luxurious home
-
భారత్‌లో ఖరీదైన నివాసాలు వీరివే!.. జాబితాలో ఫస్ట్ ఎవరంటే?
ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, వీరిలో దాదాపు అందరూ.. విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, ఖరీదైన బంగ్లాలు, వాహనాలు కలిగి ఉన్నారు. అయితే అత్యంత విలాసవంతమైన లేదా ఖరీదైన నివాసాలను కలిగి ఉన్న.. కుబేరులు ఎవరు? వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం..ముఖేష్ అంబానీభారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసాన్ని కలిగి ఉన్నారు. ముంబైలో ఉన్న 27 అంతస్తుల నివాసం (ఆంటిలియా) విలువ దాదాపు రూ. 15,000 కోట్లు. ఇది కాకుండా దుబాయ్‌లోని పామ్ జుమేరాలో బంగ్లా, యూకేలోని బకింగ్‌హామ్‌షైర్ ఎస్టేట్, మాన్‌హట్టన్‌లో లగ్జరీ హోటల్ (న్యూయార్క్) వంటివి ఉన్నాయి.పంకజ్ ఓస్వాల్2023లో స్విట్జర్లాండ్‌లోని జింగిన్స్లో.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటైన 'వరి విల్లా' (Vari Villa)ను కొనుగోలు చేశారు. 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణ కళాఖండాన్ని ఒబెరాయ్ ఉదయవిలాస్, ది లీలా హోటల్స్ వంటి వాటికి ప్రసిద్ధి చెందిన జెఫ్రీ విల్కేస్ రూపొందించారు. దీని ధర రూ. 1,650 కోట్లు.లక్ష్మీ మిట్టల్ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన.. లక్ష్మీ మిట్టల్ లండన్‌లో 'బిలియనీర్స్ రో'లో రెండు విలాసవంతమైన భవనాలను కలిగి ఉన్నారు. వీటి విలువ రూ. 2,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా.. ఢిల్లీలో కూడా రూ. 31 కోట్ల ఖరీదైన బంగ్లా కలిగి ఉన్నారు. రియల్ ఎస్టేట్ కాకుండా.. క్వీన్స్ పార్క్ రేంజర్స్ అనే ఫుట్‌బాల్ క్లబ్‌కు యజమానిగా ఉన్నారు.అదార్ పూనవాలాసీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనవల్లా' 2023 చివరిలో లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలోని అబెర్కాన్వే హౌస్‌ను సుమారు రూ. 1,444 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఒకప్పుడు డొమినికా కుల్జిక్ యాజమాన్యంలో ఉండేది.హిందూజా బ్రదర్స్హిందూజా సోదరులు ప్రకాష్, అశోక్, శ్రీచంద్, గోపీచంద్.. కార్ల్టన్ హౌస్ టెర్రస్ అనే విలాసవంతమైన ఆరు అంతస్తుల విలాసవంతమైన ప్యాలెస్ కలిగి ఉన్నారు. ఇది లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ దగ్గర ఉంది. దీనిని 2006లో కొనుగోలు చేశారు. ఇది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భవనాలలో ఒకటిగా ఉంది.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?రవి రుయాఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు 'రవి రుయా' 2023లో లండన్‌లోని హనోవర్ లాడ్జ్‌ను సుమారు రూ. 1,200 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది కూడా అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాలలో ఒకటిగా ఉంది. -
లగ్జరీ ఇంట్లో పార్టీ ఇచ్చిన ఇషా అంబానీ.. వీడియో, ఫొటోలు వైరల్!
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఫ్యాషన్ పరంగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. అంబానీ కుటుంబంలోని ఇతర సభ్యుల్లాగే ఇషా అంబానీ కూడా చాలాగా హుందా ఉంటుంది. సాంప్రదాయ మూలాలను ఇష్టపడుతుంది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) ఇషా అంబానీ తన ఆనంద్ పిరమల్‌తో కలిసి ఉంటున్న తమ విలాసవంతమైన ఇంట్లో శుక్రవారం (ఏప్రిల్ 14) టుస్కానీ థీమ్‌తో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఇషా అంబానీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్ర తీరానికి దగ్గరలో వీరి లగ్జరీ నివాసం పేరు కరుణ సింధు. (నిలిచిపోయిన నెట్‌ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్) ఈ పార్టీలో ఇషా అంబానీ ధరించిన పొడువాటి ఎరుపు రంగు గౌన్ అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇషా పెద్దగా మేకప్ లేకుండా సహజంగా కనిపించింది. ఇషా వేసుకున్న రెడ్ హ్యూడ్ అవుట్‌ఫిట్ షాప్ డోన్ అనే లేబుల్ నుంచి వచ్చింది. View this post on Instagram A post shared by Isha Ambani Piramal✨ (@_ishaambanipiramal) -
హీరో ఇంటిని సొంతం చేసుకున్న మోడల్
రియాల్టీ స్టార్, మోడల్ కెండల్ జెన్నర్ ఓ హాలీవుడ్ హీరో ఇంటిని సొంతం చేసుకుంది. నటుడు జాన్ క్రాసిన్స్కీ విలాసవంతమైన తన ఇంటిని 8 మిలియన్ల అమెరికా డాలర్లకు విక్రయిస్తానని ఇటీవల ప్రకటన ఇచ్చాడు. అయితే కొన్ని రోజులపాటు ఎవరూ ఇంటిని కొనడంపై ఆసక్తి చూపలేదు. దీంతో ఇంటి ధరపై కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అమెరికన్ సూపర్ మోడల్ కెండల్ జెన్నర్ ఆ లగ్జరీ ఇంటిని 6.5 మిలియన్ల అమెరికా డాలర్లకు కొనుగోలు చేసింది. రెండు రోజుల కిందట జాన్ క్రాసిన్స్కీ, ఎమిలీ బ్లంట్స్ తో మాట్లాడి ఈ ఇరవైఏళ్ల మోడల్ చివరికి ఆ ధరకు ఇంటిని చేజిక్కించుకుంది. ఆరు విలాసవంతమైన బెడ్రూమ్స్, విశాలమైన హాల్స్, ఐదు బాత్రూమ్స్ ఉన్నాయి. ఈ ఫేమస్ హోటల్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్లు జెన్నర్ తెలిపింది. రెండు రోజుల కిందట ఈ ఇంటిని కొనుగోలు చేసిన విషయాన్ని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మోడల్ జెన్నర్ కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఇల్లు మాత్రమే కాదు ఇది ఆమె సొంతం చేసుకున్న రెండో ఇల్లు. గతంలో 2014లో డబుల్ బెడ్రూమ్స్ ఇల్లును 1.39 మిలియన్ల అమెరికా డాలర్లకు ఆమె కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తన నూతన ఇంటి వద్ద సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేయవచ్చని, చుట్టూ కొండలు, గుట్టలతో ఆ ప్రాంతం తనకెంతో నచ్చిందని అంటోంది. దీంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.