bat
-
ఫిబ్రవరి 8న పాక్ ఎన్నికలు...‘బ్యాట్’ పట్టని ఇమ్రాన్!
వచ్చే నెల 8న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అవినీతి కేసులతో ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (71) సొంత రాజకీయ పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ). దీని ఎన్నికల చిహ్నం- క్రికెట్ బ్యాట్. మరో రెండు వారాల్లో జరగనున్న దేశ సాధారణ ఎన్నికల్లో క్రికెట్ బ్యాట్ ఎన్నికల గుర్తును వాడకుండా పీటీఐపై దేశ ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. తమ ఎన్నికల గుర్తు మీద ఈసీ నిషేధం విధించడంపై ఇమ్రాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పీటీఐ ఓటమికి కోసం మిలిటరీ మద్దతున్న ఆపద్ధర్మ ప్రభుత్వం పన్నిన కుట్రగా ఇమ్రాన్ మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు. ఇమ్రాన్ పార్టీ పీటీఐ నిబంధనల ప్రకారం అంతర్గత ఎన్నికలు నిర్వహించనందునే ఎన్నికల గుర్తు వినియోగంపై ఆంక్షలు విధించామని ఎన్నికల సంఘం అంటోంది. వాస్తవానికి గత సంవత్సరం జూన్ 8న ఇమ్రాన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. అయితే సజావుగా జరగలేదంటూ ఆ ఎన్నికలను గుర్తించడానికి పాక్ ఎన్నికల సంఘం నిరాకరించింది. ఈసీ చర్య అన్యాయం, అక్రమం, రాజకీయ దురుద్దేశపూరితమని, ఇదంతా ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని నిరోధించేందుకేనని ఇమ్రాన్ మద్దతుదారులు ఆక్రోశిస్తున్నారు. 13 చిన్నాచితకా రాజకీయ పార్టీల విషయంలోనూ ఈసీ ఇలాంటి ఉత్తర్వులే వెలువరించింది. ఎన్నికల చిహ్నంపై నిషేధాన్ని తొలగించుకునేందుకు పీటీఐ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. పీటీఐకి ఈ తీర్పు శరాఘాతంలా తగులుతోంది. ఎన్నికల్లో పార్టీ గుర్తులను రాజకీయ పార్టీలు కోల్పోవడం పాకిస్తాన్లో కొత్తేమీ కాకపోయినప్పటికీ, పీటీఐ తమ అభ్యర్థులందరికీ ఇతరత్రా ఓ గుర్తును ఎంచుకునే సమయం, అవకాశం సైతం లేకుండా పోయింది. అందుకు ఉద్దేశించిన నిర్ణీత గడువు ముగిసింది. చిహ్నాల్ని మార్చే ప్రక్రియ ఇంకా కొనసాగితే ఎన్నికల నిర్వహణలో మరింత జాప్యం జరుగుతుందని ఈసీ చెబుతోంది. ఈ గందరగోళాన్ని తొలగించేలా తమ పార్టీ అభ్యర్థుల పేర్లు-చిహ్నాలను ఓటర్లు అన్వేషించేందుకు వీలుగా ఇమ్రాన్ పార్టీ సామాజిక మాధ్యమాల బృందం ఓ పోర్టల్ నడుపుతోంది. పాకిస్తాన్లో సగం మంది ప్రజలకే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దీంతో ఓటర్ల వద్దకు చేరడంలో ఇమ్రాన్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏదేమైనా క్రికెట్ బ్యాట్ గుర్తును కోల్పోవడం తమ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తుందని పీటీఐ నేతలు ఆందోళన చెందుతున్నారు. క్రికెట్ మీద మహా మోజున్న పాక్ లాంటి దేశంలో ఓటర్లను ఇమ్రాన్ పార్టీ వైపు ఆకర్షించడానికి బ్యాట్ గుర్తు సమ్మోహనాస్త్రంలా ఉపయోగపడింది. ‘త్రాసు’ కోసం న్యాయపోరాటం! క్రికెట్ బ్యాట్ గుర్తుతో ఇమ్రాన్ రాజకీయ పార్టీ పీటీఐకి విడదీయరాని అనుబంధం ఉన్నప్పటికీ నిజానికి దాని తొలి ఎన్నికల గుర్తు ‘దీపం’. పీటీఐ పేరులోని ‘ఇన్సాఫ్’ అంటే ఉర్దూలో న్యాయం అనే అర్థం వస్తుంది. 2013 ఎన్నికలకు ముందు పీటీఐ న్యాయానికి ప్రతీకగా ‘సమ త్రాసు’ గుర్తును వాడుకోవాలని భావించింది. కానీ, ‘సమ త్రాసు’ 1970 సాధారణ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ పార్టీ గుర్తుగా ఉంది. ఈ గుర్తు కోసం ఇరు పార్టీల మధ్య సాగిన న్యాయపోరాటంలో చివరికి జమాతే ఇస్లామీ పార్టీదే పైచేయి అయింది. 1977 సార్వత్రిక ఎన్నికల అనంతరం జనరల్ జియా-ఉల్-హక్ నేతృత్వంలోని సైనిక సర్కారు కొన్ని ఎన్నికల చిహ్నాల్ని ఆమోదిత జాబితా నుంచి తొలగించింది. అలా తొలగించిన వాటిలో త్రాసు గుర్తు ఉంది. తర్వాత 2010 సంవత్సరంలో పాకిస్తాన్ ఎన్నికల సంఘం త్రాసు గుర్తును పునరుద్ధరించింది. పాక్ ఎన్నికల్లో గుర్తుల ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ‘’పాకిస్తాన్ జనాభాలో 40% మంది నిరక్ష్యరాస్యులు. విద్యావంతులు కాని ఓటర్లు ఓటు వేయడానికి గుర్తులపై ఆధారపడతారు, పేర్లు చదవగలిగిన పౌరుల్లోనూ చాలామంది ఎల్లప్పుడూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. కానీ వారికి పార్టీ గుర్తు మాత్రం తెలుసు” అని ‘జియో’ జర్నలిస్టు మాలిక్ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లోని నినాదాలు, గీతాలు వాటి గుర్తుల చుట్టూ అల్లుకుని వుంటాయి అని ఆమె చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు 150 గుర్తులు కేటాయించగా మరో 174 గుర్తుల్ని స్వతంత్ర అభ్యర్థులకు ఇస్తున్నారు. మూడు సార్లు దేశ ప్రధాన మంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ (74) ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ పులి గుర్తుతో, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో జర్దారీ సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) బాణం గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. మిలిటరీ మ్యాన్ నవాజ్ షరీఫ్! ప్రజాదరణ ఎంత బలంగా ఉన్నప్పటికీ రాజకీయ క్రీజులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి రావడం దుర్లభం గానే కనిపిస్తోంది. ఇంత ఎదురుగాలిలోనూ గత డిసెంబరులో నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్ ప్రకారం... నవాజ్ షరీఫ్ (52%)తో పోలిస్తే ఇమ్రాన్ ఖాన్ (57%)కే అధిక అప్రూవల్ రేటింగ్స్ దక్కడం విశేషం. పీటీఐని అణచివేసేందుకు మిలిటరీ ట్రిక్స్ ప్రయోగిస్తోంది. ఇటీవలి కాలంలో పీటీఐ కార్యకర్తలు పలువురు అరెస్టయ్యారు. కొందరు నేతలు ‘ఇంటరాగేషన్స్’ తట్టుకోలేక పార్టీకి రాజీనామాలు చేశారు. ప్రధాన సమాచార మాధ్యమాల్లో ఇమ్రాన్ పేరు ఉచ్చరించడాన్ని నిషేధించారు. ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. చివరికి... ప్రతిపాదించేవారు, బలపరిచేవారు దొరక్క (కిడ్నాప్స్/అపహరణలకు గురై)... ఇమ్రాన్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు కూడా పెద్ద సంఖ్యలో (దాదాపు 90%) తిరస్కృతికి గురయ్యాయి. నవాజ్ షరీఫ్ పాక్ మిలిటరీ నుంచి సహకారం పొందుతున్నారు. పాక్ ప్రధానమంత్రి పీఠంపై కూర్చొని పూర్తి పదవీకాలాన్ని అనుభవించిన వారెవరూ లేరు. ఆ అదృష్టం తొలిసారిగా, నాలుగో విడతలో షరీఫ్ ను వరిస్తుందేమో చూడాలి. మిలిటరీతో షరీఫ్ ఒప్పందం: బిలావల్ తూర్పు పంజాబ్ ప్రావిన్సులో పోటీ చేస్తున్న తమ పార్టీ జాతీయ, అసెంబ్లీ అభ్యర్థులకు తప్పుడు ఎన్నికల గుర్తులు కేటాయించారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో-జర్దారీ అంటున్నారు. నవాజ్ షరీఫ్ ఒత్తిడి మేరకే దేశ ఎన్నికల సంఘం ఇలా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. తెర వెనుక ఉంటూ రాజ్యాధికార శక్తుల్ని నియంత్రించే మిలిటరీతో షరీఫ్ ఒప్పందం కుదుర్చుకున్నారని బిలావల్ ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లు స్వయం ప్రకటిత ప్రవాసం గడిపి నిరుడు అక్టోబరులో స్వదేశానికి వచ్చిన నవాజ్ షరీఫ్... బిలావల్ ఆరోపణలను కొట్టిపారేశారు. అవినీతి కేసుల్లో పదవి నుంచి 2017లో ఉద్వాసనకు గురై పదేళ్ళ జైలు శిక్ష పడిన నవాజ్ షరీఫ్... వైద్యచికిత్స కోసమంటూ బెయిల్ మీద లండన్ వెళ్ళి అక్కడే (పరారై ప్రవాసం) తలదాచుకున్నారు. ఆయన అకస్మాత్తుగా నిరుడు అక్టోబరు 21న స్వదేశానికి విచ్చేశారు. ‘అవినీతి మరకల్ని, రాజాకీయాల నుంచి శాశ్వత నిషేధాన్ని’ వదిలించుకుని 4వ సారి ప్రధాని అయ్యే ఆశతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. - జమ్ముల శ్రీకాంత్ -
ఎన్నికల సంఘ బాధ్యతలను మేము తీసుకోబోం
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్– ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)కు బ్యాట్ గుర్తు కేటాయింపు వివాదంపై ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం విధుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని సీజేపీ జస్టిస్ క్వాజీ ఫయీజ్ ఇసా పేర్కొన్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించనందున పీటీఐకి ఎన్నికల గుర్తు బ్యాట్‌ను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించడం, దానిపై రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. దీనిపై పీటీఐ పెషావర్ హైకోర్టును ఆశ్రయించగా, ఊరట లభించింది. అనంతరం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పెషావర్ హైకోర్టు తప్పుపట్టింది. బ్యాట్ గుర్తును పునరుద్ధరించాలంటూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా సీజేపీ జస్టిస్ ఇసా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ, చట్టబద్ధమైన సంస్థ విధుల మధ్య చాలా స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఈసీ తన బాధ్యతలను నిర్వరిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థకు అత్యున్నత ప్రతినిధిగా మేమెలా జోక్యం చేసుకోగలం? అదెలా సరైన చర్య అవుతుంది? ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ. రాజకీయ పార్టీల వ్యవహారాలను నియంత్రించడం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం’’ అని ఆయన పేర్కొన్నారు. -
మనిషి సైజులో వేలాడుతున్న గబ్బిలం.. చూస్తే వెన్నులో వణుకు ఖాయం!
చెట్లపై తలకిందులుగా వేలాడే గబ్బిలాల గురించి మనకు తెలిసిందే. అవి ఏ సైజులో ఉంటాయో కూడా మనకు తెలుసు. అయితే మనిషంత సైజులో గబ్బిలం ఉండటాన్ని మనం ఊహించగలమా? ఊహించడానికే మనకు భయం వేస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్‌గా మారింది. ఇది చూపరులను భయకంపితులను చేస్తోంది. మనిషి సైజులో ఉన్న ఈ గబ్బిలం ఇంటి చూరుకు వేలాడుతూ భయపెడుతోంది. గబ్బిలాలను పిశాచాలతో పోలుస్తుంటారు. కొన్ని జాతులకు చెందిన గబ్బిలాలు ఇతర జంతువుల రక్తం తాగుతాయి. ఈ కారణంగా వీటిని పిశాచాలతో పోలుస్తారు. అయితే ఈ ఫొటోను చూసి ఎవరూ భయపడనక్కరలేదు. ఎందుకుంటే ఎవరో గబ్బిలం తరహా వేషధారణతో జనాలను భయపెట్టేందుకు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని కొందరు అంటున్నారు. అయితే ఇది ఎంత సహజంగా ఉందంటే నిజమైన గబ్బలం వేలాడుతున్నదని ఈ ఫొటో చూసినవారంతా హడలెత్తిపోతున్నారు. అయితే అసలు విషయం తెలిశాక అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఫొటోలో గబ్బిలం రూపం అంత పెద్దగా కనిపించడానికి కెమెరా ట్రిక్ కారణమట. ఆప్టికల్ ఇల్యూజన్ సృష్టించారట. ఒక సాధారణ గబ్బిలం ఫొటోను పెద్దదిగా చేసి చూపారుట. ట్విట్టర్‌లోని ఈ ఫొటో అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తోంది.ఈ ఫొటోకు ఇప్పటివరకూ 58కే కు మించిన రీట్వీట్లు, 234కే కు మంచిన లైక్స్ వచ్చాయి. ఈ ఫొటో చూసిన ఒక యూజర్ ఇంత పెద్ద గబ్బిలం ప్రపంచంలో ఉంటే ఏమవుతుందో అని రాయగా, ఇది ఎడిటింగ్ పిక్చర్ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది! Remember when I told y'all about the Philippines having human-sized bats? Yeah, this was what I was talking about pic.twitter.com/nTVIMzidbC — hatdog² (@AlexJoestar622) June 24, 2020 -
జడేజా ఐపీల్ ఫైనల్లో వాడిన బ్యాట్ ఎవరికీ ఇచ్చాడో తెలుసా..!
-
అంతరిక్షంలోకి యువరాజ్‌సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా యువీ రికార్డు..!
Yuvraj Singh Bat Flies To Space Becomes First Minted NFT Ever To Be Sent In Orbit: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ తన వ్యక్తిగత నాన్-ఫంజిబుల్ టోకెన్లను (ఎన్ఎఫ్టీ) డిజిటల్ కలెక్టబుల్స్ వెబ్సైట్ కొలెక్షన్ భాగస్వామ్యంతో ప్రారంభించాడు.ఈ ఎన్ఎఫ్టీ టోకెన్ల ద్వారా తన కెరీర్లో కొన్ని అత్యుత్తమ క్షణాలను అభిమానులతో పంచుకోనున్నాడు యువీ. అంతరిక్షంలోకి యువీ బ్యాట్..! తొలి వ్యక్తిగా.. 2003 ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ తన మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన ఐకానిక్ బ్యాట్‌ను హాట్ ఎయిర్ బెలూన్ సహయంతో అంతరిక్షంలోకి పంపారు.అందుకు సంబంధించిన వీడియో అభిమానులకు ఎన్ఎఫ్టీ రూపంలో అందుబాటులో ఉండనుంది. అయితే అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ఎన్ఎఫ్టీ కలెక్షన్గా యువీ బ్యాట్ నిలవనుంది. ఈ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. కొలెక్షన్ అధికారిక అధికారిక వెబ్సైట్లో ఎన్ఎఫ్టీ వీడియో రూపంలో అందుబాటులో ఉండనుంది. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ...“నా మొదటి ఎన్ఎఫ్టీ కలెక్షన్లను కొలెక్షన్ భాగస్వామ్యంతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కొత్త ప్లాట్‌ఫారమ్‌లో నా అభిమానులతో మరింత దగ్గరగా ఉంటాను. నా క్రికెట్ ప్రయాణంలో అమూల్యమైన కొన్ని క్షణాలను ఎన్ఎఫ్టీ రూపంలో తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. కొలెక్షన్ వ్యవస్థాపకుడు అభయ్ మాట్లాడుతూ... యువరాజ్ 3డీ స్టాచ్యూతో పాటు ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్‌ను విడుదల చేయనున్నాము. అతని ఎన్ఎఫ్టీ కలెక్షన్లను సొంతం చేసుకునేందుకు అభిమానులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించనున్నామని అన్నారు. భారత్‌లో ఊపందుకున్న ఎన్ఎఫ్టీలు..! భారత్‌లో ఎన్ఎఫ్టీలపై భారీ ఆదరణను పొందుతుంది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్, సల్మాన్ ఖాన్ లాంటి ప్రముఖ నటులు ఎన్‌ఎఫ్‌టీపై కన్నేశారు. తమ ఎన్ఎఫ్టీ కలెక్షన్లను అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటుగా ఎన్ఎఫ్టీ విషయంలో టీమిండియా క్రికెటర్లు కూడా సై అంటున్నారు. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌తో పాటుగా ఎన్ఎఫ్టీ కలెక్షన్స్‌లోకి యువీ కూడా జాయిన్ అయ్యారు. చదవండి: మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన రిషబ్ పంత్..! దినేష్ కార్తీక్ సరసన...! -
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్‌ను ఆవిష్కరించిన అజారుద్దీన్,జయేశ్ రంజన్
-
బ్యాట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్.. జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు
Yashasvi Jaiswal Happy After MS Dhoni Autographed His Bat: రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు. దానికీ ఓ కారణం ఉంది... ఎందుకంటే తన బ్యాట్‌పైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ చేయడమే. కాగా అబుదాబి వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే జైస్వాల్ అర్థ సెంచరీ సాధించి జట్టు విజయానికి బాటలు వేశాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్‌క్యాపడ్ ప్లేయర్ వేగవంతంగా హాఫ్ సెంచరీ చేయడం ఇది ఐదోసారి. కాగా జైశ్వాల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన జైశ్వాల్ ధోనీ ఆటోగ్రాఫ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. "నేను మొదట బ్యాటింగ్‌కు పిచ్ ఎలా అనుకూలిస్తుందని ఆలోచిస్తాను, కానీ మేము 190 పరుగులు చేజ్ చేయాలి, వికెట్ బ్యాటింగ్‌కు తప్పక బాగుంటుందని నాకు తెలుసు. నేను పవర్‌ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడం, మా జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడం ద్వారా 190 పరుగులను చేధించగలిగాము, ”అని జైస్వాల్ శివమ్ దుబే, అనూజ్ రావత్ ఐపీఎల్ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాడు. "మ్యాచ్ తర్వాత నా బ్యాట్‌పై ఎంఎస్ ధోని సంతకం తీసుకున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని జైశ్వాల్ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ అనంతరం జైస్వాల్‌పై రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. చదవండి: ఐపీఎల్లో రుతురాజ్ డెబ్యూ సెంచరీ.. రికార్డుల మోత -
బ్యాట్లను రిపేర్ చేస్తున్న కోహ్లి..
దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఏది చేసినా సంచలనమే. ఇటివల తరుచుగా తన అభిరుచులకు సంబంధించిన పోస్ట్‌లు పెడుతు తన ఫ్యాన్స్‌ను నిత్యం ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా తన బ్యాట్లను రిపేర్ చేస్తు నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగూళూరు టీమ్‌కు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ అంశంపై విరాట్ స్పందిస్తూ బ్యాట్ హ్యాండిల్ బ్యాలెన్స్ కావడానికి కొద్దిగా కట్ చేశానని తెలిపాడు. బ్యాట్ బ్యాలెన్స్ కోసం కొన్ని సెంటీమీటర్లైనా తనకు చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. తన బ్యాట్లంటే విపరీతమైన ప్రేమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే కోహ్లీ బ్యాట్ రిపేరింగ్ నైపుణ్యం తనను విపరీతంగా ఆకట్టుకుందని ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా తెలిపారు. తాను కూడా బ్యాట్లను రిపేర్ చేసే అవకాశం ఉంటే కచ్చితంగా కోహ్లిలా రిపేర్ చేస్తానని పేర్కొన్నాడు. యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభమవుతుండగా, 21వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ తలపడనుంది. (చదవండి: మేమేంటో మా ఇద్దరికి మాత్రమే తెలుసు) It's the small details that matter 👌. For me even couple of centimeters are crucial for the balance of a bat. I LOVE taking care of my bats 😍 pic.twitter.com/oJ4Tqk5UfP — Virat Kohli (@imVkohli) September 11, 2020 -
సచిన్ బ్యాట్‌తోనే ఆఫ్రిది చరిత్రకెక్కాడు
లాహోర్: అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్‌లోనే వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన షాహిద్ ఆఫ్రిది...18 ఏళ్ల పాటు ఆ రికార్డును తనపేరే నిలుపుకున్నాడు. 1996లో నైరోబీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 ఏళ్ల వయస్సులో పాక్ మాజీ కెప్టెన్ ఈ ఘనత సాధించాడు. అయితే ఈ అద్బుత ప్రదర్శన వెనక భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాత్ర కూడా ఉందని ఆఫ్రిది సహచరుడు అజహర్ మహమూద్ తాజాగా వెల్లడించాడు. నాటి మ్యాచ్‌లో సచిన్ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆఫ్రిది 37 బంతుల్లో శతకం సాధించాడని అజహర్ తెలిపాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమూద్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘1996లో ఆఫ్రిది అరంగేట్రం చేశాడు. ముస్తాక్ అహ్మద్ గాయపడటంతో పాకిస్తాన్ ‘ఎ’ పర్యటనలో ఉన్న ఆఫ్రిదికి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కింది. తొలి మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం దక్కలేదు. రెండో మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన అతను 40 బంతుల్లో 104 పరుగులతో పతాక శీర్షికలెక్కాడు. ఆ మ్యాచ్‌లో అతను వాడిన బ్యాట్‌ను సచిన్ వకార్‌కిచ్చాడు. వకార్ నుంచి ఆ బ్యాట్ ఆఫ్రిది చేతికందింది. అంతకుముందు బౌలర్‌గానే గుర్తింపు తెచ్చుకున్న ఆఫ్రిది... అలా సచిన్ బ్యాట్‌తో డాషింగ్ బ్యాట్స్‌మన్‌గా మారాడు’ అని అజహర్ వివరించాడు. -
గబ్బిలాల మృత్యువాత.. ఆందోళనలో గ్రామస్తులు
లక్నో: కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్న వేళ ఎనిమిది గబ్బిలాలు మృత్యువాత పడటం ఓ గ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మీరట్ శివారులోని మెహ్రోలీ గ్రామ సమీపంలోని నీటి గుంటలో ఏప్రిల్ 29న గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. కరోనా వ్యాప్తికి గబ్బిలాలే కారణమన్న వార్తల నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి అదితి శర్మ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)కి గబ్బిలాల నమూనాలు పంపించారు. ఇక ఈ విషయంపై పరిశోధన జరిపిన ఐవీఆర్ఐ శాస్త్రవేత్తలు కరెంట్ షాక్ తగిలినందు వల్లే గబ్బిలాలు మృత్యువాత పడ్డాయని తాజాగా స్పష్టం చేశారు. (కరోనా.. 53 వేలకు చేరువలో కేసులు) ఈ విషయం గురించి డీఎఫ్ఓ అదితి శర్మ మాట్లాడుతూ.. నీటి కుంట సమీపంలోని పండ్ల తోటలో వెదజల్లిన రసాయనాల వల్లే గబ్బిలాలు చనిపోయినట్లు భావించామని.. అయితే ఎలక్ట్రిక్ షాక్ వల్లే ఘటన జరిగిందని.. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కానీ మెహ్రోలి గ్రామస్తులు మాత్రం అదితి మాటలతో ఏకీభవించడం లేదు. ఊరి పెద్ద గంగారాం ఘటన గురించి మాట్లాడుతూ.. గబ్బిలాల మృతదేహాలు లభించిన చోటుకు సమీపంలో ఎలాంటి కరెంట్ లైన్ లేదని తెలిపారు. షాక్ కొట్టడం వల్లే అవి చనిపోయాయని చెబుతున్నారని.. అయితే అక్కడే ఉన్న ఇతర జంతువులు ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని తేలికగా కొట్టిపారేయవద్దని.. తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని అధికారులకు విన్నవించారు. (ఆ రాష్ట్రాల గబ్బిలాల్లో కరోనా పాజిటివ్!) గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా? -
వేలంలో షకీబ్ బ్యాట్‌కు రూ. 18 లక్షల 20 వేలు
కరోనా బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు తనకెంతో ఇష్టమైన బ్యాట్‌ను వేలానికి పెట్టిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. ఆన్లైన్ వేలంలో అతని బ్యాట్ 24 వేల డాలర్లు (రూ. 18 లక్షల 20 వేలు) పలికింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ ఓ బంగ్లాదేశీ ఈ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఈ బ్యాట్‌తోనే విశేషంగా రాణించిన షకీబ్ 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో మొత్తం 606 పరుగులు సాధించాడు. బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వని కారణంగా అతనిపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ అక్టోబర్‌తో నిషేధం ముగియనుంది. -
వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు. -
ఆ రాష్ట్రాల గబ్బిలాల్లో కరోనా పాజిటివ్!
న్యూఢిల్లీ: మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా(కోవిడ్-19) మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చి క్లినికల్ ట్రయల్స్ సైతం నిర్వహిస్తుండగా.. మరికొన్ని దేశాల్లో టీకాను కనుగొనేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. అయితే ఇంతవరకు కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యుక్రమాన్ని ఎవరూ పూర్తిస్థాయిలో విశ్లేషించలేకపోయారు. ఇక చైనీస్ శాస్త్రవేత్తలు మాత్రం గబ్బిలాల్లోని ఆర్‌ఎమ్‌వైఎన్‌ఓ2 జన్యుక్రమం, హెచ్‌సీఓవీ-19(కోవిడ్-19) జన్యుక్రమంతో దాదాపు 93 శాతం సరిపోలిందని గతంలో వెల్లడించారు. జన్యు పునఃసంయోగాల(జీన్ రీకాంబినేషన్) వల్లే కరోనా పుట్టిందని అంచనా వేశారు. తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్ఆర్)చేసిన అధ్యయనంలోనూ ఇదే తరహా కీలక విషయాలు వెల్లడయ్యాయి.(కరోనా వ్యాక్సిన్‌పై పరీక్షలు షురూ..) రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీపీసీఆర్) ద్వారా రెండు భిన్న రకాల గబ్బిలాలపై పరిశోధనలు జరిపినట్లు ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. దీని ఆధారంగా రౌసెట్టస్, టెరోపస్ రకాకలు చెందిన గబ్బిలాల్లో కరోనా వైరస్ బయటపడినట్లు వెల్లడించింది. ఇక టెరోపస్ రకంలో గతంలో నిపా వైరస్ ఆశ్రయం పొందినట్లుగా రుజువైందని పేర్కొంది. ఈ క్రమంలో కేరళ, హిమాచల్ ప్రదేశ, తమిళనాడు, పుదుచ్చేరిలోని గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిళ్లలో దాదాపు అన్నీ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది. (‘ఆ రెండు జన్యుక్రమాలు సరిపోలాయి’) ఇక తెలంగాణ సహా కర్ణాటక, చండీగడ్, గుజరాత్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లోని గబ్బిలాల్లో నెగటివ్ వచ్చినట్లు స్పష్టం చేసింది. మొత్తం 25 రకాల గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించగా కేవలం ఈ రెండింటిలోనే కరోనా ఉన్నట్లు గుర్తించామంది. ఈ మేరకు తన అధ్యయనంలో పలు కీలక విషయాలు పొందుపరిచింది. కాగా బీటీకోవ్(బ్యాట్ కరోనా వైరస్)గా వ్యవహరిస్తున్న ఈ వైరస్ వల్లే మనుషుల నుంచి మనుషులకు సోకుతున్న కరోనా ఉద్భవించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని జాతీయ వైరాలజీ సంస్థ ప్రగ్యా యాదవ్ పేర్కొన్నారు. (కరోనా: 5 నిమిషాల్లో పాజిటివ్.. 13 నిమిషాల్లో నెగటివ్) ‘‘పలు వైరస్‌లకు గబ్బిలాలు ఆశ్రయజీవులుగా ఉంటాయి. వాటిలో కొన్ని మానవులకు తీవ్రమైన హాని చేస్తాయి. భారత్‌లో టెరోపస్ గబ్బిలాలు గతంలో నిపా వైరస్ వ్యాప్తికారకాలుగా వ్యవహరించినట్లు వెల్లడైంది. కాబట్టి కోవిడ్-19 వ్యాప్తిలో ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటి కారణంగానే కరోనా విస్తరిస్తోందని కచ్చితంగా చెప్పలేం’’అని పేర్కొన్నారు. -
గబ్బిలాలతో వైరస్.. నిజమేనా?
సాక్షి, హైదరాబాద్: గబ్బిలాలతో కరోనా వ్యాపిస్తుందా? ప్రస్తుత ఈ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఈ వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది, దానికి దోహదపడుతున్న మార్గాలేమిటో బోధపడక ఇంకా సందేహాలు వెంటాడుతున్నాయి. వైరస్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వ్యాధిబారిన పడకుండా తప్పించుకోవచ్చుననేది కూడా నిర్ధారణ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 10 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణవ్వగా 50 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఇక కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి కారణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైరస్‌లకు, గబ్బిలాలకు ఉన్న సంబంధాలు, వైరస్ల వ్యాప్తిలో ఇవి పోషిస్తున్న పాత్ర ఏమిటనేది కీలకంగా మారింది. ‘పుణే వైరాలజీ’ పరిశోధనలు షురూ.. గబ్బిలాల నుంచి వైరస్లు వస్తున్నాయా లేక వాటి ద్వారా వైరస్లు వ్యాపిస్తున్నాయా అన్న దానిపై వివిధ దేశాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. ప్రజల ఆరోగ్యం, ప్రాణాంతక వ్యాధులతో ముడిపడిన ఈ అంశానికి శాస్త్ర, సాంకేతిక పరంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పుణే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా గబ్బిలాలు–వైరస్ల వ్యాప్తిపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోనూ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పర్యటించి వివిధ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ పరిశీలనలు జరిపారు. వివిధ ప్రాంతాల్లోని వేర్వేరు రకాల గబ్బిలాల రక్త, లాలాజల శాంపిల్స్‌ను సేకరించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ, ఇతర భవనాలు, హైకోర్టు భవన సముదాయం, చిలుకూరు బాలాజీ దేవాలయం, జనగామ, మంజీరా నదీ పరీవాహక ప్రాంతం సహా పలు ప్రాంతాల్లో వందలాది గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇలా దేశవ్యాప్తంగా గబ్బిలాల రకాల నుంచి సేకరించిన శాంపిళ్లపై పరిశోధనలు నిర్వహించి వాటి ద్వారా ఎలాంటి వైరస్ ఎలా ఉద్భవించి, ఏ రూపంలో ఎలా వ్యాప్తి చెందుతున్నాయనే దానిపై పుణే ఇన్స్టిట్యూట్లో అధ్యయనం సాగుతోంది. వివిధ రకాల వైరస్ల సృష్టికి, వాటికి వాహకంగానూ గబ్బిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయనే అనుమానాల నివృత్తికి ఈ పరిశోధనలు ఉపయోగపడతాయనే నమ్మకం శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది. నిఫా వైరస్ వ్యాప్తికి కారణమవే.. కరోనా వ్యాప్తికి గబ్బిలాలే కారణమని శాస్త్రీయంగా పరిశోధనలతో ఇంకా నిరూపితం కాకున్నా నిపా వైరస్ వ్యాప్తికి గబ్బిలాలే కారణమని పుణే వైరాలజీ ఇన్స్టిట్యూట్ పరిశోధనల్లో తేల్చింది. 2018లో కేరళలో నిఫా వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై పరిశోధన సందర్భంగా ఈ ఇన్స్టిట్యూట్ నిర్ధారించింది. సార్స్, స్వైన్‌ఫ్లూ, ఎబోలా వంటి వాటికి దారితీసే వైరస్‌లకు కూడా గబ్బిలాలే కారణమనే అనుమానాలను పరిశోధనల ద్వారా నివృత్తి చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం కాగా ఇప్పుడు మరింత తీవ్ర స్థాయికి చేరిన కరోనా వైరస్ కూడా ఇందులో వచ్చి చేరింది. స్వైన్‌ఫ్లూ వ్యాప్తికి కూడా గబ్బిలాలే కారణమని గట్టిగా నమ్ముతున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. గబ్బిలాల నుంచి ఎలా? గబ్బిలాలకు సంబంధించినంత వరకు భారత్‌లో 12 రకాల జాతులుండగా, వాటిలో 3 రకాలు వైరస్ల వ్యాప్తికి ప్రమాదకారిగా అంచనా వేస్తున్నారు. వీటిలో పండ్లను సగం తిని వదిలేశాక ఆ పండ్లను తిన్న పందులు, ఇతర పక్షుల నుంచి, క్రిమికీటకాలు, పశువుల కళేబరాల మాంసం తిన్న గబ్బిలాల నుంచి, జంతువుల రక్తం పీల్చే ‘వ్యాంపెయిర్’బ్యాట్ల నుంచి వైరస్లు విస్తరించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తల ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైనట్టు సమాచారం. కోవిడ్ వైరస్ వ్యాప్తిలోనూ గబ్బిలాల పాత్ర ఉందా అన్నది పరిశోధనల్లో తేలితే విశ్వ మానవాళికి సవాల్‌గా మారిన ఉపద్రవానికి విరుగుడు వ్యాక్సిన్‌ను కనుక్కోవడంలో సమాధానం దొరికినట్టు అవుతుందనే విశ్వాసాన్ని సైంటిస్ట్‌లు వ్యక్తం చేస్తున్నారు. -
వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్ చేసి..
-
కరోనా వైరస్‌తో 6.5 కోట్ల మందికి ముప్పు!
బీజింగ్: చైనా నుంచి ఇప్పటికే 11 దేశాలకు విస్తరించిన ప్రాణాంతకమైన ‘కరోనా’ జాతి వైరస్ 18 నెలలోనే ప్రపంచంలోని అన్ని మూలలకు విస్తరిస్తుందని, దీని వల్ల దాదాపు ఆరున్నర కోట్ల మంది మరణించే ప్రమాదం ఉందని అమెరికాలోని ప్రతిష్టాకరమైన ‘జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ’ ముందుగానే హెచ్చరించింది. చైనాలో కరోనావైరస్ బయట పడడానికి రెండు నెలల ముందు, అంటే గత అక్టోబర్ నెలలోనే ఇలాంటి ప్రాణాంతక వైరస్ ఎన్ని నెలల్లో ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది ? ఎంత మంది మరణిస్తారు? అన్న అంశంపై కంప్యూటర్ సిములేషన్ ద్వారా అంచనా వేయగా ఈ విషయం తేలింది. ఇప్పటి వరకు కరోనా జాతి వైరస్ వల్ల చైనాలో 41 మంది మరణించగా, 1200 మంది అస్వస్థులయ్యారు. ‘డిసెంబర్ నెలలో, చైనాలో కరోనావైరస్ వ్యాప్తి గురించి తెలియగానే నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. మేము ముందుగా అంచనా వేసినట్లుగానే అక్కడ కరోనావైరస్ వ్యాపించింది. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని తెలుసు. ఎంత తీవ్రంగా అన్నదాన్ని ఇంకా అంచనా వేయలేదు. ఇది సార్స్‌కంటే ఎక్కువ విస్తరిస్తుంది’ జాన్స్ హాప్కిన్స్ సెంటర్లోని సీనియర్ పరిశోధకులు డాక్టర్ ఎరిక్ టోనర్ హెచ్చరించారు. 2003లో చైనాలో సార్స్ వల్ల ఎనిమిది వేల మంది అస్వస్థులు కాగా, 774 మంది మరణించారు. సార్స్ (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) కూడా ఒక రకమైన కరోనా వైరస్ నుంచే వ్యాపించింది. కరోనా వైరస్ శ్వాస క్రియ వ్యవస్థను దెబ్బతీస్తుందని, నిమోనియా లక్షణాలతో రోగులు మరణించే ప్రమాదం ఉందని డాక్టర్ ఎరిక్ అభిప్రాయపడ్డారు. గబ్బిలం నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని చైనా వైద్యులు ముందుగా అనుమానించగా, సీఫుడ్ సెంటర్లో విక్రయించే పాముల నుంచి వ్యాపించి ఉండవచ్చని ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారి కళ్లలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, కళ్ల నుంచి కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించ వచ్చని, అందుకు సురక్షితంగా అందరు కళ్లజోళ్లు పెట్టుకోవాలని కూడా చైనా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారు మాత్రం స్పేస్ సూట్లు తరహాలో ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఓ వైద్యుడు వైరస్ సోకి మరణించారు. ఇప్పటికే ఈ వైరస్ అమెరికా, థాయ్‌లాండ్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, సింగపూర్, హాంకాంగ్, మకావు, నేపాల్ దేశాలకు విస్తరించింది. చదవండి: చైనాలో కరోనా కల్లోలం -
వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్ చేసి..
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్‌కు ‘కరోనా’ అని పేరు పెట్టారు కదా.. ఈ చైనా అమ్మాయికి ‘ధైర్యం’ అని పేరు పెట్టాలి. ప్రాణాంతకమైన కరోనా వైరస్.. పాలిచ్చే పక్షుల వల్ల, ఒక రకం పాముల వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టి చెప్పాక కూడా.. ఈ యువతి రెస్టారెంట్లో కూర్చొని.. చక్కగా వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్ చేసి, ఆరగిస్తోంది. గబ్బిలం పాలిచ్చే పక్షి అయితే నాకేంటి! నా నాలుకకు రుచినిచ్చే పక్షి అవునా కాదా అన్నదే పాయింట్ అన్నట్లు.. చాప్‌స్టిక్స్‌తో కొద్ది కొద్దిగా పీస్‌లు చేసుకుని తన జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరుస్తోంది. (కరోనా వైరస్ తీవ్రతరం) కరోనా వైరస్ సోకి చైనాలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మధ్య చైనాలోని ఉహాన్ ప్రాంతంలో ఇటీవలే బయట పడిన కరోనా వైరస్... లగేజ్ భుజాన వేసుకుని ప్రపంచ దేశాలలో పర్యటించేందుకు బయల్దేరినట్లే కనిపిస్తోంది. యు.ఎస్.లో ఒక కేసు బయటపడింది. మన కేర ళలో కూడా ఒక నర్సుకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవేమీ ఈ అమ్మాయికి పట్టినట్లు లేదు. (చైనాలో కరోనా కల్లోలం) చదవండి:భయంతో వణుకుతున్నారు.. అందుకే ఇలా..! -
అచ్చం ఆ సినిమా తరహాలోనే చనిపోతున్నారు!
న్యూఢిల్లీ : 2011లో వార్నర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో విడుదలైన హాలివుడ్ చిత్రం ‘కంటేజియన్’ ఇప్పుడు మళ్లీ మన కళ్ల ముందు కదలాడుతోంది. మట్ డామన్, కేట్ విన్స్లెట్ నటించిన ఆ చిత్రానికి ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో చైనాలోని ఓ గబ్బిలం నుంచి విస్తరించిన కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోతారు. దాన్ని అరికట్టేందుకు ప్రపంచంలోని రోగ నియంత్రణ, నిరోధక కేంద్రాలు తీవ్రంగా కృషి చేస్తాయి. చివరకు అందులో ‘పేషంట్ జీరో’గా పిలిచే ఓ చెఫ్‌కు ఈ వినూత్న వైరస్ సోకుతుంది. ఆ వైరస్‌తో పోరాడి బతికి బట్టకట్టడం ద్వారా పేషంట్ జీరో హీరో అవుతారు. ఆ పాత్రను నిర్మాతల్లో ఒకరైన మట్ డామన్ పోషించారు. అచ్చం అందులో లాగానే చైనాలోని వుహాన్ పట్టణం నుంచి విస్తరించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల చైనాలో 26 మంది మరణించగా 800 మంది అస్వస్థులయ్యారు. అమెరికాలో ఆరుగురికి ఈ వైరస్ సోకింది. భారత్‌లోని కేరళకు చెందిన ఓ నర్సుకు కూడా ఈ వ్యాధి సోకినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో ఆ వైరస్ లక్షణాలు కనిపించలేదని డాక్టర్లు ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. చైనాలో ఈ వైరస్ సోకిన వారు ఎక్కడి వారక్కడ ఉన్న ఫళంగా రోడ్ల మీద, బస్టాపుల్లో పడిపోతున్నారు. దాంతో భయకంపితులవుతున్న చైనీయులు తండోపతండాలుగా ఆస్పత్రులకు వెళుతున్నారు. వారి తాకిడిని తట్టుకోవడం వైద్యాధికారులకు తలకు మించిన భారమైంది. సినిమాలోలాగా కరోనా వైరస్ చైనాలోని గబ్బిలం నుంచే వెలువడి ఉంటుందని, ఆ దిశగా పరిశోధనలు జరపాలని నాటి ‘కంటేజియన్’ అభిమానులు చైనా వైద్యులకు సలహా ఇస్తున్నారు. ఆ సినిమాలోని పేరును చూసే ఇప్పటి వైరస్‌కు కూడా ‘కరోనా’ అని పేరు పెట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. ‘కంటేజియన్’ సినిమా అత్యంత భయానకమైనదని గత కొన్నేళ్లుగా తాను చెబుతున్నానని, ఇప్పుడదే నిజమైందని నటుడు, దర్శకుడు స్టీఫోన్ పోర్డ్ ట్వీట్ చేశారు. ‘నాకు కంటేజియన్ సినిమా గుర్తొస్తోంది. అచ్చం సినిమాలోలాగానే ఇప్పుడు చైనాలో వైరస్‌కు రోగులు చనిపోతున్నారు. చైనా గబ్బిలాల విసర్జితాలను ఎరువులుగా వాడుతుండడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందివుండొచ్చు’ అని మరొకరు ట్వీట్ చేశారు. గబ్బిలం జిగురు నుంచి తయారు చేస్తున్న సబ్బుల వల్ల కూడా ఈ వైరస్ సోకవచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు. 2003లో హాంకాంగ్‌లో ‘సార్స్’ వైరస్‌తో అనేక మంది మరణించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే 2011లో కంటేజియన్ చిత్రం తీసి ఉంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకనే ఆ సినిమాలో వైరస్ చైనా నుంచి విస్తరించిందని చూపించారు. కల్పితం అయినప్పటికీ సినిమాలో సైన్స్‌ను సైన్స్‌లా చూపించారని ఆ సినిమాకు దర్శకత్వం వహించిన ‘స్లీవెన్ సోడర్బెర్గ్’ను నాటి సైన్స్ కమ్యూనిటీ ప్రశంసించింది. చదవండి: భయంతో వణుకుతున్నారు.. అందుకే ఇలా..! -
భారీ వల చూడగానే అతనికి అర్థమైంది...
ఆ కీటకం వల పన్నితే తప్పించుకోవడం కష్టం. అందులో చిక్కుకుని గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడవాల్సిందే. అదే సాలీడు (స్పైడర్) ప్రత్యేకత. ఆహారాన్ని సమకూర్చుకోవడానికి, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ‘వల పన్నడం’ సాలీడుకు చిటికెలో పని. అనెటా అలానిజ్ గుజార్డో అనే వ్యక్తి టెక్సాస్‌లో నివాసముంటున్నాడు. ఆఫీస్‌కు వెళ్తున్న క్రమంలో గత బుధవారం ఇంటిపక్కన ఓ భారీ సాలీడు వల చూసి షాక్‌కు గురయ్యాడు. సినిమాలో మాదిరి అంతపెద్ద వల అతని కంటబడటంతో విషయం అర్థమైంది. ఓ భారీ స్పైడర్.. దాని వలలో చిక్కుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి గింజుకుంటున్న గబ్బిలం కనిపించాయి. అతను చూస్తుండగానే గబ్బిలం వైపు సాలీడు దూసుకొచ్చింది. దానిపైబడి నంజుకు తినేసింది. స్పైడర్ కన్నా ఆ గబ్బిలం పెద్ద సైజులో ఉండటం గమనార్హం. ఇక ఈ విషయాన్నంతా గుజార్డో ఫేస్బుక్లో పంచుకున్నాడు. సాలీడు ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జియోప్ ఆరంటియా జాతికి చెందిన ఈ స్పైడర్ తేనెటీగలు, బొద్దింకలు, కీటకాలు, పక్షుల్ని ఆహారంగా తీసుకుంటాయి వాటికన్నా భారీ ప్రాణలను కూడా అవి ట్రాప్ చేసి ఆహారంగా చేసుకోవడం విశేషం. -
విమానంలో గబ్బిలం.. పరుగులెత్తిన ప్రయాణికులు
-
విమానంలో గబ్బిలం.. పరుగులెత్తిన ప్రయాణికులు
తాము ప్రయాణిస్తున్న విమానంలో గబ్బిలం కనిపించడం ప్రయణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన నార్త్ కరోలినా నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు ట్విటర్లో షేర్ చేశాడు. ఈ ఏడాది ఇలా జరగడం ఇది రెండోసారి అని.. మళ్లీ తాను స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేయబోనని సదురు వ్యక్తి పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానంలో గబ్బిలాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అది తమపై ఎక్కడ వాలుతుందోనని భయపడ్డారు. దాదాపు 30 నిమిషాల సేపు అది విమానంలో అటు ఇటూ తిరుగుతూనే ఉంది. కొందరైతే భయంతో పరుగులు పెట్టారు. మరికొందరైతే గబ్బిలం బారిన పడకుండా ఉండటానికి వాష్‌రూమ్‌ల్లో దూరి లాక్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. -
నాణెం కాదు...బ్యాట్ గాల్లోకి!
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్ నిర్వాహకులు కొత్త తరహా ఆకర్షణలతో ముందుకు వస్తున్నారు. ఈ కోవలో తాజాగా ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) కూడా చేరింది. ఈ సారి ‘టాస్’ను కూడా ఆసక్తికరంగా మార్చేందుకు బీబీఎల్ ప్రయత్నిస్తోంది. ఈ నెల 19న ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో టాస్ కోసం నాణేన్ని కాకుండా ‘బ్యాట్’ను గాల్లోకి ఎగరేయనున్నారు. కెప్టెన్ బ్యాట్ ముందు భాగం లేదా వెనుక భాగాన్ని ఎంచుకోవాల్సి (హిల్స్ లేదా ఫ్లాట్స్) ఉంటుంది. టాస్ కోసం ఎగరవేసే ఒకే తరహా బ్యాట్‌ను బీబీఎల్ నిర్వాహకులే అందజేస్తారు. -
బ్యాట్‌పై అసభ్య పదజాలం.. ఐసీసీ మందలింపు
హెడింగ్లే: ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మందలించింది. మరొకవైపు అభిమానులు సైతం బట్లర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన బ్యాట్‌పై ఉన్న అసభ్యకరమైన పదాలే ఇందుకు ప్రధాన కారణం. తొలి టెస్టులో పరాజయం పాలైన ఇంగ్లండ్ ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయంలో బట్లర్ కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, బట్లర్ బ్యాట్‌పై ఉన్న అసభ్య పదజాలం అతన్ని ఇరకాటంలో పడేసింది. వివరాల్లోకి వెళితే.. రెండో టెస్టు మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ విరామ సమయంలో బట్లర్ తన హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను మైదానంలో ఉంచాడు. ఈ క్రమంలోనే బట్లర్ బ్యాట్ హ్యాండిల్‌పై రాసిన అసభ్య పదజాలం కాస్తా కెమెరా కంటికి చిక్కింది. అదే సమయంలో ఇది గమనించిన అభిమానులు ఫొటోలు తీసేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేశారు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ‘బట్లర్ తన బ్యాట్‌పై ఏమి రాసుకున్నాడో చూశారా’ అంటూ నెటిజన్లు ఈ ఫొటోను తెగ షేర్ చేసేస్తున్నారు. అది వాడకూడని పదజాలం కావడంతో ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొకసారి ఇలా వ్యవహరించకూడదంటూ బట్లర్‌కు మందలింపుతో సరిపెట్టింది. -
భయపడొద్దు.. జాగ్రత్తగా ఉంటే చాలూ!
సాక్షి, తిరువనంతపురం: కేరళను వణికించిన నిపా వైరస్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వదంతులను నమ్మొద్దంటూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్త పడొచ్చని చెబుతున్నారు. నిపా వైరస్ జూనోటిక్ వ్యాధికి సంబంధించింది. అంటే జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించేది. ఇన్ఫెక్షన్ సోకిన పందులు, గబ్బిలాలు, వాటి విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వారి నుంచి కూడా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందన్నది వైద్యుల మాట. ఈ వైరస్ సోకినవారికి దగ్గరగా వెళ్లినప్పుడు లేదా వైరస్ సోకిన వారు ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడం వల్ల వ్యాధి విస్తరిస్తుందని చెబుతున్నారు. కోచిలోని అమ్రిత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్లినికల్ ప్రొఫెసర్ విద్యామీనన్.. నిపా గురించి పలు సూచనలు చేస్తున్నారు. ‘మలేషియాలో పందుల పెంపకందార్లలో మొదటిసారిగా ఈ వైరస్ సోకగా, నిపా వెలుగులోకి వచ్చింది. భారత్‌లోనూ 2001, 2007లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలోనూ నిపా వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి తీరుతెన్నులను గమనిస్తే ఒకే ప్రాంతం, దాని చుట్టుపక్కల పరిసరాలకు పరిమితమవుతూ వస్తోంది. ప్రస్తుతం కూడా కేరళలోని కోజికోడ్, మళప్పురం, కన్నూర్, వేనాడ్ జిల్లాలకే నిపా పరిమితమైంది. దేశంలో మరెక్కడ దీని ఆనవాళ్లు లేదన్న సమాచారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశమే లేదు’ అని విద్యామీనన్ సలహా ఇస్తున్నారు. - చేతులను తరచుగా సోప్ తో శుభ్రం చేసుకోవటం. - ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం - పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత తినడం... ప్రాథమిక జాగ్రత్తలుగా ఆయన చెబుతున్నారు. - శ్వాసకోస ఇన్ఫెక్షన్, జ్వరం, వళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. వ్యాధి నిర్ధారణ అయితే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని వైద్యసిబ్బందికి సూచిస్తున్నారు. -
నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ?
కేరళలో కలకలం రేపుతూ 12 మంది మృతికి కారణమైన నిపా వైరస్‌కు గబ్బిలాలే కారణం కాదా ? ఇప్పటివరకు పండ్లు తినే గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంత వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఎందరో చెబుతూ వచ్చారు. కానీ గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న కొందరు బయోలజిస్టులు మాత్రం నిపా వైరస్ వ్యాప్తి చెందడానికి గబ్బిలాలే కారణమని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు. ఒకప్పుడు ఎబోలా వైరస్ బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ గబ్బిలాల వల్లే వచ్చిందని అన్నారని, కానీ తర్వాత ఆ వైరస్ చింపాంజీ, గొరిల్లాల నుంచి వ్యాప్తి చెందిందని తేలిందని వారు గుర్తు చేస్తున్నారు. అసలు మనుషులు సంచరించే ప్రదేశాల్లో గబ్బిలాలు తిరగవని, వాటి నుంచి వైరస్లు వ్యాప్తి చెందడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుందని బయోలజిస్టులు వాదిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గబ్బిలాలు ఆవాసం ఉండడానికి ఎక్కడా చోటు లేకపోవడం, సరైన తిండి దొరకకపోవడం వల్ల వాటిల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి వైరస్లు వెదజల్లుతున్నాయని,అందువల్ల గబ్బిలాల సంరక్షణకు సరైన చర్యలు తీసుకుంటే, వాటి వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. అసలు భారత్‌లో ఎందరో గిరిజనులు గబ్బిలాల్ని ఆహారంగా తీసుకుంటారని, కానీ వారిలో ఎవరికీ ప్రాణాంతక వ్యాధి నిపా సోకిందనడానికి ఆధారాలు లేవని గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు చెబుతున్న మాట. ‘పండ్లు తినేగబ్బిలాలు చూడడానికి భారీ సైజులో కనిపిస్తాయి. కానీ కేరళలో సీజ్ చేసిన బావిలో ఉన్న గబ్బిలాల్ని చూస్తే ఆకారంలో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అందువల్ల కేరళలో వైరస్‌కు గబ్బిలాలే కారణమని ఇప్పట్నుంచి నిర్ధారించలేం‘ అని ఉస్మానియా యూనివర్సిటీకి డాక్టర్ సీహెచ్. శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. మరో శాస్త్రవేత్త రోహిత్ చక్రవర్తి కూడా ప్రాణాంతక వైరస్లు వచ్చినప్పుడల్లా ఇలా గబ్బిలాలే కారణమని భయపెట్టకుండా, శాస్త్రీయమైన ఆధారాలు కనుగొనే ప్రయత్నం చేయాలని సూచించారు. అయితే గబ్బిలాల ద్వారా 60 రకాల వైరస్లు వ్యాపిస్తాయని, అందులో నిపా, సార్స్ వంటి డజనకు పైగా వైరస్లు ప్రాణాంతకమైనవని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సీజన్లో కొన్ని రకాల గబ్బిలాలు మామిడి పళ్లు, పనస పండ్లు కొరికి పడేస్తాయని, అలా కొరికి పడేసిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఆందోళన వద్దు : కేంద్ర బృందం కేరళలో నిపా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) నేతృత్వంలోని కేంద్ర బృందం దీనికి స్థానిక పరిస్థితులే కారణమని అంటోంది. ప్రజలు భయాందోళనలకు గురి కావ్సలిన పనిలేదని చెబుతోంది. కేరళలోని ఒక ఇంట్లో బావిలో ఉన్న గబ్బిలాల నుంచే వైరస్ వ్యాప్తి చెందిందా లేదా అన్నది నిర్ధారించడానికి అక్కడ్నుంచి 60 రకాల శాంపిల్స్ సేకరించింది. ఈ శాంపిల్స్‌ను పరీక్షించే వరకు మరణాలకు కారణాలు వివరించలేమని చెబుతోంది. కేరళలో వైరస్‌కు గబ్బిలాలు కారణం కాకపోవచ్చునని అభిప్రాయపడుతోంది. కర్ణాటకకూ విస్తరించిన నిపా ? కేరళ సరిహద్దుల్ని దాటి నిపా వైరస్ కర్ణాటకకూ విస్తరించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ పర్యటనకు వెళ్లి తిరిగి స్వస్థలం మంగుళూరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిపా వ్యాధి లక్షణాలతో బాధపడడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిపై నిపా వైరస్ దాడి చేసిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావల్సి ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కేరళను వణికిస్తున్న ‘నిపా’ వైరస్
-
కేరళకు ‘నిపా’ దెబ్బ
కొజికోడ్: నిపా అనే అరుదైన వైరస్ కారణంగా కేరళలోని కొజికోడ్ జిల్లాలో గత పక్షం రోజుల్లో ముగ్గురు మరణించారు. ఈ వైరస్ సోకిన ఒకరికి ప్రస్తుతం చికిత్స అందిస్తుండగా, మరో 8 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అధిక జ్వరంతో మరో ఇద్దరు నర్సులు కూడా ఆసుపత్రిలో చేరారు. చనిపోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారే. నిపా వైరస్ కారణంగా మొదట మే 5న ఈ కుటుంబంలోని ఓ యువకుడు (23), మే 18న అతని అన్న (25), మే 19న ఆ కుటుంబంలోని 50 ఏళ్ల మహిళ మరణించారు. ఆ యువకుల తండ్రికి కూడా ఈ వ్యాధి సోకడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చికిత్స పొందుతున్న సమయంలో వారి బాగోగులు చూసుకున్న నర్సు లినీ కూడా సోమవారం మరణించారు. అయితే ఆమె కూడా నిపా వైరస్ సోకడం వల్లే చనిపోయారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అటు కొజికోడ్ పొరుగు జిల్లా మలప్పురంలోనూ నిపా వైరస్ సోకిన లక్షణాలతోనే ఐదుగురు చనిపోయారు. అయితే వీరికి కూడా కచ్చితంగా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. కొజికోడ్‌లో ముగ్గురు చనిపోయిన ఇంటిలోని బావిలో గబ్బిలం కనిపించడంతో ఆ బావిని మూసివేశామని అధికారులు తెలిపారు. కేరళలో హై అలర్ట్.. నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సీఎం పినరయి విజయన్ కేరళ అధికారులను అప్రమత్తం చేశారు. మరిన్ని ప్రాణాలు పోకుండా చూసేందుకు అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ కొజికోడ్ జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని శైలజ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా శైలజతో మాట్లాడి జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం నుంచి ఉన్నత స్థాయి వైద్యుల బృందాన్ని కొజికోడ్కు పంపారు. గబ్బిలాలను పట్టుకుంటున్న సిబ్బంది 1998లో తొలిసారి.. నిపా వైరస్‌ను తొలిసారిగా 1998లో గుర్తించారు. మలేసియాలోని కాంపుంగ్ సుంగై నిపా అనే ప్రాంతంలో ఈ వైరస్‌ను మొదట గుర్తించటంతో దానికి ఆ పేరు పెట్టారు. నిఫాలో ఇది పందుల ద్వారా వ్యాపించింది. ఈ సూక్ష్మక్రిమిని నిరోధించే వ్యాక్సిన్ లేదు. పండ్లు తినే గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తోంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందులకి దగ్గరగా మసలడం వల్ల, నిపా వ్యాధి ఉన్న పక్షులు, జంతువులు కొరికి వదిలేసిన పండ్లను తినడం, వైరస్ బారిన పడిన వ్యక్తులను నేరుగా తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినవారిలో సగటున 70 శాతం మంది వరకు మరణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిపా వైరస్ భారతదేశంలో తొలిసారిగా 2001 సంవత్సరంలో పశ్చిమబెంగాల్లోని సిలిగుడిలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 66 కేసులు నమోదైతే 45 మంది (68 శాతం) మరణించారు. ఆ తర్వాత 2007 సంవత్సరం పశ్చిమ బెంగాల్లోనే నాడియాలోనూ నిపా వైరస్ కనిపించింది. కేరళలో ఈ వైరస్‌ను గుర్తించడం ఇదే తొలిసారి. లక్షణాలు ఇవీ: నిపా వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు చూసినా నిద్రమత్తుగా ఉండడం, మానసికంగా గందరగోళానికి గురవడం కూడా ఈవ్యాధి లక్షణమే. ఒక్కోసారి ఈ మానసిక ఆందోళన మెదడువాపునకు కూడా దారితీస్తుంది. వైరస్ సోకిన అయిదు నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటకొస్తాయి. గబ్బిలాలున్న బావిని మూసేస్తున్న దృశ్యం – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పిజ్జా కట్టర్‌తో తల్లి, చెల్లి హత్య!
సాక్షి న్యూఢిల్లీ/గ్రేటర్ నోయిడా: చదువుకోవాలని మందలించినందుకు కన్న తల్లితో పాటు చెల్లిని ఓ బాలుడు క్రికెట్ బ్యాట్, పిజ్జా కట్టర్లతో పాటు కత్తెరలతో దారుణంగా హతమార్చాడు. గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీలో సోమవారం ఈ దారుణం జరిగింది. పోలీసులిచ్చిన వివరాల ప్రకారం.. ‘హైస్కూల్ గ్యాంగ్‌స్టర్ ఎస్కేప్’ అనే ఆన్లైన్ ఆటకు బానిసైన 15ఏళ్ల టీనేజర్ ఎక్కువసేపు మొబైల్‌తో గడిపేవాడు. దీంతో అతని తల్లి అంజలి(42) మందలించేది. సోమవారం రాత్రి మొబైల్ పక్కనబెట్టి చదువుకోమని తల్లి తిట్టింది. దీంతో అందరూ నిద్రపోయాక రాత్రి 11 గంటల సమయంలో తల్లి అంజలి, చెల్లి మణికర్ణిక(12)లను క్రికెట్ బ్యాట్‌తో కొట్టిచంపాడు. వారిద్దరి తలపై బ్యాట్‌తో బలంగా మోది ఆ తర్వాత పిజ్జా కట్టర్, కత్తెరలతో వారి ముఖాలను చెక్కేశాడు. తర్వాత ఇంట్లోని రూ.2 లక్షల నగదు, తల్లి మొబైల్‌తో పరారయ్యాడు. రైలులో చండీగఢ్, సిమ్లా చివరికి వారణాసికి వెళ్లాడు. తండ్రి అగర్వాల్ ఫోన్‌చేసినప్పటికీ ఎవ్వరూ స్పందించకపోవడంతో ఇంటికెళ్లి చూసిరావాలని బంధువులకు చెప్పాడు. ఇంటికొచ్చి చూసిన బంధువులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు శుక్రవారం బాలుడిని వారణాసిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సదరు బాలుడు తన నేరాన్ని అంగీకరించాడు. -
వైరల్: కొండచిలువ- గబ్బిలం కొట్లాట!
బ్రిస్బేన్: కొండచిలువ-గబ్బిలం మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భూమిమీద వెళ్లే జంతువులను గుర్తించి, వేగంగా వాటిపై దాడి చేసి బంధించి ఆహారంగా తీసుకునే కొండచిలువ నేలపై వాలని గబ్బిలాన్ని పట్టుకోవడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనను వీడియో తీసిన టోనీ మారిసన్ అనే వ్యక్తి నెట్టింట్లో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది. ఒక చెట్టుపైకి వెళ్లిన కొండచిలువ అక్కడ తల్లకిందులుగా వేలాడుతున్న గబ్బిలాన్ని పట్టేసుకుని చుట్టేసింది. దీంతో గబ్బిలం గింజుకుంది. మింగడానికి కొండచిలువ, ఒదిలించుకునేందుకు గబ్బిలం హోరాహోరీగా పోరాడాయి. సుమారు అరంగటపాటు సాగిన ఈ పోరాటంలో చివరకు విజయం గబ్బిలాన్ని వరించింది. ఆకలి మీద ఉన్న కొండచిలువకు గబ్బిలంతో పోరాడలేక విడిచి పెట్టింది. -
కొండచిలువ- గబ్బిలం కొట్లాట!
-
ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధం..
కింగ్స్టన్: భవిష్యత్తు గురించి ఆలోచించనని జట్టు యాజమాన్యం ఏ స్థానంలో ఆడమంటే ఆ స్థానంలో ఆడుతానని భారత క్రికెటర్ అజింక్యా రహానే స్పష్టం చేశాడు. విండీస్ టూర్ లో ఓపెనర్‌గా చెలరేగిన ఈ స్టైలీష్ క్రికెటర్ ఆదివారం జరిగే ఏకైక టీ20లో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే విండీస్ పర్యటన అనంతరం అజింక్యా రహానేకు జట్టులో స్థానంపై ఆందోళన నెలకొంది . గత చాంపియన్స్ ట్రోఫీలో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన రహానేకు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో అవకాశం లభించింది. అయితే ఈ సిరీస్ అనంతరం భారత్ శ్రీలంకతో 3టెస్టులు, 5 వన్డే, 2 టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. దీంతో జట్టులో స్థానం కోసం రహానేకు పోటి నెలకొంది. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన రహానే భవిష్యత్తు గురించి ఆలోచించనని, ప్రస్తుతం వన్డే, టీ20లపైనే దృష్టి పెట్టానని తెలిపాడు. ఓపెనర్‌గానే కాకుండా టీం మేనేజ్మెంట్ కోరితే నెం.4 , నెం.2, నెం.1 స్థానాల్లోనైనా ఆడటానికి సిద్ధమన్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదని, నా వంతుగా జట్టు విజయం కోసం వంద శాతం కృషి చేస్తానని తెలిపాడు. ఇక వన్డే, టీ20లో స్థిరంగా రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రహానే పేర్కొన్నాడు. గత వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి రాణించానని గుర్తు చేశాడు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసన్నాడు. ఇది పెద్ద సమస్యకాదని రహానే పేర్కొన్నాడు. విండీస్ పర్యటనపై స్పందిస్తూ.. ఈ సిరీస్ నాకు చాల ముఖ్యమైనది. చాలా రోజుల తర్వాత నాకు అవకాశం లభించింది. చాంపీయన్స్ ట్రోఫీలో నాకు అవకాశం లభించలేదు. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతావని విరాట్ చెప్పాడంతో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. బ్యాట్‌తో నాప్రతిభను చూపించాలని నిర్ణయించుకున్నాను. ఈ సిరీస్ మొత్తం బ్యాటింగ్ ఆస్వాదిస్తూ రాణించానని రహానే తెలిపాడు. టీ20 మ్యాచ్‌లో క్రిస్ గేల్ రాకపై స్పందిస్తూ ప్రత్యర్ధి జట్టులో గేల్ ఒకరే లేరు..11 మంది ఆటగాళ్లు ఉంటారు. మేము మా బలంపైనే దృష్టి పెట్టామని రహానే చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ లో రహానే ఒక సెంచరీ 3 అర్ధ సెంచరీలతో ఓపెనర్‌గా రాణించాడు. -
క్రిస్ గేల్ కు కోహ్లి బ్యాట్!
బెంగళూరు:భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి అత్యంత ఇష్టమైన బ్యాట్లలో ఒకదానిని వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కు విరాళంగా ఇచ్చాడు. యువతను క్రికెటర్లగా తీర్చిదిద్దే క్రమంలో గేల్ ఏర్పాటు చేసిన ఫౌండేషన్ కు సాయంలో భాగంగా కోహ్లి తన బ్యాట్ ను దానం చేశాడు. క్రికెట్ లో యువతకు మెరుగైన శిక్షణ కోసం గేల్ ఫౌండేషన్ నిర్వర్తిస్తున్నాడు. దీనికోసం కోహ్లి తన ఫేవరెట్ బ్యాట్లలో ఒకదానిని గేల్ కు అందించాడు. జూన్ 6 వ తేదీన లండన్ లో కోహ్లి బ్యాట్ ను వేలం వేయనున్నారు. కోహ్లి బ్యాట్ తో పాటు మరికొంత క్రీడాకారుల సామాగ్రిని సైతం వేలంలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గేల్ ఇచ్చే విందు కార్యక్రమానికి కోహ్లిని ఆహ్వానించాడు గేల్. -
భర్తలను బాదేందుకు బ్యాట్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యర్యంతో జరిగిన సామూహిక వివాహ మహోత్సవంలో 700 మంది పెళ్లి కూతుళ్లకు రాష్ట్ర సామాజిక న్యాయం, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి గోపాల్ భార్గవ ఓ వినూత్న బహుమతిని అందజేశారు. తాగివచ్చే భర్తలను, ముఖ్యంగా తాగొచ్చి హింసించే భర్తలను బాదేందుకు బట్టలుతికే బ్యాట్లను ఆయన బహూకరించారు. తాను మొత్తం పదివేల బ్యాట్లను తయారు చేయించానని చెప్పారు. ‘భర్తలు గృహహింసకు పాల్పడితే ఈ బ్యాట్లతో కొట్టండి. పోలీసులు ఇందులు జోక్యం చేసుకోవద్దు’ అన్న వ్యాఖ్యలు కూడా వాటిపై రాసి ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు తాగొచ్చి భార్యలను హింసించడం సర్వసాధారణమై పోయిందని, అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి బ్యాట్ల అవసరం ఎంతైనా ఉందని మంత్రి గోపాల్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గులాబీ గ్యాంగ్ ఆందోళన చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు. ఇటీవల వైన్ షాపులను మూసేయాలని డిమాండ్ చేస్తూ కొంత మంది మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకొని, బ్యాట్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. ఇక ముందు కూడా పెళ్లి కూతుళ్లకు ఈ బ్యాట్లను బహూకరించడం కొనసాగిస్తానని మంత్రి తెలిపారు. -
ప్రపంచ టొబాకో రంగంలో భారీ డీల్!
• బీఏటీ చేతికి రేనాల్డ్స్ అమెరికన్ • 49.4 బిలియన్ డాలర్ల ఒప్పందం లండన్: ప్రపంచ టొబాకో పరిశ్రమలో భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా దిగ్గజం రేనాల్డ్స్ అమెరికన్‌ను చేజిక్కించుకున్నట్లు బ్రిటిష్ అమెరికన్ టొబాకో(బీఏటీ) మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం 49.4 బిలియన్ డాలర్లను(దాదాపు రూ.3.35 లక్షల కోట్లు) వెచ్చించేందుకు అంగీకరించింది. ఈ డీల్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద లిస్టెడ్ టొబాకో(సిగరెట్లు ఇతరత్రా పొగాకు ఉత్పత్తులు) కంపెనీ ఆవిర్భవిస్తోందని బీఏటీ పేర్కొంది. నగదు, షేర్ల రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని తెలిపింది. గతంలో ఆఫర్ చేసిన 47 బిలియన్ డాలర్ల మొత్తాన్ని రేనాల్డ్స్ అమెరికన్ తిరస్కరించడంతో డీల్ విలువను బీఏటీ పెంచింది. తాజా డీల్ ప్రకారం రేనాల్డ్స్ వాటాదారులు తమ ఒక్కో షేరుకు 29.44 డాలర్ల నగదును, 0.5260 బ్యాట్ సాధారణ షేర్లను అందుకుంటారు. మొత్తంమీద ఈ ఆఫర్ కింద బీఏటీ 25 బిలియన్ డాలర్ల నగదు, 24.4 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను రేనాల్డ్స్ వాటాదారులకు ఇస్తోంది. దీంతో రేనాల్డ్స్ గ్రూప్ విలువ 85 బిలియన్ డాలర్లకు పైగానే లెక్కతేలుతోంది. ఏకమవుతున్న గ్లోబల్ బ్రాండ్స్... బీఏటీ, రేనాల్డ్స్ డీల్‌తో ప్రపంచవ్యాప్తంగా పేర్కొందిన టొబాకో బ్రాండ్లు ఒకే గూటికి చేరనున్నాయి. ఇందులో బ్యాట్ ఉత్పత్తులైన లక్కీ స్ట్రైక్, రోత్‌మన్స్, కెంట్... రేనాల్డ్స్ బ్రాండ్లు న్యూపోర్ట్, కేమెల్, పాల్మాల్ ఉన్నాయి. కొనుగోలు తర్వాత ఆవిర్భవించే కంపెనీకి అమెరికాలో పటిష్టమైన మార్కెట్‌తో పాటు భారీగా వృద్ధి అవకాశాలున్న దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలో గణనీయమైన మార్కెట్ అవకాశాలు లభించనున్నాయి. ‘‘రేనాల్డ్స్‌తో ఒప్పందం కుదరడం చాలా ఆనందంగా ఉంది. ఈ–సిగరెట్స్ లేదా వ్యాపింగ్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న కొత్త తరం ఉత్పత్తులకు సంబంధించి సిసలైన ప్రపంచ వ్యాపారాన్ని సృష్టించేందుకు ఈ డీల్ దోహదం చేస్తుంది’ అని బీఏటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నికాండ్రో డ్యురాంట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ వాటా ప్రకారం చూస్తే చైనా నేషనల్ టొబాకో కార్పొరేషన్ ప్రపంచంలో అతిపెద్ద సిగరెట్ ఉత్పత్తిదారుగా నిలుస్తోంది. తర్వాత స్థానంలో మాల్బ్రో బ్రాండ్ తయారీ కంపెనీ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ ఉంది. అయితే, రేనాల్డ్స్ కొనుగోలుతో నికర టర్నోవర్, నిర్వహణ లాభం పరంగా తమదే అతిపెద్ద లిస్టెడ్ టొబాకో కంపెనీగా ఆవిర్భవిస్తుందని బీఏటీ చెబుతోంది. -
'బ్యాట్ మందం అనేది సమస్యే కాదు'
లక్నో: ఇప్పటికే క్రికెటర్లు వాడే బ్యాట్ల మందంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిన వరల్డ్ క్రికెట్ కమిటీ మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పలు మార్గదర్శకత్వాలను సూచించగా, భారత్ లో బ్యాట్లను తయారు చేసేవారు మాత్రం ఆ సూచనలతో ఏకీభవించడం లేదు. బ్యాట్ల మందంపై నిబంధనల వల్ల ఉపయోగం ఉండదు. బ్యాట్ బ్యాలెన్స్ తో పాటు, ఆటగాళ్ల టాలెంట్ ఇక్కడ ముఖ్యం' అని ఎంతోమంది స్టార్ ఆటగాళ్లకు బ్యాట్లను తయారు చేసిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీడీఎమ్ ఫ్యాక్టరీ వర్కర్ జితేందర్ సింగ్ పేర్కొన్నాడు. క్రికెటర్ల సూచనమేరకు మందంగా ఉన్న బ్యాట్లను కానీ, పలుచని బ్లేడ్ తరహా బ్యాట్లను కానీ తాము తయారు చేస్తూ ఉంటామన్నాడు. ఆయా బ్యాట్లను బ్యాట్స్‌మెన్ ఎలా ఉపయోగించాలో ఆ క్రికెటర్ల నైపుణ్యంపై మాత్రమే ఆధారపడి వుంటుంది తప్ప బ్యాట్ తయారీపై కాదన్నాడు. గతనెల్లో క్రికెటర్ల వాడే బ్యాట్ల మందం పరిమితంగా ఉండాలంటూ ఎంసీసీ సూచించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లను సులువుగా కొట్టడానికి బ్యాట్ల మందం పెరగడం కూడా కారణమని ఎంసీసీ అభిప్రాయపడింది. -
క్రమశిక్షణ పేరుతో విద్యార్థిని చితక్కొట్టిన టీచర్
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
రాజ్‌కోట్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు రాజ్‌కోట్ వేదికగా తొలిమ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకొంది. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్ల(ఉమేష్ యాదవ్, షమి)తో బరిలోకి దిగింది. ఇషాంత్ శర్మకు తుది జట్టులో స్థానం దక్కలేదు. మ్యాచ్ ప్రారంభంలోనే ఇంగ్లండ్ ఓపెనర్ కుక్ అందించిన క్యాచ్‌ను భారత ఆటగాళ్లు రెండు సార్లు జారవిడిచారు. తొలి ఓవర్లో షమి బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన క్యాచ్‌ను రహానే వదిలేయగా.. రెండో ఓవర్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీ మరో క్యాచ్ జారవిడిచాడు. ఇంగ్లండ్ 12 ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా 42 పరుగులతో ఆడుతోంది. -
మూర్తిదేవికి ‘గబ్బిలాల’ స్వాగతం
తెలుగు సాహిత్యం నిద్రాణం నుంచి జాషువా రాకతో మేలుకున్నది. దాని వేలుపట్టి వెలుగులో నడిపించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్. నేటికి తెలుగు సాహి త్యాన్ని మెరుగులు దిద్దుతూ మరమ్మతు చేస్తున్న వారిలో ప్రథముడాయన. 78 ఏళ్ల ఇనాక్ ఆరు పదుల వర్తమాన సాహిత్య జీవన కవనమై చరిస్తూ, సజీవంగా చలిస్తూ 87 గ్రంథాల సృష్టికర్తగా వర్ధిల్లుతున్నారు. పట్టుకున్న ప్రతీ సాహిత్య ప్రక్రియను పండించటంలో ఎదురులేని కృషీ వలుడు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో వచ్చిన బహుళ సాహిత్య ప్రక్రియల్లో రచనను కొనసాగించి తెలుగు సాహిత్యానికి పరిపుష్టిని చేకూర్చి పరిపూర్ణం చేశారు. తెలుగు సాహిత్య రంగానికి పెద్ద దిక్కుగా గమనం చూపిస్తూ నడుస్తున్న చరిత్రగా ప్రయాణం చేస్తున్నారు. గ్రంథాల సంఖ్యల్లోనే కాకుండా వాటిలోని విలువల్ని కూడా సాధించాడు. సుదీర్ఘమైన, సువిశాలమైన, వైవిధ్య కథాభరిత విశిష్ట వ్యక్తిత్వ చిత్రీకరణల సముదాయం కొలకలూరి ఇనాక్ సాహిత్యం. సరిహద్దులతో బంధించలేనంత అనుబంధాలు పెంపొందించుకున్న పెద్ద మనిషి ఇనాక్. సాహిత్య కూడలి మధ్యన కూర్చుని ఏ దారిన ప్రయాణించాలో చాలామంది సాహితీకారులకు తోచనట్టి సందర్భాలు ఉంటున్న నేపథ్యంలో తాను మాత్రం కూడలి మధ్యనే సాహిత్య తపస్సు చేస్తూ అన్ని దారులను, వాటి పిల్లదా రులను కూడా పలకరించి పరిపాలిస్తాడు. పొందికగా బోధివృక్షమై మార్గాన్ని చూపెడతాడు. పతనం అంచున కూడా శిఖరం అధిరోహించడం ఎలాగో తెలిసిన విలక్షణ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్. ఆకలి మంటల కార్ఖానా ఆయన జీవితం. లోకం పోకడలో పడి హృదయం లేని మనిషిగా బ్రతకటానికి ఏనాడూ ఇష్టపడని తత్వం ఆయనది. వాదాల గాథల్లో పడి కొట్టుకుపోలేదు. తన జీవితగాథను తన వాదంగా బయలు పరిచాడు. సాహిత్య ముడి సరుకు అయిన మాదిగ తత్వపు చెలిమే సమస్త మానవతత్వ వాదాలకు మూలమని నిత్య నూతనంగా ఊరింప జేస్తున్న జాంబ వంతుడు. తాను సృష్టించిన సాహిత్యంలో తమ తమ వాదాలను వెతుక్కునేలా, వెతుక్కోకుండా ఉండలేనంత స్ఫూర్తిని, స్పృహను తన సాహిత్యంలో పొందుపరచిన విలుకాడు భుజంగరాయుడు. విమర్శ రాయకుండా ఉండలేక, రాస్తున్నప్పుడు ఏ విమర్శకుడు కూడా నటిం పునకు లోనవకుండా విమర్శ రాసే సాహిత్యాన్ని సృష్టించిన ఆచార్య కొలకలూరి ఇనాక్ కలం యొక్క కండరాల శక్తి భారతీయ సాహిత్యపు దిమ్మెలమీద జెండాను, ఎజెండాను ప్రకటింప జేసిన సాహిత్య ‘కల్న ల్’గా గౌరవం పొందారు. మునివర్గ, శిష్టవర్గ దృష్టికి ప్రత్యామ్నాయంగా జనుల విభిన్నత్వ దృష్టిలో నుండి సాహిత్యాన్ని రంగరిం చినా మునులు, శిష్టులు, జనులు జేజేలు పలుకుతున్న ఈ సాహిత్య తరువుని మూర్తిదేవి పురస్కారం వరించిన సందర్భంలో మాతాత ఆచార్య కొలకలూరి ఇనాక్‌కి శుభాకాంక్షలు తెలుపుకుంటూ.... (ఆచార్య కొలకలూరి ఇనాక్ని నేడు ‘మూర్తిదేవి’ అవార్డుతో సత్కరిస్తున్న సందర్భంగా) డప్పోల్ల రమేష్, వ్యవస్థాపక అధ్యక్షులు, బహుజనం సాంస్కృతిక వేదిక -
మెగాస్టార్‌కి బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన గేల్!
ముంబై: భారతీయ సినిమాకు అంతర్జాతీయంగా పెద్దగా ప్రాచుర్యం లేదని అనుకుంటాం కానీ, బ్యాటింగ్ సెన్సేషన్ క్రిస్ గేల్ ఈ విషయాన్ని తప్పని నిరూపించాడు. తన అభిమానంతో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను క్లీన్బోల్డ్ చేశాడు. భారతీయ సినిమాను ప్రపంచంలో పెద్దగా ఎవరు చూస్తారులే అనుకుంటున్న సమయంలో ఈ వెస్టిండిస్ క్రికెటర్ తనకు పెద్ద ఫ్యాన్ అని తెలియడం విస్మయంలో ముంచెత్తిందని బిగ్ బీ అమితాబ్ తెలిపారు. తన అభిమానానికి గుర్తుగా క్రిస్ గేల్ తన సంతకం చేసిన బ్యాటును కానుకగా ఇచ్చాడని, ఈ అభిమానం తనకెంతో ఆనందం కలిగించిందని ఉబ్బితబ్బిబ్బవుతూ బిగ్ బీ చెప్పారు. 'మిస్టర్ క్రిస్ గేల్. ఇది నిజంగా గొప్ప గౌరవం. నువ్వు నన్ను గుర్తుపట్టగలవని నేనెప్పుడూ అనుకోలేదు. నిజంగా ఎంతో ముగ్ధుడినయ్యాను. మేమంతా నీ వీరాభిమానులం. హిందీ సినిమాల అభిమాని క్రిస్ గేల్ తన సంతకంతో ఉన్న గోల్డెన్ బ్యాటును నాకు బహుమానంగా ఇచ్చాడు. ఇది నాకు దైవసందేశంతో సమానం' అని బిగ్ బీ ట్విట్టర్లో తెలిపారు. ఐపీఎల్లో వీరబాదుడు బాదే క్రిస్ గేల్ తనకు బాలీవుడ్ షెహన్షా అంటే ఎనలేని అభిమానమని ట్విట్టర్లో తెలిపాడు. 'లెజండ్ అమితాబ్ బచ్చన్‌కు నా స్పార్టన్ బ్యాటును బహుమానంగా ఇవ్వడం గర్వంగా ఉంది. ఆయన సినిమాలు, స్టైల్‌ను ఎంతోగానో అభిమానిస్తా. థాంక్యూ' అంటూ క్రిస్ గేల్ ట్వీట్ చేశాడు. ఇందుకు ప్రతిగా అమితాబ్ కూడా ట్విట్టర్లో స్పందించడంతో 'త్వరలోనే భారత్‌లో కలుద్దాం' అంటూ బిగ్ బీకి గేల్ మరో మెసేజ్ చేశాడు. -
బహుమతిగా సచిన్ బ్యాట్
న్యూఢిల్లీ:ఇటీవల ఇంటర్ స్కూల్ టోర్నీలో చెలరేగిపోయి వెయ్యికి పైగా పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనావాడేకు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి అరుదైన బహుమతి లభించింది. సచిన్ టెండూల్కర్ స్వహస్తాక్షరితో రాసిన బ్యాట్ ను ధనావాడేకు కానుకగా ఇచ్చాడు. ఈ విషయాన్ని తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. ధనావాడే రికార్డు సృష్టించిన మరుక్షణమే ముందుగా అతనికి అభినందనలు తెలిపిన సచిన్.. బ్యాట్ ను బహుమతిగా ఇచ్చి ఉన్నతిని చాటుకున్నాడని బీసీసీఐ తెలిపింది. గత రెండు రోజుల క్రితం ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే చరిత్రను సృష్టించి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణవ్.. 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో అజేయంగా 1009 పరుగులు చేసి క్రికెట్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉండగా ప్రణవ్ ను మహారాష్ట్ర మంత్రి ఏక నాథ్ షిండే ఒక బొకే ఇచ్చి సత్కరించారు. దీంతో పాటు ఒక క్రికెట్ కిట్ ను అతనికి బహుకరించారు. ఈ సందర్భంగా ఏక్ నాథ్ మాట్లాడుతూ.. ఆ 15 ఏళ్ల కుర్రాడు భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అధిరోహించాలంటూ ఆశీర్వదించారు. తమ ప్రభుత్వానికి సాధ్యమైన సహకారాన్ని ప్రణవ్ కు అందిస్తామని మంత్రి ఏక్నాథ్ మరోసారి ప్రభుత్వం తరపున హామి ఇచ్చారు. -
మోకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చొని..
-
మోకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చొని..
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. దొంగగా అనుమానించి ఓ యువకుడిని గొడ్డునిబాదినట్లు బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఫలితంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేయడంతోపాటు మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించి ఓ యువకుడిని ఎత్వాహ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచారణ గదికి తీసుకెళ్లి టేబుల్ పై పడుకోబెట్టి ఆ యువకుడి తలను కదలకుండా ఓ పోలీసు మొకాళ్లతో ఒత్తిపట్టి మెడపై కూర్చుని ఉంచగా.. మరోపోలీసు అతడి కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే ఓ దండనాయకుడి మాదిరిగా సివిల్ డ్రస్ లోఉండి బారెడు పొట్ట వేసుకున్న ఓ పోలీసు వచ్చాడు. చేతిలో బ్యాటులాంటిదానిని తీసుకున్నాడు. దానికి ఒక మందమైన రబ్బరు కూడా ఉంది. ఇక ఆ కుర్రాడు లబోదిబోమంటు కేకలు వేస్తున్నా దెబ్బమీదదెబ్బలతో ఫటాఫటా వాయించారు. ఆ వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనడం మాత్రం ఖాయం. -
జట్టు నుంచి వెళ్లాక బ్యాట్ ముట్టలేదు
రంజీ సీజన్‌కు ముందే ప్రాక్టీస్‌కు దిగా.. * ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో ఓసారి చోటు కోల్పోయాక ఏ క్రికెటర్ అయినా పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తూ కిందా మీదా పడుతుంటారు. అయితే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం ఈ విషయంలో బేఫికర్‌గా ఉన్నానంటున్నాడు. గత జూన్‌లో ఈ సౌరాష్ట్ర ఆటగాడు బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. అప్పటి నుంచి ప్రాక్టీస్ కాదు కదా కనీసం బ్యాట్‌ను కానీ బంతిని కానీ టచ్ చేయలేదంటున్నాడు. ఈ సమయమంతా పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యానని చెప్పాడు. తనకిష్టమైన గుర్రపు స్వారీతో పాటు స్నేహితులతో సరదాగా గడిపానని అన్నాడు. కేవలం రంజీ సీజన్‌కు ముందే ప్రాక్టీస్‌పై దృష్టి సారించానని, నిజానికి తన శరీరం విశ్రాంతి కోరుకుందని తెలిపాడు. ఈ సీజన్లో తను సౌరాష్ట్ర తరఫున ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. ‘బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయాను. అప్పుడు కొద్ది సమయం క్రికెట్‌కు దూరంగా ఉండాలనిపించింది. అందుకే ఆటకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కనీసం బ్యాట్, బంతిని కూడా పట్టుకోలేదు. క్రికెట్ బటన్‌ను స్విచాఫ్ చేసి ఇతర వ్యాపకాల్లో మునిగాను. ఫాంహౌస్‌లో గుర్రాలతోనూ, స్నేహితులతోనూ ఎక్కువ సమయం గడిపాను. రంజీ సీజన్‌కు నెల రోజుల ముందు ప్రాక్టీస్ ప్రారంభిస్తూ నా బలంపై దృష్టి పెట్టాలనుకున్నాను. కొన్ని జిల్లా స్థాయి మ్యాచ్‌లు కూడా ఆడాను. ఇలాంటి ప్రాక్టీస్‌తో సీజన్లో రాణించాను’ అని 26 ఏళ్ల జడేజా పేర్కొన్నాడు. -
గబ్బిలాలు రోజూ స్నానం చేస్తాయా?!
జంతు ప్రపంచం {పపంచం మొత్తంలో వెయ్యి రకాలకు పైగా గబ్బిలం జాతులు ఉన్నాయి. ‘ఫ్లయింగ్ ఫాక్స్’ జాతి గబ్బిలాలు అన్నిటికంటే పెద్దగా ఉంటాయి. వీటి రెక్కలు ఆరడుగుల పొడవు వరకూ పెరుగుతాయి. ‘బంబుల్ బీ’ జాతికి చెందినవి అతి చిన్న గబ్బిలాలు. ఇవి మనిషి బొటన వేలంత కూడా ఉండవు! ఎగిరే జీవుల్లో క్షీరదం ఏదైనా ఉందీ అంటే... అది గబ్బిలమే! ఇవి చాలా వేగంగా తింటాయి. గంటలో ఆరు వందలకు పైగా కీటకాలను, పన్నెండు వందలకు పైగా దోమలను ఆరగించేయగలవు. ఒక్కోసారి తమ శరీరపు బరువు కంటే ఎక్కువ బరువైన ఆహారాన్ని తినేసి కదలలేక ఇబ్బంది పడుతుంటాయి. అయితే వీటి జీర్ణశక్తి అద్భుతంగా, అత్యంత వేగంగా ఉండటం వల్ల సమస్య ఉండదు! గబ్బిలం పిల్లలను కొన్ని వేల గబ్బిలాల మధ్యలో వదిలేసినా వాటి తల్లి వాటిని గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి గబ్బిలం స్వరం వేర్వేరుగా ఉంటుంది. అందుకే పిల్లల అరుపును బట్టి తల్లులు తేలికగా గుర్తిస్తాయి! వ్యాంపైర్ జాతి గబ్బిలాలు రక్తం తాగి జీవిస్తాయని అంటారు. వీటిలో మూడు రకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇవి అమెరికాలోని కొన్ని జూలలో తప్ప మరెక్కడా కనిపించడం లేదు అంటారు జీవ శాస్త్రవేత్తలు! పశ్చిమ ఆఫ్రికాలో నివసించే ఒక రకమైన గబ్బిలాలు అతి చిన్నగా, సాలీళ్ల మాదిరిగా ఉంటాయి. సాలెగూళ్లలాంటి గూళ్లనే అల్లుకుని, వాటిలో జీవిస్తుంటాయి! గబ్బిలాలు మిగతా పక్షుల్లా నేలమీద నిలబడలేవు. అందుకే విశ్రాంతి తీసుకుంటున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, చివరకు పిల్లలను కనేటప్పుడు కూడా తలకిందులుగానే వేళ్లాడుతుంటాయి ఇవి పది నుంచి ఇరవయ్యేళ్లు జీవిస్తాయి. కొన్ని రకాలైతే ముప్ఫయ్యేళ్ల వరకూ కూడా జీవిస్తాయి! గబ్బిలాలు నివసించే చోట చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది కదా! అయితే అది అవి విసర్జించిన వ్యర్థాల వల్లే వస్తుంది. నిజానికి ఇవి ఎంతో శుభ్రంగా ఉంటాయి. ప్రతిరోజూ రెక్కలు విదిలించడం, వాటికీ వీటికీ రాసుకుని ఒంటికున్న దుమ్మును దులుపుకోవడం, నీటిలో తడిపి ఆరబెట్టుకోవడం వంటి వాటి ద్వారా తమ ఒంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటాయి తెలుసా?! చలికి ఇవి తాళలేవు. ఒక పరిమితి దాటి చలి పెరిగిందంటే వీటి గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కోసారి నిమిషానికి రెండుసార్లే కొట్టుకునే స్థితికి చేరుకుంటుంది. అది వీటికి ప్రమాదకర పరిస్థితి. అందుకే ఆ సమయంలో ఇవి వెచ్చదనం కోసం గుహల్లోనూ, భవంతుల్లోనూ దూరిపోయి, వెచ్చగా ఉన్నచోట దాగిపోతాయి తప్ప బయటకు రావు! -
బ్యాట్ల కోసం మీరట్ కు ధోని
మీరట్: గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియా సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం మీరట్ లో బ్యాట్లు సెలెక్టు చేసుకున్నాడు. ఆసీస్ బౌన్సీ పిచ్ లకు అనుకూలంగా ఉండే బ్యాట్లను అతడు ఎంపిక చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఐదు గంటల సమయం వెచ్చించాడు. 1260 గ్రాముల బరువుండే ఆరు బ్యాట్లను ధోని ఎంపిక చేసుకున్నాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బ్యాట్ ఆకారంతో పాటు స్ట్రోక్ పరిగణనలోకి తీసుకుని బ్యాట్లు సెలెక్ట్ చేసుకున్నాడని తెలిపాయి. ఆడిలైడ్ లో డిసెంబర్ 12 నుంచి జరిగే రెండో టెస్టులో ధోని ఆడనున్నాడు. -
ఇటు బల్లెం.. అటు బ్యాట్
ఒక చేత్తో బల్లెం.. మరో చేత్తో బ్యాట్.. ఏంటీ విచిత్రం? ఈ అడవి పుత్రులకు క్రికెట్ ఆటతో సంబంధమేంటి? అదేగా మీ ప్రశ్న.. వీళ్లు క్రికెటర్లు. వీరి టీం పేరు మాసాయ్ క్రికెట్ వారియర్స్. వీళ్ల టీం దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ట్వంటీట్వంటీ మ్యాచ్‌లూ ఆడింది. అదీ ఈ గెటప్‌లోనే.. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత వినూత్న టీంగా పేరు గాంచింది. అడవుల్లో బతికే వీరికి క్రికెట్ ఫీవర్ ఎప్పుడు పట్టుకుందంటే.. మనం ఆలియా గురించి చెప్పుకోవాలి. దక్షిణాఫ్రికాకు చెందిన ఈమె అడవి జంతువులపై పరిశోధన కోసం కెన్యాకు వచ్చారు. ఆమెకు క్రికెట్ అంటే తెగ పిచ్చి. ఇక్కడేమో చాన్స్ లేదు? మరేం చేయాలి. బ్యాట్, బాల్ తెప్పించి.. స్థానిక మాసాయ్ గిరిజనులకు క్రికెట్ నేర్పించారు. వాళ్లకూ నచ్చింది. కొన్నాళ్లకు ఓ క్రికెట్ టీంగా తయారయ్యారు.