పారాలింపిక్స్ క్రీడాకారులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పారా విశ్వక్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన బృందాన్ని కొనియాడారు. భారత పారాలింపిక్స్ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్కును సెట్ చేశారంటూ అభినందించారు. కాగా పారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ అత్యధికంగా 29 పతకాలు గెలిచింది. ఇందులో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, పదమూడు కాంస్య పతకాలు ఉన్నాయి.
నేలపై కూర్చున్న మోదీ
ఈ క్రమంలో టోక్యో పారాలింపిక్స్ పతకాల(19) రికార్డు బ్రేక్ అయింది. ఈ నేపథ్యంలో పారిస్ నుంచి పతకాలతో తిరిగి వచ్చిన పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారాలింపియన్ల అంకితభావాన్ని కొనియాడిన ప్రధాని వారిని అభినందించారు.
అదే విధంగా.. ప్రతి ఒక్కరితో విడివిడిగా కలుసుకొని ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా శారీరక ఎదుగుదల లోపం ఉన్న జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ సింగ్‌తో మోదీ అహ్లాదంగా గడిపారు. మరుగుజ్జు క్రీడాకారుడైన అతని చేతుల మీదుగా టోపీ ధరించేందుకు నేలపై కూర్చున్నారు. దీంతో నవ్‌దీప్ అమితానందంతో ప్రధానికి టోపీ తొడిగాడు.
అనంతరం తన చేతి భుజంపై ఆటోగ్రాఫ్ కోరగా... ప్రధాని వెంటనే పెన్ తీసుకొని అతని ముచ్చట తీర్చారు. జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన అతని గురించి అడిగి తెలుసుకున్నారు.
కాలితో సంతకం చేసిన శీతల్
అదే విధంగా.. షూటర్ అవని లేఖరా, జూడో ప్లేయర్ కపిల్ పర్మార్, ఆర్చర్లు శీతల్ దేవి, రాకేశ్ కుమార్ తదితరులు ప్రధానితో ముచ్చటించారు. ఈ సందర్భంగా శీతల్ కాలితో సంతకం చేసిన జెర్సీని మోదీకి బహూకరించింది. ఇక ఈ భేటీకి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ శుక్రవారం.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.
చదవండి: అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్ దేవి
India's Paralympic champions have set a new benchmark with the highest-ever medal count. It was a delight to interact with them. https://t.co/yLkviuJCaI
— Narendra Modi (@narendramodi) September 13, 2024
Comments
Please login to add a commentAdd a comment