Malayalam actor assault
-
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ రాజీనామా
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్‌పై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ పెద్దలు చక్కదిద్దే పనిలో పడ్డారు. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) మండిపడ్డారు. ఈ నివేదికపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇప్పటికే ఈ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక విషయంలో సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నివేదికపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా.. ఇప్పటికే దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీకి రాజీనామా చేయగా.. నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవి నుంచి నుంచి వైదొలిగారు. -
జిమ్ ట్రైనర్‌పై లైంగిక వేధింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో నటుడి అరెస్ట్!
ప్రముఖ మలయాళ నటుడు షియాస్ కరీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న మహిళ ఫిర్యాదుతో అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మంచి మోసం చేశాడంటూ 32 ఏళ్ల మహిళ గత నెలలో కాసర్గోడ్లోని చందేరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం చెన్నైలో దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసులు అడ్డుకున్నారు. అతనిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. (ఇది చదవండి: విజయ్ సేతుపతి- కత్రినా కైఫ్ మూవీ.. రిలీజ్ డేట్‌పై అప్డేట్!) కరీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జిమ్‌లోనే ఆ మహిళా జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తోంది. తన వద్ద నుంచి రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడని.. డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మహిళ ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి 2021 ఏప్రిల్ నుంచి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తానని చెప్పి మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కరీమ్‌ను అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు చందేరా పోలీసులకు అప్పగించనున్నారు. కాగా.. కరీం గతంలో ఆమె చేసిన ఆరోపణలను కల్పితమని కొట్టి పారేశాడు. కాగా.. కరీం మలయాళంలో పలు చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా మలయాళం బిగ్ బాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Shiyas Kareem (@shiyaskareem) -
లైంగిక వేధింపుల కేసు.. హీరోకు షాకిచ్చిన హైకోర్టు!
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసుపై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుతో సెటిల్మెంట్ కుదిరిందని ఊహగానాలు కూడా వచ్చాయి. (ఇది చదవండి: 'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కాగా.. 2017 ఆగస్టు 23న సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్.. తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సెప్టెంబరు 15, 2017లో పోలీసులకు ఫిర్యాదులో చేశారు. అయితే ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సెటిల్మెంట్లో ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని కూడా ఆరోపించాడు. ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఆయనకు కోర్టుల్లో చుక్కెదురైంది. దీంతో నటుడు తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాడు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) కాగా.. నటుడు చివరిసారిగా 'మలికాపురం చిత్రంలో కనిపించారు. 2011లో 'సీడన్' అనే తమిళ సినిమాతో ముకుందన్ తెరంగేట్రం చేశారు. అతను మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించారు. 2020లో ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్‌ని ప్రొడక్షన్ బ్యానర్ నడుపుతున్నాడు. -
‘కుట్రదారులను బయటకు లాగుతాం’
కోజికోడ్: మళయాల నటి అపహరణ, దాడి వెనుకున్న వారందరినీ పట్టుకుంటామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటన వెనుక గూండాలతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఏకే బాలన్ ఆరోపించారు. ‘ నిందితుల ద్వారా ఈ దాడి వెనుక ఎవరున్నారో కనుక్కుంటాం. దర్యాప్తు కేవలం కిరాయి గూండాలకు మాత్రమే పరిమితం కాదు. కుట్రదారులను అందరినీ బయటకు లాగుతామ’ని బాలన్ పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సునీల్ అలియాస్ పల్సర్ సుని, అతని అనచరుడు విజేశ్ ఇంకా పట్టుబడలేదు. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి వెనుక డబ్బులు కోసం ఘాతుకాలకు పాల్పడే ‘కొటేషన్ మాఫియా’ హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.