former
-
‘ఆపిల్ చక్రవర్తి’కి పద్మశ్రీ.. జాతీయ వినూత్న వ్యవసాయవేత్తగానూ గుర్తింపు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపినవారు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాకు చెందిన హరిమాన్ శర్మ ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు.ఉద్యానవన రంగంలో కొత్త ప్రయోగాలు చేపట్టినందుకు హరిమాన్ శర్మను పద్మశ్రీ అవార్డుకు ఎంపికచేశారు. మైదాన ప్రాంతాల్లో ఆపిల్‌ను పండించడం ద్వారా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపధ్యంలోనే ఆయనను ‘ఆపిల్ చక్రవర్తి’(సేబ్ సమ్రాట్) అని కూడా పిలుస్తారు. హరిమాన్ శర్మ 1998లో తన తోటలో ఆపిల్స్‌ను పండించడంపై ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. మొదట్లో శర్మ ప్లం చెట్టుకు ఆపిల్ చెట్టును అంటుకట్టారు.ఆపిల్ తోటల పెంపకంలో ఆయన చూపిన అంకితభావం ఈరోజు ఆయన ‘పద్మశ్రీ’ అందుకునేలా చేసింది. హరిమాన్ శర్మ గతంలో జాతీయ వినూత్న వ్యవసాయవేత్త అవార్డును కూడా అందుకున్నారు. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డుతో ఆయనను సత్కరించారు. ఆపిల్ పండ్లను చల్లని ప్రాంతాలలోనే కాకుండా వెచ్చని వాతావరణంలో కూడా పండించవచ్చని హరిమాన్ శర్మ నిరూపించారు.హరిమాన్ శర్మ హెచ్‌ఆర్‌ఎంఎన్-99 రకం ఆపిల్‌ను అభివృద్ధి చేశారు. ఇది దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆయన అభివృద్ధి చేసిన రకాన్ని పంజాబ్, బెంగళూరు, తెలంగాణలతో పాటు నేపాల్, దక్షిణాఫ్రికా, జర్మనీ, బంగ్లాదేశ్ మొదలైన రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ రకాన్ని పెంచడంలో కూడా ఆయన సహాయం చేశారు. ఈ ఆపిల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ రకం జూన్ నెలలో అందుబాటులోకి వస్తుంది. ఈ సమయంలో మార్కెట్లలో సిమ్లా ఆపిల్స్ అందుబాటులో ఉండవు. ఫలితంగా హెచ్‌ఆర్‌ఎంఎన్-99 రకం ఆపిల్ మంచి డిమాండ్‌ను అందుకుంటుంది.ఇది కూడా చదవండి: ట్రంప్ నిర్ణయం: అమాంతం పెరిగిన గుడ్ల ధరలు -
అదృష్టం కలిసొస్తేనే...
ముంబై: మెగా ఈవెంట్లలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు కొన్నిసార్లు ప్రదర్శనతో పాటు కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలని భారత మాజీ కెపె్టన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ‘సియెట్’ సంస్థ అందించే వార్షిక క్రికెట్ అవార్డుల్లో ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ పురస్కారం లభించింది. ఈ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్ తన అనుభవాలను వివరించాడు. ద్రవిడ్ ఏమన్నాడంటే‘గతేడాది భారత్ వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియాకు అనూహ్యంగా టైటిల్ పోరులో ఆ్రస్టేలియా చేతిలో పరాజయం ఎదురైంది. ఓ ఆరు నెలల తిరిగేసరికి... ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ డెత్ ఓవర్లలో కనబరిచిన అద్భుత పోరాటంతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి టి20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు సందర్బాల్లోనూ కెపె్టన్‌గా రోహిత్, కోచ్‌గా నేను ఉన్నాను. మాకు టి20 ప్రపంచకప్ టైటిల్‌కు మధ్య దక్షిణాఫ్రికా అడ్డుగా ఉంది. అయితే ఆటతోపాటు కొంచెం అదృష్టం కలసిరావడంతో కప్‌తో ఆనందం మా వశమైంది. ఎంత చేసినా ఆ రోజు మనది కావాలంటే రవ్వంత అదృష్టం కూడా మనతో ఉండాలి.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 30 బంతుల్లో 30 పరుగుల సమీకరణం ప్రత్యరి్థకే అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత చిత్తంతో అనుకున్న ప్రణాళికను కెపె్టన్ రోహిత్ అమలు చేయాలి. ఎవరో ఒకరు మా ప్రయత్నాలకు కలిసి రావాలి. చివరకు సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ రూపంలో అదృష్టం మా పక్షాన నిలిచింది. ఈ క్యాచ్ తుది ఫలితాన్ని మావైపునకు తిప్పింది. కానీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగిన నవంబర్ 19న మాత్రం ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ శతకం శతకోటికిపైగా భారతీయుల కలల్ని కల్లలు చేసింది.టి20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ఇచి్చనప్పటికీ యువ బ్యాటర్లు వారి స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకముందు కూడా భారత క్రికెట్ వెలిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన అకాడమీలు, మెరుగైన మౌలిక వసతులు, లీగ్‌లతో అపార అవకాశాలు యువ క్రికెటర్ల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నాయి’ అని ద్రవిడ్ వివరించారు. -
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత (ఫొటోలు)
-
Sarath Fonseka: శ్రీలంక అధ్యక్ష బరిలో మాజీ ఆర్మీ చీఫ్
కొలంబో: శ్రీలంక అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాజీ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా(73) ప్రకటించారు. అధ్యక్షుడైతే అవినీతిని రూపుమాపి, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17–అక్టోబర్ 16 తేదీల మధ్య దేశంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికల సంఘం ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ ప్రకటించనుంది. 2009లో అప్పటి ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సె సారథ్యంలో చేపట్టిన సైనిక ఆపరేషన్‌లో ఎలీ్టటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకర్ సహా కేడర్ అంతమైంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నేత అనురా కుమార దిస్సనాయకేలు కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. -
ఈజిప్టులో మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ (ఫోటోలు)
-
సాగు లెక్క..ఇక పక్కా
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్) : ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీల ఏర్పాటుకు వీలుగా ఫిబ్రవరిలో ప్రారంభించిన రైతు సమగ్ర సర్వే ఇటీవల పూర్తయింది. వ్యవసాయాధికారులు జిల్లాలో ప్రతి రైతు కుటుంబం వివరాలు, వారు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకున్నారు. అధికారులు సర్వే ఫారాల్లో ముందుగానే ప్రింట్ చేసిన 13 అంశాలు కాకుండా మరో 14అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. రైతుకు మేలు చేసేందుకు పంటకాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా రైతుల వివరాలు సేకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం కాలనీల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇదీ సాగు లెక్కా.. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో మొత్తం 5.10లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతున్నట్లు తేలింది. 1.21లక్షల మంది రైతులు ఉండగా, ప్రధానంగా పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తి తరువాత సోయా, అంతర పంటగా కంది పంటలు తరువాత స్థానంలో నిలిచాయి. మొత్తం 18మండలాల్లోని 102 క్లస్టర్ల పరిధిలోని 508 గ్రామాల్లో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 105మంది సిబ్బంది జిల్లా వ్యాప్తంగా 90వేల రైతు కుటుంబాలను జూన్ వరకు సర్వే చేపట్టారు. జిల్లాలో అత్యధికంగా జైనథ్ మండలంలో 14113మంది రైతులు ఉండగా, మావల మండలంలో అత్యల్పంగా కేవలం 775మంది రైతులు మాత్రమే ఉన్నారు. పంట కాలనీల ఏర్పాటుకు... ప్రభుత్వం జిల్లాల వారీగా పంట కాలనీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండటంతో రైతుల పక్కా సమాచారం అవసరమైంది. అయితే వ్యవసాయ శాఖ వారు ప్రతీ ఏటా రైతులు వేసిన పంటల వివరాలను సేకరిస్తారు. ఈ వివరాల్లో చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉండటంతో మరోసారి రైతు సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. గతంలో రైతుల సాగు వివరాలు తెలుసుకోవడం ఒక రకంగా చాలా కష్టంగా ఉండిందనే చెప్పవచ్చు. రైతులు బ్యాంకులో ఒక పంట పేరిట రుణం తీసుకుంటే.. బీమా కోసం మరో పంట నమోదు చేయించేవారు. దీంతో పాటు పంట రుణం కోసం ఇంకో పంట చూపించడం సాధారణంగా మారింది. దీంతో రైతులు అసలు ఏఏ పంటలు సాగు చేస్తున్నారు అని తెల్సుకోవడం కొంత ఇబ్బందిగానే మారింది. అయితే ఈ సమగ్ర సర్వేతో రైతుల పక్క వివరాలు తెలియడంతో పంట కాలనీల ఏర్పాటు దిశగా ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ సర్వే ద్వార ఒక ఒక నిర్ణీత ప్రదేశంలో ఎక్కువగా సాగయ్యే పంటలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించి, వాటి దిగుబడి పెంచేందుకు, విస్తృత మార్కెట్ కల్పించేందుకు అవకాశం కలుగనుంది. అలాగే ఫుడ్ ప్రాసెసిసింగ్, క్రాప్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక పరిపుష్టి చేకుర్చేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. కొనసాగుతున్న ఆన్లైన్.. సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలు ప్రత్యేకమైన పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్ గ్రామాల్లో ఆఫ్‌లైన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. వారికి ఇచ్చిన ట్యాబ్‌లలో ఈ పూర్తి సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక్కసారి ఆన్లైన్ ప్రక్రియ పూర్తి అయితే ఒక్క క్లిక్‌తో ఏ గ్రామంలోని వివరాలైన తెలుసుకునే వీలుటుంది. అన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తుండటంతో రైతుల సమస్త సమాచారం ఒకే చోటు లభించే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క రైతు వివరాలను ఆన్లైన్ చేసేందుకు కనీసం 20–30నిమిషాలు పడుతుండటంతో ఆన్లైన్ ప్రక్రియ కొంత నెమ్మదిగా కొనసాగుతోంది. గ్రామాల వారీగా నివేదికలు పంపించాం సమగ్ర సర్వేపై ప్రభుత్వానికి గ్రామాల వారీగా నివేదికలు పంపించాం. గ్రామాల వారీగా సాగు విస్తీర్ణం, పంటల వివరాలు ఆన్లైన్ చేశాం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్, రైతుబంధు పనుల్లో కొంత సిబ్బంది బిజీగా ఉండటంతో రైతుల వారీగా ఆన్లైన్ చేసే పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతున్నా యి. ఏఈవోలు వారి వారి క్లస్టర్ సమాచా రాన్ని ఆన్లైన్ చేయాలని ఆదేశాలు జారీ చే సాం. త్వరలో పూర్తిస్థాయిలో ఆన్లైన్ చే స్తాం. – ఆశాకుమారి, డీఏవో,ఆదిలాబాద్ -
రైతు కుటుంబాల ఆర్థికస్థితిపై సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేస్తోంది. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న దానికి అనుగుణంగా ఈ సర్వే చేస్తున్నట్లు అధికారు లు చెబుతున్నారు. ఈ ఐదేళ్లలో పరిస్థితులు ఏమైనా మారాయా.. మారితే ఏ మేరకు మార్పులు వచ్చా యి.. ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనే కోణంలో ఈ సర్వే జరుగుతోంది. అర్థగణాంక శాఖ ద్వారా 1958 నుంచి సాంఘిక, ఆర్థిక సర్వేలను జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్ఎస్ఎస్వో)తో నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న దేశవ్యాప్తంగా ప్రారంభమైన సర్వే రాష్ట్రంలో ఈ నెల 21న ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు విడతలవారీగా కొనసాగుతుంది. వాస్తవానికి 2022 లో సర్వే జరగాల్సి ఉండగా మూడేళ్ల ముందుగానే సర్వేకు కేంద్రం ఆదేశించింది. పదేళ్లకోసారి ఈ సర్వే జరగాల్సి ఉండగా దేశవ్యాప్తంగా 2020 నాటికి రైతు ల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రాల్లోని రైతుల ఆర్థిక స్థితిగతులపై కేంద్రం ముందస్తు గా అధ్యయనం చేస్తోంది. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరుగా నమోదు చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పరిస్థితిని సర్వే చేయనుండగా, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధితో ఎలా జీవిస్తున్నారు.. రుణాల వినియోగం ఎలా ఉందనే కోణంలో వివరాలను ప్రత్యేక నమూనాలో పొందుపరచనున్నా రు. యాసంగి పంటలు చేతికొచ్చాక మళ్లీ రైతుల ఆదాయంపై సర్వే నిర్వహించనున్నట్లు తెలిసింది. కనీసమద్దతు ధర అందిందా? గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులకు ప్రాముఖ్యతనిస్తుండగా, పట్టణాల్లో అద్దెకుండే ప్రాంతాలను ఎం పిక చేశారు. గ్రామాల్లో రైతు కుటుంబాల ఆర్థిక స్థితి తెలుసుకుంటారు. ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారు? ఏఏ పంటలు వేస్తారు? విత్తనం నుంచి పం ట చేతికందే వరకు ఎంత పెట్టుబడి వచ్చింది? పంట విక్రయం తర్వాత వచ్చిన మొత్తం సొమ్మెంత? కనీసమద్దతు ధర అందిందా, లేదా? పెట్టుబడి, కుటుంబ ఖర్చులు పోను మిగిలిందెంత? వంటి వివరాలు నమోదు చేస్తారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో ఉన్నారా? ఆదాయమెంత? ఖర్చులెంత? వం టి వివరాలను పొందుపరుస్తారు. అప్పుల్లో ఉంటే అప్పుల వివరాలు, ఎందుకు అప్పులయ్యాయి, రుణాలివ్వడం లేదా.. ఇస్తే వినియోగమెలా ఉందనే వివరాలు సేకరించి వారి ఆర్థికస్తోమతను లెక్కిస్తున్నారు. -
సాగుకు పెట్టుబడి సాయం
ఈ కౌలు రైతు పేరు బోయ రాము. నిండా 26 ఏళ్లు లేవు. కరువు, దుర్భిక్షానికి మారుపేరుగా నిలుస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద ముష్టూరు. బతుకు మీద ఆశ, బతికి తీరాలనే సంకల్పం కొద్దీ ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెచ్చి మూడెకరాలు సాగు చేసేవాడు. రాము పంట వేయడం, వాన ముఖం చాటేయడం.. కొత్త అప్పులు చేసి మళ్లీ మళ్లీ ఏడాది విత్తనాలేయటం.. కరువు షరామామూలే అన్నట్టు నాలుగేళ్లుగా ఇదే తీరు. అప్పు కొండలా పెరిగి పోయింది. ఆ కొండ గుండెల మీద బరువుగా మారింది. పంట మీద చల్లాల్సిన పురుగుమందును గొంతులో పోసుకున్నాడు.ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ సంక్షోభం తీవ్రతకు రాము మరణం ఒక నిదర్శనం. నాలుగేళ్లుగా భరోసా దొరకని రైతులు బలవంతంగా ప్రాణాలను తీసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వానికి పట్టడం లేదు. ఆ చావులు పాలకులను తాకడం లేదు. ఆ కుటుంబాల ఏడుపులు ప్రతిపక్ష నాయకుడి గుండెని తాకాయి. అన్నదాతలకు వెన్నుగా ఉంటానన్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. రైతు భరోసా ప్రకటించారు. పెట్టుబడిసాయం అందిస్తానని రైతుకి ధైర్యాన్నిచ్చారు. రైతులకే కాదు సమాజంలో ప్రతిరంగానికి వరాలజల్లులాంటి నవరత్నాలను ప్రకటించారు. అందులో ఒక రత్నమే వైఎస్సార్ రైతు భరోసా. వైఎస్సార్ రైతు భరోసాలో భాగంగా ‘పెట్టుబడి సాయం’ పథకాన్ని 2017 జూలైలో పార్టీ ప్లీనరీలో ప్రకటించారు జగన్మోహన్రెడ్డి. ఇప్పుడు అనేకమంది పాలకులు ఆ బాటలో నడుస్తున్నారు. ప్రతి రైతుకు తోడుగా.. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తూనే.. రైతు కుటుంబాలన్నింటికీ ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం ఇస్తారు. నాలుగేళ్ల కాలానికి మొత్తం రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మే నెలలో నేరుగా రైతుల చేతికిస్తారు. పెట్టుబడి సాయం ప్రతి అన్నదాతకూ తోడుగా ఉంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి స్వర్ణయుగాన్ని తెస్తుంది. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు, రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ అందుతుంది. ఇటీవలి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 76.21 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపు 66 లక్షల కుటుంబాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం ప్రైవేటు వడ్డీల బారి నుంచి రైతులను కాపాడుతుంది. ప్రైవేటు వ్యాపారుల నుంచి 3, 4 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి సాగు చేయాల్సిన దుస్థితి తప్పుతుంది. దీంతో పాటు జీరో వడ్డీ, పావలా వడ్డీ కింద రైతులకు రుణాలు ఇచ్చేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటారు. ఆ పథకాల కింద బ్యాంకులకు ఎంత మొత్తం జమ చేయాలో బడ్జెట్లో కేటాయింపులు చేసి సున్నా, పావలా వడ్డీలకు రుణాలు వచ్చేలా చూస్తారు. ఈ పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు అపహాస్యం చేసిన వారే ఇప్పుడు వేనోళ్ల కీర్తిస్తున్నారు. తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు గత ఏడాది నుంచి పెట్టుబడి సాయం ఇస్తుండగా.. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో ప్రకటించాయి. వైఎస్ఆర్ నాటి స్వర్ణయుగాన్ని తేవడానికి ఆయన తనయుడు జగన్ వేసిన ఓ ముందడుగే వైఎస్సార్ రైతు భరోసా. -
ఓటాన్ బడ్జెట్ బదులు ఓట్ల బడ్జెట్: దాసోజు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టింది ఓటాన్ బడ్జెట్ కాదని, ఓట్ల వేట కోసం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. శనివారం ఢిల్లీలో, గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బడా పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. ప్రతీ రైతుపై రూ.47వేల అప్పు ఉంటే, ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు వారికి ఎలా సరిపోతాయో చెప్పాలన్నారు. ఎంఎస్పీ ధరలు పెంచాలని స్వామినాథన్ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కి తూతూ మంత్రంగా మద్దతు ధర ప్రకటించడం వల్ల దేశ వ్యాప్తంగా రైతులు సుమారు 2.5 లక్షల కోట్లు నష్టపోయారన్నారు. రైతు అనుబంధ రంగాల్లో జీఎస్టీ ప్రభావంతో రైతాంగం కుదేలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీల అసమర్థత వల్లే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి అమలు కావాల్సిన హామీలను సాధించడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. -
మాకూ రిజర్వేషన్లు కావాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని రైతు కుటుంబాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలనే డిమాండ్‌కు హైదరాబాద్ వేదికైంది. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ సదస్సులో తొలిసారి ఈ ప్రతిపాదన వచ్చింది. ‘మాకూ రిజర్వేషన్లు కావాల్సిందే. వ్యవసాయం చేసే కుటుంబాలకు చెందిన పిల్లలకు అన్ని సామాజిక వర్గాల తరహాలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. రైతుల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి’అని సదస్సులో పాల్గొన్న రైతు నేతలు డిమాండ్ చేశారు. రైతు పక్షపాతిగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని కేరళ ప్రతినిధి లాలా వర్గీస్ అన్నారు. రైతుల సమస్యల పరిష్కార మార్గాలను శాశ్వత ప్రాతిపదికన అమలు జరిపినప్పుడే రైతు సంక్షేమం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. దుక్కి దున్నే సమయం నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు, సమాజంలోని ఇతర వర్గాల మధ్య తలెత్తే వివాదాలతో పాటు అంతర్గతంగా రైతు వర్గంలో ఉండే వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైపరీత్యాల వల్ల నష్టం జరిగిన 48 గంటల్లో రైతుకు పరిహారమందేలా ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన మరో ప్రతినిధి మాట్లాడుతూ పంట పండించడానికి ముందే గిట్టుబాటు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని 30 శాతం మంది రైతులకు పాసుపుస్తకాలు రాలేదని ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని మరో నేత కృష్ణారెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా సదస్సు ఆమోదించింది. ఉత్తమ్‌తో పాటు పలువురు గైర్హాజరు ఏఐసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు సదస్సుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా స్వల్ప అనారోగ్య కారణంతో ఆయన రాలేదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, సంపత్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌లు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. -
రుణమాఫీపై కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ కోసం వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతులకు రూ.లక్ష వరకున్న రుణాల మాఫీ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తుండటంతో వ్యవసాయాధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి చెందిన బ్యాంకర్లతో వ్యవసాయ శాఖ అధికారులు శనివారం సమావేశమయ్యారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో రుణమాఫీ కసరత్తు వివరాలను బయటకు వెల్లడించట్లేదని చెబుతున్నారు. గతంలో రూ.లక్ష రుణమాఫీ నాలుగు విడతల ప్రక్రియ 2017 మార్చితో ముగిసింది. ఆ తర్వాతి నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్లలో ఎంతమంది రైతులు ఎంత రుణం తీసుకున్నారన్న విషయాలను అధికారులు సేకరించారు. అలాగే లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులెంత మందో సేకరించారు. మొత్తం రుణం తీసుకున్న రైతుల్లో వీరి శాతమెంత అనే వివరాలనూ గుర్తించారు. దాదాపు 90 శాతం పైగానే లక్ష రూపాయలు తీసుకున్న రైతులున్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. గతంలో లక్ష రూపాయల రుణమాఫీ సందర్భంగా తలెత్తిన పలు సమస్యలను ఈసారి జరగకుండా చూసుకోవాలని సర్కారుకు బ్యాంకర్లు సూచించినట్లు తెలిసింది. 40 నుంచి 45 లక్షల మంది రైతులు.. ఈ సమావేశానికి హాజరైన ఒక అధికారి అంచనా ప్రకారం ఈసారి రుణమాఫీ 40 లక్షల నుంచి 45 లక్షల మంది రైతులకు చేయాల్సి వస్తుందని తెలిపారు. నాలుగు సీజన్లలో తీసుకున్న పంట రుణాలన్నింటినీ కలిపితే ఒక్కో రైతు సరాసరి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు రుణం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. 2014లో ప్రభుత్వం 35.29 లక్షల మందికి లక్ష రూపాయలు మాఫీ చేయగా, ఈసారి అదనంగా 10 లక్షల మంది చేరే అవకాశముంది. అప్పుడు రూ.16,124 కోట్లు రుణమాఫీ చేయగా, ఈసారి రూ.20 వేల కోట్ల వరకు చేయాల్సి రావొచ్చని భావిస్తున్నారు. 2014లో ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేసినప్పుడు, వాటిని నాలుగు వాయిదాల్లో చెల్లించిన సంగతి తెలిసిందే. అంటే 2017 మార్చి నాటికి వాయిదాలన్నీ చెల్లించారు. ఇప్పుడు ఆ తర్వాత నుంచి రుణాలు తీసుకున్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే 2017–18 ఖరీఫ్, రబీల్లో 39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. అందులో ఖరీఫ్‌లో 26.20 లక్షల మంది, రబీలో 12.90 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఆ ఏడాది రూ.31,410 కోట్ల రుణాలను బ్యాంకులు రైతులకు ఇచ్చాయి. 2018–19లో ఇప్పటివరకు 26.45 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారికి బ్యాంకులు మొత్తం రూ.23,488 కోట్ల రుణాలు ఇచ్చాయి. అందులో ఈ ఖరీఫ్‌లో 22.21 లక్షల మంది రైతులు రూ.19,671 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత రబీలో ఇప్పటివరకు 4.24 లక్షల మంది రైతులు రూ. 3,816 కోట్ల రుణా లు తీసుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో జిల్లాల నుంచి బ్యాంకుల వారీగా లెక్కలు తీసుకున్నాకే స్పష్టత వస్తుందని బ్యాంకర్లు అన్నట్లు సమాచారం. మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ మేధోమథనం.. ప్రభుత్వం ఈసారి కూడా రుణమాఫీకి హామీ ఇవ్వడంతో మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేధోమథనం చేస్తున్నట్లు తెలిసింది. అయితే 2014లోనూ రూ.లక్ష రుణమాఫీ చేశారు. ఇప్పుడూ రూ.లక్ష వరకే హామీ ఇచ్చారు. అయితే ఒకేసారి రుణమాఫీ ఉంటుందని సర్కారు చెప్పడంతో అమలు మార్గదర్శకాల తయారుపై తర్జనభర్జన మొదలైంది. ఒకేసారి రూ.20 వేల కోట్లు ఇవ్వాలంటే సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. వచ్చే బడ్జెట్లో దీనికే రూ.20 వేల కోట్లు కేటాయిస్తే, రైతుబంధుకు మరో రూ.15 వేల కోట్లు కేటాయించాల్సి వస్తుంది. అంటే రుణమాఫీ, రైతుబంధుకే రూ.35 వేల కోట్లు కేటాయించాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వర్గాలు పలువురు నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. -
కల కోసం రూ. 2 కోట్లు వెచ్చించాడు
బీజింగ్ : చిన్నతనం నుంచి ప్రతి ఒక్కరం ఎన్నో కలలు కంటాం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ కలల్ని నిజం చేసుకుంటారు. వీరి కోవలోకే వస్తాడు చైనాకు చెందిన ఓ రైతు. జూ యూ అనే వ్యక్తికి బాల్యం నుంచే సొంత కారు, బైక్ లాగానే సొంతంగా విమానం ఉంటే బాగుంటుంది అనే కోరిక ఉండేది. ఈ క్రమంలో తన నలభయ్యో ఏట విమానాన్ని తయారు చేసే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. దాదాపు రెండు సంవత్సరాల పాటు శ్రమించి.. రెండు కోట్ల రూపాయలు వెచ్చించి తన కలకు ప్రాణం పోశాడు. 124 అడుగుల పొడవు.. 118 అడుగుల వెడల్పు.. 40 అడుగుల ఎత్తుతో ఎయిర్‌బస్ ఏ320కి ప్రతీకగా రూపొందించిన ఈ విమానం వచ్చే ఏడాది మే వరకూ పూర్తి కానున్నట్లు తెలిసింది. అనంతరం ఈ విమానంలో రెస్టారెంట్ లేదా హోటల్ ప్రారంభించాలనుకుంటున్నట్లు జూ యూ తెలిపాడు. తన కల గురించి తెలిసిన ఐదుగురు స్నేహితులు ఈ విమానం రూపకల్పనలో తనకి తోడుగా నిలిచారని తెలిపాడు జూ యూ. -
కాయలివ్వొద్దంటే చెట్టు వింటుందా?!
మనకెంత ప్రేమైనా ఉండొచ్చు..చెట్టు మీద, భూమి మీద, ఆకాశం మీద.వాటి కష్టాన్ని గుర్తించి చెట్టుని కాయొద్దని చెప్పినాభూమిని పండించొద్దని చెప్పినాఆకాశాన్ని వర్షించొద్దని చెప్పినాసూర్యుణ్ణి శక్తినివ్వొద్దని చెప్పినాఅవి వింటాయా!!ప్రకృతిలో ఉన్న దైవత్వమే.. నిస్వార్థంగా ఇవ్వడం.అలా ప్రకృతిలా.. ఇవ్వడమే తెలిసిన మట్టి మనిషి రైతు. ఆయన్ని ఆగమంటే.. చేసే పని ఆపమంటే..‘అయ్యా.. అందరికీ రిటైర్మెంట్ ఉంటుందినీకూ ఉంటే బాగుండు’ అని పిల్లలు పండుగ చేస్తే మాత్రం వింటాడా?! ఉద్యోగ విరమణ అంటే ప్రభుత్వ.. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు, అధికారులకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రం నిత్యం చెమటోడుస్తూ ఏళ్లకేళ్లు కుటుంబ పోషణ కోసం ఏటికి ఎదురీదే పరిస్థితుల్లో సైతం వ్యవసాయాన్ని దైవంగా భావించి సాగు చేసిన ఓ రైతుకు ఆయన కుటుంబం వ్యవసాయ విరమణ ఇచ్చింది! ‘ఇన్నేళ్లుగా మా ఉన్నతి కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసిన కాయ కష్టం చాలు.. మేము ఎదిగాం.. ఇక మీరు విశ్రమించండి’ అంటూ ఆ ముగ్గురు కుమారులు తమ తండ్రికి ఇచ్చిన భరోసా ఇది. ఖమ్మం సమీపంలోని రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన బాణోతు నాగులు ఐదు దశాబ్దాలుగా పుడమినే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరంన్నర పొలం సాగు చేసుకుని, బతుకు బండి నడుపుకుంటూ వస్తున్న నాగులుకు వ్యవసాయం అంటే అమితమైన ప్రేమ. ఏ వృత్తిలో అయితే కష్టపడుతున్నామో.. సమస్యలు ఎదుర్కొంటున్నామో.. ఫలితం సైతం అక్కడి నుంచే పొందాలన్నది ఆయన విధానం. అందుకే 50 ఏళ్ల సాగు జీవితంలో విత్తు మొలకెత్తినా.. ఎండిపోయినా.. చేనులో పంట పండకపోయినా.. పండిన మిర్చికి ధర రాకపోయినా ఆయన వీసమెత్తయినా చలించలేదు. విశ్రాంతి ఎరుగని రైతు నేల తల్లి అన్యాయం చేయదని నాగులు నమ్మకం. ఈ ఏడాది కాకపోతే మరో ఏడాది ప్రయత్నిద్దామన్న ఆయన పట్టుదల, నిరంతర శ్రమ, ఏ చేనుకు ఏ సమయంలో ఎటువంటి మందు వేయాలో.. అదును దాటకముందే సదరు పంటకు పురుగు సోకకుండా ఎలా కాపాడుకోవాలో ఆయనకు అనుభవం నేర్పిన విద్య. అందుకే నాగులు 65 ఏళ్ల వయసులోనూ గ్రామస్తులకు తలపండిన వ్యవసాయæదారుడిలా, మేలిమి పంటలను పండించే శాస్త్రవేత్తగా కనిపిస్తాడు. సాగుకు పెట్టుబడి లేని రోజుల్లో అప్పు చేసినా.. వ్యవసాయంలో వచ్చిన పంట దిగుబడి అప్పు కట్టడానికి సైతం సరిపోకపోయినా ఆయనలో ఆత్మవిశ్వాసం సడలలేదు. వ్యవసాయాన్ని విరమించి విశ్రాంతిని తీసుకోలేదు. ఇప్పుడైనా.. వ్యవసాయానికి తనను కుటుంబం దూరం చేస్తుందన్న బాధ ఒకవైపు ఉన్నా.. తన కొడుకులు ఉన్నతులు అయ్యారన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పినట్లవుతుందనే, మనిషికి ఏదో ఒక స్థాయిలో సంతృప్తి అవసరమన్న భావనను పది మందికి తెలియజేయాలన్న లక్ష్యంతోనే నాగులు వ్యవసాయ విరమణకు అంగీకరించాడు. పోరు పెట్టి మాన్పించారు భార్య, కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతో ఎకరంన్నర భూమిని పదెకరాల వరకు పెంచిన ఘనత నాగులుది. ఆయనకు భార్య పూర్ణ, ముగ్గురు కొడుకులు. ఇందులో ఒక కొడుకు విజయవాడలో ఆబ్కారీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుండగా.. మరో కొడుకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇక మూడో కొడుకు తన దగ్గరే ఉన్నా.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని తన కాళ్లపై తాను నిలబడగలిగే సామర్థ్యం తెచ్చుకున్నాడు. ‘‘మెరికల్లాంటి ముగ్గురు కొడుకులం ఉన్నాం.. ఇక నీకు వ్యవసాయంతో పనేంటి.. నీ కష్టాన్ని మేము చూడలేమంటూ..’’ ఆ కుటుంబ సభ్యులు చేసిన పోరుకు నాగులు ఎట్టకేలకు సరే అనాల్సి వచ్చింది. ఆధారపడే అవసరమే లేదు తమ పది ఎకరాల వ్యవసాయ భూమిని నాగులు ఈ ఏడాది నుంచి కౌలుకు ఇస్తున్నారు. కౌలు రైతు పడుతున్న కష్టం కళ్లారా చూసి తనకు తోచిన సలహా ఇస్తూ శేష జీవితాన్ని నాగులు, పూర్ణ దంపతులు గడిపేయదలచుకున్నారు. ఇక ఆ పదెకరాలకు వచ్చే కౌలు డబ్బులకు ఈ భార్యాభర్తలిద్దరే సర్వ హక్కుదారులు. ‘వ్యవసాయం చేసినప్పుడు ఏ రకంగానైతే ఆర్థిక స్వేచ్ఛను అనుభవించారో.. ఇప్పటికీ అదే స్వేచ్ఛ మీకు ఉండాలని’ ఆయన కుటుంబం ఆకాంక్షించింది. తల్లిదండ్రులు పడిన కష్టానికి.. విరమణతో తీర్చుకున్న రుణం నాగులు ‘వ్యవసాయ విరమణ’ వేడుకను ఆయన కుమారులు అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ ఏడాది మే 29వ తేదీన గ్రామంలో మేళతాళాలతో వచ్చి తండ్రిని ఘనంగా సత్కరించారు. ఐదు పదుల వ్యవసాయ జీవితంలో నాగులు తన కుటుంబాన్ని సంరక్షించిన తీరును, వృద్ధిలోకి తెచ్చిన వైనాన్ని అక్కడికి వచ్చిన ప్రతి అతిథి కొనియాడారు. తండ్రికి కష్టం రాకుండా కొడుకులు చూసుకోవడం.. ముదిమి వయసులో మేమున్నామంటూ తల్లిదండ్రులకు అండగా ఉండటం ఊరు ఊరునే కాదు.. జిల్లా ప్రజలందరినీ అబ్బురపరిచింది. ఇది ఇంకెందరికో స్ఫూర్తిదాయకంగా నిలవాలని ప్రతి ఒక్కరూ కాంక్షించారు. ఉద్యోగ విరమణ రోజున ప్రభుత్వ ఉద్యోగిని ఎలా సన్మానిస్తారో.. అదే విధంగా వ్యవసాయ విరమణకు సమ్మతించిన ఆ రైతుకు అరుదైన గౌరవం కుటుంబ సభ్యుల ద్వారా దక్కింది. ‘మా అమ్మానాన్న మా ఉన్నతి కోసం పడిన కష్టానికి గుర్తుగా ఈ సన్మానం’ అంటూ కుమారులు చేసిన ప్రసంగాలు ఆహూతులను కంటతడి పెట్టించాయి. ఈ తరహా వ్యవసాయ విరమణ ప్రతి రైతు కుటుంబానికి స్ఫూర్తిదాయకం కావాలన్నది ఆ గిరిజన కుటుంబం ఆకాంక్ష. – మాటేటి వేణుగోపాల్ రావు, సాక్షి, ఖమ్మం -
‘నా చావుకు కారణం నరేంద్ర మోదీయే’...
యావత్మాల్, మహారాష్ట్ర : ప్రభుత్వాలు ఎన్ని మారిన రైతు బతుకుచిత్రం మాత్రం మారదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న తన కుటుంబాన్ని పోషించలేని నిస్సహాయ స్థితిలో బలవంతంగా తనువు చాలిస్తున్నాడు. మన బ్యాంకులు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం దాటే బడా బాబులకు అప్పులిస్తాయి కానీ పదిమందికి అన్నం పెట్టే రైతుకు రుణం ఇవ్వాలంటే మాత్రం ముందుకు రావు. చేసేదేమి లేక వ్యాపారుల దగ్గర రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక ఈ నేలతో వారి రుణానుబంధాన్ని తెంచుకుని వెళ్తున్నారు. ప్రకృతి సహకరించక, ప్రభుత్వం ఆదుకోక మరో దారి లేక తనువు చాలిస్తున్న రైతన్నల మరణాలకు కారకులేవరు..? సమాధానం దొరకని ఈ ప్రశ్నకు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు మాత్రం తన చావుకు ముమ్మాటికి ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కారణం అంటున్నాడు . యవంతాల్ జిల్లా రాజుర్వాడి గ్రామానికి చెందిన శంకర్ భౌరవ్ చైరే(50) అనే రైతు వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రభుత్వ సొసైటీ వద్ద రూ.90వేలు, బయట వడ్డీ వ్యాపారీ వద్ద రూ.3లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తంతో తన భూమిలో పత్తి పంటను సాగు చేశాడు. కానీ బోలుపురుగు వ్యాపించి పంట పూర్తిగా దెబ్బతిన్నది. బోలు పురుగు వ్యాప్తి వల్ల ఈ సంవత్సరం విదర్భ ప్రాంతంలో పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పుల భారం పెరగడంతో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహా ధర్నా నిర్వహించారు. దిగి వచ్చిన ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించింది. కానీ ఈ రుణమాఫీ ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. శంకర్ భౌరవ్ సొసైటీ నుంచి తీసుక్ను తొంభై వేల రుణం మాఫీ అయ్యింది, కానీ ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న మూడు లక్షల రుణం అలానే ఉంది. అంత పెద్ద మొత్తాన్ని తీర్చడం తన వల్ల కాదని భావించాడు. తనకు అవసరమయిన మొత్తాన్ని బ్యాంకులు ఇచ్చి ఉంటే తనకు పూర్తి రుణమాఫీ వర్తించేది, అలా జరగలేదు కనుక దీనంతటికి కారణం ప్రస్తుత ప్రభుత్వము, ప్రధాని మోదీనే కారణం అని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ప్రధాని మోదీ, ఎన్డీయే ప్రభుత్వమే కారణం అని రెండు పేజీల ఉత్తరాన్ని రాశాడు. అనంతరం పురుగుల మందు తాగి పొలంలోనే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన ఇతర రైతులు శంకర్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ ఈ లోపే శంకర్ చనిపోయాడు. శంకర్ మృతితో ఆగ్రహించిన అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వం వచ్చి తమకు న్యాయం చేసేంతవరకూ మృతదేహాన్ని కదలనిచ్చేదిలేదని ఆందోళన చేశారు. దాంతో ‘వసంత్‌రావ్ నాయక్ శెటి స్వావలంభన మిషన్’(ఎస్‌ఎన్‌ఎస్‌ఎస్‌ఎం) ప్రెసిడెంట్ కిషోర్ తివారీ సంఘటన స్థలాన్ని సందర్శించి తక్షణ సాయంగా లక్ష రూపాయలను మంజూరు చేశారు. వారి కుటుంబంలో చదుదవుకుంటున్న వారు ఉన్నట్లయితే ఇక మీదట వారి చదువు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు. ఒక వేళ వారి చదువులు పూర్తి అయితే వారికి తగిని జీవనోపాధి చూపిస్తామని హామీ ఇచ్చారు. మరణించి శంకర్‌కు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. ఒక్క కుమార్తేకు మాత్రమే వివాహం అయ్యింది. -
అలో..అలో...
భువనేశ్వర్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా రైతులకు ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు పంపిణీ చేస్తుంది. రాష్ట్ర సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళా రైతులకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విభాగం మంత్రి సూర్య నారాయణ పాత్రో తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్లో స్టార్ట్‌ఫోన్ల పంపిణీని ప్రారంభిస్తారు. వ్యవసాయ రుణాలు, వాతావరణం, వ్యవసాయ ఉత్పాదనల విక్రయాలు, ఇతరేతర వ్యవసాయ సంబంధిత సమాచారం స్మార్ట్ఫోన్లలో లభ్యమవుతుందని మంత్రి వివరించారు. స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారు ఆన్లైన్లో వారి పేరు, తదితర వివరాల్ని నమోదు చేసుకోవాలని మంత్రి తెలియజేశారు. తొలి విడతలో 70 శాతం మహిళా రైతులకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసేందుకు తమ విభాగం రంగం సిద్ధం చేసిందని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ సమాచారంతో మహిళారైతులు వ్యవసాయ రంగంలో మెలకువలు తెలుసుకుని అభివృద్ధి చెందుతారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ సాగుకు వ్యవసాయ రుణాల మంజూరు కోసం ఆ విభాగం మంత్రిత్వ శాఖ ముందస్తుగా తయారైంది. ఈ ఏడాది రూ.7,600 కోట్లు వ్యవసాయ రుణాలుగా మంజూరు చేస్తారని మంత్రి తెలిపారు. ఈ మేరకు పత్రికా ప్రకటనలు కూడా జారీ చేశామన్నారు. రైతులు తమ వివరాల్ని నమోదు చేసుకోవాలని మంత్రి అభ్యర్థించారు. -
పొలం పొమ్మంది.. ఇల్లు రమ్మంది
ఒక తరం పోయి మరో తరం వస్తుంది.. ఒక పాత కనుమరుగై... మరో కొత్తకు నాంది అవుతుందిమార్పు సంస్కృతిలో భాగం... మారి తీరాల్సిందే... మార్పును స్వాగతించాల్సిందే.నాగలి పోయి ట్రాక్టర్ వచ్చింది...రోకలి పోయి మిక్సీ వచ్చింది. వాకర్ వచ్చింది... మూడు చక్రాల బండిని పక్కకు తోసేసింది.పొలం... ‘నీకిక్కడ ఇంకేం పనుంది’ అన్నది... పట్టణాల్లో ఇళ్లు ‘పని చేద్దువురా’ అని పిలిచాయి.వడ్రంగి ఊరిని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ... సిటీలో అడుగుపెట్టాడు.సమాజంలో వచ్చిన మార్పుకు... ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. ‘‘మా నాన్న పేరు సాంబాచారి. ఆయన ఊరందరికీ చుట్టమే. మా ఇంటికి పని కోసం వచ్చినవాళ్లను, పని కోసం ఇంటికి పిలిపించుకునే వాళ్లను ఎవరినైనా సరే ‘మామా, చిన్నాన్నా’ అని వరుస పెట్టి పిలిచేవాడు. చేతిలో పనితోపాటు మాట మంచితనంతోనే మా ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడాయన. మార్పు నా కళ్ల ముందే! నేను మా నాన్న చేతికింద పన్నెండేళ్లు పని చేశాను. సొంతంగా పని చేయడం మొదలు పెట్టి ముప్పై ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో నేను పెద్ద మార్పునే చూశాను. మా ఉలి, బాడిశె, కలప కోసే రంపం, తోపుడు రంపం వంటి వస్తువులు అలాగే ఉన్నాయి. కానీ వాటితో మేము తయారు చేసే వస్తువులు మారిపోయాయి. ఒకప్పుడు మా పనంతా వ్యవసాయం ప్రధానంగా ఉండేది. వ్యవసాయానికి వాడే పనిముట్లంటే... నాగలి, ఎడ్లబండి, ఏతం తొక్కడానికి ఏతం మాను, కపిల బావి నీరు తోడడానికి గిలక, గింజలు నాటడానికి జడ్డిగం గొర్రు, పళ్లమాను, గెడ్లమాను, మాను అడ్డ, గుంటక అడ్డ, కర్రల మాను, కాడి, కొడవలి ముఖ్యంగా ఉండేవి. ఇక ఇంట్లో రోజువారీ వాడకంలో... నులకమంచం, మడతమంచం, మడత కుర్చీ, బల్ల, కుర్చీ, పిల్లలకు ఊయల, చక్రాలబండి, గిలక్కాయలు ఉండేవి. వంటగదికోసం వాడే రోకలి, కత్తిపీట, పప్పుగుత్తి, తెడ్డు, కవ్వం, పీటలు, తిరగలి పిడి, రుబ్బురోలు పిడి వంటివన్నీ వడ్రంగి చేయాల్సినవే. ఇప్పుడు వంటగది మా కోసం చూసేది ఒక్క పప్పుగుత్తి కోసమే. మిగిలిన అన్నింటికీ ప్రత్యామ్నాయాలు వచ్చేశాయి. ఇంటి నిర్మాణంలో అయితే పునాది వేసిన తరవాత మొదట ద్వారబంధాలు నిలబెట్టేవాళ్లు. ఇంటి తలుపులు, దంతులు, కిటికీలు, అల్మరాలు వడ్రంగి చేతి నుంచే రావాలి. మా నాన్న దగ్గర నేను అవన్నీ నేర్చుకున్నాను.అప్పట్లో దీపావళి వరకు వ్యవసాయ పనులుంటే ఆ తర్వాత వరికోతల వరకు పని ఉండేది కాదు. శీతాకాలం, ఎండాకాలాల్లో కొట్టాలు వేసేవాళ్లు. ఇప్పుడు తాటాకు కొట్టాల్లేవు. అన్నీ రేకుల కొట్టాలే. వాటిలో మా పని పెద్దగా ఉండదు. పెంకుటిళ్లు కూడా లేవు. అన్నీ స్లాబ్ ఇళ్లే. అన్నింట్లోనూ కొత్తదనం వచ్చి పాతదనం కొట్టుకుపోయినట్లే ఇది కూడా. చిన్న కుటుంబాలూ కారణమే! ఇప్పుడు ఇళ్లు కట్టడం బాగా ఎక్కువైంది. అప్పట్లో ఉన్నట్లు ఉమ్మడి కుటుంబాల్లేవిప్పుడు. ఇంటికి ఇద్దరున్నా సరే ప్రతి ఇంటికీ ఒక డైనింగ్ టేబుల్, సోఫాసెట్ తప్పనిసరిగా ఉంటున్నాయి. డ్రెస్సింగ్ మిర్రర్లు, కార్నర్ స్టాండ్, చెక్క బీరువా, టీపాయ్, దివాన్ సెట్ వంటివి చాలా మంది వాడుతున్నారు. గ్రామంలో మేము చేసే పనులు తగ్గినప్పుడు ఊరినే నమ్ముకుంటే గడవడం కష్టమే. అందుకే వడ్రంగులం పట్టణాల బాట పట్టాం. ఫర్నిచర్ షాప్‌లతో కలిసి పని చేస్తున్నాం. వాళ్లయితే రోజూ పని చూపిస్తారు. పీస్ లెక్కన పేమెంట్ ఇస్తారు. మేము సొంతంగా పని చేసుకోలేకపోతున్నాం... అనే మాట నిజమే. కానీ ఇప్పుడు మాకు నెలకింత డబ్బు వస్తుందనే భరోసా ఉంటోంది. నిజానికి అప్పట్లో కంటే ఇప్పుడే మాకు పని పెరిగింది. అందరూ ఇళ్లను బాగా అందంగా కట్టుకుంటున్నారు. సిమెంట్ పనికి ఉన్నంత విలువ మా కొయ్యపనికి కూడా ఉంటోంది. మార్పు మంచిదే! అప్పట్లో మా పని ఎక్కువగా రైతుల కోసమే ఉండేది. మాకు ఆత్మీయులూ వాళ్లే. ఇప్పుడు మాకు పని చూపించేది యజమాని, ఆ యజమానితోపాటు యజమాని దగ్గర పని చేసే మా లాంటి మరికొందరు కార్పెంటర్లతోనే స్నేహమైనా, ఆత్మీయత అయినా. మా వృత్తిలో ఎప్పుడూ మాట మెత్తగా ఉండాలి. కస్టమర్లు వాళ్లకు ఏం కావాలో చెప్తారు. ఒక్కో డిజైన్ నుంచి ఒక్కో పార్ట్ చెప్పి అన్నింటినీ కలిపి కొత్త డిజైన్ కావాలంటారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నంతో మేము కూడా కొత్త డిజైన్ నేర్చుకుంటాం. ఒక్కోసారి వాళ్లడిగినట్లు చేయడం కుదరదు. ఉడ్ పట్టు నిలవదు. అలాంటప్పుడు ఎందుకు కుదరదో వాళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఆ సూత్రాన్ని ఒంటబట్టించుకుంటే మా వృత్తి అన్నమే కాదు పరమాన్నం కూడా పెడుతుంది. ఈ వృత్తి ఎన్ని తరాలైనా ఎక్కడికీ పోదు. చెట్టు ఉన్నంత కాలం మేమూ ఉంటాం’’. యంత్రసాయం! వ్యవసాయంలో మా పనిముట్ల స్థానంలో ట్రాక్టర్, కరెంట్ మోటార్, వరికోత మెషీన్ వచ్చేశాయి. వాటి వల్ల రైతుకి పని చాలా సులువైంది. గ్రామాల్లో ఒక్కో ట్రాక్టర్ పెరిగే కొద్దీ నాగళ్లు అటకెక్కసాగాయి. పొలం దున్నేవాళ్లు తగ్గిపోసాగారు. గొర్రుతో సేద్యం చేసేవాళ్లు లేరిప్పుడు. – అలజంగి వెంకటాచారి, కార్పెంటర్ ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రైతులే విత్తనాలు తయారు చేసుకోవాలి
ఇబ్రహీంపట్నం: రైతులే విత్తనాలు తయారు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సలహాదారుడు ఆశోక్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మనధాన్యం–మనవిత్తనం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రైతులు పండించిన ధాన్యం నుంచే విత్తనం తయారు చేసుకోవచ్చని తెలిపారు. మనం తయారుచేసుకున్న విత్తనాలను వెస్తే అధిక దిగుబడి సాధించవచ్చని అన్నారు. పంటలకు రసాయన ఎరువులు వాడొద్దని సేంద్రియపు ఎరువులే వాడాలని తెలిపారు. పండించిన వడ్లను రైసుమిల్లులో పట్టించి బియ్యాన్ని అమ్ముకుని లాభాలు పొందాలని సూచించారు. రైతులు సొసైటీగా ఏర్పడాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు ఎలిసె పాపన్న, గుజ్జుల రమేశ్, అబ్బటి రాజరెడ్డి, నాంపల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కోపంతో పంట ధ్వంసం.. రూ. లక్ష నష్టపరిహారం
-
ఈ వీడియో చూస్తే అతని కోపంలో బాధ తెలుస్తుంది
ముంబై : పండించిన పంటకు ధరలేదు, చేసిన అప్పు తీర్చే దారిలేదు. కళ్ల ముందు నిండుగా పండిన పంట పొలమంతా కనిపిస్తున్నా సరైన ధర లేకపోవడంతో ఓ రైతు కడుపుమండింది. మనసులో బాధ కోపంగా మారి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నాశనం చేశాడు. పొలమంతా మల్లె పువ్వుల్లాగా పరుచుకున్న క్యాలిఫ్లవర్ పంటను ధ్వంసం చేసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. 432 కిలోల క్యాలిఫ్లవర్కు కేవలం రూ.400 ధర చెల్లిస్తే ఎలా బతికేదని ప్రశ్నిస్తూ ప్రేమ్‌సింగ్ ఈనే రైతు తన పొలంలోని కాలిఫ్లవర్ పంటను నాశనం చేశాడు. నలభై వేలు పెట్టుబడి పెట్టి పండించిన కాలిఫ్లవర్, టమాట పంటకు కేవలం రూ.4000 వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతు ప్రేమ్‌సింగ్. రైతు చేసిన ఆ పనిని ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసి స్పందించిన శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆ రైతుకు రూ.లక్ష నష్టపరిహారం అందించారు. రైతులకు తమ పార్టీ మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. -
రాజకీయం చేయకుండా పరిష్కరించండి
సాక్షి, ముంబై: రైతుల సమస్యల్ని తెలుసుకునేందుకు మంత్రి గిరీశ్ మహాజన్ రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు, డిమాండ్లపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి మహాజన్‌కు వివరించారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వాటిని రాజకీయం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. -
మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు శిక్ష
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియా(72)కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. సుమారు 21 మిలియన్ టాకాల(కోటి 61 లక్షల రూపాయలు)ను తనకు చెందిన జియా ఆర్ఫానేజ్ ట్రస్ట్‌లోకి విదేశీ విరాళాల రూపంలో మళ్లించి అవినీతికి పాల్పడినందుకు కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న జియా కుమారుడు తారిఖ్ రహమాన్‌తో పాటు మరో నలుగురికి కూడా 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ పరిణామంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. -
భారీ కుంభకోణం: బ్యాంక్ మాజీ అధికారి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నగదు బదిలీ కేసు దర్యాప్తులో భాగంగా ఆంధ్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ అనుప్ ప్రకాశ్ గార్గ్‌ను అరెస్ట్ చేసింది. గుజరాత్‌కు చెందిన ఫార్మ కంపెనీ స్టెర్లింగ్ బయెటెక్ కుంభకోణం కేసులో ఈడీ ఈ చర్య తీసుకుంది. సుమారు రూ.5వేల కోట్ల మేర మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నగదు బదిలీ కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే ఈ కేసులో గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త గగన్ ధావన్‌ను అరెస్ట్ చేసింది. అలాగే గార్గ్ సహా, స్టెర్లింగ్ బయోటెక్,డైరెక్టర్స్ చేతన్ జయంతిలాల్ సందేశర, దిపిటీ చేతన్ సందేశర, రాజ్‌భూషణ్ ఓంప్రకాష్ దీక్షిత్, నితిన్ జయంతిలాల్ సందేశర, విలాస్ జోషి, చార్టర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాథి, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆంధ్రా బ్యాంక్ నాయకత్వంలోని కన్సార్టియం ద్వారా రూ.5 కోట్ల బ్యాంక్ అక్రమాలతోపాటు, సందేశర బ్రదర్స్ ద్వారా గార్గ్‌కు 2011లో రూ.1.52కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ గుర్తించింది. డిసెంబర్ 31, 2016 నాటికి గ్రూప్ కంపెనీల పెండింగ్‌లో ఉన్న మొత్తం రుణాలు రూ. 5,383 కోట్లుగా సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సిబిఐ విచారణ చతర్వాత ఈడీ నగదు బదిలీ కేసు నమోదు చేసింది. -
పిలిచి సినిమాల్లోకి రమ్మన్నారు..
సాక్షి, జూపాడుబంగ్లా: ‘నేసేవాడినంటున్నావు కాస్త మంచి బట్టలు కట్టుకొని రావొచ్చు కదా అంటే ఇళ్లు కట్టేవాడికి ఇళ్లుండదు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుండవు.. మాపరిస్థితి కూడా అంతే’నంటూ వేదం సినిమాలో చెప్పిన డైలాగ్‌తో పాపులర్ అయిన రాములు పాత్రదారి వేదంనాగయ్య నిజజీవితంలో కూడా అష్టకష్టాలు అనుభవించాడు. సినిమాలో నటించే ఏడుపు సీన్ల వెనుక నిజ జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలను గుర్తుకు తెచ్చుకొంటే నిజంగానే ఏడుపువస్తుందంటున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా చలాకీగా సినిమాల్లో నటిస్తూ కుటుంబపోషణలో తనవంతు పాత్ర పోషిస్తున్న వేదంనాగయ్య మంగళవారం పోతులపాడులో సినిమా షూటింగ్ సందర్భంగా ‘సాక్షి’తో మాట కలిపారు. తన ఊరు, పేరు సినిమా ప్రవేశంపై ఆయన మాటల్లోనే.. ‘మాది గుంటూరు జిల్లా, నర్సరావుపేట వద్ద దేసవరంపేట. నాకున్న రెండెకరాలు సాగు చేసుకుంటూ మిగతా సమయాల్లో కూలి పనులు వెళ్తుంటి. ఊరిలో పనులు లేకపోవడంతో కుమారుడి వెంట హైదరాబాదు వెళ్లాం. ఓ రోజు హైదరాబాదులో నడుచుకుంటూ వెళ్తుంటే ప్రొడ్యూజర్ రాధాకృష్ణ గారు చూసి సినిమాలో నటిస్తావా అని అడిగారు. కొడుకును అడిగి విషయం చెబుతానన్నా. ఇంటికెళ్లి మా వాడితో చెబితే ‘నీలాంటి వాళ్లు సినిమాలో నటించేందుకు చాలా మంది ఉంటారు. నీకెవరు అవకాశం ఇస్తారు’ అన్నాడు. చివరికి ఏదోలాగా ఒప్పించి ప్రొడ్యూజర్ కార్యాలయానికి వెళ్లే పెద్ద డైలాగ్ చీటి ఇచ్చి నేర్చుకోవాలని చెప్పారు. మొత్తం కంఠస్తం పట్టి చెప్పడంతో వేదం సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నాపేరు ముందు వేదం సినిమా పేరు చేరిపోయింది. వేదం, నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ తదితర 25 సినిమాల్లో నటించాను. సినిమా తీసే కంపెనీని బట్టి రోజుకు రూ.3వేల నుంచి రూ.25వేల దాకా ఇస్తారు. అయినా కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది. ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక పోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ‘మా’ అసోసియేషన్ వారు నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తున్నారు. ‘తాతా మనవడు’తో మొదలెట్టా.. 1500 సినిమాల్లో నటించి, పలు నాటకాలు రచించిన జీఎస్ఆర్. మ్మూర్తి అలియాస్ కవి కూడా సాక్షితో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ‘మాది విజయనగరం జిల్లా, బజ్జిపేట మండలం, గంగాడ గ్రామం. ప్రస్తుతం కుటుంబసభ్యులతో హైదరాబాదులో ఉంటున్నా. 1972 నుంచి సినిమా రంగంలో ఉన్నా. తాతా మనుమడు సినిమాతో నా సినీ రంగ ప్రస్థానం మొదలైంది. ఇప్పటి వరకు 1500 సినిమాల్లో నటించాను. 70షీల్డులు అందుకున్న నేను సొంతిల్లు మాత్రం సంపాదించుకున్నా. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ‘మా’ అసోసియేషన్ వారు సాయం చేస్తారు. ప్రస్తుతం నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తున్నారు. – జీఎస్ఆర్ మూర్తి ఆలియాస్ కవి రైతుల దీనస్థితిపై సినిమా అనంతపురం జిల్లా రైతుల దీనగాథను ‘విరంజి’ పేరుతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ వెంకటరాఘవన్ తెలిపారు. ఇందుకు సంబంధించి జూపాడు బంగ్లా మండలం పోతులపాడు, చాబోలు పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం డైరెక్టర్, యూనిట్‌సభ్యులు మీడియాతో మాట్లాడారు. హీరో ‘çస్కంద’ మాట్లాడుతూ.. రైతులు విత్తనాల కొనుగోలు నుంచి ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు అమ్ముకునే వరకు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుటుంబాలు గడవక భార్యల పుస్తెలు తాకట్టుపెట్టి అప్పులు తీరుస్తున్నారని, అప్పటికీ తీరక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఇలాంటి రైతు దీన గాథలను సినిమాలో చూపిస్తామన్నారు. హైదరాబాదు పరిసరాల్లో 90శాతం చిత్రీకరణ పూర్తయిందన్నారు. రవివర్మ, అప్పాజీ, ప్రీతినిగమ్(నటి), వేదం నాగయ్య, కవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారన్నారు. చాబోలుకు చెందిన ఓ వ్యక్తి కాటికాపరి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. -
టీడీపీకి మాజీ ఎంపీటీసీ గుడ్‌బై
నల్లమాడ: మాజీ ఎంపీటీసీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు డి.కుళ్లాయినాయక్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నల్లమాడలోని 30 పడకల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేసినట్లు కుళ్లాయినాయక్ చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం (నేడు) నల్లమాడకు విచ్చేయనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. తనతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు వైఎస్సార్సీపీలో చేరతారని పేర్కొన్నారు. -
మన వ్యవసాయ సంస్కృతికి ఏమైంది?
వేల ఏళ్ల నాటి మన వ్యవసాయ సంస్కృతికి గత యాభయ్యేళ్లలో అసలు ఏమైంది? మనదైన సుసంపన్న సేద్య జ్ఞానాన్ని వదిలేశాం. కంపెనీల మాయాజాలానికి బలిపెట్టాం... పంట భూముల ఆరోగ్యంతోపాటు, మన ఆరోగ్యాన్నీ చేజేతులా చేజార్చుకున్నాం. స్వాతంత్య్రాన్ని సాధించుకున్నాం. కానీ, పరాయి విత్తనాన్ని పట్టుకొని.. మన వారసత్వం విత్తన సంపదను వదిలేశాం. మనవైన ఆహార పంటలను కాదని అమ్మకానికి పనికొచ్చే పంటలను పండిస్తున్నాం... ఇప్పుడు ఎక్కడున్నాం? మనకు మనమే పరాయివాళ్లమైపోయాం! రసాయనాలు కుమ్మరిస్తూ నేలతల్లి ఊపిరిని నిలువునా తీసుకుంటున్నాం. మన అన్నదాతల ఉసురును మనమే తీసుకుంటున్నాం. వాతావరణ మార్పుల యుగంలో ఎడతెగని అప్పులు, ఆత్మహత్యలు, అలవికాని రోగాలను ఎలాగోలా జయించకపోతే మనుగడే మిగలదు. ఇంతకీ ఏం చెయ్యాలి? ఎటు అడుగెయ్యాలి?.. ఇటువంటి మౌలిక ప్రశ్నలకు సూటిగా సమాధానాలు వెదుకుతున్నారు మట్టి పెళ్ల మనసెరిగిన ప్లాంట్ డాక్టర్ శ్యామసుందరరెడ్డి... సేద్యం పంచభూతాల సంగమం. నింగి, నేల, నిప్పు, గాలి, వాన. వ్యవసాయదారుడు విత్తనాన్ని నేర్పుగా ఓర్పుతో ఈ పంచభూతాలకు అనుసంధానిస్తాడు. ఆరుగాలం శ్రమించి ఆహారోత్పత్తి చేస్తాడు. పైరు పచ్చని పంటపొలాలు, పరుగులు తీసే ఆలమందలు, మనసులు మురిసే మానవ సంబంధాలతో సుఖసంతోషాలమయమైన నాటి గ్రామ సీమలలో రైతులే కథానాయకులు. ఇతర వృత్తులవారు సందర్భానుసారం రైతులకు సేద్య ప్రక్రియలో తమవంతు సహకారాన్ని బేషరతుగా అందించేవారు. పంట చేతికొచ్చిన తర్వాత రైతులు తమకు వ్యవసాయంలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహాయం చేసిన వారికి తమ ఫలసాయంతో న్యాయమైన వాటా పంచి ఇచ్చేవారు. స్వతంత్ర భారతదేశాన్ని ఆహారకొరత నుండి గట్టెక్కించి, స్వయం సమృద్ధి సాధించిపెట్టిన ‘హరిత విప్లవం’, తదనంతర కాలంలో భారతీయ రైతుల పాలిట పెనుశాపంగా మారి ఆత్మహత్యల పరంపరకు తెరలేపింది. ఎన్నో శతాబ్దాలుగా చెక్కుచెదరని భారతీయ రైతుల ఉత్పత్తి సామర్థ్యం.. కొన్ని దశాబ్దాల కాలంలో తునాతునకలైపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను సహస్ర శతాబ్దాలుగా తమ భుజస్కంధాలపై మోసిన మన రైతులు.. నేడు రెక్కలు తెగిన పక్షులు. మునుపటికాలంలో రైతులు పలు రకాల వస్తువులను ఉత్పత్తి చేసుకొని, తమకవసరమైన ఒకటో, రెండో వస్తువులను మార్కెట్లో కొనుక్కునేవారు. కానీ నేడు అధికశాతం రైతులు ఒకటో, రెండో పంటలు పండించి, తమ సకల అవసరాలకు మార్కెట్‌పైనే ఆధారపడుతున్నారు. ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి’ అన్నట్టుగా తాము పండించిన ఉత్పత్తులను గంపగుత్తగా టోకు ధరలకు, కారు చౌకగా ధారపోసి, తమకు కావలసిన వస్తువులను ముందుగానే నిర్ణయించి ముద్రించిన అధిక ధరలకు కొనుగోలు చేయక తప్పని దుస్థితిలోనికి నేడు మన రైతులు నెట్టబడ్డారు. ఒకప్పుడు స్వచ్ఛమైన విషరహిత తాజా ఆహారోత్పత్తులను సమృద్ధిగా ఆస్వాదించిన మన గ్రామ సీమలు, నేడు విష రసాయనాలు చల్లిన కూరగాయలు, మందులతో మగ్గిన పండ్లు, యాంటీబయోటిక్స్ సహాయంతో పెంచిన కోళ్లు, కోడిగుడ్లు, కల్తీ నూనెలు, సింథటిక్ పాలు వంటి ప్రమాదకరమైన ఆహారాన్ని తినవలసివస్తున్నది. తత్ఫలితంగా ఒకనాడు భాగ్యవంతుల రోగాలుగా పరిగణించబడే క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు నేడు గ్రామ సీమలలో కాయకష్టం చేసుకు బతికే సామాన్యుల ఇళ్లలోకి కూడా జొరబడ్డాయి. పేదింటిలో అనారోగ్యం అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే. సమాజంలో పేదరికం కంటే రోగం బహు ప్రమాదకరం. చిన్న రైతు చేతిలోనే భవిత భద్రం ఏయేటికాయేడు అప్రతిహతంగా పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం సమకూర్చడానికి వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యాంత్రీకరించడం, వ్యవస్థీకరించడం తప్పనిసరి అన్నది ఒక వాదన. కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలలో తెలుస్తున్నదేమిటంటే, చిన్న సన్నకారు రైతులు 25 శాతం కన్నా తక్కువ వనరులతో 70 శాతం ఆహారాన్ని పండిస్తున్నారు. 750 కోట్ల ప్రపంచ జనాభాలో 500 కోట్లకు పైగా ప్రజలు రైతులు పండించిన ఆహారంపైనే ఆధారపడుతున్నారు. వాతావరణ మార్పులను, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఆహారోత్పత్తి చేయగల సామర్థ్యం చిన్న, సన్నకారు రైతులలో చాలా ఎక్కువ. ఇది వారు పంటల జీవ వైవిధ్యం ద్వారా సాధిస్తారు. కార్పొరేట్ వ్యవసాయం తస్మాత్ జాగ్రత్త కార్పొరేట్ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయిన ఆహారంలో ప్రతి రూపాయి విలువకు, పరోక్షంగా సమాజం మరో రెండు రూపాయలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇందులో వనరుల దోపిడీ, కాలుష్యం కారణంగా పర్యావరణం ఒక వంతు చెల్లిస్తే, ప్రజలు రాయితీలు, వృథా కారణంగా మరో వంతు చెల్లిస్తున్నారు. కార్పొరేట్ రసాయనిక వ్యవసాయం 70 శాతం వనరులను ఉపయోగించి 30 శాతం ఆహారోత్పత్తిని మాత్రమే చేస్తుంది. ఇందులో 90 శాతం నాలుగైదు పంటలు మాత్రమే (గోధుమ, మొక్కజొన్న, సోయా..)! కార్పొరేట్ వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యంలో 50 శాతం కన్నా ఎక్కువ భాగాన్ని పశువులు, కోళ్ల మేతగా వాడుతున్నారు. మరో 28 శాతం ఆహారం నిల్వలో, రవాణాలో, వాడకంలో వృ«థా అవుతున్నదని అంచనా. ఏకరీతి జన్యువులు, ఒకే రకం పంటలు సాగయ్యే విస్తారమైన క్షేత్రాలు చీడ పీడల ఉధృతికి దారితీస్తాయి. ప్రతికూల పరిస్థితులలో తీవ్రమైన పంట నష్టం జరిగి, దుర్భిక్షం తాండవించగలదు. వాన నీటి సంరక్షణ: అదే జగతికి శ్రీరామరక్ష హరిత విప్లవకాలంలో పెరిగిన సాగునీరు అత్యంత ముఖ్యమైనది. ఇందులో సింహభాగం అంటే 60 శాతం భూగర్భ జలవనరులు. మూడింట రెండు వంతుల వ్యవసాయోత్పత్తులు నేటికీ భూగర్భజల వనరులపై ఆధారపడినవే. కానీ నానాటికీ క్షీణిస్తున్న భూగర్భ జలమట్టాలు భావితరాల మనుగడకు పెనుసవాళ్లే్ల విసురుతున్నాయి. నదీ జలాలు అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర జల వివాదాలకు దారితీస్తున్నాయి. కావున, వాన నీటిని పొలాల్లో ఎక్కడికక్కడ ఒడిసిపట్టడం మినహా మరో గత్యంతరం లేదు. భారతదేశంలో తలసరి నీటి లభ్యత 1,600 ఘ.మీ. కానీ తలసరి నిల్వ సామర్థ్యం 200 ఘ.మీ. మాత్రమే. చాలా దేశాలలో తలసరి నీటి నిల్వ సామర్థ్యం 900 ఘ.మీ. పైనే. అన్నదాతను ముంచిన హరిత విప్లవం స్వతంత్ర భారతదేశాన్ని ఆహారకొరత నుండి గట్టెక్కించి స్వయం సమృద్ధి సాధించిపెట్టిన ‘హరిత విప్లవం’, తదనంతర కాలంలో భారతీయ రైతుల పాలిట పెనుశాపంగా మారి ఆత్మహత్యల పరంపరకు తెరలేపింది. కనీసం ఐదువేల సంవత్సరాలు చెక్కుచెదరని భారతీయ రైతుల ఉత్పత్తి సామర్థ్యం కేవలం యాభై సంవత్సరాల హరితవిప్లవ కాలంలో తునాతునకలైపోయింది. హరిత విప్లవ చోదకాలైన హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు రైతులను స్వాయత్తత కలిగిన ఉత్పత్తిదారుల స్థితి నుండి బహుళజాతి సంస్థల వినియోగదారులుగా మార్చివేశాయి. పెట్టుబడుల పర్వంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోసాగారు. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు, చీడపీడల విజృంభణ, కూలీల కొరత, మార్కెట్ అనిశ్చితి, దళారుల దోపిడీ మొదలైనవి రైతుల ఆదాయంలో అస్థిరతను నింపాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను సహస్ర శతాబ్దాలుగా తమ భుజస్కంధాలపై మోసిన మన రైతులు.. నేడు రెక్కలు తెగిన పక్షులు. జన్యు మార్పిడి పంటలు... ఎండమావులు... జన్యు మార్పిడి పంటలు, శాస్త్ర సాంకేతికత పరంగా అద్భుతాలే అయినా, వాటివల్ల రైతులకు ఒరిగింది మాత్రం శూన్యం. బహుళజాతి సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ జన్యు మార్పిడి పంటలు పర్యావరణానికి, మానవ మనుగడకు విసురుతున్న సవాళ్లు ఆషామాషీవి కావు. శనగపచ్చ పురుగును సమర్థవంతంగా నివారించగలిగిన జన్యుమార్పిడి బోల్గార్డ్పత్తి, గులాబిరంగు కాయ తొలుచు పురుగు ఉధృతికి నేడు అతలాకుతలమౌ తున్నది. గ్లైఫొసేట్ కలుపుమందును నిర్వీర్యం చేయగల జన్యువులను చొప్పించిన సోయా, మొక్కజొన్న, పత్తి, ఆవా, బీట్రూట్, ఆల్ఫా ఆల్ఫా పంటలలో కొన్ని రకాల కలుపు మొక్కలు గ్లైఫొసేట్కు లొంగడం మానేశాయి. అంతే కాకుండా, వేరే కలుపు మందులను కూడా గ్లైఫొసేట్తో కలిపి పిచికారీ చేయవలసి వస్తోంది. జన్యుమార్పిడి పంటల వల్ల రైతులు, విత్తన సార్వభౌమత్వాన్ని కోల్పోతున్నారు. అంతే కాకుండా పంట రకాలలో జన్యు వైవిధ్యం నశించిపోతున్నది. ఇదొక మహమ్మారి గ్లైఫొసేట్ కలుపునాశిని 1974వ సంవత్సరంలో విడుదలైనప్పటి నుండి నేటి వరకు తొంభై లక్షల టన్నుల నికర విషం ప్రపంచ వ్యాప్తంగా పంటపొలాలలో చల్లబడింది. అందులో అరవై లక్షల టన్నులు గత పది సంవత్సరాల కాలంలోనే పిచికారీ అయ్యింది. ఏటా దీని వాడకం 20 నుండి 30 శాతం పెరుగుతూ ఉంది. అంటే దాదాపు ఒకటిన్నర నుండి రెండు లక్షల టన్నుల నికర విషం ఏటేటా అదనం. దాదాపు నలభై సంవత్సరాలు మనుషులకు, పశువులకు అత్యంత సురక్షితమైనదిగా పరిగణించబడిన ఈ కలుపునాశిని, నేడు క్యాన్సర్ కారకంగానే కాక, అనేకానేక రోగాలకు పరోక్షంగా కారణ భూతమైనట్లుగా నిర్ధారించబడినది. క్యాన్సర్, అల్సర్, కిడ్నీ వ్యాధులు, ఆటిజం, అల్జీమర్స్, మధుమేహం, రక్తపోటు, ఇలా ఒకటేమిటి సర్వరోగాలు సంప్రాప్తించగలవు. గ్లైఫొసేట్ శరీరంలో అత్యధికంగా కిడ్నీలలోనూ తర్వాత లివర్లోను పోగవుతుందని పరిశోధకులు తేల్చారు. భార లోహాలను కలిగిన నీరు లేదా కలుషితమైన నీటిని తాగే ప్రజల మూత్రపిండాలలో గ్లైఫొసేట్ ఈ భారలోహాలను బంధించి మలినాల వడపోతకు అవరోధం కల్పిస్తుంది. దీర్ఘకాలంలో మూత్రపిండాలకు తీవ్రమైన హాని కలుగుతుందని పరిశోధకులు సూత్రీ కరించారు. మరోవైపు గ్లైఫొసేట్ పిచికారీ చేసిన నేలల్లో సూక్ష్మజీవులు నశించి, భూములు నిర్జీవమైపోతున్నాయి. బహుళజాతి సంస్థలు పలురకాల పంటలలో జన్యుమార్పిడి చేసి గ్లైఫొసేట్ వాడకాన్ని అనివార్యం చేస్తున్నారు. నవ్విన నాపచేలే పండుతాయి... నేడు మనం వరి, గోధుమ, మొక్కజొన్న పంటలను విస్తారంగా పండిస్తున్నాం. కానీ భవిష్యత్తులో సారవంతమైన భూములు, సాగునీటి లభ్యత తగ్గిపోతాయి. వాతావరణంలో మార్పులు, ఏకరీతిపంటలు, చీడపీడల ఉధృతి ఈ పంటల ఉత్పత్తి ఉత్పాదకతలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. పెరిగిన జనాభా అవసరాలననుసరించి సాగుకు యోగ్యం కాని భూములలో కూడా వ్యవసాయం చేయవలసి వస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా మనం నిర్లక్ష్యం చేస్తున్న జొన్న, సజ్జ, రాగి, కొర్ర, అరిక, సామా లాంటి చిరుధాన్యాలే భవిష్యత్తులో ఆహార భద్రతకే కాదు, ఆరోగ్య భద్రతకు కూడా చిరునామాలు. ఈ పంటలు వాతావరణమార్పులను నీటి ఎద్దడిని తట్టుకోగలవు. ఇప్పుడు మనం వాడుతున్న సాగునీటిలో మూడవ వంతు సరిపోతుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల అవసరం లేదు. చాలా తక్కువ కాలంలో కోతకు వస్తాయి. మధుమేహం, అధిక బరువు వంటి రోగాలకు చవకైన, చక్కటి పరిష్కారం ఈ చిరుధాన్యాలు. పర్యావరణానికి కూడా ఇవి మేలు చేయగలవు. ఉదాహరణకు జొన్న పంట తన వేర్ల ద్వారా కొన్ని రసాయనాలను మట్టిలోకి విడుదల చేసి నత్రజని గాలిలోకి ఆవిరికాకుండా నీటిలో కరిగి వెళ్లిపోకుండా బంధించివేస్తుంది. తత్ఫలితంగా ఓజోన్ పొరకు నష్టం కలిగించగల N20 ఉత్పత్తిని నిలువరిస్తాయి. దీనిని BNI (Biological Nitrification Inhibition) ఇదే భవిష్యత్ వ్యవసాయం మనుషులకు ఆధారం మట్టి. మట్టికి ఆధారం సేంద్రియ కర్బనం. ఒక ఎకరం పొలంలో సాధారణంగా వంద మెట్రిక్ టన్నుల సేంద్రియ కర్బనం ఉంటుంది. ఇది ఒక శాతం మాత్రమే. అనగా ఒక ఎకరం పొలంలో (30 సెం.మీ/ నాగలి చాలు) సుమారుగా లక్ష మెట్రిక్ టన్నుల మట్టి ఉంటుంది. సేంద్రియ కర్బనం సాగుచేస్తున్న భూములలో 0.5 శాతంగాను బీడు భూములలో 2 శాతంగాను ఉంది. హరితవిప్లవం తర్వాత సాగుభూములలో సేంద్రియ కర్బనం 0.25 శాతం అంతకన్నా తక్కువకు పడిపోయింది. దీనిని సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా కనీసం పది రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. కర్బన ఉద్గారాల ద్వారా వాతావరణ కాలుష్యానికి కారణమౌతున్న సంస్థలు, దేశాలు, కర్బన ఉద్గారాలను నిలువరిస్తున్న సంస్థలు, దేశాల వద్ద ‘కర్బన రుణధనం’ సేకరిస్తాయి. నేడు ప్రతి కిలో కర్బన రుణధనం విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఒక రూపాయిగా ఉంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా కర్బన రుణధనం పొందడానికి అర్హులు. సాటిలేని సేంద్రియ వ్యవసాయం భూసార సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు, ప్రజారోగ్య భద్రతకు సేంద్రియ వ్యవసాయం సాటి లేనిది. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వలన నేలలు జీవం కోల్పోయి నిస్సారమవుతాయి. ఉప్పు తిన్న మనుషులకు దాహం ఎలా తీరదో, రసాయనిక ఎరువులు వాడిన నేలలు కూడా దాహార్తితో తపిస్తూ ఉంటాయి. వాన నీరు నేలలోకి ఇంకక భూమిపై పరుగులు పెడుతుంది. సారవంతమైన మట్టి, వాన నీటిలో కరిగి కొట్టుకుపోతుంది. ఫలితంగా మరింత రసాయన ఎరువుల వాడకం అవసరం అవుతుంది. దాని మూలంగా భూమిలో సేంద్రియ కర్బనం అంతరించిపోతుంది. వెరసి, ఖర్చుపెరగడమే కాదు, దిగుబడులు తగ్గిపోతాయి. కావున సమగ్ర సేంద్రియ సాగు ద్వారా మాత్రమే సమాజం దీర్ఘకాలం మనగలుగుతుంది. ఆకలి కంటే పెద్ద సమస్య ఆకలి, పోషకాహార లోపం సమస్యలను అధిగమించిన అమెరికా, బ్రెజిల్, చైనా, చిలీ వంటి దేశాలలో అధిక బరువు, ఊబకాయం సవాలుగా మారింది. నేడు ప్రతి నలుగురిలో ఒకరు ఇందులో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. భారతదేశం లాంటి వర్ధమాన దేశాలకు ఈ ప్రమాదం మరింత ఎక్కువ. 2030 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది (400 కోట్లు) అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటారని అంచనా. మారక తప్పని ఆహారపు అలవాట్లు 2050 నాటికి ప్రపంచ జనాభా 910 కోట్లు చేరుకుంటుందని అంచనా. వారికి సరిపడా ఆహారోత్పత్తి జరగాలంటే మరో 70 శాతం వనరులు అదనంగా అవసరం. కానీ అప్పటికి మరో 30 శాతం వనరులు నిర్వీర్యమవుతాయి. అంటే 2050 నాటికి ఇప్పుడున్న వనరుల కంటే రెట్టింపు వనరులు అవసరం. ఇది దాదాపు అసాధ్యం. అటువంటి పరిస్థితుల్లో మన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం శుద్ధ శాకాహారం. నేడు ఉత్పత్తి అవుతున్న ఆహార ధాన్యాలు నేరుగా మనుషుల నోటికి చేరితే, 2050 వరకు సహజ వనరులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా పెరుగుతున్న జనాభాను పోషించవచ్చు. కానీ నేడు పండిస్తున్న ధాన్యంలో 36 శాతం పశువుల మేతకు, మరో 9 శాతం ఇంధనాల తయారీకి ఉపయోగించబడుతోంది. మాంసాహారం మరింత ప్రియం ఒక కిలో గొడ్డు మాంసం ఉత్పత్తి చేయడానికి అవసరమైన భూమి, నీటితో 60 కిలోల గోధుమలు ఉత్పత్తి చేయవచ్చు. ప్రతి వంద క్యాలరీల శక్తినిచ్చే ధాన్యంతో ఉత్పత్తి చేయగల మాంసాహారాలు: కోడిమాంసం 12 క్యాలరీలు/ 100 క్యాలరీలకు పంది మాంసం 10 క్యాలరీలు / 100 క్యాలరీలకు చేపలు / రొయ్యలు 9 క్యాలరీలు / 100 క్యాలరీలకు గొడ్డు మాంసం 6 క్యాలరీలు / 100 క్యాలరీలకు పాలు 44 క్యాలరీలు / 100 క్యాలరీలకు గుడ్లు 22 క్యాలరీలు / 100 క్యాలరీలకు కావున.. భవిష్యత్తులో మాంసాహార ఉత్పత్తుల పైన తీవ్రమైన ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. -
మరో యువ రైతు ఆత్మహత్య
మహానంది: కర్నూలు జిల్లాలో మరో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, తెచ్చిన రుణంపై పెరిగిన వడ్డీ ఓ యువ రైతు ప్రాణాలు బలిగొన్నాయి. ఈ సంఘటన మహానంది మండలం గోపవరం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మాబు హుస్సేని (28) పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. పైగా పంట సాగు కోసం చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతుండడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో శుక్రవారం పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన మద్దిశెట్టి వెంకటేశ్వరరావు(42) అనే రైతు శనివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పంటల కోసం చేసిన అప్పులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. -
పాతనోట్ల మార్పిడి... ఇరకాటంలో మాజీ ప్రజాప్రతినిధి
పెద్ద అంబర్‌పేట: పాతనోట్ల మార్పిడి వ్యవహారం ఓ మాజీ ప్రజాప్రతినిధిని ఇరకాటంలో పడేసింది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ ఆ నేత అనుచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జిల్లాలో కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఈ మాజీ ప్రజాప్రతినిధి గతేడాది జరిగిన పెద్దనోట్ల రద్దు సమయంలో భారీ మొత్తంలో నగదు మార్పిడి చేశారని గుర్తించిన ఐటీ శాఖ గురు, శుక్రవారాల్లో ఆయన అనుచరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. ఆ నేత బాటలో పయనించే సుమారు 40 మంది యువకులను టార్గెట్ చేసిన అధికారులు గురువారం వేకువ జామునుంచే ఒక్కొక్కరి ఇళ్లపై దాడులను మొదలుపెట్టి... అర్థరాత్రి వరకూ కొనసాగించినట్లు తెలిసింది. ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడంతో సర్వత్రా ఇదే చర్చ కొనసాగింది. నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు ఆయన అనుచరుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిలో ఒక్కొక్కరికీ రూ.20 లక్షల నుంచి రూ.కోటికి పైగా జమ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐటీ దాడులు చేసిన మాజీ ప్రజాప్రతినిధి అనుచరులంతా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పాటు చిరు ఉద్యోగాలు, కూలి పనిచేస్తున్నవారే కావడం విశేషం. ఈ దాడుల అనంతరం యువకులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా, ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధంలేదని, సదరు నాయకుడు ఆధార్, పాన్‌కార్డులు ఇవ్వమంటే ఇచ్చామని, అనవసరంగా ఇరికించారని అనుమానిత యువకులు సన్నిహితులు, ఐటీ అధికారుల వద్ద వాపోయినట్లు తెలిసింది. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే నెపంతో ఓ రైతును న్యూ డెమోక్రసీ సభ్యులు కొట్టి చంపారు. జిల్లాలోని పాల్వంచ మండలం పాండురంగాపురం పంచయాతి పరిధిలోని నర్సంపేటకు చెందిన రాయల భాస్కర్ అనే రైతును న్యూడెమోక్రసీ రవి దళ సభ్యులు దారుణంగా కొట్టి హతమార్చారు. బుధవారం ఉదయం భాస్కర్ ఇంటికి వచ్చిన 20 మంది న్యూ డెమోక్రసీ సభ్యులు అతన్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో 15 మంది మగ, ఐదుగురు మహిళ దళ సభ్యులు పాల్గొన్నట్లు సమాచారం. గతంలో ఇదే మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డిని ఇదే రవి దళం హతమార్చింది. -
ఫేసుబుక్ గూటికి టాప్ ఎగ్జిక్యూటివ్
న్యూయార్క్: ఉబెర్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఫేస్ బుక్ గూటికి చేరారు. ఉబెర్ మాజీ పీఆర్ చీఫ్ రాచెల్ వెట్స్టోన్ను ఫేస్బుక్ ఉపాధ్యక్షులుగా నియమించుకుంది. తన ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్ లకు బ్రిటన్ పీఆర్ గురుగా పేరొందిన వెట్స్టోన్ను ఎంపిక చేసింది. ఉబెర్‌లో మాజీ ఉన్నత ప్రజా సంబంధాల అధికారిగా ఉన్న రాచెల్ సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్, వాట్స్ఆప్ , మెసెంజర్‌కు కమ్యూనికేషన్ల వైస్ ప్రెసిడెంట్‌గా చేరినట్లు ఫేస్బుక్ ప్రకటించింది. ఫేస్బుక్ ఫ్యామిలీలో చేరడం తనకు గౌరవమని వెట్‌స్టోన్ సంతోషం వ్యక్తం చేశారు. తన సొంత కుటుంబం, స్నేహితులతో సన్నిహితంగా ఉండటం సులభమైందని తద్వారా వాట్సాప్ తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందనీ ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి జట్టును లీడ్ చేసిన రాచెల్ నుంచి ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన సమాచార అవకాశాలను నిర్వహించే క్రమంలో తాము మరిన్ని విషయాలను తెలుసుకునే అవకాశం కలగినందుకు సంతోషిస్తున్నామని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ కమ్యూనికేషన్స్) కారిన్ మారోనీ అన్నారు. కాగా బ్రిటన్ అత్యంత శక్తివంతమైన కన్జర్వేటివ్ రాజకీయ నాయకులకు పనిచేసిన వెట్ స్టోన్ కార్పొరేట్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్‌లో ఉబెర్‌కు రాజీనామా చేశారు. అంతకుముందు గూగుల్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా పనిచేశారు. అంతేకాదు ఆమె డేవిడ్ కామెరాన్ , జార్జ్ ఒస్బోర్న్ లకు స్నేహితురాలు. అలాగే హోవార్డ్‌కి రాజకీయ కార్యదర్శిగా టోనీ బ్లెయిర్ లేబర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కన్జర్వేటివ్ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించారు. -
పిల్లలకు దానగుణం నేర్పించండి
తల్లిదండ్రులకు మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ లక్ష్మీనారాయణ సూచన ఘనంగా కోనసీమ ఐ బ్యాంక్ సప్తమ వార్షికోత్సవం అమలాపురం టౌన్ : పుట్టినరోజు వేడుకలు చేసుకుని అవి వాట్సాప్‌ల్లో పెట్టి ఆనందించే నేటి యువత అదే పుట్టిన రోజున రక్తం దానం చేసి ఆ దృశ్యాన్ని వాట్సాప్‌ల్లో పెట్టినప్పుడు వచ్చే ఫలితాలు పవిత్రం, పరమార్థంతో ఉంటాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అడిషనల్ డీజీసీ లక్ష్మీనారాయణ అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇదే స్ఫూర్తిని.. దానగుణాన్ని నేర్పించాలని ఆయన సూచించారు. అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం జరిగిన యర్రా బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంక్ సప్తమ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ సేవే మాధవ సేవ సూక్తిని అందరూ తప్పకు పాటించాలని లక్ష్మీనారాయణ సూచించారు. నేత్ర, అవయవ, రక్త దానాలు చేయడం అలవర్చుకోవాలని కోరారు. మనం చనిపోయిన తర్వాత మన్నులో కలిసిపోయే అవయవాలను నిర్వీర్యం చేసే కంటే అవయవదానం చేస్తే మన మరణాంతరం మానవాళికి ఉపయోగపడతాయని గుర్తు చేశారు. ఒక పల్లె ప్రాంతమైన కోనసీమలో యర్రా బలరామమూర్తి ఐ బ్యాంక్ గత ఏడేళ్లలో 1200 కార్నియాలను సేకరించి 700 మందికి కంటి చూపు ఇచ్చేందుకు దోహదపడిదంటే సాధారణ విషయం కాదని లక్ష్మీనారాయణ అన్నారు. ఆ ఐబ్యాంక్ చైర్మన్ యర్రా నాగబాబును, వారి తండ్రి యర్రా బలరామమూర్తిని సభాముఖంగా ప్రశంసించారు. మనకు మంచి చేసినప్పుడు భగవంతుడికి మన థాంక్స్ చెప్పుకోవడం కాదు... సమాజ హితమైన నేత్ర, రక్త, అవయవ దానాలు చేసినప్పుడు భగవంతుడే మనకు థాంక్స్ చెప్పినట్టుగా మీ దానాలు పొందిన వారే పొగుడుతున్నప్పుడు అనిపిస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఐ బ్యాంక్ చైర్మన్ యర్రా నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుక సభలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, పాముల రాజేశ్వరిదేవి, చిల్లా జగదీశ్వరి, రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు, రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా నవీన్, రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ డైరెక్టర్ గణపతి వీర రాఘవులు, రాష్ట్ర కాపు వెబ్ సైట్ అధ్యక్షుడు యాళ్ల వరప్రసాద్ పాల్గొని ఐ బ్యాంక్ సేవలను కొనియాడారు. తొలుత వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం నేత్రదానం చేసిన వారి కుటుంబీలకు, ప్రొత్సహించిన వారికి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కోనసీమ ఐ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు, టెక్నీషియన్ కె. స్వర్ణలత సేవలను కూడా వక్తలు కొనియాడారు. -
‘మాధ్యమిక ’ మాఫియా
విద్యా విధానంలో మార్పు రావాలి మాజీ ఎంపీ హర్షకుమార్ కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) : ఇంటర్మీడియెట్ విద్య ఒక మాఫియాలా తయారైందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుస్తెలు సైతం తాకట్టుపెట్టుకుని తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జూన్ ఒకటి నుంచి కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలి, అయితే ఫలితాలు వచ్చిన రోజే ఆయా కళాశాలల్లో సీట్లు అయిపోయాయని చెబుతున్నారని, ఎక్కడా రిజ్వేషన్ అమలు చేయడం లేదున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రూ.2,300 వరకు అయితే ఒకో విద్యార్థి నుంచి రూ.లక్షల్లో గుంజడం మాఫియాను తలపిస్తోందన్నారు. కళాశాలలన్నింటికీ ఒకే ఫీజు విధానం అమలు చేయాలన్నారు. పేద విద్యార్థుల్లో మంచి మార్కులు వచ్చిన వారిని తీసి, వారికి కార్పొరేట్ విద్యాసంస్థల్లో రూ.70 వేల వరకు ప్రభుత్వమే ïఫీజు కట్టడం ఎంత దారుణమో తెలుస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలలు నడుచుకోకపోతే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఇంటర్ బోర్డు ఆర్ఐవోకు ఉందన్నారు. బలహీన వర్గాలకు చెందిన 12 వేలమందికి పైగా విద్యార్థులు స్కాలర్షిప్కు నోచుకోలేదన్నారు. ఇంటర్ విద్యలో తయారైన మాఫియాను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ఆయన కోరారు. పది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం సాధించడం ఆనందదాయకమన్నారు. -
ప్రజాసమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం
కేంద్ర మాజీమంత్రి పళ్లంరాజు మండపేట : ప్రజాసమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి మళ్లిపూడి మంగపతి పళ్లంరాజు విమర్శించారు. పీసీసీ అధికార ప్రతినిధి కామన ప్రభాకరరావు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నాళం వారి సత్రంలో జరిగిన జన ఆక్రోష్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పళ్లంరాజు మాట్లాడుతూ నవంబరు 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం సామాన్యులను రోడ్డున పడేసిందన్నారు. డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దోపిడి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రజావ్యతిరేక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కామన మాట్లాడుతూ ప్యాకేజీ పేరిట చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారిలో పార్టీ నేతలు పళ్లంరాజు, నానాజి, కామన తదితరులు ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. పార్టీ నాయకులు బోడా వెంకట్, ఎస్ఎన్ రాజా, జి. ఏడుకొండలు, నంద, వి. వీరాస్వామి, సురేష్‌కుమార్, దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అంతర పంట.. లాభాల బాట
పెరవలి: కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాలా సరి పోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉం టే పుడమితల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు పెరవలి మండ లం ముక్కామలకు చెందిన కౌలు రైతు మాకే వీరబాబు. నాలుగెకరాల కొబ్బరి తోటలో పసుపు సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో మెళకువలు ఆయన మాటల్లోనే.. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మూడేళ్ల క్రితం నాలుగు ఎకరాల కొబ్బరి తోటను ఏడాదికి రూ.30 వేలు చొప్పున కౌలుకు తీసుకుని పసుపు సాగు చేపట్టాను. దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మార్కెట్టులో గిట్టుబాటు ధర లభించక రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. దీంతో పసుపు సాగుకు ముందు ఆకుకూరలను పండించాను. సీజన్ రాగానే పసుపు సాగు చేశాను. ఆకుకూరల ఆదాయం పెట్టుబడికి సరిపోయింది. పుట్టు పసుపు రూ.3 వేలు పసుపు ఊరటానికి ముందు చేలో మూడుసార్లు దుక్కులు దున్నాను. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 10 టన్నులు వేసి, నీరు పెట్టి విత్తనం నాటాం. అధికారులు సూచనలతో ఎరువులు వినియోగించాం. గతేడాది ఎకరానికి 50 పుట్టుల (పుట్టు అనగా 236 కిలోలు) పసుపు ఊరింది. పచ్చిపసుపు పుట్టు రూ.3 వేలు చొప్పున అమ్మాను. నష్టాలను పూడ్చుకోగలిగాను. ప్రస్తుతం పసుపు సాగు చేపట్టాం. కొబ్బరితోటల్లో అనువైన విత్తనం గోదావరి జిల్లాల్లో కస్తూరి రకం పసుపు సాగు చేస్తారు. నేను దుగ్గిరాల పసుపు వే శాను. ఈ పసుపు దిగుబడితో పాటు మార్కెట్టులో మంచి ధర లభిస్తుంది. గతేడాది పుట్టు విత్తనం పసుపు రూ.5 వేలకు కొనుగోలు చేశాను. కొబ్బరితోటల్లో దుగ్గిరాల పసుపు సాగుకు అనుకూలం. ఈ పంటకు నీడ అవసరం. ప్రస్తుతం 4 ఎకరాల్లో పసుపు సాగుకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. వాతారవణం అనుకూలిస్తే ఈ ఏడాది లాభాలు వస్తాయి. ఖర్చుతక్కువ లాభం ఎక్కువ కొబ్బరి తోటలో పసుపు సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో బోదెలు తవ్వాలి. చచ్చు ఎక్కేయాలి. ఎరువులు ఎక్కువగా వినియోగించాలి. కొబ్బరి తోటలో పసుపుకి బోదెలు, చచ్చు ఎక్కేయటం వంటి పనులుండవు. దీంతో ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఎరువుల ఖర్చుకూడా తగ్గుతుంది. చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ తోటల్లో వేసే పసుపుకి రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులను ఎక్కువ వినియోగిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. -
అంతర పంట.. లాభాల బాట
పెరవలి: కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాలా సరి పోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉం టే పుడమితల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు పెరవలి మండ లం ముక్కామలకు చెందిన కౌలు రైతు మాకే వీరబాబు. నాలుగెకరాల కొబ్బరి తోటలో పసుపు సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో మెళకువలు ఆయన మాటల్లోనే.. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మూడేళ్ల క్రితం నాలుగు ఎకరాల కొబ్బరి తోటను ఏడాదికి రూ.30 వేలు చొప్పున కౌలుకు తీసుకుని పసుపు సాగు చేపట్టాను. దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మార్కెట్టులో గిట్టుబాటు ధర లభించక రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. దీంతో పసుపు సాగుకు ముందు ఆకుకూరలను పండించాను. సీజన్ రాగానే పసుపు సాగు చేశాను. ఆకుకూరల ఆదాయం పెట్టుబడికి సరిపోయింది. పుట్టు పసుపు రూ.3 వేలు పసుపు ఊరటానికి ముందు చేలో మూడుసార్లు దుక్కులు దున్నాను. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 10 టన్నులు వేసి, నీరు పెట్టి విత్తనం నాటాం. అధికారులు సూచనలతో ఎరువులు వినియోగించాం. గతేడాది ఎకరానికి 50 పుట్టుల (పుట్టు అనగా 236 కిలోలు) పసుపు ఊరింది. పచ్చిపసుపు పుట్టు రూ.3 వేలు చొప్పున అమ్మాను. నష్టాలను పూడ్చుకోగలిగాను. ప్రస్తుతం పసుపు సాగు చేపట్టాం. కొబ్బరితోటల్లో అనువైన విత్తనం గోదావరి జిల్లాల్లో కస్తూరి రకం పసుపు సాగు చేస్తారు. నేను దుగ్గిరాల పసుపు వే శాను. ఈ పసుపు దిగుబడితో పాటు మార్కెట్టులో మంచి ధర లభిస్తుంది. గతేడాది పుట్టు విత్తనం పసుపు రూ.5 వేలకు కొనుగోలు చేశాను. కొబ్బరితోటల్లో దుగ్గిరాల పసుపు సాగుకు అనుకూలం. ఈ పంటకు నీడ అవసరం. ప్రస్తుతం 4 ఎకరాల్లో పసుపు సాగుకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. వాతారవణం అనుకూలిస్తే ఈ ఏడాది లాభాలు వస్తాయి. ఖర్చుతక్కువ లాభం ఎక్కువ కొబ్బరి తోటలో పసుపు సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో బోదెలు తవ్వాలి. చచ్చు ఎక్కేయాలి. ఎరువులు ఎక్కువగా వినియోగించాలి. కొబ్బరి తోటలో పసుపుకి బోదెలు, చచ్చు ఎక్కేయటం వంటి పనులుండవు. దీంతో ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఎరువుల ఖర్చుకూడా తగ్గుతుంది. చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ తోటల్లో వేసే పసుపుకి రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులను ఎక్కువ వినియోగిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. -
ద్విచక్ర వాహనం ఢీకొని రైతు దుర్మరణం
మదనపల్లె టౌన్: ద్విచక్ర వాహనం ఢీకొనడంతో రైతు దుర్మరణం చెందిన సంఘటన పీటీఎంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు... పీటీఎంకు చెందిన బందార్ల సూర్యనారాయణ కుమారుడు మల్లికార్జున(43) వ్యవసాయంతోపాటు ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ భార్య సత్యవతి, కుమార్తెలు శ్రావణి, నందిని, కావ్య, లహరి, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే సొంత పనిమీద కందుకూరుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలోని మద్దయ్యగారిపల్లె మలుపు వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతును 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలిస్తుండగా మల్లికార్జున మృతిచెందాడు. పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడిన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. -
ఆయనో భ‘వనమాలి’
మేడపైనే ఆయన పెరడు ∙పూలూ, కూరలూ బోలెడు రాజమహేంద్రవరం రూరల్ : ఇల్లంటే.. ఇటుకలూ, కాంక్రీటూ, తలుపులూ, కిటికీలుండి, కొన్ని రంగుల్ని అద్దుకునే కట్టడమే కాదు.. కాసింత పచ్చదనాన్నీ సంతరించుకోవాలనుకునే వారు చాలామందే ఉంటారు. ఏవైనా మెుక్కలు పెంచాలన్న మక్కువా ఉంటుంది. అయితే అలా పెంచి తృప్తిని సొంతం చేసుకునే అవకాశం అందరికీ ఉండదు. ఎందుకంటే.. ఎందరో ఫ్లాట్లలో లేదా పెరడు లేని ఇళ్లలో నివసిస్తున్న ఈరోజుల్లో మెుక్కలు పెంచాలన్న తపన ఉన్నా ఆచరణలో సాధ్యం కాదు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన సవిరిగాని కృష్ణమూర్తికీ మెుక్కల పెంపకమంటే ప్రీతి. ఆయన ఇంటికీ పెరడులేదు. అలాగని.. ‘చేసేదేముందిలే’ అని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. డాబాపై భాగాన్నే పెరడును సృష్టించుకున్నారు. వివిధ రకాలు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పూలూ పూయిస్తున్నారు. రెండేళ్ళ క్రితం హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని పెద్దకుమార్తె ఇంటికి వెళ్ళారు. అక్కడ పక్కనున్న డాబాపై కూరగాయలు సాగు చేయడాన్ని చూసిన కృష్ణమూర్తి అదే స్ఫూర్తితో తానూ భ‘వనాని’కి శ్రీకారం చుట్టారు. పొడవాటి తొట్టెలను తయారు చేయించారు. వాటితో పాటు డబ్బాలు, కుండీలలో మట్టిని నింపి, సేంద్రియ ఎరువులను వేసి బెండ, వంగ, బీర, కాకర, దోస, చిక్కుడు, గోరుచిక్కుడు, బొబ్బరచిక్కుడు, పచ్చి మిరప వంటి మెుక్కలూ, పాదులూ పెంచుతున్నారు. తోటకూర, గోంగూర, బచ్చలి, కొత్తిమీర వంటి ఆకుకూరలనూ పండిస్తున్నారు. కరివేపాకు మొక్కలనూ పెంచారు. అనేక రకాల పూలమెుక్కలతో పాటు పూజ కోసం తమలపాకులను సైతం పండిస్తున్నారు. ఉదయం లేవగానే భ‘వనమాలి’గా మొక్కల సంరక్షణే ఆయన వ్యాపకం. ఆ కృషిలో భార్య దుర్గ చేదోడుగా ఉంటారు. కృష్ణమూర్తి దంపతులు రెండేళ్లుగా తమ కూరల ఖర్చును గణనీయంగా తగ్గించుకోవడమే కాక.. ‘మేడ మీది పెరడు’లో కాసిన వాటిని ఇరుగుపొరుగుకూ, బంధుమిత్రులకూ ఇస్తున్నారు. -
ముంచిన మక్క
ధర పెరిగినా.. దిగుబడి రాకపాయె గతేడాది రేటును చూసి సాగు చేసిన రైతులు వర్షాలు లేక ఎండిపోయిన పంటలు పెట్టుబడి కూడా రాక ఆందోళనకు గురవుతున్న కర్షకులు జిల్లా వ్యాప్తంగా 58,044 హెక్టార్లలో పంటల సాగు కేసముద్రం : కొండ నాలుకకు మందు వేస్తే..ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా మారింది జిల్లాలోని మొక్కజొన్న రైతుల పరిస్థితి. వాణిజ్య పంట పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులను సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని ప్రభుత్వం పలు సూచనలు చేయడంతోపాటు మార్కెట్లో గతేడాది మక్కలకు ధర బాగా పలకడంతో జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు దీనివైపే మొగ్గుచూపారు. అయితే సీజన్ ప్రారంభంలో మురిపించిన వరుణుడు తర్వాత ముఖం చాటేయడంతో చేతికి వచ్చిన మొక్కజొన్న ఎండిపోయింది. లాభాల కోసం ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఖరీఫ్ సీజన్‌ను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న 50,015 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా, 58,044 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది మార్కెట్లలో ప్రభుత్వ మద్దతు ధరకు మించి రేటు ఉండడంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగువైపు మొగ్గుచూపారు. గత జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా జూన్‌లో 137.2 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం ఉండగా, 244.52 మి.మీ వర్షపాతం నమోదైంది. జూలైలో 287.75 మి.మీ సాధారణ వర్షపాతం ఉండగా, 276.73 వర్షపాతం నమోదైంది. ఆగస్టు మొదటి వారంలో 48.25 మి.మీ వర్షపాతం కురవగా, తర్వాత పలుచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎండిపోతున్న మొక్కజొన్నను బతికించుకునేందుకు బావులపై ఆధారపడిన రైతులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే భూగర్భజలాలు అడుగంటి పోవడంతో పాటు సరిగా నీళ్లు పారకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు వచ్చాయి. పలుచోట్ల మోకాలు దశ నుంచి తలనెరిసే దశ, కంకి దశ, గింజపాల దశ వరకు వచ్చి ఆగిపోయి ఎండిపోతున్నాయి. దీంతో పలువురు రైతులు మనోవేదనకు గురై తమ పంటలను పశువులకు మేతగా అందిస్తున్నారు. కాగా, కొన్ని చోట్ల ఎకరాకు 10 క్వింటాళ్ల లోపే దిగుబడులు రావడంతో వారు లబోదిబోమంటున్నారు. వెలవెలబోతున్న మక్కల రాశులు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో గతేడాదితో పోల్చితే ఈసారి మక్కల రాశులు వెలవెలబోతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 15,395 క్వింటాళ్లు, అక్టోబర్‌లో 65,257 క్వింటాళ్లు, నవంబర్‌లో 6,807 క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి రాగా.. ప్రస్తుతం ఇప్పటి వరకు కేవలం 672 క్వింటాళ్లు మాత్రమే అమ్మకానికి వచ్చాయి. మొత్తంగా గతేడాది 87,459 క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి రాగా.. ఈసారి ఇప్పటివరకు సగం కూడా రాలేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మక్కలకు మద్దతు ధర క్వింటాకు రూ.1325 ఉండగా, గత సెప్టెంబర్‌లో క్వింటాకు గరిష్ట ధర రూ.1567, అక్టోబర్‌లో గరిష్ట ధర రూ.1456, నవంబర్‌లో గరిష్ట ధర రూ.1592 పలికింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం 350 క్వింటాళ్ల మక్కలు రాగా, గరిష్ట ధర రూ.1761, కనిష్ట ధర రూ.1401లు పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ధర విపరీతంగా పెరిగినప్పటికీ దిగుబడి బాగా తగ్గడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. -
‘బోరు’న విలపిస్తూ..
-
విద్యుదాఘాతంతో రైతు మృతి
తుమ్మలపల్లి (గట్టు): బోరు మోటారును ఆఫ్ చేసేందుకు వెళ్లిన ఓ యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గట్టు మండలం తుమ్మలపల్లికి చెందిన బోయ తిమ్మప్ప(28), బోయ భీమన్న అన్నదమ్ములు. తండ్రి సంపాదించిన ఐదు ఎకరాలను ఇద్దరు రెండున్నర ఎకరాల చొప్పున పంచుకుని, రెండు బోర్లు వేసుకుని సేద్యం చేసుకుంటున్నారు. వీరి పొలం గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉండడంతో వ్యవసాయ పొలం దగ్గరే అన్నదమ్ములు గుడిసెలు వేసుకుని, అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరు ఎకరా చొప్పున సీడ్‌పత్తిని సాగు చేశారు. రోజులాగే బుధవారం సాయంత్రం సీడ్ పత్తికి నీరు పారించిన బోయ తిమ్మప్ప బోరును ఆఫ్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య గోవిందమ్మతో పాటు ఇద్దరు కుమారులున్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
'నా చావుకు వారే కారణం..'
బెంగళూరు: తన చావుకు మంత్రులే కారణం అని వీడియో రికార్డింగ్ చేసి శివణ్ణ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి తాలుకా గవి నాగమంగళ గ్రామంలో చోటుచేసుకుంది. శివణ్ణకు అదే గ్రామంలోని బంధువుల కుటుంబంతో ఆస్తి వివాదం ఉంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఇటీవల శివణ్ణ కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు దాడి చేశారు. శివణ్ణ భార్యను నడిరోడ్డు పై వివస్త్రను చేసి అవమానించారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మంత్రుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినా అక్కడ కూడా ఫలితం లేకుండాపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన విషం తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అంతకుముందు అతడు రికార్డ్ చేసిన వీడియోలో 'నా కుటుంబానికి చెందిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాల్సిందిగా ఎంతగానో బతిమాలాను. అయినా పోలీసులు నన్ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అప్పటి మంత్రి కె.జె.జార్జ్‌తో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ దృష్టికి తీసుకొచ్చినా వారు న్యాయం చేయలేదు. వీరు డీవైఎస్పీ లక్ష్మీగణేష్, స్థానిక పోలీసులు కూడా నా చావుకు కారణం'అని పేర్కొన్నాడు. మరోపక్క, డీజీపీ ఓం ప్రకాష్ కుమారుడు కార్తికేష్ పేరును కూడా శివణ్ణ పేర్కొనడం చర్చకు దారి తీస్తోంది. -
విద్యుదాఘాతంతో కౌలురైతు మృతి
వేట్లపాలెం(సామర్లకోట): పొలంలో పనిచేస్తున్న ఓ కౌలురైతు విద్యుదాఘాతానికి గురై శుక్రవారం మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేట్లపాలెం శివారు దోమాడపాకలులోని పొలానికి శుక్రవారం ఉదయం కౌలురైతు కరోటి దుర్గాప్రసాద్ (35) వెళ్లాడు. పొలానికి నీరు పట్టేందుకు బోరు మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి హెచ్‌సీ వి. నాగేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాత ఆశలకు గండి!
తోటపల్లి ఎడమ కాలువకు భారీగండి పరిమితికి మించి నీరు విడుదలే కారణమనే విమర్శలు 55 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం సైపూన్ మరమ్మతులకు నిధులు మంజూరైనప్పటికీ టెండర్లు పిలవని అధికారులు తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు రైతుల ఆశలకు ఆదిలోనే గండిపడింది. పెద్దబుడ్డిడి–సంతనర్సిపురం మధ్యలో ఉన్న కాలువ సైపూన్‌కు గురువారం భారీ గండి పడడంతో నీరు వృథాగా ఒట్టిగెడ్డలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు కాలువకు నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో 55 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వరుణుడు ముఖం చాటేయడంతో చాలాచోట్ల వరినాట్లు పడలేదు. అక్కడక్కడ పడిచోట వేసవిని తలపిస్తున్నట్టు ఎండలు మండిపోతుండడంతో ఎండిపోతున్నాయి. ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతోందనుకుంటే.. గండి పడడంతో రైతుల ఆశలు అడిఆసలయ్యాయి. 2011 అక్టోబర్ నాలుగో తేదీన కూడా ఇదే సైపూన్ ప్రధాన గట్టు విరిగిపోవడంతో భారీ గండి పడి 23 రోజులు సాగునీరందక పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజా గండితో అన్నదాత గుబులు చెందుతున్నాడు. వీరఘట్టం: తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు గండి పడడంతో సాగునీరు అందుతోందో..లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వంద మీటర్ల పొడవు ఉన్న సైపూన్‌కు సుమారు 50 మీటర్లు గండి ఏర్పడడంతో కాలువ ద్వారా వస్తున్న వేలాది క్యూసెక్కులనీరు ఒట్టిగెడ్డలో కలిసిపోయింది. దీంతో నీటిని అధికారులు నిలిపివేయడంతో తిరిగి నీటిని ఎప్పుడు ఇస్తారు, గండిని ఎప్పుడు పూడ్చుతారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ధనదాహమే గండికి కారణం! అధికార పార్టీ నాయకుల ధనదాహమే గండి పడటానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. కాలువ పరిస్థితిని ఇటీవల ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేసి మరమ్మతులు అవసరమని భావించారు. ఇందుకోసం రూ.38.50 లక్షలతో గట్టు నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. నిధులు కూడా ఈ ఏడాది మే నెలలో మంజూరు అయినప్పటికీ పనులు జరిపించడంలో అధికార పార్టీ నాయకులు తమ ప్రతాపాన్ని చూపించారు. టెండర్ల ద్వారా పనులు జరిపితే తమకు ప్రయోజనం లేదని, ఆ నిధులను విభజించి నామినేటెడ్ పనులు చేపట్టి నిధులు కాజేయాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే టెండర్లను పిలవకుండా అధికార ప్రతాపాన్ని చూపించడంతో జలవనరుల శాఖాధికారులు టెండర్లు పిలవకుండా పనులను పక్కన పెట్టేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వందేళ్ల చరిత్ర ఉన్న తోటపల్లి కాలువలను ఆధునీకరించకుండా తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కొన్నిచోట్ల కాలువలు అక్రమణలకు గురై పూడికలతో నిండిపోయావి. ఈ పరిస్థితుల్లో అప్పటి డిజైన్ ప్రకారం సైపూన్ వద్ద ఆరు అడుగుల నీరు విడుదల చేస్తే తప్ప సాగునీరు అందని పరిస్థితి. ఆ స్థాయిలో నీరు విడుదల చేస్తే కాలువ ప్రారంభమయ్యే చోటే గండి పడేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని నీటి పారుదల శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత వారం రోజులుగా శివారు రైతులు సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితిల్లో ఉన్నతాధికారులు దిగువస్థాయి సిబ్బందిని మందలించి వారిని బాధ్యులను చేశారు. దీంతో ఒత్తిడిలో ఉన్న అధికారులు పరిమితికి మించి నీటిని కాలువలోకి విడిచిపెట్టారు. నీరు విడిచిపెట్టిన 24 గంటల లోపే బలహీనంగా ఉన్న గట్లు వద్ద లీకులు ఏర్పడి..కోతకు గురై సైపూన్ వద్ద గండి పడింది. 55 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం తోటపల్లి ఎడమ కాలువ పరిధిలో అధికారికంగా సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టు. ఉంది. అయితే ఈ ఏడాది ఖీరీఫ్ ప్రారంభంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో.. శివారు పొలాలకు కూడా సాగునీరందించడమే తమ లక్ష్యమని అధికారులు ప్రకటించారు. దీంతో మరో 25 వేల ఎకరాల ఆయకట్టు పెరిగింది. ఇప్పటి వరకూ 55 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అయితే తాజాగా కాలువకు గండి పడడంతో సాగునీరు ఎక్కడ అందదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బందిపై ఎస్ఈ ఆగ్రహం సైపూన్ మరమ్మతులకు నీరు–చెట్టులో భాగంగా మంజూరైన రూ.38.50 లక్షల నిధులతో పనులు చేయించకపోవడంపై స్థానిక అధికారులపై బొబ్బిలి సెక్షన్ జలవనరుల శాఖ ఎస్ఈ ఎం.వి.రమణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి శ్రీకాకుళం డివిజన్లో ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నాలుగు రోజుల్లో మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఒట్టిగెడ్డలో వస్తున్న నీటిని మళ్లించి పనులు చేయించాలని సూచించారు. అంతకుముందు గండిని పరిశీలించారు. ఆయనతో పాటు ఈఈ రవీంద్ర, డీఈఈ గనిరాజు, ఏఈలు ఉదయభాస్కర్, రాజేష్‌కుమార్, దాలయ్య,తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ నిమ్మక పాండురంగ ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం తోటపల్లి ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా మారింది. కాలువలను అభివృద్ధి చేయాలని, ఆధునికీకరణ పనులు చేపట్టాలని ఎన్నోసార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కాలువల అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ తరఫున అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేపడతాను. – విశ్వసరాయి కళావతి,పాలకొండ ఎమ్మెల్యే -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దఅడిశర్లపల్లి : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిపేటకు చెందిన రైతు నీలం వెంకటయ్య (50) వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. రోజూ వారీ మాదిరిగానే శుక్రవారం తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే వెంకటయ్య పొలం మీదుగా 33/11 కేవీ విద్యుత్ వైర్లు కిందికి వేలాడబడి ఉన్నాయి. ఇది గమనించని వెంకటయ్య విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన సమీప రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆసుపత్రికి తరలిద్దామని అనుకుంటుండగా అప్పటికే వెంకటయ్య మృతి చెందాడు. కాగా తన పొలం మీదుగా విద్యుత్ వైర్లు కిందికి వేలాడి ప్రమాదకరంగా ఉండటంతో వెంకటయ్య గతంలో పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదని.. వారి నిర్లక్ష్యం కారణంగానే తాము కుటుంబ పెద్దను కోల్పోయామని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా మృతి చెందిన వెంకటయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె వివాహం చేయగా ఇద్దరు కుమార్తెలకు వివాహానికి ఉన్నారు. -
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
కట్టంగూర్ : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ముత్యాలమ్మగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కారింగు దుర్గయ్య(45) తనకున్న మూడు ఎకరాలతోపాటు మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. అయితే రెండేళ్లుగా వర్షాభావంతో సాగు చేసిన పత్తి ఎండిపోవటంతో రైతు అప్పులపాలయ్యాడు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆరెకరాల్లో వేరుశనగ, కంది, పెసర, వరిపంటలు సాగుచేశాడు. అయితే సరిగ్గా వర్షాలు లేక పంటలు వాడుబారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చేసిన అప్పులు ఎలా తీరుతాయనే మనస్తాపంతో శుక్రవారం మధ్యాహ్నం వేరుశనిగచేను వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కొనఊపిరితో ఉన్న దుర్గయ్యను నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమకు సుమారు రూ.5లక్షల అప్పు ఉన్నట్లు మృతుడి భార్య తెలిపింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు. కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య శ్యామల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. -
టాక్లీలో రైతు ఆత్మహత్య
మూడేళ్లుగా కలిసిరాని వ్యవసాయం అప్పులు బాధ తాళలేక అఘాయిత్యం బేల : మండలంలోని టాక్లీ గ్రామానికి చెందిన రైతు కడ్కే బండు(45) శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తీరని అప్పులు.. తీసిన ప్రాణాలు కడ్కే బండు నాలుగు ఎకరాల సొంత భూమితో పాటు అత్త పేరిట ఉన్న మరో ఆరు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. సాగు కోసం సిర్సన్న గ్రామంలోని తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకులో భార్య పేరిట ఉన్న నాలుగు ఎకరాల సొంత భూమిపై రూ.లక్షా 15 వేలు, అత్త పేరిట ఉన్న ఆరు ఎకరాల భూమిపై రూ.లక్షా 20 వేల రుణం తీసుకున్నాడు. దీంతో పాటు ప్రైవేటుగా రూ.లక్ష వరకు బాకీ చేశాడు. కాగా, మూడేళ్లుగా వ్యవసాయం కలిసిరాలేదు. పంట దిగుబడులు ఆశించిన మేర రాకపోవడంతో, ఈ అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో పాటు ఇంట్లో పెళ్లికి వచ్చిన కూతురు ఉంది. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చలేనని, పెద్ధ కూతురు పెళ్లి చేయలేనని దిగులుతో రైతు కడ్కే బండు శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి సమీపాన పశువుల పాకలో పురుగుల మందు తాగాడు. ఇంటి ఆవరణలోకి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన భార్య, పిల్లలు ఇరుగు పొరుగు సహకారంతో వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కాగా, మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బొల్లు నానా పేర్కొన్నారు. -
పైర్లకు ఊపిరి!
ఎమ్మిగనూరులో అత్యధికంగా 95.6 మిమీ వర్షం 57శాతం భూముల్లో పంటలు సాగు వారం రోజుల్లోనే లక్షకు పైగా హెక్టార్లలో పంటలు కర్నూలు(అగ్రికల్చర్): జూలై నెలలో వర్షాలు కొంత అలస్యం అయినా ఆశాజనకంగా పడుతుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. మంగళవారం రాత్రి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎమ్మిగనూరు, దేవనకొండ, గోనెగండ్ల మండలాల్లో భారీ వర్షాలు పడటంతో హంద్రీకి వరద నీరు భారీగా వచ్చింది. అయా మండలాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత వారం నాటికి జిల్లాలో 2.48 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగు అయ్యాయి. వర్షాలు పడుతుండటం వల్ల వారం రోజులు వ్యవధిలో లక్ష హెక్టార్లకు పైగా పంటలు సాగు కావడం విశేషం. పత్తి, కంది, వేరుశనగ సాగు గణనీయంగా పెరుగతోంది. మంగళవారం రాత్రి అత్యధికంగా 95.6 మిమీ వర్షపాతం నమోదు అయింది. దేవనకొండలో 87.4, మద్దికెరలో 74.4, గొనెగండ్లలో 72.6, పత్తికొండలో 55.4, నందవరంలో 48.0, తుగ్గలిలో 46.4, మంత్రాలయంలో 41.2, ఆస్పరిలో 40.0, శిరువెళ్లలో 39.6, నంద్యాలలో 38.0, మహనందిలో 34.2, దొర్నిపాడులో 33.0, చిప్పగిరిలో 30.0,బండి ఆత్మకూరులో 28.2 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 117.2 మిమీ ఉండగా ఇప్పటి వరకు 90.8 మిమీ వర్షపాతం నమోదు అయింది. పది రోజులు వ్యవధిలోనే 65 మిమీ వర్షపాతం నమోదు కావడం విశేషం. ఈ నెల మొదటి నుంచి వర్షాలు లేకపోవడం వల్ల పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు పూర్తి స్థాయిలో కోలుకున్నాయి. మరో 10 రోజుల్లో వర్షాధారం కింద పూర్తి స్థాయిలో సాగు అయ్యే అవకాశం ఉంది. పత్తి సాగు భారీగానే.. జిల్లాలో పత్తి భారీగానే సాగు అయింది. ఇప్పటికే 1.10 లక్షల హెక్టార్లలో సాగు కావడం విశేషం. కంది సాగు క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో 65,123హెక్టార్లు, వేరుశనగ 84,425, మినుము 10096, మొక్కజొన్న 19095, ఆముదం 13170, మిరప 9085, ఉల్లి 13465 హెక్టార్లలో సాగు చేశారు. సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3.53 లక్షల(57 శాతం) హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. -
యువ రైతు ఆత్మహత్య
నార్నూర్ : మండలంలోని నాగల్కొండ పంచాయతీ పరిధి దేవాపాటర్ గ్రామానికి చెందిన గోర్సెంగే బాలాజీ(35) అనే యువ రైతు బుధవారం తన చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం... బాలాజీ ఈ ఏడాది మొదటిసారిగా తనకున్న ఐదు ఎకరాల భూమిలో పత్తి పంట సాగు ప్రారంభించాడు. మొదటిసారిగా విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండోసారి వేశాడు. పత్తిలో కలుపు మొక్కలు అధికంగా ఉండడంతో రెండు రోజులుగా గడ్డి మందును పిచికారి చేస్తున్నాడు. కలుపు మొక్కలు అధికంగా తయారవడంతో ఇంకా పెట్టుబడి పెట్టలేక చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శశికళాబాయి, నలుగురు పిల్లలున్నారు. రైతు ఆత్మహత్య విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై రాణాప్రతాప్ తెలిపారు. -
దిగొచ్చిన ఎరువుల ధర
కర్నూలు(అర్బన్): పలు రకాల ఎరువుల ధరలు తగ్గాయని వ్యవసాయ శాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐపీఎల్, ఇఫ్కో, ఆర్సీఎఫ్, క్రిభ్కో, ఫాక్ట్, జీఎన్వీఎన్సీ, జీఎస్ఎఫ్సీ, పీపీఎల్, ఎంసీఎఫ్,జెడ్ఐఎల్, నాగార్జున, స్పిక్ తదితర కంపెనీలు ధరలు తగ్గించినట్లు తెలిపారు. ఇఫ్కో, ఆర్సీఎన్, ఐపీఎల్, కోరమాండల్ కంపెనీలు తగ్గిన ధరలను పాత నిల్వలకు కూడా వర్తింపజేసేందుకు అంగీకరించాయన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని డీలర్లకు సమాచారం అందించి తగ్గిన ఎరువుల ధరలు అమలయ్యేలా చూడాలని సూచించారు. అన్ని దుకాణాల్లో ధరల పట్టికలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మకాల్లో ఎలాంటి తేడాలున్నా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కంపెనీ ప్రాడక్టు పాతధర కొత్తధర –––––––––––––––––––––––––––––––––––––––––––––– ఐపీఎల్ ఎంఓపీ రూ.840 రూ.577.00 డీఏపీ రూ.1244.25 రూ.1140.00 20–20–0–13 రూ.945 రూ.898.00 16–16–16 రూ.945 రూ.892.50 ఇఫ్కో(జింకేటెడ్) 10–20–26 రూ.1103 రూ.1077.30 ఆర్సీఎఫ్ డీఏపీ రూ.1155 రూ.1102.00 యూరియా రూ.298 రూ.298.00 క్రిభ్కో డీఏపీ రూ.1244 రూ.1191.50 స్పిక్ డీఏపీ రూ.1312.50 రూ.1155.00 20–20–0–13 రూ.971 రూ.913.00 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
పాముకాటుతో రైతు మృతి
అర్వపల్లి: పాముకాటుతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కొమ్మాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన దూదిగామ మల్లయ్య గురువారం రాత్రి పొలం వద్దకు వెళుతుండగా మార్గమధ్యలో పాముకాటు వేసింది. వెంటనే అతడిని 108 వాహనంలో సూర్యాపేటకు తరలిస్తుండగా మధ్యలోనే మరణించాడు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య కొంత కాలం కిందట మరణించింది. తల్లిదండ్రి ఇద్దరు మరణించడంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు. పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కుంట్ల సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ తాడూరి రామకోటి కోరారు. -
మెక్సికన్ మాజీ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌పై మెక్సికన్ మాజీ అధ్యక్షుడు ఫెలిపె కాల్డెరోన్ విరుచుకు పడ్డారు. ట్రంప్ ప్రచార ప్రణాళికపై స్పందించిన కాల్దెరోన్.. తీవ్ర పదజాలంతో విమర్శించారు. సరిహద్దు గోడ నిర్మాణాకి ఒక్క సెంట్ కూడా చెల్లించేది లేదని.. అదో స్టుపిడ్ వాల్ అని అన్నారు. బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం యాంఛెన్ వెళ్ళిన కాల్దెరోన్.. ఆ వాల్ నిర్మాణ ప్రయత్నం ఎందుకూ పనికి రానిదన్నారు. అంతేకాక అధ్యక్ష పదవికి ట్రంప్ సరిపోడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ పోటీపై కాల్డెరోన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. ఓ ప్రశంసనీయ సమాజం ఉన్న ఆమెరికాలో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ రేస్‌లో ట్రంప్ వంటి అభ్యర్థులు పోటీ పడటం నమ్మలేకపోతున్నామంటూ తన అయిష్టాన్ని వెళ్ళగక్కారు. ట్రంప్ బాగా చదువుకున్న మనిషే అయినా అధ్యక్ష పదవికి తగ్గ తెలివితేటలు లేవన్నారు. కాగా తన ప్రచారంలో ట్రంప్... సరిహద్దు సమస్యలు, ఇమ్మిగ్రేషన్లను ప్రధాన అజెండాలుగా చేసుకున్నారని, మెక్సికో ...రేపిస్టులను, క్రిమినల్స్‌ను బరిలోకి పంపిస్తోందంటూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. అంతేకాకుండా ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ సమస్యలను ప్రచార సాధనంగా ఎంచుకోవడాన్ని కాల్డెరోన్ తప్పుబట్టారు. ప్రజల, వాణిజ్య శ్రేయస్సును కోరుకునేవారు సరిహద్దును మూసివేయడంపై మాట్లాడటం వారి ఓటమికి ప్రధమ కారణం అవుతుందన్న కాల్దెరోన్... అటువంటి విధానాలను ప్రవేశపెట్టడం అమెరికా శ్రేయస్సుకు ఎంతమాత్రం సరికాదన్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్ పై ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అసంబద్ధమని, మెక్సికో నుంచి అక్రమ వలసలు సమస్యలను తెచ్చి పెడతాయని అన్నారు. గత నవంబరులో చేపట్టిన ఓ నివేదిక ప్రకారం మెక్సికోకు ఇమ్మిగ్రేట్ అయ్యేవారికంటే ఆమెరికా నుంచి వలసలు ఎక్కువయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సరిహద్దు గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాల్దెరోన్ తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. -
ఇంకా దొరకని IAF పరేడ్ హిట్ అండ్ రన్ నిందితుడు
-
కాపుజాతి ఆఖరి పోరు
-
'ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి'
-
కరువు కాటు..
యువరైతు ఆత్మహత్య ఏడు నెలల క్రితం భార్య.. కలిసిరాని సాగు.. పెరిగిన అప్పులే కారణం సుతారిపల్లిలో విషాదం రామాయంపేట: రైతు కుటుంబంలో మరో విషాదం. ఈసారి ఏకంగా రైతే ప్రాణాలు తీసుకున్నాడు. కరువు కారణంగా కలిసి రాని సాగు.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. ఇదిలావుంటే సరిగ్గా ఏడు నెలల క్రితమే ఇతని భార్య ఆత్మహత్య చేసుకుం ది. రైతు ఆత్మహత్య ఘటన మండలంలోని రాయిలాపూర్ పంచాయతీ పరిధిలోని సుతారిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రా మస్తుల కథనం ప్రకారం... సుతారిపల్లికి చెందిన రాగి పెద్దవాలోల్ల బాల య్య, పోచవ్వ దంపతులకు కొడుకు శ్రీకాంత్(28)తోపాటు ఇద్దరు కూతుర్లున్నారు. బాలయ్య మానసిక వికలాంగుడు. శ్రీకాంత్ వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అప్పులు చేసి ఓ సోదరి వివాహం చేశాడు. మరో సోదరి పెళ్లీడుకు వ చ్చింది. తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో గత ఏడాది మూడు బోర్లు తవ్వగా చుక్క నీరు రాలేదు. వేసిన మొక్కజొన్న సైతం ఎండిపోయింది. ప్రస్తుతం అతని భూమి బీడుగా ఉంది. రూ.5లక్షల వర కు అప్పుల పాలైన శ్రీకాంత్‌కు కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. మరోవైపు 20 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. గత మే నెల 2న పుట్టింటికి వెళ్లిన శ్రీకాంత్ భార్య లావణ్య అక్కడ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటివారు శ్రీకాంత్‌తోపాటు అతని తల్లిదండ్రులపై కేసు పెట్టా రు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన శ్రీకాంత్ హైదరాబాద్ వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. మంగళవారం గ్రామానికి వచ్చాడు. ఇంట్లో అందరుపడుకున్న తరువాత అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ నాగార్జునగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫాస్ట్ ఫుడ్ పోటీల్లో అందాల భామ!
గ్లామర్ ప్రపంచంలో... అందాల భామలు వారి వారి శరీరారోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటుంటారు. ఏది పడితే అది తినకపోగా... ఫాస్ట్ ఫుడ్‌కు మరీ దూరంగా ఉంటారు. కానీ ఆ సుందరి అభిరుచులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. ఒకప్పుడు మిస్ ఎర్త్ న్యూజిలాండ్ పోటీలలో పాల్గొన్న నేలా జిస్సెర్ అనే అమ్మాయి.. ఇటీవల ఓ ఫాస్ట్ ఫుడ్ పోటీలో పాల్గొని కేవలం వంద సెకన్లలో ఏకంగా 27 కప్పుల వేరుశనగ వెన్నను లాగించేసి అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. 23 ఏళ్ల జిస్సెర్.. కావడానికి గ్లామర్ గాళ్ అయినా తినడం మొదలుపెడితే మాత్రం ఆమెను తలదన్నేవారే ఉండరట. ఆమెకు ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఎన్నో పోటీల్లో పాల్గొని తనదైన శైలిలో రకరకాల ఆహార పదార్థాలను అలవోకగా లాగించేసి కప్పులు కొట్టేసింది. అందులో భాగంగానే తాజాగా 2,970 కాలరీస్ కలిగిన 27 కప్పుల పీనట్ బటర్‌ను వంద సెకన్లలో.. మధ్య మధ్యలో కాసిన్ని పాలు తాగుతూ లాగించింది. మోడల్స్ సాధారణంగా చాక్లెట్ ట్రీట్స్కు దూరంగా ఉంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఎక్కడ పోటీ జరిగినా వదలకుండా... తన ప్రతాపం చూపిస్తుంటుంది. ఈసారి నిజానికి 35 కప్పుల పీనట్ బట్టర్ తినాలని ప్లాన్ చేసిన జిస్సర్.. వంద సెకన్లలో 27 కప్పులను మాత్రమే పూర్తి చేయగలిగింది. ఆమె మరింత వేగంగా తినేందుకు వెనుక నృత్య, సంగీతాలతో ప్రోత్సాహాన్ని కూడా అందించారు. అయితే ఆమె.. ఎక్కువ నములుతూ తినడం వల్ల సమయం వేగంగా గడిచిపోయింది. వంద సెకన్లు పూర్తయ్యేసరికి మొత్తం 27 ప్యాకెట్లు తినగలిగింది. న్యూజిల్యాండ్ లోని క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో జన్మించిన జిస్సర్.. పదహారేళ్ల ప్రాయంలోనే లోకల్ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. తన కెరీర్ ను కొనసాగించేందుకు ఆమె 18 ఏళ్ల వయసులో ఆక్లాండ్‌కు తరలి వెళ్లింది. 2013 లో మిస్ ఎర్త్ న్యూజిల్యాండ్ పోటీలలో పాల్గొంది. ''నిజానికి మోడల్స్ సాధారణంగా ఫొటో షూట్స్, ఫ్యాషన్ షోలకు ప్రాధ్యాన్యం ఇస్తూ, తెరవెనుక ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు. అలా ఉండటం నాకు నచ్చదు. నేను 20/80ని నమ్ముతూ... 80 శాతం సమయం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ఫిట్‌గా ఉండేందుకు కృషి చేస్తుంటాను'' అంటుంది జిస్సర్. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
ఆదిలాబాద్(భీమిని): భీమిని మండలం గజ్జరవెల్లిలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో కోట్రంగి దేవయ్య(35) అనే రైతుపురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. దేవయ్య చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. సహకార బ్యాంకులో రూ.40వేలు, ప్రైవేటుగా రూ. 2లక్షలు అప్పు ఉన్నట్లు, అదీ గాక వేసిన పంట సరిగా పండకపోవడంతో మనస్తాపం చెంది దేవయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చింతపల్లి: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కీడేరుకు చెందిన మల్లయ్య (55) అనే రైతు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న ఐదెకరాల పొలంలో అప్పుచేసి వేసిన పత్తి పంట ఎండిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లయ్య పురుగుల మందుతాగి తనువుచాలించాడు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
రైతు ఆత్మహత్య
కోరుట్ల(కరీంనగర్): అప్పుల బాధతో ఉరేసుకొని చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపురం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన రిబ్బాస రాజమల్లయ్య(48) తనకున్న ఎకరం భూమిలో మొక్కజొన్న సాగుచేసుకోవడతంఓ పాటు గొర్ల పెపకం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య అనారోగ్యానికి గురికావడంతో పాటు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక పోవడంతో.. అప్పులు పెరిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
శామీర్‌పేట: అప్పుల బాధతో రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లారెడ్డి (45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట చేతిరిరాకపోడం, అప్పులు ఎక్కువయిన కారణంగా రైతు.. బుధవారం ఔటర్ రింగ్ రోడ్డుపై పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యా, బిడ్డలు ఉన్నారు. -
బ్యాంకు ఆవరణలో రైతు ఉరేసుకునే యత్నం
కరీంనగర్: రుణం ఇవ్వడం లేదని జిల్లాలో ఓ రైతు బ్యాంకు ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమయానికి అక్కడున్న వారు అప్రమత్తమై అతడిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నర్సయ్య అనే రైతు గంగాధరలో తనకు బ్యాంకు రుణం ఇవ్వడం లేదని, ఎన్నిమార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు అవరణలోనే ఉరేసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఐదేళ్ల కిందట రూ.6.75లక్షల మొత్తాన్ని ఇంటి రుణంగా తీసుకొని ఇప్పటివరకు చెల్లించలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
అప్పులబాదతో యువరైతు ఆత్మహత్య
నాగార్జునసాగర్: రెండు సంవత్సరాలుగా కాలం కలిసిరాక పోవడంతో.. పెట్టిన పెట్టుబడి తిరిగి రాక.. తెచ్చిన అప్పు కొండ లా పెరిగిపోయి.. దిక్కుతోచక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామ పంచాయతి పరిధిలోని సుబ్బరాయ తండలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రమావత్ శ్రీను(29) తనకున్న నాలుగెకరాల భూమితో పాటు గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ఐదెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా పంట దిగుబడి సరిగా రాలేదు. తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు దీంతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
తహశీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం
వరంగల్: పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడంలో అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ మనస్తాపానికి గురైన ఓ రైతు తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మండలంలోని చిన్న ముప్పారం గ్రామ పంచాయతి పరిధిలోని పెద్దతండాకు చెందిన గుగులోతు మంగ్యా(55) తన భూమికి చెందిన పాస్ పుస్తకాలు ఇవ్వలని గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాడు. అధికారులు అతని మొర ఆలకించకపోవడంతో.. మనస్తాపానికి గురైన మంగ్యా తహశీల్దార్ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వెద్యులు తెలిపారు. -
తహశీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
నల్లగొండ: తన సమస్యను ఎన్ని సార్లు మొరపెట్టుకున్న అధికారులు స్పందిచలేదు. మరో వైపు నీళ్లు లేక పొలం ఎండిపోతోంది. దీంతో దిక్కుతోచని ఓ రైతు తహశీల్దార్ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మండల కేంద్రానికి చెందిన సంజీవ్‌రెడ్డి(55) వ్యవసాయ బోరు ఈ మధ్య కాలంలో ఎండిపోయింది. వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ పక్క పొలం వాళ్లు బోర్లు వేయడంవల్లే తన పొలంలోని బోరులో నీళ్లు అడుగంటి పోయాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంజీవ్ రెడ్డి పలు మార్లు తహశీల్దారుకు మొరపెట్టుకున్నాడు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విసుగెత్తి.. తహశీల్ ఆఫీసులోనే వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అప్పుడుగానీ స్పందించిన తహశీల్దారు తన కారులో అతడ్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు సంజీవ్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
విద్యుదాఘాతానికి యువరైతు బలి
జగిత్యాల రూరల్: విద్యుదాఘాతంలో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల రూరల్ మండలం పెరకపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. రవి (22) అనే రైతు ఉదయం పొలానికి వెళ్లి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. పక్క పొలంలోని రైతులు వచ్చి చూసేసరికి అతను చనిపోయాడు. చేతికి అందిన కొడుకు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కలెక్టరేట్లో రైతు ఆత్మహత్య
* గ్రీవెన్స్‌సెల్ వద్ద క్రిమిసంహారక మందు తాగిన అన్నదాత * అధికారుల వద్దకు వెళ్లకుండానే బలవన్మరణం * తహసీల్దార్, ఎస్సై, వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్ సాక్షి, విజయనగరం కంటోన్మెంట్: తనకు చెందిన భూమిపై తగవు పడుతున్న తన బంధువులతో కలిసిపోయిన అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరించి, తన భూమిలోకి వెళ్లకుండా దారి మూసివేశారని తీవ్ర మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయనగరంలోని కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి, అధికారుల వద్దకు వెళ్లకుండానే క్రిమిసంహారక మందు తాగాడు. అక్కడ ఉన్న ఇతర అర్జీదారులు 108 వాహనసేవలకు సమాచారమిచ్చారు. వారు వచ్చి, ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబసభ్యుల కథనం మేరకు విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామానికి చెందిన దామెర వెంకట సూర్యారావు భూమిని తన పేరున మార్చాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. బంధువులతో వాటాలకు సంబంధించిన సుమారు 56 సెంట్ల భూమి విషయమై వివాదం నెలకొంది. దీనిపై కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌సెల్‌లోనూ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సూర్యారావు భూమిలోకి వెళ్లేందుకు ఉన్న దారిని కూడా మూసేయడంతో మరింత ఆవేదనకు లోనయ్యాడు. ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయంతో పాటు పోలీస్‌స్టేషన్, గ్రీవెన్స్సెల్లకు కాళ్లరిగేలా తిరిగాడు. అయినా ఫలితం లేక పోవడంతో ఏం చేయాలో పాలుపోక మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం సూసైడ్‌నోట్‌తో గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి, అందరూ చూస్తుండగానే పోర్టికో వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. ఆ నోట్లో వీఆర్ఓ, తహసీల్దార్, ఎస్ఐ, కానిస్టేబుల్ భానుపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఫోన్ కాల్ డేటాతో పాటు పైన పేర్కొన్న వారి కాల్ డేటాను కూడా పరిశీలించాలని మరో చీటీ ద్వారా కోరాడు. ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన జరుగగా చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతి చెందాడు. కలెక్టర్ ఎంఎం నాయక్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకు ముందు తహసీల్దార్, వీఆర్వోలతో మాట్లాడి ఆరా తీశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఇది కోర్టులో ఉన్న విషయమని, తాము వేలు పెట్టలేమన్నారు. గతంలో గ్రీవెన్స్‌కు వచ్చినపుడు భూమి గురించి మాత్రమే చెప్పాడని, రహదారి మూసివేశారన్న విషయమై పొందుపర్చలేదని తెలిపారు. జరిగిన సంఘటనైపై విచారణ చేయిస్తున్నామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం
నల్గొండ: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మయత్నానికి పాల్పడ్డ సంఘటన నల్గొండ మండలం దండెంపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాంబయ్య తనకున్న నాలుగెకరాల పొలంలో అప్పుచేసి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో అప్పుల వాళ్ల వత్తిడి ఎక్కువవడంతో పాటు.. బుధవారం ఉదయం అప్పుల వాళ్లు సాంబయ్య ఇంటికి తాళం వేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
విద్యుదాఘాతంతో రైతుకు తీవ్ర గాయాలు
మెదక్ రూరల్: బోరు మోటార్ విద్యుత్తు సర్వీస్ వైరు తెగిపడి ఓ రైతుకు తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ మండలం శమ్నాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలివీ...గ్రామానికి చెందిన మైలి పోచయ్యకు గ్రామ శివారులో రెండెకరాల పొలం ఉంది. కాగా, ఆ పొలానికి కరెంటు స్తంభాలు దూరంగా ఉండటంతో ఆమేర సర్వీస్ వైర్‌ను కర్రల మీదుగా లాగి మోటారును నడిపించుకుంటున్నాడు. కాగా, మంగళవారం ఉదయం కర్రపై ఉన్న తీగ కిందను సరి చేసేందుకు పోచయ్య ప్రయత్నించగా షాక్ తగిలింది. గాయపడిన పోచయ్యను తోటి రైతులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నీ పని నీది.. నా పని నాది
ఈ చిత్రాన్ని చూడండి.. ఓ పక్క ఉత్పాతం ఉబికి వస్తుంటే తాపీగా తనపనేదో తాను చేసుకుంటున్నాడీ రైతు. ఈ దృశ్యం ఇండోనేసియాలోని ఉత్తర సుమత్రా దీవిలో శనివారం చోటుచేసుకుంది. ఇండోనేసియాలో ఉన్న 130 క్రియాశీలక అగ్ని పర్వతాల్లో ఒకటైన షినబంగ్.. 2010 నుంచి లావా వెదజల్లుతూనే ఉంది. దీనికి అలవాటు పడిన ప్రజలు 'నీపని నీది.. నాపని నాది' అనుకుంటూ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. అయితే 400 ఏళ్ల తరువాత ఒక్కసారిగా శనివారం భారీ స్థాయిలో విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడు ధాటికి లావా, బూడిద దాదాపు 8530 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. -
చెత్త తగలబెడుతూ సజీవ దహనం
కరీంనగర్ : పొలంలోని చెత్తను తగలబెడుతూ ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన అశీర్వాదం(60) పొలంలో చెత్తను తగలబెడుతుండగా నిప్పుంటుకుని అక్కడికక్కడే సజీవ దహన మయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (వీణవంక) -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ మండలం వెంకటంపేట గ్రామానికి చెందిన ఓ రైతు అప్పుల బాధతో బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు...వెంకటంపేట గ్రామానికి చెందిన జక్కుల చంద్రయ్య(45)కు మూడెకరాల పొలం ఉంది. అయితే అందులో వేసిన పంట దిగుబడి సరిగా రాలేదు. పైగా పంటవేసేందుకు చేసిన అప్పు పెరిగిపోవడంతో తట్టుకోలేక తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందాడు. బుధవారం ఉదయం గమనించిన ఇరుగుపొరుగు పొలాలకు చెందిన రైతులు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఓ రైతు.. ఓ మంత్రి..
ఈ చిత్రంలో కనిపిస్తున్న వధువు కేరళ మంత్రి పేరు పి.కె.జయలక్ష్మి. రైతు, దూరపు చుట్టమైన వ్యక్తిని ఆదివారం వివాహమాడారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకకు సీఎం ఊమెన్ చాందీ సహా పలువురు నాయకులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని కేరళలోని ఓ టీవీ చానల్ ప్రత్యక్షప్రసారం చేసింది. -
రుణమాఫీ కాలేదని..రైతు బలవన్మరణం
గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం సందిటివారిపాలెంలో బుచ్చిరెడ్డి(40) అనే రైతు రుణమాఫీ కాలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో దిగుబడి రాక అప్పుల పాలైనట్లు, రుణమాఫీ కూడా కాకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రైతు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (పిడుగురాళ్ల) -
అన్నం పెట్టకుండా చిత్రహింసలు పెట్టాడని..
కరీంనగర్: పొలంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతుని గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి చంపిన ఘటన వినూత్న మలుపు తిరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన హత్య కేసులోని వాస్తవాలు ఇలా ఉన్నాయి.. రెండు రోజులుగా తనను తీవ్రంగా కొట్టడంతో పాటు అన్నం కూడ పెట్టకపోవడంతో తానే ఈ హత్య చేశానని మృతుడి తండ్రి దొనవల్లి లింగయ్య(75) ఒప్పుకున్నాడు. హత్య చేసిన వెంటనే తనకు ఏమి తెలియదని.. తాను నిద్రపోతున్న సమయంలో ఈ దారుణం జరిగిందని ముందు అన్నా.. తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేశాక నిజం అంగీకరించాడు. గత కొన్ని రోజులుగా భోజనం పెట్టకుండా చిత్రహింసలు పెడుతుండటంతో తట్టుకోలేక ఈ హత్య చేశానని ఆయన పోలీసులకు తెలిపాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ సీఐ రంగయ్యగౌడ్ హత్యకు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నల్గొండ: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా ఆలేరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గుంటుక వేణుగోపాల్ రెడ్డి(45) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుగోపాల్ రెడ్డికి ఐదెకరాల పొలం ఉంది. అది సాగు చేయడం కోసం చేసిన అప్పులు ఎక్కువవడంతో తీర్చే దారి కనిపించక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అన్నదాతను కేంద్రం ఆదుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: అకాల వర్షాలతో తెలంగాణలో పంట నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ పరిస్థితులపై లోక్‌సభలో సోమవారం ఆయన ప్రసంగించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా పలు రకాల పంటలు నీటిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే రాష్ట్రంలో పర్యటించాలని జితేందర్‌రెడ్డి కోరారు. ప్రధానమంత్రి ఇటీవల ప్రకటించిన విధానం ప్రకారం వెంటనే తెలంగాణ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ దూరదృష్టి కారణంగా కేవలం పది నెలల పాలనలోనే విద్యుత్ కోతల నుంచి రైతాంగాన్ని బయటపడేశారని చెప్పారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మెదక్ : ఆరుగాలం శ్రమించి పొలాన్నే నమ్ముకుని... అప్పు చేసి సాగు చేసిన ఓ రైతు చివరికి ఆ పొలంలోనే తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం మీనాజీపేటలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన డి.యాదగిరి(35) అనే వ్యక్తి కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఆలుగడ్డ సాగు చేశాడు. అందుకోసం అప్పు చేసి రూ.70వేలు పెట్టుబడి పెట్టగా... చివరికి దిగుబడి రాక పూర్తిగా నష్టమే మిగిలింది. ప్రస్తుతం ఎకరం భూమిలో సాగు చేసిన వరి కూడా ఎండిపోయింది. రూ.4 లక్షల వరకూ అప్పులు మిగలడంతో మనస్తాపానికి గురైన యాదగిరి శనివారం ఉదయం పొలానికి వెళ్లొస్తానని భార్యతో చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. పొలానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. (వర్గల్) -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఆదిలాబాద్ : అప్పుల బాధ తాళలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు...ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన రైతు మేకల పంచుభూమన్న(53) శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖరీఫ్‌లో పత్తి, వరి సాగు చేయగా విద్యుత్ కోతల కారణంగా నీరందక అవి ఎండిపోయాయి. రబీలో నువ్వు పంట సాగు చేయగా గడ్డి విపరీతంగా మొలకెత్తింది. కలుపు తొలగించగా.. కరెంటు కష్టాలు వెంటాడాయి. ఎండలు తీవ్రమై పంటకు నీరందక ఎండిపోయింది. బ్యాంకులో రూ.లక్ష, తెలిసిన వారినుంచి రూ.లక్ష అప్పులతో అప్పులపాలయ్యాడు. అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన పంచు భూమన్న తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భూమన్నకు ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై సక్రియానాయక్ తెలిపారు. (లోకేశ్వరం) -
మనోవేదనతో మిర్చి రైతు మృతి
ఏటూరునాగారం: అకాల వర్షానికి మిర్చి తడవగా, నష్టం జరుగుతుం దని మనోవేదనకు గురైన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొమ్యూర్లో బెడిక బాలంకయ్య రెండెకరాల్లో మిర్చి సాగు చేశాడు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి మిర్చి తడవడంతో నష్టం వస్తుందని మనోవేదనతో సోమవారం రాత్రి గుండెపోటుకు గురై మరణించాడు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
వరంగల్: వ్యవసాయం అనుకూలించక అప్పుల పాలై ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్మెట మండలంలోని అంకుషాపూర్ గ్రామ ఫరిది మాన్సింగ్తండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. తండాకు చెందిన లకావత్ లక్ష్మణ్(35) తనకున్న ఎకరం వ్యవసాయ భూమిలో గత మాసంలో నాలుగు బోర్లు వేశాడు. మూడు బోర్లలో చుక్క నీరు కూడా రాలేదు. ఒక్క దానిలో కొద్దిగా మాత్రమే నీళ్లు వచ్చాయి. బోర్ల కోసం సుమారు రూ.లక్ష వరకు అప్పులయ్యాయి. దీనికి తోడు కొన్ని సంవత్సరాలుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో సుమారు రూ.2 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులు ఎలా తీర్చలా.. అని తరచూ భార్య రేణుకతో వాపోయేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపం చెంది బుధవారం రాత్రి వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేణుక, కుమార్తె రాజేశ్వరి, కొడుకు రుపేశ్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై్స జలగం లక్ష్మణ్‌రావు తెలిపారు. (నర్మెట)