అఘోరి మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

అఘోరి మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Published Sat, Aug 5 2017 1:46 AM

అఘోరి మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

తమిళసినిమా: అఘోరి చిత్ర మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ శుక్రవారం ఆవిష్కరించారు. ఆర్‌పీ ఫిలింస్‌ పతా కంపై ఆర్‌పీ బాలా నిర్మిస్తున్న చిత్రం అఘోరి. ఆర్‌డీ.రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైమ్‌గోపీ, సిద్దు, వెట్ట్రి, మదన్‌కుమార్, శరత్‌ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. అఘోరి చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ  మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కే వైవిధ్యభరిత కథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్నది చాలామార్లు రుజువైందన్నారు.

అలాంటి విభిన్న కథా చిత్రంగా అఘోరి ఉంటుందన్నారు. ఆత్మల ఇతివృత్తంతో కూడిన ఫాంటసీ థ్రిల్లర్‌ కథా చిత్రంగా అఘోరి చిత్రం ఉంటుందన్నారు. ఈ తరహా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయని అన్నారు. అఘోరి చిత్ర కథా కథనాలు సరికొత్తగా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను శుక్రవారం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మైమ్‌గోపీ ఆవిష్కరించారని, ఈ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement