Valentine's Day 2025
-
ప్రేమికుల రోజే ప్రియుడి బలవన్మరణం
సంతోష్ నగర్: ప్రేమికుల రోజునే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ కథనం ప్రకారం... సంతోష్ నగర్ కళంధర్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (21) చాంద్రాయణగుట్ట జీఎం కాలనీకి చెందిన మహ్మద్ ఆబిద్ అలీ కూతురు రబియా ఫాతిమాలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇది రబియా తండ్రి అబిద్ అలీకి తెలియడంతో ఆయన ఈ నెల 14న చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తన కూతురును ఇమ్రాన్ వేధిస్తున్నాడని రబియాతో ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు ఇమ్రాన్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన ఇమ్రాన్ ఇంటికి వచ్చి.. తన మృతికి రబియా తండ్రి కారణమని సూసైడ్ నోట్ రాసి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అద్దెకు బాయ్‌ఫ్రెండ్!
సాక్షి, బెంగళూరు: ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే... ప్రేమికుల కోసం షాపింగ్ మాల్స్, బేకరీలు, వస్త్ర దుకాణాలు, చివరికి ఆన్లైన్ షాపింగ్ విక్రయదారులు అనేక ఆఫర్లను ఇచ్చి ప్రేమికులను ఆకర్షిస్తుంటారు. అయితే బెంగళూరులో మాత్రం.. ఓ విచిత్రమైన పోస్టర్ ఒకటి కలకలం సృష్టించింది. ‘బాయ్‌ఫ్రెండ్ కావాలా?’ అంటూ పోస్టర్ ముద్రించడం సర్వత్రా వివాదాస్పదమైంది.‘కేవలం రూ.389 చెల్లిస్తే చాలు.. మీకు బాయ్ ఫ్రెండ్ లభించును’ అంటూ బెంగళూరు జయనగరలోని వివిధ ప్రాంతాల్లో ఈ విధమైన పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంది. వీటిని నెటిజన్లు, నగరవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు దృష్టి సారించి, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
కృతి శెట్టి వాలెంటైన్ వైబ్స్..వైట్ డ్రెస్‌లో ఇలా (ఫోటోలు)
-
విశాఖపట్నం : ప్రేమసాగరం ఆర్కేబీచ్లో ప్రేమికుల సందడి (ఫొటోలు)
-
లవ్ అప్డేట్స్ గురూ
ప్రేమికుల రోజు(Valentine Day) సందర్భంగా ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల నుంచి ‘లవ్ అప్డేట్స్ గురూ’ అంటూ శుక్రవారం కొందరు తమ సినిమాల నుంచి పాటలు, లుక్స్ రిలీజ్ చేయగా, మరికొందరు సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళదాం...⇒ నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వేర్ఎవర్ యు గో’.. అంటూ సాగే రెండో పాటని హీరో మహేశ్‌బాబు లాంచ్ చేశారు. ఈ పాటని కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ పాడారు. ⇒ సిద్ధు జొన్నలగడ్డ రోగా నీరజా కోన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్ విడుదలైంది. ⇒ కిరణ్ అబ్బవరం హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కావాల్సింది. అయితే తాజాగా మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, కిరణ్ అబ్బవరం పోస్టర్ని రిలీజ్ చేశారు. ⇒ సుహాస్, మాళవికా మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుంచి సుహాస్, మాళవికా మనోజ్‌ల సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.⇒ హర్ష రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వంలో హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘ప్రేమలో..’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడారు. ⇒ మోహిత్ పెద్దాడ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘నా లవ్ స్టోరీ’. వినయ్ గోను దర్శకత్వంలో దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ యునిక్‌గా ఉంది. స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’’ అన్నారు. -
గ్రేటర్ మేయర్ లవ్‌స్టోరీ అలా మొదలైంది..!
నాకు క్రికెట్ అంటే ఇష్టం.. మా ఆయన సాయిరెడ్డికి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం.. క్రీడా మైదానంలోనే తమ ప్రేమకు పునాది పడిందని హైదరబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తమ ప్రేమ కబుర్లు చెప్పుకొచ్చారు.. వాలంటైన్స్ డే సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రేమ సంగతులు పంచుకున్నారు.. నిత్యం స్పోర్ట్స్ స్టేడియంలో కలుసుకునే మేం మా చదువులు అయ్యాకే పెళ్లి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా మా డిగ్రీ, పీజీ అయ్యే వరకు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. మా నాన్నకు నేను గారాలపట్టీ కావడం వల్ల నా ఇష్టాన్ని ఆయన కాదనలేక పోయారు. మా ఆయన తల్లిదండ్రులు, వారి బంధువులు కూడా అంతా మా ప్రేమను అంగీకరించి ఆశీర్వదించారని చెప్పుకొచ్చారు. నేను క్రికెట్ బాగా ఆడేదాన్ని, బాబీ బాస్కెట్ బాల్ ఆటగాడు.. అలా క్రీడా మైదానాల్లో తరచూ కలుసుకునేవాళ్లం.. మా ప్రేమ విషయాన్ని మా ఇద్దరి ఇళ్లలో చెప్పాం. మా నాన్నకు నా మీద ఉన్న ప్రేమతో నా ప్రేమను కాదనలేకపోయారు. పెళ్లి కాగానే అమెరికా వెళ్లిపోయాం.. 18 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చాం.. నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని చెప్పగానే గో ఏ హెడ్ అంటూ ప్రోత్సహించారు. మాదేమో పొలిటికల్ ఫ్యామిలీ.. మా ఆయనదేమో బిజినెస్ ఫ్యామిలీ.. అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా బాబీ నన్ను ఇబ్బంది పెట్టకపోగా రాజకీయాల్లో వెళ్లేందుకు, నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రోత్సాహంగా నిలబడ్డాడు. ఇప్పటికీ మేం ఎంతో ప్రేమగా ఉంటామంటూ తన భర్తను తాను బాబీ అని.. తననేమో విజ్జి అని ప్రేమగా పిలుచుకుంటామంటూ తమ లవ్ జర్నీ చెప్తూ మురిసిపోయారు. (చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!) -
పెళ్లి నిర్ణయం పెద్దలకేనా? యువత ఏమంటున్నారో తెలుసా?
కరీంనగర్ సిటీ: నేటి యువత చదువుకుంటూనే.. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ముందుకు సాగుతున్నారు. విద్య, ఉద్యోగం, జీవితంలో స్థిరపడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రేమ పెళ్లి వద్దు..పెద్దలు కుదిర్చిన పెళ్లి ముద్దు అంటున్నారు. మరికొందరు సరైన సమయంలో వివాహం జరగాలని చెబుతున్నారు. ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం డిబేట్ నిర్వహించగా.. వారి అభిప్రాయాలు వెల్లడించారు.అర్థం చేసుకుంటే బెటర్ప్రేమ వివాహాలతో ఎదుటి వారి వ్యక్తిత్వం, ప్రవర్తన ముందుగానే తెలుసుకోవచ్చు. వారిపై మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వారితో వివాహబంధం ముందుకు సాగుతుందా లేదా తెలుస్తుంది. కొంతవరకూ ప్రేమపెళ్లిలు మంచివే. ఏ బంధం అయినా అర్థం చేసుకుని సర్దుకుపోతే నిలుస్తుంది.– శ్రీజ, విద్యార్థినిపెద్దలు కుదిర్చినదే..పెద్దలు అన్ని రకాలుగా మంచిగానే ఆలోచిస్తారు కాబట్టి వారి నిర్ణయం బలంగా ఉంటుందని నా నమ్మకం. వివాహ బంధంలో ఏదైనా సమస్యలు వచ్చినా పెద్దలు ముందుకు వచ్చి పరిష్కరిస్తారు. జీవితంలో మంచి సపోర్టుగా ఉంటారు. పెద్దలను విస్మరించి కొందరు ప్రేమ పేరుతో మోసపోతున్నారు.– వినోద, విద్యార్థినిప్రేమ వివాహాలపై 110మంది యువతులను వివిధ ప్రశ్నలు అడుగగా.. వెల్లడించిన అభిప్రాయాలుటీనేజీ ప్రేమపై మీ అభిప్రాయం65- ఆకర్షణ మాత్రమే45 -టీనేజ్‌లో ప్రేమ అవసరం లేదు85- కెరియర్ ఫస్ట్సరైన సమయంలో పెళ్లి అవసరం ప్రేమపై సోషల్ మీడియా ప్రభావం ఉందా?80-చాలా ఉందిఎలాంటి ప్రభావం లేదు-3060 - పెద్దలు కుదిర్చిందిప్రేమ వివాహం ప్రేమించి పెద్దలను ఒప్పించాలి- 30ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్‌లో పడితే జాగ్రత్త.. భయ్యా!ఒప్పించి.. మెప్పించాలిఒక మనిషి గురించి పూర్తిగా అర్థం చేసుకుని, వారి గురించి పెద్దలకు వివరించి ఒప్పించాలి. ప్రేమించి పెద్దల సహకారంతో వివాహం చేసుకుంటే జీవితం అనందంగా ఉంటుంది. ఉన్నత చదువులతో జీవితం ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే ఏదైనా సాధ్యం. పెద్దలు చేసిన పెళ్లిలు సైతం విడిపోతున్నాయి కదా.– భానుమతి, విద్యార్థినికుటుంబ జోక్యంతోనేపెద్దలు కుదిర్చిన, ప్రేమ పెళ్లి ఏదైనా దంపతుల మధ్య కుటుంబాల జోక్యంతో విడిపోతున్నాయి. చాలా వరకూ అమ్మాయి ఇంటి వద్ద పెరిగిన విధంగానే అత్తవారింట్లో ఉండాలని అనుకుంటారు. కాని అలా ఉండదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కావాలి. అబ్బాయిలు కూడా నమ్మి వచ్చిన వారిని మంచిగా చూసుకోవాలి. – సిరిచందన, విద్యార్థిని -
ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!
కళాభిరుచిని కొనసాగించాలంటే.. కలలు కనాలి. అలాంటి కలలే కన్న మరో జత కనులు తోడైతే.. కల సాకారం అవడం తథ్యం. నచ్చిన అభిరుచిని పంచుకుంటూ పరస్పరం ప్రేమను పెంచుకుంటూ దగ్గరైన హృదయాలు ఆలపించే యుగళగీతం మృదు మధురంగా ఉంటుంది. ఆ మధురిమలు ఆస్వాదిస్తున్న కొన్ని జంటల్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలకరించినప్పుడు.. తమ రెండు హృదయాలను ఒకటి చేసిన కళాత్మక జ్ఞాపకాలను నెమరువేసుకున్నారిలా.. ప్రేమించాలనుకోలేదు.. పెళ్లి చేసుకోవాలనుకున్నా..నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు గాయనిగా, ఆయన(రేణుకాప్రసాద్) ఇంటర్లో ఉండగా మృదంగం కళాకారుడిగా.. మా ఇద్దరికీ ప్రథమ పరిచయం. సంప్రదాయ సంగీతం అంటే ఇద్దరికీ ప్రాణం. చిన్న వయసు నుంచే కలిసి ‘కళ’లు పండించుకున్నాం. ఎన్నో వేదికలపై ఎన్నో కార్యక్రమాలు కలిసి చేయడం వల్ల సహజంగానే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం, అభిమానం.. ఆ తర్వాత నాకు పెళ్లి వయసు వచ్చే సమయానికి నా ఫ్రెండ్స్ అనేక మంది పెళ్లిళ్లు చేసుకుని తమకెంతో ఇష్టమైన కళకు వీడ్కోలు పలకాల్సి రావడం కళ్లారా చూశాను. చాలా వరకూ అత్తింటి ఆంక్షలే అందుకు కారణం అవడం కూడా గమనించాను. ఎంతో శ్రమించి అభిమానించి ప్రాణంగా ప్రేమించిన కళను పెళ్లి కోసం వదిలేసుకోవాల్సి రావడం చూశాక.. తప్పనిసరిగా నాతో పాటు ఇదే రంగంలో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా అనుకున్న వెంటనే నా మదిలో ఆయనే మెదలడం.. బహుశా దాన్నే ప్రేమ అనుకోవచ్చేమో.. ధైర్యంగా నా మనసులో మాట ఆయనకు చెప్పడం.. ఆయన కొంత సమయం తీసుకుని ఓకే చెప్పడం.. నేను ఇంట్లో వాళ్లని కన్విన్స్ చేయడం.. వరుసగా జరిగిపోయాయి. మా పెళ్లితో సహా.. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ కలిసి సాగుతున్న మా కళాత్మక ప్రయాణం.. చక్కని చిక్కని సంగీతంలా కన–వినసొంపుగా సాగిపోతూనే ఉంది. శ్వేత, ప్రముఖ గాయని కలర్ ఫుల్.. కళ కపుల్.. కలిసి చదువుకున్నాం.. కలిసి బొమ్మలేశాం.. కలిసి ఏడడుగులు నడిచాం.. నగరంలోని జేఎన్ టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులుగా ఉన్నప్పుడు తొలుత పెయింటింగ్ అంటే మాకున్న ఇష్టాల్ని పంచుకున్నాం. అలా అలా పరస్పరం ప్రేమను పెంచుకున్నాం. మా ప్రేమ ప్రయాణం మీద మాకెంత నమ్మకం వచ్చిందంటే.. వృత్తిలోనో, ఉద్యోగంలోనో స్థిరపడాలి ఆ తర్వాతే పెళ్లి అనే ఆలోచన కూడా చేయకుండా.. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే పెళ్లి చేసేసుకున్నాం. ఆ తర్వాత స్ట్రీట్ ఆర్టిస్ట్స్‌గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైవిధ్యభరితమైన ఆర్ట్ వర్క్స్ గీశాం. తద్వారా సిటీలో పుట్టిన క్యూరియాసిటీ.. మా కపుల్ ఆర్ట్‌కి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరం కలిసి నగరంలోని పలు గోడలమీద బొమ్మలు గీసిన రోజులు మాకు ఇంకా గుర్తున్నాయి. ఫ్రెండ్స్‌గా మొదలుపెట్టి ఫ్రాన్స్ ఆర్ట్ ఫెస్టివల్ దాకా.. ఇంకా అనేకానేక జ్ఞాపకాలతో సాగుతున్న మా కలర్‌ఫుల్ జర్నీకి బాటలు వేసింది మా ప్రేమే.. – విజయ్, స్వాతి ప్రముఖ చిత్రకారులు పాట కలిపిన ప్రేమ బాట గురించి వారి మాటల్లోనే.. పాటల ప్రయాణంలో.. చిగురించిన ప్రేమ.. ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.., ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా.., ఈ రాతలే దోబూచులే.. అంటూ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో అద్భుతమైన ప్రేమ గీతం పాడిన సింగర్ హరిణి ఇవటూరి.. తన జీవితంలో మాత్రం కలవని ఇరు ప్రేమికుల్లా ఉండకూడదు అనుకుందో ఏమో.. తన స్వరానికి తోడుగా మరో స్వరాన్ని ప్రేమతో కలిపేసుకుంది. సలార్‌లో తను పాడిన.. సూరీడే గొడుగు పట్టి, వచ్చాడే భుజం తట్టి.. చిమ్మచీకటిలోనూ నీడలా ఉండేటోడు.. రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు.. అనే పాటను ప్రతిబింబించేలా తన ప్రియసఖుడు భాస్కరుని సాయిచరణ్ ఆమె ప్రేమకు పెళ్లి కానుక అందించారు. ఆయనెవరో కాదు.. ప్రముఖ హిట్ మూవీస్ హనుమాన్, కాటమరాయుడు, సుప్రీమ్ వంటి సినిమాల్లో హిట్ సాంగ్స్‌తో తెలుగు సంగీత ప్రియుల మన్ననలను పొందినవాడే..మా మొదటి పరిచయం 2011–12 సంవత్సర కాలంలో ఓ టీవీ ఛానెల్లో నిర్వహించిన పాటల కార్యక్రమంలో.., కానీ మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది మాత్రం ప్రముఖ సింగర్ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో నిర్వహించిన సంగీత ప్రదర్శనల్లోనే.. ఈ ప్రదర్శనల కోసం చాలా చోట్లకు ప్రయాణం చేశాం.. ఈ సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారాం.. ఒకానొక సమయంలో మా బంధం స్నేహం మాత్రమే కాదు అంతకుమించి అనిపించింది. అలా 2014లో మా స్నేహం కాస్త ప్రేమని తెలుసుకున్నాం. ‘హరిణికి తన పైన ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని.. ‘స్నేహానికి మించిన బంధంమనది అనిపిస్తుంది, ఇకపై నువ్వు నన్ను అన్నయ్య అని పిలువు’ అని సాయి చరణ్ ఆర్డర్ వేయగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్య అని పిలువను అని చెప్పకనే తన ప్రేమను చెప్పిందని తమ ప్రేమ స్మృతులను గుర్తు చేసుకున్నారు’. మేమే కాకుండా మా స్నేహం వల్ల మా ఇద్దరి కుటుంబాలు కూడా కలిసిపోయాయి. కానీ.. అప్పటికీ మేమింకా సెటిల్ కాలేదు. మా కుటుంబాల్లో ప్రేమ పెళ్లి ఒప్పుకుంటారా అనే అనుమానంతో భయపడ్డాం. ఇరు కుటుంబాలపైన ఉన్న నమ్మకంతో నిజాయితీగా మా ప్రేమ విషయం చెప్పడం, మా ప్రేమను గౌరవించి వారు కూడా ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. కానీ మీరు సెటిల్ అయ్యాకే కలిసి జీవితాన్ని ప్రారంభించండి అనే వారి సూచన మేరకు మూడేళ్ల తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మాకొక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు ఈ ప్రేమ గురించి మా గురువు బాలసుబ్రహ్మణ్యంకు తెలపగా., కుటుంబ సభ్యులు ఒప్పుకోకుంటే తను మాట్లాడతానని భరోసా ఇచ్చారు. పెళ్లికి రావడంతో పాటు పెళ్లి కానుకగా మా కోరిక మేరకు మా ఇంటికి భోజనానికి వచ్చి ఆశీర్వదించారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, విశ్వంభర వంటి సినిమాల్లో పాటలు పాడుతున్నాం. ఆస్కార్ విజేత కీరవాణి సంగీత దర్శకత్వంలో రాజమౌళి–మహేష్ బాబు ప్రాజెక్టుకు సైతం పాడుతున్నాం. ప్రేమికులు ఎవరికైనా వేరు వేరు ఇష్టాలు అభిప్రాయాలు ఉంటాయి. కేవలం 10 శాతం మాత్రమే ఆ ఇద్దరికీ ఆలోచనలు కలుస్తాయి. ఈ విషయంలో సమన్వయం ఉంటే ప్రేమ జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. – భాస్కరుని సాయి చరణ్, హరిణి నాటి అభిమాని.. నేటి జీవిత భాగస్వామి..తను (డా.బిజినా సురేంద్రనాథ్) కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ విద్యార్థినిగా ఉన్నప్పుడు నేను కూచిపూడి నృత్యకళాకారుడిగా ప్రదర్శనలు ఇస్తుండేవాడిని. ఒకసారి సిలికానాంధ్ర కార్యక్రమంలో మేము ఇద్దరం కలిసి ప్రదర్శన ఇచ్చాం. అప్పుడే తను నా ప్రదర్శనలు చూస్తున్నానని, నా నృత్యానికి అభిమానినని చెప్పింది. నిజం చెప్పాలంటే ఆ ప్రదర్శనలో నాకన్నా తనే బాగా నృత్యం చేసింది. ఆ విషయం తనతో చెప్పాను. అక్కడి నుంచి ఇద్దరం సన్నిహితులమయ్యాం. నృత్యం అంటే ఉన్న ఇష్టం పరస్పరం ఒకరి మీద ఒకరికి కూడా ఏర్పడింది. కొంత కాలం తర్వాత మేం పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నాకు సరైన ఉద్యోగం లేదని ఆమె ఇంట్లో వాళ్లు అభ్యంతరం పెట్టారు. దాంతో నేను సెటిలయ్యాకే వివాహం చేసుకుందామని అనుకుని.. ఇద్దరం కలిసి ప్రణాళికాబద్ధంగా ప్రదర్శనలు ఇస్తూ వచ్చాం. ఏడాదిలోనే నేను మంచి స్థితికి రావడంతో మా పెళ్లికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ.. మా నడక నర్తన సంతోష భరితంగా సాగిపోతున్నాయి. – సురేంద్రనాథ్, కూచిపూడి నృత్యకళాకారుడు. (చదవండి: చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!) -
Valentine's day ప్రేమా .. అంత టైం లేదు ప్లీజ్!
ప్రేమ.. రెండక్షరాలే కాదు.. రెండు హృదయాల కలయిక.. ఇద్దరి జీవితాల్లో వెలుగుల దీపిక. మనసులు కలిశాక.. ఎన్ని కష్టాలొచ్చినా.. తోడునీడగా ఉండి, జీవితాంతం కలిసి నడిస్తేనే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమకు ఎందరో అక్షరరూపంగా నిలిచారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పదేళ్ల క్రితం ప్రేమంటే అద్భుతం.. అదో ఆనందం.. ప్రేమించి, పెళ్లి చేసుకుంటే ఆశ్చర్యం. కానీ, కాలం మారుతుంటే అందులో అర్థం మారుతోంది. ప్రస్తుతం.. ప్రేమంటే అంత టైం లేదంటున్నారు యువత. చదువు, కెరియర్ ఫస్ట్ అని, ఆ తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రేమ వివాహాలకు కేరాఫ్‌గా నిలుస్తుండగా.. పలువురు లవ్ మ్యారేజ్ చేసుకొని, కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి వారిపై ప్రత్యేక కథనాలు.ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్‌లో పడితే జాగ్రత్త..భయ్యా!పెద్దల అంగీకారంతో ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన జవ్వాజి అనిల్– కల్యాణి దంపతులు వీరు. జమ్మికుంట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలంలో 2012లో ఇరువురు ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పంచి 2018లో వివాహం చేసుకున్నారు. అనిల్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘మా వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ప్రేమపెళ్లి అందంగా ఉంటుంది. ఒకరికి ఒకరు తెలిసిన తర్వాత వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తినా అర్థంచేసుకుని సర్దుకుంటారు. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది’. అని అనిల్ చెప్పుకొచ్చాడు.ఇష్టపడ్డాం.. కష్టపడ్డాం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి శ్రీనివాస్, స్రవంతి దంపతులు వీరు. జమ్మికుంటలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో 2008లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తర్వాత స్నేహితుల సహకారంతో 2012లో ప్రేమపెళ్లి చేసుకొని ఒకటయ్యారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మా యి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. అయినా ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం కారు నడుపుకుంటూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. స్రవంతి గృహిణి. వీరికి ఒక కుమార్తె ఉంది. ‘మా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ప్రస్తుతం మా పాపతో ప్రయాణం గర్వంగా కొనసాగుతోంది’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.ప్రేమ వివాహాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న కొన్ని గ్రామాలుప్రేమనగర్.. మరిమడ్లకోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట: ప్రేమ పెళ్లిళ్లకు నిలయంగా నిలుస్తోంది కోనరావుపేట మండలం మరిమడ్ల. ఈ గ్రామంలో 30కి పైగా జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. ఊరి జనాభా నాలుగు వేలు ఉండగా.. దశాబ్దకాలంగా పదుల సంఖ్యలో జంటలు ఒక్కటయ్యాయి. కట్నా లు లేకుండా ఆదర్శ పెళ్లిళ్లు సైతం చేసుకున్నారు. ప్రభుత్వం జరిపించే కల్యాణ మస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్‌తో ముంబయికి చెందిన రజిత వివా హాన్ని మరిమడ్లవాసులు దగ్గరుండి జరిపించారు. జింక నరేందర్ అనే యువకుడు ముంబయికి చెందిన మరో సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని మరిమడ్లకు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్‌లో 1,620 జనాభా ఉంటుంది. గ్రామంలో 17 మంది యువతీ యువకులు ప్రేమపెళ్లిళ్లు చేసుకున్నారు.మనసు పడ్డాం.. ఏకమయ్యాంమాది కులాంతర వివాహం. తెలియకుండా ప్రేమలో పడ్డాం. మాటలు కలిసి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి పెళ్లి చేసుకున్నాం. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. పెద్దల మనసు మార్చి ఏకమయ్యాం. ప్రస్తుత యువత జీవింతంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలి. వేధింపులకు గురిచేస్తే చర్యలుయువకులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఇబ్బందులకు గురైనవారు షీటీంనంబర్ 8712670759 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే నిమిషాల వ్యవధిలోనే మీ ముందు ఉంటాం. కరీంనగర్ షీటీంకు నెలకు 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు ఎఫ్ఐఆర్లు కాగా, గతేడాది 40 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితుడిని పిలిపించి బాధితులు కోరుకుంటే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం.– శ్రీలత, మహిళా స్టేషన్ సీఐ, షీటీం ఇన్చార్జీ, కరీంనగర్ -
బేగంపేట : హుషారుగా..డార్లింగ్స్ డే.. (ఫొటోలు)
-
Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్‌లో పడితే జాగ్రత్త.. భయ్యా!
వాలెంటైన్స్ డే సందర్బంగా ప్రేమికులతో చాలా సందడిగా ఉంటుంది. ఎక్కడ చూసినా అందంగా ముస్తాబై సీతాకోక చిలుకల్లా విహరిస్తుంటారు. పార్క్‌ల్లో, సినిమాహాళ్లలో లవ్‌బర్డ్స్ హల్‌హల్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ వాతావరణం చాలావరకు తగ్గిపోయినట్టే కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాలతో యవతలో ప్రేమలు-పెళ్లిళ్లు అంటేనే భయం పెరుగుతోంది. కరియర్కే యువత ప్రాధాన్యతనిస్తోంది. దీనికితోడు సరియైన ఉద్యోగాలు కూడా లభించక పోవడంతో, ముందు బతుకు ఎలా ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. వాలెటైన్స్ డే సందర్భంగా సాక్షి.కామ్ పబ్లిక్టాక్ వింటే ఈ అభిప్రాయమే కలుగుతుంది ఎవరికైనా.. వాలెంటైన్స్ డే అంటే ఒకరోజు జరుపుకునేది కాదనీ, స్త్రీపురుఫుల మధ్య అయినా, మనుషుల మధ్య అయినా ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలంటోంది యువత. అమ్మాయిలు కరియర్ ముఖ్యం, ఆర్థికంగా స్థిరపడాలి అంటోంటే... అబ్బాయిలేమో మనకీ లవ్వులు, గివ్వులు వద్దు బ్రో..జర జాగ్రత్త భయ్యా.. అంటున్నారు.ప్రధానంగా అమ్మాయిల్లో ప్రేమిస్తే ఏమవుతుందో అనే ఆందోళన ఎక్కువ కనిపిస్తోంది. అందుకే బాగా చదువుకుని, ఆర్థికంగా నిలదొక్కు కోవాలంటున్నారు. అదే ఆడపిల్లలకు ఆత్మస్థైరాన్ని ఇస్తుందని ఒక యువతి పేర్కొంది. ఎంతో కష్టపడి పెంచి పోషించిన తల్లి దండ్రులనుజాగ్రత్తగా చూసుకోవాలి అంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది కెమెరా ముందుకు రావడం ఇష్టంలేని ఒక యువతి తన సొంత పిన్ని ఇంట్లో జరిగిన సంఘటన తమ కుటుంబంలో పెద్ద అలజడి రేపిందనీ, అందుకే తానీ నిర్ణయానికి వచ్చానని తెలిపింది. బాధ్యత ముఖ్యంప్రేమ అంటే బాధ్యత ఉండాలి. స్త్రీపురుషుల మధ్య అయినా, ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా బాధ్యత అనేది పునాది. అదే ప్రేమ. ఆ బాధ్యతతో కూడిన ప్రేమే కుటుంబాల్ని నిలుపుతుంది అన్నారు ఒక కార్పొరేట్ ఉద్యోగి. పిల్లలు బాధ్యతగా ఉన్నపుడు ఏ తల్లిదండ్రులైనా పిల్లల్నిఅంగీకరిస్తారు. యోగ్యుడైన అల్లుడు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు అందుకే చిత్తశుధ్దిగా ఉండండి. తల్లితండ్రులను ఒప్పించుకోండి.. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అంటూ యువతరానికి ఆయన సూచించారు. ఇదీ చదవండి: ఓటీటీ బెస్ట్ యాక్టర్‌గా రాగ్‌మయూర్ నామినేట్ : రాగ్ ఫ్యావరెట్ హీరోయిన్ ఎవరంటే..!ప్రేమా, గీమా ఇవ్వన్నీ వద్దు మనకి.. బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం కొట్టాలి, అమ్మానాన్నల్ని ఖుషీగా ఉంచాలి.. అంతే.. ఇంతకుమించి తనకే ప్రయార్టీస్ లేవని చెప్పాడు మరో యువకుడు. అలాగే ఒకవేళ ప్రేమిస్తే చిత్తశుద్ధిగా ఉండండి భయ్యా..కడదాకా నిలుపుకోండి అంటూ సలహా ఇస్తున్నాడు. కానీ జాగ్రత్త భయ్యా.. సింగిల్‌గా ఉంటేనే బెటర్ కదా భయ్యా అంటూ ఓ పెద్ద సందేశాన్నిచ్చేశాడు ఫన్నీగా.లేడీస్ హాస్టలా? ఎవడ్రా ఆ కూత కూసింది!ఎంత ధైర్యం చెప్పుకున్నా, ఆడపిల్లలు సాధికారతసాధిస్తున్నా..సమాజంలోజరుగుతున్న పరిణామాలు చాలా బాధిస్తున్నాయని ఒక తల్లి వాపోయింది. ప్రేమించిన పాపానికి కన్న తల్లిదండ్రులే ఆమె జీవితంలో నిప్పులు పోస్తున్నారు. మరొక చోట ప్రేమించకోతే, పెళ్లికి ఒప్పుకోకపోతే నరికి చంపుతున్నారు.. యాసిడ్లు పోస్తున్నారు కదా తల్లీ.. ఎలా అయితే ఎలా బతికేది ఆడపిల్లలు అంటూ భావోద్వేగానికి లోనైంది. అసలు వాలెండైన్స్డే మనది కాదు. ప్రేమ శాశ్వతం. శాశ్వతమైన ప్రేమే మనది. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలను జాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బలహీనమైన క్షణాల్లో వారికి అండగా ఉండాలి. అంతే తప్ప, నటుడు చిరంజీవి లేడీస్హాస్టల్ అనుకోవడం మూర్ఖత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారో తల్లి. అంతేకాదు తన తల్లి, చెల్లి, భార్య, కుమార్తెలు, కోడలు, ఆఖరికి మనవరాలిని కూడా ఘోరంగా అవమానించిన చిరంజివి మొత్తం స్త్రీ జాతికి క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. (ఈమె కూడా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు.) -
ఓటీటీ బెస్ట్ యాక్టర్‌గా రాగ్‌మయూర్ నామినేట్ : రాగ్ ఫ్యావరెట్ హీరోయిన్ ఎవరంటే..!
సివరపల్లి వెబ్ సిరీస్‌తో దూసుకుపోతున్న హీరో రాగ్ మయూర్ మరో ఘనతను సాధించారు. సెన్సేషనల్ హీరో అయిపోదామని కాకుండా... పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతూ, నటనలో రాటుదేలుతూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న రాగ్ తాజాగా మరో అడుగు ముందుకేసారు. సివరపల్లి సిరీస్‌లో నటనకు గాను ఇంటర్నేషనల్ ఐకానిక్ బెస్ట్ యాక్టర్ ఓటీటీ తెలుగు అవార్డ్ కోసం నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. దీంతో ఆయనకు ఫ్యాన్స్ అభినందనలు తెలియజేశారు.ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్ నటనపై ఆసక్తితో ఉన్నత చదువును పక్కన బెట్టి మరీ హీరో రాణిస్తున్నారు. అద్భుతమైన నటనతో సినీ లవర్స్‌కు దగ్గరవుతున్నారు. సినిమానే తన ప్రాణం, ప్రేక్షకులే నా దేవుళ్లు.. ప్రేక్షకులు లిచ్చిన ప్రేమ, వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అంటున్న వాలెంటైన్స్ డే సందర్బంగా హీరో రాగ్మయూర్తో స్పెషల్ చిట్ చాట్ రెండో భాగం. (చివరిది) మీకోసం! -
చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!
చరిత్రలో విషాదకరంగా మిగిలిన ఎన్నోప్రేమ కథలను చూశాం. అయితే అవే కాకుండా మన చుట్టు పక్కలే జరిగిన యదార్థ ప్రేమ సంఘటనలు ప్రాచుర్యం లేక కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటిని ఒక్కసారి పరికించి తెలుసుకునే యత్నం చేస్తే హృదయం ద్రవించిపోతుంది. అలాంటి రియల్ లవ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఇది చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి యదార్ధ ప్రేమ గాథ. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ తరానికి తెలియకుండా మసకబారుతున్న శతాబ్దల నాటి ఆ అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.కదిరి నరసింహా దేవాలయంలో చిగురించి ఈ ప్రేమకథ. ఇరాన్ దేశం నుంచి మోహియార్ అనే యువకుడు వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చేరుకున్నాడు. ఆ సమయంలో కదిరి నరసింహ దేశాలయంలో కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగరాయల కూతురైన చంద్రవదన స్వామివారిని దర్శనం కోసం వచ్చింది. అప్పుడు ఆ యువతిని చూసిన మెహియర్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. చంద్రవదన కూడా పేరుకు తగినట్లుగా పున్నమి నాటి చంద్రుడిలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. ఇక అప్పటి నుంచి మెహియర్ ఆమెను అనుసరిస్తూ..ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్తుండేవాడు. దీన్ని గమనించిన చంద్రవదన కూడా ఆ యువకుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె కదిరి పట్టణం వాసుల గారాల పట్టి కావడంతో ఇరువురు కలుసుకోవడం అత్యంత కష్టంగా ఉండేది. దీంతో ఇద్దరు తమ స్నేహితుల ద్వారా ఒకరికొకరు సందేశాలు పంపుకునేవారు. చివరికి తమ ప్రేమ విషయం పెద్దలకు తెలియజేస్తారు. వారి సమ్మతితోనే పెళ్లిచేసుకోవాలనే భావిస్తారు. అందుకు పెద్దలు అంగీకరించారు. పైగా ఆ ప్రేమికులు ఇద్దరిని కలుసుకోనివ్వకుండా కట్టుదిట్టం చేస్తారు. దీంతో విరహవేదనను భరించలేక మెహియర్ పూర్తిగా నిద్రహారాలు మానేస్తాడు. అలా మెహియర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించాడు. తన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడిని తలుచుకుంటూ చంద్రవదన కూడా తుదిశ్వాస విడుస్తుంది. ఈ ఘటనతో కదిరి గ్రామం వాసుల ప్రజలు తామెంతో తప్పు చేశామని బాధపడతారు. కనీసం మరణంలోనైన ఇరువురు కలిసి ఉండాలని భావించి ఇరువురు సమాధులను ఒకచోటే ఏర్పాటు చేస్తారు గ్రామస్తులు. ఈ ప్రాంతంలోని అనేకమంది తమ పిల్లలకు మెహియార్ అనే పేరులు పెట్టుకుని ఆ అమర ప్రేమికులను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. అంతేగాదు వారి సమాధిని దర్శిస్తే తమ ప్రేమ ఫలిస్తుందనేది ప్రేమికుల నమ్మకం కూడా. దీంతో ఈ సమాధులను దర్శించుకునేందుకు ప్రేమికుల తాకిడి కూడా గట్టిగానే ఉండేది. అయితే రాను రాను తర్వాతి తరాలకు తెలియకుండా మసకబారడం మొదలైంది. దాంతో సందర్శకుల తాకిడి నెమ్మదిగా తగ్గిపోయింది.(చదవండి: 'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
చెల్లెలు కలిపిన బంధం..ఐపీఎస్ సుధీర్ రాంనాథ్ లవ్ స్టోరీ
ఆరు నెలల తర్వాత.. నా అభిప్రాయం చెప్పా.. ప్రపంచంలో ప్రతీజీవి తోడు కోరుకుంటుంది. ఆ తోడు కోరుకోవడంలో ఆచితూచి అడుగులు వేయడం కీలకం. కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు అంటే గౌరవం, బాధ్యతలు అన్నింటిని సరిచూసుకుంటూ.. నచ్చిన జోడీని ఎంచుకోవడం, అదికూడా ఆకర్షణ కాకుండా జీవితంగా భావించి.. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునేందుకు సమయం తీసుకొని.. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం అంటే.. ఒక మహాయజ్ఞంలాంటిదే. సరిగ్గా అదే జరిగింది మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్– ప్రియాంక దంపతుల ప్రేమ వివాహంలో. నేడు (శుక్రవారం) ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఐపీఎస్ సుధీర్ రాంనాథ్ కేకన్ తన ప్రేమ వివాహ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..– సాక్షి, మహబూబాబాద్నేను, ప్రియాంక ఒకరినొకరం ఇష్టపడిన విషయం ఇంట్లో తెలిసింది. కొన్నిరోజులు చర్చలు జరిగాయి. ముందుగా ప్రియాంక కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి మాట్లాడారు. కొంతసమయం తీసుకొని మా కుటుంబ సభ్యులు వారి ఇంటికి వెళ్లారు. పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ, నేను కొన్ని ఆంక్షలు పెట్టాను. ఆ సమయంలో నేను సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్న. నేను సివిల్స్ సాధించిన తర్వాతే పెళ్లి అనుకున్నాం. విషయాన్ని ఇటు కుటుంబ సభ్యులకు, అటు ప్రియాంకకు చెప్పాను. నా ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. సివిల్స్ బాగా రాశాను. మంచి ర్యాంకు వస్తుందని చెప్పాను. అంతా సంప్రదాయం ప్రకారం లగ్నపత్రిక పెట్టుకున్నారు. పెళ్లికి 15 రోజుల ముందు సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఐపీఎస్‌కు సెలక్ట్ అయ్యాను. కుటుంబ సభ్యులు, మిత్రులు అభినందనలు తెలిపారు. ప్రియాంక ఫోన్లో అభినందనలు తెలిపినప్పుడు ఇద్దరి సంతోషం చెప్పలేను. ఆ తరువాత సంప్రదాయబద్ధంగా మా వివాహం జరిగింది. నేను అనుకున్నట్లు ఒకవైపు ప్రియాంకను, మరోవైపు ఐపీఎస్‌ను సాధించాను. ఇప్పటివరకు మా వైవాహిక జీవితం ఆనందంగా సాగుతోంది. మా ఇద్దరికి తోడు మా బాబు విరాజ్. ముగ్గురం సంతోషంగా ఉన్నాం.అవగాహన లేకపోతే బంధం గుదిబండనే..మనిషికి మహిళ తోడు అవసరం. వివాహం అనేది అందరి జీవితంలో కీలక ఘట్టం. దీనికి ఆచితూచి అడుగులు వేయాలి. ప్రేమ అనేది ఒక ఆకర్షణ కావద్దు. ఇద్దరి బంధమనుకోవాలి. ఒకరి భావాలు మరొకరు పంచుకుంటూ ఒక అవగాహనతో వెళ్లాలి. లేకపోతే ఇరువురి కుటుంబ సభ్యులకు గుది బండగానే ఉంటుంది. ఇష్టపడటం, అనుకున్న ల క్ష్యాలను సాధించి తర్వాత వివాహం చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. నేటి యువత ఈ దిశగా ఆలో చించాలి. కని పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది.నాన్న అంటే అందరికీ భయమే.. కానీ చెప్పక తప్పదు..ఒకవైపు చెల్లెలి ఫ్రెండ్. అప్పటికే ఆమె బీటెక్ చేసి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. నేను సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. నేనంటే ఇష్టమని ప్రియాంక చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. మొదట ఏమి చెప్పాలో తెలియలేదు. సివిల్స్ సాధనే నా లక్ష్యం. ఈ సమయంలో ప్రేమ ఏంది అనుకున్నా. నా అభిప్రాయం చెప్పేందుకు కొంత సమయం అడిగాను. ఆమె కూడా సరేనంది. మాది పెద్ద కుటుంబం. నాన్న అంటే ముగ్గురు అన్నలతోపాటు అందరికీ భయమే. కానీ, ఆయన మాత్రం మాతో సరదాగానే ఉంటూనే పద్ధతిగా ఉండాలని చెబుతారు.. ఇటువంటి పరిస్థితిలో ప్రియాంక ప్రపోజ్ చేసిన విషయం ఇంట్లో చెప్పలేను. అలా అని ఉండలేను. నాలోనే నేను ఆలోచనలో పడ్డా. ఆరు నెలల తర్వాత ప్రియాంకకు ఓకే అని నా అభిప్రాయం చెప్పాను.చెల్లెలు కలిపిన బంధంమా ఊరుకు 20 కిలోమీటర్ల దూరంలో మా పిన్ని కూతురు అత్తగారి ఇల్లు ఉంటుంది. మా చెల్లి అంటే అందరికి ఇష్టం. ఆమెకు కూడా మేం అంటే ప్రాణం. అందుకోసమే తరచూ నేను అక్కడికి వెళ్లేవాడిని. అక్కడ మా చెల్లి దగ్గరికి తన స్నేహితురాలు ప్రియాంక వచ్చేది. చెల్లిని కలిసినప్పుడు ఒకరోజు ప్రియాంకను పరిచయం చేసింది. ఆమె కూడా సరదాగా మాట్లాడేది. కానీ, అది ప్రేమగా మారుతుందని అనుకోలేదు. చూస్తూ ఉండగానే ఒకరోజు నేనంటే ఇష్టమని నా చెల్లెలికి చెప్పింది. ఈ విషయం చెల్లి నాకు చెప్పేందుకు తడబడినా.. చివరకు చెప్పింది. -
మలి ప్రేమ..: ఔను.. వాళ్లు ఇష్టపడ్డారు
ప్రేమికుల రోజంటే యువ హృదయాల గురించే మాట్లాడుకుంటారు. వారి ఆశలు, ఆనందాల గురించే ప్రస్తావిస్తుంటారు. మలివయసులో ఒంటరితనంతో బాధపడుతున్న పెద్దలు... తోడును కోల్పోయిన జీవితాల్లో వెలుగులు నింపడం గురించి ఆలోచిస్తున్నామా?!తీరిక లేని మన జీవితాల్లో నుంచి వారిని దూరం పెడుతున్నాం సరే, వారి మదిలో దాగున్న ప్రేమలను, బాధలను అర్ధం చేసుకుంటున్నామా?! ఆరుపదుల వయసులో మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అని కోరుకుంటున్న ఒంటరి పెద్దల ప్రేమలనూ గౌరవిద్దామా... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మలి వయసులో చిగురించిన తమ ప్రేమను ఫలప్రదం చేసుకున్న కొన్ని జంటల ప్రేమ కథల గురించి చెబుతున్నారు తోడూనీడా వ్యవస్థాపకురాలు రాజేశ్వరి. ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అనేది ఇటీవల జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గౌహతిలోని ప్రమోద్ తాలూక్దార మెమోరియల్ వృద్ధాశ్రమంలో ఉంటున్న 71 ఏళ్ల పద్మేశ్వర్ గోలాకు పాటలు పాడటం హాబీ. ఆ వృద్ధాశ్రమంలో గోలా స్వరానికి మంత్రముగ్ధురాలైన 65 ఏళ్ల జయప్రభ బోరా అతన్ని ఇష్టపడింది. అతను ఆమెను ‘జాన్’ అని పిలుస్తాడు. ఆమె అతన్ని ‘బాబు’ అని పిలుస్తుంది. గోలాకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. జయప్రభకు మాత్రం పిల్లలున్నారు. భర్త ఎప్పుడో చనిపోయాడు. బోరా పిల్లలు, మనవలు కూడా ఈ అవ్వ–తాత పెళ్లి జరిపించి, వారి ఆనందంలో తామూ పాలు పంచుకున్నారు. సాయంగా మారిన ప్రేమరాజమండ్రి అర్బన్ నారాయణపురానికి చెందిన మాడుగుల మూర్తి వయసు 65 ఏళ్లు. నూడుల్స్ బండి నడుపుకునే చిరువ్యాపారి. ఎప్పుడో కుటుంబాన్ని వదిలి బయటకు వచ్చేశాడు. ఆరోగ్యం సహకరించడం లేదు. ఒంటరిగా జీవించలేక స్థానికంగా ఉండే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో చేరారు. ఆశ్రమంలోకి వచ్చాక కూడా ఎవరితోనూ మాట్లాడకుండా అనాసక్తంగా రోజులు గడుపుతుండేవారు. కడప జిల్లా కమ్మలగుంటకు చెందిన 68 ఏళ్ల గుజ్జుల రాములమ్మ అదే ఆశ్రమంలో కొన్నాళ్లుగా ఉంటున్నారు. ఆశ్రమంలో ఆరోగ్యం బాగోలేని వారికి తనకు చేతనైనంతలో సేవలు చేస్తుండేది. కొన్నినెలలుగా సేవలు అందిస్తున్న రాములమ్మతో మూర్తికి మానసిక బంధం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులను కలిసి, తమ మనసులో మాట చె΄్పారు. ప్రేమలకు వయసుతో పనిలేదు. మానసికంగా ‘మాకోసం ఒకరున్నారు’ అనే భావన జీవించడానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఒంటరి పెద్దలు కోరుకుంటున్న జీవనాన్ని అందించడానికి వారి కుటుంబసభ్యులూ అండగా నిలవాల్సిన సమయమిది.సాయంగా ఉండాలనుకున్నాం.. అనారోగ్యంగా ఉండి, ఆసుపత్రికి వెళ్లాలన్నా అక్కడ మీతోపాటు ఎవరినైనా వచ్చారా..’ అని డాక్టర్లు అడుగుతున్నారు. కొన్నాళ్లుగా నాకు సాయంగా రాములమ్మ ఉంటోంది. ఏ విషయంలోనైనా ఆమెకు సాయంగా నేనూ ఉంటాను అని చె΄్పాను. ఇద్దరమూ ఒకరికి ఒకరం తోడుగా ఉందామనుకుని, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆశ్రమం వాళ్లు మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. అంతా కలిసి ఈ మధ్యే మా ఇద్దరికీ దండలు మార్చి, అందరి సమక్షంలో పెళ్లి చేశారు. ఇప్పుడు మాకు ఒకరున్నారనే తోడు, జీవనానికి భరోసా ఉంది. – మూర్తి, రాములమ్మమనసులో మాట పంచుకోవడానికి...మలివయసు ప్రేమకథలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. తోడు–నీడ వేదికగా మలివయసు జంటలను కలుపుతున్నాను. ఆరు పదుల వయసు దాటినా, వారిలో అంతటి ప్రేమ ఉందా అనే ఆశ్చర్యమూ కలుగుతుంది. ఈరోజుల్లో పిల్లలు కూడా పెద్దల పెళ్లికి అంగీకరిస్తున్నారు. కానీ, ఇంకా సమాజం అంగీకరించడంలేదు. ఆ వయసు లో ప్రేమ–పెళ్లి అవసరమా? అంటున్నారు. మలివయసులో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదో భయం, దిగులు ఆవరిస్తుంది. బాగోలేనప్పుడే మరొకరి అవసరం ఉంటుంది. ఇరవైల్లో చేసుకునేదే ప్రేమ పెళ్లి కాదు.. అరవైల్లోనూ ఎమోషనల్ రిలేషన్ కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది.– రాజేశ్వరి, తోడు నీడ వ్యవస్థాపకురాలు -
ఆన్లైన్ నుంచి అక్షింతల దాకా
ప్రేమను.. పెళ్లితో స్థిరపరచేది అదే! అయితే దానికి బాటలు వేసేవి మాత్రం పరస్పర నమ్మకం, గౌరవాలే! అలాంటి లవ్ స్టోరే ఇది! దాదాపు ఏడేళ్లపాటు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లితో ప్రేమను గెలిపించుకున్న ఆ జంటలోని అమ్మాయి.. రైతా, ఫిన్లండ్. అబ్బాయి .. ప్రదీప్, హైదరాబాద్. ప్రేమకథా కాలం.. 1997.. స్కూలింగ్ పూర్తి చేసుకున్న రైతా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇంగ్లిష్ భాషను నేర్చుకుంటోంది. ఫ్లూయెన్సీ కోసం యాహూ చాట్‌లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో ఒకరోజు ప్రదీప్ పరిచయం అయ్యాడు. సంభాషణలో ఆధ్యాత్మికం, తాత్వికం, మతపరమైన అంశాల నుంచి సామాజిక, రాజకీయ, పర్యావరణ విషయాలు, ప్రపంచ పౌరుల బాధ్యతలు వంటి వాటి మీద ప్రదీప్కున్న అవగాహనకు రైతా ముచ్చటపడింది. ప్రదీప్‌కూ రైతా పట్ల అదే భావన. నెమ్మదిగా స్నేహం పెరిగింది. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ప్రదీప్‌కి రైతా మీద ప్రేమ మొదలైంది. అప్పటికీ ఆ ఆన్లైన్ స్నేహం వయసు నాలుగేళ్లు. అప్పట్లో వెబ్కామ్స్ లేవు.. కాబట్టి ఒరినొకరు చూసుకోలేదు. కనీసం ఫొటోలు కూడా ఎక్సే ్చంజ్ చేసుకోలేదు. ఒక రోజు ప్రదీప్ మెయిల్ పెట్టాడు ‘రకస్తాన్ సినువా (నువ్వంటే ఇష్టం).. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యాలు రైతాకు. ఎందుకంటే ఫిన్లండ్ లో అంత త్వరగా ఎవరూ పెళ్లి ప్రపోజల్ తీసుకురారు. అలాంటిది అబ్బాయి కనీసం తనను చూడనైనా చూడకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు అని! ఓకే చెప్పింది. ఇద్దరిళ్లల్లో విషయం చెప్పేశారు. ప్రదీప్ జాతకంలో విదేశీ పిల్లే రాసి ఉందని, అదే జరగబోతోందని అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కానీ రైతా వాళ్లింట్లోనే ఒప్పుకోలేదు. కారణం అక్కడ మీడియా లో ఇండియా గురించి ఉన్న వ్యతిరేక ప్రచారమే! వాళ్లను ఒప్పించే ప్రయత్నంలో.. ప్రదీప్‌ను చూస్తే ఒప్పుకుంటారు అన్న ఆశతో‘ఫిన్లండ్ రండి’ అంది రైతా. వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీసా‘రిజెక్టయ్యింది. దాంతో‘నేనే హైదరాబాద్ వస్తాను’ అంటూ అభయమిచ్చింది రైతా! ‘ఎయ్ (.. వద్దు)’ అన్నారు ఆమె తల్లిదండ్రులు. ‘మిక్సీ (ఎందుకు)?’ అడిగింది అమ్మాయి. ‘ఇండియా సేఫ్ కాదు’ స్పష్టం చేశారు. వాదించింది రైతా. అయినా ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. ఈసారి ప్రదీప్ యూకేలో చదువును బహానా (సాకు)గా మలచుకున్నాడు. వీసా ఓకే అయింది. యూకే నుంచి తేలిగ్గానే ఫిన్లండ్కి వీసా దొరికింది. రైతా ఆనందానికి అవధుల్లేవు. పరిచయం అయిన ఏడేళ్లకు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఆ క్షణం రానేవచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇంకా నచ్చారు! రైతా తల్లిదండ్రులకూ నచ్చాడు ప్రదీప్! కానీ అమ్మాయి అక్కడికి వెళ్లి ఉండగలదా? అప్పటికీ ఇండియా మీద ఇంకా సానుకూలమైన అభి్రపాయానికి రాలేదు వాళ్లు. ‘ఉంటాను’ ధైర్యం చెప్పింది. ట్రయల్ గా హైదరాబాద్‌ను విజిట్ చేసింది కూడా! ఇక్కడి సోషల్ లైఫ్‌ను ఇష్టపడింది. ప్రదీప్ తల్లిదండ్రులకూ రైతా చాలా నచ్చింది. రైతా కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి, ప్రదీప్ కుటుంబాన్ని కలిసింది. అలా ఏడేళ్ల వాళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం, ఆశీర్వాదంతో ఏడడుగుల బంధమైంది. వాళ్ల పెళ్లికిప్పుడు ఇరవై ఏళ్లు. నలుగురు పిల్లలు. ప్రదీప్ కోసం రైతా శాకాహారిగా మారింది. తెలుగు నేర్చుకుంది. ప్రదీప్ జీవితంలోనే కాదు బిజినెస్‌లోనూ భాగస్వామైంది. ప్రదీప్ ఫీనిష్ నేర్చుకున్నాడు. తన కోసం ఆమె చేసుకున్న, చేసుకుంటున్న సర్దుబాట్లను అతను గుర్తిస్తాడు. అమె అభి్రపాయాలను గౌరవిస్తాడు. రైతా తల్లిదండ్రులు తన కూతురు చాలా అదృష్టవంతురాలని పొంగిపోతారు. ‘‘మేమొక మాట అనుకున్నాం.. పెళ్లనే గొప్ప బంధంలోకి అడుగుపెడుతున్నాం. మనమధ్య వచ్చే ఏ తగవైనా మన రిలేషన్‌షిప్‌ని మరింత స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు అని. దాన్నే ఆచరిస్తున్నాం!’ అని చెబుతోంది రైతా. – సరస్వతి రమ -
లవ్ బ్రేస్లెట్..మణికట్టుపై కనికట్టు
రెండు చేతులు కలిస్తే చప్పుడవుతుంది. రెండు మనసులు కలిస్తే ప్రేమవుతుంది. ఇద్దరు మనుషులు కలిస్తే సంపూర్ణ జీవితమవుతుంది. రెండు సగాలు ఒకటిగా అమరితే పరిపూర్ణత వస్తుంది. ఇలాంటి ఒక ఊహకు రూపమిస్తే లవ్ బ్రేస్లెట్ అయింది. లవ్ బ్రేస్లెట్ రూపుదిద్దుకుని యాభై ఏళ్లు దాటింది. న్యూయార్క్‌లో డిజైన్ అయిన ఈ బ్రేస్‌లెట్‌కు లండన్‌లో ఎక్కడలేని ఆదరణ వచ్చింది. ఇప్పటికీ నిత్యనూతనంగా మార్కెట్‌ను ఏలుతోంది. ప్రేమలాగానే అజరామరంగా ప్రేమికులను దగ్గర చేస్తూనే ఉంది. సింబల్ ఆఫ్ లవ్ ‘ప్రేమ లేకపోతే జీవితమే లేదు. ప్రేమలేని జీవితం పెద్ద గుండుసున్న’ అన్నాడు లవ్ బ్రేస్లెట్ రూపకర్త ఆల్డో సిపుల్లో. అతడు 1969లో ఈ డిజైన్ చేశాడు. ఓవల్ షేప్ బ్రేస్లెట్ ఇది. ఇంగ్లిష్ అక్షరం ’సి’ ఆకారంలో ఉన్న రెండు అర్ధభాగాలను కలుపుతూ లాక్ చేయాలి. ఆ లాక్‌ను టైల్ చేయటానికి, ఓపెన్ చేయడానికి చిన్న స్క్రూడ్రైవర్‌ను పోలిన తాళం చెవి కూడా ఉంటుంది. ‘ఒక ‘సి’ నువ్వు, ఒక ‘సి’ నేను... ఇద్దరం కలిస్తే అదే అందమైన బంధం’ అని అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు బాస చేసుకుని బ్రేస్‌లెట్‌ని మణికట్టుకు పెట్టి లాక్ చేస్తారు. ‘మన ప్రేమ నిబద్ధతతో కూడినది, ఎప్పటికీ విడిపోకూడద’ని మాటలతో మనసును లాక్ చేసుకుంటారు. ప్రేమ బంగారం లవ్ బ్రేస్‌లెట్‌ని కార్టియర్ అనే ఆభరణాల తయారీ సంస్థ మార్కెట్లోకి తెచ్చింది. దాంతో దీనికి కార్టియర్ లవ్ బ్రేస్లెట్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. మొదట్లో గోల్డ్ ప్లేటెడ్ బ్రేస్లెట్లతో మొదలు పెట్టారు. ఆ తర్వాత సాలిడ్ గోల్డ్ 18 క్యారట్లో, ΄్లాటినమ్లో కూడా తయారవుతోంది. బంగారంలో ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ షేడ్లలో వస్తోంది. బ్రేస్లెట్లో లాక్ గుర్తులున్న చోట వజ్రాన్ని పోలిన రోడియం ఫినిషింగ్, అసలైన వజ్రాలు, ఇతర జాతిరాళ్లను పొదగడం వంటి మార్పులు కూడా సంతరించుకుంది. హాలీవుడ్ నటీనటులు ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్, అలీ మ్యాక్గ్రావ్, స్టీవ్ మెక్క్వీన్లు ధరించడంతో ఇది పాపులర్ అయింది. ఈ లవ్ బ్రేస్లెట్లు ఎక్కడికక్కడ స్థానికంగా తయారవుతున్నాయి. ఈ విషయంలో కార్టియర్ కొన్ని కంపెనీల మీద కేసు కూడా పెట్టింది. కొద్దిపాటి మార్పులతో కీ లేకుండా నేరుగా ధరించే మోడల్స్ వచ్చాయి. మనదేశంలో కూడా బంగారు ఆభరణాల తయారీదారులు ఈ మోడల్‌ను చేస్తున్నారు. రోజ్‌గోల్డ్ షేడ్‌లో ఇతర లోహాలతో ఫ్యాన్సీ మార్కెట్లోనూ విరివిగా దొరుకుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లవ్ బ్రేస్లెట్ కోసం దుకాణాల్లో వాకబు చేసేవాళ్లు, ఆన్లైన్ లో ఈ కామర్స్ వెబ్సైట్లలో సెర్చ్ చేసే వాళ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాదికీ మూడింతలు నాలుగింతలుగా పెరుగుతోంది. ఈ లవ్ బ్రేస్లెట్ కూడా ప్రేమలాగానే ప్రకాశిస్తోంది.హాస్పిటల్లో బ్రేస్లెట్ ‘కీ’ లవ్ బ్రేస్లెట్ ఎంతగా ప్రజాదరణ పొందిందో తెలిపే ఉదంతం ఒకటుంది. 1970–80లలో అమెరికాలోని హాస్పిటళ్లలో లవ్ బ్రేస్లెట్ తాళం చెవిని అందుబాటులో ఉంచేవారట. ఇంట్లో బ్రేస్లెట్ ధరించిన తర్వాత ‘కీ’ని ఇంట్లో పెట్టి బయటకు వస్తారు. ప్రమాదవశాత్తూ లేదా మరేదైనా కారణాలతో హాస్పిటల్‌కి వచ్చిన పేషెంట్‌కి అవసరమైన పరీక్షలు చేయాల్సినప్పుడు ఒంటిమీదున్న లోహపు వస్తువులన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది. లవ్ బ్రేస్లెట్ కీ కోసం ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి హాస్పిటళ్లు లవ్ బ్రేస్లెట్ కీని సిద్ధంగా ఉంచేవి. -
కొత్త తరం ప్రేమలు.. జెన్‌జెడ్ ప్రేమలు
జమానా మారినా ప్రేమకు అర్థం మారదు! కానీ ఇప్పుడు ప్రేమ కూడా ఆన్‌లైన్‌కి చేరి.. ఆ బంధం కూడా ట్రెండింగ్ అయ్యి.. సాఫ్ట్వేర్ అప్డేట్స్లాగా రోజుకో కొత్త రిలేషన్షిప్ లాంచ్ అవుతోంది! బ్రెడ్‌క్రంబింగ్.. అవతలి వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్.. ఫీలింగ్స్ ఉన్నట్లు, ఆ రిలేషన్షిప్ కోసం ఎంతో సమయం వెచ్చిస్తున్నట్లు నటించడమే బ్రెడ్‌క్రంబింగ్. అటెన్షన్ కోసం, అవతలి వాళ్ల మీద నియంత్రణ కోసం ఈ డ్రామా ఆడతారు. రోచింగ్.. ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకకాలంలో అనేకమందితో రిలేషన్లో ఉండటం. అయితే దీన్ని జెన్ జీ చీటింగ్‌గా భావించడం లేదు. సీక్రసీ అంటోందంతే!బెంచింగ్.. అవతలి వ్యక్తిని మరోవైపు కదలనివ్వకుండా.. అలాగని తమ నుంచి కమిట్మెంట్ ఇవ్వకుండా, సీరియస్‌నెస్ చూపించకుండా అప్పడప్పుడు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ అవతలివాళ్లను కట్టిపడేయడమే బెంచింగ్.కాన్షస్ డేటింగ్.. చుట్టూ తిరిగే వాళ్లలో ఒకరిని ఎంచుకోకుండా.. నీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, నిన్ను నిన్నుగా ఇష్టపడుతూ జీవితాంతం తోడుగా, నమ్మకంగా ఉండే వ్యక్తిని వెదుక్కోవడమే కాన్షస్ డేటింగ్!కఫింగ్.. చలికాలం, సెలవులు, వాలంటైన్ వీక్.. ఇలా ప్రత్యేక సమయం, సందర్భాల్లో డేటింగ్ చేయడాన్ని కఫింగ్ అంటున్నారు. ïడ్రై డేటింగ్ .. ఆల్కహాల్ ఫ్రీ డేట్ అన్నమాట. అంటే డేటింగ్‌కి వెళ్లినప్పుడు ఆల్కహాల్ తీసుకోరు. సింగిల్స్, రిలేషన్షిప్లో ఉన్నవాళ్లు.. అందరూ ఈ డ్రై డేట్స్‌కి ప్రాధాన్యమిస్తున్నారు. సింగిల్స్ అయితే తమకు కాబోయే పార్టనర్ మందు ప్రభావానికి లోనుకాకుండా సహజంగా ఎలా ప్రవర్తిస్తాడు/ ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి, అదివరకే రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లయితే తమ అనుభవాలు, మంచి చెడులను చర్చించుకోవడానికి ఈ డ్రై డేట్స్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. కిటెన్ఫిషింగ్ .. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అబద్ధాలాడుతూ అవతలి వాళ్లను నమ్మించడం లేదా వశపరచుకోవడం. ఉదాహరణకు వయసును తగ్గించి, జీతాన్ని పెంచి చెప్పడం, సన్నగా ఉన్నప్పటి ఫొటోలు అప్లోడ్ చేయడం, ఇంజినీరింగ్ డిప్లమా చేసి, డిగ్రీ చేశానని నమ్మించడం లాంటివన్నమాట.లవ్ బాంబింగ్.. వ్యక్తిత్వంతో కాకుండా మాటలు, కానుకలు, అటెన్షన్‌తో అవతలి వ్యక్తిని గుక్క తిప్పుకోనివ్వకుండా చేయడం సిట్యుయేషన్‌షిప్.. ఇది ఫ్రెండ్షిప్కి ఎక్కువ.. రిలేషన్‌షిప్‌కి తక్కువ! అటాచ్మెంట్ ఉంటుంది. కానీ కమిట్మెంట్ ఉండదు.నానోషిప్.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, క్లబ్‌లు, పబ్‌లలో చూపులు కలిసి.. నవ్వులు విరిసి.. ఫ్లర్టింగ్ మొదలై.. అక్కడే ముగిసి అదొక తీయటి జ్ఞాపకంలా మిగిలిపోయేది!ఇంకా..ఒక బంధంలో ఉంటూనే మరొకరితో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేసే ‘ఓపెన్ కాస్టింగ్’, సరిహద్దులకతీతంగా చేసే డిజిటల్ డేటింగ్ ‘వండర్ లవ్’ లేదా ‘డేటింగ్ నోమాడ్’, వాట్సాప్ మెసేజెస్ తో మాత్రమే రిలేషన్షిప్లో ఉండే ‘టెక్స్టేషన్షిప్’లాంటి బంధాలు, ఫోన్‌కాల్స్.. మెసేజెలను మెల్లగా తగ్గిస్తూ బంధం నుంచి వైదొలిగే ‘ఫేడింగ్’, ఏ సమాచారం లేకుండా హఠాత్తుగా భాగస్వామితో కమ్యూనికేషన్‌ను కట్ చేసుకోవడం, వాళ్ల జీవితంలోంచి అదృశ్యమైపోయే ‘ఘోస్టింగ్’ లాంటి అప్రకటిత బ్రేకప్‌లు, జీవితంలోంచి వెళ్లిపోయినా.. సోషల్ మీడియాలో పార్టనర్ చేసే పోస్ట్‌లను వెదుకుతూ లైక్స్ కొట్టే ‘హంటింగ్’ లాంటి గూఢచర్యాలూ ఉన్నాయి. ఇవన్నీ ఈ తరం ఫాలో అవుతున్న ‘లవ్షిప్స్!’పారదర్శకంగా ఉండాలిప్రేమించే వాళ్ల స్థాయిని కాకుండా మనస్తత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, అన్ని విషయాలలో పారదర్శకంగా ఉండాలి. కుటుంబాలకు, కనీసం స్నేహితులకు కూడా చెప్పుకోలేని ప్రేమ బంధాలు చాలావరకు అబద్ధాల మీదే నిర్మితమై ఉంటాయి. నిజాయితీపరులైన ప్రేమికులను కులం, మతం వంటి కట్టుబాట్ల నుంచి రక్షించడానికి వివిధ చట్టాలు ఉన్నాయి. అలాగే ప్రేమ పేరుతో మోసం చేసే వారికీ కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఆకర్షణకు లోనవకుండా భాగస్వామిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని కమిట్ అవడం మంచిది. – సుధేష్ణ మామిడి, హైకోర్టు న్యాయవాది -
ప్రేమకు శ్వాస విశ్వాసమే- రకుల్
‘‘ఒక బంధం బలంగా సాగాలంటే ప్రేమ మాత్రమే సరిపోదు.. నమ్మకమూ ఉండాలి. ప్రేమకు శ్వాస విశ్వాసమే’’ అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). జీవితంలో తాను అద్భుతమైన ‘ఫేజ్’లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ ఆనందానికి కారణం జీవిత భాగస్వామి జాకీ భగ్నానీ. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani), రకుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో ఈ ఇద్దరూ తమ ప్రేమ గురించి బయటపెట్టారు. 2024 ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో రకుల్ స్పెషల్ చిట్ చాట్ ... → మీరు, జాకీ ప్రేమలో ఉన్నప్పుడు జరుపుకున్న వాటిలో మరచిపోలేని ‘ప్రేమికుల దినోత్సవం’ గురించి చెబుతారా? మా ఇద్దరి కాంబినేషన్ (జాకీ నిర్మాత–రకుల్ హీరోయిన్)లో వచ్చిన మొదటి సినిమా ‘కఠ్ పుతలీ’ (2022). ఆ సినిమా అప్పుడే మేం ఫస్ట్ వేలంటైన్స్ డే జరుపుకున్నాం. మా డేటింగ్ మొదలైంది అప్పుడప్పుడే. ఓ హోటల్లోని గ్రీన్హౌస్ ఏరియాని జాకీ క్యాండిల్ లైట్ డిన్నర్‌కి తగ్గట్టుగా మార్పించాడు. ఒకవైపు గిటారిస్ట్‌లు పాడుతుంటే ఆ పాటలు వింటూ, ఆరోగ్యకరమైన విందుని ఆస్వాదించాం. జాకీ నా కోసం గులాబీ పువ్వులు, పుష్పగుచ్ఛాలు ఇచ్చాడు. అదొక అందమైన, ఆహ్లాదకరమైన రోజు. సో.. నాకెప్పటికీ ఆ వాలంటైన్స్ డే గుర్తుండి పోతుంది. → ఓ జంట మధ్య బలమైన బంధం ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు? పెద్ద టిప్ ఏంటంటే ‘నమ్మకం’. ఒకరి పట్ల మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే బలమైన బంధానికి పునాది వేస్తుంది. రిలేష్న్షిప్లో మంచి ష్రెండ్షిప్ ఉండటం చాలా ముఖ్యం. ఎప్పుడైతే భాగస్వామిలో మంచి ఫ్రెండ్‌ని చూస్తామో, అప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. ఎవరికైనా జీవితం చాలా సునాయాసంగా సాగాలి... ఒత్తిడిగా కాదు. హ్యాపీగా సాగాలంటే నమ్మకం, విశ్వాసం, స్నేహం ముఖ్యం. → మీ ‘బెటర్‌హాఫ్’ జాకీ భగ్నానీ గురించి కొన్ని మాటలు... జాకీ నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం.. తను నా సోల్‌మేట్ కావడం ఆనందం. మా ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మా ఇద్దరికీ ఉన్న పెద్ద తేడా ఏంటంటే నేను చాలా ‘హైపర్’, తను చాలా ‘కూల్’. నా హైపర్‌ని జాకీ ఎప్పుడూ విమర్శించింది లేదు సరికదా... పొగుడుతుంటాడు. అయినా ఒకరు హైపర్... మరొకరు కూల్... ఇలా ఉండటం కూడా బాగుంటుంది. బ్యాలెన్స్ అవుతుంది (నవ్వుతూ). నా పార్ట్నర్లో నేను బెస్ట్ ఫ్రెండ్‌ని చూశాను. మేం ఇద్దరం ఏ విషయం గురించైనా చాలా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. ఏం చేయాలన్నా చేస్తాం. ఇక మేం ఒకరికొకరం ఇచ్చుకునే సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మేం మా పార్ట్నర్ కోసం మారాల్సిన అవసరం రాలేదు. పెళ్లికి ముందెలా ఉన్నామో ఆ తర్వాతా అలానే ఉన్నాం. అందుకే మేం ఇద్దరం అదృష్టవంతులం అంటాను.→ అయితే పెళ్లి తర్వాత మీరు మారాల్సిన అవసరం రాలేదంటారా? ఏ మార్పూ లేదు. అసలు ఒకరి జీవితం పెళ్లి కారణంగా ఎందుకు మారాలి? పెళ్లి తర్వాత జీవితం మెరుగవ్వాలి. నా లైఫ్ బెటర్ అయింది. పెళ్లికి ముందు నాకు నచ్చిన పనులు చేసినట్లే ఇప్పుడూ చేస్తున్నాను. ఫీలింగ్స్‌ని దాచేయకుండా షేర్ చేసుకునేంత స్వేచ్ఛ నా సోల్‌మేట్‌తో ఉంది. అందుకే జీవితం అందంగా, ఆనందంగా ఉంది. అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించడం ఓ అదృష్టం. అర్థం చేసుకునే వ్యక్తి పక్కన ఉన్నప్పుడు జీవితంలోని ఆ దశ అద్భుతంగా ఉంటుంది.– డి.జి. భవాని -
ప్రేమించుకుందాం.. రా
తెలుగు చిత్రపరిశ్రమ(Telugu Film Industry) వెండితెర ప్రేమతో నిండిపోనుంది. అరడజనుకు పైగా ప్రేమకథలు(Love Story) ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి... ప్రేమించుకుందాం.. రా! అంటూ వెండితెర కోసం ప్రేమలో పడిన నటీనటుల గురించి ఈ ప్రేమికుల దినోత్సవం(Valentine Day) సందర్భంగా మీరూ ఓ లుక్ వేయండి.సాగర్ లవ్స్ మహాలక్ష్మిసాగర్గా కాలేజీకి వెళ్తున్నారు రామ్. కాలేజీలో మహాలక్ష్మిని ప్రేమించాడు. మరి... సాగర్ లవ్ సక్సెస్ అయ్యిందా? అతని చదువు ఏమైంది? అన్న ఆసక్తికరమైన అంశాలను థియేటర్స్‌లో చూడాలి. రామ్ హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యూత్‌పుల్ డ్రామా రూపొందుతోంది. ఈ చిత్రంలో కాలేజీ స్టూడెంట్ సాగర్‌గా రామ్, మహాలక్ష్మీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. రామ్, భాగ్యశ్రీలతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశా లను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.నారీ నారీ నడుమ మురారి ఇద్దరు అమ్మాయిల ప్రేమలో శర్వానంద్ ఇరుక్కున్నారు. ఫైనల్‌గా ఏ అమ్మాయి ఈ హీరో ప్రేమను దక్కించుకుంది? అనే ప్రశ్నకు సమాధానం ‘నారీ నారీ నడము మురారి’ సినిమా చూసి తెలుసుకోవాలి. శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘నారీ నారీ నడము మురారి’. ‘సామజ వరగమన’ మూవీతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.యాక్షన్ లవ్ స్టోరీ‘హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి లవ్‌స్టోరీ మూవీస్‌లో నటించి, ఆడియన్స్‌ను మెప్పించారు అక్కినేని అఖిల్. తాజాగా ఈ యంగ్ హీరో మరో లవ్‌స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తీసిన దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించనున్న నెక్ట్స్ ఫిల్మ్‌లో అఖిల్ హీరోగా చేస్తున్నారని తెలిసింది.ఆల్రెడీ చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ఈ యాక్షన్ లవ్‌స్టోరీ మూవీలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుందట. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని తెలిసింది. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లవ్వుకు లైఫ్ ఇద్దామా...‘లవ్వే లైఫ్ అందామా... లవ్వుకు లైఫ్ ఇద్దామా’ అంటూ తన లవ్‌ను సూపర్బ్‌గా ప్రపోజ్ చేశారు సందీప్ కిషన్. మరి... సందీప్ లవ్‌స్టోరీ సక్సెస్ అయ్యిందా? ఎటువంటి సవాళ్లను ఎదుర్కొని సందీప్ తన లవ్‌ను సాధించుకున్నారు? అన్నది ‘మాజాకా’ మూవీలో చూడాలి. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేశ్, అన్షు కీలక పాత్రల్లో నటించారు.నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. తండ్రీకొడుకుల అనుబంధం, తండ్రి లవ్‌స్టోరీకి కొడుకు ఏ విధంగా హెల్ప్ చేశాడు? కొడుకు లవ్‌స్టోరీకి తండ్రి ఏ విధంగా సపోర్ట్ చేశాడు? అన్న అంశాల నేపథ్యంలో ‘మాజాకా’ మూవీ ఉంటుందని సమాచారం.ఇద్దరు అమ్మాయిల ప్రేమలో... ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తారు. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎవర్నీ ప్రేమించడు. మరి... ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయి ప్రేమకోసం ఏం చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ‘హాష్ ట్యాగ్ సింగిల్’. అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ముక్కోణపు ప్రేమకథ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’. ఈ ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.మాజీ ప్రేమికుల కథకొంత కాలం ప్రేమించుకుని, విడిపోయిన తర్వాత మళ్లీ ఆ ప్రేమికులు కలుసుకోవాల్సి వస్తే? కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే? ఎలా ఉంటుంది? అనే కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘డెకాయిట్: ఏ లవ్‌స్టోరీ’. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో విడిపోయిన ప్రేమికులుగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కనిపిస్తారు. ఈ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత శ్రుతీహాసన్‌ను తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె ప్లేస్‌లో మృణాల్ ఠాకూర్ ఫైనలైజ్ అయ్యారు. ప్రేమ బాధ భయంకరం‘ప్రేమ చాలా గొప్పది... కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది’’ అంటున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రేమకథా చిత్రం ‘దిల్ రుబా’ కోసమే కిరణ్ అబ్బవరం ఈ డైలాగ్ చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా విశ్వ కరుణ్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ‘దిల్ రుబా’. ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించగా, నాజియా డేవిసన్ మరో లీడ్ రోల్లో నటించారు. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. లవ్‌లో ఫెయిలై, మళ్లీ లవ్‌లో పడే ఓ కుర్రాడి కథగా ‘దిల్ రుబా’ చిత్రం రూపొందినట్లుగా తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉంది. అలాగే రవి నంబూరి అనే కొత్త దర్శకుడు తీస్తున్న లవ్ స్టోరీ మూవీలోనూ కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్నట్లుగా తెలిసింది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సాయి రాజేశ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారట.ప్రేమలో సంఘర్షణఓ కాలేజీ అమ్మాయి ప్రేమ, ఆ ప్రేమ కారణంగా ఆ యువతి ఎదుర్కొనే సంఘర్షణల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. హీరోయిన్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రేమలో సంఘర్షణకు గురయ్యే అమ్మాయి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిడిల్ క్లాస్ లవ్స్టోరీమిడిల్ క్లాస్ బాయ్ లవ్‌స్టోరీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలంటున్నారు హీరో ఆనంద్ దేవరకొండ. ‘90స్’ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ను అలరించిన ఆదిత్యా హాసన్ డైరెక్షన్లో ఓ లవ్‌స్టోరీ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించనుండగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటించనున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ‘డ్యూయెట్’ అనే మరో లవ్‌స్టోరీ ఫిల్మ్ కూడా చేస్తున్నారు ఆనంద్ దేవరకొండ. రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన మిథున్ వరదరాజకృష్ణన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ప్రేమ తుఫాన్! ‘ఎవరి తుఫాన్లు వారికి ఉంటాయి లోపల. కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు’ అంటూ ఓ ఇంటెన్స్ లవ్ డైలాగ్ చెప్పారు హీరోయిన్ అనంతికా సనీల్‌కుమార్. ‘మను’ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్లో అనంతికా సనీల్ కుమార్, హను రెడ్డి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ ఇంటెన్స్ లవ్‌స్టోరీ సినిమాను నిర్మించారు.ప్రేమలో బ్రేక్ అప్ అయిన తర్వాత లైఫ్‌లో ఓ అమ్మాయి ఎలా మూవ్ ఆన్ అయ్యింది? అసలు ఆమె ప్రేమ ఎందుకు విఫలమైంది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్, రెబ్బా ప్రగడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.తెలంగాణ లవ్‌స్టోరీ ‘నీది నాది ఒకే కథ, విరాటపర్వం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల నిర్మాతగా మారి, రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఖమ్మం–వరంగల్ సరిహద్దుప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ఇది. నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. వీరే కాదు... మరికొంతమంది హీరోలు–హీరోయిన్లు కూడా లవ్‌స్టోరీ మూవీస్ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..!
యధార్థ ప్రేమ కథ ఇది. ప్రియురాలు ఇచ్చిన మాటను నమ్మి పది, పన్నేండేళ్లు కాదు ఏకంగా జీవితాంతం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు అలానే ఉండిపోరు. ఆమె వస్తుందని చివరి శ్వాస వరకు ఎదరుచూసిన గొప్ప ప్రేమ పిపాసి.ఆ వ్యక్తే మహరాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన కళాతపస్వీ కెకీ మూస్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ కోసం చాలీస్‌గావ్ అనే ఊరిలో మూస్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. ఈ ఆర్ట్ గ్యాలరీ ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమలాకర్ సామంత్ ఆయన అంతులేని ప్రేమ కథను వివరించారు. ఆయనిచ్చిన సమాచారం ప్రకారం..1912 అక్టోబర్ 2న ముంబైలోని మలబార్ హిల్‌లో పిరోజా, మానెక్జీ ఫ్రాంజీ మూస్ అనే పార్సీ దంపతులకు కెకీ జన్మించారు. కెకీ పూర్తి పేరు కైకుసారో మానెక్జీ మూస్. వాళ్ల అమ్మ ఆయన్ను కెకీ అని పిలిచేవారు. ఆ తర్వాత ఆ పేరే ఆయన ఐడెంటిటీగా మారింది. చాలిస్గావ్ స్టేషన్‌కు సమీపంలో రాతితో నిర్మించిన ఒక బంగ్లాలో ఆయన నివసించారు.ముంబైలోని విల్సన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కానీ, తన సోడా వాటర్ ఫ్యాక్టరీ, లిక్కర్ షాపు బాధ్యతలను కెకీయే చూసుకోవాలని మానెక్జీ భావించారు. 1934-35 మధ్యలో మానెక్జీ చనిపోయిన తర్వాత, షాపు నిర్వహణ బాధ్యతలను కెకీ తల్లి పిరోజా తీసుకున్నారు. కొడుకు ఇంగ్లండ్ వెళ్లి ఉన్నత చదువులు చదివేందుకు ఒప్పుకున్నారు. 1935లో లండన్‌లోని బెన్నెట్ కాలేజ్ ఆఫ్ షెఫీల్డ్‌లో చేరారు. నాలుగేళ్ల కమర్షియల్ ఆర్ట్ కోర్సులో డిప్లొమా పూర్తి చేశారు. ఈ కోర్సులో ఫోటోగ్రఫీ కూడా ఒక సబ్జెట్. అది కూడా చదువుకున్నారు కెకీ. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీలో గౌరవ సభ్యత్వం పొందారు. అమెరికా, జపాన్, రష్యా, స్విట్జర్లాండ్లను సందర్శించారు. అక్కడ చాలా ఫోటోగ్రఫీ ప్రదర్శనలను చూశారు. చాలామంది కళాకారులను కలిశారు. 1938లో భారత్‌కు తిరిగి వచ్చారు.ప్రేమ చిగురించింది..ఆయన ముంబైలో చదువుతుండగా నీలోఫర్ మోదీ అనే యువతితో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తర్వాత చాలిస్‌గావ్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలని కెకీ మూస్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆయనకు, నీలోఫర్‌కు మధ్య విభేదాలకు కారణమయింది.కెకీ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ, నీలోఫర్ సంపన్న కుటుంబానికి చెందిన వారు. దీంతో నీలోఫర్ తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం అంత నచ్చలేదు. అయినప్పటికీ వారిద్దరూ పెళ్లిచేసుకోవడానికి వారు అంగీకరించారు.అయితే, నీలోఫర్ ముంబై వదిలి చాలిస్‌గావ్‌లాంటి గ్రామీణ ప్రాంతానికి వెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెకీతో కలిసి చాలిస్గావ్ వెళ్లేందుకు నీలోఫర్ సిద్ధమైనప్పటికీ, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కెకీ ముంబై నుంచి చాలిస్గావ్ వెళ్లేటప్పుడు నీలోఫర్ ఆయనకు వీడ్కోలు పలికేందుకు విక్టోరియా స్టేషన్‌కు వచ్చారు. అది ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ మార్చారు. నీలోఫర్ కైకీకి వీడ్కోలు పలుకుతూ..ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని ఏదో ఒక రోజు తాను కచ్చితంగా పంజాబ్ మెయిల్లో చాలిస్గావ్ వస్తానని, తనతో కలిసి డిన్నర్ చేస్తానని మాటిచ్చారు. ఆ ఒక్క మాట కోసం ఆయన తన చివరి శ్వాస వరకు ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎంతలా ఎదురు చూశారంటే..ప్రియురాలి మాటలపై నమ్మకం ఉంచిన కెకీ మూస్, ఆ రైలు వచ్చినప్పుడు తన బంగ్లా కిటికీలు, తలుపులు అన్నీ తెరిచి ఉంచేవారు. రోజులో మిగిలిన భాగమంతా అవన్నీ మూసేసి ఉండేవి. రైలు వచ్చే సమయానికి దీపాలు వెలిగించేవారు. తోటలోని తాజా పూలతో బొకే తయారుచేసేవారు. తర్వాత తోటలో పువ్వులు లేని సమయంలో వాడిపోని అలంకరణ పూలతో పూలగుత్తులు తయారుచేశారు. ప్రతిరాత్రీ ఆయన ఇద్దరి కోసం భోజనం తయారుచేసేవారు. ఈ పద్ధతిలో ఆయన ప్రతిరోజూ తన ప్రియురాలికి స్వాగతం చెప్పేందుకు రెడీగా ఉండేవారు. అలా చివరి వరకూ ఆయన తన ప్రియురాలికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలా పంజాబ్ మెయిల్ వచ్చి వెళ్లిపోయిన తర్వాతే ఆయన ప్రతిరోజూ డిన్నర్ చేసేవారు. తన చివరి డిన్నర్ డిసెంబరు 31, 1989 వరకు అలానే చేశారు. ఆ రోజూ కూడా పంజాబ్ మెయిల్ రైలు వెళ్లిపోయిన తర్వాతే భోజనం చేసి పడుకున్నారని, ఇక లేవలేదని సావంత్ చెప్పుకొచ్చారు.చిన్న ట్వీస్ట్ ఏంటంటే..కెకీ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో తాను రెండు లేఖలను చూశానని సామంత్ తెలిపారు. వాటిలో ఒకటి ఆయన ప్రియురాలి నుంచి వచ్చింది. రెండోది కేకీ బంధువు హథిఖాన్‌వాలా నుంచి వచ్చిందని ఆర్ట్ గ్యాలీరీ ట్రస్టీ ఎగ్జిక్యూటివ్ సామంత్ తెలిపారు.ఆయన ప్రియురాలిని లండన్ పంపించివేశారని, అక్కడ ఆమె వివాహం చేసుకున్నారని లేఖలో హథిఖాన్‌వాలా కేకీకి తెలిపారు. అయితే కేకీ ఆ ఉత్తరాలను ఎప్పుడూ చదవలేదని సామంత్ చెప్పారు. ఎన్నింటిలో ప్రావిణ్యం ఉందంటే..కెకీ మూస్ ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్. పెయింటర్, సంగీత ప్రేమికుడు, గొప్ప శిల్పి. ఆయనకు పేపర్‌ను అనేక రకాలుగా మడిచి కళాకృతులుగా మార్చే ‘ఒరిగామి’ అనే ఆర్ట్ కూడా తెలుసు. అంతేగాదు మంచి రచయిత, అనువాదకుడు, తత్త్వవేత్త కూడా. అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, గుజరాతీ, ఉర్దు, మరాఠీ భాషలు వచ్చు. సొంత లైబ్రరీ నిర్మించాలన్న ఉద్దేశంతో దాదాపు 4వేల పుస్తకాలు సేకరించారు. ఉర్దూ కవిత్వమంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే ఇతర ఆర్టిస్టుల చెక్కశిల్పాలు, విగ్రహాలు, పురాతన వస్తువులు, పాత అరుదైన పాత్రలు, బొమ్మలు, పాత ఫర్నీచర్, నాణేలను ఆయన సేకరించారు. అనేక రకాల సంగీతానికి సంబంధించిన క్యాసెట్లు, గ్రామ్‌ఫోన్ రికార్డులు సేకరించడం కెకీకి ఒక హాబీ. హిందీ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, అలాగే పిల్లల పాటలకు సంబంధించి ఆయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది. View this post on Instagram A post shared by Yatin Pandit (@sculptor.yatinpandit) (చదవండి: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!) -
Valentines Day 2025: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!
ఫిబ్రవరి అనగానే ఠక్కున ప్రేమికుల రోజు గుర్తొచ్చేస్తుంది. అదీగాక ఆ నెలంతా కూడా హగ్ డే, కిస్ డే వంటివి వచ్చి.. చివరికి ప్రేమికుల రోజుతో ముగుస్తుంది. రొమాంటిక్ భావనను కలుగజేసే ఆ నెలలో ఉండే సందడి అంత ఇంత కాదు. ప్రేమికులు, వివిధ ప్రేమలు సినిమాలు, టీవీల పుణ్యమా అని వాటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాం. కానీ వేల ఏళ్ల చరిత్ర కాలంలోనే హృదయాల్ని కదిలించే అందమైన ప్రేమ కథలు ఉన్నాయి. అవి వింటుంటేనే మనసు అదొలా అయిపోతుంటుంది. మరీ ఈ వాలెంటైన్స్‌డే సందర్భంగా చరిత్ర ముడిపడి ఉండి, అజరామరంగా నిలిచిపోయిన అందమైన లవ్ స్టోరీలను గురించి తెలుసుకుందామా..!మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా:చరిత్రకారులను బాగా ఆకర్షించిన ప్రేమ కథల్లో ఒకటి మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా కథ. జూలియస్ సీజర్ మరణం తరువాత, రోమన్ సామ్రాజ్యాన్ని ముగ్గురు వ్యక్తులు పరిపాలించారు. వారే మార్క్ ఆంటోనీ, ఆక్టేవియస్ సీజర్, లెపిడస్. మార్క్ ఆంటోనీ తూర్పు మధ్యధరాను శాసిస్తూ ఈజిప్టులో నివసిస్తున్నాడు. అతను ఈజిప్ట్ రాణి క్లియోపాత్రాతో కూడా ప్రేమలో పడ్డాడు. ఆంటోని తన భార్య ఫుల్వియా మరణం, తన తోటి పాలకుడు ఆక్టేవియస్ సీజర్‌పై పాంపే తిరుగుబాటు తదితరాల వల్ల ఆంటోనీ రోమ్కు వెళ్లవలసి వస్తుంది. అతను తన స్నేహితుడు ఎనోబార్బస్తో కలిసి ప్రయాణిస్తాడు. అయితే ఆంటోనీకి తన స్నేహితుడు ఆక్టేవియస్ సీజర్‌కి కొన్ని కారణాల వల్ల మనస్పర్థలు వస్తాయి. దీంతో వీటిని రూపుమాపుకునేలా సీజర్ సోదరి ఆక్టేవియస్ని రాజకీయ వివాహం చేసుకుంటాడు. ఈ వివాహంతో లెపిడస్‌తో సహా పాలకులు తిరుగుబాటుదారుడైన పాంపేతో శాంతి ఒప్పందం ఏర్పరుచుకుంటాడు ఆంటోని. అయితే ఆంటోని మాటతప్పి మళ్లీ క్లియోపాత్ర వద్దకు వెళ్లిపోతాడు. దీంతో విసిగిపోయిన ఆక్టేవియస్ సీజర్ తాము ఏర్పరచుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకుని మార్క్ ఆంటోని, క్లియోపాత్రలపై యుద్ధం చేసేందుకు దిగుతాడు. అయితే ఈ యుద్ధంలో ఆంటోని ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. ఓపక్క తన ప్రాణ స్నేహితుడు ఎనోబార్బస్ సైతం ఈ కష్టకాలంలో వదిలి దూరంగా వెళ్లిపోతాడు. మరోవైపు క్లియోపాత్రకు ఆంటోని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని దూరం జరిగే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే క్లియో పాత్ర సైనికులు ఆంటోనికి సహకరించకుండా పారిపోవడం జరుగుతుంది. దీంతో ఆంటోనికి క్లియోపాత్ర తనను మోసం చేసిందన్న కోపం ఎక్కువవ్వుతుంటుంది. కానీ క్లియోపాత్ర అతడి ప్రేమను పరీక్షించే నిమిత్తం తన సహచర చెలికెత్తలతో తాను మరణించినట్లుగా వార్త పంపిస్తుంది. ఈ వార్త విని ఆంటోని కుంగిపోయి తన కత్తితో పొడుచుకుని చనిపోతాడు. వెంటనే అతడిని క్లియోపాత్ర పరిచారికలు అతడిని ఆమె వద్దకు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఆంటోని ఆమె చేతిలోని ప్రాణాలు వదిలేస్తాడు. మరోవైపు ఆక్టేవియస్ సీజర్ దండయాత్ర చేసుకుంటూ రోమ్ వైపుకి వచ్చేస్తుంటాడు. దీంతో ఆమె ఒక విషపాముతో కరిపించుకుని మరీ ప్రాణాలు వదిలేస్తుంది. ఇక్కడ ఇరువురు ఎంతో గాఢంగా ప్రేమించుకునన్నారు చిన్న మనస్పర్థ ఒకరినొకరు దూరం చేసుకునేందుకు కారణమైంది. అయితే వారికి ప్రాణాలు కోల్పోయిన టైంలో తమది నిజమైన ప్రేమ అని గుర్తించడం బాధకరం.ముంతాజ్ మహల్- షాజహాన్: !అర్జుమంద్ బాను బేగంగా జన్మించిన ముంతాజ్ మహల్ యువరాజు ఖుర్రామ్(షాజహాన్ ) హృదయాన్ని దోచుకుంది. ఆమె కేవలం ఖుర్రామ్కి రాణి మాత్రమే కాదు నమ్మకమైన సలహాదారు, సహచరురాలు. అయితే ముంతాజ్ విషాదకరంగా 1631లో తన పద్నాలుగో బిడ్డకు జన్మినిస్తున్నప్పుడు ప్రాణాలు వదిలేస్తుంది. దీంతో షాజహాన్ ఏళ్ల తరబడి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆమె జ్ఞాపకార్థం కట్టించిన స్మారక చిహ్నమే తాజ్ మహల్. ఏడు వింతల్లో ఒకటిగా నిలవడమే గాక యునెస్కో గుర్తింపును కూడా పొందింది. ఏటా లక్షలాదిమంది ఈ మహల్‌ని చూసేందుకు రావడమే గాక శాశ్వత ప్రేమకు చిహ్నంగా కీర్తిస్తారు. రోమియో - జూలియట్:ఈ ప్రేమ కథ వెరోనా నగరంలో జరిగింది. ఇరువురి కుటుంబాల నేపథ్యం వేరు. దీంతో వీరిద్దరిని కలవనిచ్చేవారు కాదు బంధువులు. అయినప్పటికి వాళ్ల కళ్లుగప్పి కలుసుకుంటూనే ఉండేవారు. తమ ప్రేమను ఎలాగైన నిజం చేసుకోవాలని ఇరువురు ఆరాటపడ్డారు. అయితే రోమియో అనుకోకుండా జూలియట్ బంధువు టైబాల్ట్‌ను క్షణికావేశంలో చంపడం జరుగుతుంది. ఈ నేరం కారణంగా రోమియోను వెరోనా నగరం నుంచి బహిష్కరిస్తారు. దీంతో ఇరువురూ ఒకరినొకరు చూసుకోలేనంత అగాథం ఏర్పడుతుంది. అయితే రోమియోకి జూలియట్ చనిపోయినట్లు నమ్మించేలా ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు చూపిస్తారు ఆమె బంధువులు. దీంతో జూలియట్ లేకుండా జీవించలేనంటూ ప్రాణం తీసుకుంటాడు. ఇంతలో మెల్కొన్న జూలియంట్ రోమియో చనిపోవడం దుఃఖంతో గట్టిగా విలపిస్తుంది. అలా ఏడుస్తూనే ప్రాణాలు వదిలేస్తుంది. అప్పడు గానీ వారి స్వచ్ఛమైన ప్రేమను గుర్తించరు అక్కడి ప్రజలు.షిరిన్- ఫర్హాద్: ఇది పర్షియన్ ప్రేమ కథ. అందమైన ఆర్మేనియన్ యువరాణి షిరిన్. ఆమె అందం ససానియన్ రాజు ఖోస్రో II దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే ఫర్హాద్ శిల్పి, రాతికట్టడాలను నిర్మించడంలో నేర్పరి. ఇరువురి మధ్య హోదాల పరంగా చాలా వ్యత్యాసం ఉంది. అయినా వాటన్నింటిని పక్కన పెట్టి ఒకరినొకరు విడిచి ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే వీరిని ఎలాగైన విడదీయాలన్న ఉద్దేశ్యంతో యువరాజు ఖోస్రో ఫర్హాద్కి కష్టమైన పనులన్నీ అప్పగించేవాడు. అన్నింటిని అలవోకగా చేసేయడంతో చివరికి షిరిన్ చనిపోయినట్లు అబద్ధం చెబుతాడు. ఆ వార్త వినడంతోనే కుప్పకూలిపోతాడు ఫర్హాద్. ఆవేదనతో తమ ప్రేమను ఏ పర్వతంపై చెక్కాడా అక్కడకే వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడు. ఫర్హాద్ మరణవార్త విని అతడున్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది షిరిన్. ఆమె కూడా అక్కడ నుంచే దూకి చనిపోతుంది.లైలా-మజ్నున్: పర్షియన్, అరబిక్ సాహిత్యంలో భావితరాల కోసం భద్రపరచబడిన గొప్ప ప్రేమ కథ లైలా-మజ్నులది. మజ్నుగా పిలిచే ఖైస్ కవి. అతడు సంపన్న కుటుంబానికి చెందిన లైలాతో ప్రేమలో పడతాడు. లైలా అందం, తెలివిలో ఆమెకు సాటిలేరెవ్వరూ. అయితే మజ్ను ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందువల్ల లైలాకు అతడు తగిన జోడి కాదని ఇరువురి కుటుంబాలు వారి ప్రేమను నిరాకరిస్తాయి. అయినా కూడా వాటిని లెక్కచేయకుండా తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చూపించాలాని భావిస్తారిద్దరు. విధి మరోలా వారిప్రేమను పరీక్షించింది. ఇక్కడ లైలా తండ్రి మరో సంపన్న వ్యక్తితో పెళ్లి చేసి పంపేస్తాడు. లైలా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న విరహంతో పిచ్చి వాడైపోతాడు మజ్ను. అక్కడ లైలా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. రాజభోగాల మధ్య ఉన్నా.. ముళ్లమీద కూర్చున్నట్లుగానే ఉంటుంది ఆమెకు. మనసు ఎల్లపుడూ కైస్ చుట్టూనే తిరుగుతుంటుంది. కొన్నేళ్లకు భర్తతో కలిసి ఆమె ఇరాక్ వెళ్లిపోతుంది. కొద్దిరోజులకే అక్కడ అనారోగ్యం బారినపడి లైలా కన్నుమూస్తుంది. లైలా మరణవార్త తెలుసుకున్న కైస్ మిత్రులు విషయం అతడికి చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ, కైస్ జాడ దొరకదు. కొద్దిరోజుల తర్వాత ఓ చోట కైస్ ఆచూకీని కనుగొంటారు. వాళ్లు అక్కడికి వెళ్లి చూడగా.. కైస్, లైలా సమాధి దగ్గర ప్రాణం లేకుండా పడి ఉంటాడు. లైలా కోసం పిచ్చివాడిలా తిరగటం వల్లే కైస్కు మజ్ను అనే పేరు వచ్చిందని అంటారు చరిత్రకారులు. ఎందుకంటే "మజ్ను లైల" అంటే లైలా కోసం పిచ్చివాడిలా తిరిగిన వాడు అని అర్థం వస్తుంది. వారిప్రేమ విషాదంగా ముగిసినా..ఇప్పటికీ ప్రేమికులు వారిని తలుచుకుంటూనే ఉంటారు. అలాగే "ప్రేమ" అనగానే ఆ ఇరువురే గుర్తు వచ్చేలా చిరస్మరణీయంగా నిలిచిపోయారు.(చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
Valentine's Day : ప్రెటీ లుక్స్.. ఇవిగో టిప్స్!
అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందులోనూ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రేమికుల రోజు మరికొన్ని గంటల దూరంలో ఉంది. తన పార్ట్నర్తో రొమాంటిక్‌గా గడిపే క్షణాల్లో అందంగా మెరిసి పోవాలని అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిలైతే ముందు నుంచే అలర్ట్‌గా ఉంటారు. కానీ అబ్బాయిలు మాత్రం జిడ్డు ముఖంతో ఎలా రా బాబూ అని తెగ హైరానా పడిపోతుంటారు. అవునా..? అందుకే ఇంటి చిట్కాలతో ఇన్స్టంట్ గ్లో వచ్చేలా చేసుకోవచ్చు. లవ్బర్డ్స్కోసం ఉపయోగపడే అలాంటి బ్యూటీ టిప్స్ ఒకసారి చెక్ చేద్దాం.అందం అనే దానికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఇష్టపడే వ్యక్తికి ఆకర్షణీయంగా కనిపించాలి. అలా ఉండాలంటే, మానిసిక ఆరోగ్యంతోపాటు, శారీరంగా కూడా కావాలి. అలా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నపుడు వచ్చే ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం వేరే లెవల్లో ఉంటుంది. దీనికి ప్రేయసి లేదా, ప్రియుడి చేయూత ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించే ధైర్యాన్నిస్తుంది. కొండంత బలాన్నిస్తుంది. దీనికి మించిన అందం ఏముంటుంది?అందకోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనీలేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. మనం రోజూ ఉపయోగించే వాటితోనే అందాన్ని మెరుగు పరచుకోవచ్చు.ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్శనగ పిండిలో కాస్తంత పెరుగు, కొద్దిగా నిమ్మకాల కలిపి మంచి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి పట్టించి, బాగా ఆరిన తరువాత మృదువుగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి.నిమ్మరసం, తేనెతో కూడా ముఖంపై ఉండే మురికిని వదిలించుకోవచ్చు. ఫేస్ వాష్, సబ్బులకు బదులు నిమ్మరసం, తేనె కలిపి ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల మృత కణాలు తొలిగిపోతాయి. ముఖం మెరిసిపోతుంది.బాదం, గంధం పొడి, వేపాకుల పేస్టు కలిపి రాస్తే.. ముఖంపై ఉండే మురికి పోయి స్కిన్ గ్లోయింగ్‌గా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలుకు ఇది ఉపయోగపడుతుంది.ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా ఆర్గానిక్ పసుపు కలిపి ముఖానికి మెడకు,మోచేతులకు చక్కగా అప్లయ్ చేసి ఆరిన తరువాత కడిగేసుకుంటే మంచి గ్లో వస్తుంది.చర్మానికి బొప్పాయి పండు చాలా చక్కగా పని చేస్తుంది. బొప్పాయి పండు పేస్ట్ రాస్తే చర్మం.. ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మృదువుగా మారి మంచి గ్లో వస్తుంది. అలాగే నచ్చినట్టుగా మీసాలు, గడ్డాన్ని చక్కగా నీట్‌గా కట్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్‌ను మెయింటైన్ చేయాలి. దీంతోపాటు చక్కటి పెర్ఫ్యూమ్ వాడితే మరీ మంచిది. ఇక అమ్మాయిలైతే ఆలు గడ్డ రసంలో రెండు చుక్కల ఆల్మండ్ ఆయిల్, శనగపిండి కలిపి మాస్క్‌లాగా వేసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే కాఫీ ఫౌడర్‌లో కాస్తం టొమాటో రసం వేసి, ముఖానికి, మెడకు,మోచేతుల దాకా అప్లయ్ చేసి కాసేపు మసాజ్ చేసి శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. టమాటా రసం, ఓట్స్ పొడి పాలు. ఈ స్క్రబ్‌లు ఉపయోగించినా చర్మం తాజాగా మెరుస్తుంది. ఇలా ప్యాక్ వేసుకున్నాక చేసిన రెండు ఐస్‌ముక్కలతో ముఖంపై మృదువగా మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకుని రసాయను లేని మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరిన్ని టిప్స్చర్మం ఆరోగ్యంగా . యవ్వనంగా కనిపించాలనుకుంటే ప్రతి రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి.తగినన్ని నీళ్లు తాగాలి. చర్మానికి విటమిన్లు, ఖనిజాలు ఎంత అవసరమో, నీళ్లు కూడా అంతే అవసరం. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం నుండి అదనపు మలినాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది. తాజాపండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ, క్రమంతప్పకుండా రోజుకు కనీసంఅరగంటసేపు ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇద్దరికీ వర్తిస్తాయి. వీటన్నింటి కంటే ముందు మీ మనసులోని ఆనందం, మీ శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్లే మీ ముఖానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. కనుక అందం గురించి పట్టించుకోకుండా, ఆనందంగా గడపండి. మీ బంధాన్ని దృఢం చేసుకోండి. మర్చిపోలేని జ్ఞాపకాలను పోగు చేసుకోండి. హ్యాపీ వాలైంటైన్స్ డే! -
వాలెంటైన్స్ డేకి మీ ఇష్టసఖిని ‘ది బెస్ట్’తో సర్ప్రైజ్ చేయండిలా.. (చిత్రాలు)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్
‘ప్రేమంటే ఏమిటంటే ...’’ యుగయుగాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదుకులాట నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి అర్థాలు వారివి. ఎవరి అనుభూతులు, అనుభవాలు వారివి. ఎవరి భావోద్వేగాలు వారివి. అందుకే రెండు హృదయాల మధ్య ప్రేమ సరికొత్తగా కొంగొత్తగా చిగురుస్తూనే ఉంది. చిక్కావే ప్రేమ.. అంటూ కూని రాగాలు కాదు...కాదు..కోటి రాగాలు పలికిస్తుంది. అదే ప్రేమ అనే రెండక్షరాల్లోని గమ్మత్తు... మత్తు. ఈ మత్తులోకి ఎవరికి వారు ఎపుడో ఒకపుడు జారిపోవాల్సిందే. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సివరపల్లి (పంచాయత్ సిరీస్ తెలుగు రీమేక్) హీరో రాగ్ మయూర్‌తో సాక్షి.కామ్ స్పెషల్‌గా ముచ్చటించింది.సినిమాబండి సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విలక్షణ నటుడు రాగ్ మయూర్. ముఖ్యంగా వాలెంటైన్స్ డే వీక్ మొదలైందంటే చాలు ‘స్వర మంజరీ’ అంటూ చెప్పే ఆయన డైలాగ్ గత మూడు నాలుగేళ్లుగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది అంటే రాగ్ యాక్టింగ్ స్కిల్స్‌ను అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్ సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ నటించడమే కాదు, అటు విలన్ కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.ఇదీ చదవండి: MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!ఇపుడు తన కరియర్లో మైలురాయిలాంటి సివరపల్లిలో పంచాయతీ సెక్రటరీగా తన నటనతో ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఓటీటీలో జనాలను ఒప్పించి, మెప్పించిన హిందీ ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తెలుగులోకి రీమేక్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవడం విశేషమే మరి. తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని పల్లె వాతావరణంలో సాగే ఈ సిరీస్ పిల్లా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటోంది.సినిమాపై ఆయనకు ప్రేమ ఎలాపుట్టింది లాంటి వివరాలతో పాటు, నిజజీవితంలో ప్రేమ, ప్రేక్షకులతో ఆయన ప్రేమ, రాగ్ కిష్టమైన నటీ నటులు ఇలాంటి మరిన్ని విశేషాలు ఆయన సాక్షితో పంచుకున్నారు. ఈ మొత్తం చిట్‌చాట్‌ను రెండు భాగాలుగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. రాగ్ అందించిన ప్రేమ కబుర్లలో ఏ ఒక్కటీ మిస్ కాకుండా దీన్ని సంపూర్ణంగా వీక్షించి, మీ అభిప్రాయాలను పంచుకోండి. సాక్షి.కామ్ ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. -
వాలెంటైన్స్.. ఫ్యాషన్ టైమ్స్..
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఎంత వరకూ నిజం అనేది అలా ఉంచితే.. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనేది మాత్రం ప్రేమికుల విషయంలో ఎల్లప్పుడూ నిజమవుతూనే ఉంటుంది. అలా మంచి ఇంప్రెషన్ సాధించే విషయంలో టాక్స్ నుంచి లుక్స్ దాకా దేని ప్రాధాన్యతనూ తీసిపారేయలేం. ఈ నేపథ్యంలో పరస్పరం ఇంప్రెస్డ్ అనిపించుకోవాలనే తహతహలాడే ప్రేమికుల కోసం నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాక్టరీలు అందిస్తున్న సూచనలివి.. ప్రేమికుల రోజున ధరించడానికి రెడ్ కలర్‌ను మించిన డ్రెస్ మరొకటి ఉండదు. అయితే, ఈ ఏడాది కొంచెం భిన్నంగా ప్రయతి్నంచవచ్చు. లేస్తో డిజైన్ చేసిన యాసెంట్స్, రఫ్లెస్ లేదా స్లిట్స్ ఉన్న ఫిగర్–హగ్గింగ్ సిల్హౌట్స్, ఫ్లోయీగా ఉండే మిడి డ్రెస్‌లను ఎంచుకోవచ్చు. టైమ్‌లెస్‌గా, సొగసైన్ లుక్ కోసం స్ట్రాపీ హీల్స్, లైట్ వెయిట్ సింపుల్ జ్యువెలరీని ఈ డ్రెస్‌కు జత చేయవచ్చు. మేకప్‌కి సాఫ్ట్ బ్లష్ పింక్, మ్యూట్ రోజ్ టోన్స్ రొమాంటిక్ మీట్స్‌కి సరైనవి. మ్యాచింగ్ స్కర్ట్లు, శాటిన్ స్లిప్ డ్రెస్‌లు లేదా పేస్టెల్ రంగులలో నిట్సెట్తో బ్లేజర్లను ఎంచుకోవచ్చు. ఈ షేడ్స్ ఆధునికతకు అద్దం పడతాయి. హృదయాకారపు ఇయర్ హ్యాంగింగ్స్, అందమైన నెక్‌పీస్, చిక్ క్లచ్‌తో లుక్ కంప్లీట్ అవుతుంది. భాగస్వామి హృదయంలో శాశ్వతమైన ముద్ర వేయడానికి ఇష్టమైన పెర్ఫ్యూమ్ జోడించడం మర్చిపోవద్దు సీక్వెన్స్, మెటాలిక్ ఫాబ్రిక్లు ఈ సీజన్లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. మెరిసే వెండి లేదా బంగారు రంగు దుస్తులు.. వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించే ఈవెనింగ్ పారీ్టలలో లుక్స్‌ని ప్రత్యేకంగా చూపుతాయి. ఆహ్లాదకరమైన వైబ్ కోసం, హార్ట్ ప్రింట్లు, పోల్కా డాట్స్ లేదా పూల నమూనాలను ప్రయతి్నంచవచ్చు. హై–వెయిస్టెడ్ ప్యాంటు లేదా స్కర్ట్‌తో జత చేసిన హార్ట్–ప్రింటెడ్ బ్లౌజ్ ఫన్నీగా అదే సమయంలో స్టైలిష్ గానూ ఉంటుంది. ప్రత్యామ్నాయంగా, లగ్జరీ టచ్ కోసం వెల్వెట్ ఫర్ వంటి అల్లికలతో ప్రయోగాలు చేయచ్చు.అబ్బాయిల కోసం.. టైమ్‌లెస్ సూట్: వాలెంటైన్స్‌డే రోజున మ్యాన్లీగా కనిపించడానికి పాలి‹Ù్డ లుక్ కోసం క్లాసిక్ బ్లాక్ లేదా నేవీ సూట్‌ను ఎంచుకోవాలి. రొమాంటిక్ ట్విస్ట్ జోడించాలనుకుంటే, బర్గండి లేదా డార్క్ రెడ్ కలర్ సూట్‌ను ఎంచుకోవచ్చు. ఇది స్టైలి‹Ùగా కనిపించడమే కాదు ఈ సందర్భానికి సరైనది.స్మార్ట్ క్యాజువల్ వైబ్స్ ముదురు జీన్స్ లేదా చినోస్‌తో క్రిస్పీ వైట్ షర్ట్‌ను జత చేయవచ్చు. మోడర్న్ లుక్ కోసం టైలర్డ్ బ్లేజర్ లేదా స్టైలిష్ లెదర్ జాకెట్‌తో లుక్‌ని పూర్తి చేయవచ్చు. ఈ లుక్ క్యాజువల్ డిన్నర్ లేదా డే టైమ్ డేట్‌కి అనువైనది. మోనోక్రోమాటిక్ మ్యాజిక్ ఈ సంవత్సరం మోనోక్రోమ్ దుస్తులు ఒక భారీ ట్రెండ్. విభిన్న టెక్స్చర్లతో ఆల్–బ్లాక్ ఎన్సెంబుల్ను ప్రయతి్నంచండి. బ్లాక్ టర్టిల్నెక్, టైలర్డ్ ట్రౌజర్లు, సొగసైన లెదర్ షూలు ఎంచుకోండి. ప్రత్యామ్నాయంగా, మృదువైన, ఆధునిక లుక్ కోసం బూడిద లేదా లేత గోధుమ రంగు షేడ్స్ ఎంపిక చేసుకోండి. ప్యాటర్న్లు, టెక్స్చర్లతో ఆడుకోవచ్చు. చారలు లేదా పూల ప్రింట్లు వంటి ప్యాటర్డ్ షర్టులతో దుస్తులకు అందమైన లుక్‌ను తీసుకురావచ్చు. ఆ లుక్‌ను సమతుల్యంగా ఉంచడానికి సాలిడ్–కలర్ ప్యాంటుతో జత చేయాలి. ఆత్మవిశ్వాసంతో యాక్సెసరైజ్ స్టైలిష్ వాచ్, లెదర్ బెల్ట్ లేదా పాకెట్ స్క్వేర్తో లుక్‌ను బ్రైట్‌గా మార్చేయవచ్చు. సందర్భానికి తగ్గట్టు టై లేదా సాక్స్ వంటి యాక్సెసరీలలో రెడ్ కలర్‌ను జోడించడానికి వెనుకాడవద్దు.ఇద్దరు కాదు ఒక్కరే.. అనిపించేలా..భాగస్వామితో కలిసి మ్యాచింగ్ డ్రెస్ ధరించాలని ప్లాన్ చేసుకుంటే.. ఒకేలాంటి దుస్తుల కంటే కాంప్లిమెంటరీ కలర్స్ లేదా థీమ్‌లపై దృష్టి పెట్టడం మంచిది. ఉదాహరణకు, ఇద్దరిలో ఒకరు రెడ్ కలర్ దుస్తులు ధరిస్తే మరొకరు టై, పాకెట్ స్క్వేర్ లేదా యాక్సెసరీల ద్వారా రెడ్ కలర్‌ను చేర్చవచ్చు. -
ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?
జన్మ జాతకం ఎలా ఉన్నా ప్రేమ జాతకం బాగుంటే మంచి ఆత్మిక భాగస్వామి దొరుకుతారు. సవాళ్లు విసిరే జీవితంలో ప్రేమ నిండిన బంధం చాలా అవసరం. స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ వారిని ఉత్సాహంగా ముందుకు నడవడానికి కారకం అవుతుంది. జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. సౌరమానం ప్రకారం ఆ రోజు దిన ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఫలితాలు సంవత్సరమంతా ప్రభావం చూపిస్తాయి...మేషం (21 మార్చి–19 ఏప్రిల్)ఈ రాశి వారికిప్రాకృతిక శక్తి సహకరిస్తుంది. అంగారక గ్రహ ప్రభావం వలన ప్రేమ వృద్ధి చెందుతుంది. వీరు తాము ప్రేమించినవారి కోసం ఏదైనా ప్రత్యేకమైన ఫంక్షన్ ఏర్పాటు చేసి వారి మన్ననలు అందుకుంటారు. చాలా రొమాంటిక్ గా కాలం గడుస్తుంది. ఈ రాశి ప్రేమికులు ఈ సంవత్సరం దంపతులవుతారు. దంపతులుగా ఉన్నవారు తల్లిదండ్రులవుతారు.వృషభం (20 ఏప్రిల్– 20 మే)శుక్ర గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు పెరుగుతాయి. ప్రేమించిన వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు అధికమవుతాయి. స్థిరపడుతాయి. ప్రేమ విషయంలో కొత్త విధానాలు అవలంబిస్తారు. ఆ కొత్త విధానాల వలన ప్రేమ సఫలీకృతం అవుతుంది. పెద్దలు మీ ప్రేమను అంగీకరిస్తారు. ఈ సంవత్సరం మంచి జీవితాన్ని గడుపుతారు.మిథునం (21 మే– 20 జూన్)బుధ గ్రహ ప్రభావం వల్ల మీరు ప్రేమించిన వారి పట్ల ప్రేమను సూటిగా చక్కగా అర్థవంతంగా తెలుపగలుగుతారు. మీ మాటలకు మీరు ఇష్టపడినవారు ప్రభావితులవుతారు. మిథునం అంటేనే జంట, ఈ సంవత్సరం ప్రేమికుల జంట పంట పండినట్టే. ఆదర్శమైన జంటగా పేరు పొందుతారు.కర్కాటకం (21 జూన్– 22 జూలై):చంద్ర గ్రహప్రభావం వల్ల మీలో ప్రేమాభిమానాలు ఉప్పొంగి మీ ప్రేమికుల పట్ల సుహృద్భావం కలిగిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో తెగిన బంధాలు ఇప్పుడు అతుకుతాయి.సింహం (23 జూలై– 22 ఆగస్టు)సూర్యగ్రహ ప్రభావం వల్ల మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించినవారికి ఆకర్షించగలుగుతారు. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. మీ ప్రేమను స్పష్టంగా తెలియజేయగలుగుతారు. ఈ సంవత్సరం మీకు తిరుగు ఉండదు. అన్నిటిలో విజయమే లభిస్తుంది. మీ ప్రేమ ఫలిస్తుంది.కన్య (23 ఆగస్టు– 22 సెప్టెంబర్)ఆత్మ పరిశీలన చేసుకొని సంబంధ బాంధవ్యాలను విశ్లేషిస్తారు. మీ భావాలను బాగా తెలియజేస్తారు. ప్రేమికుల మధ్య బంధాలు బలపడతాయి. ఈ సంవత్సరం మీకు మహోన్నతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. చేతిలో ధనం బాగా నిలుస్తుంది. దైవబలం మీకు తోడుగా ఉంది.తుల ( 23 సెప్టెంబర్- 22 అక్టోబర్)శుక్ర గ్రహ ప్రభావం వల్ల ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాల సమతుల్యత పెరిగి ప్రేమ వికసిస్తుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, డిమాండ్లు తగ్గుతాయి. ప్రేమికులు సామరస్యంగా ఉంటారు. ప్రేమలోను, వ్యాపార రంగంలోను మీదే పైచేయి అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నూతన వ్యాపారాలు ఈ సంవత్సరంప్రారంభించి లాభాలు పొందుతారు.వృశ్చిక (23 అక్టోబర్– 21 నవంబర్)అంగారక ప్రభావం వల్ల ప్రేమాభిమానాలు వృద్ధి చెందుతాయి. మీరు ప్రేమించిన వారిని ఈ రోజు మీరు అయస్కాంతంలా ఆకర్షిస్తారు. లోతైన ప్రేమ గొప్ప అనుభవాలను తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మీ కష్టాలు తొలగిపోయి, ఆనందం ఐశ్వర్యం లభిస్తాయి. మీరు చాలా సంతోషంగా ఉంటారు.ధనుస్సు (22 నవంబర్- 21 డిసెంబర్)గురు గ్రహ ప్రభావం వల్ల మీలో ఆశావాదం పెరుగుతుంది. దాంతో సాహస ప్రవృత్తి పెరిగి అది ప్రేమించినవారిని ఆకర్షించి కట్టిపడేసేలా చేస్తుంది.. ఆనందం వెల్లివిరుస్తుంది. సింగిల్‌గా ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి ప్రేమైక భాగస్వామి తారసపడతారు. ఈ సంవత్సరం గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. ప్రేమించిన వారి వల్ల మంచి జరుగుతుంది.మకరం (22 డిసెంబర్–19 జనవరి)శనిగ్రహ ప్రభావం వల్ల మీ ప్రేమ వ్యవహారం బలపడుతుంది. ప్రేమలో మీరు గతంలో ఇచ్చిన మాట, హామీలు నెరవేరుస్తారు. సింగిల్‌గా ఉన్నవారికి తగిన జోడు లభిస్తుంది. స్త్రీ వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలు లాభం పొందుతారు. ఈ సంవత్సరం ఏలిననాటి శని తొలగి గొప్ప ఉన్నతిని సాధిస్తారు.కుంభం (20 జనవరి– 18 ఫిబ్రవరి)శుక్ర, యురేనస్ గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు ఉద్దీప్తమవుతాయి. మీలోని అసాధారణ శక్తి బంధాలను బలపరుస్తుంది. ప్రేమ విషయంలో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. సింగిల్‌గా ఉన్నవారు సంప్రదాయేతర స్థలాలలో వింత పరిచయాలను ఎదుర్కొంటారు. ప్రేమికుల వల్ల ఈ సంవత్సరం మీకు వృత్తి పరంగా మంచి అవకాశాలు వచ్చి రాణిస్తారు.చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తామీనం (19 ఫిబ్రవరి– 20 మార్చి)నెప్ట్యూన్ ప్రభావం వల్ల అసాధారణ భావోద్వేగం మీ హృదయానికి సరైన దారి చూపిస్తుంది. ఈరోజు మీలో సున్నితమైన ప్రేమ సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య బంధం పెరిగి కలలు సాకారమవుతాయి. సింగిల్‌గా ఉన్నవారు అనుకోకుండా సోల్‌మేట్‌ను కలుసుకుంటారు. ఎంతో కాలంగా ఉన్న అభిలాషలు ఈ సంవత్సరం తీరుతాయి. పది సంవత్సరాల వరకు మీకు తిరుగు ఉండదు.– డా. మహమ్మద్దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
Valentines Day : లవ్ బర్డ్స్కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!
ప్రేమికుల దినోత్సవం లేదా వాలెంటైన్స్ డే (Valentine's Day) ప్రేమికులకు తమ ప్రేమను వ్యక్తీకరించు కోవడానికి, చిరస్మరణీయమైన అనుభవాన్ని పొందడానికి సరైన సమయం. ఫిబ్రవరి వస్తుందంటేనే వాలెంటైన్స్ డే కోసం ఎదురు చూస్తుంటారు ప్రేమికులందరూ. తమ లవర్‌ను సర్ప్రైజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలుచేస్తుంటారు. మరికొందరు పార్ట్నర్కు రొమాంటిక్ అనుభవాన్ని అందించాలని ఉవ్విళ్లూరుతారు. అలాంటి వారికి దుబాయ్ (Dubai) బెస్ట్ డెస్టినేషన్అని చెప్పవచ్చు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న దుబాయ్‌లోని వాలెంటైన్స్ డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడం మంచి అనుభూతిని మిగులుస్తుంది. ఆకర్షణీయమైన స్కైలైన్ భవనాలు బీచ్‌లు, లగ్జరీ స్పా రిట్రీట్స్, విలాసవంతైన రెస్టారెంట్లు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, ప్రైవేట్ యాచ్ క్రూయిజ్ ట్రిప్‌లు చక్కటి భోజనం..ఇలా అనేక రకాల వసతులతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇవి రొమాంటిక్ ఫీలింగ్‌ను అందిస్తాయి. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం.షాంగ్రి-లా దుబాయ్ (Shangri-La Dubai)షాంగ్రి-లా దుబాయ్‌లో అసమానమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఐకానిక్ హోటల్ విలాసవంతమైన వసతి సౌకర్యాలు, రొమాంటిక్ డిన్నర్లు లాంటి అద్భుతమైన భోజన సదుపాయాలు ఉంటాయి. బుర్జ్ ఖలీఫా , డౌన్‌టౌన్ దుబాయ్ స్కైలైన్ అద్భుతమైన బ్యాక్‌డ్రాప్‌లో లెవల్ 42 “ప్రైవేట్ డైనింగ్ అబౌవ్ ది క్లౌడ్స్”లో ఉన్న జంటలకు స్పెషల్ అనుభవాన్ని అందిస్తుంది.పలాజ్జో వెర్సేస్ దుబాయ్ (Palazzo Versace Dubai)పాపులర్ జద్దాఫ్ వాటర్‌ఫ్రంట్ మధ్యలో ఉన్న, పలాజ్జో వెర్సేస్ దుబాయ్ ప్రేమికులకు వెచ్చని ఆహ్వానం పలుకుతుంది. లవ్‌బర్డ్స్‌ను మంత్రముగ్ధులనుచేస్తూ శాశ్వతమైన ప్రేమను ప్రసరింపజేస్తుంది. కేక్ ట్రాలీ ఉత్కంఠభరితమైన రొమాంటిక్, సూర్యోదయాలు, సిగ్నేచర్ హై టీ అనుభవంతోపాటు, మెస్మరైజింగ్ వాతావరణంలో సొగసైన గియార్డినో సెట్స్, అద్భుతమైన మ్యూజిక్, ,గమ్మత్తైన వాలెంటైన్స్ విందునిస్తుంది.రిక్సోస్ ప్రీమియం సాదియత్ ద్వీపం (Rixos Premium Saadiyat Island)తెల్లని ఇసుక మధ్య ప్రేమికులు సేదదీరడం అంటే సాదియత్ ద్వీపం ప్రత్యేకమైన స్వర్గధామం అన్నట్టే. విలాసవంతమౌన వసతి సౌకర్యాలు, కొలనులతో కూడిన ఏకాంత ప్రైవేట్ విల్లాలు , అంజనా స్పాలు, టర్కిష్ విందును ఆస్వాదించవచ్చు . లేదంటే క్యాండిల్స్ లైట్స్ వెలుగుల్లో బీచ్‌సైడ్ భోజనాన్ని ఆస్వాదించవచ్చు. దీనికి జతగా అమేజింగ్ మ్యూజిక్, సముద్రతీర అందాలు ఉండనేఉంటాయి. జేడబ్ల్యూ మారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్ (JW Marriott Marquis Hotel Dubai)జేడబ్ల్యూమారియట్ మార్క్విస్ హోటల్ దుబాయ్‌లో రొమాంటిక్ అనుభవాన్ని అందించడంలో ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది. దీని మూడు సిగ్నేచర్ రెస్టారెంట్లలో ఒకదానిలో వాలెంటైన్స్ డేను జరుపుకోవచ్చు, ప్రతీదీ ఒక్కో విలక్షణమైన ప్రపంచ పాక అనుభవాన్ని అందిస్తుంది. దుబాయ్ ఉత్కంఠభరితమైన దృశ్యాలను తనవితీరా ఆస్వాదించవచ్చు. ఇది చిరస్మరణీయమైన సాయంత్రం కోసం సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.దుబాయ్ క్రీక్ రిసార్ట్ (Dubai Creek Resort)జంటలకు కలలు కనే అనుభవాలతో దుబాయ్ క్రీక్ రిసార్ట్‌లో ఏకంగా నెలరోజులపాటు వాలెంటైన్ డేను జరుపుకోవచ్చు. అమరా స్పాలో సన్నిహిత స్పా రిట్రీట్లు, బోర్డ్‌వాక్ వద్ద సుందరమైన వాటర్‌ఫ్రంట్ బ్రంచ్‌లు , పార్క్ హయత్ దుబాయ్‌లో శృంగార బసలను ఆస్వాదించండి. పూల్ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నా లేదా క్యాండిల్‌లైట్ డిన్నర్ అయినా ప్రతీ క్షణం ప్రేమ కోసంమే అన్నట్టు ఎంజాయ్ చేయవచ్చు.అద్భుతమైన నగర దృశ్యాల నుండి ప్రశాంతమైన సముద్ర తీరప్రాంత విహారయాత్రల వరకు, దుబాయ్‌లో వాలెంటైన్స్ డేని జరుపుకోవడానికి చక్కటి అవకాశం. కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినా ప్రేమను ప్రకటించాలన్నా, భాగస్వామితో ప్రశాంతంగా సమయాన్ని గడపాలన్నా దుబాయ్ ఈజ్ ది బెస్ట్. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే.ఇదీ చదవండి: మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో -
నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..
వీచే చిరుగాలిని వెలివేస్తా.. పారే నదినావిరి చేస్తా.. నేనున్న నేలంతా మాయం చేశా లేనేలేదే అవసరమే.. నువ్వే నాకు ప్రియవరమే.. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా నువ్వుంటే నా జతగా అంటూ రామజోగయ్య శాస్త్రి రచించిన పాటకు ఏఆర్ రెహ్మాన్ (AR Rahman) అందించిన స్వరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ పాట వింటున్నప్పుడు ఎంత ఫీల్ ఉంటుందో.. ప్రేమికుల దినోత్సవానికి ముందు జరుపుకునే వాలంటైన్స్ వారంలో అంతటి ఫీల్ ఉంటుందని తెలుస్తోంది.. హైదరాబాద్ (Hyderabad) నగరంలో హడావుడి చూస్తోంటే.. వ్యాపార వర్గాల మొదలుకుని పర్యాటక రంగం వరకూ వాలంటైన్స్ డే (Valentine's Day) సందర్భంగా అనేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు.. దీనికితోడు యువత హడావుడీ మామూలుగా లేదనేలా సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని విశేషాలు.. ఫిబ్రవరి నెల మొదటి రెండోవారం మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో వాలంటైన్స్ వీక్ (Valentine week) సందడి కనబడుతోంది. గత రెండు మూడు రోజులుగా ఎక్కుడ చూసినా ఇదే సందడి అన్నట్లుంది హడావుడి. అయితే ఈ వాలంటైన్ వీక్ కొత్తదేం కాదు.. ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ప్రేమికుల వారం నగర సంస్కృతిలో మరింత భాగమైన సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వాలంటైన్స్ వీక్ సంబంధించిన పోస్టులు, రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యానిమేటెడ్, విఎఫ్ఎక్స్ వీడియోలు కాకుండా చాలమంది యువతరం స్వయంగా వీడియోలు చేసి నెట్టింట పెట్టడంతో వైరల్‌గా మారుతున్నాయి. దీనికి సంబంధించి వాలంటైన్ వీక్‌లో మొదటి రోజైన రోజ్ డే ప్రభావం అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ఓ ఫ్లవర్ బొకే షాపు యజమాని జలీల్‌తో ముచ్చటించగా.. ఈ నెల 6న చిన్న సైజు గులాబీ పువ్వుల కోసం చాల ఆర్డర్లు వచ్చాయని, అంతేకాకుండా రోజ్ డే అయిన 7వ తేదీన విడి రోజా పూలను అధిక సంఖ్యలో అమ్మానని చెప్పుకొచ్చాడు. సాధారణంగా బొకేలు తప్ప విడిగా ఒక్కొక్క గులాబీ పువ్వులు అంతగా అమ్ముడుపోవు.. ఈ రోజ్ డే ప్రభావమే దీనికి కారణమని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.ప్రేమను పంచుకోవాలి కదా!ఏళ్ల తరబడి వాలంటైన్స్ వీక్ అని చెప్పుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప వాస్తవంగా అంతగా జరుపుకోలేదు. కానీ ప్రస్తుతం ఈ సంస్కృతి మెల్లమెల్లగా పెరుగుతోంది. చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇవ్వడం, హగ్ డే రోజు హగ్ చేసుకోవడం, ప్రపోజ్ డే రోజు కచ్చితంగా తమ ప్రేమను మళ్లీ ఒకసారి వ్యక్తపరచడం.. ఇలా ఈ తరం ‘ప్రేమికుల వారాన్ని’ స్వయంగా ఆస్వాదిస్తున్నారు. విదేశాల్లోనో, స్థానికంగానో ఉండి కలవడానకి వీలుకాని ప్రేమికులు.. డెలివరీ యాప్స్‌లో గులాబీ పూలను, చాక్లెట్లను ఆయా ప్రత్యేక రోజుల్లో తమ భాగస్వాములకు డోర్ డెలివరీ చేస్తుండటం విశేషం. చదవండి: అంతా ప్రేమమయం...ఇందులో భాగంగా వాలంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే, రోజ్ డే, చాక్లెట్ డే రోజున వీటి ఆర్డర్ల సంఖ్య నగరంలో భారీగా పెరిగిందని డెలివరీ సంస్థల యాజమాన్యాలు చెబుతున్న మాట. హగ్ డే, ప్రామిస్ డే వంటివి వర్చువల్ వేదికగా సరిపెట్టుకుంటున్నారు. తమ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఇచ్చిన ఈ గిఫ్టులకు మంచి లవ్ మెలోడీ ట్రాక్‌ని జోడించి వాట్సాప్ స్టేటస్లు, ఇన్‌స్టా పోస్టులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ వాలంటైన్స్ వీక్‌లో ప్రముఖ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలిబ్రిటీలు కూడా ఉండటం విశేషం.ప్రేమికుల దినోత్సవం కోసం ప్యార్ బజార్..వాలంటైన్స్ డేని పురస్కరించుకుని ప్రముఖ ఆన్లైన్ విపణి.. అమెజాన్ ‘ప్యార్ బజార్’ పేరిట సరికొత్త ఫ్యాషన్ ఉత్పత్తులు, ఫోన్ యాక్సెసరీలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ జహీద్ ఖాన్ తెలిపారు. ఓ చక్కని రొమాంటిక్ డేట్ ఎంజాయ్ చేసేందుకు వీలైన ఉత్పత్తుల, గిఫ్ట్ ఆర్టికల్స్ జ్యువెలరీ మొదలుకుని, మనసును హత్తుకునేలా వాలంటైన్స్ డే కోసం ప్యార్ బజార్ విభాగంలో లభిస్తాయని వివరించారు.– సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో -
ఎవరైనా ప్రేమిస్తారని చూస్తున్నా.. ఒకప్పటి ట్రెండింగ్ బ్యూటీ
‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా సీరత్ కపూర్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘టైగర్’, ‘రాజుగారి గది 2’,‘ఒక్క క్షణం’ వంటి చిత్రాల్లో సీరత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులేవేశారు. సిద్ధూ జొన్నలగడ్డతో తను నటించిన కృష్ణ అండ్ హీజ్ లీల సినిమా ఈ వాలంటైన్స్ డే సందర్భంగా 'ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా సడెన్‌గా హైదరాబాద్‌లో కనిపించిన ఈ బ్యూటీ వాలంటైన్స్ డే ప్లాన్స్ గురించి చెప్పింది.ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా..? అంటూ సీరత్ కపూర్‌ను మీడియా ప్రశ్నించగా అందుకు ఆమె చాలా ఫన్నీగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నాని ఆమె క్లారిటీ ఇచ్చింది. గతంలో కూడా లవర్ లేడని పేర్కొంది. అయితే, ఈ ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే నాడు ఎవరైనా రోజా పువ్వు ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నానని చెప్పింది. వాస్తవంగా ఆమెపై పెద్దగా రూమర్స్ వచ్చిన వార్తలు కనిపించవు. చిత్ర పరిశ్రమలోని ప్రతి హీరోయిన్ ఫలానా వ్యక్తితో డేటింగ్ అంటూ రూమర్స్ రావడం కామన్‌గా మారింది. కానీ, సీరత్పై అలాంటివి కనిపించవ్. తాజాగా ఆమె చేసిన కామెంట్‌తో ఫిబ్రవరి 14న ఆమెకు చాలా రోజా పూలు రావచ్చని నెటిజన్లు తెలుపుతున్నారు. గతంలో కూడా లవ్ లవ్ ప్రపోజల్స్ గురించి ఆమె ఇలా చెప్పింది. కాలేజ్ డేస్‌లో కొంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారని ఆమె తెలిపింది. అబ్బాయిలు అంత ధైర్యంగా అమ్మాయిలకు ఎలా ప్రపోజ్ చేస్తారా..? అని నవ్వుకునేదాన్ని. 'ఆ విషయంలో అబ్బాయిలంటే నాకు గౌరవం ఏర్పడింది. అయితే నేను ఎవరి లవ్‌నీ అంగీకరించలేదనుకోండి (నవ్వుతూ). షూటింగ్‌లు ఆరంభమయ్యాక రొమాంటిక్ సీన్స్ చేయాలంటే.. కథలోని పాత్ర డిమాండ్ చేస్తే ఆ సీన్స్‌లో నటిస్తాను. తప్పదు' అని పేర్కొంది. View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) -
#HappyProposeDay : హ్యాపీ ప్రపోజ్ డే మై లవ్! (ఫొటోలు)