china women
-
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఎర్ర తేళ్లేనా?
కరోనా మహమ్మారికి చైనాలోనే మూలాలున్నాయని.. చైనా ప్రజల అడ్డమైన ఆహారపు అలవాట్ల వల్లనే కరోనా వ్యాధికి మూలమని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. పాముల నుంచి మొదలు తేళ్లు, గబ్బిలాలు, పిల్లులు, కుక్కలు.. ఇలా ఒకటా రెండా భూమిపై ఉండే ప్రతి జీవినీ చైనీయులు లాగించేస్తారు. కొన్నింటిని ఉడికించి, మరికొన్నింటినైతే పచ్చిగా ఆ జీవి ప్రాణాలతో ఉండగానే కరకరమని నమిలేస్తారు. దీని వల్లనే కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయని చైనాపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో తన ఇంటి టెర్రస్‌పై ఏకంగా తేళ్లను సాగు చేస్తున్న వీడియో ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. సాధారణంగా ఇంట్లో కోళ్లను, కుక్కలను పెంచుతున్నట్లు ఆ యువతి తన ఇంటిపై ఎర్ర తేళ్లను పెంచుతోంది. ఒకటో రెండో ఉంటే ఒకవేళ సరదా కోసం అనుకుంటాం. కానీ తన ఇంటి టెర్రస్‌పై వేల సంఖ్యలో తేళ్లు సాగవుతున్నాయి. ఈ తేళ్ల సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోపై.. చైనీయులు మరో కొత్త వైరస్‌కు పునాది వేస్తున్నారని కొందరు, ఎందుకు చైనీయులు అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఇవి తేళ్లేనా? అని ఇంకొంత మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nature | Travel | animal (@naturelovers_ok) ఈ వీడియోను చూసిన నెటిజెన్లు నోరెళ్లబెడుతున్నారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుంటే మరో కొత్త వ్యాధి తప్పదని అభిప్రాయపడుతున్నారు. కరోనా మళ్లీ విరుచుకుపడే అవకాశముందని వాపోతున్నారు. తాజాగా వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న యువతి చైనాకు చెందినదిగా ఇంకా ధృవీకరణ కాలేదు. తను చైనా యువతి అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కానీ చాలా మంది నెటిజన్లు మాత్రం తను ఖచ్చితంగా చైనా యువతే అని అభిప్రాయపడున్నారు. ఇలాంటి పనులు చైనాలో కాకుంటే ఇంకెక్కడ జరుగుతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి ఆహారపు అలవాట్లతో ప్రపంచం ఇంకెన్ని భయంకరమైన కొత్త వ్యాధులను చూడాల్సి వస్తుందోనని సోషల్ మీడియా వేదికగా విమర్షిస్తున్నారు. -
సనత్‌నగర్‌లో చైనా యువతుల కలకలం
సనత్‌నగర్: లాక్డౌన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ పోలీసు చెక్ పోస్ట్ వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు యువతులను సనత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో చైనా దేశానికి చెందిన ఇద్దరు యువతులు, నాగాలాండ్‌కు చెందిన ఓ యువతి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం వారిని క్వారంటైన్ కు పంపనున్నట్లు తెలిపారు. -
వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్ చేసి..
-
వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్ చేసి..
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా వైరస్‌కు ‘కరోనా’ అని పేరు పెట్టారు కదా.. ఈ చైనా అమ్మాయికి ‘ధైర్యం’ అని పేరు పెట్టాలి. ప్రాణాంతకమైన కరోనా వైరస్.. పాలిచ్చే పక్షుల వల్ల, ఒక రకం పాముల వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టి చెప్పాక కూడా.. ఈ యువతి రెస్టారెంట్లో కూర్చొని.. చక్కగా వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్ చేసి, ఆరగిస్తోంది. గబ్బిలం పాలిచ్చే పక్షి అయితే నాకేంటి! నా నాలుకకు రుచినిచ్చే పక్షి అవునా కాదా అన్నదే పాయింట్ అన్నట్లు.. చాప్‌స్టిక్స్‌తో కొద్ది కొద్దిగా పీస్‌లు చేసుకుని తన జిహ్వ చాపల్యాన్ని సంతృప్తిపరుస్తోంది. (కరోనా వైరస్ తీవ్రతరం) కరోనా వైరస్ సోకి చైనాలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మధ్య చైనాలోని ఉహాన్ ప్రాంతంలో ఇటీవలే బయట పడిన కరోనా వైరస్... లగేజ్ భుజాన వేసుకుని ప్రపంచ దేశాలలో పర్యటించేందుకు బయల్దేరినట్లే కనిపిస్తోంది. యు.ఎస్.లో ఒక కేసు బయటపడింది. మన కేర ళలో కూడా ఒక నర్సుకు కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవేమీ ఈ అమ్మాయికి పట్టినట్లు లేదు. (చైనాలో కరోనా కల్లోలం) చదవండి:భయంతో వణుకుతున్నారు.. అందుకే ఇలా..! -
మొబైల్ చూస్తూ కాలు పోగొట్టుకుంది!
-
అరెరె.. ఇదెలా సాధ్యం?!
పుర్రెకోబుద్ధి.. జిహ్వకో రుచి అనే నానుడి సరిగ్గా ఇటువంటి వాళ్లకు సరిపోతుంది. ఇక్కడ ఫొటోలో మీరు చూస్తున్న ఈ హెయిర్ స్టయిల్‌కు ఓ చరిత్ర ఉందండోయ్. చిత్రంలోని అమ్మాయిది చైనా. అప్పుడెప్పుడో 2015లో హాలీవుడ్ హీరోయిన్ కెండాల్ జెన్నర్ హెయిర్ స్టైల్ కన్నా భిన్నంగా ఉండాలన్న లక్ష్యంతో ఇలా డిజైన్ చేయించుకుంది. ప్రస్తుతం ఈ హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అప్పట్లో కెండాల్ జెన్నర్ ఫొటోకు 3.6 మిలియన్ లైక్స్.. అద్భుతమైన కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం చైనా భామ హెయిర్ స్టైల్ కు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతటి క్లిష్లమైన డిజైన్‌ను ఎలా రూపొందించారు? సహజత్వానికి అత్యంత దగ్గరగా ఉండేలా హెయిర్ స్టైల్ ను డిజైన్ చేయడానికి ఎంత సమయం పట్టిందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ అమ్మాయి హెయిర్ స్టైల్ వీడియోను చైనా డెయిలీ బుధవారం పోస్ట్ చేసింది. ఇప్పటివరకూ ఈ వీడియోను 6.5 మిలియన్ల మంది చూశారని.. చైనా డెయిలీ చెబుతోంది. ❥ A post shared by Kendall (@kendalljenner) on May 25, 2015 at 3:51pm PDT -
‘మోదీ గారూ.. మా సోదరిని వెతికించండి’
బీజింగ్: త్వరలో చైనా పర్యటించనున్న ప్రధాని మోదీ... అక్కడే ఉన్న తన సోదరిని వెతికించాలని చెన్నై మహిళ జెన్నిఫర్ యాన్ కోరారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం తన తండ్రి అన్ చి పాంగ్ కుటుంబంలో మిగిలిన ఏకైక మహిళ, తన సవతి సోదరి యాన్ రోసెయ్ను ఆచూకీ కనుగొనాలని ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. మోదీ గతంలో నేపాల్ పర్యటనలో.. నేపాలీ బాలుడిని తల్లిదండ్రులతో కలపడం తెలిసిందే. తనకూ అలాంటి సాయం అందుతుందని భావించిన జెన్నిఫర్.. తన సోదరిని వెదికేందుకు భర్తతో కలసి చైనా వచ్చారు. చైనీస్ మెరైన్ ఇంజనీర్ అన్ చి పాంగ్ తొలి భార్య కుమార్తె యాన్ రోసెయ్. చైనాలోని నాంజింగ్ నగరంలో స్థిరపడిన అతని కుటుంబం మొదటి భార్య, ఆరుగురి పిల్లలతో సహా బాంబు దాడిలోనో, జపాన్ సైన్యం ఊచకోతలోనో మరణించారు. తర్వాత పాంగ్ చెన్నై చేరుకుని ఇరెనా పెరీరా అనే మహిళను వివాహమాడారు. వీరికి జెన్నిఫర్‌తో సహా నలుగురు పిల్లలు పుట్టారు.