ఈ బుడ్డోడు ఎక్కడున్నాడో వెతకండి | Wasim Akram Impress with Pakistani kid Bowling Action | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 1 2018 2:33 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Wasim Akram Impress with Pakistani kid Bowling Action - Sakshi

చిన్నారి బౌలింగ్‌ యాక్షన్‌ దృశ్యాలు

సాక్షి, ఇస్లామాబాద్‌ : పాక్‌ క్రికెట్‌ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌. సుదీర్ఘ కెరీర్‌లో పాక్‌కు ఎన్నో ఘన విజయాలను అందించాడు. 104 టెస్టుల్లో 414 వికెట్లు.. 356 వన్డేల్లో 502 వికెట్లు ఆయన ఘనత. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఓ బుడ్డొడి గురించి తెగ ఆరా తీస్తున్నారు. 

కొన్నాళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అందులో నిండా పదేళ్లు కూడా లేని ఓ బుడ్డొడు తన బౌలింగ్‌ వాటం చూపించాడు. నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో అక్రమ్‌, మహ్మద్‌ అమీర్‌ బౌలింగ్‌ యాక్షన్‌లు కలబోసినట్లు ఉన్న ఆ బుడ్డొడు ధాటిగా 17 బంతులను విసిరాడు. అందులో 7 సింగిల్‌ స్టంప్‌ను ఎగిరేయగా.. మిగతావి తప్పిపోయాయి. 

ఫైజాన్‌ రంజాన్‌ అనే యువకుడు దీనిని ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. చిన్నారి బౌలింగ్‌ యాక్షన్‌ చూసి ఫిదా అయిన అక్రమ్‌ తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఇలాంటి టాలెంట్‌ దేశానికి అవసరమని.. ఈ చిన్నారి ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పండంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన అక్రమ్‌ భార్య షానెరియా ‘బహుశా అతను మరో అక్రమ్‌ ఏమో?’ అంటూ కామెంట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement