MI Vs RR: రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం | IPL 2021 2nd Phase MI Vs RR Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

MI Vs RR: రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం

Published Tue, Oct 5 2021 6:32 PM | Last Updated on Wed, Oct 6 2021 6:25 PM

IPL 2021 2nd Phase MI Vs RR Match Live Updates And Highlights - Sakshi

Photo Courtesy: IPL

రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌పై  ముంబై ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్‌ కిషన్‌ అర్ధ సెంచరీతో చేలరేగడంతో ముంబై సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన రాజస్తాన్‌ ముంబై బౌలర్ల ధాటికి నీర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ దూకుడగా ఆడారు.

22 పరుగులు చేసిన రోహిత్‌,  చేతన్ సకారియా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. చివరకీ ఇషాన్‌ కిషన్‌  సిక్సర్‌ల మోత మోగించడంతో ముంబై కేవలం 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. దీంతో ముంబై ప్లే ఆప్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా ఈ ఓటమితో రాజస్తాన్‌ ప్లేఆప్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

రెండో వికెట్‌ కోల్పోయిన ముంబై .. సూర్యకుమార్ యాదవ్ (13) ఔట్‌
91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 56 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ముస్తఫిజుర్ రెహమాన్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (13) లామార్రోర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై .. రోహిత్ శర్మ (22) ఔట్‌
91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై దూకడుగా ఆడుతున్న రోహిత్‌ శర్మ(22) వికెట్‌ కోల్పోయింది. 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై వికెట్‌ నష్టానికి 34 పరుగులు చేసింది. ప్రస్తుతం ‍క్రీజులో ఇషాన్‌ కిషన్‌(8) సూర్యకుమార్ యాదవ్(5) పరుగులతో ఉన్నారు.

చేతులెత్తేసిన రాజస్తాన్‌ బ్యాట్స్‌మెన్స్‌.. ముంబై టార్గెట్‌ 91
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌  ముంబై బౌలర్ల ధాటికి  విలవిలాడింది. నీర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది.  నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్తాన్‌ పతనాన్ని శాసించాడు. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. రాజస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌లో ఎవిన్‌ లూయిస్‌ 24 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.


Photo Courtesy: IPL

పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్‌.. 
ముంబై బౌలర్ల ధాటికి రాజస్తాన్ విలవిలడుతుంది. కేవలం 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నీషమ్‌ బౌలింగ్‌లో శివమ్‌ దూబే(3) క్లీన్‌ బౌల్డ్‌ కాగా, నాథన్ కౌల్టర్-నైల్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్(4)కూడా బౌల్డ్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ ఐదు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(4), రాహుల్ తెవాటియా(2)పరుగులతో క్రీజులో ఉన్నారు


Photo Courtesy: IPL
సామ్సన్‌(3) ఔట్‌.. రాజస్తాన్‌ 41/3
6వ ఓవర్‌ తొలి బంతికి నీషమ్‌ బౌలింగ్‌లో జయంత్‌ యాదవ్‌ క్యాచ్‌ పట్టడంతో సంజూ సామ్సన్‌(6 బంతుల్లో 3) ఔటయ్యాడు. దీంతో రాజస్తాన్‌ జట్టు 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో శివమ్‌ దూబే, గ్లెన్‌ ఫిలిప్‌ ఉన్నారు. 

రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌.. లూయిస్‌(24) ఔట్‌
ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో రాజస్తాన్‌ జట్టు రెండో వికెట్‌ను కోల్పోయింది. డాషింగ్‌ బ్యాటర్‌ ఎవిన్‌ లూయిస్‌(19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌)ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేశాడు. 5.3 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్‌ స్కోర్‌ 41/2. క్రీజ్‌లో సంజూ సామ్సన్‌(3), శివమ్‌ దూబే ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌.. జైశ్వాల్‌(12) ఔట్‌
ఓపెనర్‌  జైశ్వాల్‌‌(12) రూపంలో  రాజస్తాన్  తొలి వికెట్‌ను కోల్పోయింది. నాథన్ కౌల్టర్-నైల్ బౌలింగ్‌లో జైశ్వాల్.. వికెట్‌ కీపర్‌ ఇషాన్ కిషన్‌కు క్యాచ్‌ వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 4 ఓవర్లో వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది.  లూయిస్ 18, సంజు శాంసన్ (1) పరుగులతో ఆడుతున్నారు.



షార్జా: ఐపీఎల్ 2021 సెకెండ్‌ ఫేజ్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్‌  ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్ రాయల్స్‌ మధ్య నేడు  కీలక పోరు జరగనుంది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈరోజు షార్జాలో జరిగే పోరులో రాజస్తాన్  లేదా ముంబై ఓడిపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోవాల్సిందే.

ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రెండు జట్లు 24 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. ముంబై 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్థాన్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా ప్రస్తుత సీజన్‌ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాదించింది.
తుది జట్లు:
రాజస్తాన్ రాయల్స్‌: సంజు శాంసన్ (కెప్టెన్‌),ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్
ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

చదవండి: T20 World Cup 2021: టీమిండియా క్యాప్‌ పెట్టుకున్నారు.. ఇంకెందుకు ఆడుతారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement