Karnataka Farmer Kisses PM Modi Pic Video Viral - Sakshi
Sakshi News home page

మోదీ ఫొటో చూసి మురిసిపోయాడు.. ఆనందంలో ముద్దుపెట్టి.. 

Published Fri, Mar 31 2023 1:36 PM | Last Updated on Fri, Mar 31 2023 1:48 PM

Karnataka Farmer Kisses PM Modi Pic Video Viral - Sakshi

బెంగళూరు: దేశంలో ఎన్నికలు ఏవైనా కేంద్రంలో ఉన్న బీజేపీ.. ఫుల్‌ మెజార్టీతో దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఎన్నికల్లో చాలా స్థానాల్లో, రాష్ట్రాలలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక, తాజాగా కర్నాటకలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో ప్రచారంలో బీజేపీ జోరుపెంచింది. 

ఇక, కర్నాటకలో ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నాటకలో ఓ బస్సుపై మోదీ ఫొటో కనిపించడంతో ఓ రైతు.. ప్రధానిపై తనకున్న మమకారాన్ని చూపించుకున్నాడు. ఓ రైతు.. బస్సుపై ఉన్న ప్రధాని మోదీ ఫొటోకు ముద్దుపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మోదీ ఫొటోను చూస్తూ కాసేపు కబుర్లు కూడా చెప్పాడు. 

అయితే, ఇటీవల కేఎస్‌ఆర్టీసీకి చెందిన ఓ ఆర్టీసీ బస్సుపై జీ20 సమ్మిట్‌కు సంబంధించిన ప్రకటనపై ప్రధాని మోదీ ఫొటో ముద్రించి ఉంది. అటుగా వెళ్తున్న ఓ రైతు.. బస్సు వద్దకు వచ్చి పోస్టర్‌ను చూసి మురిసిపోయాడు. ఈ క్రమంలో మోదీ ఫొటోకు ముద్దుపెట్టాడు. ఈ సందర్బంగా సదరు రైతు మాట్లాడుతూ.. నాకు వెయ్యి రూపాయలు వచ్చేవి.. ఇప్పుడు నాకు రూ. 500 ఎక్కువ వచ్చేలా చేశావు. మా ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు. ప్రపంచాన్నే జయిస్తావు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోను కేంద్రమంత్రి పీయూస్‌ గోయల్‌ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement