విమానంలో గబ్బిలం.. పరుగులెత్తిన ప్రయాణికులు | There Was A Freaking Bat Flying Around Inside A Spirit Airlines Flight | Sakshi
Sakshi News home page

విమానంలో గబ్బిలం.. పరుగులెత్తిన ప్రయాణికులు

Published Sun, Aug 4 2019 9:28 AM | Last Updated on Wed, Mar 20 2024 5:22 PM

తాము ప్రయాణిస్తున్న విమానంలో గబ్బిలం కనిపించడం ప్రయణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన నార్త్‌ కరోలినా నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ఏడాది ఇలా జరగడం ఇది రెండోసారి అని.. మళ్లీ తాను స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేయబోనని సదురు వ్యక్తి పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

విమానంలో గబ్బిలాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అది తమపై ఎక్కడ వాలుతుందోనని భయపడ్డారు. దాదాపు 30 నిమిషాల సేపు అది విమానంలో అటు ఇటూ తిరుగుతూనే ఉంది. కొందరైతే భయంతో పరుగులు పెట్టారు. మరికొందరైతే గబ్బిలం బారిన పడకుండా ఉండటానికి వాష్‌రూమ్‌ల్లో దూరి లాక్‌ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement