అరెరె.. ఇదెలా సాధ్యం?! | how she is doing | Sakshi
Sakshi News home page

అరెరె.. ఇదెలా సాధ్యం?!

Published Thu, Oct 12 2017 5:27 PM | Last Updated on Sat, Oct 14 2017 7:21 PM

how she is doing

పుర్రెకోబుద్ధి.. జిహ్వకో రుచి అనే నానుడి సరిగ్గా ఇటువంటి వాళ్లకు సరిపోతుంది. ఇక్కడ ఫొటోలో మీరు చూస్తున్న ఈ హెయిర్‌ స్టయిల్‌కు ఓ చరిత్ర ఉందండోయ్‌. చిత్రంలోని అమ్మాయిది చైనా. అప్పుడెప్పుడో 2015లో హాలీవుడ్‌ హీరోయిన్‌ కెండాల్‌ జెన్నర్‌ హెయిర్‌ స్టైల్‌ కన్నా భిన్నంగా ఉండాలన్న లక్ష్యంతో ఇలా డిజైన్‌ చేయించుకుంది. ప్రస్తుతం ఈ హెయిర్‌ స్టైల్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అప్పట్లో కెండాల్‌ జెన్నర్‌ ఫొటోకు 3.6 మిలియన్‌ లైక్స్‌.. అద్భుతమైన కామెంట్స్‌ వచ్చాయి.

ప్రస్తుతం చైనా భామ హెయిర్‌ స్టైల్‌ కు సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతటి క్లిష్లమైన డిజైన్‌ను ఎలా రూపొందించారు? సహజత్వానికి అత్యంత దగ్గరగా ఉండేలా హెయిర్‌ స్టైల్‌ ను డిజైన్‌ చేయడాని​కి ఎంత సమయం పట్టిందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ అమ్మాయి హెయిర్‌ స్టైల్‌ వీడియోను చైనా డెయిలీ బుధవారం పోస్ట్‌ చేసింది. ఇప్పటివరకూ ఈ వీడియోను 6.5 మిలియన్ల మంది చూశారని.. చైనా డెయిలీ చెబుతోంది.

A post shared by Kendall (@kendalljenner) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement