
శింబు విందుకు వరలక్ష్మి
నటుడు శింబు విం దులో వరలక్ష్మిశరత్‌కుమార్ పాల్గొన్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది, తారలు విందు, వినోదాల్లో పాల్గొనడం షరామామూలే కదా..అంటారా? నిజమే శింబు, వరలక్ష్మి కలిసి పోడాపోడీ చిత్రంలో కూడా నటిచారు. ఇంకా చెప్పాలంటే వరలక్ష్మి శరత్‌కుమార్‌కు తొలి హీరో శింబునే. అరుునా కాస్త ఆలోచిస్తే వీరి తాజా కలరుుక ఆసక్తిగానే ఉంటుంది. నటుడు విశాల్‌కు వరలక్ష్మికి మధ్య ప్రేమాయణం సాగుతోందని, వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని హాట్‌హాట్ వందంతులు చాలానే విన్నాం. అలాంటిది ఇటీవల వారి ప్రేమ బ్రేకప్ అరుు్యందనే ప్రచారాన్ని చూశాం.
ఇక నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో విశాల్ వ్యతిరేక వర్గానికి శింబు మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కూడికలు, తీసివేతలు చూస్తే శింబు విందులో వరలక్ష్మి పాల్గొనడం ఆసక్తికరంగా అనిపించక మానదు. ఇక అసలు విషయం ఏమిటంటే నటుడు శింబుకు విన్నైతాండి వరువాయా చిత్రం తరువాత సరైన హిట్ లేదనే చెప్పాలి. పైగా ఆ తరువాత వివాద సంఘటనలు, కేసులు, కోర్టులు అంటూ చాలా సమస్యలను ఎదుర్కొన్నా రు. అలాంటి సరిస్థితుల్లో ఆయన న టించిన అచ్చంయన్భదు మడమైయడా చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది.
ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేయడానికి చిత్రం యూనిట్ ఇటీవల ఒక నక్షత్ర హోటల్‌లో విందు, వినోదాలతో గడిపారు. ఈ పార్టీలో వరలక్ష్మిశరత్‌కుమార్, త్రిష, రమ్యకృష్ణ పాల్గొని ఆకర్షణగా మారారు. అందరూ శింబుతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపేశారు. ఆ ఫొటోలిప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తున్నారుు.