
పియానో వాయిస్తూ ఒక మహిళతో కలిసి కన్నడ పాట పాడుతున్న చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వీర లెవల్లో వైరల్ అయింది. అనంత్ కుమార్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. పాడుతున్న సమయంలో చిన్నారి ప్రదర్శించిన హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. ‘ఆహా’ అంటూ అబ్బురపడ్డారు.
‘పక్కనే తీయటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది’ ‘మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటీఫుల్ ఎక్స్‌ప్రెషన్స్’లాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. నిజానికి ఆన్‌లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమీ కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా ‘కబీర్‌సింగ్’ సినిమాలోని ‘కైసే హువా’ పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
Listened to this so many times..What an inborn talent..🌹🌹
— Ananth Kumar (@anantkkumar) April 19, 2023
Source:Wa . pic.twitter.com/bm1LEY4Nn4