Siddhu
-
‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Tillu Square Movie: ‘టిల్లు స్క్వేర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘డీజే టిల్లు-2’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
'ఆపరేషన్ వాలెంటైన్' చూసి గర్వపడతారు: నిర్మాతలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్‌పై ఈ చిత్రం రపొందింది. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. అలా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మొదలైంది దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ నాకు(సిద్దు ముద్దా), వరుణ్ కి చాలా నచ్చింది. దాన్నే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నప్పుడు, నేను, వరుణ్ కలసి కథ విన్నాం. కథ విన్న వెంటనే మాకు చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలని అనుకున్నాం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీలో చాలా గ్రాండ్ రూపొందించాం. శక్తి ప్రతాప్ కి చాలా క్లారిటీ ఉంది. తన విజన్ క్లియర్ గా ఉంటుంది, సినిమాకి ఏం కావాలో తనకి చాలా స్పష్టంగా తెలుసు. అలాగే తనకు వీఎఫ్ఎక్స్ పై చాలా మంచి కమాండ్ ఉంది. తను అదే నేపథ్యం నుంచి వచ్చారు. ఫైటర్ తర్వాత ఇలాంటి భారీ ఎయిర్ సీక్వెన్స్ తో ఇండియాలో వచ్చిన సినిమా ఇదే. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రశంసించారు ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను ఎయిర్ ఫోర్స్ అధికారులకు చూపించాం. సినిమా మొత్తం చూసిన తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏం చెప్పారో అదే తీశారని ప్రశంసించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వారు చాలా సపోర్ట్ చేశారు. రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. సైనికులు త్యాగాలని, ధైర్య సాహసాలని స్మరించుకుంటూ వాళ్ళ కథని ప్రేక్షకులకు చూపించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. 'ఆపరేషన్ వాలెంటైన్' చేస్తున్న క్రమంలో ఇలాంటి రియల్ హీరోస్ సినిమాలు మరిన్ని చేయాలనే స్ఫూర్తి కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. మిక్కీ జే మేయర్ బీజీఎం అదరగొట్టేశాడు ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతం అందించాడు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా మ్యూజిక్ ఇచ్చారు. పాటలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇప్పటికే పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీతో వరుణ్‌కి బాలీవుడ్లో మంచి గుర్తింపు వస్తుంది. నితిన్‌తో ఓ సినిమా? వరుణ్ తేజ్ తో ఇది మాకు రెండో సినిమా(గతంలో ‘గని’ అనే సినిమాను నిర్మించారు). ఇకపై బయట హీరోలతోనూ సినిమాలు చేస్తాం. నితిన్ తో ఓ సినిమా అనుకుంటున్నాం. ప్రస్తుతం మా దృష్టి 'ఆపరేషన్ వాలెంటైన్' విడుదలపై ఉంది. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాం. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని ఆగస్టు నుంచి కొత్త ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తాం. ఇప్పటివరకు స్పోర్ట్స్, ఏరియల్ యాక్షన్ జోనర్స్ లో లార్జర్ సినిమాలు చేశాం. ఇప్పుడు ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ చేయాలనే ఆలోచన ఉంది. -
పాన్ మల్కాజ్గిరి స్టోరీ తో టిల్లు
-
టిల్లు డేట్ ఫిక్స్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందు తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’కి సహనిర్మాత: సాయి సౌజన్య. -
భలే చాన్స్
‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి మంచి జోరుమీద ఉన్నారు. ఇటీవల తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించేందుకు శ్రీనిధి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భలే చాన్స్ అందుకున్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సరసన నటించను న్నారు శ్రీనిధి శెట్టి. హీరో సుదీప్, దర్శకుడు చేరన్ కాంబినేషన్లో సత్యజ్యోతి ఫిలింస్ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు శ్రీనిధి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నారట ఈ బ్యూటీ. -
Bommarillu Bhaskar-Siddhu Jonnalagadda New Movie Launch: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.పాన్ ఇండియా మూవీ ఖుషితో పాటు సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన శాకుంతలం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.ఇక ఈ మూవీ రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోని సామ్ తను తర్వాత చేయబోయే సినిమాలై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిట్ అయిన ఖుషి, సిటాడెల్ తర్వాత సమంత ఓ యంగ్ హీరోతో జతకట్టనుందట. ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరున్న ఆ హీరోతో సామ్ ఓ మూవీ చేయబోతుందని ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మార్క్ సంపాదించుకున్నాడు సిద్దు. డీజే టిల్లులో సిద్దు యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. వన్ మ్యాన్ షోలా డీజే టిల్లు మూవీని ఒంటి చేత్తో హిట్ చేయించాడు సిద్దు. దాంతో అతడు రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్నాడు. చదవండి: Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇక ఈ క్రేజీ హీరోతో సినిమా చేసేందుకు నిర్మాత రామ్ తళ్లూరి ప్లాన్ చేస్తున్నాడ. ఈ ప్రాజెక్ట్‌కి నందినీరెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. నందినిరెడ్డి-సమంతల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఓ బేబీ మూవీ నుంచి నందిని రెడ్డి, సమంతలు మంచి స్నేహితులయ్యారు. సోషల్ మీడియాలో వారిద్దరు ఎప్పుడూ సరదాగా చిట్‌చాట్ చేసుకుంటుంటారు. దాంతో నందినిరెడ్డి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడంతో సమంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్టు టాక్. ఇక స్టార్ హీరోయిన్ సమంత సరసన నటించే ఛాన్స్‌ను ఎవరు వదులుకుంటారు? అందుకే సిద్దూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. అంతా ఒకే అయితే త్వరలోనే తెరపైకి సమంత-సిద్దు కాంబినేషన్ రానుందని టాక్. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. చదవండి: వెంకటేశ్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా? -
డీజే టిల్లు సాంగ్‌కు మల్లారెడ్డి డ్యాన్స్
-
డీజే టిల్లు స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులతో అదరగ్గొట్టారు. డీజే టిల్లు సాంగ్‌కు తనదైన శైలిలో స్టెప్పులేస్తూ అలరించారు. మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులతో కలిసి మంత్రి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు, డీజే టిల్లు మూవీ హీరో సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సిద్ధుతో కలిసి మంత్రి మల్లారెడ్డి స్టెప్పలేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. దీంతో మల్లారెడ్డి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: (తెలంగాణ నూతన సీఎస్‌గా శాంతికుమారి) -
టీజే టిల్లు సీక్వెల్ నుంచి క్రేజీ అప్డేట్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన హిట్ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా ‘డీజే టిల్లు స్క్వేర్’ రూపొందనుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి వచ్చే మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. ‘డబుల్ ఫన్.. డబుల్ రొమాన్స్’ అని ట్వీట్ చేశారు సిద్ధు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, కెమెరా: సాయి ప్రకాష్. -
డీజే టిల్లు సీక్వెల్ నుంచి డైరెక్టర్ అవుట్ !.. కారణం ఇదేనా ?
Director Vimal Krishna Leaved From DJ Tillu Sequel: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి అట్లుంటది ప్రేక్షకులతోటి అనేలా చేసింది. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్ధు జొన్నల గడ్డ. ఈ యంగ్ హీరోకు 'డీజే టిల్లు' సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. ఇక 'డీజే టిల్లు' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. అయితే తాజాగా 'డీజే టిల్లు' డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ సీక్వెల్ ప్రారంభమైన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్ధు మధ్య పలు క్రియేటివ్ డిఫరెన్సెస్ చోటు చేసుకున్నాయని వినికిడి. సిద్ధు ప్రవర్తనతో హర్ట్ అయిన విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ సీక్వెల్‌కు అన్ని తానై చూసుకుంటున్నాడట సిద్ధు. విమల్ ప్లేస్‌లో కొత్త దర్శకుడు సైతం వచ్చనట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్, కొత్త డైరెక్టర్ వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. కాగా అటు విమల్ కృష్ణ.. నాగ చైతన్యకు ఒక కథ సిద్ధం చేసినట్లు సమాచారం. చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. -
నా కెరీర్లో తొలిసారి బ్లాక్‌బస్టర్ అనే మాట వింటున్నాను: హీరో
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘డిజె టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది. ‘‘మా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది’’ అని పాత్రికేయుల సమావేశంలో చిత్రబృందం పేర్కొంది. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటిదాకా నా కెరీర్లో నేను బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఈ సినిమాతో విన్నాను’’ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందనుకున్నాం. మా అంచనా నిజమైంది. ఇలాంటి చిత్రాలు విజయం సాధించడంవల్ల ఇంకా కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ‘డిజె టిల్లు’ సీక్వెల్‌ని సిద్ధు నెక్ట్ పిక్చర్‌గా చేస్తున్నాం’’ అన్నారు నాగవంశీ. ‘‘థియేటర్లో ప్రేక్షకుల సందడి చూసి నమ్మలేకపోయాం. డైలాగ్స్‌కి వస్తున్న క్రెడిట్‌ని సిద్ధూకి ఇస్తాను. నాగవంశీగారి నమ్మకం, మా టీమ్ కష్టం ఈ విజయానికి కారణం’’ అన్నారు విమల్ కృష్ణ. -
ఈ టైమ్‌లో ఇలాంటి సినిమాలే అవసరం
‘‘డిజె టిల్లు’ యూత్‌ఫుల్ సినిమానే కానీ అడల్ట్ చిత్రం కాదు. ముద్దు సీన్స్ కూడా అడల్ట్ కిందకు వస్తాయనుకుంటే ఎలా? నేటి తరం అమ్మాయి కోణంలో సాగే చిత్రమిది. టిల్లు అనే అమాయకుణ్ణి రాధిక ఎలా ఆడుకుంటుందనేది వినోదాత్మకంగా ఉంటుంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగవంశీ విలేకరులతో చెప్పిన విశేషాలు... ► ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చూశాక సిద్ధు జొన్నలగడ్డను పిలిచాను. ‘డిజె టిల్లు’ అనే యూత్‌ఫుల్ కథ చెప్పాడు. ఈ కథ వింటున్నంత సేపూ నవ్వుకున్నాను.. సినిమా చూసి ప్రేక్షకులు కూడా ఫుల్‌గా నవ్వుకుంటారు. మేము ఓ కథ ఓకే అనుకున్నాక డైరెక్టర్ త్రివిక్రమ్‌గారికి చెబుతాం. ఆయన కథలో మార్పులు, సలహాలు చెబుతారు. ‘డిజె టిల్లు’ పూర్తయ్యాక కూడా త్రివిక్రమ్‌గారు చెప్పడంతో కొన్ని సన్నివేశాలు మళ్లీ తీశాం. ► కరోనా టైమ్‌లో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మేం నిర్మించిన ‘రంగ్ దే, వరుడు కావలెను’ చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని రప్పించాలంటే ‘డిజె టిల్లు’లాంటి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలే అవసరం. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం మా బ్యానర్లో తీస్తున్న ‘స్వాతిముత్యం, ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు కూడా ఇన్నోవేటివ్ అప్రోచ్‌తో చేస్తున్నవే. ► ‘భీమ్లా నాయక్’ పెద్ద సినిమా కాబట్టి ఏపీలో థియేటర్లలో 100 శాతం సీటింగ్, సెకండ్ షోకి అనుమతి ఉన్నప్పుడే విడుదల చేస్తాం. టిక్కెట్ ధరల విషయం సమస్య కాదు. అన్నీ బాగుంటే ఈ నెల 25నే ‘భీమ్లా నాయక్’ను రిలీజ్ చేస్తాం. -
ఆ యాసలో చేయడం కొత్తగా అనిపించింది: హీరోయిన్
‘‘డిజె టిల్లు’ ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ వంటి వాణిజ్య అంశాలున్నాయి’’ అన్నారు నేహా శెట్టి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ‘ముంగార మళే 2’ చిత్రంలో హీరోయిన్గా చేశాను. తెలుగులో పూరి జగన్నాథ్‌గారు ‘మెహబూబా’ చిత్రంతో తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లోనూ నటించాను. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద సంస్థలో ‘డిజె టిల్లు’ చేసే అవకాశం రావడం నా లక్. ఈ సినిమాలో నిజాయతీగా, ఆత్మవిశ్వాసంతో ఉండే రాధిక అనే అమ్మాయి పాత్ర చేశాను. ఈ మూవీలో తెలంగాణ యాసలో చేయడం కొత్తగా అనిపించింది. కరోనా వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యాం. ‘డిజె టిల్లు’ చూస్తే ఆ ఒత్తిడినంతా మర్చిపోతారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ వస్తుంటాయి. అయితే ఆ విమర్శలను పట్టించుకోను’’ అన్నారు. -
హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్
DJ Tillu Hero Siddhu Jonnalagadda Serious Post On Socila Media: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియాలో ఓ సీరియస్ పోస్ట్ షేర్ చేశాడు. తన తాజా చిత్రం డీజే టిల్లు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చోటు చేసుకున్న సంఘటనపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. మూవీ ఈవెంట్లో హీరోయిన్ పుట్టు మచ్చలపై ఓ జర్నలిస్టు సిద్దును అడిగిన అనుచిత ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీడియా, నెటిజన్లకు సందేశం ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా సిద్ధూ తన పోస్ట్‌లో ‘‘రిసెంట్‌గా నన్ను తీవ్రంగా బాధించిన విషయాన్ని ఈ పోస్ట్ ద్వారా పరిష్కరించాలనుకుంటున్నాను. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. నా కొత్త చిత్రం ‘డీజే టిల్లు’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా చాలా కించపరిచే ప్రశ్న నన్ను అడిగారు. నేను దానికి సమాధానం ఇవ్వను అని స్టేజిపైనే చెప్పాను. అయితే నేను అలా స్పందించడానికి కారణమేంటని చాలామంది నన్ను అడుగుతున్నారు. చాలా ప్రశాంతంగా, కంపోజ్డ్(కంట్రోల్ చేసుకుంటూ) పద్ధతిలో ఆ ప్రశ్నను తిరస్కరించాలనుకున్నాను. నా కోపాన్ని బయటకి చూపించకుండా కంట్రోల్లో ఉండాలనుకున్నా. అంతేకాని దానికి సమాధానం చెప్పి ఆ ప్రశ్నను గౌరవించాలనుకోలేదు’’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ‘నటీనటుల పట్ల కొంతమందికి ఉన్న అభిప్రాయాన్ని కూడా అది తెలియజేస్తుంది. చదవండి: హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు? మండిపడ్డ నేహా శెట్టి యాక్టర్స్ ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు చాలా కష్టపడతారు. నిజానికి చాలా ఎక్కువ కష్టపడతారు. ముఖ్యంగా మహిళలు సెట్లో దాదాపు వంద మంది వ్యక్తుల మధ్య తమ సహనటుడిని ముద్దు పెట్టుకునే సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఒక టెక్నిషియన్ వారి ముఖం వద్ద లైట్ పట్టుకుని ఉన్నప్పుడు అలా నటించడానికి చాలా ధైర్యం కావాలి. నటీనటులందరి తరపున నేను స్వేచ్ఛ తీసుకుని ఇది చెప్తున్నాను. అంత ధైర్యం ఉన్నందుకు మేము గౌరవించబడతాము. మేము కథలు చెబుతాము, వినోదాన్ని అందిస్తాము. మేము చేసే పనిని బట్టి మా నిజ జీవితాలని జడ్జ్ చేస్తారనుకోవడం లేదు’ అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. చదవండి: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను.. అంతేకాదు ఈ పోస్ట్‌కి హంబుల్ అప్పీల్ అంటూ యాక్టర్స్‌ను గౌరవించండి(#respectactors) అనే అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశాడు. ఇలా నటీనటుల పట్ల గౌరవం చూపిస్తూ సిద్ధూ పెట్టిన ఈ పోస్ట్‌కి అతడి ఫ్యాన్స్‌తో, నటీనటులంతా ఫిదా అవుతున్నారు. అంతేగాకు అతడికి మద్దుతుగా వారంతా కామెంట్స్ చేస్తున్నారు. కాగా డిజె టిల్లు ట్రైలర్లో హీరో.. హీరోయిన్ను నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని అడగ్గా ఆమె 16 అని చెప్తుంది. డైలాగ్‌ను గుర్తు చేస్తూ ఓ రిపోర్టర్.. 'ట్రైలర్లో ఆమెకు 16 పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మరి నిజంగా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అని అడిగాడు. దీంతో కంగు తిన్న హీరో సిద్ధు ఈ ప్రశ్నను వదిలేయండి అని బదులిచ్చాడు. A humble appeal #respectactors#DJTillu pic.twitter.com/WbLF9mZ0oM — Siddhu Jonnalagadda (@Siddu_buoy) February 4, 2022 -
'నా పాట విని బన్నీ బట్టలు చింపుకుండు'
‘‘ఈ ఏడాది మా సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి మూడు చిన్న సినిమాలు, ఓ పెద్ద సినిమా (భీమ్లా నాయక్) విడుదల చేస్తాం. ‘డిజె టిల్లు’ యూత్ సినిమా. నాకు బాగా నచ్చిన కథ ఇది. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిజె టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో మాట్లాడుతూ.. బన్నీ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా లాంచ్ అవబోతున్నా.. ఓ కామన్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో కలిసిండు. డీజే టిల్లు సాంగ్ విని బట్టలు చింపేసుకుండు, అరేయ్ టిల్లు ఇసొంటి పాటనే కావాలన్నడు అంటూ హీరోయిన్ను పడగొట్టేందుకు లేనిపోని గొప్పలు చెప్పుకున్నాడు. మొత్తానికి ఈ ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘విమల్‌కృష్ణ, నేను ‘డిజె టిల్లు’ కథ, స్క్రీన్‌ప్లే రాశాం. డైలాగ్స్ నేనే రాశా. త్రివిక్రమ్‌గారు స్క్రిప్ట్ విషయంలో సలహాలిచ్చారు. రచయితగా నా మీద జంధ్యాల, త్రివిక్రమ్‌గార్ల ప్రభావం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు విమల్‌కృష్ణ. నేహా శెట్టి, నటుడు ప్రిన్స్ మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని, సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
అనిరుధ్ గాత్రంతో మరో స్థాయిలో పటాస్ పిల్లా సాంగ్!
"లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల" గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం చార్ట్ బస్టర్లో దూసుకు వెళుతున్న నేపథ్యంలో డీజే టిల్లు సినిమా నుంచి మరో గీతం సోమవారం(జనవరి 24న) విడుదల అయింది. "రాజ రాజ ఐటం రాజ.. రోజ రోజ క్రేజీ రోజ.. పటాస్ పిల్ల పటాస్ పిల్ల" అంటూ మొదలయ్యే ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా, శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చారు. అనిరుధ్ రవిచందర్ అద్భుతంగా ఆలపించారు. గీత రచయిత కిట్టు విస్సా ప్రగడ మాట్లాడుతూ...‘శ్రీ చరణ్ ముందు పల్లవి వరకు ట్యూన్ పంపారు. అది విన్నప్పుడు హుక్ లైన్ దగ్గర ‘పటాసు పిల్లా‘ అనే పదం తట్టింది. అదే మాట దర్శకుడితో పాటూ అందరికీ నచ్చింది. తర్వాత పాట సందర్భం తెలుసుకుని దాని చుట్టూ పాట అల్లుకుంటూ వచ్చాను. పాటలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో విమల్ నాకు చాలా వివరంగా కళ్ళకి కట్టినట్టు రాసి పంపారు. దాని వల్ల కొత్త రకం పోలికలు వాడటం సాధ్యపడింది. నేను శ్రీ చరణ్‌కి దాదాపు ముప్పై పాటల వరకూ రాసి ఉన్నాను. అతనితో పని ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. ఈ కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే పాట మరో స్థాయికి వెళ్తుందని నమ్మకం కలిగింది' అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న డీజే టిల్లు సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా 'సితార ఎంటర్టైన్ మెంట్స్', ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి నిర్మిస్తోంది. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
DJ Tillu: ‘టిల్లు’గాని డీజే పాట విన్నారా?
సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’.అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్త్నున్నారు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో టైటిల్ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ సాగే ఈ పాటని రామ్ మిర్యాల అద్భుతంగా ఆలపించారు. అంతేకాదు శ్రీచరణ్ పాకాలతో కలిసి స్వరాలు సమకూర్చాడు. -
బృందావనంకి ఫోర్ పిల్లర్స్
రచయిత శ్రీధర్ సీపాన దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘బృందావనమది అందరిది’. జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ ఆశీస్సులతో శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి కూతురు (యన్.అర్.ఐ ) నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రంలోని నటీనటుల వివరాలను చిత్రబృందం వెల్లడించింది. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ– ‘‘నా కథకి కొత్తవాళ్లతో సినిమా చేయాలని నిర్వహించిన ఆడిషన్స్‌కి మంచి స్పందన వచ్చింది. నలుగురు ప్రధాన తారాగణం మినహా మిగిలిన పాత్రలకు చాలామంది కొత్తవాళ్లని తీసుకున్నాం. ప్రధాన తారాగణంగా ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు, నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు లగడపాటి విక్రమ్ (రేసుగుర్రం ఫేమ్), సీరత్ కపూర్ (రన్ రాజా రన్ ఫేమ్), థర్టీ ఇయర్స్ పృ«థ్వీ నటిస్తారు. వీరు నలుగురూ నా సినిమాకి మెయిన్ పిల్లర్స్. సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. జనవరి 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘అదుర్స్’ రఘు, బొడ్డ నారాయణ, ‘సత్యం’ రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: సి. రాంప్రసాద్. -
అఘోరి మోషన్ పోస్టర్ ఆవిష్కరణ
తమిళసినిమా: అఘోరి చిత్ర మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం ఆవిష్కరించారు. ఆర్పీ ఫిలింస్ పతా కంపై ఆర్పీ బాలా నిర్మిస్తున్న చిత్రం అఘోరి. ఆర్డీ.రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైమ్‌గోపీ, సిద్దు, వెట్ట్రి, మదన్‌కుమార్, శరత్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. అఘోరి చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కే వైవిధ్యభరిత కథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్నది చాలామార్లు రుజువైందన్నారు. అలాంటి విభిన్న కథా చిత్రంగా అఘోరి ఉంటుందన్నారు. ఆత్మల ఇతివృత్తంతో కూడిన ఫాంటసీ థ్రిల్లర్ కథా చిత్రంగా అఘోరి చిత్రం ఉంటుందన్నారు. ఈ తరహా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయని అన్నారు. అఘోరి చిత్ర కథా కథనాలు సరికొత్తగా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను శుక్రవారం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మైమ్‌గోపీ ఆవిష్కరించారని, ఈ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
అఘోరికి శ్రీకారం!
తమిళసినిమా: అఘోరి చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ ఫైట్‌మాస్టర్ జాగ్వుర్‌తంగం, సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. మలయాళంలో మోహన్‌లాల్ కథానాయకుడుగా నటించిన సూపర్‌హిట్ చిత్రం పులిమురుగన్ను తమిళంలోకి అనువదించి మంచి విజయాన్ని సాధించిన ఆర్పీ.ఫిలింస్ అధినేత ఆర్పి.బాలా నిర్మిస్తున్న చిత్రం అఘోరి. ఈయన కథ, ఛాయాగ్రహణం నెరపుతున్న ఈ చిత్రానికి టీఎస్.రాజ్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ అఘోరి కథ, కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయని చెప్పారు. చిత్ర నిర్మాత ఆర్పీ.బాలా ఈ చిత్రానికి నిపుణులైన సాంకేతిక వర్గాన్ని ఇచ్చారని చెప్పారు. నిర్మాత ఆర్పీ.బాలా తెలుపుతూ అఘోరి చిత్రం తమిళ సినిమాలోనే కాకుండా భారతీయ సినిమాలోనే సరి కొత్త ముద్రవేసుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కారణం కథ, కథనాలు చాలా కొత్తకోణంలో సాగుతాయని అన్నారు. ఇందులో సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్నారని, ఆదవ్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారని తెలిపారు. దీనికి సరవణకుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ప్రాణం తీసిన అకాల వర్షం
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): నగరంలో కురిసిన అకాల వర్షానికి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సుభాష్‌నగర్‌లో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి సుభాషనగర్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఓ ఇంట్లో విద్యుద్ఘాతం సంభవించి సిద్దు(25) అనే యువకుడు మృతి చెందాడు. మృతునికి నెల పాప, ఏడాది వయస్సు ఉన్న బాబు ఉన్నారు. ఇంటి ఆధారం కోల్పోయిన ఆ కుటుంబ తీవ్ర విషాదంలో ఉంది. -
జగమే మాయ
‘జగమే మాయ...’ పేరుతో శ్రీ సాయి తిరుమల ప్రొడక్షన్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. జాహ్నవి కటకం సమర్పణలో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ప్రసాద్ ఉప్పుటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 6న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘కామెడీ, యాక్షన్ సమాహారంతో సాగే సినిమా ఇది. ‘జగమే మాయ’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటలు, సినిమా కూడా అందరి ఆదరణ పొందుతాయనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. శివబాలాజీ, సిద్ధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: షాబీర్ షా, లైన్ ప్రొడ్యూసర్: భీమనేని తిరుపతిరాయుడు.