dinner
-
Valentines Day : లవ్ బర్డ్స్కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!
ప్రేమికుల దినోత్సవం లేదా వాలెంటైన్స్ డే (Valentine's Day) ప్రేమికులకు తమ ప్రేమను వ్యక్తీకరించు కోవడానికి, చిరస్మరణీయమైన అనుభవాన్ని పొందడానికి సరైన సమయం. ఫిబ్రవరి వస్తుందంటేనే వాలెంటైన్స్ డే కోసం ఎదురు చూస్తుంటారు ప్రేమికులందరూ. తమ లవర్‌ను సర్ప్రైజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలుచేస్తుంటారు. మరికొందరు పార్ట్నర్కు రొమాంటిక్ అనుభవాన్ని అందించాలని ఉవ్విళ్లూరుతారు. అలాంటి వారికి దుబాయ్ (Dubai) బెస్ట్ డెస్టినేషన్అని చెప్పవచ్చు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న దుబాయ్‌లోని వాలెంటైన్స్ డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఆకర్షణీయమైన స్కైలైన్ భవనాలు బీచ్‌లు, లగ్జరీ స్పా రిట్రీట్స్, విలాసవంతైన రెస్టారెంట్లు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, ప్రైవేట్ యాచ్ క్రూయిజ్ ట్రిప్‌లు చక్కటి భోజనం..ఇలా అనేక రకాల వసతులతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇవి రొమాంటిక్ ఫీలింగ్‌ను అందిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం.షాంగ్రి-లా దుబాయ్ (Shangri-La Dubai)షాంగ్రి-లా దుబాయ్‌లో అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఐకానిక్ హోటల్ విలాసవంతమైన వసతి సౌకర్యాలు, రొమాంటిక్ డిన్నర్లు లాంటి అద్భుతమైన భోజన సదుపాయాలు ఉంటాయి. బుర్జ్ ఖలీఫా , డౌన్‌టౌన్ దుబాయ్ స్కైలైన్ అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌లో లెవల్ 42 “ప్రైవేట్ డైనింగ్ అబౌవ్ ది క్లౌడ్స్”లో ఉన్న జంటలకు స్పెషల్ అనుభవాన్ని అందిస్తుంది.పలాజ్జో వెర్సేస్ దుబాయ్ (Palazzo Versace Dubai)పాపులర్ జద్దాఫ్ వాటర్‌ఫ్రంట్ మధ్యలో ఉన్న, పలాజ్జో వెర్సేస్ దుబాయ్ ప్రేమికులకు వెచ్చని ఆహ్వానం పలుకుతుంది. లవ్‌బర్డ్స్‌ను మంత్రముగ్ధులనుచేస్తూ శాశ్వతమైన ప్రేమను ప్రసరింపజేస్తుంది. కేక్ ట్రాలీ ఉత్కంఠభరితమైన రొమాంటిక్, సూర్యోదయాలు, సిగ్నేచర్ హై టీ అనుభవంతోపాటు, మెస్మరైజింగ్ వాతావరణంలో సొగసైన గియార్డినో సెట్స్, అద్భుతమైన మ్యూజిక్, ,గమ్మత్తైన వాలెంటైన్స్ విందునిస్తుంది.రిక్సోస్ ప్రీమియం సాదియత్ ద్వీపం (Rixos Premium Saadiyat Island)తెల్లని ఇసుక మధ్య ప్రేమికులు సేదదీరడం అంటే సాదియత్ ద్వీపం ప్రత్యేకమైన స్వర్గధామం అన్నట్టే. విలాసవంతమౌన వసతి సౌకర్యాలు, కొలనులతో కూడిన ఏకాంత ప్రైవేట్ విల్లాలు , అంజనా స్పాలు, టర్కిష్ విందును ఆస్వాదించవచ్చు . లేదంటే క్యాండిల్స్ లైట్స్ వెలుగుల్లో బీచ్‌సైడ్ భోజనాన్ని ఆస్వాదించవచ్చు. దీనికి జతగా అమేజింగ్ మ్యూజిక్, సముద్రతీర అందాలు ఉండనేఉంటాయి. జేడబ్ల్యూ మారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్ (JW Marriott Marquis Hotel Dubai)జేడబ్ల్యూమారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్‌లో రొమాంటిక్ అనుభవాన్ని అందించడంలో ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది. దీని మూడు సిగ్నేచర్ రెస్టారెంట్లలో ఒకదానిలో వాలెంటైన్స్ డేను జరుపుకోవచ్చు, ప్రతీదీ ఒక్కో విలక్షణమైన ప్రపంచ పాక అనుభవాన్ని అందిస్తుంది. దుబాయ్ ఉత్కంఠభరితమైన దృశ్యాలను తనవితీరా ఆస్వాదించవచ్చు. ఇది చిరస్మరణీయమైన సాయంత్రం కోసం సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.దుబాయ్ క్రీక్ రిసార్ట్ (Dubai Creek Resort)జంటలకు కలలు కనే అనుభవాలతో దుబాయ్ క్రీక్ రిసార్ట్‌లో ఏకంగా నెలరోజులపాటు వాలెంటైన్ డేను జరుపుకోవచ్చు. అమరా స్పాలో సన్నిహిత స్పా రిట్రీట్లు, బోర్డ్‌వాక్ వద్ద సుందరమైన వాటర్‌ఫ్రంట్ బ్రంచ్‌లు , పార్క్ హయత్ దుబాయ్‌లో శృంగార బసలను ఆస్వాదించండి. పూల్ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నా లేదా క్యాండిల్‌లైట్ డిన్నర్ అయినా ప్రతీ క్షణం ప్రేమ కోసంమే అన్నట్టు ఎంజాయ్ చేయవచ్చు.అద్భుతమైన నగర దృశ్యాల నుండి ప్రశాంతమైన సముద్ర తీరప్రాంత విహారయాత్రల వరకు, దుబాయ్‌లో వాలెంటైన్స్ డేని జరుపుకోవడానికి చక్కటి అవకాశం. కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినా ప్రేమను ప్రకటించాలన్నా, భాగస్వామితో ప్రశాంతంగా సమయాన్ని గడపాలన్నా దుబాయ్ ఈజ్ ది బెస్ట్. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే.ఇదీ చదవండి: మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో -
అల్లుళ్లకు108 రుచులతో విందు
సంగారెడ్డి: సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లకు 108 రకాల వంటలతో విందును ఏర్పాటు చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా శాంతినగర్ మాజీ సర్పంచ్ మంగ రాములు నివాసంలో ఈ విందును ఘనంగా నిర్వహించారు. ఇటీవల మంగరాములు రెండవ కుమార్తె డాక్టర్ నిషాకు డాక్టర్ శ్రీకాంత్‌తో వివాహం జరిపించారు. అలాగే, సినీ నటుడు ఏడిద రాజా కుమార్తె మేఘన వివాహాన్ని లక్ష్మణ్ యాదవ్‌తో జరిపారు. ఈ రెండు కొత్త జంటలను విందుకుఅహ్వనించారు. ఈ సందర్భంగా 108 వంటకాలను తయారు చేసి వారికి వడ్డించారు. -
హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధపెడుతోంది. ముఖ్యంగా జాకీ భగ్నాన్తో పెళ్లి తరువాత జంటగా అనేక ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ సోషల్ మీడియాలో అనేక వర్కౌట్ వీడియోలుపోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ పోడ్కాస్టర్ , యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన వివరణాత్మక డైట్ ప్లాన్ గురించి వివరించింది.రకుల్ ప్రీత్ సింగ్ డైట్ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగుతుందిట. ఆ తరువాత దాల్చినచెక్క నీరు లేదా పసుపు నీటిని తీసుకుంటుందట. ఆపై నానబెట్టిన బాదం గింజలు ఐదు, వాల్నట్ తీసుకుంటుందట. ఆ తరువాత ఘీ కాఫీ తాగుతానని చెప్పుకొచ్చింది రకుల్. వర్కవుట్ పూర్తి చేసిన తరువాత అల్పాహారం మాత్రం భారీగా తీసుకుంటుందట. ముఖ్యంగా ప్రోటీన్ స్మూతీలోగా పోహా (అటుకులు) లేదా మొలకలు లేదా గుడ్లని తీసుకుంటుందట. తన డైట్ గురించి రకుల్ ఇంకా ఇలా వివరించింది. భోజనం సాధారణంగా అన్నం లేదా జొన్న రొట్టె, కూర ,చేపలు లేదా చికెన్ వంటి కొన్ని రకాల ప్రోటీన్లు, సాయంత్రం 4:35 గంటలకు స్నాక్స్‌గా ప్రోటీన్ చియా సీడ్స్ పుడ్డింగ్, పండు, పెరుగు, పీనట్ బటర్ వంటివి తీసుకుంటుందట. డిన్నర్‌ను ఏడు గంటలకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని కూడా తెలిపింది. అది కూడా మధ్యాహ్నం తినే దాని కంటే కాస్త తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా డిన్నర్‌ను ప్లాన్ చేసుకుంటుంది. -
కాబోయే భర్తతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన పీవీ సింధు... ఫొటోలు చూశారా?
-
అటవీశాఖ కార్యాలయంలో దావత్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఉద్యోగులు దావత్ ఏర్పాటు చేసుకున్నారు. మీడియా అక్కడికి చేరుకోవడంతో కొంత మంది ఉద్యోగులు అక్కడి నుంచి జారుకోగా మరికొంత మంది అక్కడే ఉంటూ నానా హంగామా సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులే మందుతాగుతూ విందు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ను వివరణ కోరగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. dinner -
చిన్నారులతో పానీపూరీ తిన్న రాహుల్ గాంధీ
శ్రీనగర్‌ను సందర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక రెస్టారెంట్లో చిన్నారులతో పాటు పానీ పూరీ తిన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ హోటల్ అహ్దూస్లో విందు ఆరగించారు. అలాగే చిన్నారులతో పాటు పానీ పూరీ తిన్నారు.శ్రీనగర్‌లోని వ్యూ రెసిడెన్సీ రోడ్ ప్రాంతంలో రాహుల్ గాంధీ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. ఆయన బసచేసిన హోటల్ చుట్టూ పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఈ హోటల్లో రాహుల్ గాంధీ ఎవరికి కలుసుకున్నారనేది వెల్లడికాలేదు. थोड़ी पानी-पूरी.. थोड़ी Chit-Chat और ढेर सारा प्यार pic.twitter.com/TvBqFdVDIo— Congress (@INCIndia) August 21, 2024కాగా రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్ పర్యటనను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆయనకు పలు సవాళ్లు విసిరింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏపై రాహుల్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని తెలుసుకునేందుకు రాహుల్‌కు అవకాశం ఏర్పడిందని బీజెపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. కాంగ్రెస్ కొన్ని దశాబ్దాల పాటు జమ్ము కశ్మీర్లో వేర్పాటువాదం, ఉగ్రవాద వాతావరణానికి ఆజ్యం పోశాయని ఆరోపించారు. అయితే 2014లో కేంద్రంలో బీజెపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మారిపోయాయన్నారు.#WATCH | Jammu & Kashmir | Lok Sabha LoP & Congress MP Rahul Gandhi along with Congress national president Mallikarjun Kharge visits an ice cream parlour at Srinagar's Lal Chowk.Both the Congress leaders arrived in Srinagar, J&K, earlier today. They will meet party leaders and… pic.twitter.com/vIDkbY9FLw— ANI (@ANI) August 21, 2024 -
రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఇన్ని లాభాలా..!
పూర్వం నుంచి రాత్రి భోజనం తర్వాత నాలుగు అడుగులు వేయండి అని మన పెద్దలు తరుచుగా చెబుతుంటారు. భోజనం అయ్యిన వెంటనే పడక మీద వాలిపోవద్దని అంటుంటారు. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు, ఆరోగ్య నిపుణులు కూడా ఈ విషయమే చెబుతుంటారు కూడా. అసలు దీని వల్ల ఏం జరుగుతుంది? కలిగే ప్రయోజనాలు ఏంటంటే..భారతీయ సంప్రదాయంలో ఈ విధానాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు కొందరూ. రాత్రి భోజనం అయ్యిన వెంటేనే కాసేపు ఆరు బయట అలా కబుర్లు చెప్పుకుంటూ నడవడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేద శాస్త్రంలో మంచి ఆరోగ్యానికి పాటించాల్సిన సూత్రాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. రాత్రి భోజనం తర్వాత కనీసం ఓ అరగంట నడిస్తే చాలని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. ఇలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటంటే..రాత్రి భోజనం తర్వాత ఓ 30 నిమిషాల పాటు నడిస్తే మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా ప్రోత్సహిస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని నివారించి అజీర్ణాన్ని దరి చేరనియ్యదు. ఇది ప్రేగుల ఆరోగ్యానికి మంచిది కూడా. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ స్పైక్‌లను నిరోధించడంలో ఉపయోగపడుతుంది. ఇలా నడవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పైగా తేలికపాటి వ్యాయామం శరీరానికి అంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. ఇలా నడవడం వల్ల శరీరం మంచి పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. ఈ నడక వల్ల కుటుంబ సభ్యులతో గడిపే ఒక చక్కటి అవకాశం కూడా దొరుకుతుంది. ఒకరకంగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చాలామంది వైద్యులు డిన్నర్ తర్వాత నడక గణనీయమైన ప్రయోజనాలనను పొందగలరని నొక్కి చెబుతున్నారు. ఉదయం వాకింగ్ ఎముకల ఆరోగ్యానికి మంచిదైతే సాయంత్రం భోజనం తర్వాత కొద్దిపాటి నడక జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదే సమయంలో అలాంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులుచేయకూడనవి ఏంటంటే..అసౌకర్యం లేదా అజీర్తి రాకూడదంటే భారగీ భోజనం చేసినట్లయితే వెంటనే నడవకూదు. కనీసం 15 నుంచి 30 నిమిషాలు విరామం ఇచ్చి నడిస్తే మంచిది. వేగంగా కూడా నడవకూడదు. ఇది తిమ్మిర్లు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. డిన్నర్ తర్వాత నడిస్తే కొందరికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటివాళ్లు ఉదయం, సాయంత్రాల్లో నడిచేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే తేలిక పాటి నడకే మంచిది. ఏదో కేలరీలు బర్న్ అవ్వాలి అన్నంతగా ఆ సమయంలో నడవకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.(చదవండి: ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!) -
అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ వేడుకలో రెండు పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలను ప్రధానం చేశారు. తదనంతరం ఆ గ్రహితలందరికి హోం మంత్రి అమిత్ షా నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఎలాంటి వంటకాలు వడ్డించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో చూద్దామా..!ఈ డిన్నర్లో స్వచ్ఛమైన శాకాహార భోజనాన్ని కంచుప్లేట్లలో సర్వ్ చేయడం విశేషం. ఈ విందులో అమిత్ షాకు ఎంతో ఇష్టమైన గుజరాతీ వంటకాలను అతిథులకు సర్వ్ చేశారు. వాటిలో సెవ్‌తో ఉండే పోహా, దోక్లా ఖాండ్వీ, హరేభరే కబాబ్, కేసరి బాత్, మష్రూమ్ కబాబ్, వెజ్ బిర్యానీ, వంటి వంటకాలు ఉన్నాయి. ఇందులో సర్వ్ చేసిన గుజరాతీ వంటకం దోక్లాను బేసిన్ పిండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సూజి, పెరుగు, పసుపు, ఉప్పు, పంచాదర మిశ్రమాలతో తయారు చేస్తారు. మరోవైపు కూరగాయాలతో చేసిన హరే భరే కబాబ్ నోరూరిస్తుండగా..పక్కనే పచ్చి కూరగాయాలు, మొలకెత్తిన పప్పు ధాన్యాలను రోస్టెడ్, మసాలాల కలయికతో చేసిన సలాడ్ కాంబినేషన్ అదిరిపోయింది. ఆ తర్వాత అప్పటి వరకు హాట్ ఐటెమ్స్‌తో స్పైసీగా ఉన్న నోటిని తియ్యగా చేసేలా అన్నం పంచాదర, నెయ్యి, డ్రైఫ్రూట్లతో చేసిన కేసరి భాత్ ఆహుతులకు ఆహ్లాదకరమైన రుచిని అందజేసింది. ఇక ఈ డిన్నర్లో సర్వ్ చేసిన వెజ్ బిరియానీ వివిధ రకాల కూరగాయలతో ఘుమాళించే వాసనతో ఆవురావురమని తినేలా హైలెట్‌గా నిలిచింది. Home Minister @AmitShah ji hosted a dinner for all those extraordinary individuals who have been duly honoured with the #PadmaAwards. PM @narendramodi Ji has honored the unsung heroes of our society who have made tremendous contributions at the ground level. https://t.co/Ddhu5JVRLT pic.twitter.com/RViztp9txH— Kiren Rijiju (मोदी का परिवार) (@KirenRijiju) May 9, 2024ఇక చివరిగా వడ్డించిన ఖాండ్వీ కూడా గుజరాతీ సుప్రసిద్ధ వంటకమే. దీన్ని సెనగపిండి పెరుగు మసాలా దినుసుల కలయికతో తయారు చేస్తారు. ఈ ప్రత్యేక విందులో పాల్గొన్న అతిథులంతా గుజరాతి ప్రసిద్ధ వంటకాలను ఎంజాయ్ చేశారు. కాగా ఈ డిన్నర్ పార్టీకి ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, అవార్డు గ్రహీతలు హాజరయ్యారు. ఈ అతిథుల జాబితాలో మెగా కుటుంబం ప్యామిలితో సహా విచ్చేసి సందడి చేసింది. వీరంతా అమిత్ షాతో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. Union Home Minister #AmitShah hosts dinner for Padma awardees at his residence....DR.MEGASTAR'S #Chiranjeevi and #RamCharan attend the Dinner along with his Family ❤🔥🤩🤩#PadmaVibhushanChiranjeevi 👑🦁 pic.twitter.com/BHVehp6MXg— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) May 9, 2024 -
వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత
క్రిస్మస్ సందర్భంగా ఓ విమానయాన సంస్థ తమ ఉద్యోగులను ఖుషీ చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ అట్లాంటిక్ కంపెనీ తవ వద్ద పనిచేసే వారికి పసందైన విందు ఇవ్వాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే గ్రాండ్‌గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే క్రిస్మిస్ డిన్నర్ ప్లాన్ బెడిసి కొట్టింది. భోజనం చేసిన ఉద్యోగుల్లో దాదాపు 700 మందికి అస్వస్థతకు గురయ్యారు. డిన్నర్ చేసిన తర్వాత ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే డిన్నర్‌కు ఇచ్చిన మెనూలో ఏయే వంటకాలు ఉన్నాయన్న విషయం తెలియరాలేదు. అంతేగాక భారీ సంఖ్యలో ఉద్యోగుల అనారోగ్యానికి గురవడం వెనక ఉన్న నిర్ధిష్ట కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎయిర్‌బస్ సంస్థ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రపంచంలోని అతిపెద్ద విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు చెందిన అనుబంధ సంస్థే ఎయిర్‌బస్ అట్లాంటిక్. ఆ సంస్థ కింద అయిదు దేశాల్లో సుమారు 15,000 మంది పనిచేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు ఏఆర్తెఎస్లి ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎయిర్‌బస్ సంస్థలో సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్, డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ పరిశ్రమలు ఆ కంపెనీ పరిధిలో ఉన్నాయి. చదవండి: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే.. -
కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని తన నివాసంలో ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. డెహ్రాడూన్‌లోని సీఎం నివాసం వద్ద పటాకులు పేల్చారు. అనంతరం సీఎం ఆ కార్మికుల కుటుంబాలను సన్మానించారు. ఈ వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. దీపావళి రోజున జరిగిన ఈ ప్రమాదంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబాలవారు దీపావళి జరుపుకోలేదు. అందుకే డెహ్రాడూన్‌లోని సీఎం నివాసంలో వారంతా ఇప్పుడు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రెస్క్యూ తర్వాత చిన్యాలిసాన్ సీహెచ్‌సీలో చేరిన కార్మికులకు సీఎం ధామి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లోనూ అయోధ్య.. ఇక్కడి రాజే రాముని అవతారం! #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami and family members of the 41 workers have dinner together at his residence in Dehradun during 'Igas Bagwal' celebrations. pic.twitter.com/MUzO60jlRG — ANI (@ANI) November 29, 2023 -
ఆ ఊళ్లో వందేళ్లకు పైగా జీవిస్తున్నారు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. పూర్వకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక విధానాలను పాటించేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే అనేక రోగాల బారిన పడుతున్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ ఆశ్చర్యకరంగా ఎక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు. ఈ కోవలోకే వస్తుంది ఇటలీలోని అబ్రుజోలో ఉన్న ఎల్'అక్విలా అనే ప్రాంతం. ఇక్కడి ప్రజలు వందేళ్లకు పైగా జీవిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇంత ఆరోగ్యంగా ఉండటానికి వీళ్లు ఏం చేస్తున్నారు? ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నారు అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటలీలోని ఎల్'అక్విలా ప్రాంతానికి చెందిన ప్రజలు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటారని రీసెర్చ్‌లో తేలింది. ఇక్కడి ప్రజల ఆయుష్షు ఎక్కువ ఉండటానికి ప్రధాన కారణం వాళ్ల ఆహార నియమాలని తేలింది. వీళ్లు ముఖ్యంగా రాత్రి భోజనాన్ని 7గంటల లోపలే ముగిస్తారని, దీనివల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్‌లోని రీసెర్చ్‌లో వెల్లడైంది. రాత్రి భోజనం నుంచి మరుసటి రోజు భోజనం చేసే సమయం సుమారు 17.5 గంటల పాటు వ్యవధి ఉండేలా పక్కాగా పాటిస్తారట.ప్రాసెస్ చేసిన మాంసం, స్వీట్లకు ఎల్'అక్విలా ప్రజలు దూరంగా ఉంటారట. వీళ్లు తీసుకునే ఆహారంలో తక్కువ కెలరీలు ఉండేలా చూసుకుంటారని, దీనివల్ల దీర్ఘాయువు పెరుగుతుందని అధ్యయనంలొ వెల్లడైంది. రాత్రి త్వరగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు త్వరగా భోజనం చేయడం వల్ల శరీరంలో మెటాబాలిజం పెరుగుతుంది రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల జీర్ణ క్రియ రేటు కూడా పెరుగుతుంది. బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. త్వరగా తినడం వల్ల మంచిగా నిద్రపడుతుంది. రాత్రి త్వరగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది త్వరగా భోజనం చేయడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా పనిచేస్తుంది -
‘టైటానిక్’ ఆఖరి డిన్నర్ మెనూ వేలం.. ఎంత పలికిందో తెలుసా?
Titanic Dinner Menu: టైటానిక్ ఓడ గురించి దాదాపుగా అందరికీ తెలుసు. సుమారు 110 ఏళ్ల క్రితం మంచుకొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయిందీ భారీ ఓడ. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయారు. ఈ ఓడ ప్రమాద ఉదంతం గురించి పాతికేళ్ల క్రితమే హాలీవుడ్లో ఓ సినిమా సైతం వచ్చింది. అది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తెలిసిందే. ఆఖరి విందు టైటానిక్ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూను ఇంగ్లండ్‌లో శనివారం (నవంబర్11) వేలం వేయగా 83,000 పౌండ్లు (రూ. 84.5 లక్షలు) పలికినట్లు యూకేకి చెందిన వార్తాపత్రిక ‘ది గార్డియన్’ పేర్కొంది. టైటానిక్ ఓడలో ఫస్ట్-క్లాస్ ప్రయాణికుల కోసం తయారు చేసిన ఆఖరి విందు ఇది. ఈ ఓడ తన తొలి అట్లాంటిక్ సముద్రయానంలో 1912 ఏప్రిల్ 14న మంచుకొండను ఢీకొట్టి మునిగిపోవడానికి కేవలం మూడు రోజుల ముందు నాటిది. ఈ చారిత్రక మెనూ ఐర్లాండ్‌లోని క్వీన్స్టౌన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన టైటానిక్ మరుసటి రోజు ప్రయాణికులకు అందించిన వంటకాల గురించి తెలియజేస్తోంది. విల్ట్‌షైర్‌కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్ అనే సంస్థ ఈ మెనూను వేలం వేసింది. రకరకాల వంటకాలు వేలానికి వచ్చిన టైటానిక్ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూలో వివిధ దేశాలకు చెందిన రకరకాల వంటకాలు ఉన్నాయి. ఆప్రికాట్లు, ఫ్రెంచ్ ఐస్‌క్రీమ్ వంటి డెసర్ట్లతోపాటు ఆయిస్టర్లు, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, బాతు, చికెన్ వంటి నాన్‌వెజ్ రుచులతో పాటు నోరూరించే వెజిటేరియన్ వంటరాలు ఇందులో ఉన్నాయి. ఈ మెనూ నీటిలో తడిసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
వివేక్‌తో విందుకు ఫీజు 50 వేల డాలర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి మాట్లాడుకుంటూ విందారగించాలనుకుంటున్నారా? అలాగైతే సుమారు రూ.42 లక్షలు చెల్లిస్తే చాలు..! సిలికాన్ వ్యాలీకి చెందిన పలు బడా సంస్థలు కొన్ని వివేక్కి ఎన్నికల ప్రచార నిధులను సేకరించి పెట్టేందుకు ఈ నెల 29వ తేదీన విందు ఏర్పాటు చేశాయి. ఇందులో వివేక్‌తోపాటు పాల్గొనాలనుకునే వారు చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని రూ.41.47 లక్షలు (50 వేల డాలర్లు)గా ఖరారు చేశారు. విందు ద్వారా మొత్తం 10 లక్షల డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఇన్వెస్టర్, సోషల్ కేపిటల్ సంస్థ సీఈవో చమత్ నివాసంలో ఈ విందు జరగనుంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో అగ్రస్థానంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో వివేక్ రామస్వామి నిలిచిన విషయం తెలిసిందే. -
450 మంది పోలీసులకు ప్రధాని విందు
ఢిల్లీ: భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశం G20 Summit.. సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇవ్వనున్నారు. ఈ వారంలోనే.. అదీ జీ20 సమ్మిట్ జరిగిన భారత్ మండపంలోనే ఈ విందు కార్యక్రమం ఉండనుందని సమాచారం. ఈ మేరకు కానిస్టేబుల్స్ నుంచి ఇన్స్పెక్టర్ల దాకా.. సదస్సు సమయంలో విధి నిర్వహణ అద్భుతంగా నిర్వహించిన సిబ్బంది జాబితాను ఢిల్లీ కమిషనర్ సంజయ్ అరోరా సిద్ధం చేస్తున్నారు. వాళ్లతో కలిసి అరోరా, ప్రధాని మోదీ ఇచ్చే డిన్నర్లో పాల్గొంటారు. దాదాపు 40 దేశాల అధినేతలు పాల్గొన్న ఈ కీలక సదస్సును అత్యంత పటిష్టమైన భద్రత నడుమ విజయవంతంగా నిర్వహించింది భారత్. హైలెవల్ సెక్యూరిటీ నడుమ ఉండే ప్రముఖుల సంరక్షణ అనే అత్యంత కష్టతరమైన బాధ్యతను.. మరీ ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు సమర్థవంతంగా నిర్వహించడంపై అభినందనలు కురుస్తున్నాయి. ప్రధాని మోదీ ఇలా క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాన్ని గుర్తించడం కొత్తేం కాదు. గతంలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంలో.. నిర్మాణ కూలీలను ఆయన సత్కరించారు. -
G20 Summit 2023: అంబానీ, అదానీలకు అందని ఆహ్వానం.. ఏం జరిగింది?
భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8న ఏర్పాటు చేసిన డిన్నర్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మంది ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ డిన్నర్‌కు భారత్‌కు చెందిన బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరు కానున్నారని, వీరిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రముఖంగా ఉన్నారని ఆయా వార్తా కథనాల్లో పేర్కొన్నారు. అయితే జీ20 డిన్నర్‌కు వ్యాపారవేత్తలకు ఆహ్వానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయా వార్తల్లో నిజం లేదని, ఈ డిన్నర్‌కు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలే కాదు.. ఏ వ్యాపారవేత్తలూ హాజరుకావడం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేసింది. ‘జీ20 స్పెషల్ డిన్నర్‌కు ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు ప్రచురించిన రాయిటర్స్ వార్తా కథనం ఆధారంగా పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇవన్నీ అవాస్తవం. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఏ బిజినెస్ లీడర్‌ను డిన్నర్‌కు ఆహ్వానించలేదు’ అంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ ఏడాది జూలై 26న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కాంప్లెక్స్‌ని ప్రారంభించారు. సమ్మిట్ మొదటి రోజు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత మండపంలో గొప్ప విందును ఏర్పాటు చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సహా ప్రపంచ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. Media reports based on an article by @Reuters have claimed that prominent business leaders have been invited at #G20India Special Dinner being hosted at Bharat Mandapam on 9th Sep#PIBFactCheck ✔️This claim is Misleading ✔️No business leaders have been invited to the dinner pic.twitter.com/xmP7D8dWrL — PIB Fact Check (@PIBFactCheck) September 8, 2023 -
జీ20 సమ్మిట్: 500 మంది బిజినెస్ టైకూన్లతో డిన్నర్
ప్రతిష్మాత్మక G20 సమ్మిట్ సందర్బంగా నిర్వహిస్తున్న డిన్నర్‌కు భారత్‌కు చెందిన బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలను హాజరు కానున్నారు. ఇందులో ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ప్రముఖంగా ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక జీ-20 శిఖరాగ్ర సమావేశానికి జీ 20 దేశాల లీడర్లతోపాటు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జీ20 సమ్మిట్ విందు ఆహ్వానాలపై శనివారం జరగనున్న ఈ డిన్నర్‌కు ఆహ్వానించబడిన 500 మంది వ్యాపారవేత్తలలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా, భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు-చైర్మన్ సునీల్ మిట్టల్ ఉన్నారు. భారతదేశంలో వాణిజ్యం , పెట్టుబడుల అవకాశాలుహైలైట్ కానున్నాయి. ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నందున, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల జీ 20 దేశాల లీడర్లు ఈ సమ్మిట్ ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాసియా దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ప్రత్యకతను నిలుపుకోనుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా న్యూఢిల్లీలో జరిగే సమావేశంలో భాగస్వామ్యమవుతారని భావిస్తున్నారు. అలాగే ఈ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. సెప్టెంబర్ 9,10వ తేదీల్లో జరిగే గ్రూప్ ఆఫ్ 20 సమావేశాలకు అగ్రదేశాల నేతలతోపాటు వేలాది మంది హాజరుకానున్నారు. వసుధైక కుటుంబం సందేశంతో భారత్ ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. మరోవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ' పేరిట పంపిన విందు ఆహ్వానాలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. "It is a proud moment for every Indian to have 'The President of Bharat' written on the invitation card for the dinner to be held at Rashtrapati Bhavan during the G20 Summit," tweets Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/kXVVYbPQ7B — ANI (@ANI) September 5, 2023 -
ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్చే దిశగా కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలబెట్టిన జీ20 సదస్సు ఊహించని పరిణామానికి దారి తీసింది. రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డ G20 డిన్నర్ ఆహ్వాన పత్రికతో సంచలన విషయం తెరమీదికి వచ్చింది. ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది రాష్ట్రపతి భవన్. దీంతో దేశం పేరును ఆంగ్లంలో ఇండియా నుంచి భారత్‌కు మార్చే ప్రయత్నాల్లో కేంద్రం ఉందనే చర్చ ఊపందుకుంది. జీ20 సదస్సులో భాగంగా.. సెప్టెంబర్ 9వ తేదీన వివిధ దేశాల అధినేతలకు, ప్రతినిధులకు విందు ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇందుకోసం విదేశీ అధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతోనే ఆహ్వానాలు పంపింది రాష్ట్రపతి . ఇదే ఇప్పుడు రాజకీయ అభ్యంతరాలకు దారి తీసింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా.. రిపబ్లిక్ ఆఫ్ భారత్‌గా మారబోతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL — Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023 ఇంకోవైపు కాంగ్రెస్ ఈ పరిణామంపై మండిపడుతోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో పేర్కొన్న యూనియన్ స్టేట్స్పై ముమ్మాటికీ దాడేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ.. దేశాన్ని విభజిస్తూ.. మోదీ ముందుకు సాగుతున్నారంటూ మండిపడ్డారు. దీనికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ‘‘దేశ గౌరవానికి, గర్వానికి సంబంధించిన ప్రతి విషయంపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత అభ్యంతరం? వ్యక్తం చేస్తోంది. భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేసిన వాళ్లు.. భారత్ మాతా కీ జై అనే ప్రకటనను ఎందుకు ద్వేషిస్తున్నారు. కాంగ్రెస్‌కు దేశంపైనా, దేశ రాజ్యాంగంపైనా, రాజ్యాంగ సంస్థలపైనా గౌరవం లేదని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి దేశం మొత్తానికి బాగా తెలుసు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. कांग्रेस को देश के सम्मान एवं गौरव से जुड़े हर विषय से इतनी आपत्ति क्यों है? भारत जोड़ो के नाम पर राजनीतिक यात्रा करने वालों को “भारत माता की जय” के उद्घोष से नफरत क्यों है? स्पष्ट है कि कांग्रेस के मन में न देश के प्रति सम्मान है, न देश के संविधान के प्रति और न ही संवैधानिक… — Jagat Prakash Nadda (@JPNadda) September 5, 2023 కొత్త భవనంలోనేనా? ఆంగ్లంలో ఇండియా(India)గా ఉచ్చరించే పేరును.. భారత్(Bharat)గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు.. 18 నుంచి 22వ తేదీలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలను కేంద్రం వేదికగా చేసుకుంటుందా? అనే దానిపై ఒక స్పష్టత మాత్రం రావాలి. తొలి రెండు రోజులు పాత పార్లమెంట్ భవనంలో.. తర్వాతి మూడు రోజులు కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలోనే.. పేరుపై తీర్మానంతో పాటు జమిలి ఎన్నికలు, బ్రిటిష్‌కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకురాబోయే కొత్త చట్టాలను చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. So the news is indeed true. Rashtrapati Bhawan has sent out an invite for a G20 dinner on Sept 9th in the name of 'President of Bharat' instead of the usual 'President of India'. Now, Article 1 in the Constitution can read: “Bharat, that was India, shall be a Union of States.”… — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపిన ఆహ్వానం వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షాల కూటమి ఇండియా పేరును పెట్టుకున్న తర్వాత దేశం పేరును ఇండియా అని పిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వర్సెస్ మోదీ లాంటి నినాదాలు చర్చలను తీవ్రతరం చేశాయి. ఇదీ చదవండి: ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..? -
బరువు తగ్గాలని రాత్రిపూట డిన్నర్ స్కిప్ చేస్తున్నారా? ఇది మీకోసమే
ప్రస్తుతం మనలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. ప్రతి పది మందిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో చాలామంది బరువు తగ్గేందుకు ఎన్నో పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకునేందుకు డైటింగ్, ఫాస్టింగ్ పద్దతిని ఫాలో అవుతుంటారు. దీనికోసం డిన్నర్‌ను స్కిప్ చేసి మరుసటిరోజు అల్పాహారం తీసుకుంటున్నారు.కానీ దీనివల్ల బరువు తగ్గడమేమో కానీ అనేక నష్టం జరుగుతుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోటి విద్యలు కూటి కోసమే అన్న సామెత అందిరికి తెలిసిందే. ఎంత సంపాదించినా మూడు పూటల కడుపు నింపుకోవడం కోసమే. కానీ ఈ మధ్య చాలామంది ఉద్యోగాల ఒత్తిడి, సమయం సరిపోక, బరువు పెరుగుతామని రాత్రి భోజనం మానేస్తుంటారు. దీని వల్ల సన్నబడటం సంగతేమో కానీ అనారోగ్య సమస్యలు తప్పవట. రాత్రిపూట తినడం మానేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం. ►రాత్రిపూట ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉంటే సరిగా నిద్ర ఉండదట. దీని కారణంగా మరుసటి రోజు అలసట, నీరసంగా అనిపిస్తుంది. ► ఏమీ తినకుండా పడుకుంటే ఆ ప్రభావం బ్రేక్‌ఫాస్ట్‌పై కూడా పుడుతుంది. రాత్రి భోజనం మానేయడం వల్ల అల్పాహారం ఎక్కువగా తినే ఛాన్స్ ఉంది. ► ఇక బరువు తగ్గుతామని చాలా మంది డిన్నర్ స్కిప్ చేస్తుంటారు. కానీ దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఫలితంగా రక్తహీనతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► భోజనం మానేస్తే మెదడు చికాకు పెట్టేస్తుంది. శరీరం కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల ఒత్తిడి, ఆకలి ఎక్కువగా ఉంటుంది. ► భోజనం మానేయడం వల్ల శరీరం ఆకలితో ఉండటం వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోతాయి. అధిక కార్టిసాల్ స్థాయిలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ► రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై కూడా రాత్రినిద్ర ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రోగాలు దాడిచేస్తాయి. ► రక్తంలో చక్కెర అసమతుల్యత ఏర్పడి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ► దీర్ఘకాలంగా డిన్నర్ మానేస్తే నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. ఇది నిద్రలేమికి దారితీస్తుంది. అలాగే, శరీరానికి అవసరమైన కేలరీలు, పోషకాలు అందవు. ► నిద్ర సంబంధిత రుగ్మతలతో మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ► న్యూరోసైకియాట్రిక్ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం తీవ్రమైన నిద్ర లేమి జ్ఞాపకశక్తి లోపానికి దారితీస్తుందట. ► అందుకే మూడు పూటల తిండి, తగినంద నిద్ర శరీరానికి ఎంతో అవసరం అని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని క్వాంటిటీ తగ్గించి తీసుకోవాలని చెబుతున్నారు. -
రాత్రి భోజనం ఉదయం 11కే కానిచ్చేస్తాడు.. 45లో 18లా కనిపిస్తూ..
అమెరికన్ వ్యాపారవేత్త బ్రియాన్ జాన్సన్ ప్రకృతికి విరుద్ధంగా పోరాడుతూ కొన్ని ఏళ్లు వెనక్కి వెళుతున్నారు. అంటే తన వయసును తగ్గించుకుని యంగ్ లుక్‌లోకి వచ్చేస్తున్నారు. ఇందుకోసం బ్రియాన్ జాన్సన్ రెండు మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తున్నారు. బ్రియాన్ చేసిన ఒక తాజా ప్రకటన అందరినీ ఎంతగానో ఆలోచింపజేస్తోంది. బ్రియాన్ జాన్సన్ ఇటీవల ఆయన తాను ఉదయం 11 గంటలకే డిన్నర్ (రాత్రి భోజనం) కానిచ్చేస్తానని వెల్లడించాడు. ఒక ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రోజులో తన చివరి భోజనం ఉదయం 11 గంటలకు ముగుస్తుందని తెలిపారు. నిజానికి ఆ సమయానికి చాలామంది టిఫిన్ తింటుంటారు. Easy, low cost brain/mind measurement unlocks next level wellness. New 🔥 capabilities from @KernelCo. The mind is forgotten until it’s the only thing that matters. More soon. pic.twitter.com/oCtt5RsRYP — Bryan Johnson (@bryan_johnson) July 8, 2023 రోజుకు వందకు మించిన సప్లిమెంట్లు 45 ఏళ్ల బ్రియాన్ జాన్సన్ యుక్త వయసులో ఉన్న తన కుమారుని రక్తాన్ని మార్చుకుంటారు. అలాగే రోజుకు వందకు మించిన సప్లిమెంట్లు తీసుకుంటారు. ఫార్చ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం 30 మంది డాక్టర్ల బృందం ప్రతీరోజూ అతని శరీరంలోని ఫ్యాట్ స్కాన్ చేయడంతో పాటు ఎంఆర్ఐ సేకరిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్యనే ఒక ట్విట్టర్ యూజర్ బ్రియాన్ జాన్సన్‌ను..‘మీ ఆహారపు షెడ్యూల్‌కు సంబంధించిన రిపోర్టు సరైనదేనా?’అని అడిగారు. దీనిని ఆయన సమాధానమిస్తూ అది నిజమేనని తెలిపారు. ‘రోజులో తన చివరి భోజనం ఉదయం 11 గంటలకేనని, నేను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్యనే తింటానని’ తెలిపారు. ఫార్చ్యూన్ రిపోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం బ్రియాన్ ఉదయం వేళ ‘గ్రీన్ జాయింట్’ తీసుకుంటారు. ఈ విధమైన రోజువారీ డైట్ కారణంగా ఆయన 18 ఏళ్ల వ్యక్తికి ఉండే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కలిగివున్నారు. 48 ఏళ్ల వ్యక్తి హృదయ స్థాయిని, 28 ఏళ్ల వ్యక్తి చర్మపు తీరును కలిగివున్నారు. Question @bryan_johnson Is this a typo? Can you clarify? pic.twitter.com/D1kYkx6eFM — Martina Markota (@MartinaMarkota) July 4, 2023 ఇది కూడా చదవండి: ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్త పనులుచేసే ముసలోడికి అరదండాలు! -
వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్... ఆసాంతం అద్భుతంగా ఉందన్న ఆనంద్‌మహీంద్ర
-
వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన అభిమానులను ఎపుడూ నిరాశ పర్చరు. బుధవారం దుబాయ్‌లో ప్రారంభమైన వరల్డ్ చెక్ లీగ్ గురించి ట్వీట్ చేసిన మహీంద్ర గురువారం వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టారు. వైట్‌హౌస్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం వాషింగ్టన్‌లోని స్టేట్ డిన్నర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు. దీంతో గ్రేట్ సర్ అంటూ ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. (వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు..) ఈ సందర్భంగా అక్కడ సంగీత వాయిద్యాలతో స్వాగతం పలికిన తీరు, థీమ్ వంటలపై ఆశ్చర్యాన్ని ప్రకటించారు అంతేకాదు స్టేట్ డిన్నర్లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ హోస్ట్ చేసే విందును కడుపారా ఆరగించేందుకు మధ్యాహ్న భోజనాన్ని స్కిప్ చేశానంటూ తనదైన శైలిలో చమత్కరించారు. కాగా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టుగా తొలిసారి వైట్ హౌస్‌లో పూర్తిగా మొక్కల ఆధారితమైన రాష్ట్ర విందును నిర్వహించడం విశేషం. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు లాంటివేవీ లేకుండా పూర్తిగి శాఖాహారాన్ని వడ్డించారు..(స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!) 400 మంది వీవీఐపీలు హాజరైన ఈ డిన్నర్‌కు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్,మైక్రోసాఫట్ సత్య నాదెళ్ల,యాపిల్ సీఈవో టిమ్ కుక్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, సహా ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ దంపతులు,పెప్సికో మాజీ చైర్పర్సన్ సీఈవో ఇంద్రా నూయి, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ లాంటి పలువురు ప్రముఖులతో కలిసి స్టేట్ డిన్నర్లో సందడి చేశారు. #WATCH | Indra Nooyi, former Chairperson and CEO of PepsiCo arrives at the White House for the State Dinner pic.twitter.com/oBhvk2KmMX — ANI (@ANI) June 22, 2023 -
మోదీకి బైడెన్ దంపతుల ప్రత్యేక విందు
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 24వ తేదీ దాకా.. నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఈ నెల 21న మోదీకి ప్రత్యేక విందు ఇస్తారని, ఈ విందులో బైడెన్ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారని సమాచారం. 22న అధికారిక విందు జరుగుతుందని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 22న విందు కంటే ముందు వైట్‌హౌస్ సౌత్ లాన్లో మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, 21న మోదీకి ప్రత్యేక విందు ఎక్కడ ఇస్తారన్నది ఇంకా తెలియరాలేదు. ‘జూన్ 22న వైట్‌హౌస్ సౌత్ లాన్లో మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందు రోజు రాత్రి మోదీతో బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు కొద్దిసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం చాలా ప్రత్యేకం. ఇద్దరు నేతల మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది’ అని తెలిపారు. త్వరలో వైట్‌హౌస్ వర్గాలు అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా.. మోదీ అమెరికా పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రవాస భారతీయులు ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి సొంతగడ్డ మీద రష్యా మిసైళ్ళ దాడి -
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్‌పై మొదలైన చర్చ!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ రోజు తమన్నాను విజయ్ ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరిపై పలుసార్లు డేటింగ్లో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. అయితే తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. ఓ డిన్నర్ పార్టీ నుంచి బయటకు వస్తూ జంటగా కనిపించడంతో లవ్‌బర్డ్స్ అంటూ మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. (ఇది చదవండి: నా తమన్నాతో తిరుగుతున్నావా?.. విజయ్ వర్మపై నటుడి కామెంట్స్ వైరల్!) శుక్రవారం రాత్రి ముంబయిలోని బాంద్రాలో డిన్నర్ పార్టీలో తళుక్కున మెరిశారు. ఇద్దరు కూడా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి బీటౌన్‌లో చర్చ మొదలైంది. కాగా.. విజయ్ వర్మ ఇటీవలే రిలీజైన దహాద్ వెబ్ సిరీస్‌లో కనిపించారు. ప్రస్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళాశంకర్‌లో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. (ఇది చదవండి: ఆ విషయంలో నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా: అనుపమ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
14ఏళ్లుగా భోజనం చేయడం లేదు : బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఫ్యామిలీ మ్యాన్-2తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ చిత్రంలో విలన్‌గా నటించారు. అల్లు అర్జున్ మూవీ హ్యాపీలో తనదైన నటనతో మెప్పించారు. చదవండి: అహంకారమా? అజ్ఞానమా? పవన్ పోస్టర్‌పై పూనమ్ ఫైర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే కొన్నేళ్లుగా నా లైఫ్‌స్టైల్ మొత్తం మారిపోయింది. గత 13-14ఏళ్లుగా నేను రాత్రిపూట భోజనం చేయటం లేదు. దీనివల్ల నా బరువు చాలా అదుపులో ఉంది. దీన్ని నేను మా తాత దగ్గర్నుంచి చూసి నేర్చుకున్నాను. ఆయన రాత్రుళ్లు భోజనం చేసేవారు కాదు. సన్నగా, ఫిట్‌గా, ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించేవారు. అందుకే నేను కూడా ఆయన్ను ఫాలో అయ్యాను. డిన్నర్ మొత్తం మానేయడం అంటే మొదట్లో చాలా కష్టంగా అనిపించేది. ఆకలిని కంట్రోల్ చేయడానికి బిస్కెట్లు లాంటివి తినేవాడిని. కానీ క్రమక్రమంగా అలవాటు చేసుకున్నా. ఈ రొటీన్ వల్ల నా బరువు అదుపులో ఉండటంతో పాటు చాలా వరకు ఎనర్జీతో ఉండగలుగుతున్నా అంటూ మనోజ్ బాజ్‌పాయ్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ షూటింగ్లో ఆయన పాల్గొంటారు. చదవండి: సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర, గ్లింప్స్ చూశారా? -
లగ్జరీ ఇంట్లో పార్టీ ఇచ్చిన ఇషా అంబానీ.. వీడియో, ఫొటోలు వైరల్!
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఫ్యాషన్ పరంగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. అంబానీ కుటుంబంలోని ఇతర సభ్యుల్లాగే ఇషా అంబానీ కూడా చాలాగా హుందా ఉంటుంది. సాంప్రదాయ మూలాలను ఇష్టపడుతుంది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) ఇషా అంబానీ తన ఆనంద్ పిరమల్‌తో కలిసి ఉంటున్న తమ విలాసవంతమైన ఇంట్లో శుక్రవారం (ఏప్రిల్ 14) టుస్కానీ థీమ్‌తో పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఇషా అంబానీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సముద్ర తీరానికి దగ్గరలో వీరి లగ్జరీ నివాసం పేరు కరుణ సింధు. (నిలిచిపోయిన నెట్‌ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్) ఈ పార్టీలో ఇషా అంబానీ ధరించిన పొడువాటి ఎరుపు రంగు గౌన్ అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇషా పెద్దగా మేకప్ లేకుండా సహజంగా కనిపించింది. ఇషా వేసుకున్న రెడ్ హ్యూడ్ అవుట్‌ఫిట్ షాప్ డోన్ అనే లేబుల్ నుంచి వచ్చింది. View this post on Instagram A post shared by Isha Ambani Piramal✨ (@_ishaambanipiramal) -
ఛాతీలో మంట... కడుపులో యాసిడ్ పైకి తంతుంటే!
ఎంత ఆరోగ్యవంతులకైనా జీవితంలో ఎప్పుడో ఒకసారైనా కడుపులోని గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ... ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వస్తుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్’ (జీఈఆర్డీ) అంటారు. కడుపులో యాసిడ్ ఆహారంపైన పనిచేసే సమయంలో దాని వాయువులు (ఫ్యూమ్స్) పైకి ఎగజిమ్మడంతో గొంతు, ఛాతీలో మంట అనిపిస్తుంది. జీఈఆర్‌డీని నివారించాలంటే... ► ఈ సమస్య నివారణకు మంచి జీవనశైలిని అలవరచుకోవడం మేలు. ► రాత్రి భోజనం ఆలస్యం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరమైనా నడవాలి. ► పక్కమీదకు చేరగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. ఒకవేళ కుడివైపు తిరిగి పడుకుంటే గొంతు చివర అన్నకోశం దగ్గర ఉండే స్ఫింక్టర్ మీద ఒత్తిడి పడి తెరుచుకుని, ఆహారం వెనక్కు రావచ్చు. అప్పుడు యాసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశముంటుంది. ► తల వైపు భాగం ఒంటి కంటే కాస్త ఎత్తుగా ఉండేలా పక్కను సర్దుకోవాలి. రిఫ్లక్స్ సమస్యతో బాధపడేవారు వీలైతే తల కింద మరో దిండును ఎక్కువగా పెట్టుకోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ► మందుల విషయానికి వస్తే... హెచ్2 బీటా బ్లాకర్స్, ప్రోటాప్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతోనూ చికిత్స చేస్తారు. -
చిట్టిచేతులతో అమ్మకోసం డిన్నర్.. వీడియో వైరల్..
బుడి బుడి అడుగులు వేసే ఓ రెండేళ్ల పసిపాప తన తల్లికోసం పసిప్రాయంలోనే చెఫ్‌గా మారింది. చిట్టిచేతులతో కూరగాయలు కట్ చేసి ప్రత్యేకంగా డిన్నర్ తయారు చేసింది. ఈ చిన్నారి ఎంతో ఓపికతో ఇష్టంగా ఆహారం వండిన తీరు నెటిజన్లను మంత్రముగ్దుల్ని చేసింది. ఆగస్టు చివరి వారంలో అప్లోడ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ అయి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో చిన్నారి స్వయంగా కూరగాయలు కట్ చేసింది. వాటిని జాగ్రత్తగా బాయిలర్‌లో పెట్టింది. పాప పని చేస్తూనే క్యారట్ కొరుక్కుని తినడం చాలా క్యూట్‌గా అనిపించింది. అంతేకాదు ఆ తర్వాత చికెన్ కూడా వండింది. టిక్‌టిక్‌టిక్ అంటూ చికెన్ ముక్కలను ఎయిర్ ఫ్రయర్లో వేసింది. ఓ పాకెట్ రైస్‌ను మైక్రోవేవ్‌లో పెట్టి దానికి కాస్త ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేసింది. ఆ తర్వాత రైస్‌ను ఓ బౌల్లోకి తీసుకుంది. చివరకు మొత్తం డిన్నర్‌ను ప్రిపేర్ చేసి టేబుల్‌పై పెట్టింది ఈ పసిపాప. ఆ తర్వత ఆమె తల్లి వచ్చాక.. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ డిన్నర్ చాలా రుచిగా ఉందంటూ తల్లి కూతుర్ని మెచ్చుకుని మురిసిపోయింది. ఈ క్షణం కోసం, తన వ్యక్తిగత చెఫ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. చిన్నారి వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. వావ్, అమేజింగ్ అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Bruna Fava and Natalie (@natalieandbruna) చదవండి: నిమిషంలోపే హెయిర్ కట్.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్ డ్రస్సర్ -
ఆటోలో కేజ్రీవాల్.. అడ్డుకున్న పోలీసులు
గాంధీనగర్: గుజరాత్ పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటోడ్రైవర్ కోరిక మేరకు అతని ఇంట్లో భోజనం చేశారు. అయితే అతని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ హైడ్రామా నడిచింది. చివరకు కేజ్రీవాల్ తగ్గకపోవడంతో.. పోలీసులే వెనక్కి తగ్గారు. సోమవారం జరిగిన ఆటో డ్రైవర్ల కార్యక్రమంలో విక్రమ్ దంతానీ అనే డ్రైవర్ కేజ్రీవాల్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. ‘‘నేను మీ అభిమానిని. పంజాబ్‌లో ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోంచేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో చూశా. మా ఇంట్లో భోజనానికి వస్తారా?’’ అని అడగ్గా కేజ్రీవాల్ అంగీకరించారు. ‘‘ఎప్పుడు రమ్మంటారు? నేను బస చేసిన హోటల్ నుంచి మీ ఆటోలో తీసుకెళ్తారా?’’ అని అడిగారు. అన్నట్టుగానే రాత్రి విక్రమ్ ఆటోలోనే ఆయన ఇంటికి భోజనానికి వెళ్లారు. అయితే ఈ ఎపిసోడ్లో కాసేపు ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న ఆటోను సెక్యూరిటీ కారణాల దృష్ట్యా అహ్మదాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రయాణానికి అంగీకరించబోమని తెలిపారు. అయితే ఆ టైంలో కాసేపు పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. చివరకు.. ఓ కానిస్టేబుల్ ఆ ఆటో డ్రైవర్ పక్కన కూర్చోగా, రెండు పోలీసు వాహనాలు ఆ ఆటోను విక్రమ్ ఇల్లు ఉన్న ఘాట్లోడియా వరకు అనుసరించాయి. ఇక.. ఇదంతా నాటకమని, కేజ్రీవాల్ గొప్ప నటుడని గుజరాత్ మంత్రి హర్ష సంఘ్వీ ఎద్దేవా చేశారు. UNSTOPPABLE 🔥 #KejriwalRukegaNahi pic.twitter.com/nMgknwFasq — AAP (@AamAadmiParty) September 12, 2022 Gujarat के Auto वाले के निमंत्रण पर @ArvindKejriwal जी गए उनके घर! परिवार वालों को नहीं हुआ विश्वास!#KejriwalRukegaNahin pic.twitter.com/iqG0QLvWDI — AAP (@AamAadmiParty) September 12, 2022 -
సీఎంను డిన్నర్‌కు ఆహ్వానించిన ఆటోవాలా
అహ్మదాబాద్: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో ఆటో డ్రైవర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఆప్ విజయం కోసం ఆటోవాలాలు తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో లాగా గుజరాత్‌లోనూ ఆప్ కోసం ప్రచారం నిర్వహించి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అయితే ఈ సమావేశంలో ఓ ఆటోడ్రైవర్ కేజ్రీవాల్‌ను తన ఇంటికి డిన్నర్‌కు రావాలని ఆహ్వానించాడు. పంజాబ్‌లో ఓ ఆటోవాలా ఇంటికి వెళ్లి కేజ్రీవాల్ భోజనం చేసిన వీడియో తాను చూశానని, ఇప్పుడు తన ఇంటికి కూడా డిన్నర్‌కు వస్తారా? అని అతను అడిగాడు. దీనికి స్పందించిన ఢిల్లీ సీఎం.. వెంటనే తాను డిన్నర్‌కు వస్తానని చెప్పారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లుకొట్టారు. అయితే తనను తీసుకెళ్లేందుకు హోటల్‌కు రావాలని ఆటోడ్రైవర్‌కు కేజ్రీవాల్ సూచించారు. తనతో పాటు మరో ఇద్దరు ఆప్ నేతలు కూడా వస్తారని పేర్కొన్నారు. అంతేకాదు ఏ సమయానికి డిన్నర్‌కు రావాలని కూడా ఆటో డ్రైవర్‌ను అడిగారు. ఆ తర్వాత రాత్రి 8గంటలకు టైంను ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. Delhi CM @ArvindKejriwal accepts a Dinner Invitation from an Autorickshaw Driver of Gujarat ❤️#TownhallWithKejriwal pic.twitter.com/0lf5kS5rkn — AAP (@AamAadmiParty) September 12, 2022 చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం -
చిచ్చు రేపిని బిర్యాని వంట... భార్యపై కత్తితో దాడి
ముంబై: ఒక వ్యక్తి తన భార్య రాత్రి భోజనానికి బిర్యాని వండలేదన్న కోపంతో కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని లతూర్లో చోటుచేసుకుంది. ఆగస్టు 31 రాత్రి సదరు వ్యక్తి రాత్రి భోజనానికి బిర్యాని ఎందుకు వండలేదంటూ భార్యతో గొడవపడ్డాడు. ఈ విషయమై ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. దీంతో సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులు ఎంతగా చెబుతున్న వినకుండా భార్యని కత్తితో పొడిచి పరారయ్యాడు. సదరు వ్యక్తిని పోలీసులు విక్రమ్ వినాయక్ దేదేగా గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత మహిళ తీవ్రంగా గాయపడిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని వెల్లడించారు. ఐతే ఈ కేసు విషయమై ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
విందు, వినోదాలకు దూరంగా ఉండే ఇళయరాజా తొలిసారి విందిచ్చారు
సంగీతజ్ఞాని ఇళయరాజా సాధారణంగా విందూ వినోదాలకు దూరంగా ఉంటారు. అలాంటిది అనూహ్యంగా ఆయనే ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య) నిర్మాహకులకు తొలిసారి విందును ఇవ్వడం విశేషం. ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడి పదవిని కట్టబెట్టడం, ఆయన పదవీ ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. ఫెఫ్సీ నిర్వాహకులతో ఇళయరాజా రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇళయరాజా ఫెఫ్సీలో భాగం అయిన 23 శాఖల నిర్వాహకులకు విందునిచ్చారు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్, పేరరసు, మనోబాలా తదితరులు పాల్గొన్నారు. -
సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం విందు (ఫొటోలు)
-
సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్ బిశ్వభూషణ్ గౌరవార్థం విందు.. హాజరైన సీఎం జగన్ దంపతులు
-
ఏపీ ప్రభుత్వం తరపున సీజేఐ ఎన్వీ రమణకు విందు
సాక్షి, విజయవాడ: మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ల గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ విందులో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముతోపాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీత మొగిలయ్య, గిరిజన నేతలు పాల్గొన్నారు. హోటల్ అశోకాలో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురితోపాటు 18 పార్టీల నేతలు కూడా ఉన్నారు. రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం సోమవారంతో ముగియనుంది. -
టిఫిన్‌కి జానారెడ్డి ఇంటికి.. లంచ్‌కి కోమటిరెడ్డి ఇంటికి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల తీరు కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. నాయకుల కీచులాటలు, పరస్పర విమర్శలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎప్పుడు.. ఏ నేత.. ఎవరిపై ఎలా మాట్లాడతాడో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. అప్పుడే బాగున్నట్టు కనిపిస్తారు.. అంతలోనే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తుంటారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఏకంగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి గాంధీభవన్‌లో చేసిన సూచనలను సైతం గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతలందరినీ ఐకమత్యంగా ఉంచి ఒక గాడిలో పెట్టేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ముఖ్యనేతలు ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. టిఫిన్ అక్కడ.. లంచ్ ఇక్కడ.. డిన్నర్ మరోచోట.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో టిఫిన్‌కి ఆహ్వానించారు. అయితే ఇది ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమమా? లేక పార్టీ అంతర్గత నిర్ణయం ప్రకారం జరుగుతోందా.. అన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు. నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇది అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇకపోతే లంచ్ ఏర్పాట్లు భువనగిరి ఎంపీ, పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో జరుగుతున్నాయి. మాణిక్యం ఠాగూర్‌తో పాటు ముఖ్య నేతలందరూ మధ్యాహ్న భోజనానికి అక్కడికి హాజరుకావాలన్న సమాచారం పార్టీ నుంచి వెళ్లినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమం కూడా ఐకమత్యం కోసమేనన్న టాక్ వినిపిస్తోంది. అలాగే పార్టీ కార్యవర్గం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డిన్నర్‌ను జూబ్లీహిల్స్‌లోని క్లబ్లో ఏర్పాటు చేశారు. దీనికి కూడా కీలక నేతలు, సీనియర్ నాయకులంతా హాజరవుతారు. కలరింగ్.. కవరింగ్.. అధిష్టానం నియమించిన ఇన్చార్జీల దగ్గరగానీ, వారు పాల్గొనే సమావేశంలో గానీ రాష్ట్ర నేతల కలరింగ్, కవరింగ్ ఒక స్థాయిలో ఉంటుందని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా కనిపిస్తుందని నేతలు చర్చించుకుంటున్నారు. తీరా ఇన్చార్జి నేతలు హైదరాబాద్ నుంచి విమానం ఎక్కగానే ఆ రోజు రాత్రి నుంచే కీచులాటలు, ఫిర్యాదుల పర్వం మొదలవుతుందని, ఒకరిపై ఒకరు దూషించుకోవడం చేస్తున్నారని పార్టీ అధిష్టానికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. తాజాగా ఆదివారం జరగబోయే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. వ్యవహారాలు ఏ స్థాయిలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకువస్తాయన్నదానిపై కేడర్‌లో ఆసక్తి నెలకొంది. -
సీఎం కేసీఆర్ క్రిస్మస్ విందు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లు బంద్
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్ వైపుకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. దీని ప్రకారం, బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలను అనుమతించరు, వాటిని నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుంచి ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. ఆ వైపు వచ్చే వాహనాలను ఎస్బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ట్రాఫిక్ బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అతిథులకు ఎంట్రీ , వారి వాహనాల పార్కింగ్: ► గోల్డ్ కార్డ్ పాస్‌లను (ఏ-1 బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ‘ఏ’ గేట్ వద్ద అంటే కేఎల్కే (ఖాన్ లతీఫ్ ఖాన్) భవనం ఎదురుగా దిగి, లోపలి గేట్ నంబర్ 17 ద్వారా ప్రవేశించి, ఆలియా మోడల్ స్కూల్, ఎస్సీఈఆర్టీ, అలియా కాలేజీలో తమ వాహనాలను పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ► గ్రీన్ కార్డ్ పాస్‌లు (ఏ-2 బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ‘డీ’ గేట్ వద్ద దిగాలి అంటే ఎదురుగా. అలియా మోడల్ స్కూల్, బీజేఆర్ విగ్రహం దగ్గర, ఎస్ఏటీఎస్ గేట్ ద్వారా ప్రవేశించి వారి వాహనాలను అలియా కళాశాల, మహబూబ్ కళాశాల, అలియా మోడల్ స్కూల్, ఎస్సీఈఆర్టీ వద్ద పార్క్ చేయాలి. ► బ్లూ కార్డ్ పాస్‌లు (బి-బ్లాక్) కలిగి ఉన్న అతిథులు ఆయాకార్ భవన్‌కు ఎదురుగా ఉన్న ‘జి’ గేట్ వద్ద దిగి, లోపలి గేట్ నంబర్ 15 ద్వారా ప్రవేశించి, పబ్లిక్ గార్డెన్లో తమ వాహనాలను పార్క్ చేయాలి. ► పింక్ కార్డ్ పాస్‌లు (సి-బ్లాక్) కలిగి ఉన్న అతిథులు బిజెఆర్ విగ్రహం సమీపంలోని ‘ఎఫ్, ఎఫ్1’ గేట్ల వద్ద దిగి, లోపలి గేట్ నెం. 6 & 8 ద్వారా ప్రవేశించి, నిజాం కళాశాల మైదానంలో తమ వాహనాలను పార్క్ చేయాలి. చదవండి: Hyderabad: ఆ ప్రయాణికులకు షాకిచ్చిన ఓలా, ఉబర్ డ్రైవర్లు -
విమానంలో కూర్చుని బిర్యానీ తింటూ.. ప్రకృతి అందాలను చూస్తుంటే..కిక్కే కిక్కు!
సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు.. ఇక దానిలో భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. విజయవాడ వాసులకు ఈ అవకాశం దొరకుతోంది. చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్! విజయవాడ – గన్నవరం జాతీయ రహదారిపై నిడమానూరు వద్ద మూలనపడ్డ ఓ పాత విమానంలో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది ‘డియర్ ఫుడ్ లవర్స్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్.. స్పెషల్ డిన్నర్ ఫ్లైట్ ఈజ్ రెడీ టు సర్వ్’ అంటూ ఆహ్వానం పలుకుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేను ప్రధానమంత్రి అయితే నా మొదటి సంతకం ఆ బిల్లు పైనే !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కొద్ది నెలలు క్రితం తమిళనాడులోని ముళగుమూడులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలను సందర్శించారు. అక్కడ ఆయన ఆ స్కూల్పిల్లలతో కాసేపు ముచ్చటించడమే కాక వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ పాఠశాల విద్యార్థులు రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వచ్చారు. (చదవండి: ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!) ఈ మేరకు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ...." నేను ప్రధాన మంత్రి అయితే మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లుపైనే సంతకం చేస్తాను. అంతేకాదు మీ బిడ్డకు నేర్పించే మొదటి విషయం ఏమిటి అని నన్ను ఎవరైనా అడిగేతే వినయం అని చెబుతాను. ఎందుకంటే పిల్లలకు మొదట వినయం గురించి తెలుసుకుంటేనే వాళ్లు అన్నింటిని సులభంగా నేర్చుకోగలుగుతారు" అని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. (చదవండి: అబ్బా ఏం ఆడుతుంది...ఇది కదా ఆటంటే Interaction and dinner with friends from St. Joseph’s Matric Hr. Sec. School, Mulagumoodu, Kanyakumari (TN). Their visit made Diwali even more special. This confluence of cultures is our country’s biggest strength and we must preserve it. pic.twitter.com/eNNJfvkYEH — Rahul Gandhi (@RahulGandhi) November 6, 2021 -
వెరైటీ ఆహ్వానం: గిఫ్ట్ విలువను బట్టే పెళ్లి భోజనం
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన వేడుక. ఈ సందర్భాన్ని జీవితాంతం మర్చిపోలేని మధురానుభూతిగా మార్చుకోవడం కోసం తమ స్థాయికి తగ్గట్లు ఖర్చు పెడతారు. పెళ్లిలో మిగితవన్ని ఒక ఎత్తు అయితే.. విందు ఒక ఎత్తు. రకరకాల పదార్థాలతో వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేస్తారు. పెళ్లికి వచ్చినవారు తృప్తిగా భోంచేసి.. తమను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ ఓ జంట పెళ్లికి అతిథులు తెచ్చిన బహుమతి ఖరీదు ఆధారంగా వారికి విందు భోజనం పెడతామని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆహ్వాననోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. రెడిట్‌లో ‘బిగ్గర్ క్యాష్ గిఫ్ట్.. బెటర్ డిన్నర్’ అనే క్యాప్షన్‌తో వైరలవుతోన్న ఈ నోట్లో కాబోయే దంపతులు.. తమ వివాహ బహుమతి కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలియజేయమని అతిథులను అడిగారు. గిఫ్ట్ కోసం చేసే ఖర్చును బట్టి వారికి డిన్నర్లో ఏం ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు సదరు జంట. ఈ నోట్ ప్రకారం సదరు జంట తమ వివాహానికి హాజరయ్యే అతిథులను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ నాలుగు గ్రూప్‌లకు ‘ప్రేమపూర్వక బహుమతి’, ‘బంగారు బహుమతి’, ‘వెండి బహుమతి’, ‘ప్లాటినం బహుమతి’ అని వేర్వేరు పేర్లు పెట్టారు. పెళ్లికి వచ్చిన అతిథులు తమకిచ్చే బహుమతి విలువ 250 డాలర్లు అయితే, అది 'ప్రేమపూర్వక బహుమతి' కేటగిరీలోకి వస్తుంది. వారికి ఇచ్చే విందులో రోస్ట్ చికెన్ లేదా చేపను వడ్డిస్తారు. అతిథులు కొనుగోలు చేసే బహుమతుల విలువ 251-500 డాలర్ల మధ్య ఉంటే, అది 'సిల్వర్ గిఫ్ట్' కేటగిరీ కిందకు వస్తుంది. వారికి డిన్నర్లో భాగంగా మొదటి కేటగిరీలో ఉన్న వంటలు లేదా ముక్కలు చేసిన స్టీక్, సాల్మన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అతిథులు కొనుగోలు చేస్తున్న బహుమతుల విలువ 501-1000 డాలర్ల మధ్య ఉంటే, అది 'బంగారు బహుమతి' కేటగిరీ కిందకు వస్తుంది. ఇక వారికి డిన్నర్లో మొదటి, రెండవ కేటగిరీ కింద వంటకాలు కలిపి వడ్డిస్తారు. అవి వద్దనుకుంటే ఫైలెట్ మిగ్నాన్, ఎండ్రకాయల తోకలను ఎంచుకోవచ్చు. అతిథులు కొనుగోలు చేస్తున్న బహుమతుల విలువ 1000 -2500 డాలర్ల లోపు ఉంటే అది 'ప్లాటినం గిఫ్ట్' కేటగిరీ కిందకు వస్తుంది. ఇక వారికి డిన్నర్లో మొదటి, రెండవ, మూడో కేటగిరీ కింద వంటకాలు వడ్డిస్తారు. వద్దనుకుంటే ఎండ్రకాయతో పాటు సావనీర్ షాంపైన్ గోబ్లెట్ని వడ్డిస్తారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మీరు భారతీయులై ఉండి.. ఇలాంటి రూల్స్ పెడితే.. మీ పెళ్లికి మీరిద్దరే తప్ప వేరే బంధువులు ఎవరు రారు.. అయినా గిఫ్ట్‌ని బట్టి భోజనం పెట్టడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: వర్క్ ఫ్రం.. వెడ్డింగ్! పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా? -
Mehul Choksi: గర్ల్‌ఫ్రెండ్‌తో డిన్నర్‌కు వెళ్లి చిక్కాడు
న్యూఢిల్లీ: ఆంటిగ్వాలోని తన సురక్షితస్థావరాన్ని వదిలి గర్ల్‌ఫ్రెండ్‌ను పొరుగునున్న డొమినికా దేశానికి డిన్నర్‌కు తీసుకెళ్లడమే మెహుల్ చోక్సీ పట్టివేతకు దారితీసింది. ప్రస్తుతం ఆయన కరీబియన్ ద్వీప దేశం డొమినికాలో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ‘గర్ల్‌ఫ్రెండ్‌తో సరదాగా గడుపుదామనో, డిన్నర్ కోసమో చోక్సీ ఆమెతో కలిసి డొమినికాకు బోటులో వెళ్లాడు. అక్కడ పోలీసులకు దొరికిపోయాడు. అదే ఆయన చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే ఆంటిగ్వాలో ఉంటే ఇక్కడి పౌరుడు కాబట్టి ఆయనకు రక్షణ ఉంటుంది. మేము చోక్సీని భారత్‌కు అప్పగించలేం’ అని ఆంటిగ్వా– బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌనే అన్నారు. జూన్ 2న కేసు తదుపరి విచారణకు వచ్చేదాకా చోక్సీని డొమినికాలోనే ఉంచాలని అక్కడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలు భిన్నంగా ఉంటే తప్పితే... చోక్సీని డొమినికా ప్రభుత్వం భారత్‌కే అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డొమినికాకు ప్రైవేట్ జెట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13,500 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ (62)ని వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చోక్సీ ఆర్థిక నేరాలకు సంబంధించిన పత్రాలను భారత్ ఈనెల 28న ఒక ప్రైవేట్ జెట్ విమానంలో డొమినికాకు పంపింది. పీఎన్బీ కుంభకోణం కేసులో మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి చోక్సి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. -
షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. యడ్డీ కుర్చీకి ఎసరు!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విందు భోజనానికి సొంత బీజేపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. బుధవారం బెంగళూరులో తన అధికారిక నివాసం కావేరిలో ఆయన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఏర్పాటు చేశారు. అందరూ తప్పక రావాలని కొన్నిరోజుల నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు తరువాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి గూడుకట్టుకుంది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవారిని కాదని వలసవాదులకు పదవులు కట్టబెట్టారని బాహాటంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అసంతృప్తిని చల్లార్చేందుకు విందు ఏర్పాటైంది. (యడియూరప్ప స్థానంలో యువ సీఎం!) గతకొంత కాలంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు రహస్యమంతనాలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుల విషయంలో పలువురు తీవ్ర సంతృప్తంగా ఉన్నారు. అంతేకాకుండా యడ్డీని సీఎం కుర్చి నుంచి దించేసి మరో నేతకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పట్టుబడుతున్నారు. తాజాగా సీఎం విందు భోజనానికి సొంత ఎమ్మెల్యేలు రాకపోవడం కన్నడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలో చాలామందికి మంత్రిపదవులు కట్టాబెట్టారు. అయితే సీఎం నిర్ణయం సొంత పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. ఎంతో కాలంగా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు రాలేదంటే.. రెబెల్ సీనియర్ ఎమ్మెల్యేలు బసవనగౌడ పాటిల్ యత్నాళ్, సునీల్ కుమార్‌తో పాటు 25 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలిసింది. వీరిలో అరవింద బెల్లద్, పూర్ణిమా శ్రీనివాస్, మహంతేశ్ దొడ్డనగౌడ పాటిల తదితరులు ఉన్నారు. -
విద్యా బాలన్ని డిన్నర్‌కి పిలవలేదు : మంత్రి
విద్యా బాలన్ని తాను డిన్నర్‌కి పిలవలేదని, వాళ్లే తనను ఆహ్వానిస్తే వీలుకాక పోలేదని మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా స్పష్టం చేశారు. తన వాళ్ల షూటింగ్ ఆగిపోయిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. ‘షేర్నీ’ షూటింగ్ నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వచ్చిన బాలివుడ్ నటి విద్యా బాలన్ని మంత్రి విజయ్ షా డిన్నర్‌కు ఆహ్వానిస్తే ఆమె నిరాకరించారని, దీంతో షూటింగ్‌కి అనుమతి ఇవ్వకుండా చిత్ర యూనిట్‌ని మంత్రి ఇబ్బందులు పెట్టారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి విజయ్ ఈ వార్తలపై వివరణ ఇచ్చారు. మంత్రి విజయ్ షా ‘షేర్నీ’ చిత్ర యూనిట్ బాలాఘాట్‌లో షూటింగ్ కోసం అనుమతి తీసుకున్నారు. నన్ను డిన్నర్‌కు రమ్మని ఆహ్వానించారు. ఇప్పట్లో సాధ్యం కాదని, మహారాష్ట్రకు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పాను. దీంతో డిన్నర్ ఏర్పాట్లు ఆగిపోయాయి. అంతే కానీ సినిమా షూటింగ్ మాత్రం ఆగిపోలేదు. అడవిశాఖ అధికారులు చిత్ర యూనిట్ వాహనాలకు అనుమతి నిరాకరించారనేది అవాస్తవం’ అని మంత్రి విజయ్ పేర్కొన్నారు. అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో విద్యా బాలన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షేర్నీ’. మనిషికి, మృగాలకు మధ్య జరిగే కథాంశం ఇది. ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్ వల్ల ఆగిపోయింది. ఇటీవలే మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ ను తిరిగి ప్రారంభించారు. చిత్రీకరణ అంతా దాదాపు అడవుల్లోనే జరగనుందట. -
పెళ్ళి భోజనాల కోసం ఘర్షణ
పశ్చిమగోదావరి, ఆకివీడు: కోళ్ల పర్రు గ్రామంలో పెళ్లి భోజనాల కోసం శుక్రవారం రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గండికోట స్వామి వివాహం ఈ నెల 15న జరిగింది. 18న యానాల భోజనాలు సక్రమంగా జరగలేదని, ఎవరూ రాలేదని బంధువులైన గండికోట బుల్లయ్య, దుర్గ తదితరులు ఆరోపిస్తూ, పెళ్లి కొడుకు తల్లిదండ్రులను విమర్శించారు. అంతేకాకుండా వారిపై దౌర్జన్యం చేసి గాయపరిచారని ఎస్సై వీరభద్రరావు చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్లో భారీ విందు
-
ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్లో భారీ విందు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ట్రంప్ దంపతులతో పాటు ఈ విందులో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ కేంద్ర మంత్రులు, తెలంగాణా సీఎం కేసీఆర్‌తో సహా ఆరు రాష్ట్రాల సీఎంలు, భారత్-అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన ట్రంప్ దంపతులకు రామ్‌నాథ్ కోవింద్ దంపతులు రాష్ట్రపతి భవన్ విశేషాలను స్వయంగా వివరించారు. విందుకు విచ్చేసిన అతిథులను వారికి పరిచయం చేశారు. ఆపై విందులో ట్రంప్ అభిరుచికి తగ్గట్టుగా ఘుమఘుమలాడే వంటకాలను వడ్డించారు. కాగా ఆరెంజ్‌తో తయారు చేసిన అమ్యూజ్ బౌజ్ సర్వ్ చేసిన తర్వాత.. సాలమన్ ఫిష్ టిక్కాతో ఈ గ్రాండ్ డిన్నర్ ప్రారంభమైంది. వెజిటేరియన్ ఫుడ్‌లో భాగంగా... రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్ చాట్ తదితర వంటకాలను వడ్డించారు. రాష్ట్రపతి భవన్ సిగ్నేచర్ డిష్ దాల్ రైసీనాతో పాటు.. మటన్ బిర్యానీ, మటన్ ర్యాన్, గుచ్చీ మటార్(మష్రూమ్ డిష్) కూడా అమెరికా అధ్యక్షుడి మోనూలో భాగమైంది. డిన్నర్ అనంతరం డిజర్ట్‌లో భాగంగా... హాజల్‌నట్ ఆపిల్‌తో పాటుగా వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్ రాబ్డీలను అతిధులు ఆరగించారు. చదవండి : ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్ -
విందు: ట్రంప్ మెనూలోని వంటకాలివే!
న్యూఢిల్లీ: తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఘనమైన విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న విందులో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. అదే విధంగా ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ తదితరులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ట్రంప్ అభిరుచికి తగ్గట్టుగా ఘుమఘుమలాడే వంటకాలు తయారుచేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాల సమాచారం. కాగా ఆరెంజ్‌తో తయారు చేసిన అమ్యూజ్ బౌజ్ సర్వ్ చేసిన తర్వాత.. సాలమన్ ఫిష్ టిక్కాతో ఈ గ్రాండ్ డిన్నర్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వెజిటేరియన్ ఫుడ్‌లో భాగంగా... రకారకాల సూపులు ఆలూ టిక్కీ, స్పినాచ్ చాట్ తదితర వంటకాలను ట్రంప్ కుటుంబానికి వడ్డించనున్నారు. (ఇండియాలో టారిఫ్‌లు ఎక్కువ: ట్రంప్) అదే విధంగా రాష్ట్రపతి భవన్ ప్రఖ్యాత వంటకం దాల్ రైసీనాతో పాటు.. మటన్ బిర్యానీ, మటన్ ర్యాన్, గుచ్చీ మటార్(మష్రూమ్ డిష్) కూడా అమెరికా అధ్యక్షుడి మోనూలో చేర్చారు. డిన్నర్ అనంతరం డిజర్ట్‌లో భాగంగా... హాజల్‌నట్ ఆపిల్‌తో పాటుగా వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్ రాబ్డీలను ట్రంప్ ఆరగించనున్నారు. దర్బార్ హాల్లో ట్రంప్‌నకు స్వాగతం పలికిన తర్వాత.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనను లోపలికి తీసుకువెళ్తారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లోని నార్త్ డ్రాయింగ్ రూం వద్ద ఇరువురు కాసేపు భేటీ అవుతారు. (భారత్‌తో ఒప్పందం కుదిరింది: ట్రంప్) ఈ క్రమంలో తాజ్‌మహల్ ప్రతిమతో పాటు కశ్మీర్ కార్పెట్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ట్రంప్‌నకు బహూకరించనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రపతి భవన్లో మంగళవారం జరిగే విందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు మహారాష్ట్ర, హరియాణా, బిహార్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు సమాచారం. ఇక డిన్నర్ అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు. (భారత పర్యటన విజయవంతం: ట్రంప్) ట్రంప్ భారత పర్యటన: సమగ్ర కథనాల కోసం క్లిక్ చేయండి -
ఆ అతిథుల జాబితాలో మన్మోహన్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరవనున్నారు. పలు విపక్ష నేతలను ఈ విందుకు ఆహ్వానించకపోయినా రాష్ట్రపతి ఇచ్చే విందులో మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొంటారని భావిస్తున్నారు. అగ్రదేశాధినేత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి విందును బహిష్కరించాలని లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి నిర్ణయించిన క్రమంలో విందుకు హాజరయ్యేందుకు సర్దార్జీ సంసిద్ధమవడం గమనార్హం. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని ఈ విందుకు ఆహ్వానించకపోవడంపై విపక్ష నేత మండిపడుతున్నారు. విపక్షాలకు చెందిన సీనియర్ నేతలను ఆహ్వానించే ఆనవాయితీని పక్కనపెట్టడమేనని చౌధరి పేర్కొన్నారు. మనసు మార్చుకున్న మన్మోహన్ కాంగగ్రెస్ అధినేత్రి, యూపీఏ చీఫ్ సోనియా గాంధీని ఆహ్వానించనందుకు నిరసనగా ట్రంప్ గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరు కారాదని ముగ్గురు కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు అధీర్ రంజన్ చౌధరి, గులాం నబీ ఆజాద్‌లు విందుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చదవండి : 'సిక్కుల ఊచకోత జరిగేది కాదు' -
ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఈ నెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ విందులో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆహ్వానం పంపింది. ఈమేరకు కేసీఆర్ మంగళవారం ఢిల్లీకి చేరుకుంటారు. కాగా, ట్రంప్ సోమ వారం ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకుని ప్రధాని మోదీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే గౌరవ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. -
పాలు-నీళ్లలా కలిసి పనిచేయండి
-
విందుకోసం స్కూళ్ల మూత..
అనంతపురం, చెన్నేకొత్తపల్లి/యల్లనూరు: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన గురువులు దారి తప్పారు. బదిలీపై వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు ఇస్తున్న విందు కోసం చెన్నేకొత్తపల్లి మండలంలోని స్కూళ్లకు శుక్రవారం అనధికార సెలవు ప్రకటించారు. విద్యార్థులంతా ఇంటిబాట పట్టగా.. సార్లంతా విందు వినోదంలో మునిగిపోయారు. ఇక యల్లనూరు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన తనిఖీకి వెళ్లిన ఎంఈఓపై ఓ ఉపాధ్యాయుడు ఎదురు తిరిగాడు. ‘‘నువ్వు ఏమైనా నీతిమంతునివా.. నీకే అధికారం ఉంది’’ అంటూ నీతి బోధన చేశారు. స్కూళ్లన్నీ మూత చెన్నేకొత్తపల్లి మండలంలోని బసంపల్లి ప్రాథమిక పాఠశాల టీచర్ మారెప్ప పదోన్నతిపై కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురానికి బదిలీ అయ్యారు. ఆయనకు రాజకీయంగా బాగా పలుకుబడి ఉంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పరిటాల సునీతకు టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశాడు. అంతటి ఘన చరిత్ర కలిగిన అయ్యవారు బదిలీ కాగా.. శుక్రవారం చెన్నేకొత్తపల్లిలో విందు ఏర్పాటు చేశారు. మండలంలోని ఉపాధ్యాయులందరికీ ఆహ్వానం పంపారు. సారు పిలిస్తే వెళ్లకపోతే మాటొస్తుందని భావించిన మండలంలోని ఉపాధ్యాయులంతా విందులో పాల్గొనేందుకు అనుమతివ్వాలని ఎంఈఓ రాజశేఖర్‌పై ఒత్తిడి తెచ్చారు. స్కూళ్లు మూతపడితే తనకు మాటొస్తుందని, పైగా వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న తనకెందుకీ తలనొప్పని భావించిన ఎంఈఓ శుక్రవారం సెలవులో వెళ్లిపోయారు. దీంతో ఉపాధ్యాయులు స్కూళ్లకు అనధికార సెలవు ప్రకటించి సీకేపల్లికి వెళ్లగా.. విద్యార్థులంతా ఇంటిబాట పట్టారు. దీనిపై ఎంఈఓ రాజశేఖర్‌ను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా.. అధికారికంగా సెలవు ఇవ్వనప్పటికీ మండలంలోని పాఠశాలలు మూతపడిన విషయం వాస్తవమేనన్నారు. సదరు ఉపాధ్యాయులపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. యల్లనూరు పాఠశాలలో రికార్డులను తనిఖీ చేస్తున్న ఇన్చార్జి తహసీల్దార్ సురేష్ బాబు, ఎంఈఓ చంద్రశేఖర్ ఎంఈఓపై ఎదురుదాడి యల్లనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఇన్చార్జ్ తహసీల్దార్ సురేష్ బాబు, ఎంఈఓ చంద్రశేఖర్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను వారు పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రోజు వారీ మెనూ, రికార్డులను తనిఖీ చేశారు. మూడు నెలలుగా రికార్డులు నమోదు చేయకపోవడంతో పాటు, పిల్లలకు రోజు వారీ మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని వారు గుర్తించారు. దీనిపై ఉపాధ్యాయులను ప్రశ్నించగా సూర్యనారాయణ అనే ఉపాధ్యాయుడు ఎదురు దాడి చేశారు. నీకేం అధికారం ఉంది ‘‘మీరంతా నీతిపరులు పాపం.. అయినా మా పాఠశాలకు ఎందుకు వచ్చావ్..’’ అంటూ పాఠశాలలోని సూర్యనారాయణ అనే ఉపాధ్యాయుడు ఎంఈఓ చంద్రశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా ఉన్నత పాఠశాలకు రావడానికి నీకు ఏం అధికారం ఉందని ప్రశ్నించాడు. ‘‘నీకే కాదు.. మాకూ ఉన్నాయి తెలివితేటలు. కావాలంటే మేము కూడా తెచ్చుకోగలం పేపర్లు.. నీవు మా పాఠశాలకు వచ్చి రాజకీయం చేస్తావా..? ఔ పాపం మీరంతా నీతిపరులు అయి మా పాఠశాలకు వచ్చారు’’ అంటూ సదరు ఉపాధ్యాయుడు నోరుపారేసుకున్నాడు. -
డ్రగ్ ఇన్స్పెక్టర్ విందు బాగోతం
కళ్యాణదుర్గం రూరల్: ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ విందుబాగోతం వివాదాస్పదమైంది. మెడికల్ స్టోర్‌లో తనిఖీకి వెళ్లిన డ్రగ్ ఇన్స్పెక్టర్...తనిఖీల కంటే ముందుగానే ఓ డాబాలో మెడికల్ షాపు నిర్వాహకులతో కలిసి విందులో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని జండు మహదేవి మెడికల్ స్టోర్‌లో కొద్ది రోజుల క్రితం ఓ గొర్రెల కాపరి జీవాల కోసం మందులను కొనుగోలు చేశాడు. అయితే వాటిని వాడకపోవడంతో వెనక్కు తీసుకోవాలని కోరగా దుకాణం నిర్వాహకులు అతనిపై దాడి చేశారు. దీనిపై గొర్రెల కాపరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ దాదాఖలందర్ తనిఖీ కోసం కళ్యాణదుర్గం వచ్చారు. అయితే తనిఖీల కంటే ముందుగానే మెడికల్ షాపుల నిర్వాహకులతో కలిసి ఓ డాబాలో విందు చేశారు. అనంతరం దుకాణంలో తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టారు. అన్నీ నిబంధనలకు విరుద్ధమే జండు మహదేవి మెడికల్ స్టోర్ నిబంధనల ప్రకారం మందులు విక్రయించడం లేదని ఇన్స్పెక్టర్ దాదాఖలందర్ తనిఖీల్లో గుర్తించారు. అంతేకాకుండా అనుమతులు లేని మందులు భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. విందు బాగోతం రచ్చ కావడంతో ఈ విషయాలన్ని మీడియా ప్రతినిధులకు కూడా తెలిపారు. సమగ్ర వివరాలతో ఏడీకి నివేదిక పంపుతానని వెల్లడించారు. మరోవైపు పట్టణంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నారని తెలియడంతో పలు మెడికల్ షాపుల యజమానులు దుకాణాలను మూసి వేశారు. -
సర్వీసు ఉద్యోగులకు ఏపీ సర్కార్ విందు
-
విందులో విషాదం
సీతానగరం(పార్వతీపురం): మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పగలరు. ఓ విందుకు హాజరైన ఓ వ్యక్తి ఎంచక్కా సరదాగా డ్యాన్స్ చేసి అంతలోనే కుప్పకూలి మృత్యువాత పడిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం గుచ్చిమిలో మంగళవారం రాత్రి ఓ పెళ్లి విందు కార్యక్రమానికి వచ్చిన వ్యక్తి స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. హైదరాబాద్ నగరం ఉప్పల్‌కు చెందిన కసిరెడ్డి అంజిబాబు(36) తన అన్నయ్య నాగేశ్వరరావుతో కలసి స్నేహితుడు గుచ్చిమికి చెంది సీహెచ్.అశోక్ ఇంట్లో వివాహవిందు కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం వచ్చారు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో విందు ఆరగించి, డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో ఊపిరాడక మృతిచెందారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కసిరెడ్డి అంజిబాబు బతుకు తెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లిపోయి ఉప్పల్‌లో సొంతంగా స్వగృహ స్వీట్‌షాపు నడుపుకుంటున్నాడనీ, తమ స్నేహితుడు అశోక్ చిన్నాన్న కుమారుడు అక్కేన ముకుందరావు పెళ్లి రిసెప్షన్ నిమిత్తం వచ్చామనీ, ఈ కార్యక్రమంలో డ్యాన్సు చేస్తుండగా రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో తమ్ముడు అంజబాబు ఒకసారిగా కుప్పకూలి కింద పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడని చెప్పారు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం కారులో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించామనీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. బుధవారం ఉదయం సీతానగరం పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలియ జేసారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ఎస్ క్రిష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియ జేశారు. -
వివాదాస్పదమైన జేసీ ప్రభాకర్‌రెడ్డికి సీఐ భారీ విందు
-
డిన్నర్ ఆ టైమ్‌లో ముగిస్తే..
లండన్ : నిద్రకు ఉపక్రమించే రెండు గంటల ముందుగా డిన్నర్‌ను రాత్రి 9 గంటలలోపు ముగిస్తే బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ల ముప్పు ఐదో వంతు తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆహారం తీసుకుంటే శరీరంలో వాపులు ఏర్పడటంతో పాటు, రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుతాయని ఇవి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గతంలో సూర్యాస్తమయానికి ముందే ఆహారం తీసుకునేవారని, నిద్ర పోయే లోపు అది జీర్ణయమయ్యేదని, ప్రసుత్తం ఆధునిక జీవితంలో పొద్దుపోయేవరకూ పనిచేయడం, దూర ప్రాంతం నుంచి ఇంటికి చేరుకోవడంతో ఆలస్యంగా తినడం అలవాటైందని ఇది ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటున్నారు. రాత్రి 9 గంటలలోపు డిన్నర్ తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుందని బార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. పడుకునే సమయానికి రెండు గంటల ముందు ఆహారం తీసుకుంటే ఈ క్యాన్సర్ల ముప్పు 20 శాతం వరకూ తగ్గుతుందని తెలిపారు.అథ్యయన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమయ్యాయి. -
రణ్‌బీర్ ఫ్యామిలీతో అలియా డిన్నర్
బాలీవుడ్లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ల మధ్య ప్రేమాయణం హాట్ టాఫిక్‌గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి బంధానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం రణ్‌బీర్ కుటుంబం అలియాను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్, సోదరి రిదిమాలతో అలియాకు సత్సబంధాలే ఉన్నాయి. తాజాగా శనివారం సాయంత్రం రణబీర్ కుటుంబంతో కలసి అలియా డిన్నర్‌కు వెళ్లింది. అలియా, రణబీర్‌లతో పాటు నీతూ కపూర్, రిదిమా, సమర(రిదిమా కూతురు) కూడా ఉన్నారు. ముంబైలోని సెయింట్ రెగిస్ హోటల్లో వీరు డిన్నర్‌కు హాజరైన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో అలియా సమరతో ముందు నడుస్తుండగా.. రణబీర్, నీతూ, రిదిమా వారి వెనుక ఉన్నారు. కాగా.. రణ్‌బీర్ కపూర్ వీరి బంధాన్ని అంగీకరించిన సంగతి తెలిసిందే. తాము రిలేషన్షిప్లో ఉన్నాం.. ఇప్పుడు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడలనుకోవడం లేదని తెలిపారు. అలియా మాత్రం తన బిగ్గెస్ట్ క్రష్ రణ్‌బీర్ అని చెప్పినప్పటికీ నేరుగా తమ బంధం గురించి మాత్రం ఎటువంటి కామెంట్లు చేయలేదు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సీరియస్‌గానే సాగుతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. వీరిద్దరు తొలిసారి ‘బ్రహాస్త్ర’ చిత్రంలో కలసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి వీరు ఎక్కడికెళ్లిన అదో వార్తగా మారుతోంది. దీంతో ప్రస్తుతం వీరి పెళ్లిపై అభిమానుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
సిరాజ్ ఇంట్లో ఆర్సీబీ ప్లేయర్లకు విందు
-
ఎవరెస్ట్‌పై కాస్ట్లీ డిన్నర్ !
ఆ విందు తినాలంటే మీరు భోజన ప్రియులైతే మాత్రమే సరిపోదు. గుండెల్లో కాస్త ధైర్యం ఉండాలి. శారీరక పుష్టి, ఆర్థిక పరిపుష్టి కూడా మీ సొంతమై ఉండాలి.. అప్పుడే ఆ డిన్నర్ ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే అదేమీ అల్లాటప్పా భోజనం కాదు. సముద్ర మట్టానికి ఏకంగా 11,600 అడుగుల ఎత్తులో వండి వార్చబోతున్నారు. ఎవరెస్ట్‌పై ఒక అరుదైన ప్రపంచ రికార్డు కోసం కొంత మంది చెఫ్‌లు భారీగా కసరత్తు చేస్తున్నారు. నేపాల్ బేస్ క్యాంప్‌లో ఓ రెస్టారెంట్ గిన్నీస్ రికార్డులకెక్కడానికి సన్నాహాలు చేస్తోంది. దీని వెనుక మొత్తం నలుగురు చెఫ్‌లు ఉన్నారు. ట్రియాంగ్యోని పేరుతో ఎవరెస్ట్‌పై డిన్నర్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. అంత ఎత్తులో అసలు ఆక్సిజన్ అందక ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది, అలాంటిది భోజనం చేయడం అంటే మాటలా ? అందుకే ఆ వాతావరణానికి తగ్గట్టుగా మెనూ రూపొందిస్తున్నారు. ఈ మెనూలో మసాలా పదార్థాలకే పెద్ద పీట వేస్తామని రెస్టారెంట్లో భాగస్వామి అయిన మన ఇండియన్ చెఫ్ సంజయ్ థాకూర్ వెల్లడించారు. వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల్ని కూడా తట్టుకుంటూ ఈ నెలఖారు నుంచి రోజుకి ఆరుగంటల సేపు ట్రెక్కింగ్ చేస్తూ నలుగురు చెఫ్‌లు, పదిమంది అతిథులు ఎవరెస్ట్‌కు చేరుకోనున్నారు. అతిథులెవరైనా ట్రెక్కింగ్ చేయలేకపోతే వారంతా హెలికాప్టర్లలో ఎవరెస్ట్‌కు చేరుకునే సదుపాయం కూడా ఉంది. ఎవరెస్ట్‌పై డిన్నర్ తినాలనుకునే ప్రతి ఒక్కరూ 3 లక్షల 64 వేల రూపాయలు చెల్లించాలి. కేవలం భోజనం మాత్రమే కాదు, ప్రయాణానికయ్యే ఖర్చు, వసతి అన్నింటికి కలిపి ఆ మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఎవరెస్ట్ లాంటి ప్రాంతానికి వెళ్లాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు మరి. అలా వచ్చిన మొత్తాన్ని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే హార్ట్ ఫర్ ఇండియా ఫౌండేషన్‌కు ఇవ్వనున్నారు. అన్నట్టు ఇలా ఎవరెస్ట్‌పై డిన్నర్ ఐడియా ఇది మొదటిసారి కాదు. 2016లో ప్రఖ్యాత చెఫ్ జేమ్స్ షెర్మన్ ఇలా రకరకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కానీ అది వరల్డ్ రికార్డులకు ఎక్కలేదు. ఈసారి ఎలాగైనా ప్రపంచ రికార్డులకెక్కాలని చెఫ్‌లు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎవరెస్ట్‌పై భోజనం చేయాలన్న ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా ఫైన్‌డైనింగ్ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. -
నేడు విపక్ష నేతలకు సోనియాగాంధీ విందు
-
ట్రంప్‌తో డిన్నర్: మనవాళ్లు ముగ్గురు
దావోస్: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ యూరోపియన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టాప్ 15 కంపెనీల సీఈవోలతో ట్రంప్ డిన్నర్‌కు హాజరయ్యారు. డైన్ విత్ గ్లోబల్ బిజినెస్ లీడర్స్ కార్యక్రమంలో ముఖ్యంగా భారత సంతతికి చెందిన ముగ్గురు సీఈవోలు పాల్గొనడం విశేషం. నోవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్, నోకియా సీఈవో రాజీవ్ సూరి , డెలాయిట్ సీఈవో పునీత్ రెన్జెన్ ట్రంప్‌తో ఈ డిన్నర్లో పాల్గొన్న ప్రముఖులు. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి అయిన నరసింహన్ సెప్టెంబరు 2017 లో నోవార్టిస్ సీఈవోగా ఎంపికయ్యారు. రోహ్తక్లో జన్మించిన పునీట్ రెన్జెన్ జూన్ ,2015లో డెలాయిట్ సీఈవోగా నియమితులయ్యారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన ప్రయత్నాలలో భాగంగా అమెరికాలో పెట్టుబడులు పెట్టమని ట్రంప్ టాప్ సీఈవోలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన హయాంలో అభివృద్ధి చెందుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. తన పన్ను విధానాలు, డీరెగ్యులేషన్ లతోపాటు అమెరికన్ వ్యాపారవృద్ధిలో తన కృషి గురించి వివరించారు. ఇంకా ఈ డిన్నర్‌కు అమెరికా ప్రతినిధి బృందంలో విదేశాంగ కార్యదర్శి రెక్స్ తిల్లెర్సన్, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కిర్స్టేజెన్ నీల్సన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హెచ్ ఆర్ మక్ మాస్టర్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ గ్యారీ కోహెన్ హాజరయ్యారు. -
‘కరువు జిల్లాలో రూ.10 లక్షలతో డిన్నర్’
సాక్షి, బెంగళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కరువు జిల్లా కలబురగిలో సీఎం డిన్నర్ పార్టీ కోసం రూ. పదిలక్షలు వెచ్చించారని బీజేపీ నేత ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత కరువు ప్రభావిత జిల్లాగా కలబురగి రికార్డులకెక్కింది. రైతులు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో కలబురగిలో కర్ణాటక సీఎం విందు కోసం ఏకంగా పది లక్షలు ఖర్చు పెట్టారని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌కుమార్ తెల్కూర్ ఆరోపించారు. సిద్ధరామయ్య రైతులకు క్షమాపణ చెప్పి వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులకు విందు ఇచ్చేందుకు జిల్లా అధికారులు రూ.10 లక్షలు ఖర్చు చేశారని అన్నారు. ఒక్కో ప్లేట్‌కు రూ 800 ఖర్చు చేశారని, కొందరు వీవీఐపీలకు వెండి కంచాలు, బౌల్స్‌లో వడ్డించారని చెప్పారు. బీజేపీ నేత ఆరోపణలపై కలబురగి జిల్లా అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు. కర్ణాటకలో 2018 ప్రధమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
రాష్ట్రపతికి గవర్నర్ విందు
-
విందు కోసం..
వారంతా ఉన్నత విద్యావంతులు. మంచి స్నేహితులు. అందరూ కలిసి విందు చేసుకున్నారు. అయితే డబ్బు తక్కువపడడంతో హైవేపైకి వచ్చి ఆర్టీఏ అధికారులమంటూ వాహనదారులను బెదిరించి డబ్బు వసూలు చేశారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. కల్లూరు: నగర శివారు గోశాల వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులమంటూ వాహన డ్రైవర్లను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఉలిందకొండ ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మద్దూర్‌నగర్‌కు చెందిన చాకలి ఇనుకొండ వంశీ మహేష్, గురుబ్రహ్మ నగర్‌కు చెందిన పెండేకల్ రమణాచారి, లక్ష్మీటౌన్‌షిప్ వాసి కొండేటి సందీప్, బాబాబృందావన్‌నగర్ వాసి కవడపు నరహరి, గణేష్‌నగర్–2 నివాసి జి. అరుణ్‌కుమార్ యాదవ్, శకుంతలా కళ్యాణమంటపం వెనకనున్న రాజేశ్వరినగర్ వాసి వడ్డె వెంకటేష్‌ప్రసాద్ మంచి స్నేహితులు. ఈనెల 21న అందరూ కలిసి విందు ఏర్పాటు చేసుకున్నారు. పార్టీకి డబ్బు తక్కువ రావడంతో గోశాల వద్ద జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులమని, డబ్బివ్వాలంటూ ట్యాంకర్ డ్రైవర్ పుల్ల మాబాషాపై దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా సందీప్ ట్రాన్స్‌కోలో జూనియర్ లైన్మెన్, నరహరి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఏవియేషన్ ఆఫీసర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తుండగా, జి. అరుణ్‌కుమార్ పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ ఫైనలియర్ చదుతున్నాడు. వంశీ మహేష్, వడ్డె వెంకటేష్‌ప్రసాద్ బీటెక్ ఫెయిలయ్యారు. -
ఇవాంకతో డిన్నర్!
తెలంగాణ ప్రభుత్వం ఇవాంక గౌరవార్థం... గోల్కొండ కోటలో పెద్ద విందు ఏర్పాటు చేసింది. హైదరాబాదీ స్పెషల్స్ ఆ విందులో హైలైట్. దాదాపు వంద రకాల వంటకాలు ఉంటాయట! మనం అక్కడ ఎలాగూ తినలేం... ఓ నాలుగు రకాలు చేసుకుని... మనింట్లోనే ఇవాంక డిన్నర్ కానిచ్చేద్దాం. డబుల్ కా మీఠా (స్లైస్) కావలసినవి : బ్రెడ్ ముక్కలు – 10 ,పంచదార – 1 కప్పు, పాలు – 1 కప్పు ,నెయ్యి – పావు కప్పు,ఏలకులు – 4,జీడిపప్పులు – 10,బాదం పప్పులు – 10,పిస్తా – 10 తయారి : ఒక్కొక్క బ్రెడ్‌ను నాలుగుముక్కలు చేసి నేతిలో వేయించుకోవాలి. పాలు మరిగించి పక్కనుంచాలి. మరొక పాత్రలో పంచదారను పాకం పట్టుకోవాలి. బ్రెడ్ ముక్కలను పాకంలో వేసి మరిగించిన పాలుపోసి ముక్క చెదరకుండా, పాలు, పాకం కలిసేలా చూడాలి. బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నని ముక్కలుగా తరిగి నేతిలో వేయించి కలుపుకోవాలి. షీర్ ఖుర్మా కావలసినవి : సేమ్యా – 2 కప్పులు (సన్నని సేమ్యా), పంచదార – 1 కప్పు, నెయ్యి – 4 టీ స్పూన్లు, బాదం – గుప్పెడు, జీడిపప్పులు – గుప్పెడు, పిస్తా – గుప్పెడు, చార్మస్ (తర్బూజ గింజలు) – 2 టీ స్పూన్లు తయారి : సేమ్యా, బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరిగి నేతిలో వేయించాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరగనివ్వాలి. మరిగిన పాలకు పంచదార కలిపి మరో పదినిమిషాలు మరిగించాలి. వేయించిన సేమ్యా, బాదం, పిస్తా, జీడిపప్పులు కలిపి రెండు నిమిషాలు ఉడికించి స్టౌ పైనుంచి దించేయాలి. ఖుబానీ కా మీఠా కావలసినవి: ఖుబానీ (డ్రై ఆప్రికాట్స్) – కేజీ; పంచదార – ఒకటిన్నర కేజీ; రాస్ప్బెర్రీ సిరప్ – 100 మి.లీ. (బేకరీలలో దొరుకుతుంది); రాస్స్బెర్రీ కలర్ – రెండు టీ స్పూన్లు తయారి: ఒక పాత్రలోకి ఖుబానీలను తీసుకుని అందులో నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. (ఖుబానీలు మునిగాక వాటి మీద రెండు అంగుళాల మేరకు నీరు ఉండాలి). మరుసటిరోజు వాటిలోని గింజలను వేరుచేయాలి. ఇప్పుడు ఈ పాత్రను ఆ నీటితోనే స్టౌ మీద ఉంచాలి. ఒక నిముషం అయిన తరువాత అందులో పంచదార వేయాలి. పంచదార పూర్తిగా కరిగి, ఖుబానీలు మెత్తగా, చిక్కగా అయ్యి, గోధుమ రంగులోకి వచ్చేవరకు ఉంచాలి. ఇప్పుడు స్టౌమీద నుంచి దింపేసి, అందులో రాస్ప్బెర్రీ సిరప్, రాస్ప్ బెర్రీ కలర్ వేసి కలిపి, ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్రీమ్‌తో గార్నిష్ చేయాలి. దమ్ బిర్యానీ కావలసినవి : చికెన్ – అర కిలో, బాస్మతి బియ్యం – 1 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూను, గరం మసాలా – అర టీ స్పూను, పసుపు – అర టీస్పూను, దాల్చిన చెక్క – చిన్న ముక్క, ఏలకులు – 4, లవంగాలు – 5, కుంకుమ పువ్వు – చిటికెడు, కారం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఉల్లిగడ్డ – 1, పాలు – 1 కప్పు తయారి : చికెన్‌ను శుభ్రపరచి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పట్టించి అరగంట పాటు పక్కనుంచాలి. బాస్మతి బియ్యాన్ని సగం ఉడకనిచ్చి నీళ్ళు వడకట్టి పక్కనుంచాలి. అడుగు మందంగా వున్న పాత్రలో అడుగున చికెన్‌ను పేర్చి దానిమీద సగం ఉడికించిన బియ్యాన్ని అమర్చాలి. దీనిని తక్కువ మంటమీద ఉడికించాలి. పాలలో కుంకుమపువ్వు కలిపి ఉడికిన బిర్యానీ పైన చల్లి మూత పెట్టుకోవాలి. ఉల్లిగడ్డని పొడవుగా తరిగి అర టీ స్పూను అల్లంవెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఉప్పు కలిపి వేయించాలి. ఉల్లిగడ్డ మిశ్రమాన్ని ఉడికిన బిర్యానీ పైన చల్లి మరో పదినిమిషాలపాటు మగ్గనిచ్చి స్టౌపైనుంచి దించేయాలి. పత్తర్ కా ఘోష్ కావలసినవి: బోన్‌లెస్ మటన్– ఒక కేజీ ,మారినేట్ చేయడానికి: ,అల్లం వెల్లుల్లి పేస్ట్– ఒక టేబుల్ స్పూన్ ,కారం పొడి– ఒక టేబుల్ స్పూన్ ,పసుపు– పావు టేబుల్ స్పూన్ ,పచ్చి బొప్పాయి పేస్ట్– రెండు టేబుల్ స్పూన్లు ,గరం మసాలా– ఒక టేబుల్ స్పూన్ ,మిరియాల పొడి– ఒక టేబుల్ స్పూన్ ,పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్ ,నిమ్మకాయ రసం– ఒక ,టేబుల్ స్పూన్ ,పత్తర్ కే ఫూల్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్ ,ఉప్పు– రుచికి తగినంత ,నూనె లేదా నెయ్యి– నాలుగు టేబుల్ స్పూన్లు ,గార్నిష్ చేయడానికి: ,ఉల్లిపాయ చక్రాలు– ఒక పెద్ద ఉల్లిపాయవి ,నిమ్మకాయ ముక్కలు– నాలుగు నిమ్మకాయలవి ,కొత్తిమీర తరుగు– ఒక కప్పు ,పుదీన తరుగు– ఒక కప్పు తయారీ: 1. పెద్ద పాత్రలో మాంసం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బొప్పాయి గుజ్జు, పచ్చిమిర్చి పేస్టు, నిమ్మరసం కలిపి 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. 2. మరొక పాత్రలో నెయ్యి, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, పత్తర్ కే ఫూల్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో పైన కలిపి పెట్టుకున్న మాంసం ముక్కలను వేసి మసాలా సమంగా పట్టేటట్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. 3. పత్తర్ కా ఘోష్ చేసే రాయి (పెనం లాంటిది)ని వేడి చేయాలి. రాయి మీద నీటిని చల్లి వేడి చూసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత మాంసం ముక్కలను రాయి మీద వరుసగా పేర్చాలి. ముక్కలనీ తీసిన తర్వాత పాత్రలో మిగిలి పోయిన మసాలా నీటిని కొద్ది కొద్దిగా ముక్కల మీద వేయాలి. నీరు ఆవిరైన తర్వాత ముక్కలను తిరగవేయాలి. చపాతీని తిరగేస్తూ కాల్చినట్లు మాంసం ముక్కలను అనేక సార్లు తిరగవేస్తూ బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. 4. రాయి మీద నుంచి తీసి ఉల్లిపాయ చక్రాలు, నిమ్మకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీన తరుగుతో గార్నిష్ చేయాలి. -
క్యాండిల్‌లైట్ డిన్నర్.. అడవిలో
క్షణం తీరిక లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయాల్సిన నేటి తరుణంలో సేదతీరే సమయం కూడా ఉండదు. విధులు ముగించుకుని నిశిరాత్రిలో ఇంటికి వచ్చినా.. అలా ఆకాశం వైపు చూస్తూ.. నక్షత్రాలను చూసే భాగ్యమూ ఉండదు. ఇల్లు, వీధిలో ఉన్న విద్యుత్ దీపాలే.. అసలు ప్రపంచంగా గడిపేస్తుండటం చూస్తుంటాం. అయితే వీరిలో చాలామంది చిన్నప్పుడు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవారే. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నింటినీ దూరమైన వీరు నాటి జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. ఇలాంటి జీవితాన్ని, వాతావరణాన్ని కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది ఓ ప్రైవేటు సంస్థ. గ్రాస్వాక్ పేరుతో పచ్చని ప్రకృతిలో క్యాండిల్‌లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేస్తూ నగర ప్రజలను ఆకట్టుకుంటోంది. వికారాబాద్ అర్బన్ : సువిశాల అటవీ ప్రాంతం.. చుట్టూ పచ్చని చెట్లు.. పక్షుల కిలకిలరావాలు.. ఆ మధ్యే చల్లని గాలులు. వివిధ రకాల పక్షులు కనువిందు చేస్తుంటాయి. ఇలాంటి వాతావరణం వికారాబాద్ పట్టణానికి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుపల్లి పరిధిలో గ్రాస్వాక్ గుట్టపై కనిపిస్తుంది. ఇక్కడి వాతావరణం ఎంతటి స్వచ్ఛత అంటే.. 50 ఏళ్ల వెనక అటవీ ప్రాంతంలోని పల్లెటూరి వాతావరణానికి అతి దగ్గరగా ఉంటుంది. అక్కడున్నంతసేపూ మనల్ని మనం మరచిపోతామంటే.. అతిశయోక్తి కాదు. ఆన్లైన్ బుకింగ్.. ఇందులో ఒకరోజు గడపాలనుకుంటే www. thegrasswalk.com సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. నేరుగా కూడా వెళ్లవచ్చు. అయితే అక్కడ గుడారాలు ఖాళీగా ఉంటేనే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో వెనుతిరిగి రావాల్సిందే. ఆన్లైన్లో మీకు కన్ఫర్మ్ అయ్యిందంటే.. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు లోపలికి అనుమతిస్తారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు అందులో గడపవచ్చు. భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ఉంటే 24 గంటలకు రూ.3,300 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేవలం ఉదయం టిఫిన్ మాత్రమే అందిస్తారు. రాత్రి డిన్నర్ గెస్టులు ఇచ్చిన ఆర్డర్‌పై చేసి ఇస్తారు. నలుగురి కంటే.. సంఖ్య పెరిగితే ఒక్కొక్కరికి అదనంగా రూ.1,000 చార్జ్ చేస్తారు. రూ.3,300లోనే పగటి పూట, సాయంత్రం వేళల్లో ట్రెక్కింగ్, స్విమ్మింగ్ చేయిస్తారు. క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేకత.. గ్రాస్వాక్లో క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేకం. సువిశాలమైన ఈ ప్రాంతంలో వంద మీటర్ల దూరంలో అంతకంటే ఎక్కువ దూరంలో గుడారాలు వేస్తారు. అందులో అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయి. కానీ.. రాత్రి పూట క్యాండిల్‌లైట్ వెలుతురులో డిన్నర్ ఏర్పాటు చేస్తారు. ఇలాంటి డిన్నర్ చేయడానికి పట్టణ వాసులు ఎంతగానో ఇష్టపడతారు. ఆర్డర్‌పై వెజ్, నాన్‌వెజ్ వంటకాలు చేసి పెట్టడానికి సహాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎలా వెళ్లాలి.. హైదరాబాద్ నుంచి వికారాబాద్ దూరం 70 కి.మీ. ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వారు వికారాబాద్‌లోకి రాగానే ఎన్నెపల్లి నుంచి ఎడమకు తిరగాలి. నస్కల్ – పరిగి రూట్ లేదా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దారిలో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా 8 కి.మీ. లోనికి వెళ్లాక.. గుడుపల్లి గ్రామ బస్‌స్టాప్ వస్తుంది. అక్కడి నుంచి ఎడమకు తిరిగి ఒక కిలోమీటర్ ముందుకు వెళితే.. గ్రాస్వాక్ చేరుకుంటాం. -
నేతలకు వెంకయ్య విందు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, దాదాపు 45 మంది కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. రొయ్యల ఫ్రై, నెల్లూరు చేపల కూర, ఆంధ్రా చికెన్, పలు చట్నీలు, స్వీట్లు సహా పలు రుచికర ఆంధ్రా వంటకాలను ఈ విందులో వడ్డించారు. కేంద్ర మంత్రుల్లో రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ, స్మృతి ఇరానీ, విపక్ష నేతల్లో గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కణిమొళి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు ఈ విందుకు హాజరయ్యారు. 16న ఉప ఎన్నిక వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి నవంబర్ 16న ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నవంబర్ 6 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. -
బాలయ్య బాబు-బాలీవుడ్ భామ@ డిన్నర్
పూరి జగన్నాధ్ దర్శకత్వం లో బాలకృష్ణ- శ్రేయ- కైరాదత్ కాంబినేషన్లో వస్తున్న ఫిల్మ్ ‘పైసా వసూల్’. ఈ మూవీ వెరైటీ స్టంపర్ శ్రావణమాసం తొలి శుక్రవారం (నేడు)రిలీజ్ కానుంది. దీని కోసం ఒకవైపు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మరోవైపు ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ భామ కైరా ఓ ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హీరో బాలకృష్ణతో కలిసి డిన్నర్ చేసిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా హీరో బాలకృష్టపై ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణగారు నిజమైన జెంటిల్మెన్, మనసు బంగారం అంటూ అపారమైన ప్రేమను, శాశ్వతమైన గౌరవాన్ని చాటుకుంటూ ట్వీట్ చేయడం విశేషం. కాగా రెగ్యులర్ టీజర్, ట్రైలర్లకు భిన్నంగా ఉండే తమ స్టంప్కోసం ఈ నెల 28వ తేదీ వరకు వెయిట్ చేయండి అని ఇప్పటికే పూరి ప్రకటించిన సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.. త్వరలోనే రిలీజ్ కానున్న ఆడియోపై అభిమానుల్లో భారీ అంచనానే నెలకొన్నాయి. Date night with Balakrishna Garu. A true gentleman & a man with a golden heart. Unconditional love & eternal respect. #NBK101 #PaisaVasool pic.twitter.com/RbzohSS0Ev — Kyra Dutt (@KyraDutt) July 27, 2017 -
19మంది డిన్నర్, 18.29లక్షలు ఖర్చు
అమరావతి: అసలే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి యనమల రామకృష్ణుడు సైతం ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని కోరారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఖర్చులు ఖజానాపై ప్రభావం చూపున్నాయి. లక్షలకు లక్షలు ఖర్చులు పెట్టి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజల ఆవేదన. దీనికి ఉదాహణగా ఏపీ ప్రభుత్వం 19 మంది ప్రముఖుల భోజనాల కోసం సుమారు 19లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇదేదో గాలి లెక్కలు కాదు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్నవివరాలు. ఈ ఏడాది ఫిబ్రవరి 23,24 తేదీల్లో ఏపీ ప్రభుత్వం విజయవాడలో "ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్" అనే అంశంపై రెండురోజుల పాటు అంతర్జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈసమావేశానికి అనేక మంది ప్రముఖలు హాజరయ్యారు. వర్క్‌షాప్ అనంతరం వీరికోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో పాల్గొన్నది కేవలం 19మంది మాత్రమే. ఈ విందుకోసం ప్రభుత్వం రూ.13,38,720 ఖర్చు చేసింది. మరో రూ.4,90,705 లను వారి సదుపాయల నిర్వహణకు ఖర్చు చేసింది. మొత్తం 18,29,425 రూపాయలను ఏపీ ప్రభుత్వం వినియోగించింది. ఈవివరాలు అన్నీ ఒక సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినవి. రాష్ట్ర అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఒక విందు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడం సరైనదేనా అనేది సామాన్య పౌరుడి ప్రశ్న. -
ప్రతిపక్షాల ఐక్యతా రాగం..
విపక్షాలతో సోనియాగాంధీ విందు సమావేశం ► రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై చర్చ ► ఎవరి పేర్లూ చర్చకు రాలేదని మమత వెల్లడి న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తి చేసుకున్న రోజే ప్రతిపక్షాలన్నీ ఐక్యతారాగం ఆలపించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎన్డీఏ యేతర రాజకీయ పక్షాలతో శుక్రవారం విందు సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో జరిగిన ఈ భేటీకి పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో చిరకాల ప్రత్యర్థులైన వామపక్షాలు –తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)–బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)తో పాటు 17 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, డీఎంకే నుంచి కనిమొళి, వామపక్షాల నుంచి సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, పి.కరుణాకరన్, జేడీయూ నుంచి శరద్‌యాదవ్, కేసీ త్యాగి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లాతో పాటు పలు ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ హాజరు కాలేదు. అయితే శనివారం ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్.. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ విందు భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించేందుకు విస్తృత చర్చ జరిగినట్టు తెలిసింది. వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ సమావేశం ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అభ్యర్థి ఎంపిక కోసం కమిటీ: మమత రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే విషయంలో ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం రాకుంటే.. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేస్తామని మమత తెలిపారు. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరీ పేరూ చర్చకు రాలేదని చెప్పారు. -
కామెడీ కార్నర్
బస్సులో ప్రయాణికుడు చాలా సేపట్నుంచి తుమ్ముని ఆపుకోడానికి నానా తంటాలు పడుతున్నాడు. తుమ్మడానికి ఏదో టెక్నిక్ ఉపయోగించి ఆపసాగాడు. పక్కనున్నతను సహనం కోల్పోయి అన్నాడు ‘‘ఎందుకండీ తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తారు... తుమ్మేస్తే పోతుంది కదా?’’ మొదటతను ‘‘మా ఆవిడ చెప్పింది... ‘మీకు ఎప్పుడు తుమ్ము వచ్చినా నేను నిన్ను గుర్తుచేసుకుంటున్నాను... నువ్వు నా వద్దకు రావాలి అని అర్థం’ అని చెప్పిందండి’’ అన్నాడు ముక్కును నలుపుకుంటూ... ‘‘అయితే ఏంటి... వెళ్ళచ్చుగా...’’ ‘‘ఆవిడ చనిపోయిందండీ...’’ ‘ఈరోజు మన ఇంటికి ఒక ఫ్రెండ్‌ను డిన్నర్‌కు పిలిచాను’ అన్నాడు అప్పారావు తన భార్యతో. ఆమె అగ్గి మీద గుగ్గిలం అయింది. ‘మన ఇల్లు ఏమైనా హోటల్ అనుకున్నావా? నేను చెత్తగా వండుతాననే విషయం నీకు తెలుసుకదా?’ అప్పారావు: తెలుసు భార్య: తెలిసి కూడా మన ఇంటికి ఎందుకు డిన్నర్‌కు పిలుస్తున్నావు? అప్పారావు: కుర్రాడు పెళ్లి చేసుకోవాలని సరదా పడుతుంటేనూ... -
మీడియా విందుకు ట్రంప్ డుమ్మా
హాజరు కావడంలేదని ట్విటర్లో వెల్లడించిన అధ్యక్షుడు వాషింగ్టన్ : మీడియాపై తరచూ నోరుపారేసు కుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జర్నలిస్టులపై తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు. జర్నలిజం స్కాలర్‌షిప్‌లకోసం ప్రతి ఏటా వైట్‌హౌస్ కరస్పాండెట్స్ అసోసి యేషన్ (డబ్ల్యూహెచ్‌సీఏ) నిర్వహించే విందు కు తాను హాజరుకావడంలేదని చెప్పారు. దశాబ్దాల తర్వాత ఈ విందుకు డుమ్మా కొట్టిన అధ్యక్షుడు ట్రంపే కావడ గమనార్హం. ‘‘వైట్ హౌస్ కరస్పాండెంట్ల విందుకు నేను హాజరుకావడంలేదు. అందరికీ శుభాకాంక్షలు, విందు బాగా జరగాలని కోరుకుంటు న్నా’’ అని ట్విటర్లో ట్రంప్ పేర్కొన్నారు. జర్నలిజం స్కాలర్షిప్ ఫండ్ కోసం ప్రతి ఏటా ఈ విందును నిర్వహిస్తారు. దీనికి అమెరికా అధ్యక్షుడు, జర్నలిస్టులు, ప్రముఖులు హాజరవుతారు. 1920లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 29న విందు ఏర్పాటు చేశారు. 1972లో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఈ విందుకు హాజరు కాలేదు. నిక్సన్ తర్వాత ట్రంప్ ఈ విందుకు హాజరుకావడంలేదు. 1981లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కూడా విందుకు వ్యక్తిగతంగా హాజరుకాలేదు. అంతకుముందు ఆయనపై హత్యాయత్నం జరగడంతో దాని నుంచి కోలుకునే క్రమంలో విందులో పాల్గొనలేకపోయారు. -
శింబు విందుకు వరలక్ష్మి
నటుడు శింబు విం దులో వరలక్ష్మిశరత్‌కుమార్ పాల్గొన్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది, తారలు విందు, వినోదాల్లో పాల్గొనడం షరామామూలే కదా..అంటారా? నిజమే శింబు, వరలక్ష్మి కలిసి పోడాపోడీ చిత్రంలో కూడా నటిచారు. ఇంకా చెప్పాలంటే వరలక్ష్మి శరత్‌కుమార్‌కు తొలి హీరో శింబునే. అరుునా కాస్త ఆలోచిస్తే వీరి తాజా కలరుుక ఆసక్తిగానే ఉంటుంది. నటుడు విశాల్‌కు వరలక్ష్మికి మధ్య ప్రేమాయణం సాగుతోందని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని హాట్‌హాట్ వందంతులు చాలానే విన్నాం. అలాంటిది ఇటీవల వారి ప్రేమ బ్రేకప్ అరుు్యందనే ప్రచారాన్ని చూశాం. ఇక నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో విశాల్ వ్యతిరేక వర్గానికి శింబు మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కూడికలు, తీసివేతలు చూస్తే శింబు విందులో వరలక్ష్మి పాల్గొనడం ఆసక్తికరంగా అనిపించక మానదు. ఇక అసలు విషయం ఏమిటంటే నటుడు శింబుకు విన్నైతాండి వరువాయా చిత్రం తరువాత సరైన హిట్ లేదనే చెప్పాలి. పైగా ఆ తరువాత వివాద సంఘటనలు, కేసులు, కోర్టులు అంటూ చాలా సమస్యలను ఎదుర్కొన్నా రు. అలాంటి సరిస్థితుల్లో ఆయన న టించిన అచ్చంయన్భదు మడమైయడా చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి చిత్రం యూనిట్ ఇటీవల ఒక నక్షత్ర హోటల్లో విందు, వినోదాలతో గడిపారు. ఈ పార్టీలో వరలక్ష్మిశరత్‌కుమార్, త్రిష, రమ్యకృష్ణ పాల్గొని ఆకర్షణగా మారారు. అందరూ శింబుతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపేశారు. ఆ ఫొటోలిప్పుడు మీడియాలో హల్చల్ చేస్తున్నారుు. -
'మీడియా లేని పోలీసింగ్‌ను ఊహించలేం'
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో మీడియా లేకుండా పోలీసింగ్‌ను ఊహించలేమని నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీసులు తీసుకునే ప్రతి చర్యలోనూ మీడియా పాత్ర వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. ప్రతి దశలోనూ పోలీసులకు మీడియా అండగా నిలిచిందని కితాబిచ్చారు. రంజాన్, గణేష్ ఉత్సవాలు, బక్రీద్ పండుగల్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులకు సహకరించిన మీడియాకు కొత్వాల్ గురువారం ఆత్మీయ పూర్వక విందు ఇచ్చారు. జలవిహార్‌లోని వేదిక హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... 'ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలమైంది. అనేక సందర్భాల్లో పుకార్లను అరికట్టడంతోపాటు నిజానిజాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంలో కీలకపాత్ర పోషిస్తోంది. బుధవారం నగరంలో అనేకచోట్ల బాంబులు ఉన్నాయంటూ పుకార్లు సోషల్ మీడియాలో చెలరేగాయి. దీనిపై నేను ఇచ్చిన వివరణను ప్రజల్లోకి మీడియా తీసుకువెళ్ళి సాధారణ జనజీవనం కొనసాగేలా చేసింది. నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడంతోపాటు పోలీసింగ్ కోసం పోలీసులు తీసుకుంటున్న ప్రతి చర్యనూ మీడియా ప్రజలకు వివరిస్తోంది. లండన్ నగరం ప్రపంచంలోనే సేఫ్ సిటీగా మారడానికి కారణం అక్కడ దాదాపు పదేళ్ల క్రితం అమలులోకి వచ్చి, నేటికీ కొనసాగుతున్న కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టు. హైదరాబాద్‌లోనూ దాన్ని అమలు చేస్తున్నాం. సిటీలో ఇంతగా సక్సెస్ కావడానికి మీడియా ఇచ్చిన సహకారమే ప్రధాన కారణం. భవిష్యత్తులోనూ మీడియా ఇదే విధమైన సహాయసహకారాలను అందిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. -
ఆగస్టు 15న కడుపులు మాడాయి...
రియో డి జనీరో: పంద్రాగస్టు సంబరాల సంగతేమో కానీ రియోలో భారత హాకీ క్రీడాకారులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి భారత దౌత్య కార్యాలయంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అథ్లెట్లను ఆహ్వానించారు. హాకీ క్రీడ ముగియడంతో ఇరు జట్ల ఆటగాళ్లు వెళ్లారు. అక్కడ ఎలాగూ విందు ఏర్పాటు చేస్తారని, పసందైన భారత వంటకాల రుచి చూడవచ్చనే కోరికతో ఒలింపిక్ విలేజిలో తమ డిన్నర్‌ను రద్దు చేసుకున్నారు. అయితే కార్యక్రమంలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. వేడుక ముగిశాక కూల్ డ్రింక్స్, కాసిన్ని పల్లి గింజలు పెట్టేసరికి అంతా అవాక్కయ్యారు. దీంతో మాంచి ఆకలి మీదున్న ఆటగాళ్లు అధికారుల తీరుతో తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. రెండు బస్సులు మారి ఇంత దూరం వస్తే కనీసం భోజనాలు కూడా పెట్టకపోవడం దారుణమని ఓ ఆటగాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
డిన్నర్ సమయంలో ఒకే..!
స్మార్ట్ ఫోన్ల ఒరవడి పెరిగిన తర్వాత ప్రతి విషయం జనాన్ని భయపెడుతున్నాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడితే క్యాన్సర్లు వస్తాయని, బుద్ధిమాంద్యం సంక్రమిస్తుందంటూ కొందరు వైద్య పరమైన సమస్యలను వెల్లడిస్తుంటే... మరి కొందరు ఫోన్ మాట్లాడేందుకు, టెక్ట్స్ సంభాషణలకు కొన్ని సమయాలు మాత్రమే అనుకూలం అని చెప్తుంటారు. అయితే ఫోన్ సంభాషణలకు, టెక్స్ ఛాటింగ్ కు రాత్రి భోజన సమయం మంచిదేనంటున్నారు తాజా అధ్యయనకారులు. రాత్రి భోజన సమయంలో ఫోన్ మాట్లాడ్డం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని పరిశోధకులు చెప్తున్నారు. బంధువులు, చుట్టాలనుంచి కాల్స్ వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసినా ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనం చేస్తుండగా ఫోన్ వాడకం మంచిది కాదనే విషయంపై పరిశోధనలు నిర్వహించిన మిచిగన్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి మోసర్.. భోజనం చేస్తూ కాండీక్రష్ వంటి గేమ్స్ ఆడటం, ఫేస్ బుక్ లో వచ్చిన వీడియోలు చూడటం వంటివి భిన్నమైనా... ఛాటింగ్, కాల్స్ వంటివి సమస్యలు తెస్తాయన్నది బూటకం అని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోని సుమారు 8 నుంచి 88 ఏళ్ళ మధ్య వయసున్న 1,163 మంది పై పరిశోధనలు నిర్వహించారు. భోజన సమయంలో మొబైల్ వాడేవారి ఆలోచనలపై సర్వే నిర్వహించారు. వారు పనిచేసే రంగాన్నిబట్టి వారి ఆలోచనా విధానం ఆధారపడి ఉండటాన్ని గమనించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో ఎక్కువ సమయం పట్టొచ్చని, భోజన సమయంలో మెసేజింగ్, ఫోన్ కాల్స్ చేయడంవల్ల పెద్దగా నష్టం ఉండదని తేల్చి చెప్పారు. చిన్నపిల్లలు ఎక్కువగా వారి మిత్రులతో సంభాషిస్తుంటారని, అదీ పగటి సమయంలోనే ఎక్కువగా ఉంటుందని సర్వేల్లో గమనించిన అధ్యయనకారులు... ముఖ్యంగా రాత్రి భోజన సమయంలో మధ్య వయస్కులే ఎక్కువగా ఫోన్ వినియోగిస్తున్నట్లు గమనించారు. దీంతో వారికి పెద్దగా నష్టం కలగదని తెలుసుకున్నారు. సాధారణంగా భోజన సమయంలో వార్తా పత్రికలు, పుస్తకాలు చదవడం, టీవీలు చూడటం పై ఎన్నో ఏళ్ళక్రితమే పరిశోధనలు జరిగాయని, ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ కొత్త సవాలుగా మారిందని సహ పరిశోధకురాలు, ప్రొఫెసర్ సరితా ఛోయెనెబెక్ తెలిపారు. ఫోన్ వాడే సమయంలో అర్జెంట్ కాల్స్ ను, మెయిల్స్ ను కూడ పట్టించుకుంటారో లేదో చెప్పలేమన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ అభివృద్ధి పరిచేవారు మాత్రం పరికరాల్లో మరింత విజిబులిటీ పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. -
ఒబామా చాలా ఫన్నీ: ప్రియాంక
ముంబయి: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని బాలీవుడ్ నటి.. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా చెప్పింది. వైట్ హౌస్ లో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆతిథ్యంలో డిన్నర్ పార్టీకి హాజరైన ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబయింది. ఒబామా, మిషెల్లీతో కలిసి డిన్నర్ చేయడం ఆనందాన్నిచ్చిందని చెప్పింది. ఒబామా చాలా ఫన్నీ.. అని ఆయన చాలా మంచివారని పొగడ్తల్లో ముంచెత్తుతూ ట్వీట్ చేసింది. 2016 వైట్ హౌస్ కరెస్పాండెట్స్ నిర్వహించిన విందుకు ప్రియాంకను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఓ హాలీవుడ్ చిత్ర షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. -
పెళ్లి భోజనం వికటించి 100 మందికి అస్వస్థత
ఇబ్రహీంపట్నం (కృష్ణా జిల్లా) : పెళ్లి భోజనం వికటించి సుమారు వందమంది అస్వస్థతకు గురైన సంఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో శుక్రవారం జరిగింది. తుమ్మలపాలెం గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుమార్తె వివాహాం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సందర్భంగా బంధువులు పెళ్ళి విందుకు హాజరయ్యారు. భోజనం చేసిన తరువాత వరుసగా కడుపునొప్పి, వాంతులకు గురయ్యారు. అస్వస్థతకు గురైనవారిని ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కలుషిత ఆహారం వల్లే ఈ సంఘటన జరిగిందని వైద్యులు చెబుతున్నారు. -
పెళ్లి విందు తిని 40 మందికి అస్వస్థత
మాచారెడ్డి (నిజామాబాద్) : పెళ్లి భోజనం వికటించి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట పంచాయతీ పరిధిలోని సర్దార్తండాలో గురువారం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి తండాకు చెందిన ఓ యువతి వివాహం జరిగింది. ఆ వివాహ విందులో భోజనం చేసిన గ్రామస్థులు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో 30 మందిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
ఒబామాతో ప్రియాంక డిన్నర్
న్యూయార్క్: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు వైట్ హౌస్ నుంచి డిన్నర్‌కు ఆహ్వానం అందింది. ప్రతి ఏటా ఒక సాధారణ డిన్నర్ కార్యక్రమాన్ని నిర్వహించడం అమెరికా శ్వేతభవనం పాటిస్తున్న ఆనవాయితీ. ది నాన్ ఫ్రాఫిట్ వైట్ హౌజ్ కరస్పాండెంట్ అసోసియేషన్ ప్రతి ఏటా ఒక డిన్నర్ నిర్వహిస్తుంటుంది. ఈ అసోసియేషన్ లో రిపోర్టర్లు, నిర్మాతలు, కెమెరా ఆపరేటర్లు, జర్నలిస్టులు ఉంటారు. జర్నలిజంలో స్కాలర్ షిప్పులు అందజేసేందుకు కావాల్సిన డబ్బుకోసం వైట్ హౌజ్ తరపున ఈ డిన్నర్‌కు ఆహ్వానిస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పటికే క్వాంటికో అనే టీవీ కార్యక్రమంతోపాటు బే వాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియాంకను వారు డిన్నర్‌కు ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు, మిషెల్లీ ఒబామా కూడా పాల్గొంటారు. ప్రియాంకతోపాటు ఇతర హాలీవుడ్ నటులు బ్రాడ్లీ కూపర్, ల్యూసీ లియూ, జేన్ ఫాండా, గ్లేడీస్ నైట్ కూడా ఈ విందుకు హాజరవుతారు.