ksrtc bus
-
మోదీ ఫొటో చూసి మురిసిపోయాడు.. ఆనందంలో ముద్దుపెట్టి..
బెంగళూరు: దేశంలో ఎన్నికలు ఏవైనా కేంద్రంలో ఉన్న బీజేపీ.. ఫుల్ మెజార్టీతో దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఎన్నికల్లో చాలా స్థానాల్లో, రాష్ట్రాలలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక, తాజాగా కర్నాటకలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో ప్రచారంలో బీజేపీ జోరుపెంచింది. ఇక, కర్నాటకలో ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నాటకలో ఓ బస్సుపై మోదీ ఫొటో కనిపించడంతో ఓ రైతు.. ప్రధానిపై తనకున్న మమకారాన్ని చూపించుకున్నాడు. ఓ రైతు.. బస్సుపై ఉన్న ప్రధాని మోదీ ఫొటోకు ముద్దుపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా మోదీ ఫొటోను చూస్తూ కాసేపు కబుర్లు కూడా చెప్పాడు. అయితే, ఇటీవల కేఎస్ఆర్టీసీకి చెందిన ఓ ఆర్టీసీ బస్సుపై జీ20 సమ్మిట్‌కు సంబంధించిన ప్రకటనపై ప్రధాని మోదీ ఫొటో ముద్రించి ఉంది. అటుగా వెళ్తున్న ఓ రైతు.. బస్సు వద్దకు వచ్చి పోస్టర్‌ను చూసి మురిసిపోయాడు. ఈ క్రమంలో మోదీ ఫొటోకు ముద్దుపెట్టాడు. ఈ సందర్బంగా సదరు రైతు మాట్లాడుతూ.. నాకు వెయ్యి రూపాయలు వచ్చేవి.. ఇప్పుడు నాకు రూ. 500 ఎక్కువ వచ్చేలా చేశావు. మా ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు. ప్రపంచాన్నే జయిస్తావు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోను కేంద్రమంత్రి పీయూస్ గోయల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. कुछ भावनाओं को शब्द बयान नहीं कर सकते! देखिए प्रधानमंत्री @NarendraModi जी और हमारे अन्नदाताओं का अटूट बंधन। pic.twitter.com/bLe1Mbt9d4 — Piyush Goyal (@PiyushGoyal) March 30, 2023 -
ఆర్టీసీ బస్సుని నడుపుతున్న ఆలుమగలు: వీడియో వైరల్
భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధరణ విషయం. ఐతే ఇద్దరు కలిసి ఒకే డిపార్ట్మెంట్ చేయడం అత్యంత అరుదుగా జరుగుతుంది. ఒకవేళ ఒకే డిపార్ట్మెంట్ అయినా వేరువేరుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కూడా. అదే ఏ ఆర్టీసి లాంటి వాటిల్లో అయితే ఒకే డిపోలో చేసిని వేర్వేరు బస్సుల్లో విధులు నిర్వర్తించి రావాల్సి ఉంటుంది. కానీ ఈ దంపతులు మాత్రం ఒకే బస్సులో కలిసి పనిచేస్తున్నారు. ఆ బస్సు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది తెలుసా!. వివరాల్లోకెళ్తే... కేరళకు చెందిన ఒక జంట కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(కేఎస్ఆర్టీసీ) బస్సుని నడుపుతున్నారు. కేఎస్ఆర్టీసీ బస్సులో డ్రైవర్ అండ్ కండక్టర్‌గా గిరి, తారా అనే భార్యభర్తలిద్దరూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు వీరు నడుపుతున్న బస్సు కూడా కేరళలోని ఉన్న బస్సుల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం ఆరు సీసీటీవీ కెమరాలు, ఎమర్జెన్సీ స్విచ్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెషనర్, పిల్లలను అలరించడానికి బొమ్మలు, ఎల్ఈ డీ డిస్టినేషన్ బోర్డులతో అత్యాధునికంగా రూపొందించారు. ఆ దంపతులు తమ సొంత డబ్బలతో ఈ ఆర్టీసీ బస్సును ఇంత అందంగా తీర్చిదిద్దడం విశేషం. ఈ మేరకు ఆ దంపతులు మాట్లాడుతూ...."ప్రతిరోజూ మేము తెల్లవారుజామున 1 గంటకు లేచి 2 గంటలకు డిపోకు చేరుకుంటాం. గిరి బస్సును శుభ్రం చేస్తాడు. ఉదయం 5 గంటలకు తమ డ్యూటీ ప్రారంభమవుతుంది" అని చెప్పారు. వాళ్లది 20 ఏళ్ల ప్రేమ కథ. ఇటీవలే కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో వివాహబంధంతో ఒక్కటైనట్లు తెలిపారు. (చదవండి: ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!) -
కోతి చేతికి స్టీరింగ్: బస్సు డ్రైవర్ని సస్పెండ్
-
వైరల్ వీడియో : కోతి చేతికి స్టీరింగ్
బెంగళూరు : ఈ మధ్య కాలంలో ఏదో ఒక చోట ఆర్టీసీ బస్సు లు ప్రమదాలకు గురవుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకున్నవి కూడా ఉన్నాయి. ఇలాంటి నిర్లక్ష్యపూరిత సంఘటనే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ ఏకంగా కోతి చేతికి స్టీరింగ్ ఇచ్చి దాని వేషాలను చూస్తూ కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కర్ణాటక ప్రభుత్వం సదరు బస్ డ్రైవర్ని విధుల నుంచి తొలగించింది. ఈ సంఘటన ఈ నెల 1న జరిగింది. వీడియోలో ఉన్న డ్రైవర్ పేరు ప్రకాష్. ఇతను దావణగేరె డివిజన్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1న ప్రకాష్ దావణగేరె నుంచి భరమసాగర వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోతి, దాని ట్రైనర్ రోజు ఇదే బస్సులో ప్రయాణం చేస్తుంటారని తెలిసింది. ఈ పరిచయం వల్ల కోతి స్టీరింగ్ మీద కూర్చునప్పటికి డ్రైవర్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా.. కోతి స్టీరింగ్ తిప్పుతుంటే అతను గేర్ మారుస్తూ వినోదం చూస్తున్నాడు. ఈ కోతి వేషాలను బస్సులోని ఓ ప్రయాణికుడు తన స్మార్ట్‌ఫోన్‌లో వీడియో తీశాడు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ విషయం కాస్తా అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో ఆ బస్సు డ్రైవర్ని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
కేఎస్ ఆర్టీసీ బస్సులో మంటలు
గుంతకల్లు రూరల్ : బళ్లారి నుంచి విజయవాడ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సులో శుక్రవారం రాత్రి గుంతకల్లు సమీపంలో ఆకస్మికంగా మంటలు, పొగలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు భారీగా కేకలు పట్టడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపి ప్రయాణికులను దించేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో గుంతకల్లు బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సుకు కొద్ది దూరం వెళ్లగానే సైలెన్సర్ ఊడిపడి రోడ్డుకు రాసుకుంటూ వెల్లడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. కాగా శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా మెకానిక్ రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
విషాద యాత్ర
బెంగళూరు, న్యూస్‌లైన్ : కాసేపట్లో దర్గాకు చేరుకుని, దైవ సమానులైన గురువుకు ప్రార్థనలు చేయాల్సి ఉంది. ఇంకేముంది అర గంటలో దర్గాకు చేరుకుంటున్నాం కదా అనుకుంటుండగానే... విధి వక్రించింది. గురువు సన్నిధిని కాకుండా దైవ సన్నిధిని చేరుకోవాల్సి వచ్చింది. గుల్బర్గ జిల్లా అళంద తాలూకా కోరహళ్లి క్రాస్ వద్ద సోమవారం వేకువ జామున కేఎస్ ఆర్టీసీ బస్సు, మ్యాక్సీ క్యాబ్‌లు ముఖాముఖి ఢీ కొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది అసువులు బాశారు. వారంతా ఉమ్మడి కుటుంబాలకు చెందిన వారు. మృతులను మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్గూడ్కు చెందిన నబీలాల్ అహ్మద్ హనీఫ్ముల్లా (58), మహబూబ్ బీ నబీలాల్ ముల్లా (55), రంజాన్ దాదాసాబ్ ముల్లా (25), గుడు మదర్సాబ్ ముల్లా (25), బాషా మదర్సాబ్ ముల్లా (60), సమీర్ ముల్లా (50), రెహానా షేక్ ముల్లా (30), మొహసీనా సికిందర్ (14), హుసేన్ మదరసా ముల్లా (30), మొమైత్ మహబూబ్ ముల్లా (35), నూర్జహాన్ రజాక్ (38), పర్వీన్ సికిందర్ ముల్లా (30), సమీరా ముల్లా (8), బావా జాన్ (32), మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కమలాకర్ (38)లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 12 మంది గుల్బర్గలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి, అళందలోని ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వీరంతా ఆదివారం రాత్రి మాక్సీ క్యాబ్‌ను అద్దెకు తీసుకుని గుల్బర్గ సమీపంలోని ఖాజా బాందా నవాజ్ దర్గాకు బయలుదేరారు. అర్ధరాత్రి వరకు అందరూ ఉల్లాసంగా మాట్లాడుకుంటూ గడిపారు. అనంతరం నిద్రలోకి జారుకున్నారు. కొద్ది సేపట్లో క్యాబ్ దర్గాకు చేరుకోవాల్సి ఉండగా, హొస్పేట నుంచి అళంద తాలూకా జడగాకు వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీ కొంది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయాయి. 12 మంది అక్కడికక్కడే మరణించారు. ముగ్గురు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. క్యాబ్‌లో ఉన్న 14 మంది, బస్సులోని ఐదు మందికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ రవి లింగశెట్టి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు మూడు గంటల పాటు శ్రమించి వాహనాలను వెలికి తీసి, మృతదేహాలను అళంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రవి లింగశెట్టికి వరుసగా మూడు రోజుల పాటు డ్యూటీ చేస్తుండడం వల్ల నిద్రలోకి జారుకున్నాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఖమరుల్ ఇస్లాం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు. -
కేఎస్ ఆర్టీసీ బస్సుకు మంటలు
బెంగళూరు, న్యూస్‌లైన్: కర్ణాటక రాష్ట్ర(కేఎస్) ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపా రు. వివరాలు.. హాసన్ ప్రాంతం నుంచి కర్ణాటక వైభవ బస్సు(కేఏ-13 ఎఫ్ 1949) 30 మందితో గురువారం బెంగళూరుకు బయలుదేరింది. సాయంత్రం 5.45 గంటల సమయంలో బెంగళూరు-తుమకూరు రోడ్డులోని గురగుంటపాళ్య సిగ్నల్ సమీపంలో బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. వారు బస్సు దిగిపోయారు.