seerath Kapoor
-
సీరత్ కపూర్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కనుందా..?
టాలీవుడ్లో తనకంటూ ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్‌గా కె. విజయ భాస్కర్ గుర్తింపు పొందారు. త్రివిక్రమ్ కూడా తన సినీ కెరీర్ ప్రారంభంలో విజయ్ భాస్కర్ సినిమాలకు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి ఇండిస్ట్రీలో మంచి హిట్ సినిమాలను నిర్మించారు. అయితే, కొంత కాలం తర్వాత త్రివిక్రమ్ డైరెక్టర్‌గా తనే పలు సినిమాలు తెరకెక్కించి టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ మధ్య పలు విభేదాలు వచ్చాయని రూమర్స్ వచ్చాయి. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ కలిసి 'ఉషా పరిణయం' సినిమా సెట్లో కలిశారు. దీంతో ఆ రూమర్స్‌కు చెక్ పెట్టారు. అయితే, తాజాగా అదే ఫోటోను సీరత్ కపూర్ తన సోషల్‌మీడియాలో పంచుకుంది.విజయ భాస్కర్ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా స్వీయ దర్శకత్వంలో 'ఉషా పరిణయం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా నటిస్తున్నారు. శ్రీ కమల్‌కు జోడీగా తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతుంది. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్‌లో సీరత్ కపూర్ దుమ్మురేపింది. ఆ పాట షూటింగ్ చివరి రోజులో సెట్స్‌లో త్రివిక్రమ్ కూడా సందడి చేశారు. ఆ సమయంలో ఆయనతో సీరత్ కపూర్ ఫోటోలు దిగింది. వాటిని ఇప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాటి విషయాలను పంచుకుంది.ఉషా పరిణయం సినిమా సెట్స్‌లో సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా త్రివిక్రమ్ సార్ వచ్చారు. మానిటర్ దగ్గర కూర్చొని నా క్లోజ్ అప్ షాట్‌ని చాలా తీక్షణంగా గమనించారు. ఆప్పుడు నాకు ఆ విషయం తెలియదు. షూట్ పూర్తి అయిన తర్వాత ఆయన నన్ను మెచ్చుకున్నారు. ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాం. అందుకు ఎన్ని ప్రశంసలు వచ్చినా అవన్నీ దర్శకులు విజయ భాస్కర్‌కు దక్కుతాయి.' అని ఆమె తెలిపింది. అయితే, తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది.సీరత్ కపూర్ టాలెంట్‌కు ఫిదా అయిన త్రివిక్రమ్ ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తర్వాతి సినిమాలో సీరత్ కపూర్‌తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు నెట్టింట వార్త వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమాలో ఆమె ఒక్కసారి మెరిస్తే మళ్లీ టాలీవుడ్లో అవకాశాల బాట పట్టడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సీరత్ కపూర్ నటించిన ఉషా పరిణయం సినిమా ఆగష్టు 2న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) -
కేక పుట్టిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. కంట్రోల్ తప్పేలా చేస్తున్న సీరత్!
అందాల విందు చేస్తున్న హాట్ బ్యూటీ సీరత్ కపూర్ చీర వీడియోతో కేక పుట్టిస్తున్న నటి సురేఖావాణి మత్తెక్కించే లుక్స్‌లో హీరోయిన్ మాళవిక మోహనన్ లడ్డూ క్యాప్షన్‌తో స్మైల్ తెప్పిస్తున్న 'దూత' బ్యూటీ వెకేషన్లో చిల్ అవుతున్న బిగ్‌బాస్ అరియానా బ్లాక్ శారీలో కాక రేపుతున్న 'చంద్రముఖి-2' బ్యూటీ బికినీలో బీచ్ ఒడ్డున నాగినీ బ్యూటీ మౌనీరాయ్ 'జమల కద్దు' డ్యాన్స్‌తో ఆకట్టుకున్న 'బిగ్‌బాస్' దివి View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pracchi Desai (@prachidesai) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by S r u s h t i i D a n g e 🦋💫 (@srushtidangeoffl) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Riddhi Kumar (@riddhikumar_) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) -
ఆయనతో ఇంకో సినిమా చేయాలనుంది!
‘‘ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ కథ ‘టచ్ చేసి చూడు’. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మా సినిమా అలరిస్తుంది. ఈ సినిమా డబ్బింగ్ పూర్తి కాగానే రవితేజగారు నాకు ఫోన్ చేసి, చాలా బాగా చేశావని అభినందించారు. అదే నాకు బిగ్ కాంప్లిమెంట్’’ అని హీరోయిన్ రాశీఖన్నా అన్నారు. రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ‘టచ్ చేసి చూడు’ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశీఖన్నా పంచుకున్న విశేషాలు.. ► ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నా పేరు పుష్ప. సాధారణంగా హీరోలకు వినోదం పండించే అవకాశం ఉంటుంది. కానీ హీరోయిన్లకు కామెడీ చేయడానికి స్కోప్ ఉండదు. అయితే.. ఈ సినిమాలో నాకు ఆ అవకాశం దొరికింది. రవితేజగారికి, నాకు మధ్య ఉన్న మంచి కామెడీ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ► నా కోసం, సినిమాల కోసం బరువు తగ్గాను. నటనకూ, గ్లామర్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయడం చాలా బాగుంది. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే బోర్‌గా ఉంటుంది. అందుకే విభిన్నమైన పాత్రలు చేయాలి. ► రవితేజగారు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. సెట్స్‌లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఆయనతో పని చేయడం చాలా బాగుంటుంది. రవితేజగారితో ఇంకో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. ► ‘టచ్ చేసి చూడు, తొలిప్రేమ’ సినిమాల్లో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నా. కానీ టైమ్ దొరకలేదు. డబ్బింగ్ చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వీలు కుదరలేదు. ► సీనియర్ హీరోలతో పనిచేస్తున్నప్పుడు వాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. యంగ్ హీరోల నుంచి కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను. నాకు టాలీవుడ్లో బాగుంది. మంచి సినిమాలు, పాత్రలు వస్తున్నాయి. చాలా హ్యాపీ. అటువంటప్పుడు బాలీవుడ్ ప్రయత్నాలు ఎందుకు? అందుకే చేయడం లేదు. -
అందరికీ వయసు పెరుగుతుంది కానీ రవితేజకు మాత్రం తగ్గుతోంది – వినాయక్
‘‘అందరికీ సినిమా సినిమాకు వయసు పెరుగుద్ది కానీ రవితేజకి మాత్రం తగ్గుతోంది. ‘విక్రమార్కుడు’ సినిమా చూసి ఎలా ఫీల్ అయ్యామో ‘టచ్ చేసి చూడు’ చూసి కూడా అలానే ఫీల్ అవుతాం’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మోహన్ నిర్మించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నాకు స్పెషల్. కారణం నిర్మాతలు బుజ్జి, వంశీ మోహన్‌గారు. దర్శకుడు విక్కీ (విక్రమ్) నాతో కలిసి పని చేశాడు. రెండు రీళ్లు చూశాను. చాలా బాగా తెరకెక్కించాడు’’ అన్నారు. ‘‘మా టెక్నీషియన్స్ రామ్–లక్ష్మణ్, రవివర్మన్, వెంకట్ ఫైట్ మాస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కో ఫైట్ చేశారు. నా ప్రొడ్యూసర్స్ ఇద్దరూ నా ఫ్రెండ్స్. విక్రమ్ సిరికొండ నాకు ‘మిరపకాయ్’ సినిమా నుంచి తెలుసు. వక్కంతం వంశీ అందించిన కథను విక్రమ్ బాగా హ్యాంyì ల్ చేశాడు. జామ్ 8 అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు’’ అన్నారు రవితేజ. ‘‘నేను ఇండస్ట్రీలో నిలబడటానికి కారణం హీరో రవితేజగారి ‘కిక్’ సినిమానే. ‘టచ్ చేసి చూడు’ ఫుల్ కమర్షియల్‌గా ఉంటుంది’’ అన్నారు వక్కంతం వంశీ. విక్రమ్ సిరికొండ మాట్లాడు తూ – ‘‘నా సినిమా గురు వినాయక్‌గారికి థాంక్స్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం బుజ్జిగారు. నా మాస్ రాజా ఎనర్జీ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కు ఇంకో క్వాలిటీ ఉంది. అదేంటంటే ఆ ఎనర్జీని చుట్టూ ఉన్న వాళ్లకి పాస్ చేస్తారు’’ అన్నారు. ‘‘రవితేజగారితో ‘కృష్ణ’ సినిమా తీయలేకపోయాను. పది సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం దొరికింది. చక్కటి స్క్రిప్ట్, మంచి డైరెక్టర్’’ అన్నారు వంశీమోహన్. -
యాంకర్ అవతారమెత్తిన అల్లు హీరో
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అల్లు శిరీష్ స్టార్ ఇమేజ్ ను అందుకోవటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో పరవాలేదనిపించినా.. తరువాత ఆ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. పలు సినీ వేడుకల్లో వ్యాఖ్యతగానూ ఆకట్టుకున్న శిరీష్ ఓ యూట్యూబ్ చానల్ కోసం యాంకర్ అవతారమెత్తాడు. పింక్ విల్లా చానల్ కోసం రిడ్లింగ్ విత్ అల్లు శిరీష్ అనే షో చేస్తున్నాడు శిరీష్. ఈ షోలో భాగంగా తనతో పాటు ఒక్క క్షణం సినిమాలో నటించిన శీరత్ కపూర్ ను ఇంటర్వూ చేశాడు శిరీష్. ఫన్నీ ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వూలో శిరీష్ తన కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. -
ఆ సక్సెస్‌ని తెలుసుకోలేకపోయా
‘‘నా తొలి చిత్రం ‘రన్ రాజా రన్’ మంచి హిట్. అంత మంచి సక్సెస్ఫుల్ సినిమా చేశానని నేను రియలైజ్ కాలేకపోయా. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు కూడా అంతే. అవి నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడతాయని చూడలేదు. ‘ఒక్క క్షణం’ సినిమాలాగా ‘టచ్ చేసి చూడు’ నా కెరీర్‌కి హెల్ప్ అవుతుందనుకుంటున్నా’’ అని సీరత్ కపూర్ అన్నారు. రవితేజ హీరోగా, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సీరత్ కపూర్ చెప్పిన విశేషాలు. ► ‘టచ్ చేసి చూడు’లో నా పాత్ర రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా ఉంటుంది. హీరోని డామినేట్ చేస్తుంటా. సినిమా మొత్తం ఉండను. ఇంటర్వెల్ తర్వాత వస్తా. నాకు, రాశీఖన్నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. నేనింకా పూర్తి సినిమా చూడలేదు. అందుకే కథాంశం ఏంటని క్లారిటీగా చెప్పలేను. రవితేజగారు పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ► రవితేజగారు వంటి పెద్ద హీరోతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఆయన చాలా సింపుల్. సెట్స్‌లో సరదాగా ఉంటారు. ఇండస్ట్రీలో ఇన్నేళ్లు అలా ఉండటం మామూలు విషయంకాదు. ఎప్పుడూ ఎనర్జీగా, లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ► ‘రన్ రాజా రన్’ సక్సెస్ తర్వాత నా సినిమాలు కొన్ని సరిగ్గా ఆడలేదు. అందుకు పెద్దగా బాధపడను. ‘రాజుగారి గది–2’ నుంచి మంచి సినిమాలు చేస్తున్నాను. ‘టచ్ చేసి చూడు’లో నేను సెకండ్ హీరోయిన్ని కాదు. ఓ ముఖ్యమైన పాత్ర చేశా. అయినా.. ఫస్ట్ హీరోయిన్.. సెకండ్ హీరోయిన్ అని ఆలోచించను. పాత్రలోని ప్రాముఖ్యత చూసి, నచ్చితే చేస్తా. ► సురేశ్ ప్రొడక్షన్లో రానాతో ఓ సినిమా, ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా. వీటితో పాటు మరో సినిమా ఒప్పుకున్నా. త్వరలో పూర్తి వివరాలు చెబుతా. -
టచ్ చేస్తే...
‘రాజా ది గ్రేట్’ సినిమా హిట్‌తో మాంచి ఊపు మీదున్నారు రవితేజ. అదే స్పీడ్‌తో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ సినిమాని పూర్తి చేశారాయన. ఇందులో రాశీఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు బుజ్జి, వంశీ మాట్లాడుతూ– ‘‘మా చిరకాల మిత్రుడు రవితేజతో ‘టచ్ చేసి చూడు’ సినిమా నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉంది. రవి ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన పాటలకు, టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. మా చిత్రంలో రవితేజ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారని అందరూ ప్రశంసిస్తున్నారు. సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈ వారంలో ప్రీ–రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహిస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జామ్ 8, కెమెరా: ఛోటా కె.నాయుడు. -
కమింగ్ సూన్
టచ్ చేస్తాం. అతి త్వరలో మాంచి మాస్ బొమ్మతో థియేటర్స్‌ను టచ్ చేస్తాం అంటున్నారు ‘టచ్ చేసి చూడు’ చిత్రబృందం. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని సమాచారం. ‘‘చిరకాల మిత్రుడైన రవితేజతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. వక్కంతం వంశీ అందించిన కథను విక్రమ్ బాగా తెరకెక్కించారు. త్వరలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రీసెంట్గా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రీతమ్ అండ్ జామ్ 8 సంగీతం అందించారు. -
నా నమ్మకం నిజమైంది – అల్లు శిరీష్
‘‘నా కెరీర్లో 2017కి చాలా ప్రత్యేకత ఉంది. మలయాళ సినిమా ‘1971 బియాండ్ బోర్డర్’లో మోహన్‌లాల్‌గారితో నటించా. నా పాత్రకి మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 28న విడుదలైన ‘ఒక్కక్షణం’ నాకు మరచిపోలేని సినిమాగా నిలిచింది’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘గౌరవం’ సరైన విజయం అందుకోలేదు. దాంతో కొత్తగా చేద్దామనే ఆలోచన తగ్గిపోయింది. ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ వంటి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశాక మళ్లీ ధైర్యం తెచ్చుకుని, ఏదైనా కొత్తగా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ‘ఒక్కక్షణం’ చేశా. ఈ రోజు నా నమ్మకం నిజమైంది. సినిమా చూసినవారందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్‌లోనూ మంచి సినిమాలు చేయాలనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులు సహా అందరికీ థ్యాంక్స్. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు, సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఒక్కక్షణం’ సక్సెస్‌తో 2018కి మేం సంతోషంగా స్వాగతం పలికేలా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సీరత్ కపూర్. నిర్మాత చక్రి చిగురుపాటి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
పక్కా మాస్ యాక్షన్.. ‘టచ్ చేసి చూడు’
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేయటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న రవితేజ, టీజర్ లో మాస్ యాక్షన్ తో అదరగొట్టాడు. రాజా ది గ్రేట్ తో సత్తా చాటిన రవితేజ టచ్ చేసి చూడుతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. -
ఫిబ్రవరి 2న ‘టచ్ చేసి చూడు’
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రీతమ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో సినిమా వాయిదా పడింది. తరువాత రవితేజ పుట్టిన రోజు కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తారని భావించినా.. హడావిడి అవుతుందన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 2న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రాజా ది గ్రేట్ తో సత్తా చాటిన రవితేజ టచ్ చేసి చూడుతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. -
బృందావనంకి ఫోర్ పిల్లర్స్
రచయిత శ్రీధర్ సీపాన దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘బృందావనమది అందరిది’. జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ ఆశీస్సులతో శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి కూతురు (యన్.అర్.ఐ ) నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రంలోని నటీనటుల వివరాలను చిత్రబృందం వెల్లడించింది. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ– ‘‘నా కథకి కొత్తవాళ్లతో సినిమా చేయాలని నిర్వహించిన ఆడిషన్స్‌కి మంచి స్పందన వచ్చింది. నలుగురు ప్రధాన తారాగణం మినహా మిగిలిన పాత్రలకు చాలామంది కొత్తవాళ్లని తీసుకున్నాం. ప్రధాన తారాగణంగా ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు, నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు లగడపాటి విక్రమ్ (రేసుగుర్రం ఫేమ్), సీరత్ కపూర్ (రన్ రాజా రన్ ఫేమ్), థర్టీ ఇయర్స్ పృ«థ్వీ నటిస్తారు. వీరు నలుగురూ నా సినిమాకి మెయిన్ పిల్లర్స్. సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. జనవరి 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘అదుర్స్’ రఘు, బొడ్డ నారాయణ, ‘సత్యం’ రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: సి. రాంప్రసాద్. -
కసి ఉన్నవాళ్లతో పనిచేస్తే ఎనర్జీ వస్తుంది
‘‘ఒక్కక్షణం’ సినిమాకి వస్తున్న ఫీడ్‌బ్యాక్, రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నా. ప్రత్యేకించి ఈ సినిమాలోని కథతో పాటు హీరో గురించి మాట్లాడుతున్నారు. ఓ యాక్టర్‌గా అది నాకు బాగా అనిపించింది. గత సినిమాలకంటే ఈ సినిమాలో నటుడిగా ఎదిగావు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయంటుంటే వెరీ హ్యాపీ’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఈ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన విశేషాలు. ► ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడా. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నప్పుడు ఆనంద్ ‘ఒక్కక్షణం’ కథ తీసుకొచ్చారు. తను కథ చెప్పిన విధానం నచ్చి వెంటనే ఓకే చెప్పేశా. ఆ తర్వాత నాన్నగారు (అల్లు అరవింద్) కథ విని బాగుందన్నారు. అన్నయ్యకి (అల్లు అర్జున్) స్టోరీ లైన్ తెలుసు. కథ పూర్తిగా తెలీదు. ఫస్ట్ కాపీ చూసి బాగుందన్నారు. ► ‘ఒక్కక్షణం’ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యమైంది. అయితే సినిమాపై నమ్మకంతో వేరే ఏ సినిమా నేను ఒప్పుకోలేదు. ప్యారలల్ లైఫ్ పాయింట్ కొత్తగా అనిపించింది. కథను నేను బాగా నమ్మడంతో ఇన్వాల్వ్ అయి చేశా. కథకి అవసరం మేరకే మూడు ఫైట్స్ ఉన్నాయి. అవి అనవసరం అనిపించవు. ► ఆనంద్ చెప్పిన కథని అంతే చక్కగా తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత ఆయనపై నాకు మరింత గౌరవం పెరిగింది. అమ్మ సెంటిమెంట్ సీన్‌కి చాలామంది కనెక్ట్ అయ్యారు. కెమెరామ్యాన్ శ్యాం కె.నాయుడుతో పనిచేయాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరింది. మరో సినిమాకి ఆయనతో పనిచేయనున్నా. ఈ చిత్రంలో సంగీతం కంటే నేపథ్య సంగీతానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మణిశర్మగారు చాలా బాగా చేశారు. ఆయనలా ఎవరూ చేయలేరు. ► ప్రమోషన్ సాంగ్‌ను ఇంటర్వెల్ తర్వాత పెట్టాలని షూట్ చేశాం. లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. ఎండింగ్ టైటిల్స్ అప్పుడు ఆ పాట ఉంటుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు తీసేశాం. ► లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టం. అన్నీ అటువంటివే చేయాలని కాదు. నా పాత్ర కొత్తగా ఉండాలి. వైవిధ్యమైన సినిమాలు చేస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. ► మంచి పాత్ర అయితే వేరే హీరోల సినిమాలో చేయడానికి రెడీ. నా సినిమాలో ఏ హీరో చేయడానికైనా అభ్యంతరం లేదు. మల్టీస్టారర్ మూవీ కథలను రచయితలు రాయడం లేదు. మలయాళంలో ‘1971’ సినిమాలో మోహన్‌లాల్‌గారితో కలిసి నటించడం మరచిపోలేను. ‘ఒక్కక్షణం’ మలయాళంలో డబ్బింగ్ చేయడానికి అక్కడివారు ముందుకొచ్చారు. ► ఓ నిర్మాత కొడుకుగా అది కావాలి.. ఇది కావాలి.. అంటూ నేను నిర్మాతలను డిమాండ్ చేయను. ప్రాజెక్ట్‌పై ఎంత శ్రద్ధ ఉంటుందో పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్పైనా అంతే శ్రద్ధ పెట్టమని చెబుతానంతే. ► నాన్నగారు వేరే హీరోతో హిట్ సాధించారంటే ఓ కొడుకుగా సంతోషిస్తా. అదే నేను హీరోగా చేసిన సినిమా హిట్ అయిందంటే నాకు మరో పది రెట్లు సంతోషంగా ఉంటుంది (నవ్వుతూ). ► కొత్త డైరెక్టర్లతో పనిచేయాలనే ఎగై్జట్‌మెంట్ ఉంది. ఇప్పుడొస్తున్న మంచి సినిమాలన్నీ కొత్తవారి నుంచి వస్తున్నవే. ఆనంద్ ఓ కొత్త డైరెక్టర్లా కష్టపడ్డాడు. అంత కసి ఉన్నవాళ్లతో పనిచేస్తుంటే ఎనర్జీ వస్తుంది. కొత్త, పాత డైరెక్టర్లు చెప్పిన రెండు మూడు కథలు విన్నా. నెలలోపు ఫైనలైజ్ చేస్తా. నేను క్రమశిక్షణతో పనిచేస్తా. కొత్త ఏడాది నుంచి మరింత క్రమశిక్షణగా పనిచేయాలనుకుంటున్నా. -
ఉతికి ఆరేస్తాడు
కూల్‌గా కామ్‌గా ఉన్నవాడిని అనవరంగా కదిలిస్తేనే ఏదో రకంగా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అలాంటిది బలుపు, పవర్ ఉన్న మాస్ అబ్బాయిని కెలికితే ఊరుకుంటాడా? దమ్ము చూపించి, వాళ్ల దుమ్మ దులిపి ఉతికారేస్తాడు. మరి.. మా హీరో ఉతుకుడు ఏ రేంజ్లో ఉందో చూడాలంటే మా సినిమా వచ్చేంతవరకు ఆగాల్సిందే అంటున్నారు ‘టచ్ చేసి చూడు’ చిత్ర బృందం. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘టచ్ చేసి చూడు’. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘రవితేజతో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రవితేజ ఇమేజ్ తగ్గట్లుగా రచయిత వక్కంతం వంశీ సూపర్ కథను అందించారు. షూటింగ్ కంప్లీటైంది. ప్రజెంట్ రీ–రికార్డింగ్ వర్క్ జరుగుతుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం : ప్రీతమ్ జామ్8, కెమెరా: చోటా. కె. నాయుడు. -
'ఒక్క క్షణం' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక్క క్షణం జానర్ : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తారాగణం : అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : విఐ ఆనంద్ నిర్మాత : చక్రి చిగురుపాటి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ అల్లు వారబ్బాయి కాస్త గ్యాప్ తీసుకొని ఓ డిఫరెంట్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎక్కడిపోతావు చిన్నవాడా లాంటి హర్రర్ థ్రిల్లర్ ను రూపొందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించాడు. సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు జీవితాలు ఒకే విధంగా ఉండటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అల్లు శిరీష్ కు మరో విజయాన్ని అందించిందా..? విఐ ఆనంద్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఆకట్టుకుందా..? కథ : జీవా (అల్లుశిరీష్) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి. అమ్మా నాన్నలతో సరదాగా కాలం గడిపే జీవాకు ఓ రోజు ఇనార్బిట్ మాల్ లోని బేస్మెంట్ పార్కింగ్ పిల్లర్ నంబర్ బి 57 దగ్గర జ్యోత్స్న(సురభి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. తరువాత వాట్సప్ చాటింగ్ లతో మరింత దగ్గరవుతారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. తనచుట్టూ ఉన్న మనుషులను చూస్తూ టైం పాస్ చేసే జ్యోకి తమ అపార్ట్మెంట్ లోని పక్క పోర్షన్ లో ఉంటున్న శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్)ల మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన జీవా, జ్యోత్స్నలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. (సాక్షి రివ్యూస్) సరిగ్గా ఏడాది క్రితం శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఏ సంఘటనలు అయితే జరిగాయో అవే సంఘటనలు జీవా, జ్యోత్స్నల జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతుంటాయి. మహ్మద్ ఆస్తేకర్ (జయప్రకాష్) అనే ప్రొఫెసర్ ద్వారా ప్యారలల్ లైఫ్ గురించి తెలుసుకొని తన జీవితం కూడా స్వాతి జీవితం లాగే అవుతుందని భయపడుతుంది జ్యో. అదే సమయంలో స్వాతి తన అపార్ట్మెంట్ లో హత్యకు గురవుతుంది. ఆ హత్య శ్రీనివాసే చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంతో జీవా తనను చంపుతాడని మరింత భయపడుతుంది జ్యో.. స్వాతిని నిజంగా శ్రీనివాసే చంపాడా..? ఆత్మహత్య చేసుకుందా..? స్వాతి లాగే జ్యోత్స్న కూడా చనిపోతుందా..? విధిని ఎదిరించి చేసే పోరాటంలో జీవా విజయం సాధించాడా..? నటీనటులు : శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ఆకట్టుకున్న అల్లు శిరీష్.. ఈసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తను ప్రేమించిన అమ్మాయి చనిపోతుందని తెలిసి ఆమెను కాపాడుకునేందుకు పోరాటం చేసే యువకుడి పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే నటనపరంగా శిరీష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. లవ్ రొమాంటిక్ సీన్స్ తో పరవాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం శిరీష్ నటన తేలిపోయింది. చాలా సన్నివేశాల్లో అల్లు అర్జున్ ను ఇమిటెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన సురభి ఆకట్టుకుంది. అభినయంతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. కథకు కీలకమైన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ లు తమ పరిధి మేరకు మెప్పించారు. (సాక్షి రివ్యూస్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సీరత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యాక్టింగ్ తో పాటు గ్లామర్ షోలోను హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. కథ అంతా నాలుగు పాత్రల చుట్టూ నడుస్తుండటంతో ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అతిధి పాత్రలో నటించిన దాసరి అరుణ్ మంచి విలనిజాన్ని పండించాడు. విశ్లేషణ : తన ప్రతీ సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించే విఐ ఆనంద్ ఈ సారి ప్యారలల్ లైఫ్ అనే సైన్స్‌ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సమయాల్లో ఒకే విధమైన సంఘటనలు జరగటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెర మీద ఆవిష్కరించటంలో సక్సెస్ సాధించాడు. అయితే కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం లోపించింది. ఫస్ట్ హాప్ స్లోగా నడిచినా ఇంట్రస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కథనం వేగం పుంజుకుంది. స్వాతి మరణానికి కారణం వెతికే సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇంకాస్త వేగంగా నడిచుంటే బాగుండనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్) మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఎండ్ టైటిల్స్ లో వచ్చే మాస్ సాంగ్ తప్ప మిగిలిన పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇంటర్వెల్ లాంటి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప మణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టకోలేదు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ లోని మలుపులు ఇంటర్వెల్ బ్యాంగ్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా వేగం తగ్గిన కథనం సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు’
‘‘ఓ కొత్త కథను అరటిపండు వలిచినట్టు అందరికీ అర్థమయ్యేలా అందంగా చెప్పారు ఆనంద్. తను చెప్పిన కథ వినగానే నేను ఎగ్జయిట్ అయ్యా. ‘ఒక్క క్షణం’ వంటి మంచి సినిమాను శిరీష్‌తో తెరకెక్కించినందుకు ఆనంద్‌గారికి థ్యాంక్స్. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ఒక్క క్షణం’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘నిర్మాతగారి అబ్బాయిలుగా నిర్మాత విలువేంటో నాకు తెలుసు. నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు. నేను ‘దిల్’ రాజుగారితో జర్నీ స్టార్ట్ చేసినట్లే.. చక్రిగారితో శిరీష్ జర్నీ స్టార్ట్ చేశాడు. తన జర్నీ ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలి. ఆనంద్‌గారి ‘టైగర్’ సినిమా చూశా. చాలా బాగుందని శిరీష్‌కి చెప్పా. తను పెద్దగా విన్నట్లు కనపడలేదు. తర్వాత ఓ రోజు నన్ను కలిసి నేను ఆనంద్‌గారితో సినిమా చేయబోతున్నాను అని అన్నాడు. అలా ఈ సినిమా ప్రారంభం కావడంలో నేను కూడా ఓ చిన్న పాత్ర పోషించాననిపిస్తోంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా నేను గర్వపడే చిత్రం అవుతుందనుకుంటున్నా. జనవరి 1న టీజర్ రిలీజ్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో చక్రిగారు సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 14 నెలలుగా శిరీష్ ఈ సినిమా కోసమే వర్క్ చేశారు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త రకం సినిమా అవుతుంది’’ అన్నారు అల్లు శిరీష్. నటుడు నాగబాబు, సురభి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హాయ్ దుబాయ్
సాంగ్స్ షూట్ చేయడానికి దుబాయ్‌కి హాయ్ చెప్పింది ‘టచ్ చేసి చూడు’ చిత్రబృందం. మరి.. దుబాయ్‌కి బై బై ఎప్పుడు చెప్తారంటే వారం రోజుల తర్వాత. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. ఇందులో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. దుబాయ్‌లో ఏం జరుగుతోంది? ఎన్ని రోజులు షూటింగ్లో పాల్గొంటారు? అని రాశీ ఖన్నాని అడిగితే – ‘‘ఈ సినిమాలో వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్ పాత్ర చేస్తున్నాను. ఓన్లీ సాంగ్స్‌లోనే కాకుండా కొన్ని సీన్స్‌లో కూడా నేను డ్యాన్స్ చేయాల్సి ఉంది. అంతే కాదు నా క్యారెక్టర్ కొంచెం కామిక్‌గా ఉంటుంది. స్క్రీన్‌పై నేనొచ్చినప్పుడు వచ్చే సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం సాంగ్స్‌ను షూట్ చేయడానికి దుబాయ్ వచ్చాం. ఈ వన్ వీక్ షెడ్యూల్లో టు సాంగ్స్‌ను కంప్లీట్ చేయబోతున్నాం. ప్రీతమ్ ఎక్స్లెంట్ మ్యూజిక్ ఇచ్చారు’’ అని చెప్పారు రాశీ ఖన్నా. అంటే రవితేజ, రాశీఖన్నా దుబాయ్‌లో చిందేస్తున్నారన్నమాట. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. -
క్షణం ఊహించలేరు
ఊహించలేరట.. ఎవరూ ఊహించలేరట. ‘ఒక్క క్షణం’ స్క్రీన్‌ప్లేని సినిమా చూస్తున్నప్పుడు ఎవరూ ఊహించలేరట. ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత అల్లు శిరీష్ హీరోగా సురభి హీరోయిన్గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ జంటగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 28న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రెండు జంటల మధ్య జరిగే సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మొదటి రీల్ నుంచి చివరి రీల్ వరకు ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం ప్యారలల్ లైఫ్‌తో ముడిపడి ఉంటుంది. ఒక జంటది ప్రజెంట్, మరొకరిది ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎవ్వరూ ఊహించలేని స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని అన్నారు. కాశీ విశ్వనాథ్, రోహిణి, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: అబ్బూరి రవి, కో–ప్రొడ్యూసర్స్: సతీష్ వేగేశ్న, రాజేష్ దండ. -
ఆనంద్ మార్క్ సినిమా ఇది – అల్లు శిరీష్
అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్ ముఖ్య పాత్రల్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్బీ నరసింహా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగరుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. టీజర్ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ‘‘టీజర్లో చెప్పిన ‘నేను ప్రేమిస్తే.. ’ డైలాగ్ శాంపిల్ మాత్రమే. సినిమాలో ఇంకా సస్పెన్స్ ఉంది. మణిశర్మగారి సంగీతం సినిమాకు ఫ్లస్. దర్శకుడి మార్క్ చూసించే సినిమా ఇది’’ అన్నారు హీరో అల్లు శిరీష్. ‘‘సినిమా కోసం శిరీష్ చాలా కష్టపడ్డారు. గతేడాది నవంబర్‌లో హీరోకి, నిర్మాతకు కథ చెప్పా. వాళ్లు నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు ఆనంద్. ‘‘ కథకు తగ్గ టైటిల్ పెట్టాం. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాం’’అన్నారు చక్రి. ‘‘ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే సినిమా’’అన్నారు రచయిత అబ్బూరి రవి. -
టచ్ చేస్తే... ఫైటే!
దమ్ముంటే టచ్ చేసి చూడు అని సవాల్ విసిరారు రవితేజ. ఆ సవాల్‌కి రౌడీలు భయపడలేదు. టచ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అంతే... రవితేజ రఫ్పాడించారు. ఫైనల్‌గా అతని టచ్‌కి దొరక్కుండా రౌడీలు ఎస్కేప్. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న ‘టచ్ చేసి చూడు’ కోసం యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. పైన చెప్పినట్లే జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. రాశీ ఖన్నా డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఫ్రెడ్డీ దార్వాల ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గా హీరో, హీరోయిన్లపై సాంగ్ తీసిన ఈ చిత్రం యూనిట్ ఇప్పుడు రవితేజ, ఫ్రెడ్డీలపై కీలక సీన్స్‌తో పాటు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అంటే... ప్రస్తుతం టచ్ చేస్తే ఫైట్ అన్నమాట. ‘‘టచ్ చేసి చూడు షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాను’’ అని పేర్కొన్నారు ఫ్రెడ్డీ. రవితేజ స్టైల్లో సాగే పక్కా కమర్షియల్ మూవీ ఇది అని సమాచారం. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ వినికిడి. -
కన్నడ పవర్‌స్టార్ @ అల్లు శిరీష్ సెట్స్
అల్లు శిరీష్ హీరోగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లు. శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడికి కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు దర్శకుడు వీఐ ఆనంద్ సినిమా గురించి వివరించారట! ‘‘శిరీష్ హార్డ్ వర్కర్. నటుడిగా తనకు మంచి భవిష్యత్ ఉంది. కథ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలనుకుంటున్నా’’ అని పునీత్ చిత్రబృందంతో చెప్పారట! ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘రాజ్‌కుమార్‌గారి ఫ్యామిలీకీ, మా ఫ్యామిలీకీ ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇటీవలే శివన్న (శివ రాజ్‌కుమార్) ‘తగరు’ టీజర్ లాంచ్‌కి నేను వెళ్లా. ఇప్పుడు పునీత్ మా సెట్స్‌కి రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, సత్య, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాతలు: సతీష్ వేగేశ్న, రాజేశ్ దండ, సంగీతం: మణిశర్మ, కెమెరా: సుజిత్ వాసుదేవ్, మాటలు: అబ్బూరి రవి. -
ఒక్క క్షణం!
ఏదైనా అర్జంటు పని మీద ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే.. ‘వన్ సెకండ్ ప్లీజ్’ అంటుంటాం. ఇప్పుడు అల్లు శిరీష్ అలానే అంటారని టాక్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో సురభి, శీరత్ కపూర్ కథానాయికలు. సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఈ సినిమాకి ‘ఒక్క క్షణం’ టైటిల్ పెట్టనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అసలు సంగతి అదండీ. కథకి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం ఆలోచన అట. ఈ చిత్రానికి ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య ఓ వార్త వచ్చింది. ఇప్పుడు ‘ఒక్క క్షణం’ సీన్లోకి వచ్చింది. వన్ సెకండ్నే ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. -
నాడీ మార్చింది
పెద్దా చిన్నా తేడా లేకుండా అందర్ని ఒకే వయసు వారిగా చేసేస్తుంది పండగ. పేరున్నోళ్లా, సామాన్యులా అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరినీ మమేకం చేస్తుంది. అంబరాన్ని తాకే సంబరాలను మోసుకొచ్చే దివాళీ వేళ.. ఆకాశంలో తారలైనా అల్లరి పిల్లలైపోరూ... నింగిలోని జాబిలైనా నేలమీదికొచ్చి జాతర చేసేయదూ. మనతో ప్రముఖులు పంచుకున్న దీపావళి ముచ్చట్లు... పండగను ఆనందించమంటున్నాయి. అలాగే పర్యావరణ‘హితవూ’ చెబుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో స్పెషల్.. ఫెస్టివల్ దీపావళి పండగ నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి క్రాకర్స్ కాలుస్తూ సెలబ్రేట్ చేసుకునేదాన్ని. అయితే ఇప్పుడు అంత బాగా కాల్చాలనిపించడం లేదు. గల్లీగల్లీకి అపార్ట్మెంట్స్ వచ్చేశాయి. ఓపెన్ స్పేస్ తగ్గిపోయింది. ఇక గ్రీన్ దీవాళీ, పొల్యూషన్ ఫ్రీ ప్రచారం బాగా పెరిగింది. దీంతో క్రాకర్స్ కాల్చడం తగ్గించేశాను. తక్కువ టపాసులు, చాలా దీపాలు పెట్టడం, మిత్రులు, బంధువులతో టైమ్‌పాస్ చేయడం.. ఇదే ఇప్పుడు దీపావళి. నిజానికి ఇది నాకు స్పెషల్ ఫెస్టివల్. బిగ్ బాస్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరవడం, ఇటీవల నేను రూపొందించిన ‘ఐయామ్ ఇన్ దిస్వే’ షార్ట్‌ఫిల్మ్ బాగా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ. అందరూ సేఫ్ దివాళీ జరుపుకోండి. – అర్చన, సినీనటి ఫ్యామిలీతో ప్రత్యేకం క్రాకర్స్ కాల్చడంతో కాలుష్యం పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే నేను క్రాకర్స్‌ను కాల్చడం ఎప్పుడో మానేశాను. ప్రతి దీపావళి మా ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం. అందరం ఒకేచోట చేరి పూజలో పాల్గొని, పండగను ఆస్వాదిస్తాం. క్రాకర్స్ కాల్చొద్దు.. వాటికి పెట్టే డబ్బులతో పేదవారికి చేయూతనివ్వండి. – తమన్నా, సినీనటి బెంగళూర్‌లో ఫ్రెండ్స్‌తో.. నేను బెంగళూర్‌లో ఉన్నాను. ఇక్కడే ఫ్రెండ్స్‌తో దీపావళి జరుపుకుంటాను. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అయితే అమ్మతో కలిసి పూజలో పాల్గొనేదాన్ని. క్రికెట్ ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలిచి, లిమిట్‌గా క్రాకర్స్ కాల్చి ఎంజాయ్ చేసేవాళ్లం. క్రాకర్స్‌తో తీవ్ర కాలుష్యం ఏర్పడి పర్యావరణం దెబ్బతింటోంది. అందుకే అందరూ చాలా తక్కువగా టపాసులు కాల్చండి. – మిథాలీరాజ్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కొవ్వొత్తి కాంతుల్లో.. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తుండడంతో ఫ్యామిలీతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేయడమే కుదరట్లేదు. ఈ ఏడాది ఇంట్లో తక్కువ రోజులు ఉన్నాను. అందుకే ఈ పండగకు ఇంటికి వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాను. అందులోనూ ‘రాజుగారి గది–2’ సూపర్ సక్సెస్ దివాళీని స్పెషల్‌గా మార్చింది. ఉదయమంతా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను. రాత్రికి కుటుంబసభ్యులతో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ దివాళీకి వెల్కమ్ చెప్తాను. – సీరత్‌కపూర్, సినీనటి కాకర పువ్వొత్తులు కాలుస్తా.. ఇంట్లో శాస్త్రీయబద్ధంగా పండగ జరుపుతారు. చాలా వెరైటీ స్వీట్స్ తయారు చేస్తాం. చిన్నప్పటి నుంచి బాణసంచా కాల్చడం తక్కువే. అయితే కాకర పువ్వులు మాత్రం బాగా కాలుస్తాను. ఈ దీపావళి కుటంబంతో జరుపుకోవడం కష్టమే... రాహుల్‌తోనే దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాను. – చిన్మయి శ్రీపాద,సింగర్ నాడీ మార్చింది దివాళీకి ఒకప్పుడు టపాసులు బాగా కాల్చేవాడిని. మా ఇంటికి నాడీ (పెంపుడు శునకం) వచ్చాక.. జరుపుకున్న తొలి దీపావళి రోజున ఆ శబ్దాలు, పొగకు అది ఉక్కిరిబిక్కిరైంది. దీంతో నాలో మార్పు వచ్చింది. మనం టపాసులకు వెచ్చించే డబ్బులతో ఒక కుటుంబం ఏడాదంతా కడుపు నింపుకోగలదు అనిపించింది. అప్పటి నుంచి టపాసులు కాల్చడం మానేశాను. దీపాలతో ఇళ్లంతా డెకరేట్ చేయడం.. స్వీట్స్ తయారీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గరికి వెళ్లడం.. ఇదే ఇప్పుడు మా దీపావళి. టపాసులు కాల్చకండి.. ఆ డబ్బును నిరుపేదలకు ఇవ్వండి.. వారి కళ్లల్లో వెలుగులే నిజమైన దీపావళి. – ప్రిన్స్, సినీనటుడు అనాథ పిల్లలతో ఆనంద దివాళీ ‘రంగుల లోకంలో విహరించడమే కాదు.. హంగులన్నీ పక్కనబెట్టి అనాథలు, పేదలతో వీలైనన్ని రోజులు గడపాలనేదే నా ఆశ’ అని చెప్పింది సినీ నటి పూనమ్‌కౌర్. సికింద్రాబాద్‌లోని ‘సర్వ్ నీడి’ అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి బుధవారం దీపావళి వేడుకలు జరుపుకుంది. టపాసులు తీసుకొచ్చి పిల్లలతో కలిసి కాల్చి, ఆనందంగా గడిపింది. మిస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. -
తెలుగు ప్రేక్షకులు నాకిచ్చిన పెళ్లి బహుమతి ఇది – సమంత
‘‘అమ్మకు ఆస్ట్రాలజీ అంటే నమ్మకం. ఓ సారి ఓ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లినప్పుడు... ‘మీరు కొత్త పాత్రలు చేస్తే తప్పకుండా హిట్’ అన్నారు. అప్పట్నుంచి ఎప్పుడు కొత్త పాత్రలు చేసినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రాజుగారి గదిలో అందరూ డబ్బులు నిండుతున్నాయంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే, గదిలో ప్రశంసలు నిండటం చాలా హ్యాపీగా ఉంది. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ కన్నా పెద్ద హిట్టా మావయ్యా?’ అనడుగుతోంది సమంత. ఆ విషయం తనకు తర్వాత చెబుతా’’ అని నవ్వేశారు నాగార్జున. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత, శీరత్ కపూర్, అశ్విన్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ ముఖ్య తారలుగా పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరైన్మెంట్స్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించిన సినిమా ‘రాజుగారి గది–2’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్ ఆదివారం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఫ్యాన్స్ ఫోన్ చేసి... ‘మా హీరో ఇలాంటి సినిమా చేశాడని కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాం’ అన్నారు. ఇలాంటి పాత్రలే చేయమని అడుగుతున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? కొత్త కోడలు బ్లాక్ బ్లస్టర్ ఇచ్చింది. ఈ హిట్‌కి నిర్మాతలు, ఓంకార్, తమన్, అబ్బూరి రవి నాలుగు స్తంభాలుగా నిలిచారు’’ అన్నారు. ‘‘ఈ విజయాన్ని తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన పెళ్లి బహుమతిగా భావిస్తున్నా. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్ బాగా రావడానికి, నేను బాగా నటించడానికి హెల్ప్ చేసిన మావయ్యకు థ్యాంక్స్’’ అన్నారు సమంత. ‘‘నైజాంలో ‘ఊపిరి’ ఫస్ట్‌డే షేర్ 80 లక్షలు అయితే... ‘రాజుగారి గది–2’కి కోటిన్నర వచ్చింది. సినిమా ఎంత హిట్టనేది చెప్పడానికే ఈ లెక్కలు చెప్పా. నాగార్జునగారి కెరీర్లో మరో మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనుకుంటున్నా. అక్కినేని ఫ్యామిలీకి సమంత లక్కీ లేడీ’’ అన్నారు పీవీపీ. ‘‘పీవీపీగారితో హ్యాట్రిక్ హిట్ అందుకున్నందుకు హ్యాపీగా ఉంది. సినిమా పైరసీ కాపీలు వచ్చేశాయని విన్నాం. ప్లీజ్... కిల్ పైరసీ. థియేటర్లోనే సినిమా చూడండి’’ అన్నారు ‘మ్యాట్నీ’ జగన్. ‘‘ఓ ఫైట్ లేదు, పాట లేదు. అయినా... నాగార్జునగారు కథను నమ్మారు. ఆయన ఫ్యాన్స్ ఆయన్ను వేరేలా ఎక్స్పెక్ట్ చేస్తారేమోనని భయపడ్డా. కానీ, సినిమాను ఆదరించారు. అక్కినేని కోడలు ఇచ్చిన తొలి హిట్ తీసిన దర్శకుడిగా నాకు క్రెడిట్ దక్కినందుకు హ్యాపీ’’ అన్నారు ఓంకార్. శీరత్ కపూర్, అభినయ, అశ్విన్, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు. రాజుగారి గది 2 సక్సస్ మీట్ వీడియో -
రాజుగారు రాగానే...
రాజుగారు తిరిగి రాగానే సినిమా చిత్రీకరణ పూర్తి చేయడానికి ‘రాజుగారి గది–2’ టీమ్ ప్లాన్ చేస్తోంది. రాజుగారు ఎవరంటే... ఇంకెవరు? ‘కింగ్’ నాగార్జునే. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారాయన. సమ్మర్ హాలిడే ఇంకా పూర్తి చేసుకోలేదు! ఈ నెలాఖరుకి నాగార్జున తిరిగి వచ్చేస్తారు. ఆయన రాగానే ‘రాజుగారి గది–2’ చివరి షెడ్యూల్ మొదలు కానుంది. ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటరై్టన్మెంట్, ఓక్ ఎంటరై్టన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్‌లో సమంత, సీరత్ కపూర్, అశ్విన్, నరేశ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ ప్రధాన పాత్రధారులు. ఈ చివరి షెడ్యూల్లో నాగార్జునతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తీయనున్నారు. వచ్చే నెల రెండో వారం కల్లా చిత్రీకరణ అంతా పూర్తవుతుందని సమాచారం. ఇందులో నాగార్జున మెంటలిస్ట్ (ఎదుటివ్యక్తి మనస్తత్వం, మనసును చదవగల) పాత్రలో నటిస్తున్నారు. ఈ లుక్లా నాగార్జున క్యారెక్టరైజేషన్ కూడా అంతే కొత్తగా ఉంటుందట! ఆగస్టులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని టాక్!