Woman techie
-
హగ్ ఇస్తేనే పాస్‌పోర్టు ఇస్తా: కానిస్టేబుల్ వేధింపులు
బొమ్మనహళ్లి: యువతి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, తనిఖీ కోసం ఆమె ఇంటికి వెళ్ళిన కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె షాకైంది. ఫిర్యాదు చేయడంతో అతనిని సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరు నగరంలోని బ్యాటరాయనపుర ఠాణా పరిధిలో జరిగింది.కోరిక తీర్చమంటూ..ఫిర్యాదు మేరకు వివరాలు.. ఠాణా పరిధిలోని బాపూజీ నగరలో ఉండే ఓ యువతి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంది. ఇందుకోసం పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె గురించి తనిఖీ చేయాలని పాస్‌పోర్టు ఆఫీసు నుంచి ఠాణాకు సిఫార్సు వచ్చింది. దీంతో కానిస్టేబుల్ కిరణ్ యువతి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి తలుపులు మూసి, నీ సోదరునిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందువలన నీకు పాస్‌పోర్టు రాదు. నీవు నాకు సహకరిస్తే చాలు అని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో ఒక్కసారి కౌగిలించుకుంటా అని వేధించాడని యువతి ఆరోపించింది. మరో గదిలో ఉన్న సోదరుడు ఏమిటీ గొడవ అని రాగా, కానిస్టేబుల్ మాట మార్చి అక్కడి నుంచి జారుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్ నంబర్ ఇవ్వకుండా బ్లాక్ చేశాడు. దాంతో బాధితురాలు పశ్చిమ డీసీపీ ఎస్. గిరీష్‌ని కలిసి గోడు వెళ్లబోసుకుంది. పోలీసు తప్పు చేసినట్లు గమనించి అతన్ని సస్పెండ్ చేశారు.ముడుపుల గోలకాగా, నగరమే కాకుండా రాష్ట్రమంతటా పాస్‌పోర్టు కోసం పెద్దసంఖ్యలో ప్రజలు దరఖాస్తులు చేస్తుంటారు. తనిఖీల సమయంలో పెద్దమొత్తంలో ముడుపులు అడుగుతారని, ఇవ్వకపోతే ఏదో ఒక సాకుతో పెండింగ్‌లో పెడతారని ఆరోపణలు ఉన్నాయి. గొడవ ఎందుకని చాలామంది డబ్బులు ఇచ్చేస్తారు. -
‘నా ఉద్యోగం పోయింది, పీడా పోయింది’ : మహిళా టెకీ ఆనందం
దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారయ్యాయి ఉద్యోగుల జీవితాలు. ఎపుడు, ఎందుకు, ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ముఖ్యంగా సంక్షోభంలో చిక్కుకున్న ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఇక మహిళా ఉద్యోగుల పరిస్థితి గురించి చెప్పనక్కరలేదు. కానీ ఒక మహిళా టెకీ మాత్రం ఆ తొక్కలో ఉద్యోగం పోతే పోయింది అంటోంది. ఏడాదికి రూ. 76 లక్షల జీతం వచ్చే ఉద్యోగం పోయినా చాలా సంతోషంగా ఉన్నా అంటోంది 24 ఏళ్ల యాక్చురియల్ అనలిస్ట్ . స్టోరీ ఏంటంటే..!మనీ కంట్రోల్ కథనం ప్రకారం చికాగోలోని డెలాయిట్ కంపెనీలో అననిష్ట్గా పనిచేది సియెర్రా డెస్మరాట్టి. ఏడాది రూ. 76 లక్షల వేతనంతో 2022లో ఉద్యోగంలో చేరింది. అయితే ఐటీ రంగ సంక్షోభం,కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. మామూలుగా అయితే నా ఉద్యోగం పోయింది అని అందరం డీలా పడిపోదాం, ఏడ్చి గగ్గోలు పెడతాం కదా, కానీ సియెర్రా మాత్రం ఎగిరి గంతేసిందట. దాదాపు సంవత్సరం కాలం తరువాత ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. జీవితంలో ఏం జరిగినా మన మంచికే అను సానుకూల ధోరణే తన సంతోషానికి కారణమని చెప్పుకొచ్చింది. జీవితంలో తనకేదైనా మంచి జరిగిందంటే, అది ఉద్యోగం పోవడమేనని తెలిపింది. ‘‘రోజంతా కుర్చీలో కూర్చొని కూర్చొని వెన్నునొప్పి వచ్చింది. తొమ్మిది కిలోల బరువు పెరిగా, పొట్టి బట్టలేసుకుని తోటి ఉద్యోగుల ముందు నడవం నా వల్ల కాలే...’’ అంటూ తన ఇబ్బందులను ఏకరువు పెట్టింది. 11 గంటల పనితో, మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురయ్యానని పేర్కొంది. రూ. 76 లక్షల జీతం గురించి కూడా ఆమె పెద్దగా బెంగపడలేదు. జీతమే జీవితంకాదు. పొద్దుపు చేసిన డబ్బుతో కొన్నాళ్లు గడిపి, తరువాత ట్రాన్స్‌అమెరికాకు చెందిన కంపెనీలో యాక్చురియల్ అనలిస్ట్‌గా రిమోట్ ఉద్యోగాన్ని సాధించి ఇపుడు నేను చాలా హ్యాపీ అంటోంది సియెర్రా. కొత్త ఉద్యోగం పాతదిలాగే ఉన్నప్పటికీ పని సంస్కృతి చాలా భిన్నంగా ఉందట. కొత్త వర్క్‌ప్లేస్‌లోని ఉన్నతాధికారులు డ్యూటీ ముగియగానే ఆఫీసు నుంచి వెళ్లిపోవచ్చంటారట. దీంతో తనకు కొంత సమయం మిగిలుతోందని చెప్పింది ఆనందంగా.సో..అదన్నమాట..! పోయినదాని గురించి బాధపడుతూ కూచుంటే ప్రయోజనం ఉండదు. ఇదీ మన మంచికే అనుకొని మరో కొత్త అవకాశాన్ని వెదుక్కోవడమే. మనసుంటే మార్గం ఉంటుంది.. కాదు కాదు.. టాలెంట్ ఉంటే కొలువు వెతుక్కుంటూ వస్తుంది!ఇదీ చదవండి: కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి! -
గడ్డి పూలతో నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న మహిళా టెక్కీ
ఏవృత్తిలో ఉన్నా మనసుకు నచ్చిన పని, హబీ, లేదా అలవాటు ఇంకోటి ఉంటుంది. ఆ అభిరుచిని ఒక్క పట్టాన వదలాలి అని అనిపించదు. కానీ ఈ విషయంలో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు కేరళలోని అలప్పుకు చెందిన పార్వతీ మోహనన్. మొక్కల్ని పెంచడం, అవి పూలో పళ్లో కాస్తో మురిసిపోవడం ఆమెకు చిన్నప్పటినుంచి అలవాటు. పెద్దగా ఎవ్వరూ పట్టించుకోని టేబుల్ రోజ్ (మాస్ రోజ్) అందమైన రంగులతో మమేకమై పోతూ చివరికి దాన్నే వ్యాపారంగా మార్చేసింది. కేరళకు చెందిన పార్వతి మోహనన్ సక్సెస్‌స్టోరీ గురించి తెలుసుకుందాం రండి! పార్వతి మోహనన్ కాలేజీ రోజుల్లోనే పోర్టులాకా (పతుమణి) అనే పూల మొక్కలను పెంచడం అభిరుచిగా చేసుకుంది. అయితే ఈ హాబీనే తనకు ఒకరోజు ఇంత ఆదాయాన్ని తెస్తుందని మాత్రం అస్సలు ఊహించ లేదు. పార్వతి త్రిస్సూర్‌లో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు, 2020లో కోవిడ్ కారణంగా, స్వగ్రామానికి తిరిగి వచ్చి ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేది. ఇంట్లోనే ఉంటూ పోర్టులాకా మొక్కల్ని పెంచడం మొదలు పెట్టింది. వీటి ఫోటలను ఫేస్బుక్లో పోస్ట్ చేసేది. అందరికీ ఇవి తెగ నచ్చేసేవి. మాకూ కావాలని అడిగేవారు. అలా ఆమె వ్యాపారం మొదలైంది. బ్లాగర్లు, యూట్యూబ్ ఛానెల్‌ల కవరేజీ రావడంతో మరింత పేరు వచ్చింది.ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉండగానే, అలప్పులోని చేరాల ప్రాంతానికి చెందిన పార్వతి తన ఇంటి సమీపంలోని ఒకటిన్నర ఎకరాల భూమిలో పోర్టులాకా మొక్కలను పెంచడం ప్రారంభించింది. అలా కేవలం ఐదు సంవత్సరాలలో తనహాబీని ఒక బిజినెస్ వెంచర్‌గా మార్చుకుంది.ప్రస్తుతం కక్కనాడ్‌లోని ఇన్ఫోపార్క్‌లోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ టెస్టర్‌గా పనిచేస్తు, మరోవైపు తోట నుండి సంవత్సరానికి లక్షల్లో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తుంది. అంతేకాదు ప్యాకేజింగ్ , ఆర్డర్లను కొరియర్ చేయడం లాంటి పనులకోసం మరో ఇద్దరు మహిళలకు ఉపాధినిస్తోంది. భారతదేశం, థాయిలాండ్, బ్రెజిల్‌లోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన 300 రకాల పోర్టులాకా మొక్కలను పెంచుతోంది. పోర్టులాకా మొక్కల కాంబో ప్యాక్ ఆర్డర్లు రోజుకు 50-100 ఆర్డర్లను పూర్తి చేసే స్థాయికి చేరుకుంది. ఆమె నెలవారీ ఆదాయం. రూ. 1 లక్షకు పైమాటే. 300 రకాల మొక్కలు ఆమె దగ్గర ఉన్నాయి.మొక్కల సంరక్షణ చూస్తున్నపుడు చాలా హాయిగా అనిపిస్తుంది.వారాంతంలో మొక్కలతోనే ఉంటారు. అది మిగిలిన వారానికి సరపడా ఉత్సాహాన్ని శక్తిని సంపాదించుకుంటారు. ‘నా మొక్కలే నాకు సర్వస్వం’ అంటారు పార్వతి. మంచి ఆదాయాన్ని సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషించేందుకు మన చుట్టూ అపారమైన అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి అంతే అంటారామె. -
ప్రేమించి..సహ జీవనం సాగించి
యశవంతపుర: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడని మహిళా టెక్కీ (27) ఒకరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు... బెంగళూరులో ఉత్తర భారత్‌కు చెందిన యువతి టెక్కీగా పని చేస్తోంది. 2022లో ఆమె జిమ్‌కు వెళ్లతుండగా ఆదిత్య సింగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు కూడా టెక్కీగా పని చేస్తున్నాడు. స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో కలిసి బండేపాళ్యలో బాడుగ ఇంటిలో ఇద్దరు సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకుందామని ఆమె ఆదిత్యసింగ్‌ను కోరింది. అందుకు ఆతడు నిరాకరించడంతో పాటు ఆమెను ఇష్టానుసారం తిట్టి కొట్టాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితురాలు ప్రేమ పేరుతో వంచించాడని బండేపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమంటే తలను గోడకేసి కొట్టి దౌర్జన్యం చేశాడని వాపోయింది. పోలీసులు ఆదిత్యసింగ్‌కు నోటీసులిచ్చి విచారణకు రావాలని ఆదేశించారు. -
అమెరికాలో ఉన్నా బతికేదానివి తల్లీ..
జ్యోతినగర్: అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను చూసేందుకు రామగుండం వచ్చిన నరిష్మారెడ్డి అనే యువతి కరోనా కాటుకు బలైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘అమ్మా.. నువ్వు అమెరికాలో ఉన్నా బతికే దానివి.. మమ్మల్ని చూడటానికి వచ్చి కరోనాకు బలైపోయావా తల్లీ..’ అంటూ తల్లడిల్లిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (రామగుండం)లోని కృష్ణానగర్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నరిష్మారెడ్డి (27) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే నాలుగేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటానికి తల్లిదండ్రులు రామగుండం పిలిపించారు. దీంతో ఆమె నెల కిందట ఇక్కడికి వచ్చింది. అయితే ఆమె 20 రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు తల్లికీ పాజిటివ్‌రాగా, ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారం కిందట మరోసారి టెస్ట్ చేయించుకోగా నరిష్మారెడ్డికి నెగెటివ్ వచ్చింది. అయినా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం రాత్రి ఆమె మృతిచెందింది. మంచి ఉద్యోగంతో అమెరికాలో క్షేమంగా ఉన్న కూతురు ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్రవంతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్లో స్రవంతి (26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. భర్త రవి కిరణ్ కూడా సాప్ట్వేర్ ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని స్రవంతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
తన సంపాదన ఎక్కువని అన్నందుకే
కృష్ణరాజపురం : సంపాదన విషయంలో చోటు చేసుకున్న గొడవలోనే ఢిల్లీకి చెందిన మహిళా టెక్కీ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమేరకు నిందితుడిని గురువారం వైట్‌ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరక వివరాలు...‘ఢిల్లీకి చెందిన విజయలక్ష్మీ(24) అక్కడ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో రోజూ ఇంటికి సమీపంలోని జిమ్‌కు వెళ్లేది. ఈక్రమంలో అక్కడ పనిచేస్తున్న హరిష్కుమార్తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా రూపాంతరం చెందింది. ఇంజినీరింగ్ ముగిసిన అనంతరం విజయలక్ష్మికి బెంగళూరులో ఓ బహుళజాతి సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం లభించింది. దీంతో ఆమె కొద్ది కాలం క్రితం బెంగళూరు వచ్చారు. విజయలక్ష్మీని కలుసుకోవడానికి ఈనెల19వ తేదీన హరిష్‌కుమార్ కూడా బెంగళూరు వచ్చాడు. మాటల సందర్భంలో వేతనాల విషయం ప్రస్తావనకు వచ్చింది. నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నానని, నీకెందుకు భయపడాలంటూ విజయలక్ష్మి వాదించింది. కోపోద్రిక్తుడైన హరిశ్‌కుమార్ కాలితో బలంగా తన్నాడు. కిందపడిపోయిన విజయలక్ష్మీ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు’. అని పోలీసులు తెలిపారు. -
పెళ్లాడతానని నయవంచన
బనశంకరి: పెళ్లి చేసుకుంటానని మహిళా టెక్కీని నమ్మించి ఢిల్లీకి చెందిన మోసగా డు రూ.25 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. ఈ మేరకు రోనిత్ మల్హోత్రా అనే వ్యక్తిపై సర్జాపుర నివాసి 34 ఏళ్ల మహిళా ఐటీ ఇంజినీరు వర్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి సంబంధాల కోసం ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేసిన మహిళా టెక్కీని రోనిత్ మల్హోత్రా అనే వ్యక్తి తనది ఢిల్లీగా చెప్పుకుని సంప్రదించాడు. తాను వ్యాపారవేత్తనని, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. ఇద్దరూ మొబైల్ నంబర్లు తీసుకున్నారు. వసూళ్లు మొదలు పెళ్లికి ముందు పూజ చేయాలని ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీన మంత్రి అపార్టుమెంట్, డాలర్స్‌కాలనీలో మహిళాటెక్కీ వద్ద రూ.7.5 లక్షలు తీసుకున్నాడు. తన చెల్లెలు, అన్న ద్వారా సదరు మహిళకు ఫోన్ చేయించి మాట్లాడాడు. ఫిబ్రవరి 23 తేదీన గుర్రప్పనపాళ్య కేఇబీ కాలనీలో మళ్లీ కలిశాడు. బంగారునగలు కొనుగోలు చేయాలని మళ్లీ రూ.6 లక్షలు గుంజాడు. కొద్దిరోజులకే డార్జిలింగ్‌లో తల్లి చనిపోయిందని అక్కడికి వెళ్లాలని భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. ఇలా పలు కారణాలు చెప్పి మహిళా టెక్కీ నుంచి రూ.25.2 లక్షలు జేబులో వేసుకున్నాడు. పెళ్లి విషయం వాయిదా వేయసాగాడు. డబ్బు వెనక్కి ఇవ్వాలని మహిళాటెక్కీ మోసగాడు రోనిత్ మల్హోత్రాను అడగ్గా బిజనెస్‌లో పెట్టుబడి పెట్టానని, చెల్లిస్తానని తెలిపాడు. కానీ ఇటీవల ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో బాధితురాలు సోమవారం వర్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
లేడీ కిలాడీ
బనశంకరి : కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 8 లక్షలు తీసుకుని ఓ మహిళా టెక్కీ ఉడాయించిన సంఘటన బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళా టెక్కీ స్మృతిఖానాపూర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు...నగరంలోని స్టాఫ్హౌసింగ్ కాలనీకి చెందిన శంకర్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఇక్కడి శంకర్ డైయిరీ సర్కిల్ వద్ద గల ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మూడు నెలల క్రితం ఎలక్ట్రికల్ పనులు చేశాడు. ఈ సమయంలో శంకర్‌కు అదే కంపెనీలో పనిచేసే ముంబయికు చెందిన స్మృతిఖానాపూర్ అనే యువతి పరిచయమైంది. కంపెనీలో రూ. కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇప్పిస్తానని ఇందుకు రూ. 15 లక్షలు కమీషన్ ఇవ్వాలని అడిగింది. దీంతో ఆమె మాటలను నమ్మిన శంకర్ ఫిబ్రవరి 14న రూ. 5 లక్షలు అందజేశాడు. అప్పటి నంచి స్మృతిఖానాపూర్ అదృశ్యమైంది. ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో బాధితుడు శంకర్ బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదే విధంగా నగరంలోని మంజునాథ్ నగర్‌కు చెందిన మరో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ రవికుమార్‌ను ఇలాగే మోసం చేసి నాలుగు నెలల క్రితం రూ. 12 లక్షల కమీషన్ అడిగింది. ఆమె మాటలను నమ్మిన రవికుమార్ మొదటి విడతగా రూ. 3 లక్షలు అందజేశాడు. అప్పటి నుంచి స్మృతిఖానాపూర్ కనిపించడం లేదు. దీంతో బాధితుడు ఆమెపై బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కిలాడి లేడీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
నా భర్త నపుంసకుడు.. న్యాయం చేయండి!
పోలీసులకు మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదు బనశంకరి: పోలీసుల ముందుకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. ఆ తగవును ఎలా పరిష్కరించాలా? అని వారే తర్జనభర్జనలు పడుతున్నారు. ‘నా భర్త నపుంసకుడని మొదటిరాత్రే తేలిపోయింది, నాకు న్యాయం చేయండి’ అని ఒక మహిళా టెక్కీ శనివారం హలసూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులో పేరుపొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐటీ ఇంజనీర్లు 2011లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నిజం తెలిశాక ఇల్లొదిలిపోయాడు కానీ పెళ్లైన రోజు నుంచి భర్త కునాల్ శ్యామ్ ప్రతి రాత్రి తనను దూరం పెడుతూ ఉన్నట్లు ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. ఒకవేళ తన భర్త సంతానభాగ్యం కల్పిస్తే తన ఫ్లాట్‌ను అతడి పేరుతో రాసిస్తానని సవాల్ విసిరారు. ఆరునెలల కిందట తాను పదే పదే నిలదీయడంతో నపుంసకుడనే నిజం బహిర్గతమైందని, ఆ క్షణం నుంచి వదిలివెళ్లిపోయాడని తెలిపారు. వివాహమైన రోజు నుంచి భర్త తనతో కాపురం చేయలేదని ఆమె ఆరోపించారు. ఇంట్లో తన అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులు ఆమె భర్తను వెతికితెచ్చి తదుపరి ‘దర్యాప్తు’ చేయడంలో నిమగ్నమయ్యారు. -
క్యాబ్‌లో వెళితే బతికుండేదేమో!
పుణె: ఆమె ఎప్పుడూ కంపెనీ క్యాబ్‌లో వెళుతుండేది.. దురదృష్టం కొద్ది ఆరోజు క్యాబ్‌లో కాకుండా వేరే విధంగా వెళదామనుకుంది. పొంచి ఉన్న ప్రమాదం పసిగట్టలేకపోయింది. తాను పని చేస్తున్న కంపెనీ నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే భయంతో పరుగులు పెట్టడం ప్రారంభించింది. కానీ హత్యకు కుట్ర చేసిన వ్యక్తి నుంచి బయటపడలేకపోయింది. వేగంగా ఆమెను అందుకొని కత్తితో పొడిచాడు. అప్పటికీ వదిలించుకొని గాయంతోనే పరుగెత్తే ప్రయత్నం చేసినా మరోసారి అందుకొని వరుస కత్తిపోట్లు పొడిచాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. ఈ ఘటన పుణెలో మహిళా టెకీపై జరిగిన హత్య తీరు. ఈ సంఘటను స్వయంగా బైక్‌పై వెళుతున్న వ్యక్తి చూశాడు. ఆమెకు సహాయం చేసేందుకు అతడు వేగంగా వెళ్లేలోగానే హంతకుడు కత్తిపోట్లు పొడిచి పరారయ్యాడు. దీంతో ఆమె వద్దకు వెళ్లిన ఆ బైకిస్టు నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం పుణెలోని క్యాప్‌జెమిని అనే కంపెనీలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన అంతార దాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పలు వివరాలు తెలిశాయి. హంతకుడు బ్లూ, బ్లాక్ డ్రెస్సులో ఉన్నాడని బైకిస్టు చెప్పాడు. తాను పట్టుకునే లోగానే పారిపోయాడని చెప్పాడు. మరోపక్క, అంతారా తండ్రి దేబానందదాస్ స్పందిస్తూ తన కూతురు హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపాడు. గత కొద్ది నెలలుగా తన కూతురుని వెంబడిస్తున్న వ్యక్తే ఈ హత్య చేశాడని, అతడి వివరాలు కూడా పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. తన కూతురు బెంగళూరులో శిక్షణ తీసుకునే సమయంలో ఓ యువకుడు వెంటపడ్డాడని, అతడే పుణెకు వెళ్లి ఈ దారుణానికి దిగాడని అన్నారు. అయితే, ఎప్పుడూ క్యాబ్‌లో వెళ్లే ఆమె ఆరోజు ఎందుకు క్యాబ్‌లో వెళ్లలేదనే విషయం తెలిస్తే కొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. -
మహిళా టెకీ మృతి.. శరీరమంతా గాయాలు
-
మహిళా టెకీ మృతి.. శరీరమంతా గాయాలు
కోల్‌కతా: పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె ఒంటి నిండా తీవ్ర గాయాలయ్యాయి. పుణెలోని దేహు రోడ్డులో ఆమె మృతదేహం పడి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమెను పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాకు చెందిన అంతార దాస్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ముఖంమీద ఉమ్మి, అసభ్యంగా దూషించాడు
ఓ మహిళా సాప్ట్వేర్ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వయంగా నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి జోక్యం చేసుకుని చర్యలకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కోల్‌కతాకు చెందిన రీనా బిస్వాస్ అలియాస్ రాణి బెంగళూరులో ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీరుగా పని చేస్తోంది. ఈనెల 18న రాత్రి 11 గంటల సమయంలో ఆమె విధులు ముగించుకుని ఆటోలో మడివాళలోని ఇంటికి బయలుదేరింది. కొద్ది దూరం అనంతరం మారుతినగర్లో ఆటో ఆపేసిన డ్రైవర్, మీటర్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇంత రాత్రివేళలో అక్కడినుంచి ఇంటివరకు నడిచి వెళ్లడం ప్రమాదమని చెప్పినా అతను డ్రాప్ చేయడానికి నిరాకరించాడు. దాంతో డబ్బులు చెల్లించే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన డ్రైవర్ ...రీనాను ఆటోలో నుంచి బయటకు లాగిపడేశాడు. దీంతో ఆమె స్వల్పంగా గాయపడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని ఇద్దరికి సర్ది చెప్పారు. అనంతరం రీనా ఈ ఘటనపై మడివాళ పోలీస్ కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఇంటికి వచ్చి ఫేస్బుక్లో ఆటో ఫొటో పెట్టి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. ఆటో డ్రైవర్ తన ముఖం మీద ఉమ్మటంతో పాటు, అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించింది. విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని మడివాళ పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
డిప్రెషన్‌తో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ (24) ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన దీపా రాదారియా గత ఆరు నెలలుగా ఇండోర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తోంది. ఎంజీ రోడ్డులోని అహింసా టవర్ అపార్టుమెంటులోని తన ఫ్లాట్‌లో ఉరేసుకుని మరణించిందని టుకోగంజ్ స్టేషన్ ఇన్‌ఛార్జి దిలీప్ సింగ్ చౌదరి తెలిపారు. తన సహోద్యోగి స్నేహితో కలిసి ఆమె ఆ ఫ్లాట్‌లో ఉండేది. చిన్న చిన్న విషయాలకు కూడా దీప పదేపదే డిప్రెషన్‌కు గురయ్యేదని ఆమె స్నేహితురాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గత మూడు నాలుగు రోజులుగా ఆమె ఆరోగ్యం కూడా అంత బాగోలేదు. దాంతో స్నేహ కూడా ఆఫీసుకు వెళ్లకుండా సాయం ఉంటానని చెప్పినా, దీప బలవంతంగా ఆమెను ఆఫీసుకు పంపేసింది. ఆఫీసుకు వెళ్లిన తర్వాత స్నేహ ఎన్ని సార్లు ఫోన్ చేసినా దీప ఆన్సర్ చేయలేదు. తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లాక పదే పదే తలుపు కొట్టినా కూడా తీయలేదు. దాంతో ఇరుగుపొరుగులను పిలవగా వాళ్లు తలుపు బద్దలుకొట్టారు. తీరాచూస్తే దీప ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. -
మహిళా టెకీ ప్రాణాలు తీసిన లాంగ్ డ్రైవ్
(ఒంగోలు నుంచి సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్) లాంగ్ డ్రైవ్ సరదా మహిళా ఇంజినీర్ ప్రాణాలు తీసింది. స్నేహితులతో కలిసి సరదాగా బైక్ పై లాంగ్ డ్రైవ్‌కు బయల్దేరిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. శనివారం ఉదయం ప్రకాశం జిల్లాలో కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఓ లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే తమిళనాడు సేలంకు చెందిన విష్ణుప్రియ ...చెన్నైలో ఓ సాప్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది. వీకెండ్ సందర్భంగా ఆమె... తన స్నేహితులతో కలిసి మూడు బైక్‌ల్లో చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. మేదరమెట్ల సమీపంలో వారి బైక్‌ను లారీ ఢీకొనటంతో వెనక కూర్చున్న విష్ణుప్రియ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.