హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్‌పై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ పెద్దలు చక్కదిద్దే పనిలో పడ్డారు. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌పై (AMMA) మండిపడ్డారు. ఈ నివేదికపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇప్పటికే ఈ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక విషయంలో సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నివేదికపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా.. ఇప్పటికే దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీకి రాజీనామా చేయగా.. నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవి నుంచి నుంచి వైదొలిగారు.
Comments
Please login to add a commentAdd a comment