వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్‌ చేసి.. | Watch Video, Chinese Woman Eating Bat At Restaurant | Sakshi
Sakshi News home page

వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్‌ చేసి..

Jan 26 2020 12:50 PM | Updated on Mar 21 2024 7:59 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్‌కు ‘కరోనా’ అని పేరు పెట్టారు కదా.. ఈ చైనా అమ్మాయికి ‘ధైర్యం’ అని పేరు పెట్టాలి. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌.. పాలిచ్చే పక్షుల వల్ల, ఒక రకం పాముల వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టి చెప్పాక కూడా.. ఈ యువతి రెస్టారెంట్‌లో కూర్చొని.. చక్కగా వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్‌ చేసి, ఆరగిస్తోంది. గబ్బిలం పాలిచ్చే పక్షి అయితే నాకేంటి! నా నాలుకకు రుచినిచ్చే పక్షి అవునా కాదా అన్నదే పాయింట్‌ అన్నట్లు.. చాప్‌స్టిక్స్‌తో కొద్ది కొద్దిగా పీస్‌లు చేసుకుని తన జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement