కలెక్టర్‌కు అల్ల్లాదుర్గం గ్రామ ప్రజల వినతి
సంగారెడ్డి మున్సిపాలిటీ : అల్లాదుర్గం పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై విచారణ చేపట్టాలని గ్రామ ఉపసర్పంచ్ బాలకిషన్, వార్డు సభ్యులు స్వరూప, నవీన, గణపతి, నాగిశెట్టి సోమవారం ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌కు ఫిర్యాదు చేశారు. 2013- 14 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీకి మంజూరైన నిధుల్లో దాదాపు రూ.2 లక్షలను పనులు చేపట్టకుండానే సర్పంచ్ స్వాహా చేశారని ఆరోపించారు. పంచాయతీ సమావేశంలో సభ్యులు తీర్మానం చేసిన పనులను చేపట్టకుండా మంజూరైన నిధులను దుర్వినియోగం చేశారన్నారు. ఏప్రిల్ 16న రూ.50,600, మే 5న 64వేలు (టీఎఫ్‌సీ), అదే నెల 24న రూ.38906లను డ్రా చేసినట్లు ఆరోపించారు.
బస్వపూర్ సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి
సర్పంచ్‌గా ఎన్నికై సంవత్సరం కావొస్తున్నా సమావేశం నిర్వహించని సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సభ్యులు వడ్ల శ్రీశైలం,సాయిలు, భాగ్యమ్మ, మొగులమ్మ, నింగమ్మ, లక్ష్మి, వీరేశం జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సమావేశం నిర్వహించకుండా పంచాయతీ కార్యదర్శితో కుమ్మక్కయి ఇష్టారాజ్యంగా నిధులను డ్రా చేస్తూ అభివృద్ధి పనులను చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సర్పంచ్ అవినీతిపై విచారణ చేపట్టాలి
Published Tue, Jul 8 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement