Kerala minister
-
అంగన్వాడీ చిన్నారి ‘చికెన్ ఫ్రై’ రిక్వెస్ట్.. స్పందించిన ప్రభుత్వం
తిరువనంతపురం: అంగన్వాడీలో పెడుతున్న తిండి విషయంలో ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ దెబ్బకు ప్రభుత్వం కదిలి వచ్చింది. అంగన్వాడీ మెనునూ మార్చేయాలని నిర్ణయించింది.కేరళ అంగన్వాడీ సెంటర్లలో మెనూ మార్చే అంశంపై అక్కడి విద్యా శాఖ సమీక్ష జరుపుతోందట. అందుకు కారణం.. శంకూ అనే ఓ చిన్నారి వీడియో వైరల్ కావడమే. స్వయానా ఆ రాష్ట్ర ఆరోగ్య, శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్( Veena George) ఆ చిన్నారి వీడియోకు స్పందించి.. ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.అంగన్వాడీలో ప్రతీసారి ఉప్మా పెడుతున్నారని, దానికి బదులు.. బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఆ చిన్నారి విజ్ఞప్తి చేశాడు. అమాయకంగా ఆ బుడ్డోడు చెప్పిన మాటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అయ్యాయి. చివరకు.. ఆ వీడియో ప్రభుత్వం దాకా వెళ్లింది. దీంతో వీణా జార్జ్ స్పందించారు.അംഗൻവാടിയിൽ, ഉപ്പുമാവ് മാറ്റി ബിരിയാണിയുംപൊരിച്ച കോഴിയും വേണം എന്നുഈ അമ്പോറ്റി പൊന്നിന്.🤗♥️🥰😘ഈ പരാതി ആരോടു പാറയും മല്ലയ്യാ. 🤔🤔 pic.twitter.com/FPYoXHB3tJ— 🖤 🍁 സുമ 🍁🖤 (@Suma357381) February 1, 2025అంగన్వాడీలో పిల్లలకు ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. ఇప్పటికే పాలు గుడ్లు అందిస్తున్నాం. అయితే.. చిన్నారి శంకూ చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. మెనూను కచ్చితంగా సమీక్షిస్తాం. ఆ వీడియోను చూశాక.. చాలామంది మాకు ఫోన్లు చేశారు. అతనికి బిర్యానీ, చికెన్ ఫ్రై ఇప్పిస్తామని అన్నారు. అంగన్వాడీలో పిల్లలకు అన్నిరకాల పోషకాలు అందాల్సిన అవసరం ఉంది. అందుకే మెనూలో మార్పులు తప్పకుండా చేస్తాం అని అన్నారామె.అయితే.. అవసరమైతే జైల్లో ఖైదీలకు అందించే పెట్టే ఫుడ్‌ను తగ్గించి.. ఇలాంటి పిల్లలకు పెట్టాలంటూ ఆమె కామెంట్ సెక్షన్లో కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. -
సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ!
బెంగళూరులో నీటి కొరత.. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ఐటీ కంపెనీలను తమ రాష్ట్రాలకు రప్పించే అవకాశంగా మారింది. ‘ఎకనామిక్ టైమ్స్’ ఒనివేదిక ప్రకారం.. కేరళకు మారాలని బెంగళూరులోని కొన్ని ఎంఎన్సీ కంపెనీలకు తాను లేఖ రాసినట్లు కేరళ పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రి పి.రాజీవీ తెలిపారు. తమ రాష్ట్రంలో కర్ణాటక కంటే మెరుగైన నీటి వనరులు ఉన్నాయని, గణనీయమైన పెట్టుబడులకు కేరళ అనువైన ప్రదేశం అని మంత్రి రాజీవీ పేర్కొన్నారు. ‘బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని తెలుసుకున్నాం. కాబట్టి మేము కొన్ని ఐటీ కంపెనీలను సంప్రదించి కేరళకు తరలించమని కోరాము. మా రాష్ట్రం మంచి ప్రణాళికాబద్ధమైన నీటి సదుపాయాలు కలిగి ఉంది. సహజ వనరులతో నిండి ఉంది. మేము వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తాం’ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్ కేరళను దేశంలోని కొత్త సిలికాన్ వ్యాలీగా మార్చాలనే తన ఆశయాన్ని మంత్రి రాజీవీ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కేరళలో పెట్టుబడులపై కొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. మా రాష్ట్రం కొత్త సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారే అవకాశం ఉంది. ఆ దిశగా కంపెనీలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. బెంగళూరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నందున, కంపెనీలకు తదుపరి అతిపెద్ద ఐటీ గమ్యస్థానంగా కేరళ తనను తాను ప్రదర్శించుకోవాలనుకుంటోంది’ అన్నారు. 66వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి నాలుగు కొత్త ఐటీ కారిడార్లను నిర్మించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
రాజ్యాంగంపై విమర్శలు: ఎట్టకేలకు మంత్రి సాజీ రాజీనామా
తిరువనంతపురం: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన.. కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు.. బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని సాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. చెరియన్ కామెంట్లపై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు. మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని చెప్పారు. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఈ వ్యవహారంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ రూపకర్తలను చెరియన్ అవమానించారంటూ వ్యతిరేక నినాదాలు చేశాయి విపక్షాలు. ఈ క్రమంలో చర్చ జరగకుండానే.. స్పీకర్ ఎంబి రాజేష్ సభను వాయిదా వేశారు. ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ కార్యాలయంలో విపక్షాలు నిరసన చేపట్టాయి. చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం, చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆయనే రాజీనామా చేశారు. -
ఏపీ ఆదర్శంగా కేరళలోనూ ఇంటి వద్దకే రేషన్
సాక్షి, అమరావతి: ఏపీలోని రేషన్ డోర్ డెలివరీ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్æ కొనియాడారు. 85 శాతం మందికి ఇంటింటికీ బియ్యం పంపిణీ ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు. కేరళలోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం విజయవాడకు వచ్చిన ఆయన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులతో కలిసి.. వాహనాల ద్వారా రేషన్ పంపిణీని స్వయంగా పరిశీలించారు. అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. బియ్యం పంపిణీ వ్యవస్థ, ధాన్యం సేకరణ, అర్హుల ఎంపిక, క్వాలిటీ కంట్రోల్, మార్క్‌ఫెడ్, ఆర్బీకేల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ప్రజల ముంగిట్లోకి సంక్షేమ పథకాలు అనంతరం కేరళ మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నేరుగా పరిపాలన, సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకు చేరుతున్నాయన్నారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ను అత్యంత పారదర్శకంగా చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఆంధ్రా నుంచి కేరళకు బియ్యం రవాణా చేసే విషయంపై చర్చించినట్టు తెలిపారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్, రేషన్ పంపిణీ వ్యవస్థల వంటి విప్లవాత్మక కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం గర్వకారణమన్నారు. సుమారు 65 లక్షల మందికి ఫించన్లు ఇచ్చే కార్యక్రమం ఐదారు గంటల్లోనే పూర్తి చేసే సామర్థ్యం ఏపీలో ఉందన్నారు. కార్యక్రమంలో కేరళ పౌరసరఫరాల శాఖ కమిషనర్ సాజిత్ బాబు, ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, డైరెక్టర్ ఢిల్లీరావు, పౌర సరఫరాలశాఖ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్ తదితరులున్నారు. -
కేరళలోనూ ఆర్బీకేల ఏర్పాటు
తుక్కులూరు/ముసునూరు(నూజివీడు): కేరళ రాష్ట్రంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల వైపు దేశం మొత్తం చూస్తోందని ఆయన ప్రశంసించారు. కేరళ వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలోని బృందం ఆదివారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించింది. అక్కడ అందుతున్న వ్యవసాయ సేవలను పరిశీలించింది. ఎరువులు, విత్తనాల కోసం ఆర్డర్ పెట్టే కియోస్క్ యంత్రాన్ని పరిశీలించి.. ‘ఇదేంటి అచ్చం ఏటీఎంలా ఉంది’.. అంటూ కేరళ మంత్రి ప్రశ్నించారు. విత్తనాలను, ఎరువులను బుక్ చేసుకునేందుకు దీనిని రైతులకు అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పగా.. మంత్రి ఆశ్చర్యపోయారు. అధికారులు తెలిపిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై చూపుతున్న శ్రద్ధకు కేరళ మంత్రి ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యంపై దేశం మొత్తం చర్చించుకుంటోందన్నారు. రైతులకు విత్తనాల దగ్గర నుంచి ఎరువులు, పురుగు మందులతో సహా.. పండిన పంటలకు గిట్టుబాటు ధర అందించే వరకూ సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన గొప్పదని కొనియాడారు. రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, సేంద్రియ ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం తదితర వాటిపై తమ బృందం అధ్యయనం చేస్తోందన్నారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రకృతి వ్యవసాయ కార్యనిర్వాహక వైస్ చైర్మన్ టి.విజయకుమార్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని కొర్లగుంటలో ప్రకృతి సిద్ధ సేద్యంలో సాగవుతున్న పెరటి తోటలు, ఉద్యాన పంటలు, పండ్ల తోటలు, సేంద్రియ ఎరువుల తయారీని కేరళ మంత్రి, అధికారులు పరిశీలించారు. కార్యక్రమాల్లో కేరళ రాష్ట్రానికి చెందిన పూర్వ చీఫ్ సెక్రటరీ, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎస్ఎం విజయానంద్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ టీవీ సుభాష్, అగ్రికల్చర్ డివిజన్ చీఫ్ నగేష్, డెప్యూటీ డైరెక్టర్ ప్రమోద్‌కుమార్ తదితరులున్నారు. -
బాహుబలిలా మూటలు మోసిన మంత్రి
తిరువనంతపురం: ప్రకృతి సృష్టించిన విలయం నుంచి కేరళ ప్రజలను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి కేంద్రబలగాలతో పాటు, ఉన్నతాధికారులు కూడా శ్రమించారు. మత్య్సకారులైతే స్వచ్ఛందగా తమ సేవలందించారు. ఇలా ప్రతి ఒక్కరు ఏదోరకంగా తమకు తోచిన సహాయం చేశారు. కేరళ వరద బాధితులకు సహాయక సామాగ్రిని అందజేయడానికి ఐఏఎస్ అధికారులు సైతం మూటలు మోసిన సంగతి విదితమే. సహాయక చర్యల్లో కేరళ మంత్రి రవీంద్రనాథ్ వ్యవహరించిన తీరు పలువురికి ఆదర్శంగా నిలిచింది. కేవలం సహాయక చర్యలను పర్యవేక్షించడమే కాకుండా.. బాధితులకు కావాల్సిన సామాగ్రిని ఆయన తన భుజంపై మోసారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే.. ఆయన బాహుబలిలా కష్టపడ్డారని అభినందిస్తున్నారు. కాగా కేరళలో సంభవించిన వరదల్లో చిక్కుకుని 400 మందికి పైగా మరణించగా, వేలాదిమందిని సైన్యం, సహాయక బృందాలు కాపాడాయి. ప్రకృతి విపత్తు కారణంగా కేరళ 21 వేల కోట్లు నష్టపోయిందని అంచనా వేస్తున్నారు. -
కేరళ వరదలు: మూటలు మోసిన మంత్రి
-
హైకోర్టు వ్యాఖ్యలతో తప్పుకున్న కేరళ మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేయడం పట్ల కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టడంతో ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి థామస్ చాందీ బుధవారం రాజీనామా చేశారు. 2016లో ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి మండలి నుంచి వైదొలగిన మూడవ మంత్రి థామస్ కావడం గమనార్హం. భూములు లాక్కున్నాననే ఆరోపణలు రావడంతోనే కేబినెట్ నుంచి తప్పుకుంటున్నానని ఆయన చెప్పారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ త్వరలోనే తాను రాష్ట్ర కేబినెట్లోకి తిరిగి వస్తానని థామస్ చాందీ ధీమా వ్యక్తం చేశారు. అలప్పుజలోని తన లేక్ ప్యాలెస్ రిసార్ట్‌లో థామస్ పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆయన అక్రమాలపై అలప్పజ జిల్లా కలెక్టర్ వెల్లడించిన నివేదికను సవాల్ చేస్తూ థామస్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ నివేదికను సవాల్ చేస్తూ కేబినెట్ మంత్రి పిటిషన్ వేయడం రాజ్యాంగం నిర్ధేశించిన మంత్రివర్గ ఉమ్మడి బాధ్యతకు విరుద్ధమని పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తనకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తొలగించాలని తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని థామస్ చెప్పారు. -
ఏపీ మంత్రులతో కేరళ మంత్రి భేటీ
అమరావతి: ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావులతో కేరళ మంత్రి తిలోత్తం గురువారం భేటీ అయ్యారు. మంత్రులు మాట్లాడుతూ.. కేరళకు అవసరమైన జయ బియ్యం సరఫరాపై చర్చించామని తెలిపారు. కేరళ రాష్ట్రం ప్రస్తుతం ఆహార ఉత్పత్తి సమస్యలో ఉందని తెలిపారు. ఏపీలో జయ బియ్యం ఉత్పత్తి బాగా ఉందన్నారు. త్వరలో ఓనమ్ పండుగ ఉండటంతో 70 వేల టన్నుల బియ్యం సరఫరా చేయాలని కేరళ మంత్రి కోరారని, ధర విషయంలో ఇంకా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ధర నిర్ణయించాక దళారులు లేకుండా నేరుగా కేరళకు బియ్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. -
‘కుట్రదారులను బయటకు లాగుతాం’
కోజికోడ్: మళయాల నటి అపహరణ, దాడి వెనుకున్న వారందరినీ పట్టుకుంటామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటన వెనుక గూండాలతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఏకే బాలన్ ఆరోపించారు. ‘ నిందితుల ద్వారా ఈ దాడి వెనుక ఎవరున్నారో కనుక్కుంటాం. దర్యాప్తు కేవలం కిరాయి గూండాలకు మాత్రమే పరిమితం కాదు. కుట్రదారులను అందరినీ బయటకు లాగుతామ’ని బాలన్ పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సునీల్ అలియాస్ పల్సర్ సుని, అతని అనచరుడు విజేశ్ ఇంకా పట్టుబడలేదు. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి వెనుక డబ్బులు కోసం ఘాతుకాలకు పాల్పడే ‘కొటేషన్ మాఫియా’ హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నేను 'కుమారి'ని కాను.. 'శ్రీమతి'ని!
కేరళ మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి.. పీకే జయలక్ష్మి. ఇటీవలే ఆమె తన చిన్ననాటి స్నేమితుడు అనిల్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పెళ్లయిపోయినా కూడా ఇప్పటికీ ఆమెను చాలామంది కుమారి జయలక్ష్మి అనే పిలుస్తున్నారట. దాంతో కొంచెం కోపగించుకున్న ఆమె.. తనను కుమారి అని కాకుండా శ్రీమతి జయలక్ష్మి అని పిలవాలంటూ అందరికీ ఓ సర్క్యులర్ జారీ చేసిపారేశారు. మే 10వ తేదీన జయలక్ష్మికి పెళ్లయింది. ఆ పెళ్లికి ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నేతలు కూడా హాజరై.. కొత్త దంపతులను ఆశీర్వదించారు. అయినా ఇప్పటికీ తనను చాలామంది కుమారి జయలక్ష్మి అనే లేఖలలో సంబోధిస్తుండటంతో మంత్రి గారికి చికాకు వచ్చి ఈ రకంగా సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చింది. -
రైతును పెళ్లాడిన మంత్రి
కేరళలోని కాంగ్రెస్ సభ్యురాలు, ఏకైక గిరిజన మంత్రి పి.కె. జయలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, సమీప బంధువు, రైతు అయిన సి.ఎ. అనిల్‌కుమార్‌ను ఆమె పెళ్లాడారు. సంప్రదాయ కురిచియ గిరిజన పద్ధతిలోనే ఆమె పెళ్లి చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ప్రతిపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్, కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు.. అందరూ కొత్త జంటను అభినందనలలో ముంచెత్తారు. కళ్యాణమండపంలోకి వెళ్లడానికి ముందుగా జయలక్ష్మి ముఖ్యమంత్రి చాందీ, అచ్యుతానందన్‌ల పాదాలకు నమస్కరించారు. అయితే.. తమ సంప్రదాయం ప్రకారం ఏమీ మాట్లడకూడదు కాబట్టి.. పెళ్లి అయ్యవరకు ఆమె మౌనంగానే ఉండిపోయారు. కేరళ గిరిజన సంక్షేమ, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న జయలక్ష్మి.. కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలు. గిరిజన తెగలలో ఆమె తెగను బ్రాహ్మణులుగా పరిగణిస్తారు. -
ఓ రైతు.. ఓ మంత్రి..
ఈ చిత్రంలో కనిపిస్తున్న వధువు కేరళ మంత్రి పేరు పి.కె.జయలక్ష్మి. రైతు, దూరపు చుట్టమైన వ్యక్తిని ఆదివారం వివాహమాడారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకకు సీఎం ఊమెన్ చాందీ సహా పలువురు నాయకులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని కేరళలోని ఓ టీవీ చానల్ ప్రత్యక్షప్రసారం చేసింది. -
రాత్రంతా అసెంబ్లీలోనే గడిపిన మంత్రి