animated video
-
"బుజ్జి & భైరవ" మీ ఊహకి అందదు
-
ప్రధాని మోదీ చిందేస్తే.. ఎలా ఉంటుంది!
లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ ప్రముఖులపై మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్నట్లు నెట్టింట వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అలా తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ యానిమేటెడ్ డాన్స్ వీడియోపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ‘మీలాగే నేను కూడా వీడియోలో నా డాన్స్ చూసి ఎంజాయ్ చేశా. ఎన్నికల సమయంలో ఇది చాలా అద్భుతమైన క్రియేటివిటీ. నిజంగా ఆనందం కలిగిస్తోంది’ అని మోదీ తన డాన్స్ వీడియో పోస్ట్‌ను ‘ఎక్స్’ లో రీట్వీట్ చేశారు.Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀Such creativity in peak poll season is truly a delight! #PollHumour https://t.co/QNxB6KUQ3R— Narendra Modi (@narendramodi) May 6, 2024 అయితే ఈ వీడియోను క్రిష్ణా అనే నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘ఈ వీడియో పోస్ట్ చేయటం వల్ల నన్న ఎవరూ అరెస్ట్ చేరని నాకు తెలుసు’ కాప్షన్ జతచేశారు. దీనికి ప్రధాని మోదీ పైవిధంగా స్పందించటం గమనార్హం. ఈ యానిమేటెడ్ వీడియోలో మోదీ ప్రజల ముందు డాన్స్ చేసినట్లు కనిపిస్తారు.దీనికి కంటే ముందు ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. దీనిపై కోల్‌కతా పోలీసులు ఆ వీడియోను పోస్ట్ చేసిన యూజర్‌పై చర్యలు తీసుకున్నారు.Mamata Banerjee's video can get you arrested by Kolkata Police.Narendra Modi's video won't get you arrested.But, Modi is dictator. pic.twitter.com/Y42D6g2EJx— Incognito (@Incognito_qfs) May 6, 2024 దీంతో పలువురు నెటిజన్లు.. తమ వీడియోలపై ప్రధానిమోదీ, సీఎం మమత స్పందించిన తీరుపై చర్చించుకుంటున్నారు. ఇక.. ‘మోదీ కూల్ పీఎం’అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే.. మోదీ, మమత యానిమేటెడ్ డాన్స్ వీడియోలను పోస్ట్ చేసి.. ‘మమత బెనర్జీ వీడియో నిన్న కోల్‌కతా పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తుంది. అదే మోదీ వీడియో అయితే అరెస్ట్ కాము’అని కామెంట్ చేశారు.ఇక.. గతేడాది పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మోదీ వాయిస్‌తో వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. వాటిని నెటిజన్లు సరదగా క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. -
ఖతం.. టాటా.. వీడ్కోలు..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి పునఃర్వైభవం తీసుకొచ్చేందుకు భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్ర చేపడుతున్నారు రాహుల్ గాంధీ. యాత్ర మొదలైనప్పుటి నుంచి రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ.. తాజాగా ఓ యానిమేటెడ్ ఫన్నీ వీడియోను విడుదల చేసింది. అందుకు కాంగ్రెస్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భారత్ జోడో యాత్ర లక్ష్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల వీడియోను అధికార బీజేపీ విడుదల చేసింది. దానికి కౌంటర్‌గా ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రధాని మోదీ విఫలమైనట్లు సూచిస్తూ కాంగ్రెస్ మరో వీడియోను షేర్ చేసింది. బీజేపీ అధికారిక ట్విటర్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో.. కాంగ్రెస్‌లో కొద్ది రోజులుగా నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్న తీరును వివరించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో నేతల రాజీనామాలు, రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల తిరుగుబాటును సూచిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సుమారు 2 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో.. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ఓదార్చుతున్నట్లు చూపించారు. ఈ సందర్భంగా.. ‘ అమ్మా చెడ్డ రోజులు ఎందుకు అంతం కావు? ఇది ముగిసింది, టాటా.. వీడ్కోలు..’ అంటూ సోనియాను రాహుల్ అడిగినట్లు పేర్కొంది. मम्मी ये दुःख खतम काहे नहीं होता है? खतम…टाटा…गुडबाय! pic.twitter.com/J4tFqQgPOQ — BJP (@BJP4India) October 16, 2022 కాంగ్రెస్ కౌంటర్ వీడియో.. బీజేపీ వీడియో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ కౌంటర్ అటాక్ చేసింది. ప్రజలు గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల పెరుగుదల, నిరుద్యోగిత వంటి వాటిపై ప్రశ్నిస్తుంటే ప్రధాని మోదీ అక్కడి నుంచి దూరంగా పరిగెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో చూపించింది కాంగ్రెస్. దుష్మాన్ సినిమాలోని ‘వాదా తేరా వాదా’ పాట వస్తుండగా మోదీ పరుగులు పెట్టినట్లు పేర్కొంది. दौड़ा दौड़ा भागा भागा सा.. pic.twitter.com/xYXLY5dWdf — Congress (@INCIndia) October 16, 2022 ఇదీ చదవండి: Himachal Pradesh Election 2022: మంచుకొండల్లో ఎన్నికల వేడి -
'ఊ అంటావా' బీట్‌కు 'బీటీఎస్' బ్యాండ్.. 'శ్రీవల్లి' పాటకు ప్రధాని స్టెప్పులు
BTS Band Dance To Samantha Song PM Modi Steps To Srivalli Song: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ సమంత కలిసి అదరగొట్టిన సాంగ్ 'ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఒకరకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఆ స్పెషల్‌లో సమంత వంటి అగ్రకథానాయిక స్టెప్పులు వేయనుందని తెలిసినప్పటినుంచి బజ్ విపరీతంగా పెరిగింది. ఆ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, సమంత, అల్లు అర్జున్ స్టెప్పులు పాటను ఓ రేంజ్లో తీసుకెళ్లాయి. ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ పాటకు వస్తున్న క్రేజ్ చూసి ఇదివరకే పలువురు కవర్ సాంగ్స్, రీల్స్ చేసి ఆకట్టుకున్నారు. నెటిజన్లు ఈ పాటపై ఎడిటింగ్ వీడియోలు క్రియేట్ చేసి అబ్బురపరుస్తున్నారు. తాజాగా ప్రముఖ కొరియన్ పాప్ సింగింగ్ బ్యాండ్ బీటీఎస్ చేసిన 'బాయ్ విత్ లవ్' వీడియోకు 'ఊ అంటావా మావ' పాటను జత చేసి ఓ నెటిజన్ ప్రత్యేక వీడియోను రూపొందించాడు. 'పుష్ప బీట్‌ను బీటీఎస్ ఫాలో కాలేదు. బీటే బీటీఎస్‌ను ఫాలో అయ్యింది. బీటీఎస్‌లో టీ అంటే టాలీవుడ్' అని రాసుకొచ్చాడు. ఈ వీడియోలో బీటీఎస్ టీమ్ అయిన ఆర్ఎం, జిన్, సుగా, జిమిన్, వి, జంగ్‌కూక్, జె. హోప్ వేసిన స్టెప్పులు తెలుగు పాట బీట్‌కు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో ఈ క్రియేటెడ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by qualiteaposts (@qualiteaposts) అలాగే పుష్పలోని మరొక సూపర్ డూపర్ హిట్ సాంగ్ శ్రీవల్లి. ఈ పాటకు ప్రధాని నరేంద్ర మోదీ స్టెప్పులేసినట్లుగా ఓ యానిమేటెడ్ వీడియోను మరొ నేటిజన్ క్రియేట్ చేశాడు. అలా క్రియేట్ చేసిన ఆ వీడియోను నెట్టింట్లో వదిలేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. My favourite WhatsApp forward! The creators in our country don’t sleep 😂 Looking great Modiji! @narendramodi @alluarjun #Pushpa pic.twitter.com/QBkxX51b3a — Akshat Saraf (@AkshatSaraf) January 21, 2022 -
ప్రతిపక్షాలపై ‘వీడియో’ అస్త్రాలు
న్యూఢిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై సైన్యం దాడులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పేందుకు బీజేపీ యానిమేటెడ్ వీడియోలను రూపొందించింది. రాహుల్, ఇతర ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా ప్రధాని మోదీని హీరోగా చూపుతూ క్రీడా నేపథ్యంలో తయారుచేసిన వీడియోలను ఆదివారం బీజేపీ విడుదల చేసింది. క్రికెట్, కబడ్డీ, చెస్ ఆటల క్లిప్పింగ్‌లను ఈ వీడియోలకోసం తీసుకున్నామని, పార్టీ అధికారిక ట్విట్టర్ సైట్లో ప్రకటించారు. దాదాపు అన్ని వీడియోలలోనూ మోదీ హీరోగా, ప్రతిపక్షాలపై ఒంటరిగా, అజేయంగా పోరాడుతున్నట్టుగా రూపొందించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఒక వీడియోలో మోదీ సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించినట్టుగా, ప్రతిపక్షాలు అంపైర్‌ను ఆ విజయానికి సాక్ష్యం చూపమని అడుగుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోను ట్యాగ్చేస్తూ అరుణ్ జైట్లీ ‘భారత్ విజయానికి ఎవరు సాక్ష్యాలు అడుగుతారు, అపజయానికి కారణాలు వెతుక్కునే వారే ఈ విజయానికి రుజువులు కావాలని అడుగుతారు’అని చెప్పారు. కబడ్డీ వీడియోలో ప్రతిపక్షాలన్నింటినీ మోదీ ఒక్కడే మట్టి కరిపించినట్టుగా ఉంది. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఓటర్లకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే లక్ష్యంగా వీటిని తయారుచేసినట్లు బీజేపీ తెలిపింది. -
త్రీడీలో మోదీ: నేను యోగా టీచర్‌ను కాదు
-
త్రీడీలో మోదీ.. షేర్ చేసిన ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: గత సంవత్సరం ప్రపంచ యోగా డేను ఘనంగా నిర్వహించిన ప్రధాని మోదీ ఇప్పుడు యోగా టీచర్‌గా అవతారమెత్తారు. త్రీకోణాసనం నేర్పిస్తున్న యోగా టీచర్‌గా ఉన్న ఓ త్రీడీ యానిమేషన్ వీడియోను విడుదల చేశారు. ఆదివారం 42వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఓ త్రీడి వీడియోను షేర్ చేశారు. అందులో త్రీకోణాసనం నేర్పిస్తున్న యోగా టీచర్‌గా మోదీ కనిపిస్తారు. ప్రధాని మాట్లాడుతూ.. ‘నేను యోగా టీచర్‌ను కాదు. కొంత మంది తమ ప్రతిభతో నన్ను ఇలా మార్చేశారు’ అని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018 బడ్జెట్లో రైతులకు పెద్దపీఠ వేసినట్టు, పంటలకు 1.5 రెట్లు మద్దతు ధర ఇవ్వనున్నట్టు తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ఆరోగ్య కేంద్రాలను విస్తరించడానికి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. దేశ యువత ఫిట్ మూమెంట్ తెచ్చి దాన్ని విజయవంతం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. బీఆర్ అంబేద్కర్ భారత్‌ను ఇండస్ట్రీయల్ పవర్‌హౌజ్ దేశంగా చేయాలని కలలు కన్నారని వాటిని నిజం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని వివరించారు. -
హార్దిక్ పాండ్యా వర్సెస్ జడేజా!
ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి చెందగా.. ఓ రనౌట్ మాత్రం చర్చనీయాంశమైంది. రవీంద్ర జడేజాతో సమస్వయ లోపంతో , హార్దిక్ పాండ్యా అవుట్ కాగా అతడు తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. పాండ్యాతో పాటు యావత్ భారతదేశం జడేజా తీరును తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. 'సొంత జట్టు లోపాల వల్లే ఓడిపోయాం. కానీ పాక్‌కు అంత సీన్ లేదని' తాను చేసిన ట్వీట్ వైరల్ కావడంతో పాండ్యా ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. అయితే ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రనౌట్ తర్వాత డ్రెస్సింగ్ రూముకి వెళ్లిన పాండ్యా, జడేజా వచ్చిన వెంటనే అతడితో తలపడినట్లుగా ఓ యానిమేషన్ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెజ్లింగ్‌కు సంబంధించి డబ్ల్యూడబ్ల్యూఈలో రెజ్లర్లు తలపడినట్లుగా జడేజా, పాండ్యాలు ఒకరిపై మరొకరు ముష్టిగాథాలతో చెలరేగిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సరదా వీడియో అనూహ్యమైన స్పందన వస్తోంది. చివరికి ఎవరు గెలుస్తారన్న సస్పెన్స్‌తో నెటిజన్లు ఈ యానిమేటెడ్ వీడియోను వీక్షిస్తున్నారు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 339 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన టీమిండియా 54 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకొచ్చిన యువ సంచలనం హార్దిక్ పాండ్యా కేవలం 43 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి కాసేపు ప్రత్యర్థి పాక్‌కు వణుకు పుట్టించాడు. జడేజా కాల్‌కు స్పందించి పరుగుకు యత్నించి పాండ్యా రనౌట్ కాగా, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ రనౌట్ కొన్ని రోజులపాటు చర్చనీయాంశమైంది. పాండ్యా మరికాసేపు క్రీజులో ఉంటే ఓటమి అంతరాన్ని తగ్గించేవాడని కామెంట్లు వచ్చాయి.