![Bengaluru police Surprised Woman Who Did Work from home In Car](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/IT.jpg.webp?itok=dmkIxtTu)
వైరల్: కరోనా టైం నుంచి వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఒకానోక టైంకి వచ్చేసరికి.. ఈ తరహా పని తీరు ఉద్యోగుల మానసిక స్థితిపైనా ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. అయితే పరిస్థితులు మారుతున్నా కొద్దీ క్రమక్రమంగా కంపెనీలు హైబ్రీడ్ విధానానికి వాళ్లను అలవాటు చేశాయి. ఈ క్రమంలో..
అటు ఆఫీస్.. ఇటు ఇల్లు కాని పరిస్థితుల్లో ఉద్యోగులు నలిగిపోతుండడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎక్కడపడితే అక్కడ తమ లాప్‌ట్యాప్‌లతో వర్క్ చేస్తున్న దృశ్యాలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి చేష్టలకు దిగిన బెంగళూరు మహిళా టెకీకి పోలీసులు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో కారులో వెళ్తూ ఓ మహిళా టెకీ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసింది. అదే సమయంలో డ్రైవింగ్ కూడా చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇది బెంగళూరు పోలీసుల దృష్టికి చేరడంతో.. వాళ్లకు చర్యలకు ఉపక్రమించారు. ఓవర్ స్పీడింగ్, డ్రైవింగ్‌లో అలసత్వంగా ఆమె చర్యను గుర్తించి రూ.వెయ్యి ఫైన్ విధించారు. వర్క్‌ఫ్రమ్ ‘హోమ్’.. కారులో కాదమ్మా! అంటూ.. జరిమానా నోటీసు అందిస్తూ.. ఎక్స్‌లో బెంగళూరు నార్త్ ట్రాఫిక్ డీసీపీ పోస్ట్ చేశారు.
"work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R
— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025
Comments
Please login to add a commentAdd a comment