వేలం ముగిసింది.. ఇంకా ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలు | IPL 2025 Mega Auction: Full Teams Remaining Purse Slots To Be Sold Check Details | Sakshi
Sakshi News home page

వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఇంకా ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు

Published Tue, Nov 26 2024 11:25 AM | Last Updated on Tue, Nov 26 2024 11:41 AM

IPL 2025 Mega Auction: Full Teams Remaining Purse Slots To Be Sold Check Details

ఐపీఎల్‌ ఆక్షనీర్‌ మల్లికా సాగర్‌(Photo Credit: BCCI)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం కార్యక్రమం పూర్తయింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలంపాటలో.. తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం పది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఎట్టకేలకు తమకు కావాల్సిన వారిని దక్కించుకున్నాయి. ఇక వేలం ప్రక్రియ ముగిసింది కాబట్టి... ఇక వచ్చే ఏడాది మార్చిలో జరిగే టోర్నీకి ఎలా సమాయత్తం కావాలో ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచించుకుంటాయి.

కాగా ఐపీఎల్‌లో ఇంతవరకూ టైటిల్‌ నెగ్గలేకపోయిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. మరి వచ్చే సీజన్‌లోనైనా ఈ జట్లలో ఒకటి ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.

ఇక ఆదివారం నాటి తొలిరోజు వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ భారీ ధర పలికారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ ఆప్షన్‌ అయిన పంత్‌ కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించింది. మరోవైపు.. పంజాబ్‌ కింగ్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తాము రిలీజ్‌ చేసిన వెంకటేశ్‌ అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసి మరోసారి జట్టులో చేర్చుకుంది.

ఇదిలా ఉంటే..  సోమవారం నాటి రెండో రోజు వేలంలోని విశేషాలను గమనిస్తే.. భువనేశ్వర్‌ కుమార్‌ కోసం ముంబై ఇండియన్స్‌, లక్నో మధ్య తీవ్ర పోటీ సాగింది. ఈ రెండు కలిసి అతడి విలువను రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ స్థితిలో అనూహ్యంగా ముందుకు వచ్చిన బెంగళూరు రూ.10 కోట్ల 75 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది.  

మరోవైపు.. తమ పాత ఆటగాడు దీపక్‌ చహర్‌ను తీసుకునేందుకు చెన్నై సూపర్‌కింగ్స్‌ చివరి వరకు ప్రయత్నించింది. ముంబై, పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీలతో పోటీ పడి రూ. 8 కోట్ల వరకు బరిలో నిలిచింది. అయితే వెనక్కి తగ్గని ముంబై రూ.9 కోట్ల 75 లక్షలకు అతడిని దక్కించుకుంది.

వీరికి మంచి ధర
👉సోమవారం వేలంలో అందరికంటే ముందుగా న్యూజిలాండ్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌ పేరు రాగా అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు.  
👉గత ఏడాది వరకు బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను ఈసారి అతని కనీస విలువ రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎంచుకుంది.   
👉భారత పేస్‌ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ (రూ.8 కోట్లు; లక్నో), ముకేశ్‌ కుమార్‌ (రూ. 8 కోట్లు; ఢిల్లీ), తుషార్‌ దేశ్‌పాండే (రూ. 6 కోట్ల 50 లక్షలు; రాజస్తాన్‌ రాయల్స్‌) మంచి ధర పలికారు.  

👉అఫ్గానిస్తాన్‌ మిస్టరీ ఆఫ్‌స్పిన్నర్‌ అల్లా గజన్‌ఫర్(రూ. 4.80 కోట్లు)‌ కోసం కోల్‌కతా, బెంగళూరులతో పోటీ పడి ముంబై సొంతం చేసుకుంది. భారత స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని పోలిన బౌలింగ్‌ శైలిగల గజన్‌ఫర్‌ గత ఏడాది కోల్‌కతా టీమ్‌లో ఉన్నా మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు.  
👉ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిలో పడిన ప్రియాన్ష్‌ ఆర్య కోసం నాలుగు జట్లు బరిలో నిలవగా, చివరగా పంజాబ్‌ దక్కించుకుంది.  
👉పదేళ్ల క్రితం చివరి టీ20 మ్యాచ్‌ ఆడి టెస్టుల రిటైర్మెంట్‌ తర్వాత ఇప్పుడు ఐపీఎల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ను ఎవరూ పట్టించుకోలేదు.
👉రిటెయిన్‌ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్, పంజాబ్‌ కింగ్స్‌ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్‌ జెయింట్స్‌ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌ (23), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (22), డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (21), రాజస్తాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి.  

చెన్నై సూపర్‌ కింగ్స్‌
రుతురాజ్‌ (రూ. 18 కోట్లు) 
జడేజా (రూ. 18 కోట్లు) 
పతిరణ (రూ. 13 కోట్లు) 
శివమ్‌ దూబే (రూ. 12 కోట్లు) 
ధోని (రూ. 4 కోట్లు) 
నూర్‌ అహ్మద్‌ (రూ.10 కోట్లు) 
ఆర్‌. అశి్వన్‌ (రూ. 9.75 కోట్లు) 
కాన్వే (రూ. 6.25 కోట్లు) 
ఖలీల్‌ అహ్మద్‌ (రూ. 4.80 కోట్లు) 
రచిన్‌ రవీంద్ర (రూ. 4 కోట్లు) 
రాహుల్‌ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) 
అన్షుల్‌ కంబోజ్‌ (రూ.3.40 కోట్లు) 
స్యామ్‌ కరన్‌ (రూ. 2.40 కోట్లు) 
గుర్జప్‌నీత్‌ సింగ్‌ (రూ. 2.20 కోట్లు) 
నాథన్‌ ఎలిస్‌ (రూ. 2 కోట్లు) 
దీపక్‌ హుడా (రూ.1.70 కోట్లు) 
జేమీ ఓవర్టన్‌ (రూ.1.50 కోట్లు) 
విజయ్‌ శంకర్‌ (రూ. 1.20 కోట్లు) 
వంశ్‌ బేడీ (రూ. 55 లక్షలు) 
ముకేశ్‌ చౌదరీ (రూ. 30 లక్షలు) 
షేక్‌ రషీద్‌ (రూ. 30 లక్షలు) 
అండ్రి సిద్ధార్థ్‌ (రూ. 30 లక్షలు) 
కమలేశ్‌ నాగర్‌కోటి (రూ. 30 లక్షలు) 
రామకృష్ణ ఘోష్‌ (రూ. 30 లక్షలు) 
శ్రేయస్‌ గోపాల్‌ (రూ.30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ. 65 కోట్లు; వేలానికి రూ. 54.95 కోట్లు; మిగిలింది: 5 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్‌
అక్షర్‌ పటేల్‌ (రూ. 16.50 కోట్లు) 
కుల్దీప్‌ యాదవ్‌ (రూ. 13.25 కోట్లు) 
స్టబ్స్‌ (రూ. 10 కోట్లు) 
అభిషేక్‌ పోరెల్‌ (రూ. 4 కోట్లు) 
కేఎల్‌ రాహుల్‌ (రూ. 14 కోట్లు)  
స్టార్క్‌ (రూ. 11.75 కోట్లు) 
నటరాజన్‌ (రూ. 10.75 కోట్లు) 
జేక్‌ ఫ్రేజర్‌ (రూ 9 కోట్లు)  
ముకేశ్‌ కుమార్‌ (రూ. 8 కోట్లు) 
హ్యారీ బ్రూక్‌ (రూ. 6.25 కోట్లు) 
అశుతోష్‌ శర్మ (రూ. 3.80 కోట్లు) 
మోహిత్‌ శర్మ (రూ.2.20 కోట్లు) 
డుప్లెసిస్‌ (రూ. 2 కోట్లు) 
సమీర్‌ రిజ్వీ (రూ. 95 లక్షలు) 
దుష్మంత చమిర (రూ. 75 లక్షలు) 
డోనొవన్‌ ఫెరీరా (రూ. 75 లక్షలు) 
విప్రాజ్‌ నిగమ్‌ (రూ.50 లక్షలు) 
కరుణ్‌ నాయర్‌ (రూ. 50 లక్షలు) 
మాధవ్‌ తివారి (రూ. 40 లక్షలు) 
అజయ్‌ జాదవ్‌ (రూ.30 లక్షలు) 
దర్శన్‌ నల్కండే (రూ. 30 లక్షలు) 
త్రిపురాణ విజయ్‌ (రూ. 30 లక్షలు) 
మన్వంత్‌ కుమార్‌ (రూ. 30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ. 47 కోట్లు; వేలానికి రూ 72.80 కోట్లు; మిగిలింది: రూ. 20 లక్షలు    

గుజరాత్‌ టైటాన్స్‌
రషీద్‌ ఖాన్‌ (రూ. 18 కోట్లు) 
శుబ్‌మన్‌ గిల్‌ (రూ. 16.50 కోట్లు) 
సాయి సుదర్శన్‌ (రూ. 8.5 కోట్లు) 
రాహుల్‌ తెవాటియా (రూ. 4 కోట్లు) 
షారుక్‌ ఖాన్‌ (రూ. 4 కోట్లు) 
బట్లర్‌ (రూ.15.75 కోట్లు) 
సిరాజ్‌ (రూ.12.25 కోట్లు) 
రబాడ (రూ.10.75 కోట్లు) 
ప్రసిధ్‌ కృష్ణ (రూ.9.50 కోట్లు) 
సుందర్‌ (రూ. 3.20 కోట్లు) 
రూథర్‌ఫర్డ్‌ (రూ. 2.60 కోట్లు) 
కొయెట్జీ (రూ. 2.40 కోట్లు) 
ఫిలిప్స్‌ (రూ. 2 కోట్లు) 
సాయి కిషోర్‌ (రూ. 2 కోట్లు) 
మహిపాల్‌ లోమ్రోర్‌ (రూ.1.70 కోట్లు) 
గుర్నూర్‌ సింగ్‌ (రూ. 1.30 కోట్లు) 
అర్షద్‌ ఖాన్‌ (రూ.1.30 కోట్లు),  
జయంత్‌ (రూ. 75 లక్షలు) 
ఇషాంత్‌ (రూ. 75 లక్షలు) 
కరీమ్‌ జనత్‌ (రూ. 75 లక్షలు) 
కుమార్‌ కుశాగ్ర (రూ.65 లక్షలు) 
మానవ్‌ సుతార్‌ (రూ. 30 లక్షలు) 
అనూజ్‌ రావత్‌ (రూ.30 లక్షలు) 
నిశాంత్‌ సింధు (రూ. 30 లక్షలు) 
కుల్వంత్‌ (రూ. 30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ. 51 కోట్లు; వేలానికి రూ. 68.85 కోట్లు; మిగిలింది: 15 లక్షలు  

పంజాబ్‌ కింగ్స్‌
శశాంక్‌ సింగ్‌ (రూ.5.5 కోట్లు) 
ప్రభ్‌సిమ్రన్‌ సంగ్‌ (రూ.4 కోట్లు) 
శ్రేయస్‌ అయ్యర్‌ (రూ.26.75 కోట్లు) 
అర్ష్‌దీప్‌ సింగ్‌ (రూ.18 కోట్లు) 
యుజువేంద్ర చహల్‌ (రూ.18 కోట్లు) 
స్టొయినిస్‌ (రూ.11 కోట్లు) 
మార్కొ జాన్సెన్‌ (రూ. 7 కోట్లు) 
నేహల్‌ వధేరా (రూ.4.20 కోట్లు) 
మ్యాక్స్‌వెల్‌ (రూ.4.20 కోట్లు) 
ప్రియాన్‌‡్ష ఆర్య (రూ. 3.80 కోట్లు) 
జోష్‌ ఇంగ్లిస్‌ (రూ. 2.60 కోట్లు) 
అజ్మతుల్లా (రూ. 2.40 కోట్లు) 
ఫెర్గూసన్‌ (రూ. 2 కోట్లు) 
వైశాక్‌ విజయ్‌కుమార్‌ (రూ.1.80 కోట్లు) 
యశ్‌ ఠాకూర్‌ (రూ.1.60 కోట్లు) 
హర్‌ప్రీత్‌ బ్రార్‌ (రూ.1.50 కోట్లు) 
ఆరోన్‌ హార్డి (రూ. 1.25 కోట్లు) 
విష్ణు వినోద్‌ (రూ.95 లక్షలు) 
జేవియర్‌ బార్ట్‌లెట్‌ (రూ. 80 లక్షలు) 
కుల్దీప్‌ సేన్‌ (రూ. 80 లక్షలు) 
అవినాశ్‌ (రూ. 30 లక్షలు) 
సూర్యాంశ్‌ షెడ్గే (రూ. 30 లక్షలు) 
ముషీర్‌ఖాన్‌ (రూ.30 లక్షలు) 
హర్నూర్‌ (రూ.30 లక్షలు) 
ప్రవీణ్‌ దూబే (రూ. 30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ.9.50 కోట్లు; వేలానికి రూ. 110.15 కోట్లు; మిగిలింది: రూ. 35 లక్షలు  

రాజస్తాన్‌ రాయల్స్‌
యశస్వి జైస్వాల్‌ (రూ. 18 కోట్లు) 
సంజూ సామ్సన్‌ (రూ. 18 కోట్లు) 
ధ్రువ్‌ జురేల్‌ (రూ. 14 కోట్లు) 
రియాన్‌ పరాగ్‌ (రూ. 14 కోట్లు) 
హెట్‌మైర్‌ (రూ. 11 కోట్లు) 
సందీప్‌శర్మ (రూ. 4 కోట్లు) 
జోఫ్రా ఆర్చర్‌ (రూ.12.50 కోట్లు) 
తుషార్‌ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు) 
హసరంగ (రూ.5.25 కోట్లు) 
మహీశ్‌ తీక్షణ (రూ.4.40 కోట్లు) 
నితీశ్‌ రాణా (రూ. 4.20 కోట్లు) 
ఫజల్‌హక్‌ (రూ. 2 కోట్లు) 
క్వెన మఫాక (రూ. 1.50 కోట్లు) 
ఆకాశ్‌ మధ్వాల్‌ (రూ.1.20 కోట్లు) 
వైభవ్‌ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు) 
శుభమ్‌ దూబే (రూ. 80 లక్షలు) 
యు«ద్‌వీర్‌ చరక్‌ (రూ. 35 లక్షలు) 
కుమార్‌ కార్తికేయ (రూ.30 లక్షలు) 
అశోక్‌ శర్మ (రూ. 30 లక్షలు) 
కునాల్‌సింగ్‌ (రూ. 30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ. 79 కోట్లు; వేలానికి రూ. 40.70 కోట్లు; మిగిలింది: రూ. 30 లక్షలు  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
క్లాసెన్‌ (రూ. 23 కోట్లు) 
కమిన్స్‌ (రూ. 18 కోట్లు) 
హెడ్‌ (రూ. 14 కోట్లు) 
అభిõÙక్‌ శర్మ (రూ. 14 కోట్లు) 
నితీశ్‌ రెడ్డి (రూ. 6 కోట్లు) 
ఇషాన్‌ కిషన్‌ (రూ.11.25 కోట్లు) 
షమీ (రూ.10 కోట్లు) 
హర్షల్‌ పటేల్‌ (రూ.8 కోట్లు) 
రాహుల్‌ చహర్‌ (రూ.3.20 కోట్లు) 
అభినవ్‌ మనోహర్‌ (రూ.3.20 కోట్లు) 
రాహుల్‌ చహర్‌ (రూ. 3.20 కోట్లు) 
ఆడమ్‌ జంపా (రూ.2.40 కోట్లు) 
సిమర్‌జీత్‌ సింగ్‌ (రూ. 1.50 కోట్లు) 
ఇషాన్‌ మలింగ (రూ. 1.20 కోట్లు) 
బ్రైడన్‌ కార్స్‌ (రూ. 1 కోటి) 
ఉనాద్కట్‌ (రూ. 1 కోటి) 
కమిండు మెండిస్‌ (రూ. 75 లక్షలు) 
జీషాన్‌ అన్సారి (రూ. 40 లక్షలు) 
అనికేత్‌ వర్మ (రూ. 30 లక్షలు) 
అథర్వ తైడే (రూ.30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ.44.80 కోట్లు; మిగిలింది: రూ.20 లక్షలు  

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
కోహ్లి (రూ. 21 కోట్లు) 
రాజత్‌ పటిదార్‌ (రూ.11 కోట్లు) 
యశ్‌ దయాళ్‌ (రూ. 5 కోట్లు) 
హాజల్‌వుడ్‌ (రూ.12.50 కోట్లు) 
ఫిల్‌ సాల్ట్‌ (రూ.11.50 కోట్లు) 
జితేశ్‌ శర్మ (రూ.11 కోట్లు) 
భువనేశ్వర్‌ (రూ.10.75 కోట్లు) 
లివింగ్‌స్టోన్‌ (రూ.8.75 కోట్లు) 
రసిక్‌ ధార్‌ (రూ.6 కోట్లు) 
కృనాల్‌ పాండ్యా (రూ. 5.75 కోట్లు) 
టిమ్‌ డేవిజ్‌ (రూ. 3 కోట్లు) 
జాకబ్‌ బెథెల్‌ (రూ. 2.60 కోట్లు) 
సుయాశ్‌ శర్మ (రూ.2.60 కోట్లు) 
పడిక్కల్‌ (రూ. 2 కోట్లు) 
తుషార (రూ. 1.60 కోట్లు) 
రొమరియో (రూ. 1.50 కోట్లు 
ఇన్‌గిడి (రూ. 1 కోటి) 
స్వప్నిల్‌ సింగ్‌ (రూ.50 లక్షలు) 
మనోజ్‌ (రూ. 30 లక్షలు) 
మోహిత్‌ రాఠి (రూ. 30 లక్షలు) 
అభినందన్‌ (రూ. 30 లక్షలు) 
స్వస్తిక్‌ చికార (రూ. 30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ. 37 కోట్లు; వేలానికి రూ. 82.25 కోట్లు; మిగిలింది: రూ. 75 లక్షలు  

ముంబై ఇండియన్స్‌
బుమ్రా (రూ. 18 కోట్లు) 
హార్దిక్‌ పాండ్యా (రూ.16.35 కోట్లు) 
సూర్యకుమార్‌ (రూ. 16.35 కోట్లు) 
రోహిత్‌ శర్మ (రూ. 16.30 కోట్లు) 
తిలక్‌ వర్మ (రూ. 8 కోట్లు) 
ట్రెంట్‌ బౌల్ట్‌ (రూ.12.50 కోట్లు) 
దీపక్‌ చహర్‌ (రూ. 9.25 కోట్లు) 
నమన్‌ ధీర్‌ (రూ.5.25 కోట్లు) 
విల్‌ జాక్స్‌ (రూ.5.25 కోట్లు) 
ఘజన్‌ఫర్‌ (రూ. 4.80 కోట్లు) 
సాంట్నర్‌ (రూ. 2 కోట్లు) 
రికెల్టన్‌ (రూ. 1 కోటి) 
రీస్‌ టోప్లే (రూ. 75 లక్షలు) 
లిజాద్‌ విలియమ్స్‌ (రూ. 75 లక్షలు) 
రాబిన్‌ మిన్జ్‌ (రూ.65 లక్షలు)  
కరణ్‌ శర్మ (రూ.50 లక్షలు) 
అర్జున్‌ టెండూల్కర్‌ (రూ.30 లక్షలు) 
విఘ్నేశ్‌ (రూ.30 లక్షలు) 
సత్యనారాయణ (రూ. 30 లక్షలు) 
రాజ్‌ అంగద్‌ (రూ. 30 లక్షలు) 
శ్రీజిత్‌ కృష్ణన్‌ (రూ. 30 లక్షలు) 
అశ్వని కుమార్‌ (రూ. 30 లక్షలు) 
బెవాన్‌ జాకబ్స్‌ (రూ. 30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ. 44.80 లక్షలు; మిగిలింది: రూ. 20 లక్షలు

లక్నో సూపర్‌ జెయింట్స్‌
నికోలస్‌ పూరన్‌ (రూ.21 కోట్లు) 
రవి బిష్ణోయ్‌ (రూ.21 కోట్లు) 
మయాంక్‌ యాదవ్‌ (రూ. 11 కోట్లు) 
మోసిన్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు) 
ఆయుశ్‌ బదోని (రూ.4 కోట్లు) 
రిషభ్‌ పంత్‌ (రూ.27 కోట్లు) 
అవేశ్‌ ఖాన్‌ (రూ.9.75 కోట్లు) 
ఆకాశ్‌దీప్‌ (రూ.8 కోట్లు) 
మిల్లర్‌ (రూ.7.50 కోట్లు) 
అబ్దుల్‌ సమద్‌ (రూ.4.20 కోట్లు) 
మిచెల్‌ మార్‌‡్ష (రూ.3.40 కోట్లు) 
షహబాజ్‌ అహ్మద్‌ (రూ. 2.40 కోట్లు) 
మార్క్‌రమ్‌ (రూ.2 కోట్లు) 
బ్రీట్‌జ్కే (రూ. 75 లక్షలు) 
షమర్‌ జోసెఫ్‌ (రూ. 75 లక్షలు) 
సిద్ధార్థ్‌ (రూ. 75 లక్షలు) 
యువరాజ్‌ (రూ. 30 లక్షలు) 
ప్రిన్స్‌ యాదవ (రూ. 30 లక్షలు) 
ఆకాశ్‌ సింగ్‌ (రూ. 30 లక్షలు) 
దిగ్వేశ్‌ సింగ్‌ (రూ. 30 లక్షలు) 
హిమ్మత్‌ సింగ్‌ (రూ.30 లక్షలు) 
ఆర్యన్‌ జుయల్‌ (రూ.30 లక్షలు) 
అర్శిన్‌ కులకర్ణి (రూ. 30 లక్షలు) 
హంగార్‌గేకర్‌ (రూ. 30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ.51 కోట్లు; వేలానికి రూ. 68.90 కోట్లు; మిగిలింది: రూ. 10 లక్షలు  

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
రింకూ సింగ్‌ (రూ. 13 కోట్లు) 
నరైన్‌ (రూ. 12 కోట్లు) 
రసెల్‌ (రూ. 12 కోట్లు) 
వరుణ్‌ చక్రవర్తి (రూ. 12 కోట్లు) 
హర్షిత్‌ రాణా (రూ. 4 కోట్లు) 
రమణ్‌దీప్‌ (రూ.4 కోట్లు) 
వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ.23.75 కోట్లు) 
ఆన్రిచ్‌ నోర్జే (రూ.6.50 కోట్లు) 
డికాక్‌ (రూ.3.60 కోట్లు) 
అంగ్‌కృష్‌ (రూ.3 కోట్లు) 
జాన్సన్‌ (రూ. 2.80 కోట్లు) 
గుర్బాజ్‌ (రూ.2 కోట్లు) 
మొయిన్‌ అలీ (రూ. 2 కోట్లు) 
వైభవ్‌ అరోరా (రూ.1.80 కోట్లు) 
రోవ్‌మన్‌ పావెల్‌ (రూ.1.50 కోట్లు) 
రహానే (రూ. 1.50 కోట్లు) 
మనీశ్‌ పాండే (రూ. 75 లక్షలు) 
ఉమ్రన్‌ మలిక్‌ (రూ. 75 లక్షలు) 
అనుకూల్‌ రాయ్‌ (రూ. 40 లక్షలు) 
మయాంక్‌ మర్కండే (రూ. 30 లక్షలు) 
లవ్‌నిత్‌ సిసోడియా (రూ. 30 లక్షలు) 
ఖర్చు: రిటెయినర్లకు రూ.69 కోట్లు; వేలానికి రూ. 50.95 కోట్లు; మిగిలింది: రూ.5 లక్షలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement