రోడ్డు మీద వెళ్లేటపుడు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. అయితే అంబులెన్స్ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా వెంటనే తమ వాహనాలను సైడ్‌కు తీసుకుంటారు. సినీ సెలబ్రిటీలైనా, రాజకీయ నేతలైనా.. చివరికి ప్రధాని, రాష్ట్రపతి అయినా సరే అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇస్తారు. కానీ ఓ ప్రబుద్దుడు అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు.
దీంతో ఆ వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్‌కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్ కు దారివ్వకుండా ఏకంగా రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది.
అంబులెన్స్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నా, ఆ కారు ఓనర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్ లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ఆ కారు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించిన పోలీసులు. నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. దాదాపు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతడి లైసెన్స్ కూడా రద్దు చేశారు.
A car owner in Kerala has been fined Rs/- 2.5 Lakh and their license has been cancelled for not giving away the path for an ambulance. pic.twitter.com/GwbghfbYNl
— Keh Ke Peheno (@coolfunnytshirt) November 17, 2024
Comments
Please login to add a commentAdd a comment