kendall jenner
-
అరెరె.. ఇదెలా సాధ్యం?!
పుర్రెకోబుద్ధి.. జిహ్వకో రుచి అనే నానుడి సరిగ్గా ఇటువంటి వాళ్లకు సరిపోతుంది. ఇక్కడ ఫొటోలో మీరు చూస్తున్న ఈ హెయిర్ స్టయిల్‌కు ఓ చరిత్ర ఉందండోయ్. చిత్రంలోని అమ్మాయిది చైనా. అప్పుడెప్పుడో 2015లో హాలీవుడ్ హీరోయిన్ కెండాల్ జెన్నర్ హెయిర్ స్టైల్ కన్నా భిన్నంగా ఉండాలన్న లక్ష్యంతో ఇలా డిజైన్ చేయించుకుంది. ప్రస్తుతం ఈ హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అప్పట్లో కెండాల్ జెన్నర్ ఫొటోకు 3.6 మిలియన్ లైక్స్.. అద్భుతమైన కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం చైనా భామ హెయిర్ స్టైల్ కు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతటి క్లిష్లమైన డిజైన్‌ను ఎలా రూపొందించారు? సహజత్వానికి అత్యంత దగ్గరగా ఉండేలా హెయిర్ స్టైల్ ను డిజైన్ చేయడానికి ఎంత సమయం పట్టిందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ అమ్మాయి హెయిర్ స్టైల్ వీడియోను చైనా డెయిలీ బుధవారం పోస్ట్ చేసింది. ఇప్పటివరకూ ఈ వీడియోను 6.5 మిలియన్ల మంది చూశారని.. చైనా డెయిలీ చెబుతోంది. ❥ A post shared by Kendall (@kendalljenner) on May 25, 2015 at 3:51pm PDT -
వివాదాస్పద యాడ్‌పై స్పందించిన కెందాల్
సాక్షి, వాషింగ్టన్: సూపర్ మోడల్, నటి కెందాల్ జెన్నర్ ఎట్టకేలకు వివాదాస్పద యాడ్ పై నోరు విప్పింది. ఈ యేడాది మొదట్లో ఆమె చేసిన ఓ డ్రింక్ యాడ్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ఆ యాడ్ చేసి చాలా పెద్ద తప్పు చేశా. విమర్శల నేపథ్యంలో మానసికంగా కుంగిపోయా. నా జీవితం ముగిసిందనే భావించా. కానీ, పరిస్థితి ఇప్పుడు సర్దుమణిగింది. మళ్లీ మాములు జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యా అని 21 ఏళ్ల కెందాల్ చెబుతున్నారు. ప్రముఖ శీతలపానీయ సంస్థ పెప్సీ రూపొందించిన యాడ్ లో కెందాల్ నటించింది. అయితే నల్లజాతి ఉద్యమాన్ని కించపరిచేలా ఉందంటూ ఆ సమయంలో విమర్శలు వినిపించాయి. దీంతో క్షమాపణలు తెలియజేసిన పెప్సీ సంస్థ ఆ యాడ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కెందాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ ద్వారా యాడ్ పై స్పందించింది. యాడ్ విషయానికొస్తే.. బ్లాక్ లైవ్స్ పేరిట కొందరు ఆందోళనకారులు ర్యాలీ చేస్తుండగా, అక్కడున్న పోలీసులు అడ్డుకుంటారు. పక్కనే ఫోటో షూట్ చేస్తున్న కెందాల్ ఇది గమనించి పెప్సీ టిన్లను ఇచ్చి పోలీసులను ఛిల్ చేస్తుంది. అయితే సామాజిక పోరాటాన్ని అవహేళన చేశారంటూ రాజకీయ విమర్శలు ఎదురుకాగా, తప్పు చేశావంటూ కెందాల్ సోదరి కిమ్ కర్దాషియన్ కూడా అభిప్రాయపడ్డారు. -
హీరో ఇంటిని సొంతం చేసుకున్న మోడల్
రియాల్టీ స్టార్, మోడల్ కెండల్ జెన్నర్ ఓ హాలీవుడ్ హీరో ఇంటిని సొంతం చేసుకుంది. నటుడు జాన్ క్రాసిన్స్కీ విలాసవంతమైన తన ఇంటిని 8 మిలియన్ల అమెరికా డాలర్లకు విక్రయిస్తానని ఇటీవల ప్రకటన ఇచ్చాడు. అయితే కొన్ని రోజులపాటు ఎవరూ ఇంటిని కొనడంపై ఆసక్తి చూపలేదు. దీంతో ఇంటి ధరపై కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అమెరికన్ సూపర్ మోడల్ కెండల్ జెన్నర్ ఆ లగ్జరీ ఇంటిని 6.5 మిలియన్ల అమెరికా డాలర్లకు కొనుగోలు చేసింది. రెండు రోజుల కిందట జాన్ క్రాసిన్స్కీ, ఎమిలీ బ్లంట్స్ తో మాట్లాడి ఈ ఇరవైఏళ్ల మోడల్ చివరికి ఆ ధరకు ఇంటిని చేజిక్కించుకుంది. ఆరు విలాసవంతమైన బెడ్రూమ్స్, విశాలమైన హాల్స్, ఐదు బాత్రూమ్స్ ఉన్నాయి. ఈ ఫేమస్ హోటల్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్లు జెన్నర్ తెలిపింది. రెండు రోజుల కిందట ఈ ఇంటిని కొనుగోలు చేసిన విషయాన్ని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మోడల్ జెన్నర్ కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఇల్లు మాత్రమే కాదు ఇది ఆమె సొంతం చేసుకున్న రెండో ఇల్లు. గతంలో 2014లో డబుల్ బెడ్రూమ్స్ ఇల్లును 1.39 మిలియన్ల అమెరికా డాలర్లకు ఆమె కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తన నూతన ఇంటి వద్ద సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేయవచ్చని, చుట్టూ కొండలు, గుట్టలతో ఆ ప్రాంతం తనకెంతో నచ్చిందని అంటోంది. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. -
బీబర్ ..నిన్ను నువ్వే సరిదిద్దుకో:ఉషర్
లాస్ ఏంజిల్స్: టీనేజి పాప్ సంచలనం జస్టిస్ బీబర్ చేసిన స్వీయ తప్పిదాలనుంచి ఇకనైనా గుణపాఠం నేర్చుకోవాలని అమెరికన్ సింగర్ ఉషర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పలు వివాదాల్లో చిక్కుకున్న బీబర్ జరిగిన పరిణామాలపై అవగాహన పెంచుకుని, వాటిని చక్కదిద్దుకునేందుకు యత్నించాలని సూచించాడు. పదమూడేళ్లకే పాప్ సింగర్ గా కెరీర్ ను ఆరంభించిన బీబర్ సమస్యలకు అతనే కారణమన్నాడు. కనీసం వాటినుంచి బయటకు రావడానికి బీబర్ యత్నించడం లేదన్నాడు. ఇకనైనా వాటిని అధిగమించాలని ఉషర్ హితవు చేశాడు. 'బీబర్ చేసిన స్వీయ తప్పల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అతను ఇంకా చిన్నవాడే. నా నుంచి బీబర్ ఏమైనా సలహాలు అడిగితే తప్పక సహాయం అందిస్తానని' 35 ఏళ్ల ఉషర్ తెలిపాడు. -
కెండల్ జెన్నర్‌తో జస్టిన్ బీబర్ డేటింగ్?
ఓ బేబీ.. బేబీ అంటూ చిన్న వయసులోనే తారాపథానికి ఎదిగిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇప్పుడు కెండల్ జెన్నర్ అనే అమ్మడితో డేటింగ్ చేస్తున్నాడట. వీళ్లిద్దరూ కలిసి ఓ డిన్నర్‌కు వెళ్లి హాయిగా ఆస్వాదిస్తూ తింటూ అందరికీ కనిపించడంతో ఈ కథనాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన మన్హట్టన్లో కెండల్ స్నేహితుడు హైలీ బాల్డ్విన్తో పాటు వీళ్లిద్దరూ కలిసి డిన్నర్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు వీరి డిన్నర్ పార్టీ సాగిందని యూఎస్మాగజైన్.కామ్ తెలిపింది. భోజనం ముగిసిన తర్వాత ముందుగా బీబర్ అక్కడినుంచి వెళ్లిపోతే.. కాసేపటి తర్వాత మిగిలిన ఇద్దరూ వెళ్లారట. బీబర్ అప్పుడప్పుడు తిరిగే సెలెనా గోమెజ్‌తో అతడికి ఇప్పుడు చెడిపోయిందని చెబుతున్నారు. జెన్నర్, ఆమె చెల్లెలు కైలీ జెన్నర్ ఇద్దరూ కలిసి జస్టిన్ బీబర్, అతడి బృందంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారని, తెగ వాగుతున్నారని ఇటీవల సెలెనా చెప్పింది. దీన్ని బట్టి కూడా జస్టిన్ బీబర్ ఇప్పుడు కొత్త స్నేహితురాలిని వెతుక్కుని ఆమెతో డేటింగ్‌కు వెళ్తున్నాడని అంటున్నారు.