![Seerat Kapoor Comments His Living Relationship](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/seerath-kapur.jpg.webp?itok=8qMBwVnl)
‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా సీరత్ కపూర్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘టైగర్’, ‘రాజుగారి గది 2’,‘ఒక్క క్షణం’ వంటి చిత్రాల్లో సీరత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులేవేశారు. సిద్ధూ జొన్నలగడ్డతో తను నటించిన కృష్ణ అండ్ హీజ్ లీల సినిమా ఈ వాలంటైన్స్ డే సందర్భంగా 'ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా సడెన్‌గా హైదరాబాద్‌లో కనిపించిన ఈ బ్యూటీ వాలంటైన్స్ డే ప్లాన్స్ గురించి చెప్పింది.
ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా..? అంటూ సీరత్ కపూర్‌ను మీడియా ప్రశ్నించగా అందుకు ఆమె చాలా ఫన్నీగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నాని ఆమె క్లారిటీ ఇచ్చింది. గతంలో కూడా లవర్ లేడని పేర్కొంది. అయితే, ఈ ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే నాడు ఎవరైనా రోజా పువ్వు ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నానని చెప్పింది. వాస్తవంగా ఆమెపై పెద్దగా రూమర్స్ వచ్చిన వార్తలు కనిపించవు. చిత్ర పరిశ్రమలోని ప్రతి హీరోయిన్ ఫలానా వ్యక్తితో డేటింగ్ అంటూ రూమర్స్ రావడం కామన్‌గా మారింది. కానీ, సీరత్‌పై అలాంటివి కనిపించవ్. తాజాగా ఆమె చేసిన కామెంట్‌తో ఫిబ్రవరి 14న ఆమెకు చాలా రోజా పూలు రావచ్చని నెటిజన్లు తెలుపుతున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/ss_1.jpg)
గతంలో కూడా లవ్ లవ్ ప్రపోజల్స్ గురించి ఆమె ఇలా చెప్పింది. కాలేజ్ డేస్‌లో కొంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారని ఆమె తెలిపింది. అబ్బాయిలు అంత ధైర్యంగా అమ్మాయిలకు ఎలా ప్రపోజ్ చేస్తారా..? అని నవ్వుకునేదాన్ని. 'ఆ విషయంలో అబ్బాయిలంటే నాకు గౌరవం ఏర్పడింది. అయితే నేను ఎవరి లవ్‌నీ అంగీకరించలేదనుకోండి (నవ్వుతూ). షూటింగ్‌లు ఆరంభమయ్యాక రొమాంటిక్ సీన్స్ చేయాలంటే.. కథలోని పాత్ర డిమాండ్ చేస్తే ఆ సీన్స్‌లో నటిస్తాను. తప్పదు' అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment