తిరువనంతపురం: అంగన్‌వాడీలో పెడుతున్న తిండి విషయంలో ఓ చిన్నారి చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ దెబ్బకు ప్రభుత్వం కదిలి వచ్చింది. అంగన్‌వాడీ మెనునూ మార్చేయాలని నిర్ణయించింది.
కేరళ అంగన్‌వాడీ సెంటర్లలో మెనూ మార్చే అంశంపై అక్కడి విద్యా శాఖ సమీక్ష జరుపుతోందట. అందుకు కారణం.. శంకూ అనే ఓ చిన్నారి వీడియో వైరల్ కావడమే. స్వయానా ఆ రాష్ట్ర ఆరోగ్య, శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్( Veena George) ఆ చిన్నారి వీడియోకు స్పందించి.. ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
అంగన్‌వాడీలో ప్రతీసారి ఉప్మా పెడుతున్నారని, దానికి బదులు.. బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఆ చిన్నారి విజ్ఞప్తి చేశాడు. అమాయకంగా ఆ బుడ్డోడు చెప్పిన మాటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అయ్యాయి. చివరకు.. ఆ వీడియో ప్రభుత్వం దాకా వెళ్లింది. దీంతో వీణా జార్జ్ స్పందించారు.
അംഗൻവാടിയിൽ,
ഉപ്പുമാവ് മാറ്റി ബിരിയാണിയും
പൊരിച്ച കോഴിയും വേണം എന്നു
ഈ അമ്പോറ്റി പൊന്നിന്.🤗♥️🥰😘
ഈ പരാതി ആരോടു പാറയും മല്ലയ്യാ. 🤔🤔 pic.twitter.com/FPYoXHB3tJ— 🖤 🍁 സുമ 🍁🖤 (@Suma357381) February 1, 2025
అంగన్‌వాడీలో పిల్లలకు ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. ఇప్పటికే పాలు గుడ్లు అందిస్తున్నాం. అయితే.. చిన్నారి శంకూ చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం. మెనూను కచ్చితంగా సమీక్షిస్తాం. ఆ వీడియోను చూశాక.. చాలామంది మాకు ఫోన్లు చేశారు. అతనికి బిర్యానీ, చికెన్ ఫ్రై ఇప్పిస్తామని అన్నారు. అంగన్‌వాడీలో పిల్లలకు అన్నిరకాల పోషకాలు అందాల్సిన అవసరం ఉంది. అందుకే మెనూలో మార్పులు తప్పకుండా చేస్తాం అని అన్నారామె.
అయితే.. అవసరమైతే జైల్లో ఖైదీలకు అందించే పెట్టే ఫుడ్‌ను తగ్గించి.. ఇలాంటి పిల్లలకు పెట్టాలంటూ ఆమె కామెంట్ సెక్షన్‌లో కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment