‘కుట్రదారులను బయటకు లాగుతాం’ | Malayalam actor assault: All accused will be smoked out of hideouts, says Kerala minister | Sakshi
Sakshi News home page

‘కుట్రదారులను బయటకు లాగుతాం’

Published Wed, Feb 22 2017 10:47 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

‘కుట్రదారులను బయటకు లాగుతాం’

‘కుట్రదారులను బయటకు లాగుతాం’

కోజికోడ్‌: మళయాల నటి అపహరణ, దాడి వెనుకున్న వారందరినీ పట్టుకుంటామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటన వెనుక గూండాలతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఏకే బాలన్‌ ఆరోపించారు. ‘ నిందితుల ద్వారా ఈ దాడి వెనుక ఎవరున్నారో కనుక్కుంటాం. దర్యాప్తు కేవలం కిరాయి గూండాలకు మాత్రమే పరిమితం కాదు. కుట్రదారులను అందరినీ బయటకు లాగుతామ’ని బాలన్ పేర్కొన్నారు.

మరోవైపు ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సునీల్ అలియాస్ పల్సర్‌ సుని, అతని అనచరుడు విజేశ్‌     ఇంకా పట్టుబడలేదు. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి వెనుక డబ్బులు కోసం ఘాతుకాలకు పాల్పడే ‘కొటేషన్ మాఫియా’ హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement