child viral video
-
స్వీట్వాయిస్ చిట్టెమ్మ! చిన్నారి వీడియో వైరల్.. ఆహా’!
పియానో వాయిస్తూ ఒక మహిళతో కలిసి కన్నడ పాట పాడుతున్న చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వీర లెవల్లో వైరల్ అయింది. అనంత్ కుమార్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. పాడుతున్న సమయంలో చిన్నారి ప్రదర్శించిన హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. ‘ఆహా’ అంటూ అబ్బురపడ్డారు. ‘పక్కనే తీయటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది’ ‘మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటీఫుల్ ఎక్స్ప్రెషన్స్’లాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. నిజానికి ఆన్లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమీ కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా ‘కబీర్‌సింగ్’ సినిమాలోని ‘కైసే హువా’ పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. Listened to this so many times..What an inborn talent..🌹🌹 Source:Wa . pic.twitter.com/bm1LEY4Nn4 — Ananth Kumar (@anantkkumar) April 19, 2023 -
వైరల్ వీడియో: తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
-
తల్లిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడికి సర్ప్రైజ్ గిఫ్ట్
భోపాల్: తన చాక్లెట్లు దొంగిలించి దొరక్కుండా దాచి పెడుతోందంటూ తల్లిపై ఓ మూడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మాటలు సైతం సరిగా రాని వయసులోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన చేసిన ఆ బుడ్డోడికి దీపావళి ముందే వచ్చేసింది. ఏకంగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ పిల్లాడికి సైకిల్ గిఫ్ట్‌గా పంపించారు. పోలీసులు తీసుకొచ్చి ఇచ్చిన ఆ సైకిల్‌పై చిన్నోడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తల్లిపై ఫిర్యాదు చేస్తున్న మూడేళ్ల హమ్జా వీడియో చూసిన తర్వాత.. అతడి ధైర్యానికి మెచ్చిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. దివాళి గిఫ్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ మరుసటిరోజునే చిట్టి సైకిల్‌ను బాలుడికి పంపించారు. పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం హమ్జా ఇంటికి వెళ్లి సైకిల్‌తో పాటు చాక్లెట్లు అందించారు. వాటిని చూసిన ఆ చిన్నోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదీ చదవండి: మా అమ్మ చాక్లెట్లు దొంగిలించింది.. అరెస్టు చేయండి.. పోలీస్ స్టేషన్లో బుడ్డోడి వీడియో వైరల్ -
ఈ బుడ్డోడు ఎక్కడున్నాడో వెతకండి
సాక్షి, ఇస్లామాబాద్ : పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్. సుదీర్ఘ కెరీర్లో పాక్‌కు ఎన్నో ఘన విజయాలను అందించాడు. 104 టెస్టుల్లో 414 వికెట్లు.. 356 వన్డేల్లో 502 వికెట్లు ఆయన ఘనత. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఓ బుడ్డొడి గురించి తెగ ఆరా తీస్తున్నారు. కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో నిండా పదేళ్లు కూడా లేని ఓ బుడ్డొడు తన బౌలింగ్ వాటం చూపించాడు. నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో అక్రమ్, మహ్మద్ అమీర్ బౌలింగ్ యాక్షన్లు కలబోసినట్లు ఉన్న ఆ బుడ్డొడు ధాటిగా 17 బంతులను విసిరాడు. అందులో 7 సింగిల్ స్టంప్‌ను ఎగిరేయగా.. మిగతావి తప్పిపోయాయి. ఫైజాన్ రంజాన్ అనే యువకుడు దీనిని ట్విట్టర్లో పోస్టు చేయగా.. చిన్నారి బౌలింగ్ యాక్షన్ చూసి ఫిదా అయిన అక్రమ్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇలాంటి టాలెంట్ దేశానికి అవసరమని.. ఈ చిన్నారి ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పండంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన అక్రమ్ భార్య షానెరియా ‘బహుశా అతను మరో అక్రమ్ ఏమో?’ అంటూ కామెంట్ చేసింది. Where is this boy??? We have serious talent flowing through the veins of our nation and no platform for these kids to be discovered. It’s time we do something about it #TheFutureOfCricketIsWithOurYouth https://t.co/ybzd5ASeTx — Wasim Akram (@wasimakramlive) 28 February 2018 -
బుడ్డోడి గురించి ఆరా తీస్తున్న క్రికెటర్
-
వైరల్ వీడియో: ఆ చిన్నారి మొండిది.. అందుకే
న్యూఢిల్లీ: చదువు పేరిట చిన్నారిని భయపెట్టి, బెదిరించి వేధిస్తున్న వీడియోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోను చూసి కలత చెందిన క్రికెటర్లు యువరాజ్‌సింగ్, శిఖర్ ధావన్‌తోపాటు ఎంతోమంది నెటిజన్లు షేర్ చేసుకున్నారు. పిల్లలను చదువు పేరిట ఇలా దండించడం, హింసించడం ఎంతమాత్రం సరికాదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను చక్కగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని, చిన్నారి హృదయాలను ఇలా బెదిరించి, హింసించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. అయితే, ఆసక్తికరంగా ఈ వీడియోలో ఉన్న చిన్నారి వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ గాయకులు తోషి, షరీబ్ సబ్రీల మేనకోడలే ఈ మూడేళ్ల పాప హయా.. వైరల్ అయిన ఈ వీడియోపై గాయకుడు తోషీ సబ్రీ స్పందిస్తూ.. హయా చాలా మొండిదని, ఎంత చెప్పినా చదువుకోదని, అందుకే ఆమె తల్లి ఇలా బలవంతంగా నేర్పిస్తున్నదని వివరించాడు. తమ కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్ కోసం ఈ వీడియోను హయా తల్లే రికార్డు చేసిందని, ఇది అందరూ షేర్ చేసుకోవడానికి కాదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. 'మా పాప గురించి మాకు బాగా తెలుసు. ఎంత తిట్టినా హయా చదువుకోదు. మరుక్షణమే ఆడటానికి పరిగెత్తుకు వెళ్తుంది. అందుకే తను కొంతసేపైనా చదువుకొనేలా చూస్తాం' అని తోషి చెప్పాడు. 'హయా ఎంత మొండిదో భర్తకు, సోదరులకు చూపించేందుకు ఆమె తల్లి ఈ వీడియోను చిత్రీకరించింది. తల్లి చదువుకోమని చెప్పినంత సేపే హయా ఏడుస్తోంది. చదువు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తుంది. ప్రతి ఇంట్లో విభిన్న స్వభావాలున్న పిల్లలు ఉంటారు. మా చిన్నారి కాస్తా మొండిది. కానీ తను అంటే మాకు ఎంతో ఇష్టం' అని తోషి చెప్పాడు. కానీ, ఏదిఏమైనా చదువు పేరిట పిల్లలను తీవ్రంగా భయపెట్టడం, బెదిరించడం సబబు కాదని నెటిజన్లు అంటున్నారు.