
ప్రేమికుల దినోత్సవం లేదా వాలెంటైన్స్ డే (Valentine's Day) ప్రేమికులకు తమ ప్రేమను వ్యక్తీకరించు కోవడానికి, చిరస్మరణీయమైన అనుభవాన్ని పొందడానికి సరైన సమయం. ఫిబ్రవరి వస్తుందంటేనే వాలెంటైన్స్ డే కోసం ఎదురు చూస్తుంటారు ప్రేమికులందరూ. తమ లవర్‌ను సర్ప్రైజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలుచేస్తుంటారు. మరికొందరు పార్ట్‌నర్‌కు రొమాంటిక్ అనుభవాన్ని అందించాలని ఉవ్విళ్లూరుతారు. అలాంటి వారికి దుబాయ్ (Dubai) బెస్ట్ డెస్టినేషన్‌అని చెప్పవచ్చు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న దుబాయ్‌లోని వాలెంటైన్స్ డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఆకర్షణీయమైన స్కైలైన్ భవనాలు బీచ్‌లు, లగ్జరీ స్పా రిట్రీట్స్, విలాసవంతైన రెస్టారెంట్లు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, ప్రైవేట్ యాచ్ క్రూయిజ్ ట్రిప్‌లు చక్కటి భోజనం..ఇలా అనేక రకాల వసతులతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇవి రొమాంటిక్ ఫీలింగ్‌ను అందిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం.
షాంగ్రి-లా దుబాయ్ (Shangri-La Dubai)
షాంగ్రి-లా దుబాయ్‌లో అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఐకానిక్ హోటల్ విలాసవంతమైన వసతి సౌకర్యాలు, రొమాంటిక్ డిన్నర్లు లాంటి అద్భుతమైన భోజన సదుపాయాలు ఉంటాయి. బుర్జ్ ఖలీఫా , డౌన్‌టౌన్ దుబాయ్ స్కైలైన్ అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌లో లెవల్ 42 “ప్రైవేట్ డైనింగ్ అబౌవ్ ది క్లౌడ్స్”లో ఉన్న జంటలకు స్పెషల్ అనుభవాన్ని అందిస్తుంది.
పలాజ్జో వెర్సేస్ దుబాయ్ (Palazzo Versace Dubai)
పాపులర్ జద్దాఫ్ వాటర్‌ఫ్రంట్ మధ్యలో ఉన్న, పలాజ్జో వెర్సేస్ దుబాయ్ ప్రేమికులకు వెచ్చని ఆహ్వానం పలుకుతుంది. లవ్‌బర్డ్స్‌ను మంత్రముగ్ధులనుచేస్తూ శాశ్వతమైన ప్రేమను ప్రసరింపజేస్తుంది. కేక్ ట్రాలీ ఉత్కంఠభరితమైన రొమాంటిక్, సూర్యోదయాలు, సిగ్నేచర్ హై టీ అనుభవంతోపాటు, మెస్మరైజింగ్ వాతావరణంలో సొగసైన గియార్డినో సెట్స్, అద్భుతమైన మ్యూజిక్, ,గమ్మత్తైన వాలెంటైన్స్ విందునిస్తుంది.
రిక్సోస్ ప్రీమియం సాదియత్ ద్వీపం (Rixos Premium Saadiyat Island)
తెల్లని ఇసుక మధ్య ప్రేమికులు సేదదీరడం అంటే సాదియత్ ద్వీపం ప్రత్యేకమైన స్వర్గధామం అన్నట్టే. విలాసవంతమౌన వసతి సౌకర్యాలు, కొలనులతో కూడిన ఏకాంత ప్రైవేట్ విల్లాలు , అంజనా స్పాలు, టర్కిష్ విందును ఆస్వాదించవచ్చు . లేదంటే క్యాండిల్స్ లైట్స్ వెలుగుల్లో బీచ్‌సైడ్ భోజనాన్ని ఆస్వాదించవచ్చు. దీనికి జతగా అమేజింగ్ మ్యూజిక్, సముద్రతీర అందాలు ఉండనేఉంటాయి.
జేడబ్ల్యూ మారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్ (JW Marriott Marquis Hotel Dubai)
జేడబ్ల్యూమారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్‌లో రొమాంటిక్ అనుభవాన్ని అందించడంలో ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది. దీని మూడు సిగ్నేచర్ రెస్టారెంట్‌లలో ఒకదానిలో వాలెంటైన్స్ డేను జరుపుకోవచ్చు, ప్రతీదీ ఒక్కో విలక్షణమైన ప్రపంచ పాక అనుభవాన్ని అందిస్తుంది. దుబాయ్ ఉత్కంఠభరితమైన దృశ్యాలను తనవితీరా ఆస్వాదించవచ్చు. ఇది చిరస్మరణీయమైన సాయంత్రం కోసం సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

దుబాయ్ క్రీక్ రిసార్ట్ (Dubai Creek Resort)
జంటలకు కలలు కనే అనుభవాలతో దుబాయ్ క్రీక్ రిసార్ట్‌లో ఏకంగా నెలరోజులపాటు వాలెంటైన్ డేను జరుపుకోవచ్చు. అమరా స్పాలో సన్నిహిత స్పా రిట్రీట్‌లు, బోర్డ్‌వాక్ వద్ద సుందరమైన వాటర్‌ఫ్రంట్ బ్రంచ్‌లు , పార్క్ హయత్ దుబాయ్‌లో శృంగార బసలను ఆస్వాదించండి. పూల్ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నా లేదా క్యాండిల్‌లైట్ డిన్నర్ అయినా ప్రతీ క్షణం ప్రేమ కోసంమే అన్నట్టు ఎంజాయ్ చేయవచ్చు.
అద్భుతమైన నగర దృశ్యాల నుండి ప్రశాంతమైన సముద్ర తీరప్రాంత విహారయాత్రల వరకు, దుబాయ్‌లో వాలెంటైన్స్ డేని జరుపుకోవడానికి చక్కటి అవకాశం. కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినా ప్రేమను ప్రకటించాలన్నా, భాగస్వామితో ప్రశాంతంగా సమయాన్ని గడపాలన్నా దుబాయ్ ఈజ్ ది బెస్ట్. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే.
ఇదీ చదవండి: మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment