Kannada song
-
ఈ చిన్నారి టాలెంట్‌కు ఫిదా అయిన ప్రధాని మోదీ
మహిళతో కలిసి కన్నడ పాట పాడుతూ, అద్భుతంగా పియానో వాయిస్తున్న ఓ చిన్నారి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వీర లెవల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అనంత్ కుమార్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘పల్లవగల పల్లవియాలి’ అనే పాటకు పియానో వాయిస్తూ చిన్నారి శాల్మలీ ప్రదర్శించిన హావభావాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా చిన్నారి టాలెంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. పాప వీడియోను మోదీ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. చిన్నారి వీడియో ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు తెప్పిస్తుందన్నారు. ఆమెలో అసాధారణమైన ప్రతిభ, సృజనాత్మకత దాగుందన్నారు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని శాల్మలీకి ఆశీస్సులు అందజేశారు. This video can bring a smile on everyone’s face. Exceptional talent and creativity. Best wishes to Shalmalee! https://t.co/KvxJPJepQ4 — Narendra Modi (@narendramodi) April 25, 2023 కాగా పల్లవగల పల్లవియాలి’ అంటూ చిన్నారి పాడిన పాటను కన్నడ కవి కేఎస్.నరసిహస్వామి రచించారు. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ‘పక్కనే తీయటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది’ ‘మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటీఫుల్ ఎక్స్ప్రెషన్స్’లాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. నిజానికి ఆన్లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమీ కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా ‘కబీర్‌సింగ్’ సినిమాలోని ‘కైసే హువా’ పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. -
స్వీట్వాయిస్ చిట్టెమ్మ! చిన్నారి వీడియో వైరల్.. ఆహా’!
పియానో వాయిస్తూ ఒక మహిళతో కలిసి కన్నడ పాట పాడుతున్న చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వీర లెవల్లో వైరల్ అయింది. అనంత్ కుమార్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. పాడుతున్న సమయంలో చిన్నారి ప్రదర్శించిన హావభావాలకు నెటిజనులు ఫిదా అయ్యారు. ‘ఆహా’ అంటూ అబ్బురపడ్డారు. ‘పక్కనే తీయటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది’ ‘మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటీఫుల్ ఎక్స్ప్రెషన్స్’లాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. నిజానికి ఆన్లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమీ కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా ‘కబీర్‌సింగ్’ సినిమాలోని ‘కైసే హువా’ పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. Listened to this so many times..What an inborn talent..🌹🌹 Source:Wa . pic.twitter.com/bm1LEY4Nn4 — Ananth Kumar (@anantkkumar) April 19, 2023 -
పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలు, జెండాలు.. దాడి
బెళగావి: కర్ణాటక బెళగావిలో కన్నడ పాటలు పెట్టినందుకు వధూవరులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. దమానే గ్రామంలో రేష్మ-సాయిబన్వర్‌ల వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలను ప్రదర్శించడంతో పాటు కన్నడ జెండాలతో డ్యాన్సులు చేశారు కొందరు. దీంతో చన్నమ్మనగర్‌కు చెందిన ఎంఈఎస్ కార్యకర్తలు కొందరు ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారు. ఐదుగురు యువకులను తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వాళ్లను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి.. పది మంది ఎంఈఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. -
అమితాబ్ గొంతులో కన్నడ కస్తూరి
కర్ణాటక, బొమ్మనహళ్లి: బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కన్నడ పాట పాడారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కన్నడ నటి పరూల్ యాదవ్ నటిస్తున్న బటర్ ఫ్లై సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఒక క్లబ్ సాంగ్‌ను అమితాబ్ బచ్చన్ చేత పాడించారు. కన్నడ, ఆంగ్ల సాహిత్యంతో మాస్టర్ హిరణ్ణ రాసిన ఈ పాటను రాశారు. గాయని విద్యా హోక్స్ కూడా అమితాబ్‌తో గొంతు కలిపారు. ఈ పాటను ప్యారిస్‌లో ఒక క్లబ్లో నాలుగురోజులు షూటింగ్చేసినట్లు చెబుతున్నారు. అమితాబ్ 14 ఏళ్ల కిందట అమృత దారే అనే కన్నడ సినిమాలో అతిథి పాత్రను పోషించారు. మళ్లీ ఇప్పుడు శాండల్‌వుడ్ తెరపై దర్శనమిస్తారు. -
పాట కోసం ధనుష్ కు రూ.4 లక్షల వాచ్
శివరాజ్‌కుమార్ ‘వజ్రకాయ’ సినిమాలో ఓ పాటను పాడిన ధనుష్ సాక్షి, బెంగళూరు : ‘వై దిస్ కొలవెరి డీ’ ఈ పాట ఒకే ఒక్క రోజులో దేశాన్నంతా ఒక ఊపు ఊపేసింది. అంతేనా అప్పటి వరకు సినీపరిశ్రమలో మంచి నటుడిగా, రజనీకాంత్ అల్లుడిగా సుపరిచితుడైన ధనుష్‌ను ఓ యూత్‌ఫుల్ సింగర్‌గా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి ధనుష్‌తో కన్నడలో కూడా ఓ పాటను పాడించాలని, ఎంతో మంది సంగీత దర్శకులు, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులకు కన్నడ సినీప్రియులకు ధనుష్ గాత్రాన్ని వినే అవకాశం కలిగింది. అర్జున్‌జన్య సంగీత సారధ్యంలో శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న వజ్రకాయ సినిమా ద్వారా కన్నడ సంగీత అభిమానులకు ధనుష్ చేరువకానున్నారు. చెన్నైలోని ధనుష్ స్టూడియోలో మంగళవారం ఈ పాటను రికార్డింగ్ చేశారు. ఈ విషయంపై వజ్రకాయ దర్శకుడు హర్ష మాట్లాడుతూ ధనుష్ పాడిన వై దిస్ కొలవెరి డీ పాటను విన్న తర్వాత కన్నడ సినిమాలో కూడా ఆయనతో ఓ పాటను పాడించాలని భావించానన్నారు. వజ్రకాయ సినిమాలోని ఓ పాట ఆయన గాత్రంలో అయితేనే చక్కగా ఉంటుందని భావించానన్నారు. అందుకే పాట లిరిక్స్, ట్యూన్ తీసుకుని చెన్నైలో ఉన్న ధనుష్‌ని కలిసి వినిపించామన్నారు. దీంతో ఈ పాటను పాడడానికి ఆయన అంగీకరించారని తెలిపారు. ఈ అద్భుతంగా వచ్చిందని వివరించారు. పాట కోసం రూ.4 లక్షల వాచ్ వజ్రకాయ చిత్రంలో పాట పాడినందుకు ధనుష్‌కి రూ.4 లక్షల విలువైన వాచ్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం గాంధీనగర్‌లో హాట్‌టాపిక్. ‘ధనుష్ పాటకు ఇంతని పారితోషికాన్ని చెల్లించడం కష్టతరమైన పని. అందుకే మా యూనిట్ తరఫున ఓ వాచ్‌ను ఆయనకు అందజేయనున్నాం. ఆ వాచ్ ధర ఎంతని మాత్రం నేను చెప్పలేను’ అని నిర్మాత సి.ఆర్.మనోహర్ పేర్కొన్నారు.