
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఫ్యాషన్ పరంగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. అంబానీ కుటుంబంలోని ఇతర సభ్యుల్లాగే ఇషా అంబానీ కూడా చాలాగా హుందా ఉంటుంది. సాంప్రదాయ మూలాలను ఇష్టపడుతుంది.
(Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?)
ఇషా అంబానీ తన ఆనంద్ పిరమల్‌తో కలిసి ఉంటున్న తమ విలాసవంతమైన ఇంట్లో శుక్రవారం (ఏప్రిల్ 14) టుస్కానీ థీమ్‌తో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఇషా అంబానీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్ర తీరానికి దగ్గరలో వీరి లగ్జరీ నివాసం పేరు కరుణ సింధు.
(నిలిచిపోయిన నెట్‌ఫ్లిక్స్.. సబ్‌స్క్రయిబర్ల పరేషాన్)
ఈ పార్టీలో ఇషా అంబానీ ధరించిన పొడువాటి ఎరుపు రంగు గౌన్ అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇషా పెద్దగా మేకప్ లేకుండా సహజంగా కనిపించింది. ఇషా వేసుకున్న రెడ్ హ్యూడ్ అవుట్‌ఫిట్ షాప్ డోన్ అనే లేబుల్ నుంచి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment