695 అడుగుల ఎత్తులో ‘హెలిప్యాడ్ డిన్నర్’!
దుబాయ్: ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తై లగ్జరీ హోటళ్లలో నాలుగో స్థానంలో ఉన్న దుబాయ్‌లోని ‘ద బుర్జ్ అల్ అరబ్ హోటల్’ ఐరాస ప్రపంచ ఆహార పథకానికి నిధుల సేకరణ కోసం వినూత్న పద్ధతిని ఎంచుకుంది. 212 మీటర్ల (695 అడుగులు) ఎత్తులో ఉన్న హోటల్‌లోని హెలిప్యాడ్‌పై కేవలం 12 మంది అతిథుల కోసం ఈ నెల 13న ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేసింది. ఈ విందు ఆరగించాలనుకునే ఒక్కొక్కరి నుంచి 2,722 డాలర్లు (రూ. 1,68,083) వసూలు చేయనుంది. ఇలా అందిన మొత్తాన్ని ఐరాస ప్రపంచ ఆహార పథకానికి విరాళంగా ఇవ్వనుంది. ఈ పథకం కింద ఐరాస రోజుకు సుమారు 1.20 లక్షల మంది చిన్నారులకు ఆహారాన్ని అందిస్తోంది.