
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్‌లు(butch wilmore) భూమ్మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వాళ్లిద్దరు మార్చి 19 (బుధవారం) భూమ్మీదకు రానున్నారు.
ఈ క్రమంలో పరిశోధనల నిమిత్తం ఎనిమిది రోజుల పాటు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వ్యోమగాములు నెలల తరబడి అక్కడే ఉండాల్సి వచ్చింది. మరి నెలల తరబడి స్పేస్ స్టేషన్‌లో గడిపిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్‌లకు నాసా ఎంత జీతం ఇస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వ్యోమగాముల జీత భత్యాలపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా
ఆస్ట్రోనాట్ జీతం ఎంతంటే?
అమెరికా ఫెడరల్ గవర్నమెంట్‌లో జీఎస్(జనరల్ షెడ్యూల్)-15 కేటగిరీలో అత్యున్నత స్థాయి పదవుల్లో విధులు నిర్వహిస్తుంటారు ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు 2024 లెక్కల ప్రకారం.. ఏడాదికి 136,908 నుంచి 178,156 డాలర్ల వరకు వేతనాలు తీసుకునేవారు. ఆ లెక్కన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్‌ల ఏడాది వేతనం అంచనా ప్రకారం.. 125,133 నుంచి 162,672 డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం.. రూ.1.08 కోట్లు నుంచి రూ.1.41కోట్ల వరకు) ఉంటుంది.
నాసా అంత చెల్లించదు
పరిశోధనల నిమిత్తం 9 నెలల పాటు ఐఎస్ఎస్‌లో ఉన్న ఈ ఇద్దరి ఆస్ట్రోనాట్స్‌లకు నాసా 93,850 డాలర్ల నుంచి 122,004 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం (భారత కరెన్సీలో రూ.81లక్షల నుంచి రూ.1.05 కోట్లు). కానీ, నాసా అంత చెల్లించదని, ఇలాంటి అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు రోజుకు నాలుగు డాలర్లు (రూ.347 )మాత్రమే చెల్లిస్తుందని రిటైర్డ్ నాసా ఆస్ట్రోనాట్ క్యాడీ కోల్‌మన్ తెలిపారు.
మరీ ఇంత తక్కువా
సునీతా విలియమ్స్ ,బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్‌లో 8 రోజులకు బదులు 287 రోజులు గడపాల్సి వచ్చింది. ఆ లెక్కన కేవలం రూ1,148డాలర్లు (రూ.1లక్ష) అదనంగా తీసుకోనున్నారు. ఫలితంగా, అసలు జీతంతో పాటు అదనంగా 1,148 డాలర్లు (సుమారు రూ. 1లక్ష) చెల్లించనుంది. ఈ మిషన్ కోసం వారి మొత్తం సంపాదన 94,998 డాలర్ల నుంచి 123,152 డాలర్ల వరకు (సుమారు రూ. 82 లక్షలు - రూ. 1.06 కోట్లు) ఉంటుందని అంచనా.
నేటికి 284 రోజులు
సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది!
‘నాసా’ టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. క్రూ-10 మిషన్ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం విజయవంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment