సిక్సర్ల మోత.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి | IPL 2024 After DC Vs LSG Most Sixes In An IPL Season Major Record | Sakshi
Sakshi News home page

సిక్సర్ల మోత.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి

Published Wed, May 15 2024 10:41 AM | Last Updated on Wed, May 15 2024 11:36 AM

IPL 2024 After DC Vs LSG Most Sixes In An IPL Season Major Record

ఢిల్లీ- లక్నో మ్యాచ్‌ సందర్భంగా అరుదైన రికార్డు (PC: IPL)

ఐపీఎల్‌-2024 తుది అంకానికి చేరుకుంటోంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ ఫలితంతో రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా టాప్‌-4కు అర్హత సాధించింది.

సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్నోను ఓడించడంతో రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. ​ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో 64వ మ్యాచ్‌ అయిన ఢిల్లీ- లక్నో పోరు తర్వాత సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.

ఈసారి ఏకంగా
క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్‌గా 2024 నిలిచింది. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 1125 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక మంగళవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్‌ పోరెల్‌ 4, షాయీ హోప్‌ రెండు, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 4 సిక్సర్లు బాదగా.. లక్నో ఆటగాళ్లలో నికోలసన్‌ పూరన్‌ 4, అర్షద్‌ ఖాన్‌ 5, యుద్‌వీర్‌ సింగ్‌ చరక్‌ ఒక సిక్సర్‌ కొట్టారు.

కాగా ఐపీఎల్‌-2024 ఆరంభం నుంచే సిక్సర్ల మోత మోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పాటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కూడా సిక్స్‌ల వర్షం కురిపించింది. 

తద్వారా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన తొలి రెండు జట్లుగా సన్‌రైజర్స్‌, ఆర్సీబీ నిలవగా.. అనూహ్య రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో స్థానం ఆక్రమించింది.

ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు
👉1125 సిక్సర్లు - 2024
👉1124  సిక్సర్లు - 2023
👉1062  సిక్సర్లు - 2022
👉872  సిక్సర్లు- 2018
👉784  సిక్సర్లు- 2019

2024లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన జట్లు
👉సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 12 మ్యాచ్‌లలో 146 సిక్స్‌లు
👉ఆర్సీబీ- 13 మ్యాచ్‌లలో 141 సిక్స్‌లు
👉ఢిల్లీ క్యాపిటల్స్‌- 14 మ్యాచ్‌లలో 135 సిక్స్‌లు

👉కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- 12 మ్యాచ్‌లలో 125 సిక్స్‌లు
👉ముంబై ఇండియన్స్‌- 13 మ్యాచ్‌లలో 122 సిక్స్‌లు
👉పంజాబ్‌ కింగ్స్‌- 12 మ్యాచ్‌లలో 102 సిక్స్‌లు
👉రాజస్తాన్‌ రాయల్స్‌- 12 మ్యాచ్‌లలో 100 సిక్స్‌లు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement