 పరుగులు చేసి సత్తా చాటాడు. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ యువ ప్లేయర్ తనకు తాను బీఎండబ్ల్యూ కారును గిఫ్టుగా ఇచ్చుకున్నాడు. బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ స్పెసిఫికేషన్స్ ►పెట్రోల్, డీజిల్ వర్షన్లో లభ్యం ►ఇంజిన్: 1995- 2993సీసీ ►టాప్ స్పీడ్: 220- 250 కేఎమ్‌పీహెచ్ చదవండి: Yuvraj Singh Arrested: క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..! View this post on Instagram A post shared by PRITHVI SHAW (@prithvishaw) -
Venkatesh Iyer: మాటల్లో వర్ణించలేను.. అందుకే ఆయనను...
Venkatesh Iyer shares experiences of meeting MS Dhoni: యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సీజన్ రెండో అంచెలో అద్భుతంగా రాణించాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి... ఫైనల్ చేరడంలో తన వంతు సాయం చేశాడు. ఈ సీజన్లో మొత్తంగా 10 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్.. 370 పరుగులతో సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ యువ ఆల్‌రౌండర్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా నెట్ బౌలర్‌గా అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఈ విషయంపై స్పందించిన వెంకటేశ్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని, తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. శక్తిమేర రాణించి... భవిష్యత్తుకు బాటలు వేసుకుంటానని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ తనకు ఎప్పుడు, ఎలాంటి అవకాశం ఇచ్చినా అందిపుచ్చుకుంటానని పేర్కొన్నాడు. ఇక టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనితో మాట్లాడటం తన జీవితంలో గొప్ప విషయమని వెంకటేశ్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2021 సీఎస్కే- కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా... ధోనితో ముచ్చటించే అవకాశం వచ్చిందన్న వెంకటేశ్.. ఆయనను మిస్టర్ కూల్ అని ఎందుకు అంటారో అర్థమైందన్నాడు. ‘‘ఆయనను చూడగానే సంతోషంతో నాకు మాటలు రాలేదు. మైదానంలో ఆయన ఎలా ఉంటారు... ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూసే అవకాశం వచ్చింది. అందరూ ఆయన గురించి ఎలా అయితే మాట్లాడుకుంటారో అలానే ఉంటారు. చాలా కూల్‌గా.. కామ్‌గా... ఆయన నిజంగా ‘‘కెప్టెన్ కూల్’’’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ధోని కెప్టెన్సీలోని సీఎస్కే ... ఐపీఎల్-2021 ఫైనల్లో కేకేఆర్‌ను ఓడించి నాలుగోసారి ట్రోఫీని గెలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
నేను ఇంకా ఎక్కడికీ వెళ్లడం లేదు: ధోని
ప్రతీ ఫైనల్ ప్రత్యేకమే. ఫైనల్లో ఎక్కువసార్లు ఓడిన జట్టు కూడా మాదే. అయితే పడ్డ ప్రతీసారి కోలుకొని పైకి లేవడం అన్నింటికంటే ముఖ్యం. మేం ఆటగాళ్లను మారుస్తూ వచ్చాం. ప్రతీసారి ఒక మ్యాచ్ విన్నర్ బయటకు వచ్చి అద్భుతాలు చేశారు. నిజాయితీగా చెప్పాలంటే జట్టు సమావేశాల్లో మేం పెద్దగా మాట్లాడుకోం. ఏమైనా ఉంటే ఒక్కొక్కరితో విడిగా చెప్పడమే. మేం ఎక్కడ ఆడినా మాకు అండగా నిలిచే చెన్నై అభిమానులకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా చెన్నైలో ఆడుతున్నట్లే అనిపించింది. వచ్చేసారి రెండు కొత్త జట్లు వస్తున్నాయి కాబట్టి ఆటగాళ్లను కొనసాగించడం గురించి ఏమీ చెప్పలేను. నేను ఇదే జట్టుతో కొనసాగుతానా లేదా అనేది సమస్య కాదు. ఫ్రాంచైజీ కోసం ఒక పటిష్టమైన జట్టును తయారు చేయడం ముఖ్యం. సరిగ్గా చెప్పాలంటే వచ్చే 10 ఏళ్లు జట్టును నడిపించగల ప్రధాన బృందాన్ని ఎంచుకోవడం ముఖ్యం. నా వైపు నుంచి గొప్ప ఘనతలు ఇచ్చి వెళుతున్నానని అంటున్నారు. కానీ నేను ఇప్పుడే పోతే కదా. –ఎమ్మెస్ ధోని, (చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్) -
ధోని పక్కా వ్యూహం.. వారి వయసు 35 ఏళ్లకు పైనే..
సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్‌ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. సీఎస్కేకు తొలి సీజన్ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్‌షిప్‌లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్ చూస్తే సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్‌తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్‌లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం! చెన్నై టీమ్‌లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్‌గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్ రైనా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్‌గా పేలింది. తొలి క్వాలిఫయర్‌లో మెరుపు బ్యాటింగ్ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు. 36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్ గెలిచిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్ గైక్వాడ్. గత ఏడాది ఐపీఎల్ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్‌లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. చివరగా... వచ్చేసారి ఐపీఎల్లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్‌లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్ఫుల్ టీమ్ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు, సగటు క్రికెట్ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది. -
నాలుగోసారి ‘కింగ్స్’
ఐపీఎల్లో మళ్లీ ‘విజిల్ పొడు’... పసుపు మయమైన దుబాయ్ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తుంటే... దసరా రోజున చెన్నై క్రికెట్ అభిమానుల పండగ ఆనందం రెట్టింపైంది... అనుభవం, అద్భుత నాయకత్వం వెరసి చెన్నై మరోసారి ధనాధన్ లీగ్‌లో తమ విలువేంటో చూపించింది. తుది పోరులో అన్ని రంగాల్లో మెరిసి నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. మెరుపు బ్యాటింగ్‌తో మొదటి భాగంలోనే విజయానికి బాటలు వేసుకున్న జట్టు, బౌలింగ్‌లో కీలక సమయంలో సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టింది. ఫైనల్ పోరులో తమదైన పాత్ర పోషించిన ప్రతీ ప్లేయర్ హీరోలుగా నిలిచారు. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరంభంలోనే భారీగా పరుగులు సమరి్పంచుకొని పట్టు కోల్పోయింది. నమ్ముకున్న బౌలర్లంతా విఫలం కాగా... బ్యాటింగ్‌లో టోర్నీ ఆసాంతం వెంటాడిన మిడిలార్డర్ వైఫల్యం అసలు సమయంలో పెద్ద దెబ్బ కొట్టింది. ఫలితంగా తమ మూడో ఫైనల్‌ను ఓటమితో ముగించాల్సి వచి్చంది. దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) నాలుగో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో చెన్నై 27 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫాఫ్ డు ప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, మొయిన్ అలీ (20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఉతప్ప (15 బంతుల్లో 31; 3 సిక్సర్లు) కీలక ప్రదర్శన చేశారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఒకదశలో 91/0తో లక్ష్యం దిశగా సాగిన జట్టు... 34 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. విజేతగా నిలిచిన చెన్నై జట్టుకు రూ. 20 కోట్లు... రన్నరప్ కోల్‌కతా జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు... సీజన్ మొత్తంలో ఆడిన తరహాలోనే చెన్నైకి మరోసారి ఓపెనర్లు రుతురాజ్, డు ప్లెసిస్ శుభారంభం అందించారు. షకీబ్ ఓవర్లో రుతురాజ్ వరుసగా 4, 6 కొట్టగా, అదృష్టం కలిసొచ్చిన డు ప్లెసిస్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. నరైన్ ఈ జోడీని విడదీసిన సమయంలో కోల్‌కతా స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. అయితే మూడో స్థానంలో వచి్చన రాబిన్ ఉతప్ప ఉన్న కొద్దిసేపు మెరుపు బ్యాటింగ్‌తో ఆట గమనాన్ని మార్చేశాడు. మరోవైపు ఫెర్గూసన్ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన 35 బంతుల్లోనే డు ప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్‌లో ఉతప్ప వెనుదిరిగినా అలీ దూకుడుతో చెన్నై ఇన్నింగ్స్‌లో జోరు తగ్గలేదు. శివమ్ మావి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అలీ, వరుణ్ చక్రవర్తి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ కొట్టాడు. ఫెర్గూసన్ ఓవర్లో 19 పరుగులు రాబట్టి కింగ్స్ పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి బంతికి డు ప్లెసిస్ అవుటైనా... మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాల్లో (61, 63, 68) అతను తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఓపెనర్లు మినహా... చెన్నైతో పోలిస్తే ఛేదనలో కోల్‌కతా మరింత దూకుడు కనబర్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ వరుస బౌండరీలతో జోరును ప్రదర్శించగా, గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహర్, శార్దుల్ ఓవర్లలో వెంకటేశ్ రెండేసి ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లేలో 55 పరుగులు రాగా, జడేజా ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి స్కోరు 88 పరుగులకు చేరింది. అయితే ఈ దశలో శార్దుల్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని ఓవర్లో భారీ షాట్‌కు ప్రయతి్నంచిన వెంకటేశ్... జడేజా అద్భుత క్యాచ్‌కు వెనుదిరగడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా, అదే ఓవర్లో రాణా (0) అవుటయ్యాడు. నరైన్ (2), కార్తీక్ (9), షకీబ్ (0), గాయంతో బ్యాటింగ్‌కు దిగిన త్రిపాఠి (2), పేలవ ఫామ్‌లో ఉన్న కెపె్టన్ మోర్గాన్ (4) వరుసగా విఫలమయ్యారు. దాంతో కేకేఆర్ ఇన్నింగ్స్ వేగంగా పతనమైంది. చివర్లో 21 బంతుల్లో 68 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన శివమ్ మావి (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫెర్గూసన్ (18 నాటౌట్) కొన్ని మెరుపు షాట్లు ఆడి 39 పరుగులు జోడించినా అది వృథా ప్రయాసే అయింది. డు ప్లెసిస్‌కు అవకాశం ఇచి్చ... సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చేసిన పెద్ద తప్పు చెన్నైకి ఊపిరి పోసింది. షకీబ్ బౌలింగ్‌లో డు ప్లెసిస్ ముందుకు దూసుకు రాగా, సునాయాస స్టంపింగ్ అవకాశాన్ని కార్తీక్ వదిలేశాడు. ఆ సమయంలో ప్లెసిస్ స్కోరు 4 మాత్రమే! ఆ తర్వాత అతనే భారీ స్కోరుకు కారణమయ్యాడు. కోల్‌కతా ఆటగాడు వెంకటేశ్ ‘0’ వచి్చన ఇచ్చిన క్యాచ్‌ను అనూహ్యంగా ధోని వదిలేసి అతని అర్ధ సెంచరీకి అవకాశం ఇచి్చనా... చివరకు అది నష్టం కలిగించలేదు. మరోవైపు 27 పరుగుల వద్ద గిల్ క్యాచ్‌ను రాయుడు అందుకున్నా... బంతి స్పైడర్ క్యామ్ వైర్‌కు తగిలి రావడంతో అంపైర్లు డెడ్‌బాల్‌గా ప్రకటించడం ధోనికి అసహనం తెప్పించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మావి (బి) నరైన్ 32; డు ప్లెసిస్ (సి) వెంకటేశ్ (బి) మావి 86; ఉతప్ప (ఎల్బీ) (బి) నరైన్ 31; మొయిన్ అలీ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–61, 2–124, 3–192. బౌలింగ్: షకీబ్ 3–0–33–0, మావి 4–0–32–1, ఫెర్గూసన్ 4–0–56–0, వరుణ్ 4–0–38–0, నరైన్ 4–0–26–2, వెంకటేశ్ 1–0–5–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (ఎల్బీ) (బి) దీపక్ చహర్ 51; వెంకటేశ్ (సి) జడేజా (బి) శార్దుల్ 50; రాణా (సి) డు ప్లెసిస్ (బి) శార్దుల్ 0; నరైన్ (సి) జడేజా (బి) హేజల్‌వుడ్ 2; మోర్గాన్ (సి) చహర్ (బి) హేజల్‌వుడ్ 4; దినేశ్ కార్తీక్ (సి) రాయుడు (బి) జడేజా 9; షకీబ్ (ఎల్బీ) (బి) జడేజా 0; త్రిపాఠి (సి) అలీ (బి) శార్దుల్ 2; ఫెర్గూసన్ (నాటౌట్) 18; మావి (సి) చహర్ (బి) బ్రేవో 20; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–91, 2–93, 3–97, 4–108, 5–119, 6–120, 7–123, 8–125, 9–164. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–32–1, హేజల్‌వుడ్ 4–0–29–2, శార్దుల్ ఠాకూర్ 4–0–38–3, బ్రావో 4–0–29–1, జడేజా 4–0–37–2. ఐపీఎల్–2021 అవార్డులు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ రుతురాజ్ గైక్వాడ్ –ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) హర్షల్ పటేల్–32 వికెట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హర్షల్ పటేల్ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ హర్షల్ పటేల్ – ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ రవి బిష్ణోయ్ (పంజాబ్ కింగ్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ హెట్‌మైర్ – ఢిల్లీ క్యాపిటల్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్ కేఎల్ రాహుల్ (30 సిక్స్‌లు) పంజాగ్ కింగ్స్ ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ఫెయిర్ ప్లే టీమ్ ఆఫ్ ద సీజన్: రాజస్తాన్ రాయల్స్ -
IPL 2021 Prize Money: విజేతకు 20 కోట్లు.. మరి వాళ్లందరికీ ఎంతంటే!
IPL 2021 Prize Money: ఐపీఎల్-2021 విజేతగా చెన్నై సూపర్‌కింగ్స్ అవతరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. మరి... టైటిల్ విన్నర్, రన్నరప్ గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత? ఎమర్జింగ్ ప్లేయర్, ఫెయిర్ ప్లే, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల వీరుడు ఎవరు.. వాళ్లు గెలుచుకున్న మొత్తం ఎంత? తదితర అంశాలను పరిశీలిద్దాం. అవార్డు ప్లేయర్ గెలుచుకున్న మొత్తం (రూపాయల్లో) ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు ఫెయిర్ ప్లే అవార్డు రాజస్తాన్ రాయల్స్ 10 లక్షలు గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ హర్షల్ పటేల్ 10 లక్షలు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ షిమ్రోన్ హెట్మెయిర్ 10 లక్షలు మాక్సిమమ్ సిక్సెస్ అవార్డు కేఎల్ రాహుల్ 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వెంకటేశ్ అయ్యర్ 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ రవి బిష్ణోయి 10 లక్షలు పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ 10 లక్షలు ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు అత్యంత విలువైన ఆటగాడు హర్షల్ పటేల్ 10 లక్షలు విజేత చెన్నై సూపర్ కింగ్స్ 20 కోట్లు రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 12.5 కోట్లు మూడోస్థానం ఢిల్లీ క్యాపిటల్స్ 8.75 కోట్లు నాలుగో స్థానం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8.75 కోట్లు చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది: ధోని -
Faf Du Plessis: 100వ గేమ్... ప్రత్యేకం.. భారత క్రికెట్‌కు అదొక వరం!
IPL 2021 Final Faf Du Plessis Comments: ఐపీఎల్2021 సీజన్ ఆసాంతం అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ ఫాప్ డుప్లెసిస్. 16 మ్యాచ్‌లు ఆడిన అతడు మొత్తంగా 633 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 95 నాటౌట్. దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి విశ్వరూపం ప్రదర్శించిన డుప్లెసిస్... సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి గనుక డుప్లెసిస్.. షాట్ ఆడి ఉంటే ఆరెంజ్ క్యాప్ అతడి సొంతమయ్యేది. కాగా డుప్లెసిస్‌కు ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో విజయానంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ... ‘‘ఇది నిజంగా గొప్ప రోజు. 100వ ఐపీఎల్ గేమ్. నేను ఇక్కడకు వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. నాలుగోసారి ట్రోఫీ గెలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. రుతు(మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్) ప్రతిభావంతుడు. ఇలాంటి మెరికల్లాంటి ఆటగాళ్లు ఉండటం భారత క్రికెట్‌కు వరమనే చెప్పాలి. జట్టు బాధ్యతను భుజాల మీద మోశాడు. అతడికి గొప్ప భవిష్యత్తు ఉంది’’ అని ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్(635)పై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో రుతు 32 పరుగులు చేశాడు. చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది: ధోని Partners #1331 💛#SuperCham21ons#CSKvKKR #WhistlePodu #Yellove🦁 @faf1307@Ruutu1331pic.twitter.com/yz3WE8VNvG — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 -
MS Dhoni: టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది.. మేమైతే..
IPL 2021 Winner CSK Captain MS Dhoni Commnets: ‘‘సీఎస్కే కంటే ముందు నేను కేకేఆర్ గురించి మాట్లాడాలి. సీజన్ తొలి దశలో ఎదురైన పరాభవాల నుంచి తేరుకుని... ఇక్కడి వరకు రావడం నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. ఈసారి ఐపీఎల్ టైటిల్ విజేత అయ్యే అర్హత ఏ జట్టుకైనా ఉందంటే.. అది కేకేఆర్. వాళ్ల ఆట తీరు అమోఘం. నిజానికి... విరామం (ఐపీఎల్ వాయిదా)వాళ్లకు మేలే చేసింది’’ అంటూ చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2021 రెండో అంచెలో మోర్గాన్ సేన అద్భుత ప్రద్శనతో ఆకట్టుకుందని కితాబిచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే.. కేకేఆర్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి నాలుగోసారి (2010, 2011, 2018, 2021) చాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని స్పందిస్తూ... ‘‘గణాంకాలను బట్టి చూస్తే... నిలకడ జట్టుగా మాకు మంచి పేరు ఉంది. అదే సమయంలో మేం ఫైనల్లో ఓడిన సందర్భాలు అనేకం. అందుకే ఈసారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని అనుకున్నాం. బాగా ఇంప్రూవ్ అయ్యాం. జట్టు సమిష్టి విజయం ఇది. తొలుత కాస్త ఒత్తిడికి గురైన మాట వాస్తవం. అయితే, వ్యక్తిగతంగా.. గొప్పగా రాణించే ఆటగాళ్లు ఉండటం మాకు కలిసి వచ్చింది.’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సందర్భంగా అభిమానులను ధన్యవాదాలు తెలిపిన ధోని... ‘‘ఇప్పుడు మేం దుబాయ్‌లో ఉన్నాం. ఒకవేళ సౌతాఫ్రికాలో ఉన్నా సరే.. ఫ్యాన్స్ మద్దతు మాకు ఇలాగే ఉంటుంది. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను చెన్నైలోని చెపాక్‌లోనే ఉన్నట్లుగా భావిస్తున్నా. చెన్నై అభిమానుల కోసం మేం మళ్లీ అక్కడ ఆడే అవకాశం వస్తుందని భావిస్తున్నా’’ అని ఫ్యాన్స్‌పై ప్రేమను కురిపించాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా Of the Fans, By the Fans, For the Fans 💛 #EverywhereWeGo#THA7A #SuperCham21ons#CSKvKKR #WhistlePodu #Yellove🦁pic.twitter.com/6OXgZUeOjA — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 We are the Chennai boys… Making all the noise… Everywhere we Gooo…💛💛 For all of you #SuperFans.! 💛🦁#WhistlePodu #Yellove #SuperCham21ons 💛🦁 pic.twitter.com/6nQS9zWovf — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 -
#iplfinal: సీఎస్కే విన్నింగ్ మూమెంట్.. వీడియో వైరల్
IPL 2021 Winner CSK Video Viral: గత సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి టైటిల్ విజేతగా నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 27 పరుగుల తేడాతో జయభేరి మోగించి విజయ దరహాసం చేసింది. నాలుగోసారి ట్రోఫీని గెలుచుకుని సత్తా చాటింది. ధోని సారథ్యంలో తమకు తిరుగులేదని నిరూపిస్తూ తుదిపోరులో ప్రత్యర్థిని మట్టికరిపించింది. దీంతో చెన్నై అభిమానుల ముఖాల్లో చిరునవ్వు విరిసింది. విజయ దశమినాడు విజిల్ పొడూ అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇక విజయానంతరం ధోని సేన చేసుకున్న సంబరాలకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సీజన్ తర్వాత ధోని సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదంటే, ఇతర బాధ్యతలు చేపడతాడా అన్న సందేహాల నేపథ్యంలో అనివార్యమైన ఈ విజయాన్ని అభిమానులు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి!! స్కోర్లు: చెన్నై 192/3 (20) కేకేఆర్ 165/9 (20) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Fantastic FOUR! 🏆 🏆 🏆 🏆 The @msdhoni-led @ChennaiIPL beat #KKR by 27 runs in the #VIVOIPL #Final & clinch their 4⃣th IPL title. 👏 👏 #CSKvKKR A round of applause for @KKRiders, who are the runners-up of the season. 👍 👍 Scorecard 👉 https://t.co/JOEYUSwYSt pic.twitter.com/PQGanwi3H3 — IndianPremierLeague (@IPL) October 15, 2021 The winning moment.! Ft. Super Fam.!#WhistlePodu #Yellove #SuperCham21ons 💛🦁 pic.twitter.com/7uHH5fJ5N5 — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021 -
IPL 2021 Winner: కేకేఆర్‌పై ఘన విజయం.. చెన్నై ‘ఫోర్’ కొట్టేసింది!
IPL 2021 Winner CSK: చెన్నై సూపర్ కింగ్స్ ‘ఫోర్’ కొట్టేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ధోని సేన నాలుగోసారి(2010, 2011, 2018, 2021) క్యాష్ రిచ్ లీగ్ విజేతగా అవతరించింది. విజయ దశమి నాడు అభిమానులకు గొప్ప బహుమతి ఇచ్చింది. తొమ్మిదోసారి ఫైనల్ చేరిన చెన్నై... సగర్వంగా నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక తొలి అంచెలో తడబడినా.. యూఏఈలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న మోర్గాన్ బృందం రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఫాఫ్ డుప్లెసిస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అదరగొట్టిన డుప్లెసిస్.. గైక్వాడ్ సైతం.. టాస్ గెలిచిన మోర్గాన్... ధోని సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో... ఈ సీజన్లో చక్కటి శుభారంభాలు అందించిన చెన్నై ఓపెనర్లు మరోసారి అదే ఫీట్ రిపీట్ చేశారు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుత్‌రాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 32 పరుగులు, 3 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుగైన ఆట తీరు కనబరచగా... ఫాఫ్ డుప్లెసిస్(59 బంతుల్లో 86, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రాబిన్ ఊతప్ప మరోసారి మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. మొయిన్ అలీ సైతం 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లు కోల్పోయి... 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునిల్ నరైన్‌కు రెండు, శివం మావికి ఒక వికెట్ దక్కాయి. ఓపెనింగ్ జోడీ రాణించినా.. 193 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(51), వెంకటేశ్ అయ్యర్(50) మంచి ఆరంభాన్ని అందించారు. కానీ శార్దూల్ ఠాకూర్ మాయాజాలం, జడేజా అద్భుత ఫీల్డింగ్.. అన్నింటికీ మించి ధోని వ్యూహాల ముందు చతికిలపడ్డ కేకేఆర్‌కు చివరికి ఓటమి తప్పలేదు. నితీశ్ రాణా(0), సునిల్ నరైన్(2), కెప్టెన్ మోర్గాన్(4), దినేశ్ కార్తిక్(9), షకీబ్ అల్ హసన్(0), రాహుల్ త్రిపాఠి(2), లాకీ ఫెర్గూసన్(3) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివర్లో శివం మావి(20) వరుస షాట్లతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మూడోసారి టైటిల్ గెలవాలన్న కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 2012 నాటి ఫలితాన్ని పునరావృతం చేద్దామని భావించిన కోల్‌కతాకు 2021 ఫైనలో భంగపాటు తప్పలేదు. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ 1, జోష్ హాజిల్‌వుడ్ 2, శార్దూల్ ఠాకూర్ 3, జడేజా రెండు, బ్రావో ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి: గోల్డెన్ డక్ విషయంలో నితీష్ రాణా చెత్త రికార్డు Fantastic FOUR! 🏆 🏆 🏆 🏆 The @msdhoni-led @ChennaiIPL beat #KKR by 27 runs in the #VIVOIPL #Final & clinch their 4⃣th IPL title. 👏 👏 #CSKvKKR A round of applause for @KKRiders, who are the runners-up of the season. 👍 👍 Scorecard 👉 https://t.co/JOEYUSwYSt pic.twitter.com/PQGanwi3H3 — IndianPremierLeague (@IPL) October 15, 2021 -
IPL 2021 CSK Vs KKR: అప్పుడు టార్గెట్ 190/3, ఇప్పుడేమో.. 192/3!
IPL 2021 FInal: ఐపీఎల్-2021 విజేతగా నిలిచేందుకు చెన్నై సూపర్‌కింగ్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు రుత్‌రాజ్ గైక్వాడ్(32), డుప్లెసిస్(86) శుభారంభం అందించగా... రాబిన్ ఊతప్ప తనకు దక్కిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. 15 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. మొయిన్ అలీ సైతం 37 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ధోని సేన 3 వికెట్లు కోల్పోయి... 192 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా.... 6 ఓవర్లు ముగిసేసరికి 55 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. ఇదిలా ఉండగా... ఐపీఎల్ విజేత ఎవరన్న అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. దుబాయ్ పిచ్ హిస్టరీ, అదే విధంగా గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన సమయంలో కేకేఆర్ 180 కంటే ఎక్కువ టార్గెట్ ఛేజ్ చేసిన నేపథ్యంలో మోర్గాన్ బృందానికే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 2012లో చెన్నైలో సీఎస్కేతో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ 192(19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) పరుగులు చేసి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా 2014లో బెంగళూరులో జరిగిన ఫైనల్లో పంజాబ్‌తో తలపడిన కోల్‌కతా 200(19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరుగులు సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడు కూడా 2012 నాటి ఫలితమే పునరావృతమవుతుందని కేకేఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తలా ధోని అభిమానులు సైతం... ‘‘ఇక్కడ ఉంది మిస్టర్ ధోని.. అది గుర్తుంచుకోండి’’ అంటూ ధీటుగా బదులిస్తున్నారు. 2012 ఫైనల్ స్కోర్లు చెన్నై... 190-3 (20 ఓవర్లు) కేకేఆర్.... 192-5 (19.4 ఓవర్లు) విజేత: కోల్‌కతా 2021 ఫైనల్ చెన్నై: 192-3 (20 ఓవర్లు) విజేత... ? -
ఫెర్గూసన్ చెత్త రికార్డు..
Lockie Ferguson.. సీఎస్కేతో జరుగుతున్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ లోకి ఫెర్గూసన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఫెర్గూసన్ ఎక్కువ పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి. ఇక్కడ విశేషమేమిటంటే.. ఫెర్గూసన్ గత సీజన్లోనూ దుబాయ్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లోనే ఫెర్గూసన్ 54 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. -
CSK Vs KKR Final: ఐపీఎల్ 2021 టైటిల్ విజేత సీఎస్కే
ఐపీఎల్ 2021 టైటిల్ విజేత సీఎస్కే ఐపీఎల్లో సీఎస్కే నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఐపీఎల్ 2021 విజేతగా నిలిచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆరంభంలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ దూకుడుతో ఇన్నింగ్స్‌ను ఘనంగానే ఆరంభించింది. అయితే అయ్యర్, గిల్ ఔటైన తర్వాత మ్యాచ్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ టర్న్ అయింది. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్ వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా అడుగులేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. ఎనిమిదో వికెట్ వికెట్ డౌన్.. ఓటమి దిశగా కేకేఆర్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. షకీబుల్ హసన్ జడేజా బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 15 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అంతకముందు9 పరుగులు చేసిన కార్తీక్ జడేజా బౌలింగ్‌లో రాయుడుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. 51 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ దీపక్ చహర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. . వెంకటేశ్ అయ్యర్ ఔట్.. కేకేఆర్ 93/2 సీఎస్కే జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. నితీష్ రాణా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అంతకముందు వెంకటేశ్ అయ్యర్(50) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దాటిగా ఆడుతున్న అయ్యార్ శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. గిల్ 40, నితీష్ రాణా పరుగులతో క్రీజులో ఉన్నారు. చుక్కలు చూపిస్తున్న వెంకటేశ్ అయ్యర్.. కేకేఆర్ 72/0 కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులతో ఆడుతున్న అయ్యర్‌కు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(27) సహకరిస్తున్నాడు. ప్రస్తుతం కేకేఆర్ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ధీటుగా బదులిస్తున్న కేకేఆర్ 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ధీటుగానే బదులిస్తుంది. కేకేఆర్ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్‌మన్ గిల్లు దాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 21, గిల్ 15 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL సీఎస్కే 192/3 .. కేకేఆర్ ముందు భారీ టార్గెట్ ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు. 17 ఓవర్లలో సీఎస్కే 153/2 17 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ 69 పరుగులతో ఆడుతుండగా.. మొయిన్ అలీ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 124/2 రాబిన్ ఊతప్ప(31) రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్‌లో ఊతప్ప ఎల్బీగా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. డుప్లెసిస్ 57 పరుగులతో ఆడుతున్నారు. 13 ఓవర్లలో సీఎస్కే స్కోరు 116/1 13 ఓవర్ల ఆట ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. డుప్లెసిస్ 56,రాబిన్ ఊతప్ప 25 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. రుతురాజ్(32) ఔట్ రుతురాజ్ గైక్వాడ్(32)రూపంలో సీఎస్కే తొలి వికెట్‌ను కోల్పోయింది. కేకేఆర్ స్పిన్నర్ నరైన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని రుతురాజ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. శివమ్ మావి క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం సీఎస్కే 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. 6 ఓవర్లలో సీఎస్కే 50/0 సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌లు ఇన్నింగ్స్ ధాటిగా ఆడుతున్నారు. కేకేఆర్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. రుతురాజ్ 26, డుప్లెసిస్ 23 పరుగులతో ఆడుతున్నారు. 3 ఓవర్లలో సీఎస్కే 22/0 కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. రుతురాజ్ 18, డుప్లెసిస్ 3 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్ 2021లో భాగంగా సీఎస్కే, కేకేఆర్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక మ్యాచ్‌లో సీఎస్కే ఫెవరెట్‌గా కనిపిస్తుండగా.. కేకేఆర్ కూడా పటిష్టంగానే కనిపిస్తుంది. లీగ్ దశలో సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 5 ఓటములతో రెండో స్థానంలో నిలిచింది. ఇక కేకేఆర్ 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు.. ఏడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1లో సీఎస్కే ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆర్సీబీని ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడించిన కేకేఆర్ క్వాలిఫయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో రెండుసార్లు తలపడగా.. సీఎస్కేనే విజయం వరించింది. ముఖాముఖి పోరులో 24 సార్లు తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో సీఎస్కే విజయం సాధించగా.. కేకేఆర్ 8సార్లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్ కోల్‌కతా నైట్ రైడర్స్: శుబ్‌మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి -
బయోబబూల్‌లో మా పరిస్థితి ఇలాగే ఉంది..
Virat Kohli Shows Life In Bio Bubble.. ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఐపీఎల్ 2021 టైటిల్ అందుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. తనకు కెప్టెన్‌గా ఇదే చివరి సీజన్ అని విరాట్ కోహ్లి ఇప్పటికే ప్రకటించడంతో ఈసారి ఎలాగైనా ఆర్సీబీ కప్ కొడుతుందని అంతా భావించారు. కానీ కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ అనూహ్యంగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక తర్వాతి సీజన్ నుంచి కోహ్లి ఆర్సీబీకి ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. చదవండి: Virat Kohli Crying: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా ఇక తాజాగా విరాట్ కోహ్లి టి20 ప్రపంచకప్ ఉండడంతో టీమిండియా బయోబబూల్లోకి వెళ్లిపోయాడు. అయితే కరోనా వైరస్ తర్వాత బయోబబూల్ ప్రతీ ఒక్కరికి సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో బయోబబూల్ అనేది ఎంత కష్టంగా ఉందో కోహ్లి ఒక్క ఫోటోతో చూపించాడు. తనను తాను కుర్చీకి కట్టేసుకొని.. బయోబబూల్‌లో మా పరిస్థితి అచ్చం ఇలాగే ఉందని పేర్కొన్నాడు. బయోబబూల్ వల్ల చాలా మంది ఆటగాళ్లు మానసిక ఒత్తిడి గురయ్యారు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు క్రిస్ గేల్ బయోబబూల్ కారణంగానే ఐపీఎల్ వీడిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లి కూడా బయోబబూల్ అనేది నచ్చలేదంటే పరోక్షంగా ఒక్క ఫోటోలోనే చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కోహ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2021: టి20 కెప్టెన్‌గా ఎంఎస్ ధోని అరుదైన రికార్డు View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
టి20 కెప్టెన్‌గా ఎంఎస్ ధోని అరుదైన రికార్డు
MS Dhoni As First Captain As 300 T20 Matches.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముందు అరుదైన రికార్డు ఎదురుచూస్తుంది. కేకేఆర్‌తో జరగనున్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ ద్వారా 300 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనతను ధోని అందుకోనున్నాడు. కాగా ధోని సారధ్యంలోనే సీఎస్కే మూడుసార్లు(2010, 2011, 2018)లో చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇప్పటివరకు సీఎస్కే తరపున తొమ్మిదిసార్లు ఫైనల్ చేర్చిన ధోని.. 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను ఫైనల్ చేర్చాడు. దీంతోపాటు టి20ల్లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న కెప్టెన్‌గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో 213 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ధోని 130 విజయాలు అందుకున్నాడు. ధోని తర్వాత ఐపీఎల్లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న వారిలో రోహిత్ శర్మ 75 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ల పరంగా కోహ్లి 140 మ్యచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ కాగా వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ధోని సీఎస్కేలో కొనసాగుతాడా లేదా అనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం ధోని సీఎస్కేకు ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. తనను వచ్చే సీజన్లో ఎల్లో డ్రెస్‌లో కనిపిస్తానని.. అయితే జట్టులో ఆటగాడిగా.. లేక ఇతర స్థానంలో కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. ఇక టి20 ప్రపంచకప్ సందర్భంగా ధోని టీమిండియాకు మెంటార్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021: అందరూ ధోనిలు కాలేరు.. పంత్‌కు కాస్త సమయం ఇవ్వండి -
IPL 2021 Final: అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం!
Brendon McCullum Comments: ‘‘ఒక్కసారి అన్నీ గుర్తుకు తెచ్చుకోండి.. ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండే విజయాలు. ఆ ప్రయాణాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు చెప్పబోయే స్ఫూర్తిదాయక కథల గురించి ఊహించుకోండి. మీ అనుభవాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన ముందున్న లక్ష్యం అదే. మనల్ని ఉత్తేజపరిచి... ఎగ్జైట్మెంట్కు గురిచేసేది అదే. మనం పెద్దగా కోల్పోయేదేం లేదు. అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం’’- కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్... జట్టును ఉద్దేశించి ఈ మేరకు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. తొలి అంచెలో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన సమయంలో జట్టులో జోష్ నింపేందుకు ప్రయత్నించాడు. ఆ మాటలను నిజం చేస్తూ... కేకేఆర్ ఆటగాళ్లు రెండో అంచెలో అద్భుత ప్రదర్శనను కనబరిచి... వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువచ్చారు. ఇక అక్టోబరు 15న చెన్నై సూపర్‌కింగ్స్‌తో టైటిల్ పోరుకు సిద్ధమవుతున్న సమయంలో ఫ్రాంఛైజీ మెకల్లమ్ స్పీచ్ వీడియోను షేర్ చేసింది. అభిమానులను ఈ వీడియో విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా కోవిడ్ కారణంగా ఐపీఎల్-2021 సీజన్ వాయిదా పడే నాటికి ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండింట మాత్రమే గెలుపొందిన కేకేఆర్.. పాయింట్ల పట్టికలో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా రెండో అంచె ప్రారంభమైన తర్వాత... కోల్‌కతా రాత మారింది. ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: IPL 2021 Final Today: ఆ జట్టుదే పైచేయి... ముందు ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలుపు ఖాయమా? Tonight's our 𝙩𝙧𝙮𝙨𝙩 𝙬𝙞𝙩𝙝 𝙙𝙚𝙨𝙩𝙞𝙣𝙮! 💜#KKR #CSKvKKR #AmiKKR #KorboLorboJeetbo #আমিKKR #IPL2021 pic.twitter.com/X0u50MHBR0 — KolkataKnightRiders (@KKRiders) October 15, 2021 -
IPL 2021 Final Today: ఆ జట్టుదే పైచేయి... టాస్ గెలిస్తే చాలా?!
IPL 2021, CSK vs KKR Today At Dubai International Cricket Stadium: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి. తొమ్మిదిసార్లు ఫైనల్ చేరిన సీఎస్కే నాలుగోసారి కప్ కొట్టాలని భావిస్తుండగా... ప్లే ఆఫ్స్ కూడా చేరుతుందా లేదా అన్న దశ నుంచి టేబుల్ టాపర్‌ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్ మూడోసారి చాంపియన్‌గా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. నేటి మ్యాచ్ ప్రధానంగా చెన్నై బ్యాటింగ్‌కు, కోల్‌కతా బౌలింగ్‌కు మధ్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. Courtsey: IPL అదరగొడుతున్న ఓపెనర్లు... ఇంకో 23 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్... సీఎస్కే ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్( ఇప్పటి వరకు 603 పరుగులు) సొంతమవుతుంది. మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ (547), ఆల్‌రౌండర్ జడేజా వంటి కీలక ప్లేయర్లు మెరుగ్గా రాణిస్తుండటం... అన్నింటికీ మించి కెప్టెన్ ధోని వ్యూహాలు... సీఎస్కేను ఫేవరెట్‌గా నిలుపుతాయనడంలో సందేహం లేదు. అయితే, రెండో అంచెలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ దాకా వచ్చిన మోర్గాన్ బృందాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. Courtsey: IPL చెన్నైదే పైచేయి! ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(427), వెంకటేశ్ అయ్యర్(320)ఫాంలో ఉండటం... మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(18), సునిల్ నరైన్(14) రాణిస్తుండటం కేకేఆర్‌కు కలిసి వచ్చే అంశాలు. ఈ సీజన్లో చెన్నై- కేకేఆర్ రెండుసార్లు తలపడగా... రెండుసార్లు విజయం ధోని సేననే వరించింది. అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియం(సెప్టెంబరు 26), ముంబైలోని వాంఖడే స్టేడియంలో(ఏప్రిల్ 21) వరుసగా 2 వికెట్లు, 18 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. ఇక మొత్తంగా క్యాష్ రిచ్ లీగ్‌లో సీఎస్కే- కేకేఆర్ 25సార్లు ముఖాముఖి తలపడగా... చెన్నై 16 సార్లు, కోల్‌కతా 8 సార్లు గెలిచింది. ఇక ఇప్పుడు ఇరు జట్లు తొలిసారిగా దుబాయ్ వేదికగా ఫైనల్లో తలపడబోతున్నాయి. మరి అక్కడి పిచ్‌పై టీ20 రికార్డు ఎలా ఉందో పరిశీలిద్దాం! ►స్టేడియం పేరు: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ►ఇప్పటి వరకు జరిగిన టీ20 మ్యాచ్‌లు: 105 ►తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు సాధించిన విజయాలు: 41 ►లక్ష్య ఛేదనకు దిగిన టీం సాధించిన విజయాలు: 63 ►మ్యాచ్ టై అయినవి: 1 ►నమోదైన అత్యధిక స్కోరు: 219/2- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్- 2020 ►అత్యల్ప స్కోరు: 59(లాహోర్ కాలాండర్స్ వర్సెస్ పెషావర్ జల్మీ-2017) ►ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 156 ►ఇక ఈ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై... ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. స్కోర్లు: ఢిల్లీ- 172/5(20 ఓవర్లు) చెన్నై- 173/6(19.4 ఓవర్లు). ►ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లోనూ టాస్ కీలకం కానుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టేడియం చరిత్ర ప్రకారం... ఒకవేళ ధోని టాస్ గెలిస్తే.. మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంటాడా.. లేదంటే అదృష్టం కేకేఆర్‌ను వరిస్తుందా.. లేదంటే సెంటిమెంట్‌ను తిరగరాస్తూ అద్భుతాలేమైనా జరుగుతాయా లేదా అన్నది చూడాలంటే సాయంత్రం వరకు(7.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం) వేచి చూడాల్సిందే! చదవండి: IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు! -
IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు!
Don’t be surprised if Morgan drops himself: మరికొన్ని గంటల్లో ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిపోరుకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కేకేఆర్ జట్టు కూర్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ జట్టుతో చేరే అవకాశాలున్న వాన్... షకీబ్ అల్ హసన్ స్థానాన్ని అతడు భర్తీ చేసే ఛాన్స్ ఉందన్నాడు. ఒకవేళ అది కుదరకపోతే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. రస్సెల్ కోసం తనను తాను తుదిజట్టు నుంచి డ్రాప్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్న మోర్గాన్... బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 129 రన్స్ మాత్రమే చేసిన అతడు... కీలకమైన క్వాలిఫైయర్-2లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘షార్జాలో వాళ్లు బాగా ఆడారు. అక్కడి పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. అయితే, దుబాయ్‌లో పిచ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆండ్రీ రస్సెల్‌తో నాలుగు ఓవర్లు వేయిస్తే బాగుంటుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం లేదనుకుంటే... షకీబ్ స్థానంలో అతడు జట్టులోకి రావొచ్చు. ఇక మోర్గాన్ విషయానికొస్తే... జట్టు ప్రయోజనాల కోసం తను ఎంతటి తాగ్యానికైనా సిద్ధపడతాడు. తనను తాను తుది జట్టు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తన పట్టుదల గురించి నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
IPL Final CSK Vs KKR: అతనే బలం... ‘సూపర్’ దళం!
పాత చాంపియన్ల మధ్య కొత్త చాంపియన్‌షిప్ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఏకంగా తొమ్మిదిసార్లు ఫైనల్ చేరి లీగ్‌కే వన్నె తెచి్చన ఫేవరెట్ చెన్నై సూపర్‌కింగ్స్ నాలుగో టైటిల్‌పై కన్నేయగా... రెండు సార్లు ఫైనల్ చేరితే ఆ రెండుసార్లూ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ ఆనవాయితీని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మూడో ఐపీఎల్ టైటిల్‌తో దుబాయ్ నుంచి దిగి్వజయంగా తిరిగి రావాలని ఆశిస్తోంది. దుబాయ్: అవాంతరాలతో ఆగి, భారత్‌నుంచి విదేశం తరలి వెళ్లి మళ్లీ మొదలైన 2021 ఐపీఎల్‌కు ఇంకొన్ని గంటల్లో దుబాయ్‌లో శుభం కార్డు పడనుంది. 14వ సీజన్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సై అంటే సై అంటున్నాయి. గత ఏడాది ప్లే ఆఫ్స్‌కే అర్హత సాధించని ఇరు జట్లను కెపె్టన్లు ధోని, మోర్గాన్ ఈ సీజన్లో సమర్థంగా నడిపించారు. ఇప్పుడు అసలు పోరులో వారి సారథ్యం, బ్యాటింగ్ సామర్థ్యం జట్టుకు గెలిపిస్తాయా అనేది ఆసక్తికరం. ధోని నాయకత్వంలోనే చెన్నై మూడు సార్లు చాంపియన్‌గా నిలవగా, ధోనిలాగే వరల్డ్ కప గెలిపించిన మోర్గాన్ సారథిగా తొలి ఐపీఎల్ టైటిల్‌పై కన్నేశాడు. అతనే బలం... ‘సూపర్’ దళం బ్యాటింగ్ మెరిసినా, మెరిపించకపోయినా ధోని ధోనినే! ఈ క్రికెట్ జ్ఞాని శిబిరంలో ఉంటే ఆ జట్టుకు వంద ఏనుగుల బలం. అందుకే భారత క్రికెట్ బోర్డు కూడా వచ్చే టి20 ప్రపంచకప్ వేటకు వెళ్లే కోహ్లి సేనకు ధోనిని మెంటార్‌గా నియమించింది. తొలి క్వాలిఫయర్‌లో ధోని మెరుపులు జట్టుని గెలుపుతీరానికి చేర్చాయి. ఈ ధనాధన్ టి20ల్లో అతని విశేషానుభవం, సారథ్య సామర్థ్యం జట్టుకు అదనపు బలం. అందుకే 12 సీజన్లు ఐపీఎల్ ఆడితే ఏకంగా 9 సార్లు ఫైనల్‌కు చేర్చిన ఘనత ధోనిదే! ఓపెనింగ్ రుతురాజ్ గైక్వాడ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. దీనికి డుప్లెసిస్ ధాటి కూడా తోడైతే సూపర్ కింగ్స్ భారీస్కోరు చేయడం ఖాయమవుతుంది. టాపార్డర్ నుంచి దీపక్ చహర్ దాకా పది మందికి పరుగులు చేసే సత్తా ఉండటం కూడా చెన్నైలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. దీంతోపాటు ఈ సీజన్లో అక్కడా... ఇక్కడా... రెండు సార్లు కోల్‌కతాపై గెలిచిన సానుకాలంశం చెన్నైని మురిపిస్తోంది. ముంబై, అబుదాబీలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లలో సూపర్‌కింగ్స్ జట్టే గెలిచింది. టాపార్డర్ కీలకం... మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ సీజన్ క్లైమాక్స్ దశలో రెచి్చపోతోంది. అయితే భారీ స్కోర్లతో, మెరిపించే బ్యాట్స్‌మెన్‌తో కాదు... తిప్పేసే స్పిన్ ద్వయంతో పాయింట్ల పట్టికలో తనకన్నా మెరుగైన బెంగళూరు, ఢిల్లీ జట్లను కంగుతినిపించింది. ఇప్పుడు ఫైనల్ మజిలీకొచి్చంది. ఇక్కడి దాకా వస్తే టైటిల్‌తోనే వెళ్లిన రికార్డూ ఊరిస్తోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు తమ స్పిన్ మాయాజాలంతో సూపర్‌కింగ్స్‌ను కట్టిపడేస్తే... లీగ్‌లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవచ్చు. అయితే గత రెండు మ్యాచ్‌లు షార్జా పిచ్‌పై జరిగాయి. కానీ ఇది దుబాయ్ వికెట్. యూఏఈ అంచెలో మెరుగైన స్కోర్లు నమోదైన వేదిక కూడా ఇదే! టాపార్డర్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలతో పాటు అనుభవజు్ఞలైన కెపె్టన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్‌లు పరుగుల బాధ్యతను పంచుకోవాలి. చక్కని బ్యాటింగ్‌కు జతగా స్పిన్ మ్యాజిక్ పనిచేస్తే కోల్‌కతాకు ఫైనల్లో తిరుగుండదు. దుబాయ్‌లో మూడో స్పిన్నర్ అవసరం పెద్దగా ఉండకపోవడంతో పాటు రసెల్ ఫిట్‌గా ఉంటే షకీబ్ స్థానంలో అతనికి చోటు దక్కవచ్చు. తుది జట్లు (అంచనా) చెన్నై సూపర్‌కింగ్స్: ధోని (కెపె్టన్), రుతురాజ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, ఉతప్ప, రాయుడు, జడేజా, బ్రావో, శార్దుల్, దీపక్ చహర్, హాజల్‌వుడ్. కోల్‌కతా నైట్‌రైడర్స్: మోర్గాన్ (కెపె్టన్), గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, షకీబ్ / రసెల్, నరైన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ఫెర్గూసన్. -
IPL 2021: ఫైనల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్ షాక్!
DInesh Karthik Breach IPL Code Of Conduct.. ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. అయితే ఫైనల్లో అడుగుపెట్టిన కోల్‌కతాకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌కు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 ఓవర్ వేసిన రబడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యిన కార్తీక్.. అసహనానికి లోనై స్టంప్స్‌ను కొట్టి పెవిలియన్‌కు వెళ్లాడు. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం కార్తీక్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. అతడు నేరాన్ని అంగీకరించాడు. తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపై ఆదారపడి ఉందని' ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే మ్యాచ్ రిఫరీ విధించే శిక్షకు కార్తీక్ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ ఒక్క మ్యాచ్ నిషేదం కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కార్తీక్ తప్పును రిఫరీ సీరియస్‌గా తీసుకుంటే, ఫైనల్ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. చదవండి: Rahul Tripathi: ' సిక్స్ కొడతానని ఊహించలేదు' -
అంపైర్‌ను ఫ్రాంక్ చేసిన రిషబ్ పంత్.. వీడియో వైరల్
Rishab Pant Prank On Umpire Anil Chaudary.. ఐపీఎల్ 2021లో కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్ అనిల్ చౌదరీని ఫ్రాంక్ చేయడం వైరల్‌గా మారింది. కేకేఆర్ బ్యాటింగ్ సమయంలో అశ్విన్ బంతిని పరిశీలిస్తుండగా.. అనిల్ చౌదరీ బాల్ బాక్స్‌ను పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పంత్ అనిల్ చౌదరీ వెనక్కి వెళ్లి.. అతనికి తెలియకుండా కుడి మోచేతిని టికిల్ చేశాడు. వెంటనే అనిల్ తిరిగి చూడగా అక్కడ ఎవరు కనిపించలేదు. దీంతో పంత్ నేనే అంటూ అంపైర్‌కు చెప్పడంతో మైదానంలో నవ్వులు విరపూశాయి. ఈ వీడియోపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. చదవండి: Rahul Tripathi: ' సిక్స్ కొడతానని ఊహించలేదు' ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. అనంతరం కోల్‌కతా 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 74 బంతుల్లో 96 పరుగులు జోడించారు. చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం 24 year old kiddopic.twitter.com/LFvvWBx3UA — Ryan (@RyanIke4) October 13, 2021 -
'సిక్స్ కొడతానని ఊహించలేదు'
Rahul Tripathi after the match-winning six: ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. అయితే చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరగిన ఈ మ్యాచ్‌లో అఖరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన నేపథ్యంలో సిక్స్ కొట్టి రాహుల్ త్రిపాఠి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన త్రిపాఠి.. ఆ సమయంలో తనపై తనకు జట్టును గెలిపించగలనన్న నమ్మకం ఉందని తెలిపాడు. "జట్టు విజయం చాలా ముఖ్యం. ఒకటి లేదా రెండు కఠినమైన ఓవర్లు మా ఇన్నింగ్స్‌లో ఉన్నాయి. కానీ చివరికి టార్గెట్ అంత కష్టంగా మారుతుందని నేను అనుకోలేదు. అఖరికి మేము మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. 18 వ ఓవర్ రబాడా చాలా కఠినంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లో ఒకరని టార్గెట్ చేయాలని అనుకున్నాను. అదే పని నేను చేశాను. మేము ప్లాన్ చేసుకున్నాము. చివరి రెండు బంతులల్లో సాధ్యమైనంత వరకు పరగులు చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ రెండు బంతులే మిగిలి ఉండడంతో గెలుపు సాధ్యం కాదని అనుకున్నా.. ఆ సమయంలో ఒక పెద్ద హిట్ కావాలని భావించా.. అయితే సిక్స్‌తో ముగిస్తానని మాత్రం ఊహించలేదు' అని త్రిపాఠి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ ముందు ఉంచింది. అయితే 136 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్ 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత కేవలం 7పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అఖరి ఓవర్లో 7 పరుగుల కాల్సిన నేపథ్యంలో మెదటి 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు ఆశ్విన్ పడగొట్టాడు. ఇక ఢిల్లీ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో.. క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠి ఐదో బంతికి సిక్స్ కొట్టి కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చాడు. చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం -
ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం
Rishab Pant Emotional.. కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలై వరుసగా రెండో ఏడాది నిరాశనే మిగిల్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో త్రిపాఠి స్టన్నింగ్ సిక్స్‌తో కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చాడు. మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ భావోద్వేగంగా స్పందించాడు. PC: IPL Twitter ''ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా. బాధతో నాకు మాటలు రావడం లేదు. కానీ మ్యాచ్ మా చేతుల్లో ఉండదు. మేము వీలైనంతసేపు ఆటలో గెలుపుకే ప్రయత్నించాం. ఆఖర్లో బౌలర్లు ఆటను మార్చినప్పటికి.. మ్యాచ్ గెలవలేకపోయాం. ఇక ముందు బ్యాటింగ్‌లో మాకు మంచి ఆరంభం వచ్చినప్పటికీ మిడిల్ ఓవర్లో కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ సమయంలో సరైన స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాం. కానీ సీజన్లో మా ప్రదర్శన బాగానే అనిపించింది. కచ్చితంగా వచ్చే సీజన్లో మరింత బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం'' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు. చదవండి: Venkatesh Iyer: ఫైనల్ చేరడం సంతోషం.. కప్ కొట్టడమే మిగిలింది