మహిళతో కలిసి కన్నడ పాట పాడుతూ, అద్భుతంగా పియానో వాయిస్తున్న ఓ చిన్నారి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వీర లెవల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అనంత్ కుమార్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ‘పల్లవగల పల్లవియాలి’ అనే పాటకు పియానో వాయిస్తూ చిన్నారి శాల్మలీ ప్రదర్శించిన హావభావాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.
తాజాగా చిన్నారి టాలెంట్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. పాప వీడియోను మోదీ తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. చిన్నారి వీడియో ప్రతి ఒక్కరి ముఖంపై చిరునవ్వు తెప్పిస్తుందన్నారు. ఆమెలో అసాధారణమైన ప్రతిభ, సృజనాత్మకత దాగుందన్నారు. భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని శాల్మలీకి ఆశీస్సులు అందజేశారు.
This video can bring a smile on everyone’s face. Exceptional talent and creativity. Best wishes to Shalmalee! https://t.co/KvxJPJepQ4
— Narendra Modi (@narendramodi) April 25, 2023
కాగా పల్లవగల పల్లవియాలి’ అంటూ చిన్నారి పాడిన పాటను కన్నడ కవి కేఎస్.నరసిహస్వామి రచించారు. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ‘పక్కనే తీయటి సెలయేరు పారుతున్నట్లుగా ఉంది’ ‘మ్యాజిక్ వాయిస్ ప్లస్ బ్యూటీఫుల్ ఎక్స్‌ప్రెషన్స్’లాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. నిజానికి ఆన్‌లైన్ ప్రేక్షకులకు ఈ చిన్నారి గొంతు కొత్తేమీ కాదు. గత సంవత్సరం బాలీవుడ్ సినిమా ‘కబీర్‌సింగ్’ సినిమాలోని ‘కైసే హువా’ పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment