హీరో ఇంటిని సొంతం చేసుకున్న మోడల్ | an American fashion model Kendall Jenner buys Emily Blunt's home | Sakshi
Sakshi News home page

హీరో ఇంటిని సొంతం చేసుకున్న మోడల్

Published Fri, Jul 1 2016 10:41 PM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

an American fashion model Kendall Jenner buys Emily Blunt's home

రియాల్టీ స్టార్, మోడల్ కెండల్ జెన్నర్ ఓ హాలీవుడ్ హీరో ఇంటిని సొంతం చేసుకుంది. నటుడు జాన్ క్రాసిన్స్కీ విలాసవంతమైన తన ఇంటిని 8 మిలియన్ల అమెరికా డాలర్లకు విక్రయిస్తానని ఇటీవల ప్రకటన ఇచ్చాడు. అయితే కొన్ని రోజులపాటు ఎవరూ ఇంటిని కొనడంపై ఆసక్తి చూపలేదు. దీంతో ఇంటి ధరపై కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అమెరికన్ సూపర్ మోడల్ కెండల్ జెన్నర్ ఆ లగ్జరీ ఇంటిని 6.5 మిలియన్ల అమెరికా డాలర్లకు కొనుగోలు చేసింది. రెండు రోజుల కిందట జాన్ క్రాసిన్స్కీ, ఎమిలీ బ్లంట్స్ తో మాట్లాడి ఈ ఇరవైఏళ్ల మోడల్ చివరికి ఆ ధరకు ఇంటిని చేజిక్కించుకుంది. ఆరు విలాసవంతమైన బెడ్రూమ్స్, విశాలమైన హాల్స్, ఐదు బాత్రూమ్స్ ఉన్నాయి.

ఈ ఫేమస్ హోటల్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్లు జెన్నర్ తెలిపింది. రెండు రోజుల కిందట ఈ ఇంటిని కొనుగోలు చేసిన విషయాన్ని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మోడల్ జెన్నర్ కొనుగోలు చేసిన  అత్యంత ఖరీదైన ఇల్లు మాత్రమే కాదు ఇది ఆమె సొంతం చేసుకున్న రెండో ఇల్లు. గతంలో 2014లో డబుల్ బెడ్రూమ్స్ ఇల్లును 1.39 మిలియన్ల అమెరికా డాలర్లకు ఆమె కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తన నూతన ఇంటి వద్ద సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేయవచ్చని, చుట్టూ కొండలు, గుట్టలతో ఆ ప్రాంతం తనకెంతో నచ్చిందని అంటోంది. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement