
Yashasvi Jaiswal Happy After MS Dhoni Autographed His Bat: రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు. దానికీ ఓ కారణం ఉంది... ఎందుకంటే తన బ్యాట్‌పైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ చేయడమే. కాగా అబుదాబి వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే జైస్వాల్ అర్థ సెంచరీ సాధించి జట్టు విజయానికి బాటలు వేశాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్‌క్యాపడ్ ప్లేయర్ వేగవంతంగా హాఫ్ సెంచరీ చేయడం ఇది ఐదోసారి. కాగా జైశ్వాల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన జైశ్వాల్ ధోనీ ఆటోగ్రాఫ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
"నేను మొదట బ్యాటింగ్‌కు పిచ్ ఎలా అనుకూలిస్తుందని ఆలోచిస్తాను, కానీ మేము 190 పరుగులు చేజ్ చేయాలి, వికెట్ బ్యాటింగ్‌కు తప్పక బాగుంటుందని నాకు తెలుసు. నేను పవర్‌ప్లే ఓవర్‌లను సద్వినియోగం చేసుకోవడం, మా జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడం ద్వారా 190 పరుగులను చేధించగలిగాము, ”అని జైస్వాల్ శివమ్ దుబే, అనూజ్ రావత్ ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాడు. "మ్యాచ్ తర్వాత నా బ్యాట్‌పై ఎంఎస్ ధోని సంతకం తీసుకున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని జైశ్వాల్ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ అనంతరం జైస్వాల్‌పై రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment