sarath
-
Sarath Fonseka: శ్రీలంక అధ్యక్ష బరిలో మాజీ ఆర్మీ చీఫ్
కొలంబో: శ్రీలంక అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాజీ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా(73) ప్రకటించారు. అధ్యక్షుడైతే అవినీతిని రూపుమాపి, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17–అక్టోబర్ 16 తేదీల మధ్య దేశంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికల సంఘం ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ ప్రకటించనుంది. 2009లో అప్పటి ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సె సారథ్యంలో చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో ఎలీ్టటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకర్ సహా కేడర్ అంతమైంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నేత అనురా కుమార దిస్సనాయకేలు కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
పతాకధారిగా శరత్ కమల్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరిస్తాడు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల శరత్ ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్నాడు. మహిళల బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ భారత జట్టుకు ‘చెఫ్ డి మిషన్’గా వ్యవహరిస్తుందని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. -
అమరావతిలో ‘ప్రత్తిపాటి’ దోపిడీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణాల్లో మరో భారీ అవినీతి బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట రూ.66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు వెల్లడైంది. ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు కొల్లగొట్టి.. షెల్‌కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఆధారాలతోసహా బట్టబయలైంది. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకొచ్చింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్లు తేటతెల్లమైంది. దీంతో డీఆర్ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఎ), 120 (బి) రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తీగ లాగితే కదిలిన డొంక ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్‌కు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలలో బ్రాంచి కార్యాలయాలున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ డైరెక్టర్‌గా, ఆయన కుమారుడు ప్రత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ, చేసినట్లు గా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతోపాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని కూడా పొందింది. దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీకి డీజీజీఐ రూ.16 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేయాలని ప్రతిపాదించింది. అసలు అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ దృష్టిసారించాయి. ఆ కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో మొత్తం బాగోతం బట్టబయలైంది. షెల్ కంపెనీలను సబ్ కాంట్రాక్టర్లుగా చూపించి రూ.21.93 కోట్లు అవెక్సా కార్పొరేషన్ ముసుగులో ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో ప్రత్తిపాటి కుటుంబం అమరావతిలో కాంట్రాక్డు సంస్థలను బెదిరించి సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండానే అక్రమంగా నిధులు కొల్లగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్ (ప్రస్తుత పేరు జైశ్నవి ఎమినెన్స్) అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టును పొందింది. ఆ కంపెనీ నుంచి రూ.37.39 కోట్ల విలువైన పనులను అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. సీఆర్డీయే పరిధిలో రోడ్లు, వరదనీటి కాలువలు, కల్వర్టులు, సివరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అయితే, ఈ సంస్థ తానిషా ఇన్ఫ్రా, రాలాన్ ప్రోజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా అల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే నాలుగు కంపెనీలకు రూ.21.93 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించింది. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్టుకు ఇచ్చామని చెప్పిన నాలుగు కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చేసినట్టుగా కనికట్టు చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్టు సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలూ పొందలేదు. అవి ఏ పనులూ చేయలేదు. ఆ నాలుగు కంపెనీలూ షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం రూ.21,93,08,317 నిధులను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. రహదారి కాంట్రాక్టుల ముసుగులో రూ.26.25 కోట్లు దోపిడీ అంతటితో అవెక్సా కంపెనీ అక్రమాలు ఆగలేదు. అమరావతిలోని ఉద్దండరాయపురం నుంచి నిడమర్రు వరకు ఎన్ 9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టుకు తీసుకుంది. కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలోకి మళ్లించుకుంది. రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణుల సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టు చేసింది. అందుకోసం క్వాహిష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్డ్ ఫినెక్స్ ఐరన్ – స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఆ విధంగా ఏ పనీ చేయకుండానే వివిధ దశల్లో రూ.26,25,19,393 దోపిడీ చేసింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరిట అక్రమంగా రూ.17.85 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ అవెక్సా కంపెనీ అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టింది. ఏపీ టిడ్కో కింద జి+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది. ఈమేరకు ఆధ్యా ఎంటర్‌ప్రైజస్, మెస్సెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్లు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా రూ.17,85,61,864 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం రూ.66,03,89,574 ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. అవును ...భోగస్ బిల్లులతో నిధులు కొల్లగొట్టాం – అవెక్సా కంపెనీ డైరెక్టర్ కుర్ర జగదీశ్వరరావు ఈ వ్యవహారంపై డీజీజీఐ, ఏపీ డీఆర్ఐ విచారణలో మొత్తం లోగుట్టు బట్టబయలైంది. అవెక్సా కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కుర్ర జగదీశ్ తాము బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నామని అంగీకరించారు. ఈ కుంభకోణానికి ఎలా పాల్పడిందీ ఆయన సవివరంగా వెల్లడించారు. దాంతో అవెక్సా కంపెనీ ముసుగులో ప్రత్తిపాటి కుటుంబం అవినీతి బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైంది. తనయుడి కోసం తండ్రి పుల్లారావు చక్కర్లు విజయవాడ స్పోర్ట్స్/గుణదల (విజయవాడ తూర్పు): అమరావతి పనుల కుంభకోణంలో దొరికిపోయిన ప్రత్తిపాటి శరత్ కోసం అతని తండ్రి, టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పత్త్రిపాటి పుల్లారావు విజయవాడలో చక్కర్లు కొట్టారు. డీఆర్ఐ ఫిర్యాదుపై శరత్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ చేపట్టారు. దీంతో శరత్ జాడ కోసం అతని తండ్రి పుల్లారావు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఇతర టీడీపీ నాయకులను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షణలు చేశారు. ముందుగా గురునానక్ కాలనీలోని ఏసీపీ కార్యాలయానికి, అక్కడ లేకపోవడంతో మాచవరం పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత టాస్‌్కఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం తన అనుచరులను నగరం నలుదిక్కులకు పంపారు. ఆ తరువాత సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. అక్కడా లేకపోవడంతో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో పుల్లారావు, పట్టాభి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులతో కలిసి పోలీసు కమిషనరేట్‌కు చేరుకొని తన కొడుకును చూపించాలంటూ ఆందోళనకు దిగారు. కొద్ది సేపటి తరువాత రూరల్ డీసీపీ కె.శ్రీనివాసరావు వచ్చి ఓ గంటలో న్యాయమూర్తి వద్ద నిందితుడు శరత్‌ను ప్రవేశపెడతామని చెప్పడంతో ఆందోళన విరమించి మాచవరంలోని జడ్జి క్వార్టర్స్‌కు వెళ్లారు. -
విశాఖ కిడ్నాప్ కేసు: లవర్‌కు 40 లక్షలు పంపిన హేమంత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48 గంటలపాటు ఎంపీ కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు నరకం చూపించారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ను చిత్ర హింసలు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. భీమిలి ప్రాంతానికి చెందిన కోలా వెంకట హేమంత్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుసూదనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. చోరీలు చేసే రాజేష్, ఇతర గ్యాంగ్‌తో అక్కడ అతనికి పరిచయం ఏర్పడింది. చిన్న చిన్న చోరీలు చేసే కంటే ఒకేసారి బిగ్‌షాట్‌ను కిడ్నాప్ చేస్తే సెటిల్ అయిపోవచ్చని హేమంత్ వారికి ఆశపెట్టాడు. టార్గెట్ ఎంపీ కుటుంబం బయటకు వెళ్లాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు. హేమంత్‌కుమార్, రాజేష్, సాయి, చిన్న సాయి, గోవర్ధన్, మరో వ్యక్తి కలిసి ఎంపీ కొత్త ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంట్లోకి చొరబడి ఎంపీ కుమారుడు శరత్‌పై దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేశారు. శరత్‌తో ఫోన్ చేయించి సెక్యూరిటీ గార్డును పంపించేశారు. శరత్ ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు. మరుసటి రోజు ఉదయం శరత్‌తో ఫోన్ చేయించి ఒంట్లో బాగోలేదని చెప్పించి, తల్లి జ్యోతిని ఆ ఇంటికి రప్పించారు. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, ఆమెనూ బంధించారు. అనంతరం ఎంపీ ఎంవీవీ స్నేహితుడు జీవీ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతనికి బలవంతంగా ఫోన్ చేయించి రప్పించారు. హేమంత్ రాజేష్‌లు అతడిపై దాడి చేసి.. చేతులు, కాళ్లు కట్టేశారు. కారు డ్రైవర్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫోన్ చేయించారు. రూ.20 కోట్లు ఇస్తావా? లేదా ఇల్లు, స్థలం రాసిస్తావా? అసలు ఎందుకు తమను నిర్బంధించారని, ఏం కావాలో చెబితే ఇస్తామని జీవీ కిడ్నాపర్లకు చెప్పగా.. రూ.100 కోట్లు కావాలి ఇస్తావా? అని హేమంత్ ప్రశ్నించాడు. అంత డబ్బు ఉండదని, తమను వదిలేస్తే రూ.5 కోట్ల వరకు సమకూరుస్తామని చెప్పారు. దానికి హేమంత్ అంగీకరించలేదు. ఎవరికి ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయో వారి పేర్లను హేమంత్కుమారే సూచించి, ఫోన్లు చేయించారు. ఇలా జీవీ రూ.కోటి వరకు సమకూర్చి డ్రైవర్ ద్వారా ఆ డబ్బు తెప్పించారు. వచ్చిన డబ్బులో హేమంత్‌కుమార్, రాజేష్‌లకు 40 శాతం చొప్పున, సాయికి 10 శాతం, ఇతర ఖర్చుల కోసం 10 శాతం పంపకాలు చేసుకున్నారు. శరత్ బ్యాంక్ అకౌంట్లో రూ.65 లక్షలు జీవీ అకౌంటెంట్ ద్వారా విత్‌డ్రా చేయించి తెప్పించుకున్నారు. వచ్చిన డబ్బులో రూ.21 లక్షలు బెయిల్ కోసం రాజేష్ అనే లాయర్‌కు పంపించారు. లవర్‌కు రూ.40 లక్షలు నజరానా హేమంత్‌కుమార్ తన వాటాలో వచ్చిన డబ్బులో రూ.40 లక్షలు తన లవర్ సుబ్బలక్ష్మికి ఇవ్వాలని భావించాడు. అయితే గతంలో చేసిన కిడ్నాప్ వ్యవహారంలో ఇతనితో పాటు సుబ్బలక్ష్మి కూడా జైలుకు వెళ్లింది. ఫలితంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రూ.40 లక్షలు ఇచ్చి మళ్లీ ఆమెకు దగ్గరవ్వాలని భావించాడు. నేరుగా డబ్బులు ఇస్తానంటే అంగీకరించదని జీవీతో ఫోన్ చేయించి.. రెండు గంటల సేపు మాట్లాడి ఒప్పించేలా చేశాడు. జీవీ కారు డ్రైవర్‌ను రప్పించి రూ.40 లక్షలు ఆమెకు అందేలా చేశారు. రెండు రోజుల పాటు కిడ్నాపర్లు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. వారికి పెరుగన్నం పెట్టి, కిడ్నాపర్లు మాత్రం బిర్యానీ తినేవారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ రాజేష్.. వారి చేతులపై కత్తితో కొడుతూ.. దుర్భాషలాడుతూ వారి చేతికి ఉన్న ఉంగరాలను లాక్కున్నాడు. డబ్బు లేదంటే ఎంపీ ఇల్లు, జీవీకి ఉన్న స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని హేమంత్ డిమాండ్ చేశాడు. శరత్‌ను డిక్కిలో కుక్కి.. ఫోన్ చేసినప్పుడు జీవీ పొంతన లేని సమాధానాలతో ఎంపీకి అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే పోలీసులు జీవీ నెంబర్‌కు వరుసగా ఫోన్ చేస్తుండటంతో.. అనుమానం వస్తుందని భావించిన కిడ్నాపర్లు ఫోన్లో మాట్లాడించారు. పోలీసులకు అనుమానం వచ్చినట్లు గ్రహించిన హేమంత్‌కుమార్ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి శరత్ కారులోనే తప్పించుకోవాలని చూసింది. చేతులు, కాళ్లు కట్టేసి శరత్‌ను డిక్కీలో కుక్కారు. హేమంత్ కార్ డ్రైవ్ చేయగా ముందు సీట్లో రాజేష్ ఎక్కాడు. జ్యోతి, జీవీతో పాటు సాయి కూర్చున్నాడు. మధ్యలో వీరు తమ వద్ద ఉంటే ప్రమాదమని భావించిన హేమంత్‌కుమార్.. వారిని ఆనందపురం మండలంలో దించేశాడు. దీంతో జ్యోతి, జీవీలు జాతీయ రహదారి వరకు నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కారు. అనంతరం కారు ఆపి మధ్యలోనే సాయి దిగిపారిపోయాడు. అంతలో పోలీసులు వారి కారును వెంబడించి హేమంత్, రాజేష్‌లను పట్టుకుని.. శరత్‌ను విడిపించిన విషయం తెలిసిందే. ముగ్గురి అరెస్ట్.. రూ.86.6 లక్షలు రికవరీ దొండపర్తి (విశాఖ దక్షిణ): ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనలో ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వాస్తవానికి గురువారమే కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కిడ్నాప్‌లో పాల్గొన్న వారి వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం శుక్రవారం గాజువాకకు చెందిన సాయిని షీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. వీరి ముగ్గురి నుంచి రూ.86.6 లక్షలు రికవరీ చేశారు. ఈ ముగ్గురిని సాయంత్రం కేజీహెచ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, మరో ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
అందుకే నన్ను కొట్టారు: ‘సుఖీభవ’ శరత్
-
ఏడో తరగతి.. ఐటీ ఉద్యోగి
మణికొండ: ఆ విద్యార్థి వారంలో మూడు రోజులు స్కూల్‌కు వెళ్లి పాఠాలు వింటాడు.. మరో మూడు రోజులు సాఫ్ట్వేర్ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తాడు. చిన్నప్పటి నుంచే తల్లి దండ్రులు ప్రోత్సహించడంతో 12 ఏళ్ల వయసులోనే ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెం దిన పి.రాజ్‌కుమార్, ప్రియ క్యాప్‌జెమినీలో ఉద్యోగం చేస్తూ మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలో నివసిస్తున్నారు. వారి కుమారుడు శరత్ స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో ఏడో తర గతి చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రోజూ ల్యాప్ టాప్ల్లో పనిచేయటాన్ని ఆ విద్యార్థి చిన్నప్పటి నుంచి నిశితంగా గమనిస్తూ వస్తున్నాడు. దీంతో ఏడేళ్ల వయసులోనే అతడిలో కోడింగ్, జావా తదితర సాఫ్ట్వేర్లపై ఆసక్తి పెరగ డంతో వాటిని నేర్చుకున్నాడు. అతడిలోని టాలెంట్‌ను గమనించిన తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగిగా పనికి వస్తాడని నిర్ణయించారు. పలు ఐటీ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఇంటర్వ్యూలకు వెళ్లాడు. ఇటీవల మోంటైగ్నే సంస్థలో నెలకు రూ.25 వేల గౌరవ వేతనంతో శరత్‌కు డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కింది. దాంతో పాటుగా కొన్ని రోజులు ఉద్యోగం, కొన్ని రోజులు చదువుకునేందుకు అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు.. 12 ఏళ్ల వయసులో ఏడో తరగతి చదువుతూ డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కించుకున్న శరత్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. శరత్ తల్లిదండ్రులు మంగళవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా శరత్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. -
మేము సైతం అంటున్న యాంకర్లు...
అనాథలకు అన్నం పెట్టడం, పేదలకు సాయం చేయడం, వికలాంగులకు ఊతమివ్వడం, సమాజానికి చేతనైన సేవ చేయడం... ఇవన్నీ చేయాలంటే బోలెడంత డబ్బుండాలి... అది నిజమే కావచ్చు కానీ సేవ చేయాలన్న దృఢ సంకల్పం, ఆ సంకల్పాన్ని నిలబెట్టుకోవాలన్న సహృదయం ఉంటే చాలు... ఆ సేవను చూసి తోటివాళ్లు ముందుకు వస్తారని నిరూపిస్తున్నాడు శరత్.బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్పూర్లో నివసించే శరత్‌కుమార్ కొండగడుపులో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆర్థికంగా అంత బలంగా లేకపోయినా, ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే తపన బలంగా ఉండేది. ఒక బాలికను దత్తత తీసుకుని... తన గల్లీలో ఉండే ఇంటికి పెద్ద దిక్కు అయిన ఓ బాలిక తండ్రి 2011లో చనిపోయాడు. ఇది చూసిన శరత్ ఆ బాలికను దత్తత తీసుకుని స్కూల్లో చేర్పించాడు. ఆమె చదువుకు అయ్యే ఖర్చు తానే భరించాడు. ఆ బాలిక దత్తతతో మొదలైన తన ప్రస్థానం ఇంకెందరికో సాయపడేలా సాగింది. ఇలా సాగిపోతున్న తనకు ఒక ఆలోచన వచ్చింది. ‘నాలాగా ఆలోచించే వాళ్లను ఒక బృందంగా చేసుకుని నేనెందుకు ఒక ఎన్జీఓను ప్రారంభించకూడదు?’అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఒక ఎన్జీఓను నడపడం అంత సులువేమీ కాదని శరత్‌కు తెలుసు కాని ఒక సంవత్సరం పాటు దానిపై కసరత్తు చేసి నిస్వార్థంగా ఎన్జీఓను ఎలా నడపాలనే దానిపై అవగాహన పెంచుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతితో ‘ది సహృదయ్ స్వచ్ఛంద సంస్థ’ ను ప్రారంభించాడు. సాక్షి దినపత్రికలో వచ్చిన ఓ కథనంతో మొదలైంది... ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిపై సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. రెండుకిడ్నీలు ఫెయిలైన ఇమ్రాన్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సకు అయ్యే ఖర్చు కోసం దాతల సాయం కావాలన్న ఆ కథనాన్ని చదివిన శరత్ వెంటనే ఆ పేపర్ క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఇమ్రాన్ తల్లిదండ్రులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే మందుల కోసం తన వంతుగా రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించాడు. సేవాభావం గల తన స్నేహితుల సాయంతో మరికొంత సాయం చేశాడు. అది తన మనసుకెంతో తృప్తిని ఇవ్వడంతో వైద్యులతో మాట్లాడి చికిత్స చేస్తే బతికే అవకాశాలున్న రోగులకు దాతల నుంచి సాయం అందేలా చూడటం ప్రారంభించాడు. శరత్‌తోపాటు తన బృందంలోని సభ్యులు వివిధ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే స్థోమత లేని రోగులకు సాయం చేయడం మొదలు పెట్టాడు. శరత్ బృందానికి కేటీఆర్ ఏ సాయం కావాలన్నా చేస్తా అని హామీ ఇవ్వడంతో ఆయన ద్వారా ఎంతోమందికి సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు కేటీఆర్ సాయంతో 26 మంది ప్రాణాలను కాపాడినట్లు శరత్ తెలిపారు. కేటీఆర్ తమ ఫౌండేషన్‌కు ఎంతో అండగా నిలిచారని పేర్కొన్నారు. ఫోన్ చేస్తే రక్తం దానం... రోగులకు రక్తం కావాలని ఫలానా గ్రూప్ రక్తం కావాలని ఈ ఫౌండేషన్‌ను సంప్రదించే వాళ్లు. ఇది దృష్టిలో పెట్టుకుని ఫౌండేషన్ వలంటీర్ల బ్లడ్ గ్రూప్ వివరాలను సేకరించి పొందుపరిచారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో వలంటీర్లు రోగుల వివరాలు తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. అంతేకాకుండా బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వలంటీర్లు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం. హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు విస్తరణ... 2017లో శరత్ స్థాపించిన ‘ది సహృదయ్ ఫౌండేషన్’ 23 మంది వలంటీర్లతో హైదరాబాద్‌లో తమ సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలలో తమ సేవలను అందిస్తున్నారు. మరింత మందికి సేవలందించాలనే ఉద్దేశంతో ఆ తర్వాత తమిళ్నాడు, కర్నాటక, యూపీ, ఎంపీ, ఢిల్లీ, అస్సాం, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాలలో సహృదయ ఫౌండేషన్ బృందాలు పని చేస్తున్నాయి. విదేశాలలోనూ ఫౌండేషన్ బృందాలు... యూఎస్ఏ, రష్యా, ఆస్ట్రేలియా, మలేసియా, ఇండోనేసియా, ఫిలిఫైన్స్, ఇటలీ, ఉక్రెయిన్ వంటి దేశాలలో తమ బృందాలు పని చేస్తున్నాయని శరత్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5000మంది వలంటీర్లు ఉన్నారని పేర్కొన్నారు. మేము సైతం అంటున్న యాంకర్లు... శరత్ చేస్తున్న సేవల గురించి తెలిసిన యాంకర్ ప్రదీప్, విష్ణుప్రియ, సుడిగాలి సుధీర్ తల్లి కూడా స్వచ్ఛందంగా తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు.– సచిన్ విశ్వకర్మ, సాక్షి, హైదరాబాద్ -
'సీత రాముని కోసం' మూవీ రివ్యూ
టైటిల్ : సీత రాముని కోసం జానర్ : ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ తారాగణం : శరత్ శ్రీరంగం, అనిల్ గోపిరెడ్డి, కారుణ్య చౌదరి సంగీతం, దర్శకత్వం : అనిల్ గోపిరెడ్డి నిర్మాత : శిల్పా శ్రీరంగం తెలుగు తెర మీద సక్సెస్ ఫార్ములాగా మారిన హర్రర్ సినిమాల హవా ఇటీవల కాస్త తగ్గింది. అయితే ఇప్పటికీ ఆ జానర్ సినిమాలకు మంచి ఆదరణ లబిస్తున్న నేపథ్యంలో ఈ శుక్రవారం హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సీత రాముని కోసం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెగ్యులర్ హర్రర్ సినిమాల మాదిరిగా కేవలం భయం సస్పెన్స్ మాత్రమే కాకుండా ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ తో తెరకెక్కిన సీత రాముని కోసం ప్రేక్షకులను ఆకట్టుకుందా..? కథ : పారా సైకాలజిస్ట్ అయిన విక్రాంత్ (శరత్ శ్రీరంగం) అమెరికా నుంచి ఇండియా వస్తాడు. తన అక్కకు పుట్టబోయే బిడ్డ కోసం విక్రాంత్ ఇక్కడ ఓ విల్లా కొంటాడు. అయితే ఆ విల్లాలో ఏదో సమస్య ఉందని తెలియటంతో తానే స్వయంగా సమస్యను పరిష్కరించాలనుకుంటాడు. పారా సైకాలజిస్ట్ గా ఆత్మల సమస్యలు తెలుసుకోవటంలో అనుభవం ఉన్న విక్రాంత్ తాను కొన్న అంజలి నిలయంలో ఓ చిన్న పాప ఆత్మ ఉందని తెలుసుకుంటాడు. అయితే ఆ పాపతో పాటు మరో ఆత్మ కూడా ఉండి ఉంటుందని విక్రాంత్ అనుమానం. అదే సమయంలో విల్లాలోని ఆత్మ విక్రాంత్ కు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది. (సాక్షి రివ్యూస్) విక్రాంత్ కూడా విల్లా తాను కొనటానికి ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి పాత ఓనర్ రామ్ (అనిల్ గోపిరెడ్డి)ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అసలు విల్లాలో ఉన్న ఆ ఆత్మలు ఎవరివీ..? విక్రాంత్ తో ఆ ఆత్మలు ఏం చెప్పాలనుకున్నాయి..? పాత ఓనర్ రామ్ కి ఆ ఆత్మలకు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : రెగ్యులర్ హర్రర్ జానర్ కు భిన్నంగా ఎమోషనల్ కథను ఎంచుకున్న అనిలో గోపిరెడ్డి, అనుకున్నట్టుగా కథను తెర మీదకు తీసుకురావటంలో సక్సెస్ సాధించాడు. ఫస్ట్ హాఫ్ థ్రిల్లర్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను ఎమోషనల్ డ్రామాగా రూపొందించాడు. అయితే కథలో వేగం తగ్గటం కాస్త ఇబ్బంది పెడుతుంది. దర్శకుడిగా పరవాలేదనిపించిన అనిల్ సంగీత దర్శకుడి మంచి విజయం సాదించాడు. ముఖ్యంగా లాలీ లాలీ పాట థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా ప్రేక్షకులను వెంటాడుతుంది. (సాక్షి రివ్యూస్) నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అయితే కీలక పాత్రలో తానే నటించిన అనిల్ నటుడిగా నిరాశపరిచాడు. అనిల్ నటించిన రామ్ పాత్రకు అనుభవం ఉన్న నటుడైతే బాగుండనిపిస్తుంది. హీరోగా శరత్ శ్రీరంగం నటన బాగుంది. శరత్ లుక్, బాడీ లాంగ్వేజ్ విక్రాంత్ పాత్రకు సరిగ్గా సరిపోయాయి. సీత పాత్రలో కారుణ్య చౌదరి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. ప్లస్ పాయింట్స్ : కథ సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అఘోరి మోషన్ పోస్టర్ ఆవిష్కరణ
తమిళసినిమా: అఘోరి చిత్ర మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం ఆవిష్కరించారు. ఆర్పీ ఫిలింస్ పతా కంపై ఆర్పీ బాలా నిర్మిస్తున్న చిత్రం అఘోరి. ఆర్డీ.రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైమ్‌గోపీ, సిద్దు, వెట్ట్రి, మదన్‌కుమార్, శరత్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. అఘోరి చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కే వైవిధ్యభరిత కథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్నది చాలామార్లు రుజువైందన్నారు. అలాంటి విభిన్న కథా చిత్రంగా అఘోరి ఉంటుందన్నారు. ఆత్మల ఇతివృత్తంతో కూడిన ఫాంటసీ థ్రిల్లర్ కథా చిత్రంగా అఘోరి చిత్రం ఉంటుందన్నారు. ఈ తరహా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయని అన్నారు. అఘోరి చిత్ర కథా కథనాలు సరికొత్తగా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను శుక్రవారం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మైమ్‌గోపీ ఆవిష్కరించారని, ఈ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
కబడ్డీ పోటీకి క్రికెట్ జట్టు
కబడ్డీ పోటీల్లో గెలవడానికి సిద్ధమైన క్రికెట్ టీమ్.కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ. ఇలాంటి విభిన్న కథాంశంతో తెరకెక్కితున్న చిత్రం ధోని కబడ్డీ కుళు.మనిదం తిరైక్కళం పతాకంపై ఎస్.నందన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కే.మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏ.వెంకటేశ్ శిష్యుడు పి.అయ్యప్పన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బుల్లితెరలో మైడియర్ భూతం అనే సీరియల్లో బాల నటుడిగా నటించిన అభిలాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. అరియన్ అనే నటి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో టీకడై అనే ముఖ్య పాత్రలో సీజీ.ప్రభాకరన్ నటిస్తుండగా ఇతర పాత్రల్లో కాంత, నవీన్, శంకర్, శక్తివేల్ మురుగన్, తెనాలి, ప్రభాకర్, పీటర్, సుజన్ సౌందర్‌రాజన్, ఏఆర్.పుగళ్కుమార్వేల్, శరత్, విజయ్గౌతమ్ నటిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక గ్రామంలో హీరో మిత్ర బృందం క్రికెట్ క్రీడే శ్వాసగా ఆడుతుంటారన్నారు.అలాంటిది ఒక సమయంలో ఆ గ్రామానికి అనూహ్యంగా ఒక సమస్య వచ్చి పడుతుందన్నారు. దాన్ని పరిష్కరించడానికి డబ్బు అవసరం అవుతుందని తెలిపారు. అరుుతే అదే సమయంలో పక్క గ్రామంలో కబడ్డీ పోటీలు జరుగుతుంటాయని, ఈ క్రికెట్ టీమ్ తమ గ్రామ సమస్యను తీర్చడానికి పక్క ఊరిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకంటారన్నారు.అయితే ఆ పోటీల్లో గెలిచి నగదు బహుమతి పొందారా? తమ గ్రామ సమస్యను పరిష్కరించుకున్నారా? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన జనరంజక కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్ర దోని కబడ్డీ కుళు అని తెలిపారు. ఇందులో కబడ్డీ సన్నివేశాలను మాత్రమే 20 రోజులు చిత్రీకరించినట్లు, అందుకు హీరో మిత్ర బృందం నెల రోజుల పాటు శిక్షణ పొందినట్లు తెలిపారు.చిత్ర షూటింగ్ పూర్తి అయిందని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు దర్శకుడు తెలిపారు. -
జలాశయంలో మునిగి యువకుడి మృతి
వర్ని: మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల జలపాతంలో మునిగి మండలంలోని సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. బంధువుల రోదనల మధ్య సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల కథనం ప్రకారం.. సత్యనారాయణపురం గ్రామానికి చెందిన భీష్మ, గోవిందకుమారి దంపతులకు కూతురు కీర్తి, కుమారుడు శరత్‌కుమార్ (21) ఉన్నారు. చిన్ననాటి చదువులో రాణించిన శరత్ ఐఐటీలో 57వ ర్యాంకు సాధించాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని పుణెలోని ప్రముఖ కంపెనీలో గత జూన్‌లో ఇంజినీర్‌గా చేరాడు. కీర్తి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇటీవలే అమెరికా వెళ్లింది. శనివారం సెలవు కావడంతో పుణెకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లునావాల పావని దరవత్ జలాశయం చూడడానికి కలిసి స్నేహితులతో కలిసి వెళ్లాడు. ముగ్గురు స్నేహితులు ఒడ్డున ఉండగా, మరో ఇద్దరితో కలిసి నీటిలోకి దిగిన శరత్ మునిగిపోయాడు. స్నేహితుల సమాచారంతో రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. స్వగ్రామమైన సత్యనారాయణపురంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. చేతికొచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వీధికుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు
హైదరాబాద్‌సిటీ: వీధికుక్కను చంపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఎస్ఐ జయన్న తెలిపిన వివరాల ప్రకారం..బర్కత్‌పురా భూమన్న లేన్‌లో ఇందిరాభవన్ అపార్ట్మెంట్ వాచ్‌మన్ శరత్(35) తన పిల్లల్ని తీసుకుని బయటకు రాగానే రోడ్డుపైన ఉన్న ఓ వీధికుక్క పిల్లల్ని చూసి మొరగడం ప్రారంభించింది. కుక్క కరస్తుందనే భయంతో వాచ్‌మన్ కుక్కను కొట్టాడు. దీంతో ఆ కుక్క చనిపోయింది. హైకోర్టు అడ్వోకేట్ శ్రేయ పరోపకారి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
శంషాబాద్ మండలం తొండు పల్లి వద్ద బెంగళూరు జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వెనక నుంచి టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. మృతుడు మేడ్చల్‌లోని రాఘవేంద్రస్వామి ఆలయ పూజారి శరత్(25)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడు అదృశ్యం
కుత్బుల్లాపూర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జయరామ్‌నగర్ కు చెందిన సోమయ్య కుమారుడు శరత్(16) సోమవారం సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టు పక్కల, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం బాలుడు తండ్రి సోమయ్య పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాళ్లు స్మగ్లర్లు
కేంద్రం కొత్త బాణి కోర్టుకు నివేదిక జాలర్లలో ఆగ్రహం ఖండించిన వైగో, శరత్ కాల్పులకు రెడీ : శ్రీలంక మంత్రి ‘‘వాళ్లు స్మగ్లర్లు.. అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండడంతో అరెస్టు అవుతున్నారు. భారత సరిహద్దుల్లోకి వచ్చే ఏ ఒక్కర్నీ శ్రీలంక నావికాదళం అరెస్టు చేయలేదు’’. అంటూ తమిళ జాలర్లకు వ్యతిరేకంగా కేంద్రం కొత్త బాణి అందుకుంది. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ఇందుకు తగ్గ నివేదికను సమర్పించి ఉండడం వెలుగులోకి రావడంతో జాలర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, చెన్నై:తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంధీలుగా పట్టుకెళ్లడం, విడుదల చేయడం, పడవల్ని స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు కడలిలో భద్రత కల్పించాలంటూ బుధవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ నేతృత్వంలో తమిళ జాలర్ల బృందం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయింది. తాను ఉన్నానంటూ ఆమె ఇచ్చిన భరోసాతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం జాలర్ల సంఘాల ప్రతినిధుల్లో నెలకొంది. అదే సమయంలో జాలర్లల ఆశలపై నీళ్లు చల్లే విధంగా చెన్నైకు వచ్చిన శ్రీలంక మంత్రి స్వామినాథన్ చేసిన వ్యాఖ్యలు విస్మయంలో పడేశాయి. మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సరిహద్దులు దాటిన పక్షంలో తుపాకులతో కాల్చే అధికారం తమకు ఉందని స్పష్టం చేశారు. ‘మీ ఇంట్లోకి హద్దులు మీరి ఎవరైనా వ్యవహరిస్తే అడ్డుకోరా..’ అదే తాము చేస్తున్నాం అని సమాధానం ఇవ్వడం జాలర్లలో మరింత ఆందోళన రేకెత్తించేలా చేస్తున్నది. అలాగే, జాలర్లకు భద్రత అన్నది తాము కల్పించాల్సిన విషయం కాదు అని, అది భారత ప్రభుత్వం చేతిలో ఉందని వ్యాఖ్యానించడం బట్టి చూస్తే, ఏ మేరకు కేంద్రానికి తమిళ జాలర్లపై చిత్తశుద్ధి ఉన్నదో స్పష్టం అవుతోంది. ఈ సమయంలో పుండు మీద కారం చల్లినట్టుగా కేంద్రం వ్యవహరించిన నక్క చిత్తుల వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలోని జాలర్లు అగ్గి మీద బుగ్గిలా మండి పడుతున్నారు. వాళ్లు స్మగ్లర్లు : ఓ వైపు తమను కలిసిన జాలర్లకు భరోసా ఇచ్చి పంపిన కేంద్రం మరో వైపు భారత నావికాదళం ద్వారా స్మగ్లర్లుగా చిత్రీకరించే పనిలో పడటం రాజకీయ పక్షాలను , జాలర్లను జీర్ణించుకోలేకుండా చేస్తున్నది. జాలర్ల భద్రతకు సంబంధించిన పిటిషన్ విచారణ మదురై ధర్మాసనంలో జరుగుతూ వస్తున్నది. మంగళవారం పిటిషన్ విచారణ సమయంలో భారత నావికాదళం తరపున వివరణతో కూడిన ఓ నివేదికను ధర్మాసనంకు సమర్పించి ఉన్నారు. ఇందులో పేర్కొన్న అంశాలు వెలుగులోకి రావడంతో జాలర్లు తీవ్ర ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జాలర్లను స్మగ్లర్లుగా చిత్రీకరించి ఉండటం గమనించాల్సిన విషయం. మాదక ద్రవ్యాల్ని అక్రమంగా తరలిస్తుండడంతోనే శ్రీలంక నావికాదళం తరచూ అరెస్టులు చేస్తున్నదని జాలర్లను ఉద్దేశించి ఆ నివేదికలో వివరించి ఉన్నారు. అలాగే, నిషేధిత వలల్ని జాలర్లు ఉపయోగిస్తున్నారని, సరిహద్దులు దాటి పదే పదే వెళ్లడం వల్లే దేశ భద్రత నిమిత్తం శ్రీలంక నావికాదళం ఇప్పటి వరకు 937 కేసులను జాలర్లపై నమోదు చేసి ఉన్నదని పేర్కొన్నారు. ఇక , చెప్పాలంటే, భారత సరిహద్దుల్లోకి వచ్చి ఎవర్ని అరెస్టు చేయలేదని, అలా అరెస్టు చేసినట్టుగా తమకు ఇంత వరకు ఏ ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని స్పష్టం చేయడం గమనించాల్సిన విషయం. శ్రీలంక తీరంలో చేపలు అధికంగా ఉండటంతో సరిహద్దులు దాటే వెళ్తున్నారని పేర్కొన బడి ఉంది. అలాగే, జాలర్లను కట్టడి చేయడంలో , భద్రత కల్పించడంలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం బట్టి చూస్తే, కేంద్రం ఆడుతున్న కపట నాటకాలు మరో మారు స్పష్టం అవుతోన్నది. ఈ నివేదికలోని అంశాలు వెలుగులోకి రావడంతో ఎండీఎంకే నేత వైగో, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాలర్లకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. ప్రధానంగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారని పేర్కొంటూ స్మగ్లర్లుగా చిత్రీకరించడాన్ని ఖండించారు. ఇదే, విషయాన్ని పరిగణలోకి తీసుకున్న జాలర్ల సంఘాలు కేంద్రం మీద గుర్రుగా ఉన్నాయి. -
అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు
సంగారెడ్డి రూరల్: అర్హులైన పేదలందరికి ఆహారభద్రత కార్డులను అందజేస్తామని జేసీ డాక్టర్ ఎ.శరత్ పేర్కొన్నారు. మండలంలోని కవలంపేటలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పేదలందరికి ఆహారభద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో ఒక్కొక్కరికి నాలుగు కిలోల బియ్యం చొప్పున, 20 కిలోలకు మించకుండా ఇచ్చేవారన్నారు. ఆహార భద్రత కార్డుల్లో పేర్లు ఉన్న వారందరికి పరిమితి లేకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తామన్నారు. గ్రామాల్లో సభలు నిర్వహించి ఆహార భద్రత కార్డులు మంజూరైన వారి పేర్లను అధికారులు చదివి వినిపిస్తారన్నారు. కార్డులు అందనివారు మళ్లీ దరఖాస్తుకు చేసుకుంటే అధికారులు పరిశీలించి మంజూరు చేస్తారన్నారు. జిల్లాలో ఆహారభద్రత కార్డుల కోసం 8 లక్షల 22 వేల దరఖాస్తులు రాగా వాటిల్లో 7లక్షల 2వేల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కొత్తగా మంజూరైన ఆహారభద్రత కార్డులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముద్ర ఉంటుందన్నారు. ఈ నెల 21 లోగా తహాశీల్దార్లు గ్రామసభలు నిర్వహించి తుది జాబితాను రూపొందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి తహాశీల్దార్ గోవర్దన్, ఈఓపీఆర్డీ సంధ్య పాల్గొన్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసి కార్డులివ్వాలి సంగారెడ్డి అర్బన్: ఆధార్‌తో అనుసంధానం చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహరభద్రత కార్డులు అందజేయాలని జేసీ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చిహ్నంతో ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తామని, ఈ నెల 26 లోగా ఆహార భద్రత కార్డుల డేటా ఎంట్రీ పూర్తి చేసి, జనవరి మొదటి వారంలో రేషన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. డేటా ఎంట్రీ చేసే సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని తహాశీల్దార్లకు సూచించారు. ఆహారభద్రత కార్డుల పరిశీలన పూర్తయినందున ఆ వివరాలను గ్రామపంచాయతీ వార్డుల వారీగా నిర్దేశించిన 22 కాలమ్‌లలో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 17 నుంచి 21 వరకు గ్రామసభలు జరుగుతున్నందున, గ్రామసభల్లో ఆహార భద్రత కార్డులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించాలన్నారు. ఆహర భద్రత కార్డులకు సంబంధించి ప్రతి మండల కేంద్రంలో గ్రివెన్స్ సెల్ ఏర్పాటుచేసి వచ్చే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. డ్రాప్ట్ బాక్స్‌లను ఏర్పాటుచేసి ప్రతి రోజు బాక్స్‌ను తెరచి అందులో ఉన్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ నెల 22న తహాశీల్దార్లు చౌకధరల దుకాణాల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని, డీలర్లతో ఈ నెల 23న రేషన్‌కు సంబంధించిన డీడీ బ్యాంక్‌లో చెల్లించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా సరఫరాల అధికారి ఏసురత్నం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘కోవలెంట్’పై జనం కన్నెర్ర
‘కోవలెంట్’ పరిశ్రమ జల, వాయు కాలుష్యంతో ఇప్పటికే చస్తూ బతుకున్నామని, ఇపుడు పరిశ్రమను విస్తరిస్తే గ్రామం శ్మశానమవుతుందని గుండ్లమాచునూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గురువారం హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామ పరిధిలోని కోవలెంట్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-1 పరిశ్రమను విస్తరించేందుకు గాను ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ అధ్యక్షతన జరిగిన సభలో జనమంతా ‘కోవలెంట్’ పరిశ్రమ యాజమాన్యంపై నిప్పులు చెరిగారు. కాలుష్యంతో తమను కబలిస్తోన్న పరిశ్రమ విస్తరణను తాము ఒప్పుకోమంటూ కరాఖండీగా తేల్చిచెప్పారు. నర్సాపూర్/ హత్నూర: ‘కోవలెంట్’ పరిశ్రమ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. స్థానికులంతా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోవలెంట్ పరిశ్రమ హఠావో..గుండ్లమాచునూర్ బచావో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న కంపెనీని విస్తరించవద్దని గ్రామ సర్పంచ్ మన్నె ఈశ్వరమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు పల్లెజయశ్రీతోపాటు పలువురు వార్డు సభ్యులు జాయింట్ కలెక్టర్ శరత్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీగా వచ్చిన వారు కంపెనీ విస్తరించకూడదని పంచాయతీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారని జేసీకి వెళ్లడించారు. అంతేకాకుండా తీర్మాన ప్రతిని జేసీకి అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు జయశ్రీ మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పరిశ్రమల కోసం జనం ప్రాణాలను ఫణంగా పెట్టలేమన్నారు. కోవలెంట్ పరిశ్రమ వెదజల్లే కాలుష్యంతో ఇప్పటికే జనమంతా అల్లాడిపోతున్నారని, ఇపుడు కంపెనీని విస్తరిస్తే స్థానికుల బతుకులు ఆగమవుతాయన్నారు. కాలుష్యంతో గుండ్లమాచునూర్‌లో చాలా మంది పురుషులు చనిపోవడంతో మహిళలు యుక్త వయస్సులోనే వితంతువులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్పనూర్, గుండ్లమాచునూర్, బోర్పట్ల గ్రామాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలుష్యాన్ని అదుపు చేయాలని ఆమె సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఈ కంపెనీని విస్తరణను వెంటనే ఆపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం గుండ్లమాచునూర్ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, కోవలెంట్ పరిశ్రమ నుంచి వస్తున్న వివిధ రకాల కాలుష్య కారకాలతో తమ గ్రామంలోని మహిళలకు గర్భ స్రావాలు అవుతున్నాయని, అందువల్ల కంపెనీని విస్తరించవద్దని జేసీకి వినతిపత్రం అందజేశారు. యువజన సంఘాల నాయకుడు బద్రేశ్ మాట్లాడుతూ, కోవలెంట్ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తాము చస్తూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ కాలుష్యంతో గాలి, నీరు కలుషితమై రోగాలబారిన పడుతున్నామన్నారు. కాలుష్యం కారణంగా పంట భూములన్నీ బీళ్లుగా మారాయన్నారు. పల్పనూర్ సర్పంచ్ బంటు శ్రీనివాస్ మాట్లాడుతూ, పల్పనూర్ గ్రామం చుట్టూ ఉన్న కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యంతో తమ గ్రామ పరిధిలోని భూములలో గడ్డి మొలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామ పరిధిలో కంపెనీలు లేకపోయినా, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కంపెనీల నుంచి వెలువడే కాలుష్యంతో తమ గ్రామానికి చెందిన వారంతా అనారోగ్యానికి గురవుతున్నారని, ఆయా కంపెనీల నుంచి వచ్చే కాలుష్యాన్ని అదుపు చేయాలని అధికారులను కోరారు. అనంతరం పటాన్‌చెరుకు చెందిన పర్యావరణ ప్రేమికుడు చిదంబరం మాట్లాడుతూ, రసాయన పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో రాబోయే తరాలకు విపత్తేనని ఆందోళన వ్యక్తం చేశాడు. తాను పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యానికి వ్యతిరేకమన్నారు. గుండ్లమాచనూర్ మాజీ సర్పంచ్ న ర్సింహ్మ, గ్రీన్కాప్ సొసైటీ అధ్యక్షుడు సైదిరెడ్డి మాట్లాడుతూ, కంపెనీల యాజమాన్యాలు లాభాలనే చూస్తూ, ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. గ్రామాల్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కంపెనీ విస్తరణ ప్రజాభిప్రాయం ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. కాలుష్య వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు యాదగిరి, బీఎస్పీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి శాంతకుమార్‌లు మాట్లాడుతూ, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను సారవంతమైన భూముల్లో ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కోవలెంట్ పరిశ్రమకు అధికారులు మద్దతు తెలుపుతున్నారని రిపబ్లికన్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మొగులయ్య ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నగేష్, హత్నూర తహశీల్దార్ ప్రతాప్‌రెడ్డి, గ్రామానికి చెందిన కృష్ణ, సాయిలు,హెస్సేన్, నగేష్, శంకర్‌రెడ్డి, గౌసోద్దీన్, సర్దార్, జితేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొని కంపెనీని విస్తరించవద్దని కోరారు. భారీ పోలీసు బందోబస్తు గుండ్ల మాచునూర్ గ్రామ శివారులో ఉన్న కోవలెంట్ లేబరేటరీస్ పరిశ్రమ విస్తరణ కోసం గురువారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలతో పాటు వందలాది మంది కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసు దళాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి గ్రామాల్లో సైతం ముందస్తుగా పోలీసులను మోహరించడంతోపాటు సభాస్థలి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు పహార ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే జేసీ శరత్ కల్పించుకుని స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశ వేదిక వద్దకు ప్రజాప్రతినిధులను పంపాలని సూచించడంతో పోలీసులు వారిని వదిలారు. -
దళితుల భూములు అమ్మినా, కొన్నా నేరమే
కొండపాక: నిరుపేదలైన దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసే భూములు అమ్మినా, కొన్నా చట్టరీత్యా నేరమని జేసీ శరత్ హెచ్చరించారు. కొండపాక మండలం బందారం గ్రామంలో దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకం కింద కొనుగోలు చేయనున్న భూములను ఆయన సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. 15 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న 44 ఎకరాల స్థలంలో కంప చెట్ల తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూములను సాగు చేసుకొని బతుకులు బాగుచేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు బోర్లు తవ్వి, కరెంట్ సరఫరా చేస్తామన్నారు. సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, ఎరువులు, విత్తనాలు అందజేస్తామన్నారు. సాగు యోగ్యమైన సాగు భూమినే దళితులకు పంపిణీ చేస్తామని శరత్ పేర్కొన్నారు. పంపిణీ కోసం కొనుగోలు చేయనున్న భూమిపై లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారా లేదా అని ఆయన ప్రశ్నించారు. భూమిని పంపిణీ చేయడానికి ముందే ముళ్లపొదలు తొలగించి ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతుల పద్మానరేందర్, తహశీల్దార్ పరమేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య, ఎగుర్ల వెంకటేశం, గొట్టె ఐలయ్య, ఆర్ఐ నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
దళితులకు సాగు భూమి పంపిణీ
కొండపాక: నిరుపేదలైన దళితులకు వ్యవసాయ యోగ్యమైన సాగుభూమిని పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీలో భాగంగా ఆయన ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి కొండపాక మండలం బందారంలోని భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. భూముల ధరలపై నేతలను, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పంపిణీ కోసం కొనుగోలు చేయనున్న భూమి సారవంతైమైనదేనా, లబ్ధిదారులు సం తృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించారు. భూ మి పంపిణీ చేయడానికి ముందే ముళ్లపొదలను తొలగించి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతుల పద్మానరేందర్, తహశీల్దార్ పరమేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాగల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకే మద్దతు
శరత్: మీరంతా రైతులేనా? కమీషన్ ఏజెంట్లు కూడా ఉన్నారా? రైతులు: అంతా రైతులమే సార్. శరత్: మీ పేర్లు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? రైతులు: నాపేరు నర్సింహులు సార్... నా పేరు శేషారెడ్డి.. మాది యార్రారం, నా పేరు మానయ్య, మా ఊరు కంసానిపల్లి, నా పేరు జోగిరెడ్డి.. నాది కూడా రాంసానిపల్లి సారు, నా పేరు మాణిక్‌రెడ్డి..కంసానిపల్లి మాజీ సర్పంచ్‌ను సార్....నా పేరు సత్తయ్య, నా పేరు యాదయ్య సార్. శరత్: ఎందుకు దిగులు పడుతున్నారు ? మీకున్న సమస్యలేమిటీ? నర్సింహులు: సార్, మక్కలు గింతమంచిగున్నయ్( మొక్కజొన్నలు చూపిస్తూ) రేటు మాత్రం ఇస్తలేరు శరత్: ఏమైంది... నిబంధనల ప్రకారం ఇవ్వటం లేదా? తూకంలో మోసం చేస్తున్నారా? నర్సింహులు: ఏం పాడైందో.. ఏమో..! సారు, ఏందో గేడింగ్‌లు అంటున్నరు..ఇసువంటి గేడింగులు ఎప్పుడూ లేకుండే. శరత్: గ్రేడింగ్ గురించి మీకు తెలియదా? రైతులు : గ్రేడింగ్‌లు ఎప్పుడూ లేకుండే సార్( ముక్తకంఠంతో) శరత్ : ఏం జోగిరెడ్డి నీకు కూడా తెలియదా? జోగిరెడ్డ్డి: తెల్వదు సార్.. శరత్: చిన్నసైజు గింజలు ఉన్న మక్కలు వరూ కొనటం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. రైతు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ గ్రేడింగ్ విధానం తెచ్చింది. పెద్ద సైజు గింజలుంటే ‘ఏ’ గ్రేడ్, మధ్యరకం గింజలు ‘బీ’ గ్రేడ్, చిన్న సైజు గింజలు ‘సీ’ గ్రేడ్ గా చేస్తున్నారు. ‘ఏ’గ్రేడ్‌కు రూ.1,310, ‘బీ’ గ్రేడ్‌కు రూ.1,230, సీ గ్రేడ్‌కు రూ.1,180 మద్దతు ధర చెల్లిస్తోంది. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి? మానయ్య: ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలతోనే పండించాం, కానీ పంట సరిగా పండలేదు సారూ శరత్: పంటకు తడి బాగా అందిందా? మానయ్య: వానలు ఎక్కడివి సారు, అప్పుడింత..ఇప్పుడింత కురిసిన జల్లుకు ఈ మాత్రం పండింది. విత్తనాలు కూడా మంచియిగానట్టున్నయి సారు. శరత్ : మీ పేరేమిటి? ఏదో సమస్యల్లో ఉన్నట్లున్నావు? రైతు : నా పేరు మాణిక్‌రెడ్డి సార్, ఇక్కడ హమాలీలకు డబ్బులు మేమే చెల్లించాల్సి వస్తోంది సార్? శరత్: కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదా? నర్సింహులు: వచ్చేటపుడు డబ్బులు తెచ్చుకోలేం కదా సార్? శరత్: ధాన్యంకు సంబంధించి డబ్బులు వచ్చాయా? సత్తయ్య: ఈరోజే వచ్చాయి సారు. శరత్: ధాన్యాన్ని ఇక్కడకు ఎప్పుడు తెచ్చావు. సత్తయ్య: గత నెల 31న కొన్ని, ఈ నెల 2న కొన్ని వడ్లు తెచ్చి కేంద్రంలో కాంటా పెట్టిన. ఇవ్వాళ్ల డబ్బులు వచ్చినాయి. శరత్: హమాలీకి ఎంత డబ్బు ఇచ్చావు. సత్తయ్య: రూ.600 వరకు ఇచ్చిన. శరత్: హమాలీ డబ్బులో సగం భాగం మహిళాగ్రూపు వారు చెల్లించుకోవాలి కదా..! అనంతరం జేసీ పక్కనే ఉన్న రైతు బక్కొళ్ల యాదయ్యతో మాట్లాడారు. శరత్: ఏం యాదయ్య...ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశావు. యాదయ్య: నాలుగు ఎకరాల్లో వేశాను సార్. శరత్: ఈ నాలుగు ఎకరాల్లో గత ఏడాది ఎంత దిగుబడి వచ్చింది. ఈ సారి ఎంత వచ్చింది. యాదయ్య: గత ఏడాది 70 క్వింటాళ్ల వరకు వచ్చాయి. ఈ సారి 25 క్వింటాళ్లే వచ్చినయి సారు. -
అసైన్డ్ భూములు అమ్మినా..కొన్నా నేరమే!
కొండపాక: అసైన్డ్ భూములు అమ్మినా, కొన్నా చట్ట ప్రకారం నేరమని జాయింట్ కలెక్టర్ శరత్ హెచ్చరించారు కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని అసైన్డ్ భూములను ఆయన గురువారం సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డితో కలిసి పరిశీలించారు. తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని 158, 159, 160, 161, 163 సర్వేనెంబర్లలోని అన్యాక్రాంతమైన 58 ఎకరాల అసైన్డ్భూములను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమి వివరాలపై స్థానిక తహశీల్దార్ పరమేశ్వర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తిమ్మారెడ్డిపల్లి శివారులోని 58 ఎకరాల భూమిని ప్రభుత్వం గతంలో భూమి లేని నిరుపేదలకు కేటాయించిందన్నారు. ప్రస్తుతం ఈ భూమి నిబంధనలకు విరుద్దంగా హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. వెంటనే ఈ భూమిని స్వాధీనం చేసుకొని కడీలు పాతించాలని ఆయన తహశీల్దార్‌ను ఆదేశించారు. సిద్దిపేట నుంచి జిల్లా సరిహద్దులోని వంటిమామిడి గ్రామం వరకు రాజీవ్ రహదారికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల లోపలి వరకు ఉన్న ప్రభుత్వ, అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను, ఇతరుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వేచేపట్టి స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రభుత్వభూములపై ఎన్ని లావాదేవీలు జరిగినా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. కబ్జా అయిన వాటి వివరాలు ఇవ్వాలి అన్యాక్రాంతమైన ప్రభుత్వ, అసైన్డ్‌భూములపై పత్రికల్లో వచ్చే కథనాలపై వెం టనే స్పందించి చర్యలు తీసుకుంటామని జేసీ శరత్ తెలిపారు. మండలంలోని కుకునూర్‌పల్లిలోని సబ్ మార్కెట్‌యార్డులో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జేసీ శరత్ సందర్శించారు. అర్హులకే సంక్షేమ పథకాలు సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలను అందించే ఉద్దేశంతోనే ముందుకు పోతోందని జేసీ శరత్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించి, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జేసీ శరత్ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పింఛన్ల కోసం 4.10 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. వాటిలో ఇప్పటి వరకు 3.75 లక్షలను పరిశీలించడం జరిగిందన్నారు. పరిశీలన ప్రక్రియ అనంతరం అర్హులైన జాబితాను కంప్యూటర్లో అప్లోడ్ చేసి నవంబర్ 8 నాటికల్లా తుది జాబితాను సిద్ధం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు రూ. 1500, వితంతువులు, వృద్ధులకు, ఇతర పింఛన్లకు రూ. వెయ్యి చొప్పున అందించనుందన్నారు. మరోవైపు కుటుంబ ఆహార భద్రత కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని వాటిలో 4 లక్షల దరఖాస్తులను పరిశీలించామన్నారు. నవంబర్ 15 నాటికి ఆహార భద్రత కార్డుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. జనవరిలో జిల్లా ప్రజలందరి చేతుల్లో కొత్త కార్డులు ఉంటాయన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
జగదేవ్‌పూర్: జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి మండలంలోని ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్, ఆదివారం ఉదయం తన మనమడితో కలిసి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ రాహల్ బొజ్జా, జాయింట్ కలెక్టర్ శరత్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ ఓఎస్డి హన్మంతరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చే సి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. గజ్వేల్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా జిల్లాలో వ్యవసాయాభివృద్ధి, పంటల పరిస్థితిపై ఆరా తీశారు. సంక్షేమ పథకాలన్నీ అర్హులకే అందేలా చూడాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. త్వరలోనే జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పథకాలు అమలు. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిద్దామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్ చుట్టూ భారీ బందోబస్తు సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు రావడంతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ అధ్వర్యంలో ఫాంహౌస్ చుట్టూ భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం సీఎం హైదరాబాద్‌కు వెళ్లే వరకు పోలీస్ బందోబస్తు కొనసాగింది. ఆదివారం ఉదయం ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బంది బందోబస్తును నిర్వహించారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షించారు. ఆదివారం 3:40 గంటలకు సీఎం కేసీఆర్ తమ కాన్వాయ్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ను టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు కలిశారు. -
72 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు
మెదక్ మున్సిపాలిటీ: వరి, మొక్కజొన్న కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని జాయింట్ కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో వరి, మొక్కజొన్న కేంద్రాల కొనుగోలు విషయమై పాయింట్ వర్కర్స్, ఏపీఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ శరత్ మాట్లాడుతూ రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోనే సంబంధిత రైతుల బిల్లులు డీఆర్డీఏ కార్యాలయానికి చేరాలని సూచించారు. ఆవిధంగా చర్యలు తీసుకున్నప్పుడే 72గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. బిల్లులు సకాలంలో పంపించడంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్య వైఖరి అవలంబించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారిగా ధాన్యం పేరుకుపోకుండా ముందస్తుగానే కేంద్రాలను ప్రారంభించాలన్నారు. వరి కామన్ రకాన్ని క్వింటాల్‌కు రూ.1360, గ్రేడ్ ఏ రాకానికి రూ. 1400, మొక్కజొన్నకు రూ. 1310లు మద్ధతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏ కొనుగోలు కేంద్రాల్లోను ఈ ధర కంటే తక్కువగా చెల్లిస్తే వారి పై కేసులు నమోదు చేయాలని సూచించారు. ధాన్యంలో తేమ 15 శాతం, రంగు మారిన ధాన్యం 5 శాతం, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, చెత్త, మట్టి పెడ్డలు 1శాతం కంటే ఎక్కువగా ఉండకూడదన్నారు. ధాన్యం కొనుగోలులో కనీస ప్రమాణాలను పాటించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తరువాత రైతుల వద్ద నుంచి సరైన బ్యాంకు ఖాతా నంబరును తీసుకోవాలని, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే కనీసం అందులో రూ.500 ఉండేలా చూడాలని రైతులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏసురత్నం, డీఎం మార్క్‌ఫెడ్ నాగమల్లిక, డీఎం సివిల్ సప్లయీస్ జయరాం, ఏపీడీ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ విజయలక్ష్మి, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, ఎరియా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
8లోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటీ: సమగ్ర కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను ఈ నెల 8లోగా కంప్యూటర్లో ఎంట్రీ చేయాలని జాయింట్ కలెక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సంబంధిత అధికారుల సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ, జిల్లాలోని 46 మండలాలకు గాను జహీరాబాద్, కల్హేర్, కోహీర్, నారాయణఖేడ్, న్యాల్కల్ మండలాల్లో డాటా ఎంట్రీ మందకొడిగా సాగుతుండటం పట్ల జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ తేదీలోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే డాటా ఎంట్రీ ఆపరేటర్లను పెంచుకోవడంతో పాటు అధిక సమయాన్ని కేటాయించి పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషాతో పాటు వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు పాల్గొన్నారు. డాటా ఎంట్రీని పరిశీలించిన జేసీ సంగారెడ్డి రూరల్: కంది శివారులోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శరత్ శుక్రవారం పరిశీలించారు. జిల్లాలో 8 లక్షల 65 వేల నివాసాల్లో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సర్వే వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాలని ఆదేశించారు. సర్వే వివరాలు అత్యంత ప్రాధాన్యత కలిగినవని, అందుకు డాటా ఎంట్రీలో అప్రమత్తత అవసరమని సూచించారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు భోజన సౌకర్యం కల్పించాలన్నారు. జేసీతోపాటు తహశీల్దార్ రాధాబాయి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. -
ఇన్చార్జి కలెక్టర్ శరత్ బదిలీ?
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ బదిలీపై వెళుతున్నట్టు సమాచారం. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు జిల్లాలో గరిష్టంగా మూడేళ్లలోపు పనిచేసిన వారై ఉండాలి. మూడేళ్లు దాటితే ఇతర ప్రాంతానికి బదిలీ చేస్తారు. ప్రస్తుతం జిల్లా ఇన్చార్జిగా పనిచేస్తున్న డాక్టర్ శరత్ 2011 ఆగస్టు 18న జాయింట్ కలెక్టర్‌గా ఇక్కడికి వచ్చారు. ఫుల్‌టైం కలెక్టర్ పనిచేసిన స్మితాసబర్వాల్ జూన్ మాసంలో ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శిగా బదిలీపై వెళ్లారు. ఖాళీ అయిన స్థానంలో కొత్త కలెక్టర్‌ను రాష్ర్ట ప్రభుత్వం నియమించకపోవటంతో అప్పటి నుంచి డాక్టర్ శరత్ ఇన్చార్జి కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయనే జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. అయితే మంగళవారం నాటితో శరత్ విధి నిర్వహణ సమయం మూడేళ్లు దాటింది. ఈ నేపథ్యం ఎన్నికల కమిషన్ ఆయనను బదిలీ చేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం శరత్‌ను ఇక్కడే కొనసాగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.