
ఓ రైతు.. ఓ మంత్రి..
ఈ చిత్రంలో కనిపిస్తున్న వధువు కేరళ మంత్రి పేరు పి.కె.జయలక్ష్మి. రైతు, దూరపు చుట్టమైన వ్యక్తిని ఆదివారం వివాహమాడారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకకు సీఎం ఊమెన్ చాందీ సహా పలువురు నాయకులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని కేరళలోని ఓ టీవీ చానల్ ప్రత్యక్షప్రసారం చేసింది.