
కొలంబో: శ్రీలంక అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాజీ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా(73) ప్రకటించారు. అధ్యక్షుడైతే అవినీతిని రూపుమాపి, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17–అక్టోబర్ 16 తేదీల మధ్య దేశంలో ఎన్నికలు జరిగే అవకాశముంది.
ఎన్నికల సంఘం ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ ప్రకటించనుంది. 2009లో అప్పటి ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సె సారథ్యంలో చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో ఎలీ్టటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకర్ సహా కేడర్ అంతమైంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నేత అనురా కుమార దిస్సనాయకేలు కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.