ప్రధాని మోదీ చిందేస్తే.. ఎలా ఉంటుంది! | 'I also enjoyed my dance': PM Modi reacts to viral dancing video | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియోపై స్పందించిన మోదీ.. ‘నేనూ ఎంజాయ్‌ చేశా’

Published Tue, May 7 2024 11:38 AM | Last Updated on Tue, May 7 2024 12:38 PM

'I also enjoyed my dance': PM Modi reacts to viral dancing video

లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ ప్రముఖులపై మీమ్స్‌, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్నట్లు నెట్టింట వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అలా తనపై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ యానిమేటెడ్‌ డాన్స్‌ వీడియోపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 

‘మీలాగే నేను కూడా వీడియోలో నా డాన్స్‌ చూసి ఎంజాయ్‌ చేశా. ఎన్నికల సమయంలో ఇది చాలా అద్భుతమైన క్రియేటివిటీ. నిజంగా ఆనందం కలిగిస్తోంది’ అని మోదీ తన డాన్స్‌ వీడియో పోస్ట్‌ను ‘ఎక్స్‌’ లో రీట్వీట్‌ చేశారు.

 

అయితే ఈ వీడియోను క్రిష్ణా అనే నెటిజన్‌ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేసి.. ‘ఈ వీడియో పోస్ట్‌ చేయటం వల్ల నన్న ఎవరూ అరెస్ట్‌ చేరని నాకు తెలుసు’ కాప్షన్‌ జతచేశారు. దీనికి ప్రధాని మోదీ పైవిధంగా స్పందించటం గమనార్హం. ఈ  యానిమేటెడ్‌ వీడియోలో మోదీ ప్రజల ముందు డాన్స్‌ చేసినట్లు కనిపిస్తారు.

దీనికి కంటే ముందు ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. దీనిపై కోల్‌కతా పోలీసులు ఆ వీడియోను పోస్ట్‌ చేసిన యూజర్‌పై చర్యలు తీసుకున్నారు.

 

దీంతో పలువురు నెటిజన్లు.. తమ వీడియోలపై ప్రధానిమోదీ, సీఎం మమత స్పందించిన తీరుపై చర్చించుకుంటున్నారు. ఇక.. ‘మోదీ కూల్‌ పీఎం’అని కామెంట్‌ చేశారు. మరో నెటిజన్‌ అయితే.. మోదీ, మమత యానిమేటెడ్‌ డాన్స్‌ వీడియోలను  పోస్ట్‌ చేసి.. ‘మమత బెనర్జీ వీడియో నిన్న కోల్‌కతా పోలీసుల చేత అరెస్ట్‌ చేయిస్తుంది. అదే మోదీ వీడియో అయితే అరెస్ట్‌ కాము’అని కామెంట్‌ చేశారు.

ఇక.. గతేడాది పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మోదీ వాయిస్‌తో వీడియోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. వాటిని నెటిజన్లు​ సరదగా క్రియేట్‌​ చేసి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement