ఐపీఎల్‌లో ఇవాళ (Apr 27) రెండు మ్యాచ్‌లు.. రెండూ రసవత్తర సమరాలే..! | IPL 2024 April 27, 2024: Today Double Header Matches To Happen, MI VS DC And Lucknow Vs RR | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు.. రెండూ రసవత్తర సమరాలే..!

Published Sat, Apr 27 2024 12:28 PM | Last Updated on Sat, Apr 27 2024 12:28 PM

IPL 2024 April 27, 2024: Today Double Header Matches To Happen, MI VS DC And Lucknow Vs RR

ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 27) రెండు రసవత్తర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ-ముంబై.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో లక్నో-రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. 

మధ్యాహ్నం మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ ఢిల్లీ హోం గ్రౌండ్‌ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఢిల్లీ ఆరో స్థానంలో.. ముంబై తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ముంబై ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్‌ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది.

ఢిల్లీ విషయానికొస్తే.. లీగ్‌ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు ఇటీవల వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ప్రధాన పోటీదారుగా మారుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి 8 పాయింట్లు కలిగి ఉంది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 34 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 19, ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. 

తుది జట్లు (అంచనా)..
ఢిల్లీ: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్‌/విరుట్‌కీపర్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జై రిచర్డ్‌సన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్. [ఇంపాక్ట్ సబ్: రసిఖ్ సలామ్]

ముంబై: ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా. [ఇంపాక్ట్ సబ్: నువాన్ తుషార]

రాత్రి మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ లక్నో హోం గ్రౌండ్‌ అయిన భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్‌ స్టేడియంలో జరుగనుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్‌ అగ్రస్థానంలో.. లక్నో నాలుగో స్థానంలో ఉన్నాయి. 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచిన రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను అనధికారికంగా దక్కించుకోగా.. 8 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచిన లక్నో ప్లే ఆఫ్స్‌ బెర్తు కోసం పోటీపడుతుంది.

ప్లే ఆఫ్స్‌ రేసులో మిగతా జట్ల కంటే ముందుండాలంటే లక్నో ఈ మ్యాచ్‌ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు రాజస్థాన్‌ను ఈ మ్యాచ్‌ ఫలితం పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. గెలిస్తే మాత్రం రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధిస్తుంది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. రాజస్థాన్‌ 3, లక్నో ఓ మ్యాచ్‌లో గెలుపొందాయి.

తుది జట్లు (అంచనా)..

రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ [ఇంపాక్ట్‌ సబ్‌: జోస్ బట్లర్]

లక్నో: క్వింటన్ డి కాక్, కేఎల్‌ రాహుల్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మాట్ హెన్రీ, యష్ ఠాకూర్ [ఇంపాక్ట్‌ సబ్‌: మయాంక్ యాదవ్]

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement