సిద్ధు, సీరత్ కపూర్, విక్రమ్, పృథ్వీ
రచయిత శ్రీధర్ సీపాన దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘బృందావనమది అందరిది’. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ ఆశీస్సులతో శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి కూతురు (యన్.అర్.ఐ ) నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రంలోని నటీనటుల వివరాలను చిత్రబృందం వెల్లడించింది. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ– ‘‘నా కథకి కొత్తవాళ్లతో సినిమా చేయాలని నిర్వహించిన ఆడిషన్స్‌కి మంచి స్పందన వచ్చింది.
నలుగురు ప్రధాన తారాగణం మినహా మిగిలిన పాత్రలకు చాలామంది కొత్తవాళ్లని తీసుకున్నాం. ప్రధాన తారాగణంగా ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు, నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు లగడపాటి విక్రమ్ (రేసుగుర్రం ఫేమ్), సీరత్ కపూర్ (రన్ రాజా రన్ ఫేమ్), థర్టీ ఇయర్స్ పృ«థ్వీ నటిస్తారు. వీరు నలుగురూ నా సినిమాకి మెయిన్ పిల్లర్స్. సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. జనవరి 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘అదుర్స్’ రఘు, బొడ్డ నారాయణ, ‘సత్యం’ రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: సి. రాంప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment