
భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధరణ విషయం. ఐతే ఇద్దరు కలిసి ఒకే డిపార్ట్‌మెంట్ చేయడం అత్యంత అరుదుగా జరుగుతుంది. ఒకవేళ ఒకే డిపార్ట్‌మెంట్ అయినా వేరువేరుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కూడా. అదే ఏ ఆర్టీసి లాంటి వాటిల్లో అయితే ఒకే డిపోలో చేసిని వేర్వేరు బస్సుల్లో విధులు నిర్వర్తించి రావాల్సి ఉంటుంది. కానీ ఈ దంపతులు మాత్రం ఒకే బస్సులో కలిసి పనిచేస్తున్నారు. ఆ బస్సు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది తెలుసా!.
వివరాల్లోకెళ్తే... కేరళకు చెందిన ఒక జంట కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(కేఎస్‌ఆర్టీసీ) బస్సుని నడుపుతున్నారు. కేఎస్‌ఆర్టీసీ బస్సులో డ్రైవర్ అండ్ కండక్టర్‌గా గిరి, తారా అనే భార్యభర్తలిద్దరూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు వీరు నడుపుతున్న బస్సు కూడా కేరళలోని ఉన్న బస్సుల కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం ఆరు సీసీటీవీ కెమరాలు, ఎమర్జెన్సీ స్విచ్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెషనర్, పిల్లలను అలరించడానికి బొమ్మలు, ఎల్‌ఈ డీ డిస్టినేషన్ బోర్డులతో అత్యాధునికంగా రూపొందించారు.
ఆ దంపతులు తమ సొంత డబ్బలతో ఈ ఆర్టీసీ బస్సును ఇంత అందంగా తీర్చిదిద్దడం విశేషం. ఈ మేరకు ఆ దంపతులు మాట్లాడుతూ...."ప్రతిరోజూ మేము తెల్లవారుజామున 1 గంటకు లేచి 2 గంటలకు డిపోకు చేరుకుంటాం. గిరి బస్సును శుభ్రం చేస్తాడు. ఉదయం 5 గంటలకు తమ డ్యూటీ ప్రారంభమవుతుంది" అని చెప్పారు. వాళ్లది 20 ఏళ్ల ప్రేమ కథ. ఇటీవలే కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో వివాహబంధంతో ఒక్కటైనట్లు తెలిపారు.
(చదవండి: ఆసుపత్రి నిరాకరణ.. రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!)
Comments
Please login to add a commentAdd a comment